నాగార్జున ఎక్స్‌ప్రెస్
స్వరూపం
నాగార్జున ఎక్స్‌ప్రెస్ రైలు భారతదేశం లోని భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వేచే నడుపబడి ప్రస్తుతము నిలిపివేయబడిన ఒక రైలు.
చరిత్ర
[మార్చు]నాగార్జున ఎక్స్‌ప్రెస్ మొదట సికింద్రాబాదు-గుంటూరు మధ్య నడుపబడెను. తరువాత తెనాలి కూడలి వఱకు పొడిగింపబడెను. ఈ రైలు దాని పాత సంఖ్య7005/7006 స్థానంలో 2719/2720 గా మారి, అప్పటి నుండి సూపర్ ఫాస్ట్ రైలుగా హోదా హెచ్చింపబడెను. పిదప విశాఖపట్నం-తెనాలి మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ ప్రెస్ సికిందరాబాదుకు పొదిగింపబడిన దరిమిలా, ఈ నాగార్జున ఎక్స్ ప్రెస్ రైలు రద్దు చేయబడెను.
రద్దు
[మార్చు]ఈ రైలు 2007 సం. జూన్ మూడవ వారంలో రద్దు చేయబడింది, 2805/2806 విశాఖపట్నం - తెనాలి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ వరకు పొడిగించ బడింది.