పిఎస్ఎల్‌వి-C4 ఉపగ్రహ వాహకనౌక
పిఎస్ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌక మాదిరి | |||
విధి | Medium lift launch system | ||
---|---|---|---|
తయారీదారు | ఇస్రో | ||
దేశము | ఇండియా | ||
ఒక్కో ప్రయోగానికి అయ్యే ఖర్చు (2024) | PSLV-CA | ||
పరిమాణము | |||
ఎత్తు | 44 మీటర్లు (144 అ.) | ||
వ్యాసము | 2.8 మీటర్లు (9 అ. 2 అం.) | ||
ద్రవ్యరాశి | PSLV: 295,000 కి.గ్రా. (650,000 పౌ.) PSLV-G: 230,000 కి.గ్రా. (510,000 పౌ.) PSLV-XL: 320,000 కి.గ్రా. (710,000 పౌ.) | ||
దశలు | 4 | ||
సామర్థ్యము | |||
Payload to LEO |
3,250 కి.గ్రా. (7,170 పౌ.) | ||
Payload to SSO |
1,750 కి.గ్రా. (3,860 పౌ.)[1] | ||
Payload to Sub GTO |
1,425 కి.గ్రా. (3,142 పౌ.)[1] | ||
ప్రయోగ చరిత్ర | |||
స్థితి | Active | ||
ప్రయోగ స్థలాలు | Sriharikota | ||
మొత్తం ప్రయోగాలు | 30 PSLV: 11 PSLV-CA: 10 PSLV-XL: 9 | ||
విజయాలు | 29 PSLV: 9 PSLV-CA: 10 PSLV-XL: 9 | ||
వైఫల్యాలు | 1 (PSLV) | ||
పాక్షిక వైఫల్యాలు | 1 (PSLV) | ||
తొలి ప్రయోగం | PSLV: 20 September 1993 PSLV-CA: 23 April 2007 PSLV-XL: 22 October 2008 | ||
ప్రముఖ పేలోడ్లు | Chandrayaan-1, Mars Orbiter Mission | బూస్టర్లు (PSLV-G) - S12 | |
బూస్టర్ల సంఖ్య | 6 | ||
ఇంజన్లు | off | ||
థ్రస్టు | 662 కి.N (149,000 lbf) | ||
Specific impulse | 262 s (2.57 km/s) | ||
మండే సమయం | 45 seconds | ||
ఇంధనం | HTPB | ||
First దశ | |||
ఇంజన్లు | S139 | ||
థ్రస్టు | 4,628 కి.N (1,040,000 lbf) | ||
Specific impulse | 237 s (2.32 km/s) (sea level) 269 s (2.64 km/s) (vacuum) | ||
మండే సమయం | 107 seconds | ||
ఇంధనం | HTPB | ||
Second దశ | |||
ఇంజన్లు | 1 Vikas | ||
థ్రస్టు | 725 కి.N (163,000 lbf) | ||
Specific impulse | 293 s (2.87 km/s) | ||
మండే సమయం | 163 seconds | ||
ఇంధనం | N2O4/UDMH | ||
Third దశ | |||
ఇంజన్లు | S7 | ||
థ్రస్టు | 260 కి.N (58,000 lbf)260కిలోన్యూటన్లు | ||
Specific impulse | 294 s (2.88 km/s) | ||
మండే సమయం | 109 seconds | ||
ఇంధనం | solid HTPB | ||
Fourth దశ | |||
ఇంజన్లు | 2 x L-2-5 | ||
థ్రస్టు | 14.8 కి.N (3,300 lbf)(2X7.4)=14.8కిలోన్యూటన్లు | ||
Specific impulse | 308 s (3.02 km/s) | ||
మండే సమయం | 515 seconds | ||
ఇంధనం | MMH/MON |
పిఎస్ఎల్ వి-C4 ఉపగ్రహ వాహకనౌక, ఇస్రో సంస్థ, ధ్రువీయ ఉపగ్రహ వాహకనౌక (Polar Satellite Launch Vehicle) శ్రేణిలో తయారు చేసిన 7వ ఉపగ్రహ ప్రయోగ వాహనం. భూ అనువర్తిత బదిలీ కక్ష్యలో 1060 కిలోగ్రాముల బరువు ఉన్న METSAT-1 (కల్పన-1) ఉపగ్రహాన్నివిజయవంతంగా ప్రవేశపెట్టింది. నిజానికి పిఎస్ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌకను, 900 కిలోల బరువుఉన్న ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ (IRS) ను 900 కి.మీ.సౌర సమస్థితి ధ్రువ కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి రూపకల్పనచేసి నిర్మించారు.మొదట సారి 1993 లో శ్రీహరికోట నుండి నాలుగు దశలు కలిగిన మొదటి పిఎస్ఎల్‌వి వాహనాన్ని ప్రయోగించినది లగాయితు క్రమంగా ఈ ఉపగ్రహ ప్రయోగ వాహనాన్ని అభి వృద్ధిపరచుకుంటూ, దాని ప్రయోగ సామర్ధ్యాన్ని పెంచుతూ వచ్చారు.
అంతకుముందు ప్రయోగించిన పిఎస్ఎల్‌వి వాహనాలతో పిఎస్ఎల్ వి-C4 ఉపగ్రహన్ని పోల్చిన, ఇది ఉపగ్రహాన్ని భూ అనువర్తిత బదిలీ క్షక్ష్యలో, 250 కి.మీ పెరిజీ (భూమికి దగ్గరి బిందువు), 36,000 కి.మీ అపోజీ (భూమి నుండి దూరపు బిందువు) కలిగి ఉండేలా, భూమధ్య రేఖకు 18.0 డిగ్రీల కోణంలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టెలా రూపొందించారు.
ఉపగ్రహ వాహన నౌక నిర్మాణం
[మార్చు]పిఎస్ఎల్‌వి-C4 ఉపగ్రహ వాహకనౌక 44.4 మీటర్ల పొడవు ఉండి,295 టన్నుల బరువు ఉంది.నాలుగు అంచెలు ఉన్న ఈ ఉపగ్రహంలో ద్రవ, ఘనచోదక దశలను ఒకదాని తరువాత మరొకటి చొప్పున అమర్చారు (ఘన, ద్రవ, ఘన, ద్రవ చోదక దశలు).[2] [3]
మొదటిదశ
[మార్చు]మొదటిదశ ప్రపంచంలోని రాకెట్ లలో కెల్లా పొడవైనది,138 టన్నుల హైడ్రాక్సిల్ పాలిబ్యుటడైన్ (HTPB) ఘనచోదకం కలిగిన చోదకఇంజన్.ఈ మొదటిభాగాన్ని మారజింగ్ఉక్కుతో (maraging steel) తో తయారు చేసారు.ఈదశలో 4,628 కిలోన్యూటన్ల త్రోపుడుశక్తి ఉత్పన్నమగును[2][3].
మెదటి దశకు అదనంగా 6 స్ట్రాపాన్ మోటరులు బిగించబడినవి. ప్రతి స్ట్రాపాన్ మోటరులలో 9 టన్నుల ఘనఇంధనం/చోదకం HTPB నిపబడిఉన్నది. ప్రతి స్ట్రాపాన్‌దశ మండునపుడు 662 కిలోన్యూటన్ల త్రోపుడు శక్తి (thrust) ని సృష్టించును. స్ట్రాపాన్ ఇంజన్లలో నాలుగు భూ స్థాయిలోనే మండింపబడి, మొదటిదశ మోటరుకు అదనపు త్రోపుడుశక్తిని అందించుటకు దోహదపడును.
రెండవ దశ
[మార్చు]రెండవదశలో ద్రవచోదకం ఉంది.ఇందులో స్వదేశీయంగా తయారు చేసిన వికాస్ ఇంజను అమర్చబడిఉన్నది.ఇందులో 40 టన్నుల అసౌష్టవ డైమిథైల్ హైడ్రాజీన్ (UDMH), నైట్రోజన్ టెట్రాక్సైడ్ (N2O4) లు నింపబడిఉన్నాయి. డైమిథైల్ హైడ్రాజీన్ ను ఇంధనంగా, నైట్రోజన్ టెట్రాక్సైడ్ ను ఆక్సీకరణిగా ఉపయోగిస్తారు.ఈ దశ మండునపుడు 725 కిలోన్యూటనుల త్రోపుడు శక్తి/పీడనం జనించును[2][3].
మూడవదశ
[మార్చు]మూడవ దశలో 7.6 టన్నులఘన HTPBచోదకం (propellant) నింపబడి ఉంది. ఈ మోటారును పాలి అర్మిడ్ ఫైబరుతో నిర్మించారు. ఈదశలో 260 కిలోన్యూటన్ల త్రోపుడుశక్తి ఏర్పడుతుంది.
నాల్గవ దశ
[మార్చు]చివరి, నాల్గవ దశలో 2.5 టన్నుల ద్రవచోదకం ఉంది. (మొనో-మిథైల్ హైడ్రాజీన్ ఇంధనాన్ని నైట్రోజన్ ఆక్సైడులతో మిశ్రమం చేసింది). ఈ భాగంలో రెండు మోటరులు అమర్చబడి ఉన్నాయి. ఒక్కొక్క ఇంజను మండునప్పుడు 7.4 కిలోన్యూటన్ల గరిష్ఠ త్రోపుడుశక్తిని సృష్టిస్తుంది[2].
నాల్గవదశ తరువాత నిర్మాణం
[మార్చు]నాలగవ దశకు పై భాగాన ఉపగ్రహ వాహనాన్ని నియంత్రణ చేసే పరికరాలపెట్టె (equipment bay) ఉండి, దానిపై భద్రంగా ఉపగ్రహం అమర్చబడిఉన్నది. దీని చుట్టూ 3.2 మీటర్ల వ్యాసమున్న, రెండు సమభాగాలుగా నిర్మాణం కలిగిన ఉష్ణరక్షక కవచంఉన్నది.ఇది ఐసోగ్రిడ్ నిర్మాణం. ఈ రక్షక కవచం, ఉపగ్రహ వాహనం సాంద్రతయుత వాతావరణం గుండా ప్రయాణించే సమయంలో, గాలితో వాహకం ఘర్షణవలన ఏర్పడు వేడి, పీడనం నుండి ఉపగ్రహాన్ని, పరికరాల పెట్టెను, అందులోని నియంత్రణ ఉపకరణాలను సంరక్షించును[2][3].
ఉపగ్రహ వాహనం గమనంలో ఉండునపుడు వాహక నియంత్రణ వ్యవస్థ
[మార్చు]మొద దశలో పిచ్, యవ్ (pitch and yaw) నియంత్రణకు సెకండరి ఇంజెక్షను త్రస్ట్ వెక్టరు కంట్రోల్ (SITVC) వ్యవస్థ, రోల్ (roll) నియంత్రణకు రియక్షన్ కంట్రోల్ త్రస్టరులు (RCT) ఉన్నాయి. రెండు స్ట్రాపాన్ మోటరుల మీద అమర్చిన SITVC ద్వారా రోల్ కంట్రోల్ అగ్మేంటేషన్ జరుగుతుంది. రెండవదశలో పిచ్, యవ్ (pitch and yaw) నియంత్రణకు ఇంజిన్ గింబాల్ (Engine gimbal) విధానం, ఫ్లైట్ రోల్ కై హాట్ గ్యాస్ రియాక్షన్ నియంత్రణ ఉంది. మూడవదశలో పిచ్, యవ్ నియంత్రణకు ఫ్లెక్సు నాజిల్, రోల్ కై PS-4 RCS వ్యవస్థను అమర్చారు. నాల్గవదశలో ఇంజిన్ గింబాల్ నియంత్రణ వ్యవస్థ ద్వారా పిచ్, యవ్, రోల్ నియంత్రణ చెయ్యబడును[2].
పరికారలపెట్టెలో అమర్చిన (equipment bay) ఇనర్షియల్ నావిగేషన్ సిస్టం (INS) ద్వారా ఉపగ్రహ వాహనం బయలు దేరినది మొదలు, ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టు వరకు ఉపగ్రహ ప్రయోగ వాహనాన్నిమార్గ నిర్దేశం చేయును[2][3].
దశ | పేరు | చోదకం | చోదకం బరువు, టన్నులు |
త్రోపుడు పీడనం/శక్తిKN | దహన సమయం, సెకన్లు |
వ్యాసం, మీటర్లు |
పొడవు, మీటర్లు |
1దశ | PS1+, | SOLID HTPB BASED | 138టన్నులు | 4628 | 107 | 2.8 | 20.0 |
1దశ | స్ట్రాపాన్‌లు,6 | SOLID HTPB BASED | 6X9టన్నులు | 6X662KN | 45 | 1.0 | 10.0 |
2దశ | PS2 | LIQUID UDMH +N2O4 | 40.6 | 725 | 163 | 2.8 | 12.8 |
3దశ | PS3 | SOLID HTPB BASED | 7.6 | 260 | 109 | 2.0 | 3.6 |
4దశ | PS4 | LIQUID MMH + MON | 2.5 | 2 X 7.4 | 515 | 2.8 | 2.9 |
ఉపగ్రహవాహన ప్రయోగ వివరాలు
[మార్చు]పిఎస్ఎల్‌వి-C4 ఉపగ్రహ వాహకనౌక ద్వారా కల్పన-1 ఉపగ్రహం/METSAT ను అంతరిక్షంలో భూస్థిరకక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ వాహన నౌకను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుండి 12 సెప్టెంబరు 2002న ప్రయోగించారు.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Polar Satellite Launch Vehicle". Archived from the original on 2014-12-23. Retrieved 2014-12-21.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 "PSLV-C4". isro.gov.in. Archived from the original on 2015-12-07. Retrieved 2015-09-29.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 "PSLV C4-METSAT MISSION" (PDF). isro.gov.in. Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2015-09-30.