Jump to content

రక్తం తాగే రాక్షసబల్లి

వికీపీడియా నుండి

రక్తం తాగే రాక్షసబల్లి
Temporal range: Early Jurassic
IVIC-P-2687, the holotype right tibia, and IVIC-P-2868, the referred left ischium
Scientific classification Edit this classification
Domain: Eukaryota
Kingdom: జంతువు
Phylum: కార్డేటా
Class: Reptilia
Clade: Dinosauria
Order: Saurischia
Suborder: Theropoda
Genus: Tachiraptor
Langer, Rincón, Ramezani, Solórzano, & Rauhut, 2014
Species:
T. admirabilis
Binomial name
Tachiraptor admirabilis
Langer, Rincón, Ramezani, Solórzano, & Rauhut, 2014

రక్తం తాగే రాక్షసబల్లి లేదా రక్త రాకాసిబల్లి లేదా రక్తం తాగే రాకాసి బల్లి లేదా ధీఫ్ ఆఫ్ టచీరా ఒక రకమైన రాక్షస బల్లి. దీని అవశేశాలను శాస్త్రవేత్తలు వెనిజులా లో కనుగొన్నారు.

Tachiraptor admirabilis type locality in Venezuela

విశేషాలు

[మార్చు]
  • దీనిపై చేసిన పరిశోధనలో శాస్త్రజ్ఞులకు ఎన్నో ఆసక్తికరమైన సంగతులు తెలిశాయి. ఆరు అడుగుల ఆరు అంగుళాల పొడవు ఉండే ఈ డైనో చిన్న చిన్న జీవుల్ని చంపి వాటి రక్తాన్ని జుర్రుకునేదిట.[1][2]
  • వెనిజులాలో బయటపడ్డ మొదటి మాంసాహారి డైనోసార్ ఇదే. శాస్త్రీయ నామం 'టచీరాప్టర్ అడ్మిరబిలిస్'. ఇది కనిపించిన టచీరా ప్రాంతం మీదుగా పేరు పెట్టారు.
  • ఈ డైనో దొరికిన ప్రాంతంలోని రాళ్లను, పరిసరాల్ని రేడియోమెట్రిక్ డేటింగ్ పరిజ్ఞానంతో పరిశీలించి పుట్టుపూర్వోత్తరాలు కనుగొన్నారు. ఈ రక్త రాకాసి బల్లి దాదాపు 200 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై తిరిగాడింది. అంటే 20 కోట్ల ఏళ్ల క్రితమన్నమాట. ఎక్కువగా డైనోలు బతికింది ఈ కాలంలోనే. అదే జురాసిక్ కాలం.
  • దీని శిలాజాలు ఇతర డైనో జాతుల గురించి అధ్యయనానికి ఎంతో ఉపయోగపడతాయిట. ఒకేసారి ఎక్కువ మొత్తంలో దాదాపు 84 శాతం వరకు అంతరించిపోయిన డైనో జాతుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా మాంసాహార డైనోసార్ జాతులు ఎలా విస్తరించాయనే వంటి విషయాలు తెలుస్తాయి. అంతేకాదు ఇది ఆనాటి డైనోలతో పాటు కొత్త జాతి డైనోలకు, జన్యువులకు ప్రాతినిధ్యం వహించేలా ఉందిట.
  • ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఉండే ఇవి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, అగ్నిపర్వతాలు పేలడం, సముద్ర మట్టాలు పెరగడం వల్లే అంతరించిపోయాయని తేలింది.

మూలాలు

[మార్చు]
  1. Hannah Osborne (9 October 2014). "Dinosaur Species Discovered: Tachiraptor admirabilis was T-Rex's Tiny Ancestor from Venezuela". International Business Times. Retrieved 8 December 2014.
  2. Charles Q. Choi (7 October 2014). "Newfound South American Predator Snacked on Little Dinosaurs". LiveScience. Retrieved 8 December 2014.