అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ | |
---|---|
సారాంశం | |
రైలు వర్గం | SuperFast Express Train |
స్థితి | అందుబాటులో ఉంది |
తొలి సేవ | 30 December 2023 |
మార్గం | |
లైను (ఏ గేజు?) | 2 |
సదుపాయాలు | |
శ్రేణులు | Sleeper Class Coach (SL) General Unreserved Coach (GS) |
పడుకునేందుకు సదుపాయాలు | Yes |
ఇతర సదుపాయాలు | |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | Amrit Bharat (trainset) |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 130 km/h (81 mph) (maximum) |
అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ భారతీయ రైల్వేలచే నిర్వహించబడే సామాన్య ప్రజానీకానికి అందుబాటులో సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ సేవ. ఇది 800 కిమీ (500 మైళ్ళు) కంటే ఎక్కువ దూరంలో ఉన్న లేదా ఇప్పటికే ఉన్న సేవలతో ప్రయాణించడానికి పది గంటల కంటే ఎక్కువ సమయం పట్టే నగరాలను కలుపుతూ ఎయిర్ కండిషన్ లేని, తక్కువ-ధర, స్లీపర్ సౌకర్యంతో పాటు రిజర్వ్ చేయబడని కోచ్ లు కలిగిన రైలుసేవ. ఈ రైలు సెట్ కు ఇరువైపులా ఇంజిన్లు ఉంటాయి. ఈ ఎక్స్ ప్రెస్ 22 కోచ్‌లు కలిగి గంటకు 110–130 కిలో మీటర్ల (68–81 మైళ్ళు) గరిష్టంగా వేగ సామర్ధ్యంతో ప్రయాణిస్తుంది, 1 జనవరి 2024న వాణిజ్య సేవలోకి ప్రవేశించింది.
చరిత్ర
[మార్చు]భారతీయ రైల్వేలు సుదూర ప్రయాణానికి స్లీపర్, సాధారణ సౌకర్యాలతో కూడిన ఎయిర్ కండిషన్ లేని రైలు కోసం జూలై 2023లో ప్రణాళికలను ప్రకటించింది.[1] ఒక్కో రైలు సెట్‌కు ₹65 కోట్ల (US$8.1 మిలియన్) ఖర్చుతో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ద్వారా రైలు సెట్‌లు తయారు చేయబడ్డాయి.[2] మొదటి రైలు 30 డిసెంబర్ 2023న జెండా ఊపి ప్రారంభించబడి 1 జనవరి 2024న వాణిజ్య సేవలోకి ప్రవేశించింది.[3]
అమృత్ భారత్ రైళ్లు ఎయిర్ కండిషన్ లేని సెకండ్ క్లాస్, త్రీ-టైర్ స్లీపర్ కోచ్‌లను పునరాభివృద్ధి చేశాయి. కోచ్‌లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసింది.[4] ఇతర భారతీయ రైళ్లకు భిన్నంగా, రైలు-సెట్‌లు పుష్-పుల్ అమరికలో రెండు చివర్లలో లోకోమోటివ్‌ను కలిగి ఉండిఇంజిన్ దిశను మార్చేటప్పుడు, ట్రైన్ బయలుదేరేటప్పుడు మెరుగైన త్వరణం ద్వారా సమయం ఆదా చెయ్యడములో తోడ్పడుతుంది.[5] రైలు-సెట్‌లు చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ చేత తయారు చేయబడిన వైబ్రేషన్ రెసిస్టెన్స్ ఇంజిన్‌లతో రెండు డబ్లు.ఏ-పి-5 లోకోమోటివ్‌ల ద్వారా శక్తిని పొందుతాయి.[6]
ప్రతి రైలు-సెట్‌లో 22 కోచ్‌లు ఉంటాయి: పన్నెండు 3-టైర్ స్లీపర్ క్లాస్ కోచ్‌లు, ఎనిమిది సెకండ్-క్లాస్ , రెండు లగే జ్ కోచ్‌ల సమ్మేళనంతో ఉంటాయి.[7][8] కోచ్‌లలో ఎలక్ట్రిక్ అవుట్‌లెట్‌లు, రీడింగ్ లైట్లు, సీ. సీ. టి. వీ కెమెరాలు, బయో-వాక్యూమ్ టాయిలెట్‌లు, సెన్సార్ ఆధారిత వాటర్ ట్యాప్‌లు, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉన్నాయి.[9][10] రైలు-సెట్‌లు రైలును ప్రారంభించేటప్పుడు, ఆపే సమయంలో షాక్‌లను నివారించడానికి సెమీ-పర్మనెంట్ కప్లర్‌లను కలిగి ఉంటాయి , స్థిరత్వం , భద్రతను సులభతరం చేయడానికి పూర్తిగా కప్పబడిన వెస్టిబ్యూల్స్‌ను కలిగి ఉంటాయి.[11] రైళ్లు గంటకు 130 కిలో మీటర్ల గరిష్టంగా అనుమతించదగిన వేగంతో (ఎమ్. పి. ఎస్.) నడుస్తాయి.
సేవలు
[మార్చు]ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 30 డిసెంబర్ 2023న, అయోధ్య ధామ్ జంక్షన్ నుండి రైలును జెండా ఊపి ప్రారంభించారు.[12] మొదటి వాణిజ్య సేవ 1 జనవరి 2024న ప్రారంభమైంది.[13]
వరుస సంఖ్య | రైలు పేరు | రైలు నంబర్ | మూలం స్టేషన్ | గమ్యస్థానం స్టేషన్ | ఆపరేటర్ | స్టాప్‌లు | ఫ్రీక్వెన్సీ | దూరం | ప్రయాణ సమయం | వేగం | మొదటి సర్వీస్ | సూచన | |||||||||||||
గరిష్ట | సగటు | ||||||||||||||||||||||||
1 | దర్భంగా - ఆనంద్ విహార్ టెర్మినల్ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ | 15557/15558 | దర్భంగా జంక్షన్ | ఆనంద్ విహార్ టెర్మినల్ | ఈస్ట్ సెంట్రల్ రైల్ | 18 | బై-వీక్లీ | 1,137 కిమీ (706 మైళ్ళు) | 20గం 40మీ | గం 130 కిమీ (81 మైళ్లు) |
గం 55కిమీ (34 మైళ్లు) |
30 డిసెంబర్ 2023 | |||||||||||||
2 | మాల్డా టౌన్ - ఎస్. ఎమ్. వీ. టి బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ | 13433/13434 | ఎస్. ఎమ్. వీ. టి బెంగళూరు | మాల్డా టౌన్ | తూర్పు రైల్వే | 32 | వీక్లీ | 2,272 కిమీ (1,412 మైళ్ళు) | 45గం 10మీ | గం 130 కిమీ (81 మైళ్లు) | గం 50కిమీ (31 మైళ్లు) |
మూలాలు
[మార్చు]- ↑ "Indian Railways To Soon Launch Budget-Friendly Non-AC Vande Sadharn train". Times Now. 3 July 2023. Retrieved 1 December 2023.
- ↑ "Indian Railways: What is Vande Sadharan Train? What are its similarities with Vande Bharat train?". Zee Business. 18 July 2023. Retrieved 30 October 2023.
- ↑ "PM Modi to inaugurate 'Amrit Bharat Express' on Dec 30. All you need to know about this 'sleeper Vande Bharat' train". Hindustan Times (in ఇంగ్లీష్). 27 December 2023. Retrieved 28 December 2023.
- ↑ "Vande Sadharan train: All you need to know; How it is different from Vande Bharat train?". Business Today (in ఇంగ్లీష్). 30 October 2023. Retrieved 30 December 2023.
- ↑ Nigam, Saumya (27 December 2023). "Amrit Bharat Express to launch with Push-Pull technology and other exciting features". India TV (in ఇంగ్లీష్). Retrieved 28 December 2023.
- ↑ Athrady, Ajith (10 July 2023). "Indian Railways to produce non-AC Vande Sadharan trains". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 30 October 2023.
- ↑ "New Vande Sadharan arrives in city". The Times of India. 30 October 2023. ISSN 0971-8257. Retrieved 31 December 2023.
- ↑ "Here's a first look of the 22-coach Vande Sadharan Express train, all set to hit the tracks by October-end". The Times of India. 13 October 2023. ISSN 0971-8257. Retrieved 30 October 2023.
- ↑ "Vande Sadharan: Indian Railways' 'affordable' alternative to Vande Bharat trains". CNBCTV18 (in ఇంగ్లీష్). 19 July 2023. Retrieved 30 October 2023.
- ↑ "Amrit Bharat Express: What's special about Indian Railways new push-pull train for common man? Top images & facts". The Times of India (in ఇంగ్లీష్). 26 December 2023. Retrieved 28 December 2023.
- ↑ "Amrit Bharat Express with innovative 'push-pull technology' to start soon from Ayodhya – Know features, design, routes and more". Financial Express (in ఇంగ్లీష్). 26 December 2023. Retrieved 28 December 2023.
- ↑ "PM Modi flags off 2 Amrit Bharat, 6 Vande Bharat Express trains in Ayodhya". Hindustan Times (in ఇంగ్లీష్). 30 December 2023. Retrieved 31 December 2023.
- ↑ "PM Modi flags off new Vande Bharat, Amrit Bharat trains from Ayodhya Dham Junction: Routes, features and all you need to know". News9. 30 December 2023. Retrieved 31 December 2023.