Jump to content

రంగియా రైల్వే డివిజను

వికీపీడియా నుండి

రంగియా రైల్వే డివిజను , భారతీయ రైల్వేల యొక్క ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ కింద ఉన్న ఐదు రైల్వే డివిజన్లలో ఒకటి. ఈ రైల్వే డివిజను 1 ఏప్రిల్ 2003న అలీపుర్దువార్ రైల్వే డివిజను నుండి వేరు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం అసోం రాష్ట్రంలోని రంగియా లో ఉంది. కతిహార్ రైల్వే డివిజను , లుండింగ్ రైల్వే డివిజను , టిన్సుకియా రైల్వే డివిజను, అలీపుర్దువార్ రైల్వే డివిజను అనేవి గౌహతి లోని మాలిగావ్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలోని ఇతర నాలుగు రైల్వే డివిజన్లు.

డిఆర్‌ఎం కార్యాలయం, రంగియా
డిఆర్‌ఎం కార్యాలయం, రంగియా

రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా

[మార్చు]

ఈ జాబితాలో రంగియా రైల్వే డివిజను పరిధిలోని స్టేషన్లు అలాగే వాటి స్టేషను వర్గం ఉన్నాయి.[1][2]

స్టేషను వర్గం స్టేషన్ల సంఖ్య స్టేషన్ల పేర్లు
ఎ-1 1 రంగియా జంక్షన్
3 న్యూ బొంగైగావ్, బార్పేట రోడ్డు, రంగపార నార్త్ జంక్షన్
బి 3 నల్బరి, పత్సల, దుధ్నోయి
సి
సబర్బన్ స్టేషన్లు
2 విశ్వనాథ్ చరాలి , తేజ్‌పూర్
డి 5 ఉదల్గురి , హరిసింగ , రౌతా బగన్ , తాంగ్లా , ముర్కోంగ్సెలెక్
- -
ఎఫ్
హాల్ట్ స్టేషన్లు
- -
మొత్తం - 14

ఈ గుర్తు - ప్రయాణీకులకు మూసివేయబడిన స్టేషన్లను సూచిస్తుంది.

సేవలందిస్తున్న జిల్లాలు

[మార్చు]

రంగియా డివిజను అసోం రాష్ట్రంలోని బొంగైగావ్, గోల్‌పరా, బార్పేట, చిరాంగ్, నల్‌బరి, ఉదల్‌గురి,బ్సాక్ జిల్లా కామ్‌రూప్(రూరల్), కామ్‌రూప్(మెట్రో), సోనిత్‌పూర్, ఉత్తర లఖింపూర్, ధేమాజీ జిల్లాలకు, అలాగే అరుణాచల్ ప్రదేశ్ లోని పశ్చిమ కమ్‌పరీ, మేఘాలయ లో రెసుబెల్పరా (నార్త్ గారో హిల్స్) లకు సేవలు అందిస్తోంది. >[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Statement showing Category-wise No. of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016.
  2. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 15 జనవరి 2016.
  3. Kagyung, Biplob. "Rangiya Railway Station Map/Atlas NFR/Northeast Frontier Zone - Railway Enquiry". indiarailinfo.com. Retrieved 2024-05-05.

మూసలు , వర్గాలు

[మార్చు]