వికీపీడియా:మీకు తెలుసా? భండారము
స్వరూపం
1 • 2 • 3 • 4 • 5 • 6 • 7 • 8 • 9 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 |
ఈ జాబితా, మొదటి పేజీ లోని "మీకు తెలుసా?" విభాగంలో ఇప్పటిదాకా ప్రదర్శించిన వాక్యాల భాండాగారం.
- ఏదైనా వికిపీడియా వ్యాసం చదువుతున్నపుడు మీకు ఆహా! అనిపించే విషయం ఏదైనా కనిపిస్తే ఇక్కడ దానిని చేర్చండి. బహుశా మీలాగే చాలా మందికి ఆ విషయము తెలిసి ఉండకపోవచ్చు.
- ఈ భాండాగారం నుండి ఒక సమయములో కేవలం మూడూ లేదా నాలుగింటిని మాత్రమే ఈ మూసలో చేర్చండి.
- వికీపీడియాలో వ్యాసాలు పూర్తవటం అనేది ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వ్యాసాన్ని మెరుగుపరుస్తూనే ఉంటారు. అందుకని మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు ఇక్కడ చేర్చేయండి. అలాగే ఇక్కడ చేర్చిన విషయాలను దాయనవసరం లేదు.
మీకు తెలుసా?
|
2025 సంవత్సరంలోని వాక్యాలు
01 వ వారం
- ... కన్నమ దాసు బ్రహ్మనాయుడికి నమ్మిన బంటు, మాచర్ల సైన్యాధ్యక్షుడు అనీ!
- ... నవపాషాణం ఆలయం తమిళనాడులో నవగ్రహదేవతలకు అంకితం చేయబడిన దేవాలయమనీ!
- ... నికోలస్ కోపర్నికస్ ప్రచురించిన ఖగోళ శాస్త్ర రచనతో వైజ్ఞానిక విప్లవం ప్రారంభమైనట్లుగా భావిస్తారనీ!
- ... అస్సాంలోని కాటన్ విశ్వవిద్యాలయం భారతదేశంలోని అగ్రగామి విద్యాసంస్థల్లో ఒకటనీ!
- ... విజయనగరం జిల్లా, భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారనీ!
02 వ వారం
- ... డేల్ కార్నెగీ 1930 దశకంలో రాసిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు నేటికీ ప్రజాదరణ పొందుతున్నాయనీ!
- ... పురాతన తమిళ భూభాగాన్ని తమిళకం అని పిలిచేవారనీ!
- ... బృహత్సంహిత ప్రాచీన రచయిత వరాహమిహిరుడు రాసిన విజ్ఞాన సర్వస్వ గ్రంథమనీ!
- ... తలకావేరి ప్రాంతాన్ని కావేరి నదికి పుట్టినిల్లుగా భావిస్తారనీ!
- ... గ్రాఫైట్ సాధారణ పరిస్థితుల్లో కర్బనం యొక్క స్థిరమైన రూపమనీ!
03 వ వారం
- ... 2009 లో వచ్చిన అరుంధతి చిత్రంలో దివ్య నగేష్ చిన్నప్పటి అరుంధతి పాత్రలో నటించిందనీ!
- ... కర్ణాటకలోని తలకాడు ప్రాంతంలో సుమారు 30కి పైగా దేవాలయాలు ఇసుకతో కప్పబడిపోయాయనీ!
- ... పురాతన తమిళ ప్రాంతాన్ని పరిపాలించిన ముఖ్యమైన రాజవంశాల్లో చేర రాజవంశం ఒకటనీ!
- ... సమోసా అనే పదం పర్షియన్ పదమైన సంబూసాగ్ అనే పదం నుంచి వచ్చిందనీ!
- ... కొన్ని వైద్యప్రక్రియలను సులువు చేసేందుకు అనస్థీషియా ఉపయోగపడుతుందనీ!
04 వ వారం
- ... ఎం. జగన్నాథరావు మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అనీ!
- ... పురాతన వైద్య గ్రంథమైన సుశ్రుత సంహితలో అయస్కాంతాన్ని ఉపయోగించి శరీరంలో దిగిన బాణాన్ని వెలికితీయడం గురించిన వర్ణన ఉందనీ!
- ... అమెరికాలోని పురాతనమైన, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ప్రిన్స్టన్ యూనివర్శిటీ ఒకటనీ!
- ... ఫెమినా భారతదేశంలో మహిళకోసం ప్రత్యేకంగా నడుపుతున్న ప్రాచీనమైన పత్రిక అనీ!
- ... బెంగళూరులోని ఇండియన్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ మ్యూజియం వివిధ భారతీయ సంగీత పరికరాల సంగ్రహాలయం అనీ!
05 వ వారం
- ... హెన్రీ బెక్వరల్ రేడియో ధార్మికత ఆవిష్కరణకు నోబెల్ బహుమతి అందుకున్నాడనీ!
- ... ఈజిప్టులోని అలెగ్జాండ్రియా గ్రంథాలయం ప్రాచీన ప్రాముఖ్యత కలిగిన అతిపెద్ద గ్రంథాలయమనీ!
- ... భూఉపరితలం పైన ఉన్న వాతావరణ వాయువులపై గ్రహం యొక్క గురుత్వాకర్షణ ఆకర్షణ వల్ల వాతావరణ పీడనం ఏర్పడుతుందనీ!
- ... అంతర్జాల వ్యవస్థలో కంప్యూటర్ పేర్లను ఐపీ అడ్రసుగా మార్చేందుకు డొమైన్ నేమ్ సిస్టమ్ ఉపయోగపడుతుందనీ!
- ... తనిష్క్ టైటాన్ కు అనుబంధ సంస్థ అయిన ఆభరణాల విక్రయ సంస్థ అనీ!
06 వ వారం
- ... జాకీ చాన్ సినిమా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన మార్షల్ ఆర్టిస్టుల్లో ఒకడిగా పేరు గాంచాడనీ!
- ... ముంబైలో ఉన్న సర్ జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్ కళలను బోధించే పురాతన విద్యాసంస్థల్లో ఒకటనీ!
- ... పురాతన ఈజిప్టు నాగరికతలో అనేక నిర్మాణ సాంకేతికతలు రూపుదిద్దుకున్నాయనీ!
- ... మిస్ ఎర్త్ ఇండియా పర్యావరణ అవగాహనను ప్రోత్సహించే అందాల పోటీ అనీ!
- ... రామాయణంలో లంకకు కాపలాగా ఉన్న రాక్షసి లంకిణి అనీ!
07 వ వారం
- ... అమృత థాపర్ 2005 లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ గెలుచుకుందనీ!
- ... సా.పూ 2 వ శతాబ్దం నుంచీ జ్యోతిషశాస్త్రం వేర్వేరు రూపాల్లో వాడబడుతుందనీ!
- ... బిగ్ బ్లూ అని ముద్దుగా పిలవబడే బహుళ జాతి సంస్థ ఐబిఎం అనీ!
- ... జపాన్ లో పుట్టిన జూడో ఆయుధాలు లేకుండా ఆడే యుద్ధ క్రీడ అనీ!
- ... బహుళ వర్ణపట చిత్రాలు సైనిక, అంతరిక్ష, భూపరివేక్షణ మొదలైన విస్తృతమైన అవసరాలకు ఉపయోగపడుతుందనీ!
08 వ వారం
- ... యశస్వి జైస్వాల్ తాను ఆడిన మొదటి టెస్ట్ లోనే శతకం సాధించాడనీ!
- ... విటమిన్ సి లోపం వలన స్కర్వి వ్యాధి వస్తుందనీ!
- ... ఓజోన్ పొరకు చేటు చేసే క్లోరో ఫ్లోరో కార్బన్ లకు ప్రత్యామ్నాయంగా శీతలీకరణ పరికరాల్లో ద్రవీకృత పెట్రోలియం వాయువును వాడుతున్నారనీ!
- ... 42 కిలోమీటర్ల దూరం మేరకు జరిగే పరుగు పందేన్ని మారథాన్ అంటారనీ!
- ... వ్యర్థ పదార్థాల నిర్వహణ సరిగా లేకపోతే మానవ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందనీ!
09 వ వారం
- ... ప్రణవ్ చాగంటి తెలుగులో ర్యాప్ సంగీతంలో పేరు గాంచాడనీ!
- ... పంటిలో చేరిన బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఆమ్లాల వలన దంత క్షయం కలుగుతుందనీ!
- ... బిందు సేద్యం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సాగునీటి ఖర్చును తగ్గించవచ్చనీ!
- ... క్లౌడ్ కంప్యూటింగ్ విధానంలో పలువురు వినియోగ దారులు కలిసి కంప్యూటింగ్ పరికరాలను పంచుకుంటారనీ!
- ... ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవా నగరంలో ఉందనీ!
10 వ వారం
- ... మైత్రేయుడు బౌద్ధ సాంప్రదాయాల ప్రకారం భవిష్యత్తు బుద్ధుని అవతారమనీ!
- ... సూక్ష్మజీవ శాస్త్రం కి ఆద్యుడు ఆంథోనీ వాన్ లీవెన్‌హాక్ అనీ!
- ... శ్రీరాముడు బంగాళాఖాతంలో నవగ్రహ దేవతలను ప్రతిష్టించిన ప్రాంతమే నవపాషాణం ఆలయం గా విరాజిల్లుతోందనీ!
- ... రంగనతిట్టు పక్షుల సంరక్షణా కేంద్రం కర్ణాటకలో అతి పెద్ద పక్షి అభయారణ్యమనీ!
- ... పులిట్జర్ బహుమతిని స్థాపించి దానిని నిర్వహిస్తున్నది కొలంబియా విశ్వవిద్యాలయం అనీ!
11 వ వారం
- ... రెమో ఫెర్నాండెజ్ భారతీయ సంతతికి చెందిన పోర్చుగీసు గాయకుడనీ!
- ... ప్రాచీన భారతీయ వైద్య గ్రంథాల్లో ప్లాస్టిక్ సర్జరీ గురించిన ప్రస్తావన ఉందనీ!
- ... తమిళనాడులోని రామేశ్వరంలో భారత ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మారక చిహ్నాన్ని నిర్మించిందనీ!
- ... ఒక పెద్ద డేటా సెంటర్ నిర్వహించడానికి ఒక మధ్యస్థాయి పట్టణానికి ఖర్చయ్యే విద్యుత్ అవసరమవుతుందనీ!
- ... భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మారుతున్న జనసంఖ్యకు అనుగుణంగా శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులను పునఃపరిశీలిస్తుందనీ!
12 వ వారం
- ... ప్రతిష్టాత్మకమైన కెరీర్ గ్రాండ్ స్లాం పూర్తి చేసిన ముగ్గురు ఆటగాళ్ళలో రఫెల్ నాదల్ ఒకడనీ!
- ... నీలగిరి పర్వతాల్లో అతి ఎత్తైన శిఖరం దొడ్డబెట్ట శిఖరం అనీ!
- ... భరద్వాజ మహర్షి రచించిన అంశుబోధిని సూర్యుని నుంచి లభించే వివిధ రకాల శక్తినీ, వాటి ఉపయోగాలను గురించి వివరిస్తుందనీ!
- ... మాజీ సైనికులు, అనుభవజ్ఞులు కలిసి 2020 లో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ స్థాపించారనీ!
- ... మధుమేహం కారణంగా నరాలు దెబ్బతినే వ్యాధిని డయాబెటిక్ న్యూరోపతి అంటారనీ!
13 వ వారం
- ... జన్మతః అమెరికన్ దేశస్తురాలైన తులసి గబ్బార్డ్ కు తల్లిదండ్రులు హిందూ మత ప్రభావంతో ఆ పేరు పెట్టారనీ!
- ... ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం, విమర్శనాత్మక ఆలోచన, సామాజిక బాధ్యతను పెంపొందించడం కోసం చార్వాక ఆశ్రమం స్థాపించారనీ!
- ... వాణిజ్య రంగంలో పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వహించడానికి మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్ వాడతారనీ!
- ... తొలితరం తెలుగు పత్రికల్లో ఒకటైన ప్రబుద్ధాంధ్ర సంపాదకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి అనీ!
- ... ప్రఖ్యాత బహుళ జాతీయ వాణిజ్య సంస్థ ఐకియా డిజైనర్ల బృందంలో ఉన్న ఒకే ఒక్క భారతీయురాలు ఆకాంక్ష శర్మ అనీ!
14 వ వారం
- ... రాంపిళ్ల నరసాయమ్మ విజయవాడకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలనీ!
- ... కృత్రిమ మేధకు సంబంధించిన పెద్ద భాషా నమూనాలు అనేక అనువాదం, అర్థం చేసుకోవడం, ఉత్పత్తి లాంటి భాష ఆధారిత కార్యాలను నిర్వహించగలవనీ!
- ... పరివేషము అంటే సూర్యుడు, లేదా చంద్రుని చుట్టూ ఏర్పడే ఒకరకమైన కాంతి వలయాలనీ!
- ... చైనాకు చెందిన ప్రాచీన యుద్ధవ్యూహ గ్రంథం ది ఆర్ట్ ఆఫ్ వార్ లోని సూత్రాలు ఇప్పటికీ పలు రంగాల్లో ఉపయోగిస్తున్నారనీ!
- ... కేరళకు చెందిన ట్రావన్‌కోర్ రాజులు వేలమంది బ్రాహ్మణులకు ఖరీదైన దానాలు చేసేవారనీ!
15 వ వారం
- ... మసాకో ఒనో జపాన్ నుంచి వచ్చి భారతదేశంలో స్థిరపడ్డ ఒడిస్సీ నర్తకి అనీ!
- ... ఆంధ్ర ప్రకాశిక మద్రాసు నుండి వెలువడిన తొలితరం తెలుగు పత్రికల్లో ఒకటనీ!
- ... భారతప్రభుత్వం జాతీయ పసుపు బోర్డు ను ఆంధ్రప్రదేశ్ లోని నిజామాబాద్ లో ఏర్పాటు చేసిందనీ!
- ... మోనోశాఖరైడ్లు శరీరానికి శక్తి నిచ్చే ప్రధానమైన వనరులనీ!
- ... ప్రమాదవశాత్తూ మరణించిన కుమారుడి జ్ఞాపకార్థం ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు ఏర్పాటు చేశాడనీ!
16 వ వారం
- ... భావన బాలకృష్ణన్ భారతదేశంలో ప్రజాదరణ పొందిన క్రీడా పాత్రికేయుల్లో ఒకరనీ!
- ... భారతదేశంలో గ్రామీణ మహిళలు తమలో తాము సహాయం చేసుకోవడం కోసం స్వయం సహాయక బృందంగా ఏర్పడుతారనీ!
- ... విశ్వరూపం కాళీపట్నపు కొండయ్య 1936 లో తెలుగులో రాసిన ప్రజావిజ్ఞానశాస్త్ర పుస్తకమనీ!
- ... పోర్చుగల్ దేశపు రాజధాని లిస్బన్ నగరం ప్రపంచంలో అత్యంత పురాతన నగరాల్లో ఒకటనీ!
17 వ వారం
- ... భారతీయ బహుళ జాతి సంస్థ వ్యవస్థాపకుడు సుబ్రతో బాగ్చి అనీ!
- ... తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదు బయట నుండి వెలువడ్డ తొలి పత్రిక తెనుగు పత్రిక అనీ!
- ... నిద్రాణ అగ్నిపర్వతమైన కిలిమంజారో ఆఫ్రికాలో అత్యంత ఎత్తయిన పర్వతమనీ!
- ... తిరుమల దర్శనానికి వచ్చే భక్తుల నియంత్రణ కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారనీ!
- ... కడప జిల్లాలోని తుమ్మలపల్లి యురేనియం గని ప్రపంచంలో అతిపెద్ద యురేనియం నిక్షేపాలు కలిగిన ప్రదేశాల్లో ఒకటనీ!
18 వ వారం
- ... మహాత్మా గాంధీ జాన్ రస్కిన్ అనే ఆంగ్ల రచయిత పుస్తకాన్ని గుజరాతీలోకి అనువాదం చేశాడనీ!
- ... సినీ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు పలు చలనచిత్రోత్సవాల్లో పురస్కారాలు గెలుచుకుందనీ!
- ... భారత పర్యాటక మంత్రిత్వ శాఖ మొదటిసారిగా తిరుపతిలో ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ స్థాపించిందనీ!
19 వ వారం
- ... బరోడా సంస్థానాన్ని పరిపాలించిన మూడవ శాయాజీరావ్ గైక్వాడ్ తన పాలనలో అనేక ప్రజోపయోగ సంస్కరణలు ప్రవేశపెట్టాడనీ!
- ... తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ప్రసూతి ఆసుపత్రి అనీ!
- ... ప్రముఖ మిఠాయి వ్యాపారి జి. పుల్లారెడ్డి పేరు మీదుగా జి. పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్థాపించబడిందనీ!
20 వ వారం
- ... దర్శకుడు తిరుపతి స్వామి తీసిన మొదటి సినిమా గణేష్ ఐదు నంది పురస్కారాలు దక్కించుకున్నదనీ!
- ... పుట్టపర్తి నారాయణాచార్యులు రాసిన రచనల్లో ఆయనకు అత్యంత ఖ్యాతి తెచ్చిన పుస్తకం శివతాండవ కావ్యం అనీ!
21 వ వారం
- ... అంతర్జాతీయ క్రికెట్ రంగంలో 20,000 పరుగులు సాధించిన ఏకైక పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఇంజమామ్-ఉల్-హక్ అనీ!
- ... శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర కోట ను భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా గుర్తించిందనీ!
22 వ వారం
- ... పుట్టణ్ణ కణగాల్ అత్యంత ప్రభావవంతమైన భారతీయ చలనచిత్ర నిర్మాతల్లో ఒకడిగా పరిగణించబడ్డాడనీ!
- ... కర్నూలు జిల్లాలోని కైరుప్పల గ్రామంలో ప్రతి యేటా పిడకల యుద్ధం జరుగుతుందనీ!
23 వ వారం
- ... రణబీర్ సింగ్ హుడా ఏడుసార్లు లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాడనీ!
24 వ వారం
- ... పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత బాలు శంకరన్ కృత్రిమ అవయువాల తయారీలో ప్రసిద్ధి చెందాడనీ!
25 వ వారం
- ... గులామ్ యాజ్దానీ హైదరాబాద్ నిజాం పరిపాలనాకాలంలో పురావస్తుశాఖ వ్యవస్థాపకుల్లో ఒకడనీ!
26 వ వారం
- ... భారతీయ, పాశ్చాత్య ఖగోళ శాస్త్రాలను అధ్యయనం చేసిన బాపుదేవ్ శాస్త్రి మహామహోపధ్యాయ బిరుదు పొందాడనీ!
27 వ వారం
- ... ప్రపంచ అత్యుత్తమ గాయకుల్లో ఒకడైన బాబ్ డిలాన్ 2016 లో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందాడనీ!
28 వ వారం
- ... భారతదేశంలో రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా స్పీకరుగా ఎన్నికైంది షన్నో దేవి అనీ!
29 వ వారం
- షాజహాన్ చక్రవర్తి కుమారుడైన దారా షుకో ముఖ్యమైన హిందూ గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదించాడనీ!
30 వ వారం
- ... శీతల్ దేవి అతి పిన్న వయసులో పారా ఒలంపిక్స్ లో పతకం సాధించిందనీ!