హుసేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | Inter-city rail | ||||
స్థితి | Operating | ||||
స్థానికత | Telengana, Maharastra | ||||
ప్రస్తుతం నడిపేవారు | South Central Railway, Indian Railways | ||||
మార్గం | |||||
మొదలు | Hyderabad Deccan | ||||
ఆగే స్టేషనులు | 17 | ||||
గమ్యం | Mumbai CST | ||||
ప్రయాణ దూరం | 790 కి.మీ. (490 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 13 hours 45 minutes | ||||
రైలు నడిచే విధం | Daily | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | Sleeper, Air-conditioned and Unreserved | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | Indian Rail standard | ||||
ఆహార సదుపాయాలు | Pantry | ||||
చూడదగ్గ సదుపాయాలు | Large windows in all carriages | ||||
బ్యాగేజీ సదుపాయాలు | Below the seats | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | Two | ||||
పట్టాల గేజ్ | Broad | ||||
వేగం | 58.7 km/h | ||||
|
భారతదేశంలోని దక్షిణ మధ్య రైల్వే నిర్వహిస్తోన్న హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ (Hussainsagar Express) బహుళ ప్రజాదరణ పొందిన రైలు సర్వీసు. ఈ రైలు హైదరాబాద్, ముంబయి మధ్య నడుస్తుంది. 1993లో ఈ రైలు (7001/7002) ప్రారంభమైంది. అప్పట్లో దాదర్ - హైదరాబాద్ మధ్య ఇది వారానికి రెండుసార్లు మాత్రమే నడిచేది. హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ అనతికాలంలోనే ప్రతిరోజు నడిచే రైలు సర్వీసుగా మారింది.
చరిత్ర
[మార్చు]భారతదేశంలోని హైదరాబాద్ సంస్థానాన్ని ఇబ్రహీం కులీకుతుబ్ షా పాలిస్తున్న సమయంలో 1562లో హజ్రత్ హుస్సేన్ షా వలీ హుస్సేన్ సాగర్ సరస్సును నిర్మించారు.[1] ప్రస్తుతం ఈ సరస్సు పేరుతోనే రైలును నడిపిస్తున్నారు. గతంలో బాంబే-వీటీ, సికింద్రాబాద్ మధ్య నడిచే 2101/2102 నెంబర్లు గల మినార్ ఎక్స్ ప్రెస్ స్థానంలో 1994 నుంచి హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైలు నడుస్తోంది. ప్రస్తుతం దీని నెంబర్లు 2701/2702.
రైలు సంఖ్య
[మార్చు]12701: ముంబయి సి.ఎస్.టి. - హైదరాబాద్ డెక్కన్ హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్
12702: హైదరాబాద్ Decan - ముంబయి సి.ఎస్.టి. హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్[2]
ఈ రైలు మొత్తం 429 మైళ్ల దూరం ( 790 కి.మీ.) దూరాన్ని 13 గంటల 45 నిమిషాల వ్యవధిలోప్రయాణిస్తుంది. దీని సగటు వేగం 58.7 కిమీ/గం.
పెట్టెల వివరములు
[మార్చు]12701 హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ రైలులో బోగీల విభజన ఈ విధంగా ఉంటుంది: ENG-SLR-GEN-S10-S9-S8-S7-S6-S5-S4-S3-S2-S1-B2-B1-A1-HA1-GEN-SLR
12702 హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ రైలులో బోగీల విభజన ఈ విధంగా ఉంటుంది:
ENG-SLR-GEN-GEN-GEN-GEN-S1-GEN-GEN-SLR
ఈ రైలు హైదరాబాద్ ముంబయి ఎక్స్ ప్రెస్ తో రేక్ లు పంచుకుంటుంది.
ఇంజిన్లు
[మార్చు]హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ రైలును లాగేందుకు మొదట్లో డబ్ల్యు.సి.ఎం. రైలింజన్ ఉపయోగించేవారు. ఆ తర్వాత WCAM3/WCG2 ఇంజన్లను సి.ఎస్.టి. ముంబయి, పుణె మధ్య ఉపయోగిస్తున్నారు. డీసీ నుంచి ఏసీకి మార్చడం ప్రారంభించిన తర్వాత పుణె నుంచి కల్యాణ్ వరకు దక్షిణ మధ్య రైల్వే కాజీపేట (KZJ) యొక్క డీజిల్ లోక్ షెడ్ నుంచి తీసుకుని సింగిల్ WDM3A డీజిల్ లోకోమోటివ్ వాడుతున్నారు. 2013 మధ్య సంవత్సరం నుంచి మధ్య రైల్వేకు చెందిన కల్యాణ్ షెడ్ నుంచి WDM3A/D లేదా WDG 3 లోకొమొటివే ఇంజన్లను హైదరాబాద్, ముంబయి సి.ఎస్.టి. మధ్య జరిగే మొత్తం ప్రయాణంలో వాడుతున్నారు.
ఇతరములు
[మార్చు][3] హైదరాబాద్, ముంబయి నగరాలను కలిపే ఇతర రైళ్ల వివరాల జాబితా:
రైలు
సంఖ్య |
పేరు | ఆధారం | గమ్యం |
---|---|---|---|
18519/18520 | ఎల్.టి.టి. విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ | విశాఖపట్నం | ముంబయి ఎల్.టి.టి. |
17221/17222 | బై వీక్లీ ఎక్స్ ప్రెస్ | కాకినాడ | ముంబయి ఎల్.టి.టి. |
11019/11020 | కోణార్క్ ఎక్స్‌ప్రెస్ | ముంబయి సి.ఎస్.టి. | భువనేశ్వర్ |
17031/17032 | హైదరాబాద్ ముంబయి ఎక్స్‌ప్రెస్ | హైదరాబాద్ | ముంబయి సి.ఎస్.టి. |
17057/17058 | దేవగిరి ఎక్స్ ప్రెస్ | సికింద్రాబాద్ | ముంబయి సి.ఎస్.టి. |
12219/12220 | దురంతో ఎక్స్‌ప్రెస్ | సికింద్రాబాద్ | ముంబయి ఎల్.టి.టి. |
17203/7204 | కాకినాడ భావ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ | కాకినాడ | భావ్ నగర్ |
17017/17018 | సికింద్రాబాద్ రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ | సికింద్రాబాద్ | రాజ్ కోట్ |
19201/19202 | పోరుబందర్ సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ | సికింద్రాబాద్ | పోరుబందర్ |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Indian Railways Fan Club Association (April 16, 2007). "Train Nomenclature". Indian Railways Fan Club Association. Retrieved 2008-02-21.
- ↑ "Hussain Sagar Express". cleartrip.com. Archived from the original on 2016-03-04.
- ↑ India Rail Info (December 29, 2006). "Trains between Mumbai and Hyderabad". India Railway Information. Retrieved 2007-01-15.
బయటి లింకులు
[మార్చు]సమాచారం
[మార్చు]- భారతీయ రైలు సమాచారం: హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్(2701)
- భారతీయ రైలు సమాచారం: హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్(2702)
- హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్.
ఆర్టికల్స్ & సమీక్షలు
[మార్చు]- దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన రైలు నెంబర్లు, రైలు సమయాలు.
- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html
- http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537