Jump to content

ఇప్పపువ్వు లడ్డు

వికీపీడియా నుండి
ఇప్పపువ్వు లడ్డూ
మూలము
ఇతర పేర్లుఈరూక్ లడ్డు,
పొక్కేల లడ్డు,
మూలస్థానంభారతదేశం
ప్రదేశం లేదా రాష్ట్రంఉట్నూరు, ఆదిలాబాద్ జిల్లా
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు ఇప్పపువ్వులు, పల్లీలు/నువ్వులు, బెల్లం
సేకరించిన ఇప్పపువ్వు
ఆరపెట్టిన ఇప్పపువ్వు

ఇప్పపువ్వు లడ్డూ, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు ప్రాంతంలో ఆదివాసీ మహిళలు తయారు చేసే తినుబండారం.[1] ఆదివాసీ ప్రాంతంలో గోండి భాషలో ఈరుక్ లడ్డుకొలామీ భాషలో పొక్కే లడ్డు అని అంటారు.[2] [3]

ఇప్పపువ్వు సేకరణ

[మార్చు]

ఇప్ప పువ్వులు (Mahua Flower/Madhuca longifolia) వేసవికాలంలో ఎక్కువగా లభిస్తుంటాయి.[4] మహిళలు వేకువజామున వెదురు బుట్టలతో అడవికి వెళ్లి ఇప్పపువ్వులను సేకరించి ఇంటికి తీసుకొచ్చి తడుక పై ఎండలో రెండు రోజులు ఆరబెట్టి సంచిలో జమ చేసి ఉంచుతారు. ఆ తరువాత, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఇప్పపూలతో రకరకాల వంటకాలు తయారు చేస్తుకుంటారు.[5]

ఇప్పపువ్వు లడ్డూ తయారీ విధానం

[మార్చు]
ఇప్ప పువ్వు లడ్డులు

ఆరపెట్టిన ఇప్పపువ్వులను నెయ్యి/నూనెలో దోరగా వేయించి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. అనంతరం ఈ పొడికి, కొంత వేరుశనగల(పల్లీలు)ను వేయించి సిద్దం చేసుకున్న పొడి కూడా కలుపుకోవాలి. బాదం, జీడిపప్పు, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ తురుముతో పాటు సువాసనకు యాలకుల పొడిని కూడా చేర్చాలి. ఈ మిశ్రమాన్ని, సిద్ధం చేసుకున్న బెల్లం పానకంలో కలిపి లడ్డూలను తయారు చేసుకోవాలి.

ఇప్పపువ్వు లడ్డూలను ఆర్డర్లు ఉన్న చోట బాక్సులలో భద్రపర్చి విక్రయిస్తున్నారు. ఈ లడ్డూ తినడానికి ఎంతో కమ్మగా ఉండడంతో పాటు ఔషధగుణాలు మెండుగా ఉంటాయి.[6] రక్తహీనత, నీరసం, మొకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.[7]

కావాల్సిన పదార్థాలు

[మార్చు]
  1. ఎండపెట్టిన ఇప్పపువ్వులు[8]
  2. వేరుశనగలు / నువ్వులు
  3. యాలకులు
  4. బాదం, కాజూ, కిస్మిస్ వగైరా
  5. బెల్లం

కుటీర పరిశ్రమ

[మార్చు]

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూరు, సహకారంతో 2015  సంవత్సరంలో 12 మంది మహిళలు, భీంబాయి ఆదివాసీ మహిళా సంఘం ఏర్పాటు చేసి ఇప్పపువ్వు లడ్డు తయారీకి కావాల్సిన పరికరాలతో ఒక యూనిట్ ని ఇక్కడ ఆదివాసీ ఆహారం పేరుతో కుటీర పరిశ్రమను ప్రారంభించారు.[9] [7]

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2022-02-19). "Ippa puvvu laddu | ఇప్ప‌పూలతో చేసే ఈ ల‌డ్డూలు మ‌హిళ‌లు తింటే మంచిదేనా?". www.ntnews.com. Retrieved 2024-05-05.
  2. "ఈ లడ్డూలు తింటే మోకాళ్ల నొప్పులు ఖతం.. ఒంట్లో రక్తం ఉరకలేస్తుంది!". News18 తెలుగు. 2024-03-20. Retrieved 2024-05-05.
  3. "ఇప్పపువ్వు లడ్డూ కావాలా." EENADU. Retrieved 2024-05-05.
  4. ABN (2022-04-11). "ఇప్పపువ్వు సేకరణలో గిరిజనులు". Andhrajyothy Telugu News. Retrieved 2024-05-27.
  5. Dishanational2 (2022-04-22). "Ippa Puvvu Laddu: ఆదివాసీల స్పెషల్.. ఇప్ప పువ్వుతో లడ్డు". www.dishadaily.com. Retrieved 2024-05-05.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "ఇప్ప పువ్వు లడ్డు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే". News18 తెలుగు. 2024-02-26. Retrieved 2024-05-05.
  7. 7.0 7.1 Chilukuri, Arun (2022-05-02). "Ippa Puvvu Laddu: గర్భిణీ స్త్రీల ఆహార డైట్ లో ఇప్పపూవ్వు లడ్డూ". www.hmtvlive.com. Retrieved 2024-05-05.
  8. telugu, NT News (2022-05-07). "ఆదివాసుల దైవం ఇప్పపువ్వు". www.ntnews.com. Retrieved 2024-05-27.
  9. సాక్షి (2024-04-05), ఉపాధి లడ్డు!, retrieved 2024-05-05