గ్రీక్ ప్రభుత్వ-రుణ సంక్షోభం
గ్రీక్ ప్రభుత్వ-రుణ సంక్షోభం (గ్రీస్ ఆర్థికమాంద్యంగా కూడా పిలుస్తారు)[1][2][3], యూరోజోన్ లోని నాలుగు సార్వభౌమ రుణ సంక్షోభాల్లో ఒకటిగా 2009 చివర్లో ప్రారంభమైంది, తర్వాతికాలంలో యూరోపియన్ రుణసంక్షోభంగా వాటన్నిటినీ పిలవనారంభించారు. సాధారణ దృక్కోణం ఇది గ్రేట్ రెసిషన్ (గొప్ప ఆర్థికసంక్షోభం) వల్ల ఏర్పడిన సంక్షోభంతో ప్రారంభమైందని భావించినా, ఈ సమస్య గ్రీసులో విస్ఫోటనం కావడానికి వెనుక గ్రీక్ ఆర్థికవ్యవస్థలోని నిర్మాణాత్మక లోపాలతో, దశాబ్దాల నుంచి నెలకొన్న అత్యున్నతస్థాయి నిర్మాణంలోని లోపాలతో కలపడం, స్థూలజాతీయోత్పత్తి స్థాయికి రుణం మించిపోవడం వంటివి మూలకారణాలు. 2009 తుదిలో, పెట్టుబడిదారుల్లో గ్రీస్ కి రుణాలను తీర్చే సామర్థ్యం ఉండదేమోనని, సార్వభౌమ రుణసంక్షోభం తాలూకు భయాలు ఏర్పడ్డాయి.[4][5][6]2012లో, గ్రీస్ ప్రభుత్వం చరిత్రలోనే అతిపెద్ద సార్వభౌమ రుణం తీర్చలేని దేశంగా నిలిచింది. జూన్ 30, 2015న గ్రీస్ €1.6 బిలియన్ ఐఎంఎఫ్ రుణం చెల్లింపు చేయలేకపోయిన తొలి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచింది.[7]ఆ సమయానికి, గ్రీసు ప్రభుత్వం €323 బిలియన్ల రుణం కలిగివుంది.[8]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "The Greek Depression" Foreign Policy
- ↑ "Greece has a depression worse than Weimar Germany’s—and malaria too" Quartz
- ↑ "[190] Thusday, Sept. 29: Keiser Report: The Greek Depression & Macing Bankers". Archived from the original on 26 జూన్ 2015. Retrieved 29 June 2015.
- ↑ Higgins, Matthew; Klitgaard, Thomas (2011). "Saving Imbalances and the Euro Area Sovereign Debt Crisis" (PDF). Current Issues in Economics and Finance. 17 (5). Federal Reserve Bank of New York. Retrieved 11 November 2013.
- ↑ George Matlock (16 February 2010). "Peripheral euro zone government bond spreads widen". Reuters. Archived from the original on 20 సెప్టెంబరు 2020. Retrieved 28 April 2010.
- ↑ "Acropolis now". The Economist. 29 April 2010. Retrieved 22 June 2011.
- ↑ "Greece fails to make IMF payment as bailout expires". CTVNews. Retrieved 3 July 2015.
- ↑ BBC News, 30 June 2015: Greece debt crisis: Eurozone rejects bailout appeal