Jump to content

సోనిత్‌పూర్ జిల్లా

వికీపీడియా నుండి
సోనిత్‌పూర్ జిల్లా
শোণিতপুৰ
District
నమేరి నేషనల్ పార్క్‌లోని కమెంగ్ నది నేపథ్యంలో హిమాలయాలు ఉన్నాయి
నమేరి నేషనల్ పార్క్‌లోని కమెంగ్ నది నేపథ్యంలో హిమాలయాలు ఉన్నాయి
Country India
రాష్ట్రంఅసోం
ప్రధాన కార్యాలయంతెజ్పూర్
Elevation
48 మీ (157 అ.)
జనాభా
 (2011)
 • Total19,25,975
భాషలు
 • అధికారఅస్సామీ
Time zoneUTC+5:30 (IST)

అస్సాం రాష్ట్రం లోని 27 జిల్లాలలో సోనిత్‌పూర్ (అస్సాం: শোণিতপুৰ) జిల్లా ఒకటి. తేజ్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి అస్సాం రాష్ట్రంలో సోనిత్‌పూర్ జిల్లా జనసాంధ్రతలో ఇది 3 వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానంలో నాగావ్ జిల్లా, ధుబ్రి జిల్లాలు ఉన్నాయి.[1]

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

తేజ్‌పూర్ అనేపేరుకు ఒక పౌరాణిక కథనం ఉంది. తేజా అంటే రక్తం, పుర అంటే (పురం). సంస్కృతంలో కూడా తేజ్‌పూర్ అంటే రక్తపురం అని అర్ధం. ఈ ప్రాంతం శివభక్తుడైన బాణాసురుడు నివసించింది. బాణాసురుని కుమార్తె ఉషా తన చెలికత్తే చిత్రలేఖ సాయంతో శ్రీకృష్ణుని మనుమడైన అనిరుద్ధుని గంధర్వ వివాహం చేసుకుంది. అది తెలిసిన బాణాసురుడు అనిరుద్ధుని ఖైదు చేసాడు. శ్రీకృష్ణ బలరాములు సైన్యంతో తరలి వచ్చి బాణాసురునితో సైన్యాలతో యుద్ధం చేసి అనిరుద్ధుని విడిపించాడు. యుద్ధంలో ఈ ప్రాంతం రక్తంతో తడవడం కారణంగా ఈ ప్రాంతానికి తేజ్‌పురి అనే పేరు వచ్చింది.[2][3] తేజ్‌పూర్ అస్సాం రాష్ట్రంలో ఇది 7వ స్థానంలో ఉంది. మొదటి 6 స్థానాలలో గౌహతి, సిల్చర్, డిబ్రూగర్, జోర్హట్, నాగావ్, జోర్హాట్, నాగావ్, తింసుకియా.

చరిత్ర

[మార్చు]

1983లో సోనిత్‌పూర్ జిల్లా రూపొందించబడింది. దర్రాంగ్ జిల్లా నుండి కొంతభూభాగం వేరు చేసి ఈ జిల్లా రూపొందించబడింది.[4]

భౌగోళికం

[మార్చు]

సోనిత్‌పూర్ జిల్లా వైశాల్యం 532చ.కి.మీ.[5] ఇది గుయాడల్ కెనాల్ వైశాల్యానికి సమానం.[6]

అభయారణ్యం

[మార్చు]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,925,975,[1]
ఇది దాదాపు. లెసొదొ దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. వెస్ట్ వర్జీనియా నగర జనసంఖ్యకు సమం.[8]
640 భారతదేశ జిల్లాలలో. 245వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 365 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15.67%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 946:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 69.96%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
  • జిల్లాలో ఉన్న హిందువుల సంఖ్య 1,287,646, ముస్లిముల సంఖ్య 268,078 (15.94%).

సంస్కృతి

[మార్చు]

ప్రముఖులు

[మార్చు]

అస్సామీ సంస్కృతికి తేజ్‌పూర్ సాంస్కృతిక రాజధానిగా ఉంది. ప్రముఖ అస్సామీ కేంద్రంగాతేజ్‌పూర్ పలు ప్రముఖులకు జన్మస్థానంగా గుర్తించబడుతుంది. వీరిలో డాక్టర్ భూపేన్ హజారికా, రూప్‌కంవర్ జ్యోతి ప్రసాద్ అగర్వాల్ (1903-1951), కలగురు బిష్ణు ప్రసాద్ రభ (1909-1969), ఫణి శర్మ (1909-1970), ఆనంద చంద్ర అగర్వాల్ (1974-1939)ముఖ్యులు. భరతీయ పార్లమెంటరీ గత స్పీకర్ సోమనాథ్ చటర్జీకి ఇది జన్మస్థానం.

  • జిల్లాలో కొంతమంది ప్రముఖులు:
  • చంద్రకుమార్ అగర్వాలా
  • దండిరాం కలిత
  • కమలాకాంతా భట్టాచార్య (అస్సాం)
  • లామోబొర బొరా

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

1998లో సోనిత్‌పూర్ జిల్లాలో 200 చ.కి.మీ వైశాల్యంలో " నమేరీ నేషనల్ పార్క్ " స్థాపించబడింది. .[9] సోనిత్‌పూర్ జిల్లాలో ఒరంగ్ నేషనల్ పార్క్ ఉంది. ఈ పార్కును సోనిత్‌పూర్ జిల్లా దర్రాంగ్ జిల్లాతో పంచుకుంటుంది. ఒరంగ్ పార్క్ 1999లో స్థాపించబడింది. ఒరంగ్ పార్క్ వైశాల్యం 79చ.కి.మీ.[9] సోనిత్‌పూర్‌లో 2 వన్యప్రాణి అభయారణ్యాలు (వన్యమృగ సంరక్షణాలయాలు) స్థాపించబడ్డాయి: బరుచపోరి వన్యప్రాణి శాక్చ్యురీ,, సోనైరూపై వన్యప్రాణి అభయారణ్యం.[9] సోనిత్‌పూర్‌లో బెహల్,నాడౌర్,చార్దుయర్ కూడా ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. Sajnani, Manohar (2001). Encyclopaedia of Tourism Resources in India. Gyan Publishing House. pp. 12–. ISBN 978-81-7835-017-2.
  3. "Legend & History". Sonitpur district website. Archived from the original on 2013-07-14. Retrieved 2014-04-11.
  4. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  5. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  6. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Guadalcanal 5,353km2
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Lesotho 1,924,886
  8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. West Virginia 1,852,994
  9. 9.0 9.1 9.2 Indian Ministry of Forests and Environment. "Protected areas: Assam". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

మూస:అస్సాంలోని జిల్లాలు