Jump to content

నెక్ చంద్ సైని

వికీపీడియా నుండి
నెక్ చంద్ సైని
జననం(1924-12-15)1924 డిసెంబరు 15
బరియన్ కలన్,షకర్‌గర్, బ్రిటిష్ ఇండియా.
మరణం2015 జూన్ 12(2015-06-12) (వయసు 90)
చండీగఢ్
జాతీయతభారతీయుడు
రంగంArchitecture, sculpture
ఉద్యమంOutsider Art
చేసిన పనులురాక్ గార్డెన్, చండీగఢ్‌
అవార్డులుపద్మశ్రీ (1984)

నెక్ చంద్ సైని[1] (नेक चंद सैनी; 15 డిసెంబరు 1924 – 12 జూన్ 2015) స్వయం అధ్యయనం చేసిన శిల్పకారుడు.ఆయన చండీగఢ్ లోని రాతి ఉద్యానవనం సృష్టికర్త.పద్మశ్రీ అవార్డు గ్రహీత.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

నెక్ చంద్ ‘బెరియన్ కలాన్’ అనే గ్రామంలో 1924 లో జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం పాకిస్థాన్ లో ఉంది. భారత విభజన సమయంలో వారి కుటుంబం భారత్ కు వచ్చేసింది. ఆయన చండీగఢ్ లో రాక్ గార్డెన్ ను సృష్టించారు. దీనికోసం విశేష కృషి చేసారు. ఈ ఉద్యానవన నిర్మాణం గోప్యంగ చేసారు. 1973 లో అడవిలో ఆంటి – మలేరియా టీంలో పనిచేస్తున్న ఎస్.కె. శర్మ దీనిని గుర్తించారు. ఇది అటవీ ప్రాంతం కనుక, చాంద్ నిర్మాణాలు అన్నీ అక్రమమైనవని, తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, చాంద్ ప్రజాభిప్రాయం సేకరించి, ఇదొక గొప్ప పర్యాటక స్థలం కాగలదని నిరూపించాడు. 1975 లో దీన్ని అధికారికంగా గుర్తించారు. 1976 నుంచి ఇది సందర్శకుల కోసం తెరిచారు. తర్వాత ఈ వనాన్ని మరిన్ని శిల్పాలతో విస్తృత పరిచారు. అటుపై, చాంద్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. పలు విదేశీ సంస్థలు ఆయన్ను సత్కరించాయి. విదేశీ మ్యూసియం లలో చాంద్ శిల్పాలు చోటు సంపాదించుకున్నాయి.

రాక్ గార్డెన్

[మార్చు]

ఇది సృజనాత్మకతకు, నూతన ఆవిష్కరణకు, అద్భుత చాతుర్యానికి పెట్టింది పేరు. చండీగఢ్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ ఇన్‌స్పెక్టర్ అయిన నెక్ చంద్ ఈ ఉద్యాన సృష్టికర్త. 1957లో 12 ఎకరాల స్థలంలో 18 ఏళ్లపాటు కృషి చేసి దేశంలోనే ప్రత్యేక ఉద్యానంగా దీన్ని తీర్చిదిద్దాడు. ఇది ప్రస్తుతం సుమారు నలభై ఎకరాలకు విస్తరించింది. ఆయన చక్కటి ఆకృతి ఉన్న రాళ్ళను తన సైకిల్ పై మోసుకొచ్చేవాడు. వ్యర్ధ పదార్ధాలు సేకరించేవాడు. అడవిలో తానుండి, పనిచేసుకునేందుకు ఒక రాతి పలకల గూటిని నిర్మించుకున్నాడు. ఇవన్నీ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే, సాయంత్రం తన బాధ్యతలు ముగియగానే, మొదలుపెట్టి, చేసేవాడు... అదీ, “రహస్యంగా !” ఇలా దాదాపు 18 ఏళ్ళు కష్టపడ్డారు. కష్టమైనా, ఇష్టమైన పనిని ఒక తపస్సులా, యోగనిష్ట లా చేసినందుకు.ఒక అద్భుతమైన రాతి సామ్రాజ్యం అక్కడ ఏర్పడింది. అతని శ్రమకు ఫలితంగా, అతనికి ప్రభుత్వం ‘పద్మశ్రీ’ని 1984లో బహుకరించింది.

ఆయన ఉద్యోగ విధులు ముగిసాకా, శివాలిక్ కొండల దిగువన తిరుగుతూ, పక్షి ఆకృతిలో, వివిధ జంతువుల ఆకారాల్లో, మనిషి ఆకారంలో ఉన్న రాళ్ళను ఏరి, తన సైకిల్ పై తీసుకు వచ్చేవారు. తాను ఉండి, పని చేసుకునేందుకు వీలుగా ఒక రాతి గుడిసెను ఏర్పరచుకున్నారు. మొదటి ఏడేళ్ళు గృహాల నుంచి, ఇండస్ట్రీ ల నుంచి, వీధుల నుంచి వ్యర్ధ పదార్ధాల సేకరణలో గడిపారు. విరిగిన గాజు ముక్కలు, పగిలిన కుండలు, సిరామిక్ టైల్స్, మాడిన బుల్బ్ లు, బాటిల్స్, మంగలి వద్ద నుంచి కత్తిరించిన జుట్టు, ఇవే అతని ముడి పదార్ధాలు. క్రమంగా అవన్నీ అద్భుతమైన 20,000 కళాకృతులుగా రూపుదిద్దుకున్నాయి. 12 ఎకరాల్లో నాట్యకారులు, సంగీత వాద్య కారులు, వివిధ జంతువులు, రాతి మేడలు, తోరణాలు, జలపాతాలు, సింహాసనం, కళారూపాలతో ‘సుఖ్రాని’ అద్భుత సామ్రాజ్యం నిర్మించారు. ఒక సన్నటి దారి గుండా వెళ్తుంటే, ముందర ఏమి ఒస్తుందో తెలియని ఉద్విగ్నత ! మరొక్క క్షణం ఆగితే, కళ్ళముందు మరో అద్భుత ప్రపంచం... ఇలా సాగుతుంది చండీగర్ రాక్ గార్డెన్స్ లో సందర్శకుల పయనం. ‘ఒక్క మనిషి, ఇంత అద్భుతాన్ని సృష్టించగలడా ?’, అని ఆశ్చర్యపోనివారు ఉండరు.

మరణం

[మార్చు]

ఆయన 2015 జూన్ 12 న మరణించారు.[3]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nek Chand Saini was born on 15 December 1924 in a small Punjabi village of Barian Kalan." Page number 159, 'Univers caches: I’art outsider au Musee Dr Guislain’ Published by ‘Lannoo Uitgeverij’ 2008, ISBN 9020970232, 9789020970234
  2. Nek Chand Rock Garden Sublime spaces & visionary worlds: built environments of vernacular artists, by Leslie Umberger, Erika Lee Doss, Ruth DeYoung (CON) Kohler, Lisa (CON) Stone, Jane (CON) Bianco. Published by Princeton Architectural Press, 2007. ISBN 1568987285. Page 319-Page 322.
  3. "రాక్‌ గార్డెన్‌ సృష్టికర్త చంద్‌ కన్నుమూత". Archived from the original on 2015-06-17. Retrieved 2015-06-15.

ఇతర లింకులు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]