Jump to content

పోలమాంబ దేవాలయం (పెదవాల్తేరు)

వికీపీడియా నుండి
కరకచెట్టు పోలమాంబ ఆలయం (పెదవాల్తేరు)

పోలమాంబ దేవాలయం, ఈ ఆలయం విశాఖపట్నం నగరంలోని పెద వాల్తేరు ప్రాంతంలో ఉంది. దీనిని కరకచెట్టు పోలమాంబ ఆలయం అనే మరో పేరు ఉంది. ఈ ఆలయంలో పోలమాంబ దేవత కొలువు దీరడం వెనుక శతాబ్దాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది.[1] ఈ అమ్మవారిని ఇంకా జీడిపళ్ల అమ్మవారు, సర్పదేవత, సముద్ర దేవత అనే ఇతర పేర్లతోనూ పిలుస్తారు. పోలమాంబ దేవత ఉత్తరాంధ్ర ప్రజలకు, విశాఖపట్నం చుట్టూ పక్కల ఉన్న  గ్రామ ప్రజలకు ఆరాధ్య దైవం. పిలిస్తే పలికే దైవంగా, తమ ఇంటి ఇలవేల్పుగా, సముద్ర దేవతగా, సర్ప దేవతగా, శశ్య దేవతగా భక్తులు పలురూపాలతో కొలుస్తారు. ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు తరలివస్తారు. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన, శ్రావణ మాసంలో ఈ ఆలయంలో పోలమాంబ దేవతకు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.[2]

చరిత్ర

[మార్చు]

గతంలో అమ్మవారిని జీడిపళ్ల అమ్మవారు అని పిలిచేవారు. పండుగ జరుపుకునే సమయంలో ఈ అమ్మవారి గుడిపై జీడిపళ్లు విసురుతారు. గర్భాలయంలో కొలువుదీరిన అమ్మవారి శిరస్సుపై సర్పం, చేతుల్లో ఖడ్గం, కుంకుమ భరణి, నిమ్మకాయల దండ అలంకరణతో దర్శనమిస్తుంది. జ్ఞానం, ఐశ్వర్యం, శక్తిని మూడింటిని ఏకకాలంలో పోలామాంబ అమ్మవారు ప్రసాదిస్తుందని స్థానికులు నమ్ముతారు. ఈ అమ్మవారు పొలాల్ని రక్షించే దైవంగా భావిస్తారు. అధిక పంటలు రావడంలో ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటుందని గట్టిగా నమ్ముతారు. అందుకే ఈ అమ్మవారికి శ్రీ పోలామాంబ అనే పేరొచ్చిందని స్థానికుల కథనం.శ్రీ పోలమాంబ అమ్మవారు అక్కడ కొలువు దీరడం వెనుక శతాబ్దాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మవారిని జీడిపళ్ల అమ్మవారు, సర్పదేవత, సముద్ర దేవత అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజలకు, విశాఖపట్నం చుట్టూ పక్కల ఉన్న గ్రామాల వారికి ఈ అమ్మవారే ఆరాధ్య దైవం. పిలిస్తే పలికే దైవంగా, తమ ఇంటి ఇలవేల్పుగా, సముద్ర దేవతగా, సర్ప దేవతగా, శశ్య దేవతగా భక్తులు కొలుస్తారు. ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు తరలివస్తారు. ప్రతి సంవత్సరం ఉగాది, శ్రావణ మాసంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఈ అమ్మవారిని దుర్గా దేవి అవతారంగా పరిగణిస్తారు. దుర్గాదేవిలోని ప్రకృతి రక్షణా తత్వానికి పోలామాంబను ప్రతీకగా పరిగణిస్తారు. అందుకే ఈ అమ్మవారిని సిరుల తల్లిగా, పంటల తల్లిగా వివిధ రూపాల్లో భక్తులు ఆరాధిస్తారు. ఈ అమ్మవారు సుమారు 2023 నాటికి 900 సంవత్సరాల క్రితం విశాఖ సాగర తీరంలో జాలర్లకు అమ్మవారి విగ్రహం దొరికినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ విగ్రహాన్ని తమ గ్రామంలో ప్రతిష్టించి కొలుస్తుండగా.. ఒకరోజు జాలర్లకు అమ్మవారు కలలో కనిపించి, తనను పెద్ద వాల్తేరులో ఉన్న మద్ది వంశీయులకు అప్పగించాలని ఆదేశించిందట. దీంతో వారు వెళ్లి అక్కడ అప్పగించారు. ఆ తర్వాత మద్ది వంశం వారికి కూడా కలలో కనిపించి తనను పెద్ద వాల్తేరులోని కరకచెట్టు కింద ప్రతిష్టించమని ఆదేశించగా వారు అక్కడే అమ్మవారిని ప్రతిష్టించి పోలమాంబ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అప్పటినుంచి ఈ అమ్మవారు కరకచెట్టు పోలమాంబగా ప్రసిద్ధి చెందారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Karaka Chettu Polamamba Temple: A bridge between communities". The Times of India. 2015-10-03. ISSN 0971-8257. Retrieved 2024-01-10.
  2. "Karakachettu Polamamba Ammavari Temple,waltair polamamba temple 'వాల్తేరు' శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయానికి ఆ పేరేలా వచ్చింది... ఈ గుడిని ఎవరు కట్టించారు? - who built vizag pedda waltair sri polamamba temple and history of the polamamba telugu - Samayam Telugu". web.archive.org. 2023-12-26. Archived from the original on 2023-12-26. Retrieved 2023-12-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "waltair polamamba temple 'వాల్తేరు' శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయానికి ఆ పేరేలా వచ్చింది... ఈ గుడిని ఎవరు కట్టించారు?". Samayam Telugu. Retrieved 2024-01-10.

వెలుపలి లంకెలు

[మార్చు]