ఆదివాసి
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఆదివాసీ జాతి తెగలలో ఒక విజాతీయ సెట్ ఒక గొడుగు పదం భారతదేశం ఆదిమవాసుల జనాభా భావిస్తారు. వారు భారతదేశం జనాభాలో ఎక్కువ దేశవాళీ అల్పసంఖ్యాక వహిస్తాయి. ఆదివాసీ బంగ్లాదేశ్ అల్పసంఖ్యాక, శ్రీలంక స్థానిక Vedda ప్రజలు ఉపయోగిస్తారు అదే పదం (Sinhala: ආදී වාස). మరొక పదం, janajati (నేపాలీ ఈ పదం కూడా నేపాల్ లో అదే అర్ధంలో ఉపయోగిస్తారు: जनजाति; janajāti), రాజకీయ సందర్భం షా రాణా రాజవంశాల కింద చారిత్రాత్మకంగా భిన్నాభిప్రాయాలతో ఉన్నా.
ఆదివాసీ సమాజాలు ఆంధ్ర ప్రదేశ్, బీహార్, చత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్, నికోబార్ దీవులు ముఖ్యంగా ఉన్నాయి. అనేక చిన్న గిరిజన సమూహాలు ఆధునికీకరణ వల్ల పర్యావరణ భ్రష్టత చాలా సున్నితంగా ఉంటాయి. రెండు వాణిజ్య అటవీ, సాంద్ర వ్యవసాయానికి అనేక శతాబ్దాలుగా swidden వ్యవసాయం భరించిన అడవులు విధ్వంసక మారింది.
ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితాలో 3వ కులం. హరిదాసులు, బుడబుక్కల, కాటికాపరులు, బోయ, కోయ, ఎరుకల, యానాది, లంబాడీ మొదలైన ఆదిమ జాతుల్లో చెంచు కూడా ఒకటి. వీరు పూర్తిగా ఆదివాసీలు. ఆంధ్రప్రదేశ్‌లోని చెంచు తెగ ప్రాచీన సంచార తెగలలో ఒకటి. నల్లమల ప్రాంతంలోని కొండలు, గుట్టలే చెంచుల ప్రస్తుత నివాస స్థలం. అంటే కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో చెంచులు విస్తరించి, అటు నిజాం రాజ్యానికీ, యిటు బ్రిటిషు పరిపాలనలోని మద్రాస్ ప్రెసిడెన్సీకి సరిహద్దుగా ఉన్నకృష్ణానదికి ఇరువైపులా వున్న ప్రాంతాల్లో కనిపించేవారు. చెంచులు తెలుగు కూడా మాట్లాడతారు. శ్రీలంకలోని ప్రాచీన తెగ అయిన వెద్దా (vedda) ల మాదిరిగానే చెంచులు కూడా రింగుల జుత్తు, విశాల వదనం, చప్పిడి ముక్కు, పొడవాటి దవడతో పొట్టిగా, నల్లగా ఉంటారు. శరీరాన్ని తమ పూర్వీకులలాగా ఆకులతో చుట్టుకోవడం ఇప్పుడు లేకపోయినా, మగవాళ్ళు గోచీ మాత్రమే పెట్టుకుంటారు. ఆడవాళ్ళు నూలు రవిక, చీర కట్టుకుంటారు.అడవి చెంచుల కన్నా నిరుపేదలు మొత్తం భారతదేశంలోనే ఉండరు. విల్లంబులు, ఒక కత్తి, గొడ్డలి, గుంతలు తవ్వే కర్ర, కొన్ని కుండలు, బుట్టలు, మరికొన్ని చింకిపాతలు - యివే చెంచుల సమస్త ఆస్తిపాస్తులు. చెంచుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అన్న భావనలు బలంగా కనిపిస్తాయి. చెంచులు వేటనూ, అడవి పండ్లనూ ప్రసాదిస్తుందని విశ్వసించే ఒక దేవతను పూజిస్తారు. హిందువులు పరమాత్మగా పూజించే భగవంతుడిలో కొన్ని లక్షణాలతో సారూప్యం ఉన్న ఒక "ఆకాశదేవుణ్ణి" కూడా చెంచులు పూజిస్తారు. జీవితం దేవుడి వరప్రసాదమేననీ, మరణించిన జీవుడు దేవుడిలో కలిసిపోతాడనీ, చెంచులు బలంగా నమ్ముతారు. హిందూ సమాజ సంపర్కం వల్లే యీ విశ్వాసాలన్నీ చెంచుల ఆలోచనా విధానాల్లోకి ప్రవేశించాయి. అప్పటికప్పుడే ఆశువుగా పాటలు పాడుతూ స్త్రీ పురుషులు నృత్యం చేస్తారు. వీరి ఆటల్లో సింగి సింగడు ప్రధాన పాత్రధారులు, నాయికా నాయకులు. డప్పుకు తగినట్టుగా గంతులేస్తారు. ఇప్పపువ్వు సారా తాగితే మైమరచి కుప్పిగంతులేస్తారు. నెమలి నృత్యం, కోతి నృత్యం వీరి నృత్యాల్లో ముఖ్యమైనవి. చెంచుల కథలు కూడా పూర్వం ప్రసిద్ధి చెందిన జానపద కళల్లో ఒకటి.
పావనంబైన తమిళేటి పరిసరమున
వేగి కురువాటికా దేశ విపినభూమి గోవులనుపేరి చెంచుల కులమునందు గడిమికత్తుల నా గలుగ గమ్మి యలదు - (వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామం)
విలు నమ్ముల్ ధరియించి చెంచులు తదాభీలాటవీ మధ్య భూ
ముల కన్పట్టిన నంజలింపుము మహాత్ముండైన భర్గుండు భ క్తుల కిష్టార్థము లీయగోరిన గణస్తోమంబుతో మాయ పం దుల వేటాడుచు భిల్లుడై నరుల కన్నుల్ గప్పి క్రీడించెడిన్ - ( గుర్రం జాషువా గబ్బిలం)
బోయలు, చెంచులు మొదలైన వాళ్ళకి పాలన్నం పెట్టినంత మాత్రాన విశ్వాసవంతులౌతారు. ఐతే వాళ్ళకి కోపం రావటం కూడా చాలా తేలికే. వాళ్ళ విషయంలో మంచితనంతో ఉండాలి.-యామునిడి రాజనీతి సూత్రాలు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు చెంచులను విందుకు పిలిచి వాళ్ళు భోజనం చేశాక 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి నరికించాడనీ అందుకే ఆ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడుగా మారిందనీ తరువాత తాను చేసిన హత్యలకు పశ్చాత్తాపపడి గుళ్ళూ గోపురాలూ కట్టించాడనీ చరిత్ర.. ఆదిమ గిరిజన జాతి అయిన చెంచులు అంతరించిపోతున్నారు. నల్లమల అడవికి మాత్రమే పరిమితమైన ఈజాతి క్రమంగా కాల గర్భంలో కలిసిపోతోంది. (సాక్షి 21.10.2008) అస్తిత్వ ప్రమాదంలో చెంచులు (ఆంధ్రజ్యోతి 28.12.2008)
క్షయ, మలేరియా వంటి వ్యాధుల మూలంగా చెంచులు మరణిస్తున్నారు. సంతాన లేమి కూడా ప్రధాన సమస్యగా మారింది. అతి ప్రాచీన ఆదివాసి తెగయైన చెంచు జాతి అస్తిత్వానికే ముప్పు ఏర్పడుతున్నది. మహబూబ్ నగర్, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, నల్గొండ జిల్లాల్లోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వేల సంవత్సరాలుగా జీవిస్తున్నారు చెంచులు.రాష్ట్రంలోని మిగతా జన సమూహాలతో కానీ, ఇతర గిరిజన తెగలతో కానీ, చెంచు తెగకు దగ్గరి పోలికలు లేవు. వీరి మనస్తత్వాలు, అలవాట్లు, మానసిక, శారీరక స్థితిగతులు, సంస్కృ తి భిన్నమైనవి.నల్లమ ల అటవీ ప్రాంతంలోని ఐదు జిల్లాలను పులుల అభయారణ్యంగా ప్రకటించి, శాశ్వత నిర్మాణాలు లేని 'నో మాన్ లాండ్'గా ప్రకటించారు. చెంచు పెంటలను పునరావాసం పేరి ట అడవి బయటకు పంపించవద్దని జి.సి.సి నిర్వహణను చెంచు యువతకు అప్పగించాలని వీరు కోరుతున్నారు.చెంచుల వ్యవసాయ భూములు అధికభాగం అన్యాక్రాంతమయ్యాయి. అంతేకాక వీరి విలువైన వనరులు గిరిజనేతరుల చేతికి పోయాయి.చెంచుల ఇలవేల్పులైన శ్రీశైలం మల్లికార్జున స్వామి, అహోబిళ లక్ష్మీనరసింహ్మ స్వామి దేవాలయాలు వందల సంవత్సరాలుగా చెంచుల సంరక్షణలోనే ఉండేవి. చెంచులు వీటిని వారసత్వ సంపదగా భావించుకుంటారు. చెంచుల గజ్జల కొండడు, మల్లయ్య తాత దొర వంటి వారు శ్రీశైలం మల్లన్న అర్చకులు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో జరిగే పూజాకార్యక్రమంలో చెంచులకు ప్రత్యేక స్థానం ఉంది. వీరు పార్వతీ దేవిని తమ ఆడపడుచుగా భావిస్తారు. శ్రీశైల మల్లన్న సన్నిధిలో చెంచులకు ఉద్యోగాలివ్వాలని కోరుతున్నారు. అభివృద్ధి అంతా పైపైనే - గుడిసెల్లోనే నివాసం .. పక్కా ఇళ్లకు తాళం
గిరిజనుల్లో ప్రత్యేకత కలిగిన ఒక వర్గం. వారిలో ఎక్కువ మంది బంధువులే. అయినా ఒకటిగా కలిసుండేందుకు ప్రయత్నించరు. ఇతర గిరిజనుల మాదిరిగానే వారు కూడా అభివృద్ధికి దూరంగా ఉండేందుకే మొగ్గు చూపిస్తారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గూడేల్లో నివసిస్తున్నప్పటికీ ఆ అభివృద్ధిని అందుకోవడంలో వారు వెనుకబడే ఉంటున్నారు. ఇక మారుమూల దట్టమైన కీకారణ్యంలో ఉన్న చెంచుల మాట చెప్పనక్కర్లేదు. అటు పౌష్టికాహారం, ఇటు వైద్యంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. అంతా కలిసి ఒకటిగా ఉండేందుకు చొరవ చూపించకపోవడం, ప్రభుత్వం కట్టించిన పక్కా ఇళ్లలో నివసించేందుకు ఇష్టపడకపోవడం, స్వచ్ఛమైన నీరు లభించకపోవడం వంటి అంశాలు చెంచులను వేధిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం నుండి కూడా అవసరమైన ప్రణాళిక లేకపోవడంతో అరణ్యంలో సమస్యల మధ్యనే చెంచులు కాలం వెళ్లదీస్తున్నారు. ఒకరిద్దరు చెంచులు కూడా ఒక గూడేన్ని ఏర్పాటుచేసుకుని ముందుకు సాగడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.
చెంచులు ప్రధానంగా నల్లమలలోనే కనిపిస్తారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో కొంతమంది చెంచులు నివసిస్తున్నప్పటికీ 80 శాతానికిపైగా నల్లమలలోని నాలుగు జిల్లాల అటవీ ప్రాంతంలోనే కనిపిస్తున్నారు. మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 42 వేల మంది చెంచులు నివసిస్తుండగా, వారు తమ కోసం 340 చిన్న చిన్న గూడేలు, పెంటలు ఏర్పాటుచేస్తున్నారు.46 mandals lo 10768 families unnayi.total state population lo 0.055%. ఉన్నది తక్కువ మంది అయినప్పటికీ ఎక్కువ గూడేలు ఏర్పాటుచేసుకోవడం వల్ల ఒక ప్రాంతంలో తక్కువ మంది నివసించే పరిస్థితి నెలకొంది. నలుగురు చొప్పున ఒక పెంటలో నివసిస్తున్న వారు కూడా నల్లమలలో కనిపిస్తున్నారు. పది మంది కన్నా తక్కువగా చెంచులు నివసిస్తున్న పెంటలు 13 ఉన్నాయి. 25 మంది కన్నా తక్కువ చెంచులు నివసిస్తున్న పెంటలు 26 వరకు ఉన్నాయి. ఇంత తక్కువ సంఖ్యలో చెంచులు ఒక పెంటలో నివసిస్తుండడంతో వారికి సంక్షేమ పథకాలు అమలు పరచడం కష్టంగా ఉన్నట్లు అధికారులు చెబున్నారు. బయటకు రమ్మన్నా రావడం లేదని, దీంతో వారికి అభివృద్ధి ఫలాలు అందడం లేదని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు చెబున్నారు. రెండు వందల మంది కన్నా చెంచులు ఒక చోట నివసించే గూడేలు కేవలం 60 మాత్రమే ఉండటం పరిస్థితి దయనీయతకు అద్దం పడుతోంది. పర్యాటకంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద పల్లెలకు సమీపంలోని అటవీ పెంటలు, గూడేల్లో కొంతవరకు అభివృద్ధి ఉన్నట్లు బయటకు కనిపిస్తున్నప్పటికీ సామాజిక అభివృద్ధి మాత్రం లేదనే చెప్పవచ్చు.
ఆధునిక ప్రపంచంలో మహిళలు ధరించే చుడీదార్, చీరలు వంటి వస్త్రాలు కొంతమంది ధరిస్తున్నప్పటికీ అక్కడ ఇతర విద్య, ఆరోగ్యం వంటి అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. వైద్యం కోసం వచ్చే వైద్యులు, సిబ్బందికి కూడా సహకరించని వారు కోకొల్లలుగా కనిపిస్తారు. రాకపోతే వైద్యుల నిర్లక్ష్యం అంటూ, వస్తే ఎందుకు వచ్చారని ప్రశ్నించే వారు చెంచుల్లో అధికంగా ఉన్నారు. వైద్యులు వచ్చే సమయంలో ఇళ్లలోకి వెళ్లిపోయి తాళాలు వేసుకోవడం కూడా కద్దు. ఇక ఎన్ని పక్కా ఇళ్లు నిర్మించినా వాటికి దూరంగా ఉండడం చెంచుల్లో దర్శనమిస్తుంది. పక్కా ఇళ్లలో ఉంటే శుభం జరగదన్న భావం కారణంగా వారంతా ఇప్పటికే గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తుంటారు. ఐటిడిఎ అధ్వర్యంలో నిర్మించిన ఇళ్లు దశాబ్దాల తరబడి తాళాలు వేసే కనిపిస్తున్నాయి. అప్పాపూర్ అనే ప్రధాన గూడెంలో ఐటిడిఎ అధ్వర్యంలో చుట్టుపక్కల చిన్న చిన్న గూడేలన్నింటికీ కలిపి కొన్ని పక్కా ఇళ్లను నిర్మించారు. అయితే నిర్మాణం పూర్తయిన తరువాత ఆ ఇళ్లకు తాళాలు వేసి మళ్లీ తమతమ పెంటలకు వెళ్లిపోయిన చెంచుల సంఖ్య అధికంగా ఉంది. ఇదే పరిస్థితి దాదాపు నల్లమలలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక అనేక గూడేల్లోని పిల్లల కోసం ఏర్పాటుచేసిన పాఠశాలలు కూడా దీనావస్థలోనే ఉంటున్నాయి. పశువుల పాకలుగా కొన్ని మారిపోతుండగా, మరికొన్ని ఎప్పుడూ తాళాలు వేసే దర్శనమిస్తున్నాయి. ఐదో తరగతి చదివితే గొప్ప అన్న పరిస్థితి చెంచుల్లో ఉండడం గమనార్హం. పదో తరగతి, ఇంటర్ చదివితే వారు అత్యంత విద్యావంతులుగా గుర్తించబడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో అటవీశాఖ, గిరిజన సంక్షేమం, ఐటిడిఎ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు పుష్కలంగా ఉన్నాయి. తాగునీటికి కూడా చర్యలు లేవని చెంచుల నుండి ఆరోపణలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో స్థానికంగా లభించే ఊటలు, బావుల్లో నీటినే తాగాల్సి వస్తుండడంతో డయేరియా వంటి సమస్యలు తరచూ తలెత్తుతున్నట్లు చెంచులు అంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులు కూడా వీరికి స్వచ్ఛమైన నీరు అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. (చిత్రం) మూఢనమ్మకాలతో ప్రభుత్వం నిర్మించిన పక్కా ఇళ్ళలో ఉండటానికి భయపడి...చెంచులు గుడిసెల్లోనే ఉండటానికిష్టపడుతున్నారు (ఆంధ్ర భూమి 2011 జూన్ 6). ITDA Srisailam paridhi lo 37 PHC lu, 146 upakendralu erpatu chesinatlu lekkalu cheputhunnaru officers.
చెంచులు నివసించే గ్రామాలను 'పెంట' అంటారు. 'పాచిపెంట', 'సున్నిపెంట' వంటి పేర్లు వినగానే అవి 'చెంచుల' నివాసాలుగా గుర్తించవచ్చును. 'తాటిపాక', 'కొలనుపాక' గ్రామ నామాలలోని 'పాక' జైనుల నివాసాలుగా గుర్తించవచ్చును.
DTWO డిపార్టుమెంటు కూడా చెంచు కులాన్ని STలు గానే గుర్తిస్తున్నారు కానీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ (PTG) గా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నారు ఇంకా. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ITDA) కేవలం చెంచుల కోసమే సుందిపెంట, కర్నూలు జిల్లాలో ఉంది. మహబూబ్ నగర్ లో అచ్చంపేట నియోజకవర్గంలోని కొండనాగుల, మన్ననూర్ చెంచులు, ప్రకాశం లోని దోర్నాల గ్రామంలోని చెంచులు మిగతా వారితో పోలిస్తే కొంచెం ఎడ్యుకేషన్ కు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీరికి తగిన సహాయం అందటంలేదు. ఎడ్యుకేషనల్ గా చెంచులు ఇంతవరకు టీచర్ పోస్ట్ దాటి వచ్చిన వారు దాదాపుగా లేరు. ప్రభుత్వ ఉద్యోగాల కొరకు కొంతమంది ఇతర కులాల వారు చెంచు కులం సర్టిఫికేట్ తో ఉద్యోగాలు చేస్తున్న వారుకూడా ఉన్నారు. కాని సామాజికంగా పోరాట పటిమ తక్కువగా ఉన్న చెంచులు దీనిపై ఏమిచేయలేక పోతున్నారు., ITDA శ్రీశైలం ప్రాజెక్ట్ సుందిపెంట, కమీషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, హైదరాబాదు ఆధీనంలో పనిచేస్తున్న, ITDA PTG చెంచు శ్రీశైలం అని పేరులోనే ఉన్నా, అందులో ఉద్యోగాలు చెంచు వారితోనే నింపండి అంటే STs లో ABCDలు లేవు కదా అందరూ సమానమే అని ST లంబాడ వాళ్ళకే పోస్టులు పోయే విధంగా పరిపాలిస్తున్నారు. ITDA PTG శ్రీశైలంలోని 34 ఆశ్రమ పాఠశాలలు అన్ని April 2012 నుండి DTWO ఆధీనంలోకి మారినప్పటి నుండి ఆ ITDA తన ఉనికినే కోల్పోవడం ప్రారంభమైది. గతంలోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగేవి. కాని 2010 నుండి ఎలాంటి సామజిక అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. చెంచులకు లోన్స్ ఇప్పుడు క్లిష్టతరం అయింది. కావున ఎవరు తీసుకోవడం లేదు. ITDA శ్రీశైలం తన ఉనికినే కోల్పోతుంది.
చెంచులకు ఆరోగ్య పరంగా చూడటానికి అచ్చంపేట, మహబూబ్ నగర్ జిల్లా యందు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే పెద్ద హాస్పిటల్ కట్టి 6 సంవత్సరాలు అవుతున్న అది ఏవిధంగా ఉపయోగిస్తున్నారో ఎవరికీ తెలియదు. సిబ్బంది ఎవరు కూడా అక్కడ వుండరు. చెంచులు కొందరు ANM, MPHW లాంటి కోర్సులు చదివిన వారికీ ఉద్యోగాలు చూపించే మార్గాలేవి అధికారులు చేయడంలేదు.
భూములు చెంచులకు కొంత ఉన్న చాల మందికి లేవు. వీరి పక్క లంబాడ కులం చేరి, వీరి అవకాశాలను, వనరులను కొల్లగోడుతూనే ఉన్నారు. అటవీ ఆధికారులు సైతం చెంచులను అటవీ ఫలాలు పొందనీయడం లేదు. ST లలో PTG లైన చెంచులను ప్రభుత్వం ఎప్పుడో గుర్తించింది కానీ ఇప్పటి పాలకులకు తెలియక ఇంట్రెస్ట్ లేక వారి జీవితాలని గాలికి, అడవి దేవతకు వదిలేసినట్లుగా తోస్తుంది. PESA చట్టం, అటవీ హక్కుల చట్టం ఉన్నా, పని చేయడం లేదు. నిరుపయోగంగా ఉన్నాయి.కేవలం ఒక్క చెంచులకే ఈ అన్యాయం జరగట్లేదు. అటు భద్రాచలం, కూనవరం, చర్ల, వెంకటాపురం, మణుగూరు, లాంటి ఆదివాసీ ప్రాంతాలలో కూడా ఈ లంబాడీలు పాగా వేసి వారి అవకాశాలను, వనరులను వారికి దక్కకుండా చేస్తూ ఇంకా వారి వెనుకబాటు తనానికి కారణమవుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70సంవత్సరాలు అయినా ఆదివాసీలకు ఇంకా సామాజిక, ఆర్థిక స్వాతంత్ర్యం రాలేదని చెప్పాలి. ఇప్పటికి రవాణా, నీటి, విద్య సౌకర్యాలు లేని ఆదివాసీ గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ప్రభుత్వం ST ల కోసం ప్రతి సంవత్సరం వేళల్లో బడ్జెట్ కేటాయిస్తున్న, ఆ ఫలాలు చాల వరకు లంబాడీలకే చెందుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. కారణం ఆదివాసీల అమాయకత్వం, లోకజ్ఞానం లేకపోవడం, అభివృద్ధి అవకాశాల వివరాలను తెలుసుకోలేకపోవడం, వారి హక్కులు, అవకాశాలను తెలుసుకొని సాధించుకోలేక పోవడం, ఆదివాసీలలో వారిని వెనుక ఉండి నడిపించే బలమైన నాయకత్వం లేకపోవడం, ఆ బలమైన నాయకత్వాన్ని కొనసాగించడానికి ఆర్థిక బలం లేకపోవడము ఒక కారణమే. ఏది ఏమైనా ఎన్ని ప్రభుత్వాలు మారిన ఆదివాసీ జీవితాలను మార్చే ప్రభుత్వమూ గాని, నాయకుడు కానీ రాలేదని, అస్సలు లేరని చెప్పుకోవచ్చు.
ఆదివాసి దినోత్సవం
[మార్చు]ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం నిర్వహించబడుతుంది. ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
- ↑ వి6 వెలుగు, ఫీచర్స్ (9 August 2018). "ఇవాళ ప్రపంచ ఆదివాసీ దివస్". Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ వార్త, సంపాదకీయం (8 August 2020). "నేడు అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం". Vaartha. కోరం జ్ఞానేశ్వరీ. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.