Jump to content

అజంతా ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Ajanta Express at Dayanandnagar Railway Station, Hyderabad
Ajanta Express
Ajanta Express at Manmad yard

అజంత ఎక్స్ ప్రెస్ సికింద్రాబాదు-మన్మాడ్ పట్టణాల నడుమ నడిచే భారతీయ రైల్వేలకు చెందిన ఒక రైలు. షిరిడి వెళ్ళే శ్రీ సాయి బాబా భక్తులకు ఎంతో ప్రయోజనకరముగ ఉంటుంది.ఈ రైలు దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాదు మండలం వారిచే నడుపబడుచున్నది.

చరిత్ర

[మార్చు]

తెలంగాణ, మరాఠ్వాడ ప్రాంతాల మధ్య నడిచే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రైలు అజంత ఎక్స్ ప్రెస్ . 1967, ఏప్రియల్ 1-వ తేదీ, శనివారము నాడు ఈ రైలు కాచిగూడ-మన్మాడ్ మధ్య మీటర్ గేజ్ పై ప్రవేశపెట్టబడింది. మన్మాడ్-పర్భణి మధ్య రైల్వే లైను మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్ కు మార్చబడ్డప్పుడు, ముద్ఖేడ్-సికింద్రాబాద్ లైను ఇంకను మీటర్ గేజ్ పైనే ఉండెను. అప్పుడు ఈ రైలు వికారాబాద్-బీదర్-పరళి వైద్యనాథ్-పర్భణి మీదుగా మళ్లింపబడెను. 2007 లో ముద్ఖేడ్-సికింద్రాబాద్ పూర్తిగా బ్రాడ్ గేజ్ గా మార్చబడిన పిమ్మట ఈ రైలు మఱల నిజామాబాద్-బాసర-ముద్ఖేడ్-నాందేడ్-పర్భణి మీదుగా మళ్లింపబడింది. ప్రవేశపెట్టబడ్డప్పుడు ఈ రైలు దేశంలో అత్యంత వేగంగా నడిచే మీటరు గేజ్ రైలుగా ప్రఖ్యాతి గాంచింది.


బండి సంఖ్య

[మార్చు]

17064 సికింద్రాబాద్ జంక్షన్ -> మన్మాడ్ జంక్షన్

17063 మన్మాడ్ జంక్షన్ -> సికింద్రాబాద్ జంక్షన్

పెట్టెల వివరములు

[మార్చు]

శీతలీకరింపబడిన రెండవ తరగతి పెట్టె -1

శీతలీకరింపబడిన మూడవ తరగతి పెట్టె -2

పడక వసతి కలిగిన రెండవ తరగతి పెట్టెలు -15

కూర్చొను వసతి కలిగిన రెండవ తరగతి పెట్టెలు -3

కూర్చొను మఱియు సామాగ్రి పెట్ట్టుకొను పెట్టెలు- 2

మూలాలు

[మార్చు]