ఎలక్టోరల్ బాండ్
ఎలక్టోరల్ బాండ్ భారతదేశంలోని రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే విధానం. ఈ పథకాన్ని 2017-18 కేంద్ర బడ్జెట్ సమయంలో ఫైనాన్స్ బిల్లు, 2017లో ప్రవేశపెట్టారు[1].ఇది రాజ్యాంగ విరుద్ధమని 15 ఫిబ్రవరి 2024 న సుప్రీంకోర్టు కొట్టివేసింది.ఏడేళ్లుగా అమలులో ఉన్న ఈ విధానాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తక్షణమే నిలిపివేసింది, ఈ బాండ్ల జారీని నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది.మరియు ఈ పథకం సమాచార హక్కు చట్టం ఉల్లంఘన క్రిందికి వస్తుంది అని పేర్కొంది.
లక్షణాలు
[మార్చు]ఎలక్టోరల్ బాండ్‌లు వడ్డీ రహిత బాండ్‌లు లేదా మనీ సాధనాలు, వీటిని భారతదేశంలోని కంపెనీలు మరియు వ్యక్తులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యొక్క అధీకృత శాఖల నుండి కొనుగోలు చేయవచ్చు.ఈ బాండ్లను రూ. 1,000, రూ. 10,000, రూ. 1 లక్ష, రూ. 10 లక్షలు మరియు రూ. 1 కోటి విలువలొ విక్రయిస్తారు. భారతదేశంలో నమోదైన ఏ భారతీయ పౌరుడైనా లేదా సంస్థ అయినా ఆర్బిఐ నిర్దేశించిన కెవైసి నిబంధనలను పూర్తి చేసిన తర్వాత ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.ఈ ఎలక్టోరల్ బాండ్లను రాజకీయ పార్టీ లేదా పార్టీ అభ్యర్థికి విరాళంగా ఇవ్వవచ్చు.వీటిని అన్ని రాజకీయ పార్టీలకి విరాళంగా ఇవ్వలేము కేవలం ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 (విభాగం 29A ప్రకారం) ఇటీవలి లోక్‌సభ లేదా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోల్ అయిన ఓట్లలో కనీసం 1% ఓట్లను పొందిన రాజకీయ పార్టీలకు మాత్రమే ఇవ్వవచ్ఛు.ఈ ఎలక్టోరల్ బాండ్‌లను 15 రోజుల వ్యవధిలో సంబంధిత రాజకీయ పార్టీ క్యాష్ చేసుకోవాలి.15 రోజులలో క్యాష్ చేసుకోని పక్షంలో విరాలం ఇచ్చిన దాత లేదా స్వీకరించే రాజకీయ పార్టీ ఎలక్టోరల్ బాండ్ మొత్తాన్ని వాపసు పొందలేరు.వీరికి బదులుగా, ఎలక్టోరల్ బాండ్ యొక్క ఫండ్ విలువ ప్రధానమంత్రి సహాయ నిధికి జమ చేయబడుతుంది.ఇవి జనవరి, ఏప్రిల్, జూలై మరియు అక్టోబర్‌లలో 10 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. లోక్‌సభ ఎన్నికల సంవత్సరాల్లో అవి 30 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి.[2]
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు
[మార్చు]సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఈ వివరాలను ఎన్నికల సంఘం 14 మార్చి 2024 న వెల్లడించింది. రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళంగా ఇచ్చిన 10 కంపెనీల సమాచారం[3]
క్ర.స | విరాళం ఇచ్చిన సంస్థ | విరాళం |
1 | ఫ్యూచర్ గేమింగ్ మరియు హోటల్ సర్వీసెస్ PR | ₹ 1,368 కోట్లు |
2 | మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ | ₹ 966 కోట్లు |
3 | క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ | ₹ 410 కోట్లు |
4 | వేదాంత లిమిటెడ్ | ₹ 400 కోట్లు |
5 | హల్దియా ఎనర్జీ లిమిటెడ్ | ₹ 377 కోట్లు |
6 | భారతి గ్రూప్ | ₹ 247 కోట్లు |
7 | ఎస్సెల్ మైనింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ | ₹ 224 కోట్లు |
8 | వెస్టర్న్ UP పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్ | ₹ 220 కోట్లు |
9 | కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ | ₹ 195 కోట్లు |
10 | మదన్‌లాల్ లిమిటెడ్ | ₹ 185 కోట్లు |
అయితే, దేశం మొత్తం మీద జాతీయ, ప్రాంతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకుంటే... ఎలక్టోరల్ బాండ్లను స్వీకరించిన పార్టీల్లోబీజేపీ రూ. 6,566 కోట్లతో మెుదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్ రూ. 1,123 కోట్లతో రెండో ప్లేస్‌లో ఉన్నాయి. , బీఆర్ఎస్ మూడోవ స్థానంలో ఉంది. ఈ మూడు పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 2023 మార్చి వరకు సమకూరిన లెక్కలు మాత్రమే.
మూలాలు
[మార్చు]- ↑ "Press Release of Electoral Bonds" (PDF). Department of Economic Affairs (in ఇంగ్లీష్).
- ↑ "What are electoral bonds?". Economic Times (in ఇంగ్లీష్).
- ↑ "ఎలక్టోరల్ బాండ్ వివరాలు". NDTV. Retrieved 15 March 2024.