వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2015
స్వరూపం
2015 సంవత్సరంలో వివిధ వారాలలో "మీకు తెలుసా!" వాక్యాలు |
01 • 02 • 03 • 04 • 05 • 06 • 07 • 08 • 09 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 • 19 • 20 • 21 • 22 • 23 • 24 • 25 • 26 |
1 వ వారం
[మార్చు]- బుద్ధుని నిర్యాణం తరువాత అతని ధాతువులపై నిర్మించిన 8 చైత్యాలలో ఏడింటిని అశోకుడు తెరిపించి అందులోని శకలాలను చిన్న ఖండాలుగా చేసి 84 వేల స్తూపాలను కట్టించాడనీ!
- కరణం సుబ్రహ్మణ్యం పిళ్ళై వ్రాసిన చారిత్రిక నవల బోయకొట్టములు పండ్రెండు అనీ!
- పరమశివుని కృప వలన ఏర్పడిన సరోవము గుజరాత్ రాష్ట్రంలో గల బిందు సరోవరం అనీ!
- కాశ్మీరు ప్రాంతాన్ని గురించి వ్రాసిన గ్రంథాల్లో అత్యంత ప్రాచీనమైనది రాజతరంగిణి అనీ!
- బెంగుళూర్ నగరం శివార్లలో సుబ్రహ్మణ్య స్వామిని నాలుగు దశలలో చూడదగిన క్షేత్రం ముక్తి నాగ క్షేత్రము అనీ!
2 వ వారం
[మార్చు]- ...ట్రాఫిక్ పొలీసులు వాహనాల యొక్క వేగాన్ని సులువుగా చెప్పగలిగే విధానం డాప్లర్ ప్రభావం అనీ!
- ...వూయల మీదున్న మొనతేలిన మేకులపై పూజారి కూర్చుని భక్తుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసే సంబరం 'ముళ్ల వూయల' సంబరం అనీ!
- ...ధ్రువ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి రూపొందించిన వాహక నౌక పీఎస్‌ఎల్‌వీ అనీ!
- ...చైనాలో చాన్‌గా అభివృద్ధి చెందిన మహాయాన బౌద్ధమత విభాగం జెన్ అనీ!
- ...ఈజిప్టు లో ప్రాచీన నాగరికులు మమ్మీల తయారీలో తారు ను కూడా ఉపయోగించారనీ!
3 వ వారం
[మార్చు]- ... భారత దేశంలో తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రజాదరణ పొందిన టెలివిజన్ షో జబర్దస్త్ అనీ!
- ...చెన్నైలో 214 గదులతో సౌకర్యవంతమైన విశేష హోటల్ ది పార్క్ చెన్నై అనీ!
- ... ఈస్టిండియా పరిపాలనకాలంలో దుబాసీ, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు అవధానం పాపయ్య అనీ!
- ... ప్రపంచంలోనే అతిచిన్న ఊసరవెల్లులను మరియు ఎగిరే నక్కలను, రాక్షస గబ్బిలాలను మడగాస్కర్ దీవిలో చూడవచ్చు అనీ!
- ... యోగి వేమన జ్ఞానోదయం కోసం తపస్సు చేసిన ఊడలమర్రి మల్లెమడుగు (చిట్వేలు) గ్రామంలో ఉన్నదనీ!
4 వ వారం
[మార్చు]- ...హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తిమంతురాలైన దేవత మరియు పరబ్రహ్మ స్వరూపం ఆది పరాశక్తి అనీ!.
- ...శరీరంలో వివిధ రుగ్మతలను తెలుసుకొనుటకు ఉపయోగించే వైద్య విధానం ఎమ్మారై అనీ!
- ...నిజాం నవాబును ఎదురించిన వీరవనిత మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ అనీ!
- ... గద్వాల అల్లసాని పెద్దనగా భాసిల్లిన కవి కాణాదం పెద్దన అనీ!
- ...ఐదు బిందు ఉపనిషత్తుల యొక్క అతి ముఖ్యమైనది అమృతబిందు ఉపనిషత్తు అనీ!
5 వ వారం
[మార్చు]- ... కటకం అవసరం లేకుండా కేవలం సూక్ష్మరంధ్రం ద్వారా ప్రతిబింబాన్ని నమోదు చేసే కెమేరా సూదిబెజ్జం కెమెరా అనీ!
- ... శంభులింగేశ్వర స్వామి దేవాలయం లో శివలింగం ప్రతి సంవత్సరం ఎత్తు పెరుగుతూ ఉంటుందనీ!
- ... మాయాలేడిని వెంబడిస్తూ రాముడు లేడిబండ పై మోకాలు ఆన్చి లేడిని సంహరించినాడనీ!
- ... తెలుగులో సుప్రతిష్టులైన విశ్వనాథ సత్యనారాయణ, పిలకా గణపతిశాస్త్రి, విద్వాన్ విశ్వం తదితరులు రాజతరంగిణి అనువాదాలు - అనుసృనలు చేశారనీ!
- ...ఊరి పొలిమేరలో కాషాయ జెండా పాతి విషజ్వరాన్ని ఊరు దాటి రావడానికి వీల్లేదని ఆజ్ఞాపించిన కీర్తనకారుడు వేపూరి హనుమద్దాసు అనీ!
6 వ వారం
[మార్చు]- ... ప్రపంచంలో అతి పెద్ద రౌతుతో ఉన్న గుర్రం విగ్రహం చెంఘీజ్ ఖాన్ గుర్రపు విగ్రహం అనీ (పక్క చిత్రంలో)!
- ...తొలిసారిగా లైన్ ఆర్ట్ ద్వారా గిన్నిస్ పొందిన వ్యక్తి చింతపట్ల వెంకటాచారి అనీ!
- ...తెలుగు సాహిత్యానికి విశేషమైన కృషి చేసిన కడప జిల్లా కలెక్టర్ సి.పి.బ్రౌన్ యొక్క ఛాయాచిత్ర సృష్టికర్త మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము అనీ!
- ...సనాతన ధర్మం ప్రకారం మనిషి యొక్క ఆఖరి యజ్ఞం అంత్యేష్ఠి అనీ!
7 వ వారం
[మార్చు]- ... శరీరం నుండి దాదాపు 650 ఓల్టుల విద్యుత్ శక్తిని విడుదలచేయడం వీటి ప్రత్యేకత గలిగిన చేప విద్యుత్ చేప అనీ!
- ...సాహిత్యానికి తన అభినయంతో రూపం ఇచ్చి తరువాతి తరాలవారికి మార్గదర్శిగా నిలిచిన నృత్యకారిణి బాల సరస్వతి అనీ!
- ... వంశానుగత రక్త రుగ్మత సికిల్ సెల్ వ్యాధి అనీ!
- ...మన దేశంలో ప్లాస్టిక్ పరిశ్రమ అనూహ్యంగా అభివృద్ధి చెందడానికి దోహదపడిన పరిశోధకుడు ఎం.శాంతప్ప అనీ!
- ...బొలీవియాలో బంగారు పంట అని పిలువబడీ అత్యధిక పోషకాలున్న ఈ పంట క్వినోవా అనీ!
8 వ వారం
[మార్చు]- ... చిన్న కాశీ అని పిలువబడుతున్న దక్షిణ భారత దేశములో ఉన్న పుణ్య క్షేత్రములలో ఒకటి ఆచంటీశ్వరాలయం అనీ!
- .... ప్రపంచంలోనే అతి చిన్న పక్షిగా రికార్డులకెక్కిన పక్షి హమ్మింగ్ పక్షి అనీ!
- ...ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన క్రూయిజ్ నౌక సెవెన్ సీస్ ఎక్స్‌ప్లోరర్ అనీ!
- ...వెనిజులాలో బయటపడ్డ మొదటి మాంసాహారి డైనోసార్ రక్తం తాగే రాక్షసబల్లి అనీ!
- ...2014 లో నాయుడమ్మ అవార్డు పొందిన మహిళా శాస్త్రవేత్తలు గీతా వరదన్ మరియు టెస్సీ థామస్ లు అనీ!
9 వ వారం
[మార్చు]- ... ఐరావతేశ్వర దేవాలయం లోని కోనేరులో స్నానమాచరించి శాపవశాత్తు కోల్పోయిన శరీరచ్ఛాయని ఐరావతం తిరిగి పొందినదనీ!
- ... సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడిన ప్రసిద్ధ ఆలయం కోదండ రామాలయం, ఒంటిమిట్ట అనీ!
- ... విద్యుత్ ఘటాన్ని మొట్టమొదట రూపకల్పనచేసినవాడు అలెస్సాండ్రో వోల్టా అనీ!
- ...కన్యాకుమారి నుంచి ఢిల్లీకి గంటకంటే కొంచెం ఎక్కువ సమయంలో చేరుకోగలిగే అధునాతన రవాణా వ్యవస్థ హైపర్‌లూప్ అనీ!
- ...కొడుకు ఆశయాల సాధనకోసం తల్లి తన ఆరోగ్యాన్ని ఖాతరు చేయక కొడుకుతో పాటు గ్రామగ్రామంలో తిరిగి స్వాతంత్రొద్యమంలో పాల్గొన్నదనీ! ..ఖాసా సుబ్బారావు వ్యాసం.
10 వ వారం
[మార్చు]- ... మాండ్యవ మహర్షి నివసించిన ప్రాంతం ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని మండ్య అనీ!
- ...ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన వారు దగ్గుబాటి రామానాయుడు అనీ!
- ...బాలికల సంక్షేమం కోసం నరేంద్రమోడీ జనవరి 2015 లో ప్రారంభించిన ప్రత్యేక డిపాజిట్ పథకం సుకన్య సమృద్ధి ఖాతా అనీ!
- ...విష్ణు వామన్ శిర్వాద్కర్ పుట్టినరోజును "మారాఠీ భాషా దినం" గా జరుపుకుంటారనీ!
11 వ వారం
[మార్చు]- ...రైటు సోదరుల ప్రయోగాలకు 8 యేండ్ల పూర్వమే 1895 లో తొలివిమానాన్ని నిర్మించిన భారతీయ శాస్త్రవేత్త శివకర్ బాపూజీ తలపడే అనీ!
- ... భూమిపై ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే కేవలం నాలుగు గంటల్లోనే గమ్యానికి చేర్చేసే భవిష్యత్ రవాణా వ్యవస్థ లాప్‌కాట్ అనీ!
- ...సంస్కృత భాషలో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన ఏకైక పండితుడు సత్యవ్రత శాస్త్రి అనీ!
- ...ఆసియా ఖండములో రెండవ అతిపెద్ద జంతుప్రదర్శనశాలగా ఖ్యాతికెక్కినది శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శన శాల అనీ! వ్యవస్థ లాప్‌కాట్ అనీ!
12 వ వారం
[మార్చు]- ... ఎంతో చరిత్ర కలిగిన బొబ్బిలి వీణ కు జియోగ్రాఫికల్ గుర్తింపు ఇప్పుడు లభించడం తెలుగు నేలకు గర్వకారణమనీ!.
- ... 108 వైష్ణవ క్షేత్రాలలో 62 వ వరాహ క్షేత్రం తిరువిడందై అనీ!
- ... దేశప్రజలను సహృదయంతో ఆదరించిన ఆంగ్లేయాధికారుల భార్యలు కొద్ది మందిలో పిట్ దొరసాని ఒకరనీ!
- ...అడవి పుల్లరి శాసనాన్ని దిక్కరించి అమరుడైన వీరుడు కన్నెగంటి హనుమంతు అనీ!
- ...న్యూఢిల్లీలోని నార్తన్ హిమిస్ఫియర్ ఎక్సేంజి అండ్ ఎనాలసిస్ సెంటర్ ల స్థాపనకు విశేష కృషిచేసిన వ్యక్తి పంచేటి కోటేశ్వరం అనీ!
13 వ వారం
[మార్చు]- ... బలరాముడు ప్రతిష్టించిన పంచ శైవక్షేత్రాలలో నాలుగవది ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము అనీ!
- ...జాతి మత విద్వేషాలతో భారతీయ చరిత్రను దోషభూయిష్టం చేసే విధానాలను నిశితంగా విమర్శించిన ప్రముఖ చరిత్ర పరిశోధకురాలు రొమిల్లా థాపర్ అనీ!
- ...ఆంధ్రాహేవలాక్ ఎల్లీస్‌గా పిలువబడే పత్రికా సంపాదకుడు, అభ్యుదయ రచయిత రాంషా అనీ!
- ...జొరాస్ట్రియన్ మతం యొక్క దేవాలయాన్ని అగ్ని దేవాలయం అంటారనీ!
- ...భూమిపై పగలు రాత్రి సమయాలు సరిసమానంగా ఉండే రోజు మార్చి 21 అనీ!
14 వ వారం
[మార్చు]- ...పిచ్చుకల సంరక్షణ కొరకు ప్రజలను ప్రోత్సహించుటకుగానూ పిచ్చుక అవార్డు అందజేస్తారనీ!
- ...ఉదయపూర్ లో 83 గదులు, పాలరాతి గోడలతో కూడిన అధునాతన సూట్లు గల ఒక విలాసవంతమైన హోటల్ తాజ్ లేక్ ప్యాలెస్ అనీ!
- ...భారతదేశంలో మొట్టమొదటి డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించింది మన తెలుగువాడు డాక్టర్ పి.వి.పతి అనీ!
- ...లక్నో లో ప్రసిద్ధి చెందిన ఎంబ్రాయిడరీ చికెంకారీ ఎంబ్రాయిడరీ అనీ!
- ...1999లో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం చే 'విశ్వశ్రేష్ట మహిళ' గా గుర్తింపబడిన వారు మాలతి కృష్ణమూర్తి హొళ్ళ అనీ!
15 వ వారం
[మార్చు]- ... మయరాష్ట్రంగా రావణుని మామయైన మయాసురునిచేత స్థాపించబడి రావణ్ కీ ససురాల్ అని కూడా పిలువబడే నగరం మీరట్ అనీ (పక్క చిత్రం లో మీరట్ లోని మార్టీర్ స్మారకం)!
- ... జలవనరులపై పి.హెచ్.డి చేసి, ప్రొఫెసర్ గా పనిచెస్తూ సినీ హాస్యనటుడిగా పేరుగాంచిన తెలుగు నటుడు డాక్టర్ గుండు సుదర్శన్ అనీ!
- ... సాంబవిలాసమను ప్రబంధము ను రచియించి వేంకటేశ్వరునికి అంకితమిచ్చిన కవి చిత్రకవి రమణకవి అనీ!
- ... తులికా భూషణ్ అనే కలం పేరుతో ప్రసిద్ధుడైన రచయిత, జర్నలిస్టు అసలు పేరు బుద్ధవరపు చినకామరాజు అనీ!
- ... కంప్యూటర్లు, టాబ్లెట్లు మరియు మొబైల్ పరికరాలు నుండి ఇతర పరికరాలు లేదా టెలిఫోన్లు/స్మార్ట్‌ఫోనులకు ఇంటర్నెట్ ద్వారా వీడియో చాట్ మరియు వాయిస్ కాల్స్ అందించే అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ స్కైప్ అనీ!
16 వ వారం
[మార్చు]- ... శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడే విశిష్ట క్షేత్రం శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం అనీ!
- ...ఒకే కావ్యానికి రెండు అర్థాలు వచ్చేలా రచిస్తే దాన్ని ద్వ్యర్థి కావ్యం అంటారనీ!
- ...వోల్టేజి, విద్యుత్ ప్రవాహం, మరియు నిరోధకత కొలిచే పరికరం మల్టీమీటర్ అనీ!
- ...భమిడిపాటి రామగోపాలంకు సాహిత్య అకాడెమీ పురస్కారం రావడానికి దోహదపదిన విశిష్ట సంకలనం ఇట్లు మీ విధేయుడు అనీ!
- ...కొన్ని రసాయన మూలకాలు ఒకే భౌతిక స్తితిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ వేర్వేరు రూపాల్లో ఉనికిలో వుండేటటువంటి గుణమును భిన్నరూపత అంటారనీ!
17 వ వారం
[మార్చు]- ... 172 రోజుల్లో ఏడు ఖండాలలోని ఏడు పర్వతాలను అధిరోహించి గిన్నిస్ బుక్ రికార్డులలోకి ఎక్కిన తెలుగు బిడ్డడు మల్లి మస్తాన్ బాబు అనీ!
- ... వాసలక్ష్మి అనే పేరుతో లక్ష్మీదేవి శ్రీ రంగనాథుని పరిణయమాడిన స్థలం అళగియ మణవాళ పెరుమాళ్ ఆలయం అనీ (పక్క చిత్రంలో)!
- ...రేలంగి, పింగళి, చక్రపాణి, పెండ్యాల, మల్లాది, బాపు, రమణ... ఎందరు పెద్దలవో జ్ఞాపకాలు గల పుస్తకం నాగావళి నుంచి మంజీర వరకు అనీ!
- ... ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ. పట్టా పుచ్చుకున్న మొట్టమొదటి వ్యక్తి పల్లా దుర్గయ్య అనీ!.
- ... భారతదేశపు మొట్టమొదటి పౌర విమానాశ్రయము జుహు విమానాశ్రయము అనీ !
18 వ వారం
[మార్చు]- ...42 అడుగుల ధ్వజస్తంభం నేలను ఒకవైపు నేలను తాకకుండా ఉండే విశిష్టతను కలిగిన ఆలయం చెన్నకేశవాలయం,బేలూరు అనీ!
- ... సింగపూర్ జాతి పితగా ప్రసిద్ధి చెందినవాడు లీ క్వాన్ యూ అనీ!
- ...కదలకుండా ఉండే అంశాలకి తగినట్లుగా కాంతిని అమర్చుకోవటం వాటి ద్వారా తాము కలిగించదలచుకొన్న భావాలని కలిగించేలా చిత్రీకరించగలగటం స్టిల్ లైఫ్ ఫోటోగ్రఫీ అనీ!
- ... కందుకూరి వారి శిష్యుడైన తిరుపతి రాజు గారు వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయాన్ని పుస్తకాల కొరకే కాక ఒక ప్రజా హిత కార్యక్రమ శాలగా మార్చివేసారనీ!
- ...ఆధ్యాత్మికవేత్త,వీరశైవ గురుకుల స్థాపకులు చిదిరెమఠం వీరభద్రశర్మ అనీ!
19 వ వారం
[మార్చు]- ...దేశంలో అతి పెద్ద నందులలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న నందులను కలిగి ఉన్న దేవాలయం హళేబీడు అనీ!
- ... స్వత్రంత్ర్య భారత మొదటి గవర్నర్ జనరల్ గా వ్యవహరించింది మౌంట్‌బాటన్ అనీ!
- ...ఎవరెస్ట్ పర్వతం మీంచి హిమ సంపాతానికి దారితీసి, దాని కారణంగా 17మంది మృతి చందడానికి కారణమైన ప్రకృతి వైపరీత్యం 2015 నేపాల్ భూకంపం అనీ!
- ..."బుల్లి తిరుపతి " గా ప్రసిద్ధిగాంచింన ప్రసిద్ధ దేవాలయం శ్రీ వరాల వేంకటేశ్వరస్వామి దేవాలయం-ఈడూరు అనీ!
- ... 2015 నేపాల్ భూకంపములో సర్వం కోల్పోయిన వారికి సహాయ సహకారాలు అందించుటకు భారత ప్రభుత్వం ప్రారంభించిన చర్య ఆపరేషన్ మైత్రి అనీ!
20 వ వారం
[మార్చు]- ... మన దేశంలో ప్రాచీన సూర్యదేవాలయాలలో ప్రసిద్ధి చెందినది శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి అనీ!
- ...న్యూరాన్స్ సమతుల్యం ఉండుటకై అవసరమైన రసాయనం పొటాషియం కార్బోనేట్ అనీ!
- ...పెరియాళ్వార్లు పల్లాండు పాడిన ప్రసిద్ద పుణ్యక్షేత్రం కూడలళగర్ ఆలయం అనీ!
- ..." లాండ్ ఆఫ్ ది ఈటర్నల్ బ్లూ స్కై " లేక " కంట్రీ ఆఫ్ బ్లూ స్కై " అని పిలువబడే దేశం మంగోలియా అనీ!
- ... భూగర్భ జల ప్రవాహము యొక్క ద్విపరిమాణ గ్రాఫును తెలియజేసేది ఫ్లోనెట్ అనీ!
21 వ వారం
[మార్చు]- ...నేపాల్ రాజధాని కాఠ్మండు నగరానికి ఆ పేరు కాష్ఠమండపము ఆలయం ద్వారా వచ్చినదనీ! (చిత్రంలో కాష్ఠ మంటపం)
- ...కృష్ణా, తుంగభద్రల సంగమమున పాడవులు ప్రతిష్టించిన శైవక్షేత్రం కూడలి సంగమేశ్వర క్షేత్రము అనీ!
- ...గాడిచర్ల హరి సర్వోత్తమరావు రచించిన "అబ్రహాం లింకన్" ను మొదటి పుస్తకంగా ప్రచురించిన సంస్థ విజ్ఞాన చంద్రికా మండలి అనీ!
- ...వీరశైవ గురుకుల స్థాపకులు, విభూతి అనే సారస్వతపత్రికా స్థాపకులు చిదిరెమఠం వీరభద్రశర్మ అనీ!
- ...కళా సాహిత్య రంగాలలో రాణిస్తూనే వైద్య వృత్తిలో విశేష సేవలందించిన వారు గొడవర్తి సత్యనారాయణ వరప్రసాద్ అనీ!
22 వ వారం
[మార్చు]- .... రామకృష్ణ పరమహంస పురోహితునిగా పనిచేసిన ఆలయం దక్షిణేశ్వర కాళికాలయము అనీ!
- ... సిరపీజియా రోళ్ళ, మొఘానియా రోళ్ళ అనే పేర్లతో వృక్షజాతులకు నామకరణానికి కారణమైన ప్రసిద్ధ శాస్త్రవేత్త రోళ్ళ శేషగిరిరావు అనీ!
- ..."నాగార్జున ఉల్లిగడ్డ" అనే మొక్కను తొలిసారిగా కనుగొన్న తెలుగు శాస్త్రవేత్త కొప్పుల హేమాద్రి అనీ!
- ... అయనొ మండలపు ధ్వని గ్రహిణిని రూపొందించిన తెలుగు శాస్త్రవేత్త బర్రి రామచంద్రరావు అనీ!
- ...తెలుగు సాహిత్య సంస్థ. తెలుగు భాషా, సాహిత్యాల వృద్ధికి కృషిచేస్తున్న సంస్థ నన్నయ భట్టారక పీఠం అనీ!
23వ వారం
[మార్చు]- ... తమిళ నెలలలో ఆరవ నెల అయిన చిత్తిరాయి(ఏప్రిల్) లో సూర్యకిరణాలు మూలవిరాట్టు యొక్క పాదాలపై పడే ప్రత్యేకత కలిగిన ఆలయం శ్రీ వైకుంఠము అనీ!
- ... రాజమండ్రి లో ఒక వీధికి ఆయన పేరును పెట్టి గౌరవింపబడిన తెలుగు శాస్త్రవేత్త ఎన్.సి.గోపాలాచారి అనీ!
- ... విజయనగరం లో ద్వారం వెంకటస్వామి నాయుడు మెమోరియల్ స్కూలు ను స్థాపించిన సంగీతకారుడు ఇవటూరి విజయేశ్వరరావు అనీ!
- ... "వరల్డ్ ఫుడ్ ప్రైజ్" పొందిన తొలి తొలి ఆంధ్రుడిగా చరిత్ర పుటలకెక్కిన శాస్త్రవేత్త ముందడుగు విజయ్‌గుప్తా అనీ!
- ... కుమార్తెకు వివాహం చేసాక ఆరుమాసాలు అల్లుణ్ణి అత్తవారింట ఉంచి విశేష మర్యాదలు చేసే సాంప్రదాయం అల్లెం అనీ!
24 వ వారం
[మార్చు]- ... 18-19 శతాబ్దాల్లో భారతదేశంలో దోపిడీలు, హత్యలను వృత్తిగా స్వీకరించిన దొంగల్లో థగ్గులు ఒకరనీ! (పక్క చిత్రం)
- ...తూర్పుగోదావరి జిల్లాలో అభినవ ఆంజనేయునిగా ప్రసిద్ధి చెందిన రంగస్థల నటుడు పేపకాయల లక్ష్మణరావు అనీ!
- ... పంటకు మేలు చేసే సాలీడు, మిడతలు, తదితర జీవాలను మిత్రపురుగులు గా పరిగణిస్తారనీ!
- ...తరతరాలుగా పుత్ర సంతానం లేని రాజులు వారసున్ని దత్తత తెచ్చుకోవటమనే సాంప్రదాయాన్ని తిరగవేసినది రాజ్యసంక్రమణ సిద్ధాంతం అనీ!
- ...శ్రీవరిసాగు అత్యధిక దిగుబడినిచ్చిందని నిరూపించిన మహిళ దుద్దెడ సుగుణమ్మ అనీ!
25 వ వారం
[మార్చు]- ... బాలీవుడ్ సినిమాల్లో గొప్ప హాస్యనటునిగా పేరొందిన జానీ లీవర్ తెలుగువారనీ!(పక్క చిత్రంలో)
- ... ఏకం అనే సంస్థను స్థాపించి చిన్న పిల్లలకు వైద్యసేవలందిస్తున్న ఆదర్శ వనిత బలిజేపల్లి సాయిలక్ష్మి అనీ!
- ..."మంగళంపల్లి బాలమురళీ కృష్ణ" కు గురువుగా పేరుగాంచిన ప్రముఖ గాత్రవిధ్వాంసుడు పారుపల్లి రామకృష్ణయ్య అనీ!
- ... ఆంధ్రరాష్ట్ర శాససనసభ తొలి స్పీకర్‌గా వ్యవహరించిన రాజకీయ నేత రొక్కం లక్ష్మీనరసింహ దొర అనీ!.
- ... చరిత్ర లోనే మొదటి సారిగా అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడి మనుషులతో మాట్లాడిన రోబో గా గిన్నిస్ రికార్డుల కెక్కినది కిరోబో అనీ!
26 వ వారం
[మార్చు]- ...క్రైస్తవ సమాజం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచీన క్రైస్తవ సమాజాల్లో ఒకటిగా పేరుపొందినది కేరళలోని సెయింట్ థామస్ క్రిస్టియన్లు అనీ!
- ...న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ కథల పోటీలో ప్రపంచవ్యాప్తంగా రెండో బహుమతి పొందినది "పాలగుమ్మి పద్మరాజు" రాసిన తెలుగు కథ గాలివాన అనీ!
- ...1878లో ఒకేరోజున గుండ్లకమ్మ నదీతీరాన రెవరెండ్ జాన్ క్లౌ ఆధ్వర్యంలో ఒకేరోజు 2,222 మంది క్రైస్తవమతాన్ని స్వీకరించారనీ!
- ...జీవరాసుల శరీర నిర్మాణాలకనుగుణంగా కట్టడాలను పటిష్ఠంగా నిర్మించిన తెలుగు శాస్త్రవేత్త ఎ.జోసెఫ్ అనీ!
- ...తమిళనాడు ప్రభుత్వం ప్రతియేటా ఆదర్శమహిళలకిచ్చే పురస్కారం కల్పనా చావ్లా అవార్డు అనీ!
27 వ వారం
[మార్చు]- ... ప్రపంచంలోనే నీటిపై తేలియాడే ఏకైక జాతీయ వనముగా ఖ్యాతి కెక్కినది మనదేశంలోని కిబుల్ లామ్జావో జాతీయ వనము అనీ! (పక్క చిత్రంలో)
- ...రెండవ ప్రపంచ యుద్ద సమయంలో ప్రారంభింపబడి, రాయలసీమ లో తిరుపతి, పుట్టపర్తి తర్వాత మూడవ విమానాశ్రయం కడప విమానాశ్రయం అనీ!
- ...పశువుల దాణాను వినూత్న విధానాల ద్వారా రూపొందించడం మీద పరిశోధనలు చేసిన తెలుగు మహిళా జంతు శాస్త్రవేత్త దేవనబోయిన నాగలక్ష్మి అనీ!
- ...తెలుగులో స్టీరియో స్కోపిక్ 3D విధానం ద్వారా చిత్రీకరింపబడిన మొదటి సినిమా రుద్రమదేవి అనీ!
- ...ఆసియా ఖండంలో అతి పెద్ద కోయిల్ వాష్ కంపెనీగా గుర్తించబడుతున్న కోయిల్ మైంస్ గనులు ఛింద్వారా జిల్లా లో ఉన్నాయనీ!
28 వ వారం
[మార్చు]- ... సుమారు 29 అంగుళాల వరకు పెరిగి నోట్లో దంతాలతో పాటు గొంతులోనూ పళ్లుండే అరుదైన అంతరించిపోతున్న చేప బ్లూ పారట్‌ఫిష్ అనీ!(చిత్రంలో)
- ..."భారత్ 78118" అనే గ్రహశకలాన్ని కనుగొని ఖగోళం మీద తెలుగు జెండాను రెపరెపలాడించినవారు కనువూరు విష్ణురెడ్డి అని!
- ... జైన మత బోధకుడు జినసుర క్రీ.శ 1450 లో రాసిన ప్రియకర్ణపాకత అనే పుస్తకంలో జిలేబీల ప్రస్తావన ఉంది అనీ!
- ... ప్రపంచ ప్రఖ్యాత నరాల శాస్త్రవేత్త (న్యూరోసైంటిస్ట్) విలయనూర్ ఎస్. రామచంద్రన్ మద్రాస్ అడ్వొకేట్ జనరల్, భారత రాజ్యంగ రూపశిల్పి అయిన అల్లాడి రామస్వామి మనవడు అని!
- ...చంద్రమండలంపై ఉన్న రాళ్ళతో చంద్రునిపైనే ఆక్సీజన్ తయారీ విధానం కనుగొన్న తెలుగు తేజం త్రిపురనేని కమల్ అనీ!
29 వ వారం
[మార్చు]- ... సుమారు కోటీ యాభైలక్షల ఏళ్ల క్రితం భూమిపై తిరుగాడి ఇటీవల శిలాజాలు కనుగొనబడిన భారీ రాక్షసబల్లి టైరనోసారస్ అనీ! (పక్క చిత్రంలో)
- ...కాలో, చెయ్యో కోల్పోయినవారు లేని కాలుకు నొప్పి కలుగుతుందనీ, ఉందన్న అనుభూతి కలుగుతుందని భావించడాన్ని ఫాంటమ్ లింబ్స్ అంటారనీ!
- ...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనరీ బైపాస్ సర్జరీ చేసిన వ్యక్తిగా ప్రసిద్ది చెందినవారు దాసరి ప్రసాదరావు అనీ!
- ...క్రీ.శ. 6వ శతాబ్దంలో అలంపురంవద్ద మొదటి విక్రమాదిత్యుడు నిర్మించిన ఆలయాన్నితరలించి పునః నిర్మాణం చేయించిన పురావస్తుపరిశోధకుడు ఇంగువ కార్తికేయశర్మ అనీ!
- ...పరిశోధనా పటిమతో స్టీఫెన్ హాకింగ్స్ మరియు రోజర్ పెన్రోజ్ సిద్ధాంతాలకు సవరణలు చేసిన తెలుగువాడు ఎస్.ఎన్.పి.గుప్తా అనీ!
30 వ వారం
[మార్చు]- ...ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న లాప్‌టాప్, వీడియోకాలింగ్ వంటి అంశాలను ముందుగానే ఊహించి "ప్రియదర్శిని" పరికరం ద్వారా పరిచయం చేసిన సినిమా మాయాబజార్ అనీ!
- ...జూన్ 2015లో ఆమోదం పొందిన భారత-బంగ్లాదేశ్ భూసరిహద్దు ఒప్పందం వల్ల దాదాపు 51వేలమంది ఇరుదేశాల ఎన్‌క్లేవుల ప్రజల పౌరసత్వ సమస్య తీరిందనీ!
- ...తొలి భారతీయ ఉపగ్రహం "ఆర్యభట్ట" ప్రయోగ సమయంలో పాల్గొన్న పిన్న వయసు శాస్త్రవేత్తగా గుర్తింపుపొందిన తెలుగు వారు దండు విశ్వేశ్వరరాజు అనీ!
- ...హోమియోపతీ వైద్యవిధానంలో కొత్త ఔషథాలను కనుగొన్న తెలుగు వ్యక్తిగా పేరొందినవారు ముదునూరు గురురాజు అనీ!
- ...ప్రపంచ ప్రప్రథమ మహాగణిత శతావధానిగా పేరుగడించిన తెలుగు తేజం కానాల శ్రీహర్ష చక్రవర్తి అనీ!
31 వ వారం
[మార్చు]- ...కళాఖండంగా పేరొందిన తెలుగు చలనచిత్రం మల్లీశ్వరికి బుచ్చిబాబు రాసిన రాయలకరుణ కృత్యం నాటిక ఆధారమనీ!(చిత్రంలో)
- ...అంధుడైనా అనేక త్యాగరాజు,అన్నమయ్య,క్షేత్రయ్య వంటి వాగ్గేయకారుల కీర్తనలను అద్భుతంగా స్వరపరచిన వైణికుడు మంచాల జగన్నాధ రావు అనీ!
- ...నలుగురు భారతదేశ రాష్ట్రపతులకు శస్త్రచికిత్సలు చేసి వారి ప్రసంశలు చూరగొన్న ప్రముఖ ఇ.ఎన్.టి.వైద్యులు చిట్టూరి సత్యనారాయణ అనీ!
- ...కమల్ హాసన్ నటించిన అనేక చిత్రాలు భాషాపరమైన, మతపరమైన, ఇతరేతరమైన వివిధ వివాదాలకు కేంద్రబిందువయ్యాయనీ!
- ...తన ధారణా శక్తితో 10 గంటలలో 1125 శ్లోకాలను నిర్విరామంగా ధారణ చేసి మేన్ ఆఫ్ రికార్డుకు ఎంపికైన తెలుగు తేజం ఒలుకుల శివశంకరరావు అనీ!
32 వ వారం
[మార్చు]- ...అమెరికాలోని బానిసత్వాన్ని తెరదించేందుకు జరిగిన అమెరికన్ అంతర్యుద్ధానికి నేపథ్యంగా, ప్రేరణగా అంకుల్ టామ్స్ క్యాబిన్ నవల చారిత్రిక పాత్ర పోషించిందనీ!(చిత్రంలో)
- ...వ్యర్ధాలతో అర్ధవంతమైన సుందర ఉద్యానవనం నిర్మించిన భారతీయుడు నెక్ చంద్ సైని అనీ!
- ...ముంబైలోని ధారావి ప్రాంతం నేపథ్యంలోని నాయకుడు సినిమాలో 90శాతానికి పైగా చెన్నైలోనే తీసి ముంబైగా భ్రమింపజేశారనీ!
- ...అంతర్జాతీయ ద్రవ్యనిధి అప్పు చెల్లించలేక బాకీపడ్డ తొలి అభివృద్ధి చెందిన దేశంగా గ్రీస్ నిలిచిందని(గ్రీక్ ప్రభుత్వ-రుణ సంక్షోభం)!
- ... టెక్స్‌ట్ మెసేజ్ ఆవిర్భావంలో కీలక భూమిక పోషించి ఎస్ఎంఎస్ పితామహుడిగా గుర్తింపుతెచ్చుకున్నవారు మట్టి మెకోనెన్ అనీ!
33 వ వారం
[మార్చు]- ...సృజనాత్మకతకు, నూతన ఆవిష్కరణకు, అద్భుత చాతుర్యానికి పెట్టింది పేరు చండీగఢ్ లోని రాతి ఉద్యానవనం అనీ!
- ...ఉత్తమ నటునిగా జాతీయ చలనచిత్ర పురస్కారం ఎక్కువసార్లు పొందిన(మూడు సార్లు) నటులు కమల్ హాసన్, మమ్ముట్టి, అమితాబ్ బచ్చన్ అనీ!
- ...నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించి సంచలనం సృష్టించినవారు దాశరథి రంగాచార్యులనీ!
- ...డబ్స్మాష్ యాప్‌తో సామాన్య ప్రజలతో పాటుగా, సెలబ్రెటీలు కూడా లిప్‌సింక్ వీడియోలు సృష్టిస్తున్నారనీ!
- ...గాంధీజీ పై కాల్పులు జరిగినపుడు గాంధీజీ తన చివరి మాటలుగా "హే రామ్" అనలేదని వ్యక్తీకరించిన వారు వి.కళ్యాణం అనీ!
34 వ వారం
[మార్చు]- ...అకాడమీ సంస్థ నుంచి గౌరవ ఆస్కార్ అవార్డ్ అందుకున్న తొలి భారతీయుడు, భారతరత్న పురస్కారం పొందిన తొలి సినీరంగ ప్రముఖుడు సత్యజిత్ రే అనీ!
- ...ప్రపంచ ప్రఖ్యాత పాశ్చాత్య స్వరకర్త, పియానిస్ట్ బీథోవెన్ వినికిడిశక్తి కోల్పోయి తన సంగీతం తానే వినలేని స్థితిలో అపురూపమైన కృతులు స్వరపరిచారనీ!
- ...డాక్టర్ కొట్నీస్ అనే భారతీయ వైద్యుడు, చైనా కమ్యూనిస్ట్ సైన్యానికి జపాన్ ఆక్రమణకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో అంకితభావంతో వైద్యసేవలందించి చీనా ప్రజల హృదయంలో స్థానం సంపాదించారనీ!
- ...మహాత్మా గాంధీ యొక్క వ్యక్తిగత కార్యదర్శి మరియు గాంధీ యొక్క బోస్‌వెల్ గా, ప్లాటోగా, సోక్రటీసుగా, బుద్ధ గా అభివర్ణింపబడేవారు మహదేవ్ దేశాయ్ అనీ!
35 వ వారం
[మార్చు]- ...ఒక సన్యాసికి శిష్యుడైన తానాషా హఠాత్తుగా రాకుమార్తెను వివాహం చేసుకుని గోల్కొండ రాజు అయ్యాడనీ!
- ...దేవదాసీల నృత్యప్రదర్శనలనే నిషేధించాలని చట్టాలు చేస్తున్న కాలంలో దేవదాసీల హక్కుల కోసం పోరాటం చేసిన మహిళ బెంగుళూరు నాగరత్నమ్మ అనీ!
- ...తొలి తెలుగు, హిందీ, తమిళ టాకీలు భక్త ప్రహ్లాద, ఆలం ఆరా, కాళిదాస్ సినిమాల్లో నటించిన వ్యక్తి ఎల్.వి.ప్రసాద్ అనీ!
- ... ప్రపంచములోనే అతిపెద్ద గ్లోబు ఎర్తా అనీ!
- ...బౌద్ద గ్రంధాలలో పేర్కొనబడ్డ ఆరుగురు ప్రసిద్ధ తీర్ధంకరులలో నాల్గవవాడు ప్రకృథ కాత్యాయనుడు అనీ!
36 వ వారం
[మార్చు]- ...సుప్రఖ్యాతి చెందిన వాహినీ స్టుడియోలో చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రంగా షావుకారు నిలిచిందనీ!
- ...భారత స్వాతంత్య్ర పోరాటంలో మనతో సమానంగా పాల్గొని భారతీయ సంప్రదాయాన్ని కూడా పాటించిన నాటి మహిళ మీరాబెన్ అనీ!
- ...మహ్మాతాగాంధీతో ఉన్న సాన్నిహిత్యంతో, ఆయన సైద్ధాంతిక భావాలతో వినోభాబావే ప్రారంభించిన భూధాన ఉద్యమంలో కీలకమైన వ్యక్తి నారాయణదేశాయ్ అనీ!
- ...బౌద్ద గ్రంధాలలో పేర్కొనబడ్డ ఆరుగురు ప్రసిద్ధ తీర్ధంకరులలో మూడవ వాడు అజితకేశ కంబళుడు అనీ!
- ... ప్రత్యామ్నాయ ఛాయాచిత్రకళకు పేరొందిన కెమేరా హోల్గా అనీ!
37 వ వారం
[మార్చు]- ...రెండవ ప్రపంచ యద్దకాలంలో కార్బొనైల్ క్లోరైడ్ విసృతంగా రసాయన ఆయుధంగా వాడారనీ!(చిత్రంలో)
- ... ప్రముఖ సీపీఐ నేత, టోల్ ఛార్జీల వసూళ్లకు వ్యతిరేక ఉద్యమకారుడు గోవింద్ పన్సారే అనీ!
- ...భారత ప్రభుత్వం నుండి సంగీత కళానిథి మరియు పద్మభూషణ అవార్డులను పొందిన మొదటి మృదంగ కళాకారుడు పాల్గాట్ మణి అయ్యర్ అనీ!
- ...బౌద్ద గ్రంధాలలో పేర్కొనబడ్డ ఆరుగురు ప్రసిద్ధ తీర్ధంకరులలో మొదటి వాడు పూర్ణ కాశ్యపుడు అనీ!
- ...ధాన్యం,విత్తనాలు తదితరాలకు పురుగు పట్టకుండ నిలవుంచుటకై వాడు రసాయన పదార్థం కార్బొనైల్ సల్ఫైడ్ అనీ!
38 వ వారం
[మార్చు]- ...గుర్తింపు కార్డులు మరియు వాటి యొక్క రీడర్‌లలోని అయస్కాంత పట్టిలలో బేరియం ఫెర్రైట్ ను ఒక ప్రత్యేక నమూనాతో ఉపయోగిస్తారనీ!
- ... కమ్యూనిస్టు పార్టీల్లో కూడా క్రియాశీలక సభ్యుడిగా ఉంటూ ఒక రచయితగా, ఒక కళాకారుడిగా సేవలందించినవారు కానూరి వెంకటేశ్వరరావు అనీ!
- ...బౌద్ద గ్రంధాలలో పేర్కొనబడ్డ ఆరుగురు ప్రసిద్ధ తీర్ధంకరులలో రెండవ వాడు, అజీవక మత స్థాపకుడు మక్ఖలి గోశాలుడు అనీ!
- ...నెల్లూరు ప్రాంతంలో సుప్రఖ్యాతులైన నాయకులు. స్వాతంత్ర్య సమరయోధులు ఆనం చెంచుసుబ్బారెడ్డి అనీ!
- ...తెలుగు భాషలో బాలసాహిత్య రచయిత అల్దీ రామకృష్ణ అనీ!
39 వ వారం
[మార్చు]- ...తెలుగు భాషా, సంస్కృతి, సాహిత్యాల గురించి తెలుగేతర పాఠకులకు పరిచయం చేయుటకు పరిశ్రమ చేస్తున్న రచయిత్రి నిడదవోలు మాలతి అనీ!
- ...తూలిక ప్రత్యేకించి తెలుగుకథలకీ తెలుగు రచయితలకీ మాత్రమే పరిమితమయిన ఏకైక వెబ్‌సైట్ అనీ!
- ... రాష్ట్రజనాభా 3కోట్లు ఉన్న 1964లో, మొత్తం కలుపుకుంటే 60లక్షల జనాభా ఉన్న వందకేంద్రాల్లో లవకుశ సినిమాకి 1.98 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయనీ!
- ... నగర, పట్టణ అభివృద్ధి ప్రణాళికలలో అనేక నూతన ఒరవడులను సృష్టించిన సృజనశీలి చార్లెస్ కొరియా అనీ!
- ...తక్కువ హానికరమైన శీతల కరణిలుతయారు చేయుటకు ఉపయోగించు రసాయనం కార్బన్ టెట్రాక్లోరైడ్ అనీ!
- ...తెలుగు భాష లో పేరెన్నికగన్న విమర్శకులలో ఒకడు ఆర్.యస్.సుదర్శనం అనీ!
40 వ వారం
[మార్చు]- ...ఈతకొలనులలో శైవలనాశిని గా ఉపయోగించే రసాయన పదార్థం కాపర్ సల్ఫేట్ లేదా మైలుతుత్తం అనీ!(చిత్రంలో)
- ...స్నేహంకోసం రాజమండ్రిలో కళాకేంద్రంగా "రామారావు ఆర్ట్ గ్యాలరీ" ప్రారంభించిన చిత్రకారుడు వరదా వెంకటరత్నం అనీ!
- ...అమెరికాలో భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించేందుకు గాను "శ్రీ ఫొండేషన్" ను స్థాపించిన మహిళ శొంఠి శారదాపూర్ణ అనీ!
- ...భారతదేశంలో రెండవ అత్యున్నత పురస్కారం అయిన కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు వాడపల్లి వెంకటేశ్వరరావు అనీ!
- ...ఎఫ్-16 యుద్ధ జెట్ విమానంలో అత్యవసర విద్యుత్ జనకయూనిట్లో ఇంధనంగా ఉపయోగించే పదార్థం,మరియు పిఎస్ఎల్వి-C4 ఉపగ్రహ వాహకనౌక రెండవదశలో వాడిన చోదకం హైడ్రాజీన్ అనీ!
- ...తెలుగులో తొలి చతురర్థ కావ్యం నలరాఘవ యాదవ పాండవీయం వ్రాసింది తెలంగాణ ప్రాంతానికి చెందిన మరింగంటి సింగరాచార్యులు అనీ!
41 వ వారం
[మార్చు]- ...జీశాట్-6 ఉపగ్రహాన్ని దిగ్విజయంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహకనౌక జీఎస్ఎల్వీ -డీ6 అనీ!
- ...కొరియా శాంతి బహుమతి అందుకున్న తెలుగు శాస్త్రవేత్త మోదడుగు విజయ్ గుప్తా అనీ!
- ...సినిమాలను పరిరక్షించి, భద్రపరచడంలో గట్టి కృషి చేసినందుకు హెన్రీ లాంగ్లోయిస్కు ఆస్కార్ గౌరవ పురస్కారం లభించిందనీ!
- ...స్ట్రాటో ఆవరణం నుంచి జంప్ చేసి ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి అలన్ యూస్టేస్ అనీ!
- ... 1957 లో దేశంలోనే, మొట్టమొదటి సారిగా ఎంబిఎ కోర్సును ప్రవేశపెట్టింది ఆంధ్ర విశ్వవిద్యాలయం అనీ!
42 వ వారం
[మార్చు]- ....యుద్ధంలో మరణించిన వీరులను గుర్తుచేసే స్మారకశిలలే వీరగల్లు లనీ!
- ...అనేకమంది కవులకూ,కళాకారులకూ సహాయాన్నందిస్తున్న శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి.వి.రమణయ్య రాజా అనీ!
- ...ఆరిపోయిన ట్యూబ్ లైట్లతో మళ్లీ వెలుగులు నింపేందుకు క్రొత్త ఆవిష్కరణ "ఐక్య-రెడ్"రూపొందించిన తెలుగు ఆవిష్కర్త మండోజి నర్సింహాచారి అనీ!
- ...ముస్లిం కవులు-రచయితల సంక్షిప్త పరిచయాలను తెలియజేసిన పుస్తకం అక్షరశిల్పులు అనీ!
- ...గుంటూరులోని ఏకా ఆంజనేయులు అనే సంపన్నుడి ఆలోచనా ఫలితంగా జమ్మలమడక మాధవరాయశర్మ రూపకల్పన చేసిన రూపకం భువనవిజయం అనీ!
43 వ వారం
[మార్చు]- ... భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట అనీ!(చిత్రంలో)
- ...శతాధిక నవలా రచయిత్రి,లలిత సంగీత గాయని రావినూతల సువర్ణా కన్నన్ అనీ!
- ...ఆధునిక భౌతిక శాస్త్రం ప్రకారం ప్రకృతిలో నాలుగు ప్రాధమిక బలాలు ఉన్నవనీ!
- ...పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మండోజి నర్సింహాచారి కనిపెట్టిన ప్రయోగము చారి ఫార్ములా అనీ!
- ...కుడివైపు గుండె కలిగి యున్న ప్రత్యేకత కలిగిన గణిత మేథావి పూసపాటి కృష్ణసూర్యకుమార్ అనీ!
- ...దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి విద్వత్ గాయకుడు సంధ్యావందనం శ్రీనివాసరావు అనీ!
44 వ వారం
[మార్చు]- ...ఇండియా యొక్క త్రిమితియ చిత్రాలను తీయు సామర్ధ్యంకలిగిన మొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం కార్టోశాట్-1 అనీ!(చిత్రంలో)
- ... హిందీభాషాప్రవీణుడు, ‘హిందీ చందమామ‘ సంపాదకుడు వై.బాలశౌరిరెడ్డి అనీ!
- ... అడోబ్ ఫోటోషాప్ సృష్టించిన ఒక అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ థామస్ నోల్ అనీ!
- ... సంగీత కళానిధి పురస్కారం పొందినవారిలో అత్యంత పిన్నవయస్కునిగా రికార్డు సాధించినవారు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ అనీ!
- ...కాథోడ్ రేట్యూబ్ హిటింగ్ ఎలెమెంట్ లో వాడు ఇన్సులేటింగ్ పేపరు తయారికి వాడే పదార్థం అల్యూమినియం నైట్రేట్ అనీ!
45 వ వారం
[మార్చు]- ...భాస్కర-I ఉపగ్రహం తరువాత భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన మరో ఉపగ్రహం భాస్కర –II అనీ!
- ...సైన్స్ చక్రవర్తి బిరుదాంకితుడైన ప్రఖ్యాత సైన్సు రచయిత సి.వి.సర్వేశ్వరశర్మ అనీ!
- ...స్త్రీవేషము వేసి క్షేత్రయ్య పదములను పాడి అభినయించు సంగీతకారుడు సభాపతయ్య అనీ!
- ... సుమారు 49,000 నుండి 1,89,000 మందిలో ఒకరు అవిభక్త కవలలు గా జన్మిస్తారనీ!
- ...తెలుగులో లభ్యమయే తొలి శాసనాలలో భట్టిప్రోలు శాసనాలు మొదటివి అనీ!
46 వ వారం
[మార్చు]- ..."స్వరలాసిక" కలం పేరుతో పత్రికలలో వివిధ గ్రంథాలపై చేసిన సమీక్షల్ని "గ్రంథావలోకనం" పేరుతో వెలువరించిన రచయిత కోడీహళ్లి మురళీ మోహన్ అనీ!(చిత్రంలో)
- ...భారత దేశం నిర్మించిన మొదటి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం భాస్కర – I అనీ!
- ...ఖవ్వాలీ గాయకుడిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాకిస్తానీ గాయకుడు నస్రత్ ఫతే అలీఖాన్ అనీ!
- ...ఇప్పటి వరకు ఇస్రో మొత్తం 51 విదేశ ఉపగ్రహలను అంతరిక్షంలో నిర్దేశిత కక్ష్యలో విజయ వంతంగా ప్రవేశపెట్టినదనీ!
- ...నరేంద్ర మోడీకి ఆధ్యాత్మిక గురువు స్వామి దయానంద గిరి అనీ!
47 వ వారం
[మార్చు]- ... స్త్రీ పునర్వివాహము శాస్త్రీయమని అనేక సభలలో వాదించి నిరూపించిన సంఘసంస్కర్త బంకుపల్లె మల్లయ్యశాస్త్రి అనీ!(చిత్రంలో)
- ...ఇస్రో రూపొందించిన కార్టోశాట్ ఉపగ్రహాల శ్రేణిలో నాల్గవ ఉపగ్రహం కార్టోశాట్-2B ఉపగ్రహం అనీ!
- ...ప్రపంచ రికార్డు 225 ఐక్యూ స్థాయితో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన 15 ఏళ్ల విద్యార్థిని విశాలిని అనీ!
- ...శ్రీమదాంధ్ర మహాభారతంలో తొట్టతొలి శ్లోకం శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో అనీ!
- ... ప్రతి ఇంటికి విమానమున్న గ్రామము అమెరికా లో ఫ్లోరిడా రాష్ట్రంలోని స్ర్పూస్ క్రీక్ విమానాశ్రయం అనీ!
48 వ వారం
[మార్చు]- ... ఆంధ్రప్రదేశ్ లో లభ్యమైన అశోకుడి కాలం నాటి శాసనం ఎర్రగుడి శాసనం అనీ!
- ...కార్టోశాట్ ఉపగ్రహశ్రేణిలో ఇది మూడో ఉపగ్రహం కార్టోశాట్-2A ఉపగ్రహం అనీ!
- ....స్త్రీలు కూడా దీక్షలు తీసుకోవచ్చని చెప్పి అన్ని కులాల వారిని ఆదరించిన మహాజ్ఞాని మళయాళ స్వామి అనీ!
- ...పిఠాపురం సంస్థానాన్ని పరిపాలించినవారిలో చివరివాడు రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు అనీ!
- ...దక్షిణభారతదేశాన్ని పల్లవులు ఏలినకాలం నాటి లిపి పల్లవ లిపి అనీ!
49 వ వారం
[మార్చు]- ... క్రికెట్ లో వన్డే పోటీలలో వేగవంతమైన అర్థ శతకం(16 బంతులు), వేగవంతమైన శతకం (31 బంతులు), వేగవంతమైన 150(64 బంతులు) సాధించిన ఆటగాడు ఎబి డెవిలియర్స్ అనీ!(చిత్రంలో)
- ...కార్టోశాట్ శ్రేణి ఉపగ్రహ వరుసలో తయారు చేసిన రెండవ ఉపగ్రహం కార్టోశాట్-2 ఉపగ్రహం అనీ!
- ..."భోజరాజీయం " అను సాహిత్య రూపకం లో కవి సార్వభౌమ 'శ్రీనాధుని ' పాత్రధరించి అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చిన నటుడు తంగిరాల పాల గోపాల కృష్ణ అనీ!
- ...పలు లోహ అలోహ వస్తువులను గ్రైండింగు చెయ్యుటకు మరియు పాలిష్ చెయ్యుటకు ఉపయోగించే రసాయనం అల్యూమినియం డైబోరైడ్ అనీ!
- ... "కవిత" అనే మాసపత్రికను ప్రారంభించిన విశిష్ట జంటకవులు వేంకట రామకృష్ణ కవులు అనీ!
50 వ వారం
[మార్చు]- ....ఇస్రోవారు తయారు చేసిన జీశాట్ శ్రేణికి చెందిన ఉపగ్రహం జీశాట్-8 ఉపగ్రహం అనీ!
- ....క్రీ.శ.1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని కూలదోసిన ఉలూగ్ ఖాన్ రాజమహేంద్రవరంలో వేణుగోపాలస్వామి ఆలయాన్ని పడగొట్టి నెలకొల్పిన పెద్ద మసీదే ఆంధ్రదేశంలో మొట్టమొదటి మసీదుగా నిలిచిందనీ!
- ...12 సంవత్సరాల పాటు నిర్విరామ కృషితో 384 వాల్యూంలతో కూడిన 74 బౌద్ధ గ్రంధాలను చైనా భాష లోనికి అనువదించిన బౌద్ధ సన్యాసి కుమారజీవుడు అనీ!
- ...నాసిక్ నగరమునకు దెగ్గరలో త్రిరశ్మి అను మూడు రాతికొండలయందు నిర్మించబడిన పురాతన గుహలు నాసిక్ గుహలు అనీ!
51 వ వారం
[మార్చు]- ... వికీమీడియా భారతదేశం వారి విశిష్ట వీకీమీడియన్ గుర్తింపు పొందిన హైదరాబాదుకు చెందిన వైద్యులు అంగజాల రాజశేఖర్ అనీ!(చిత్రంలో)
- ...బాపురమణలు తీసిన సాక్షి సినిమా కోసం పులిదిండి గ్రామంలోని గుడిలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల పెళ్ళి చిత్రీకరించగా, కొన్నేళ్ళకు అదే గ్రామంలో, అదే గుడిలో నిజంగా పెళ్ళాడారనీ!
- ...భారత సంతతికి చెందిన,అమెరికా వ్యోమగామిని డా.కల్పనా చావ్లా స్మృతి చిహ్నంగా ఇస్రో తయారుచేసిన ఉపగ్రహం కల్పన-1 ఉపగ్రహం అనీ!
- ...ఉప్పల లక్ష్మణరావు రచించిన అతడు-ఆమె నవల పాత్రలు రాసుకున్న డైరీ ఆధారంగా నడుస్తుంటుందనీ!
- ...తెలుగు, ఇతర ద్రావిడ భాషలను వ్రాసేందుకు కళింగ లిపి ఉపయోగించేవారనీ!
52 వ వారం
[మార్చు]- ...వర్తమాన విషయాలతో తెలుగు జనరల్ నాలెడ్జిని అంతర్జాలం ద్వారా అనేక మంది విద్యార్థులకు అందిస్తున్న తెలుగు భాషాభిమాని సి.చంద్రకాంతరావు అనీ! (చిత్రంలో)
- ...కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారి చారిత్రాత్మక నవల "కడిమి చెట్టు", మయూరశర్మ జీవితం ఆధారంగా వ్రాయబడినదనీ!
- ... ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి లోని జగన్నాధ ఆలయాన్ని నిర్మించిన "అనంతవర్మ చోళగాంగుడు" తూర్పు గాంగుల సామ్రాజ్య స్థాపకుడనీ!
- ...20 నుంచి 30 వరకూ వేర్వేరు కూరలను బోజనంలో వడ్డించటం ద్వారా గుర్తింపు పొందిన హోటల్ నాగన్న హోటల్ అనీ!
- ... తెలంగాణ రాష్ట్రంలో చరిత్రకందని శైవక్షేత్రం కూసుమంచి గణపేశ్వరాలయం అనీ!
53 వ వారం
[మార్చు]- ... దక్షిణ భారత దేశంలో అతి పెద్ద వృక్షం గా పేరు పొందింది తిమ్మమ్మ మర్రిమాను అనీ!
- ... మధ్వాచార్యుని ద్వైత వేదాంత పాఠశాలకి చెందినవిగా భావిస్తున్న వ్రాతపత్రులు నందినాగరి లిపిలో ఉన్నాయనీ!
- ... అంతరిక్షానికి పంపబడిన మొదటి జంతువు లైకా అనీ!
- ... ఆకాశవాణిలో ప్రసారమైన మొదటి తెలుగు శ్రావ్యనాటిక "అనార్కలి"ని వ్రాసింది ముద్దుకృష్ణ అనీ!
- ... "కాకి బంగారం" అని పిలువబడే మిశ్రమలోహం అభ్రకం అనీ!