Jump to content

అండమాన్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
అండమాన్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థానికతతమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్,ఉత్తర ప్రదేశ్,హర్యానా,ఢిల్లీ,పంజాబ్,జమ్మూ కాశ్మీర్
తొలి సేవమే 1 1988
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ రైల్వే మండలం
మార్గం
మొదలుచెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను
ఆగే స్టేషనులు79
గమ్యంకాట్రా
ప్రయాణ దూరం2,848 కి.మీ. (1,770 మై.)
రైలు నడిచే విధంవారానికి మూడుమార్లు
రైలు సంఖ్య(లు)16031 / 16032
సదుపాయాలు
శ్రేణులుమూడవ తరగతి ఎ.సి,స్లీపర్,జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీకార్ కలదు
చూడదగ్గ సదుపాయాలుLarge windows
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం50 km/h (31 mph) average with halts
మార్గపటం

జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది జమ్ము తావి రైల్వే స్టేషను, చెన్నై రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]

చరిత్ర

[మార్చు]

జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్1988 మే 1 న ప్రారంభించారు.

జమ్ము తావి - చెన్నైఅండమాన్ ఎక్స్‌ప్రెస్

ప్రయాణ మార్గం

[మార్చు]
  • జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్16032 నెంబరుతో ఆదివారం, బుధవారం, శనివారాల్లో జమ్మూ నుండి రాత్రి 09గంటల 55నిమిషాలకు బయలుదేరి మూడవరోజు ఉదయం 10గంటల 20నిమిషాలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను చేరుతుంది.
  • చెన్నై-జమ్ము తావి అండమాన్ ఎక్స్‌ప్రెస్ 16031 నెంబరుతో ఆదివారం, బుధవారం, గురువారాల్లో ఉదయం 05గంటల 15నిమిషాలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి బయలుదేరి మూడవ రోజు మధ్యహ్నం 03గంటల 20నిమిషాలకు జమ్మూతావి చేరుతుంది.

అండమాన్ ఎక్స్‌ప్రెస్ తన మార్గంలో తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ముఖ్య ప్రాంతాలైన గూడూరు, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, తెనాలి, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను, ఖమ్మం, వరంగల్లు, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్, నాగ్పూర్, భోపాల్, సాంచి, ఝాన్సీ రైల్వే జంక్షన్, గ్వాలియర్, ఆగ్రా, మధుర, హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, క్రొత్త ఢిల్లి, లూధియానా, జలంధర్, పఠాన్ కోట్, సాంబ, ఉధంపూర్ ల మీదుగా ప్రయాణిస్తూ జమ్ముతావి చేరుతుంది.

వేగం

[మార్చు]

చెన్నై-జమ్ము తావి అండమాన్ ఎక్స్‌ప్రెస్ చెన్నై-జమ్ము తావి ల మద్య గల దూరాన్ని 55గంటల 55నిమిషాల సమయం తీసుకుంటుంది.ఈ రెల యొక్క సగటువేగం గంటకు 50కిలోమీటర్లు.

కోచ్ల కూర్పు

[మార్చు]

జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్ కు 2 ఎ.సి మూడవ తరగతి భోగీలు,8 స్లీపర్ భోగీలు,5 జనరల్ భోగీలు లతో కలిపి మొత్తం 17భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఇంజను
SLR జనరల్ జనరల్ జనరల్ బి2 బి1 ఎస్8 ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 ఎస్2 ఎస్1 జనరల్ జనరల్ SLR
జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్
జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్

ట్రాక్షన్

[మార్చు]

అండమాన్ ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషను వరకు ఈరోడ్ లేదా లోకోషేడ్ అధారిత WAP-4 లేదా అరక్కోణం లోకోషెడ్ అధారిత WAP-1 లోకోమొటివ్లను ఉపయోగిస్తున్నారు.అక్కడినుండి జమ్మూతావి వరకు తుగ్లకబాద్ ఆధారిత WDP-4B/WDP-4D డీజిల్ లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Welcome to Indian Railway Passenger Reservation Enquiry".