Jump to content

చెన్నై సెంట్రల్-బెంగళూరు సిటీ రైలు మార్గం

వికీపీడియా నుండి
చెన్నై సెంట్రల్-బెంగళూరు సిటీ రైలు మార్గం
అవలోకనం
స్థితిపనిచేస్తోంది
లొకేల్తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
చివరిస్థానంచెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను
బెంగళూరు సిటీ రైల్వే స్టేషను
ఆపరేషన్
ప్రారంభోత్సవం1864; 161 సంవత్సరాల క్రితం (1864)
యజమానిIndian Railways
నిర్వాహకులుదక్షిణ రైల్వే, నైరుతి రైల్వే
డిపో (లు)ఆవడి, అరక్కోణం, కృష్ణరాజపురం, బెంగళూరు కంటోన్మెంటు, బెంగళూరు
రోలింగ్ స్టాక్WAP-1, WAP-4, WAP-5, WAP-7, WAG-7, WAG-9 ఎలక్ట్రిక్ లోకోలు; WDS-6, WDM-2, WDM-3A, WDP-4, WDG-3A, WDG-4, WDS-4 డీజిల్ లోకోలు
సాంకేతికం
ట్రాక్ పొడవుప్రధాన మార్గం:358 కి.మీ. (222 మై.)
శాఖా మార్గాలు:
బంగారపేట-కోలార్-బయ్యప్పనహళ్ళి166 కి.మీ. (103 మై.)
బంగారపేట-మారికుప్పం16 కి.మీ. (10 మై.)
ట్రాక్ గేజ్5 ft 6 in (1,676 mm) బ్రాడ్ గేజి
ఆపరేటింగ్ వేగంUp to 110 km/h
మార్గ పటం
Chennai-Bangalore route mapమూస:Chennai Central–Bangalore City line

చెన్నై సెంట్రల్-బెంగళూరు సిటీ లైన్ (అధికారికంగా పురట్చి తలైవర్ డాక్టర్. MG రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్-క్రాంతివీర సంగొల్లి రాయన్న - బెంగళూరు స్టేషన్ లైన్) దక్షిణ భారతదేశంలోని రెండు అతిపెద్ద నగరాలైన చెన్నై. బెంగుళూరులను కలిపే విద్యుదీకరించబడిన డబుల్ లైన్ రైలు మార్గం.

చరిత్ర

[మార్చు]

1856లో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రైలు సేవ, భారతదేశంలో మూడవది మద్రాసు రైల్వే ద్వారా రాయపురం / వేయసరపాడు నుండి వాలాజా రోడ్ (ఆర్కాట్) వరకు నిర్వహించబడింది. మద్రాసు రైల్వే 1861లో దాని ట్రంక్ మార్గాన్ని బేపూర్ / కడలుండి (కాలికట్ సమీపంలో) వరకు విస్తరించింది. మద్రాస్ రైల్వే 1864లో కొత్తగా నిర్మించిన బేపూర్ లైన్‌లో బెంగుళూరు కంటోన్మెంట్‌ను జోలార్‌పేటకు అనుసంధానించింది. అదే సంవత్సరం బెంగుళూరు మెయిల్ రన్ నడవడం మొదలైంది. [1] బెంగుళూరు నగరం 1882లో బెంగుళూరు కంటోన్మెంట్‌తో అనుసంధానించబడింది [2] బౌరింగ్‌పేట్ (తరువాత బంగారుపేట), కోలార్ మధ్య నారో-గేజ్ లైన్ 1913లో మైసూర్ స్టేట్ రైల్వే ద్వారా ప్రారంభించబడింది. నారో-గేజ్ యశ్వంతపూర్-యెలహంక-దేవనహళ్లి-చిక్కబల్లాపూర్-కోలార్ లైన్ 1915లో మొదలై 1918లో బెంగుళూరుకు అనుసంధానించబడింది [3] 2013 నవంబరులో చిక్కబల్లాపూర్-కోలార్ సెక్షన్ను బ్రాడ్ గేజ్‌గా మార్చడం పూర్తవడంతో, బెంగళూరు-కోలార్ సెక్షన్ మొత్తం డైరెక్ట్ బ్రాడ్ గేజ్ రైళ్లకు సిద్ధమైంది. [4] [5] బంగారుపేట-కోలార్ లైన్ గేజ్ మార్పిడి 1997లో పూర్తయింది. అప్పటి నుండి 2016 సెప్టెంబరు 11 వరకు రైల్‌బస్ నడిచింది. ఎనిమిది బోగీల డీజిల్-ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU) మొదలవడంతో రైల్‌బస్ సర్వీసును ఆపేసారు. [6] [7]

షెడ్లు, వర్క్‌షాప్‌లు

[మార్చు]

అరక్కోణంలో ఇంతకుముందు స్టీమ్ లోకో షెడ్ ఉండేది. ఇప్పుడు 230+ లోకోలు ఉండే ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఉంది. ఇందులో WAP-1 WAP-4 WAG-7, WAM-4, WAG-5 లోకోమోటివ్‌లు ఉన్నాయి. [8]

1983లో ప్రారంభించిన కృష్ణరాజపురం డీజిల్ లోకో షెడ్‌లో 125 ఇంజన్లు ఉంటాయి. వీటిలో: WDS-6, WDM-2, WDM-3A, WDP-4, WDG-3A, WDG-4 ఉన్నాయి. డీజిల్ ఎలక్ట్రిక్ లోకో షెడ్‌గా మార్చడంలో భాగంగా ఇటీవల, రోయపురం షెడ్ నుండి బదిలీ చేయబడిన 5 WAP-7 లోకోమోటివ్‌లు కూడా ఇక్కడ ఉన్నాయి. [9]

జోలార్‌పేటైలో ఎలక్ట్రిక్/డీజిల్ ట్రిప్ షెడ్ ఉంది. [10] పెరంబూర్‌లోని క్యారేజ్, వ్యాగన్ వర్క్‌షాప్‌లు కోచ్‌లు, వ్యాగన్‌లను రిపేర్ చేస్తాయి. పెరంబూర్‌లోని లోకోమోటివ్ వర్క్‌షాప్‌లు దక్షిణాన ప్రధాన బ్రాడ్-గేజ్ స్టీమ్ లోకో రిపేర్ షాప్. ఇప్పుడు కూడా ఫెయిరీ క్వీన్ కు వార్షిక మరమ్మతులు చేస్తుంది. వర్క్‌షాప్ ఇప్పుడు ప్రధానంగా దక్షిణాది నుండి, బయటి నుండీ వచ్చే ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లకు మరమ్మత్తులు, నిర్వహణ పనులు చేస్తుంది. [11]

బేసిన్ బ్రిడ్జిలో క్యారేజ్ నిర్వహణ వసతులు ఉన్నాయి. అవడిలో బ్రాడ్-గేజ్ EMU నిర్వహణ, కార్ షెడ్ ఉన్నాయి. అరక్కోణంలో ఇంజనీరింగ్ వర్క్‌షాప్‌లు ఉన్నాయి. [12]


మూలాలు

[మార్చు]
  1. "IR History – Early days". 1832–1869. IRFCA. Retrieved 19 December 2013.
  2. "IR History: Early days II". 1870–1899. IRFCA. Retrieved 19 December 2013.
  3. "IR History: Part III (1900–1947)". IRFCA. Retrieved 19 December 2013.
  4. "76552/Kolar – Bangalore City DEMU (via Chik Ballapur)". India Rail Info. Retrieved 19 December 2013.
  5. "Railway line proposed by Indira". The New Indian Express. 2 November 2013. Archived from the original on 23 డిసెంబరు 2013. Retrieved 19 December 2013.
  6. Satish, Shalini. "Railcar's last stop". Deccan Herald. Retrieved 19 December 2013.
  7. TNN, TNN. "Curtains come down on state's single-bogie rail bus". Times of India. Retrieved 15 October 2017.
  8. "Sheds and Workshops". IRFCA. Retrieved 18 December 2013.
  9. "Sheds and Workshops". IRFCA. Retrieved 18 December 2013.
  10. "Sheds and Workshops". IRFCA. Retrieved 18 December 2013.
  11. "Sheds and Workshops". IRFCA. Retrieved 18 December 2013.
  12. "Sheds and Workshops". IRFCA. Retrieved 18 December 2013.