Jump to content

అలీపుర్దువార్ రైల్వే డివిజను

వికీపీడియా నుండి

అలీపుర్దువార్ రైల్వే డివిజను, భారతీయ రైల్వేల యొక్క ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ కింద ఉన్న ఐదు రైల్వే డివిజన్లలో ఒకటి . ఈ రైల్వే డివిజను 1995 జనవరి 15న ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌ లోని అలీపుర్దువార్‌లో ఉంది.[1] కతిహార్ రైల్వే డివిజను , లాండింగ్ రైల్వే డివిజను , టిన్సుకియా రైల్వే డివిజను, రంగియా రైల్వే డివిజను అనేవి గౌహతిలోని మాలిగావ్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలోని ఇతర నాలుగు రైల్వే డివిజన్లు. [2][3]

సిక్కిం అనుసంధానం

[మార్చు]

పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పైగురి-అలిపుర్దువార్-సముక్తల రోడ్ రైలు మార్గములోని సెవోక్‌లోని సివోక్ రైల్వే స్టేషను నుండి సిక్కింలోని రంగ్పోలోని రంగ్పో రైల్వే స్టేషను వరకు 44.4 కిలోమీటర్ల (27.6 మైళ్ళు) పొడవైన సెవోక్-రాంగ్పో రైల్వే మార్గము నిర్మాణం 2010లో ప్రారంభమైంది.[4][5] రంగ్పో వరకు రైల్వే లైన్ 2021లో పూర్తవుతుందని భావించారు.[6] రెండవ దశలో ఈ లైన్ సిక్కిం రాజధాని గ్యాంగ్‌టాక్ వరకు విస్తరించబడుతుంది.[7]

రాష్ట్రాల వారీగా రూట్ కి.మీ.లు

[మార్చు]
31-03-2018 నాటికి
రాష్ట్రం బిజి మొత్తం కి.మీ.లు
విద్యుదీకరించబడినది విద్యుదీకరించబడనిది ఉప-మొత్తం
అసోం - 163.47 163.47 163.47
పశ్చిమ బెంగాల్ - 560.22 560.22 560.22
మొత్తం - 723.69 723.69 723.69

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Railway Zones and Divisions in The Country". Press Information Bureau. Ministry of Railways (Government of India). 21 July 2017. Retrieved 1 January 2025.
  2. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 19 March 2015. Retrieved 14 January 2016.
  3. "Alipurduar Railway Division". Railway Board. North Eastern Railway zone. Retrieved 14 January 2016.
  4. "Work commences on new railway line connecting Sikkim". Business Standard. 24 February 2010. Retrieved 2011-11-20.
  5. Jayanta Gupta (29 October 2009). "Finally, Sikkim railway project on track". The Times of India. Archived from the original on 7 July 2012. Retrieved 2011-11-20.
  6. Financial Express. Indian Railways new Sivok-Rangpo rail project: Travel from West Bengal to Sikkim in just 2 hours. (30 August 2019).
  7. Times of India. Very soon, travelling to Sikkim by train will be a possibility. (17 September 2019).

బయటి లింకులు

[మార్చు]