Jump to content

ఆలం ఆరా

వికీపీడియా నుండి
ఆలమ్ ఆరా
1931 - అలమ్ ఆరా సినిమా పోస్టర్
దర్శకత్వంఅర్దెషీర్ ఇరానీ
రచనజోసెఫ్ డేవిడ్
నిర్మాతఇంపీరియల్ మూవీటోన్
తారాగణంమాస్టర్ విఠల్, జుబేదా, జిల్లూ, సుశీలా, పృథ్వీరాజ్ కపూర్
ఛాయాగ్రహణంవిల్ ఫోర్డ్ డెమింగ్
అదీ ఎమ్.ఇరానీ
కూర్పుఇజ్రా మీర్
విడుదల తేదీs
మార్చి 14, 1931
సినిమా నిడివి
124 నిముషాలు
దేశంIndiaభారతదేశం
భాషహిందీ/ఉర్దూ

ఆలమ్ ఆరా (ప్రపంచ జ్యోతి; 1931), అర్దెషీర్ ఇరానీ దర్శకత్వం వహించాడు. భారతీయ సినిమా రంగంలో ప్రథమ టాకీ (సంభాషణలు, శబ్దాలు) సినిమా.[1]

సినిమాలలో శబ్దాలు ముఖ్యమని భావించి అర్దెషీర్ ఇరానీ ఆలం ఆరా సినిమాని నిర్మించాడు. దీనిని ముంబాయి లోని మెజిస్టిక్ సినిమా థియేటర్ లో మార్చి 14 1931లో ప్రదర్శించారు.[2] ఈ మొదటి భారతీయ టాకీ చిత్రం ఎంతగా విజయవంతమయ్యిందంటే సినిమాకు వచ్చిన ప్రేక్షకులను అదుపులో పెట్టడానికి పోలీసుల సహాయము తీసుకోవలసి వచ్చింది.[3]

ఆలం అరా చిత్రానికి స్ఫూర్తి యూనివర్సల్ పిక్చర్స్ వారు తీసిన రాడ్జర్స్ అండ్ హామ్మర్స్టీన్స్ ఆంగ్ల చిత్రం షో బోట్.[1]

ప్రాముఖ్యత

[మార్చు]

ఈ చిత్రం, దీని సంగీతం రెండూ విజయాన్ని సాధించాయి.[4] ఇందులో బాగా ప్రసిద్ధి చెందిన పాట "దే దే ఖుదా కే నామ్ పర్, భారతీయ సినిమాలో మొట్టమొదటి పాట. ఈ పాటను సినిమాలో ఫకీరు పాత్రను పోషించిన వజీర్ మహమూద్ ఖాన్" పాడాడు.[4] భారతీయ సినిమాల్లో నేపథ్యగానం ఇంకా ప్రారంభమవని ఆ రోజుల్లో ఈ పాటను నటుడు నటిస్తూ పాడుతు ఉంటే హార్మోనియం , తబాలా సహకార వాయిద్యాలతో అప్పటికప్పుడే రికార్డు చేశారు.[5]

ఈ సినిమా భారతీయ సినిమా రంగంలో సినిమా సంగీతానికి కూడా నాంది పలికింది. ప్రముఖ సినిమా దర్శకుడు శ్యామ్ బెనగళ్ అన్నట్టు "“ఇది కేవలం టాకీ చిత్రమే కాదు. ఇది మాటలకంటే పాటలే ఎక్కువ ఉన్నఆటా పాటా కలిగిన చిత్రం. ఈ సినిమాలో అనేక పాటలు ఉన్నాయి. ఇదే ఆ తరువాత వచ్చిన అన్ని సినిమాలకు ఒక మూస ఒరవడిని సృష్టించింది”.[6]

నిర్మాణం

[మార్చు]

ఈ సినిమా ఆర్దేషిర్ ఇరానీ సౌండ్ రికార్డింగును తానే స్వయంగా చేపట్టాడు. ఇందులో తరన్ సౌండ్ సిస్టాన్ని ఉపయోగించారు. శబ్దాన్ని నేరుగా ఫిల్ము మీదనే రికార్డు చేయగల టానార్ సింగిల్ సిస్టం కెమెరాతో చిత్రీకరించబడింది. అప్పట్లో సౌండుప్రూఫు స్టూడియోలేవి లేనందువళ్ళ, పగటి పూట ఉండే శబ్దాలను తప్పించుకోవటానికి సినిమా చిత్రీకరణను చాలామటకు రాత్రుళ్ళే చేశారు. మైకును నటీనటులకు దగ్గరగా కనిపించకుండా దాచిపెట్టారు.[4]

ఆలం అరా చిత్రంలోని ఒక దృశ్యం

ఈ చిత్రం ఒక యువరాజు, ఒక బంజారా యువతి మధ్య జరిగిన ప్రేమకథ. చిత్ర కథ జోసెఫ్ డేవిడ్ వ్రాసిన పార్శీ నాటకంపై ఆధారితమైనది. డేవిడ్ ఆ తర్వాత ఆర్దేషిర్ ఇరానీ యొక్క సినిమా నిర్మాణ సంస్థలో రచయితగా పనిచేశాడు. కథ ఒక కల్పిత చారిత్రక రాజవంశపు రాజ్యమైన కూమార్‌పూర్లో జరుగుతుంది. ఇందులో ఆ రాజ్యపు రాజు, ఆయన ఇద్దరు భార్యలు దిల్‌బహార్, నవ్‌బహార్. ఇద్దరు సవతులకు ఒకరంటే ఒకరికి పడదు. ఒక ఫకీరు నవ్‌బహార్ గర్భాన సింహాసనానికి వారసుడు పుడతాడని జోష్యం చెప్పడంతో వీళ్ల మధ్య వైరం పెచ్చుమీరిపోతుంది. దిల్‌బహార్ ప్రతీకార కాంక్షతో రాజు యొక్క ప్రధానమంత్రి అయిన ఆదిల్ తో సంబంధం పెట్టుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం విఫలం కావడంతో దిల్‌బహార్ ప్రతీకారంతో మంత్రిని బంధించి ఆయన కూతురు ఆలం అరా (జుబేదా) ను రాజ్యం నుండి బహిష్కరిస్తుంది. అజ్ఞాత వాసంలో ఆలం అరాను జిప్సీలు పెంచి పెద్దచేస్తారు. కుమార్‌పూర్ కు తిరిగివచ్చిన ఆలం అరా అందమైన యువరాజు (మాస్టర్ విఠల్) ను చూసి ప్రేమలో పడుతుంది. చివరకు ఆదిల్ ఖైదు నుండి విడుదలౌతాడు, దిల్‌బహార్ కు శిక్ష పడుతుంది., ప్రేమికుల కథ సుఖాంతమై పెళ్ళి చేసుకుంటారు.

వార్తాపత్రికలో ఆలంఅరా ప్రకటన

2003లో పూణేలోని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలోని జరిగిన అగ్నిప్రమాదంలో అనేక పాత సినిమాల యొక్క మొదటి ప్రింట్లు కాలిపోయాయి. అందులో ఆలం అరా ఒరిజినల్ ప్రింటు కూడా ఒకటి.[6]

నట వర్గం

[మార్చు]
ఆలం అరాలోని ఒక దృశ్యం

పాటలు

[మార్చు]
ఆలంఅరాకు రికార్డింగ్ చేస్తున్న ఆర్దేషిర్ ఇరానీ

ఈ సినిమాకు సంగీతాన్ని ఫిరోజ్‌షా ఎం. మిస్త్రీ, బి.ఇరానీ సమకూర్చారు. సినిమాలో ఏడు పాటలు ఉన్నాయి:

  • దే దే ఖుదా కే నామ్ పె ప్యారే, తాఖత్ హో అగర్ దేనీ కీ, కుఛ్ ఛాహే అగర్ తో మాంగ్ లే ముఝ్‌సే హిమ్మత్ హో అగర్ లేనే కి: వజీర్ మొహమ్మద్ ఖాన్
  • బద్లా దిల్‌బాయేగా యా రబ్బ్ తు సితమ్‌గారోఁ సె: జుబేదా [7]
  • రూఠా హై ఆస్మాన్ గుమ్ హో గయా మెహతాబ్: జిల్లూ
  • తేరీ కాతిలీ నిఘావోఁ నే మారా
  • దే దిల్ కో ఆరామ్ ఆయే సఖీ గుల్ఫామ్
  • భర్ భర్ కే జామ్ పిలా జా సాగర్ కే చాలానే బాల
  • దరస్ బినా మారే హై తర్సే నైనా ప్యారే

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Goddard, John. "Missouri Masala Fear not, St. Louisans: You don't need to go to Bombay to get your Bollywood fix" Riverfront Times, St. Louis, Missouri, July 30, 2003, Music section.
  2. The 'First' talkies film Archived 2012-02-05 at the Wayback Machine http://www.indiamarks.com Archived 2008-12-22 at the Wayback Machine.
  3. Quoted in Chatterji (1999), "The History of Sound."
  4. 4.0 4.1 4.2 Talking images, 75 years of cinema Archived 2011-07-17 at the Wayback Machine The Tribune, March 26, 2006, Retrieved:2008-08-04
  5. Alam Ara- first song[permanent dead link] Archives, http://www.saregama.com.
  6. 6.0 6.1 India's first talkie lost in silence Archived 2009-02-03 at the Wayback Machine"“It is a sad thing, but there is no print of the film available. We are, however, trying to see if there is anything to be found anywhere else in the world. The search is still on,” says former director of NFAI, K S Shashidharan."
  7. Alam Ara Archived 2008-09-17 at the Wayback Machine Film History.

బయటి లింకులు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Alam Ara

"https://te.wikipedia.org/w/index.php?title=ఆలం_ఆరా&oldid=4340547" నుండి వెలికితీశారు