Jump to content

చికెంకారీ ఎంబ్రాయిడరీ

వికీపీడియా నుండి
Chikan embroidery on a cotton kurta

చికన్ (హిందీ: चिकन, Urdu: چکن) అనునది భారతదేశంలోని లక్నోకు చెందిన సాంప్రదాయ ఎంబ్రాయిడరీ. భాషాపరంగా ఆ పదానికి అర్థం కూడా "ఎంబ్రాయిడరీ". ఈ విధానం మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అయిన షాజహాన్ యొక్క సతీమణి నూర్జహాన్ ద్వారా ప్రవేశపెట్టబడినదని ప్రజల విశ్వాసం.[1] ఇది లక్నో లోని ప్రసిద్ధ వస్త్ర అలంకరణ విధానం.

లక్నో చికెంకారీ ఎంబ్రాయిడరీ కళకు పేరుపొందింది. జిల్లా చికెంకారీ జరీ, జర్దారీ, కందని, గోటా తయారీ మొదలైన పనులకు ప్రసిద్ధి చెందింది. చికెంకారీ ఎంబ్రాయిడరీ దేశంమంతటా గుర్తించబడుతూ ఉంది. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కళ లక్నోలో అభివృద్ధి చేయబడింది. ఇది ప్రధానంగా లక్నో, పరిసర ప్రాంతాలలో వాడుకలో ఉంది. మెత్తని నులు, మద్లిన్, షిఫాను వస్త్రాల మీద తెల్లని నూలుతో చికెంకారీ ఎంబ్రాయిడరీ చేయబడుతుంది. కొన్ని సార్లు లేత పసుపు వర్ణం దారలతో వస్త్రాలు నేయబడుతూ ఉంటాయి. చికెంకారీ ఎంబ్రాయిడరీ టోపీలు, కుర్తాలు, చీరెలు, కాగ్డా (స్కార్ఫ్), కొన్ని ఇతర వస్త్రాల మీద చేయబడుతుంది.

చికెంకారీ ఎంబ్రాయిడరీ పుట్టుక

[మార్చు]

చికెంకారీ ఎంబ్రాయిడరీ పుట్టుక గురించి పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చికెన్ అనే మాట పర్షియన్ పదం. చికెన్ అంటే పర్షియన్‌లో ఎంబ్రాయిడరీ, డిజైన్ అని అర్ధం. చరిత్రకారుడు, నవలాకారుడు అబ్దుల్ హలిం షారర్ వ్రాసిన " లక్నో ది లాస్ట్ ఫేస్ ఆఫ్ ఏన్ ఓరియంటల్ కల్చర్ " పుస్తకంలో చికెంకారీ ఎంబ్రాయిడరీ కళ నజీరుద్దీన్ హైదర్ కాలంలో అభివృద్ధి చెందుంది ప్రాబల్యత సంతరించుకుందని పేర్కొన్నాడు. చికెంకారీ ఎంబ్రాయిడరీ వస్త్రం మొదటిసారిగ 19వ శతాబ్ధపు ఆరంభంలో లక్నోలోని దాలిగంజ్ లోని ఒక మహలు వద్ద బడే మిలియా జరియా రూపకల్పనలో తయారు చేయబడింది. ఇది మొదటిసారిగా బాదుషా అంగరిఖాన్ (వెయిస్ట్ కోట్) మీద డిజైన్ చేయబడింది. ఇది చూసిన బాదుషా ఆనందపడి రూపొందించిన కళాకారులకు బహుమానాలిచ్చి సత్కరించాడు.

శిక్షణాలయం

[మార్చు]

19వ శతాబ్దం మధ్యకాలంలో చికెంకారి కళను అభివృద్ధి చేయడానికి తన సౌందర్యం, మర్యాదలతో లక్నోలో శిక్షణాలయం ఏర్పాటు చేయబడింది. ఇది 38 విధాలైన కుట్లు ఉపయోగిస్తూ (అద్దాలు, కటావో, బఖియా) వస్త్రాల మీద అల్లబడిన క్లిష్టమైన కళ. లక్నో క్రమంగా తన పురాతనమైన సంస్కృతి, సంప్రదాయ వేడుకలు, మద్యాద కోల్పోతూ ఉంది. అయినప్పటికీ దేశ, విదేశ ఆదరణ కారణంగా చికెంకారి ఎంబ్రాయిడరీ తిరిగి అభివృద్ధి దశకు చేరుకుంది. ఇది నవాబుల కాలం నాటి దశకంటే అధికంగా అభివృద్ధి చెందుతూ ఉంది.

గత 20 సంవత్సరాల కాలంలో చికెంకారి ఎంబ్రాయిడరీకి గిరాకీ అధికరిస్తూ ఉంది. దీనిని టోపీలు, కుర్యాలు, మఫ్లర్లు, చీరెల మీద అల్లుతుంటారు. చికెంకారి ఎంబ్రాయిడరీ లక్నో, అవధ్ ప్రాంతంలో ఇది ప్రధాన పరిశ్రమగా వర్ధిల్లింది. ప్రాంతీయ, దేశీయ, విదేశీ మార్కెట్లలో చెకెంకారీ ఎంబ్రాయిడరీ చేయడానికి 2,500 మంది పనిచేస్తూ ఉన్నారు. చెకెంకారి ఎంబ్రాయిడరీ వస్త్రాల లక్నో అతిపెద్ద ఎగుమతి మార్కెట్టుగా రూపొందింది.

వైవిధ్యం

[మార్చు]

చెకెంకారీ ఎంబ్రాయిడరీ కటావో, ఫండా మొదలైన 4 విధాలలో రూపొందించబడుతున్నాయి.[2] కటావో పద్ధతిలో మస్లిన్, ముర్రీ వస్త్రాల మీద రకరకాల డిజైన్లు చిత్రించబడి దానిమీద నూలును సూదితో చేచి అల్లబడుతుంది. ఫండా విధానంలో గొలుసుకుట్టుతో అల్లబడుతుంది. జాలి ఖోల్నా విధానంలో వస్త్రాల మీద అల్లబడిన నూలును నేర్పుగా విప్పి తిరిగి వేరు డిజైనులో అల్లబడుతుంది. చికెంకారి ఎంబ్రాయిడరీ 2008 లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిస్తూ జి.ఐ సర్టిఫికేటును సాధించుంది. చికెంకారి వస్త్రాల ఎగుమతిలో లక్నో అంతర్జాతీయంగా ప్రథమ స్థానంలో ఉంది.

జరీ కుట్టు

[మార్చు]

లక్నో బంగారు, జరీ నూలు ఎంబ్రాయిడరీ పనికి కూడా ప్రసిద్ధి చెందింది.[2] జరీ అల్లిక పని సల్మా, ఘిజై, సితారా, కందాని, కాలాబాతున్ విధానాలలో డిజైన్లు రూపకల్పన చేయబడుతున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా లక్నో జర్దోజి, కాందాని చాలా ప్రాబల్యత సంతరించుకుంది. ఇది నవాబుల సభామండపాలలో మెరుపులు కురిపించింది. లక్నోలో బంగారు, వెండి జలతారును ఉపయోగించి జర్దోయి, కాందాని విధానాలలో డైజైన్లు రూపొందించబడుతున్నాయి. కాందాని డిజైన్లు బంగారు, వెండి జలతారును ఉపయోగించి మాత్రమే రూపొందిస్తారు. జర్దోయి డిజైన్లు సల్మా, సితారా అలాగే బంగారు, వెండి జలతారును కూడా చేర్చి రూపొందించబడుతున్నాయి. ఇది నిరాడంబరంగా చిన్న చున్న డిజైన్లుగా రూపొందించబడుతున్నాయి. ప్రసిద్ధమైన కాందాని డిజైన్లు చికెంకారీలా ఉన్నప్పటికీ ఇది బంగారు, వెండి జలతారుతో తెల్లని వస్త్రాల మీద మాత్రమే అల్లబడుతుంది. సన్నని వస్త్రాల మీద చదునైన బంగారు, వెండి జలతారుతో కాందాని డిజైన్లు అల్లబడుతుంటాయి.

కుట్టే విధానం

[మార్చు]

డిజైన్ రూపొందించే సమయంలో సూదిలో రెండు వరుసల దారం దూర్చి రెండు కొసలను కలిపి ముడి వేస్తారు. జర్దోయి, చుకెన్ పని ఒకలా కనిపించినప్పటికీ ఒకదానికి మరొకటి విభేదించి ఉంటూ ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటుంది. జర్దోయి వర్కులో పట్టు వస్త్రం మీద బంగారు వెండి జలతారును ఉపయోగించి పెద్ద పెద్ద డిజైన్లతో రూపొందించబడుతుంటాయి. వస్త్రాన్ని ఫ్రేములో బిగించి డిజైన్ రూపొందించబడుతుంది. లక్నో జర్దోయి నాణ్యంగా ఉంటుంది. ఇది త్వరితగతిలో పూర్తిచేయబడుతూ ప్రజాదరణను అధికంగా చూరగొన్నది. 2013లో ప్రపమచ ప్రసిద్ధి చెందిన లక్నో జర్దారీకి జి.సి.ఆర్ నుండి జి.ఐ గుర్తింపు లభించింది. లక్నో జర్దోయి డిజైన్ వస్త్రాలు లక్నో, పరిసరాలలోని 6 ప్రాంతాలలో తయారు చేయబడుతున్నాయి. జర్దోయి డిజైన్లతో వస్త్రాలు ఉన్నవ్, సీతాపూర్, రాయ్‌బరేలి, హర్దోయి, అమేధి ప్రాంతాలలో కూడా తయారు చేయబడుతున్నాయి.

లేసు తయారీ

[మార్చు]

లక్నోలో ప్రధానంగా బంగారు, వెండి జలతారుతో లచ్కా, కాలబటు, లైస్ మొదలైన లేసులు తయారు చేయబడుతున్నాయి. లచ్కా విధానంలో వెండి జలతారు ఉపయోగించబడుతుంది. ఇది రిబ్బన్ వంటి వస్త్రం మీద తయారు చేయబడుతుంది. కాలాబటు వెండి జల్లతారుతో పెనవేసిన పచ్చని దారాలను ఉపయోగించి రిబ్బనులాగా డిజైన్లు రూపొందిస్తారు. వీటిని పట్టు, వైర్లను ఉపయోగించి అల్లుతుంటారు. బంగారు, వెండి గోటా పనులకు కూడా లక్నో పేరుపొందింది. గోటాను వస్త్రాల అంచులకు చేర్చి కుట్టి వస్త్రాలను నూతన అందం తీసుకువస్తారు. లక్నోలో ఇప్పటికీ గోటా, కినారి పనులు జరుగుతూనే ఉన్నాయి. లక్నో చౌక్ ప్రాంతంలో ఆకర్షణీయమైన వార్క్యూ, ఇత్రా, జర్దా, చికన్, కాందాని, జరి, గోటా, కినారీ తయారీలకు కేంద్రంగా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. Wilkinson-Weber, Clare M. (1999). 5. Skill and Knowledge in Fine Chikan Embroidery, Embroidering Lives: Women's Work and Skill in the Lucknow Embroidery Industry, pp. 12-13. State University of New York Press. ISBN 0-7914-4087-7.
  2. 2.0 2.1 Dusenbury, Mary M. (2004). Flowers, Dragons and Pine Trees: Asian Textiles in the Spencer Museum of Art, p. 42. Hudson Hills Press. ISBN 1-55595-238-0.

వెలుపలి లింకులు

[మార్చు]