Jump to content

కల్పనా చావ్లా పురస్కారము

వికీపీడియా నుండి
(కల్పనా చావ్లా అవార్డు నుండి దారిమార్పు చెందింది)
కల్పనా చావ్లా అవార్డు
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం పతకం
విభాగం దైర్యసహసాలు ప్రదర్శించిన మహిళలు
వ్యవస్థాపిత 2003
మొదటి బహూకరణ 2003
క్రితం బహూకరణ 2014
మొత్తం బహూకరణలు 12
బహూకరించేవారు తమిళనాడు ప్రభుత్వం
నగదు బహుమతి రూ.5,00,000/-
వివరణ తమిళనాడు ప్రభుత్వ చిహ్నంతోకూడిన పతకం
మొదటి గ్రహీత(లు) * రేష్మాశర్మ

కల్పనా చావ్లా అవార్డు ను మన దేశంలో తమిళనాడు ప్రభుత్వం ప్రతియేటా ఆగస్టు 15న వివిధ రంగాలలో మహిళా శక్తిమంతులకు అందిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 4 2003 న ఈ అవార్డు కోసం 792 సంఖ్య గల ఉత్తర్వును వెలువరించింది. 2003 నుండి ఈ అవార్డును అందజేస్తున్నారు.[1]

విశేషాలు

[మార్చు]

భారతదేశం లోని హర్యానా రాష్ట్రంలో జన్మించి మనదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించిన కల్పనా చావ్లా పేరు మీద ప్రతి సంవత్సరం ఆదర్శ మహిళలకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా అందిస్తుంది.ఈ అవార్డు మూలంగా ఐదు లక్షల నగదు పురస్కారాన్ని, సర్టిఫికేటును ప్రతి సంవత్సరం ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆదర్శమహిళలకు అందజేయబడుతుంది.[2] ఈ అవార్డు కొరకు మహిళలను ఎంపిక చేయుటకు కమిటీ ఉంటుండి.

ఎంపిక కమిటీ వివరాలు

[మార్చు]

తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ క్రింది వారు ఎంపిక సంఘంగా ఏర్పడి ఈ అవార్డు గ్రహీతను ఎన్నిక చేస్తుంది.[3]

  1. చైర్ పర్సన్/చైర్మన్ : ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ.
  2. సభ్యులు :
    1. సెక్రటరీ, ఆర్థిక శాఖ.
    2. సెక్రటరీ, హోం శాఖ
    3. సెక్రటరీ, పరిశ్రమల శాఖ
    4. సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్ అండ్ న్యూట్రిషన్ మీల్ ప్రోగ్రాం
    5. సెక్రటరీ, పబ్లిక్.
    6. వైస్ ఛాన్సలర్, అన్నా విశ్వవిద్యాలయం చెన్నై.
    7. వైస్ ఛాన్సలర్, మదర్ తెరెసా విశ్వవిద్యాలయం.
    8. జస్టిస్ పద్మిని జేసుదురై
    9. డా. పద్మా సుబ్రమణ్యన్,
  3. మెంబర్ సెక్రటరీ : సెక్రటరీ, హయ్యర్ ఎడ్యుకేషన్

నియమాలు

[మార్చు]

ఈ అవార్డు ఎంపిక కొరకు కొన్ని నియమాలను తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులో వెలువరించింది.[4]

  • ఈ అవార్డును మెడల్ రూపంలో యిచ్చి, దానిని "కల్పనా చావ్లా అవార్డు ఫర్ కరేజ్ అండ్ డేరింగ్ ఎంటర్ ప్రైజ్" అని పిలువబడుతుంది.
  • ఈ మెడల్ ను తమిళనాడు రాష్ట్రంలోని మహిళలకు అందజేయాలి. దానిని భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేయాలి.
  • ఈ మెడల్ వృత్తాకారంగా ఉండి దాని వ్యాసం 83 సెం.మీ, మందం 6 మి.మీ ఉండాలి. దీనిని వెండితో తయారుచేసి బంగారు పూతను వేయాలి. దానిపై తమిళంలో వివరాలను ఒకవైపు, రెండవవైపు తమిళనాడు రాష్ట్ర చిహ్నం ఉండాలి. దీని వెల రూ.5000/- ఉండాలి.
  • ఈ మెడల్ తో పాటు నగదుగా ఐదు లక్షల రూపాయలను గ్రహీతకు యిచ్చి సత్కరించాలి.
  • సంవత్సరానికి ఒక్కరికి మాత్రమే ఈ మెడల్ యివ్వాలి. గ్రహీత పేరును తమిళనాడు ప్రభుత్వ గజిట్ లో ప్రచురించాలి.
  • ఈ అవార్డును ఎంపిక కమిటీ ఎంపిక చేసినా ప్రభుత్వం దానిని దృవీకరించాలి.

అవార్డు గ్రహీతలు

[మార్చు]
  • 2003 : రేష్మాశర్మ - కరాటే విద్యలో ప్రవీణురాలు.[5]
  • 2004 :అమలా మేరీ - బీడీ కార్మికురాలు, అసమాన ధైర్యసాహసాలతో పాడైపోయిన రైలు మార్గం చూసి రైలును ఆపి అనేక మంది ప్రాణాలను రక్షించిన వనిత.[6]
  • 2005 :మీరా రామలింగం - సునామీలో అనేకమందిని కాపాడారు.
  • 2006 : డా.వసంత కందస్వామి, ఐఐటిలో సామాజిక న్యాయం కోసం కృషిచేసారు.[7]
  • 2007 : అర్హులు లేరు.
  • 2008: జ్యోతి నిర్మల, కన్యాకుమారి జిల్లా కలెక్టరు.[8]
  • 2009: పుష్పాంజలి, డా.రాజమహేశ్వరి, [9]
  • 2010: జె.దీప, [10]
  • 2011 : ఎస్.సంగీత : రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, తిరుచి [11]
  • 2012 : డి.రాజ్యలక్ష్మి, డి.శివరంజని, ఈ తల్లీ కూతుళ్ళకు దొంగలతో వీరోచితంగా పోరాడారు.[2]
  • 2013 : సూకి ప్రమీల, తాలూక్ సప్లై ఆఫీస్, విల్వనకోడ్, కన్యాకుమారి, [12]
  • 2014 : ఆర్.పొన్ని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు.[13]

మూలాలు

[మార్చు]
  1. The Kalpana Chawla Award for Courage and Daring Enterprise Constitution of the Selection Committee
  2. 2.0 2.1 "Kalpana Chawla Award to mother, daughter for bravery". Archived from the original on 2016-03-04. Retrieved 2015-06-08.
  3. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ఎంపిక కమిటీ వివరాలు
  4. ఎంపిక మార్గదర్శకాల ప్రభుత్వ ఉత్తర్వు
  5. Reshma Sharma bags first Kalpana Chawla award
  6. Woman gets award for averting train accident
  7. "KALPANA CHAWLA AWARD TO DR.VASANTHA KANDASAMY WHO FOUGHT FOR SOCIAL JUSTICE IN IIT". Archived from the original on 2014-12-03. Retrieved 2015-06-08.
  8. Kalpana Chawla award for Kanyakumari Collector
  9. Mother who inspired organ donations, disabled athlete among Kalpana Chawla award recipients
  10. TN farmers to get free pumpsets; soft skill training scheme for youth
  11. Sangeetha, Tiruchi RDO, given the Kalpana Chawla award
  12. "List of Independence Day Award winners -Tamil Nadu". Archived from the original on 2016-03-04. Retrieved 2015-06-08.
  13. Nagapattinam SP chosen for Kalpana Chawla award

ఇతర లింకులు

[మార్చు]