2001
స్వరూపం
2001 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 |
దశాబ్దాలు: | 1980లు - 1990లు - 2000లు - 2010లు - 2020లు |
శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- డిసెంబర్ 13: భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు.
జననాలు
[మార్చు]- సెప్టెంబర్ 3: ధీరజ్ బొమ్మదేవర, భారతీయ విలుకాడు. 2024 ఒలింపిక్స్లో భారత్ ఆర్చరీ జట్టులో ఉన్నాడు.
మరణాలు
[మార్చు]- జనవరి 1: ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు. (జ.1920)
- ఫిబ్రవరి 9: హెర్బర్ట్ సైమన్, ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత .
- ఫిబ్రవరి 25: డొనాల్డ్ బ్రాడ్మన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్మన్గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (జ.1908)
- మే 13: ఆర్.కె.నారాయణ్, భారతీయ ఆంగ్ల నవలా రచయిత.
- మే 28: వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (జ.1921)
- జూన్ 1: బీరేంద్ర, నేపాల్ రాజు.
- జూన్ 4: దీపేంద్ర, నేపాల్ రాజు.
- జూన్ 6: కె.ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (జ.1925)
- జూన్ 10: లక్ష్మీదీపక్, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1935)
- జూన్ 19: జంధ్యాల, తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (జ.1951)
- ఆగష్టు 16: అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (జ.1918)
- సెప్టెంబర్ 10: పొట్లపల్లి రామారావు, కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు
- సెప్టెంబర్ 27: కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రి. (జ.1920)
- అక్టోబర్ 5: కల్లూరి తులశమ్మ, సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. (జ.1910)
- అక్టోబర్ 30: కొత్తదాస్, పేరుమోసిన గూండా, రాజకీయనాయకుడు.
- డిసెంబరు 18: అమల్ కుమార్ సర్కార్, భారతదేశ సుప్రీంకోర్టు ఎనమిదవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1901)
పురస్కారాలు
[మార్చు]- భారతరత్న పురస్కారం: లతా మంగేష్కర్, బిస్మిల్లా ఖాన్
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : యష్ చోప్రా.
- జ్ఞానపీఠ పురస్కారం : రాజేంద్ర కేశవ్లాల్ షా
నోబెల్ బహుమతులు
[మార్చు]- భౌతికశాస్త్రం: ఎరిక్ అలిన్ కార్నెల్, వోల్ఫ్గాంగ్ కెట్టెర్లీ, కార్ల్ ఎడ్విన్ వీమన్.
- రసాయనశాస్త్రం: విలియం నోలెస్, యోజి నొయోరి, కే బ్యారీ షార్ప్లెస్.
- వైద్యం: లెలాండ్ హార్ట్వెల్, తిమోతి హంట్, పాల్ ఎం నర్స్.
- సాహిత్యం: వి.ఎస్.నైపాల్.
- శాంతి: ఐక్యరాజ్య సమితి, కోఫీ అన్నన్
- ఆర్థికశాస్త్రం: జార్జి ఏ అకెర్లోఫ్, మైకెల్ స్పెన్స్, జోసెఫ్ ఇ స్టిగ్లిడ్జ్.