రాధికా సేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాధికా సేన్
జననం1993
వృత్తిఇండియన్ ఆర్మీ మేజర్‌‌
పురస్కారాలుమిలటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌
(2023కి గానూ ఈ పురస్కారం ఐక్యరాజ్య సమితి 2024 మే 30న ఆమెకు అందించింది.)

మేజర్‌‌ రాధికా సేన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పనిచేస్తున్న భారత సైనిక శాంతి పరిరక్షకురాలు.

భారత సైనిక దళంలో సీనియర్ సైనిక అధికారిణిగా సేవలు అందిస్తున్న ఆమెకు ఐక్యరాజ్యసమితి 2023 ఏడాదికిగానూ అత్యున్నత పురస్కారమైన ‘మిలటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ తో గౌరవించింది. మే 29వ తేదీ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఆమెకు ఈ అవార్డు ప్రకటించారు. ఇందులో భాగంగా 2024 మే 30న యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆమెకు ఈ పురస్కారం అందచేసాడు.[1]

మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న రెండవ భారతీయ శాంతి పరిరక్షకురాలుగా రాధికా సేన్ నిలిచింది. ఆమె కంటే ముందు, 2019లో మేజర్ సుమన్ గవానీకి, దక్షిణ సూడాన్‌లోని యుఎన్‌ మిషన్‌తో ఆమె చేసిన సేవకు ఈ గౌరవం లభించింది.[2]

కెరీర్

[మార్చు]

హిమచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఆమె జన్మించింది. ఆమె పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్చేసింది. ఆ తరువాత, ఆమె ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీలో చేరింది. అయితే, ఆ సమయంలోనే ఆమె ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సంపాందించింది. 2023లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి శాంతి పరిరక్షకురాలిగా ఆమె నియమించబడింది. కాంగోలోని నార్త్‌ కీవో ప్రాంతంలో ఆమె విశేషమైన సేవలు అందించింది. అక్కడ ఆమె ప్రధానంగా స్త్రీలు, బాలికల పట్ల హింసను నిరోధించేందుకు చొరవచూపింది. శాంతి పరిస్థితుల కోసం ఆమె విస్తృత ప్రచారం చేసింది. ఆమె ఏప్రిల్‌ 20024 వరకు ఇండియన్ రాపిడ్ డిప్లాయ్‌మెంట్ బెటాలియన్‌తో ఎంగేజ్‌మెంట్ ప్లాటూన్ కమాండర్‌గా వ్యవహరించింది.

మూలాలు

[మార్చు]
  1. "Major Radhika: భారత ఆర్మీ అధికారిణికి యూఎన్‌ అవార్డు.. ఈమె ఎవ‌రో తెలుసా..? | Sakshi Education". web.archive.org. 2024-05-31. Archived from the original on 2024-05-31. Retrieved 2024-05-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "మేజర్ సుమన్ గవానీకి అత్యున్నత పురస్కారం | Major Suman Gawani women peacekeeper". web.archive.org. 2024-05-31. Archived from the original on 2024-05-31. Retrieved 2024-05-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)