2000
Jump to navigation
Jump to search
2000 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1997 1998 1999 2000 2001 2002 2003 |
దశాబ్దాలు: | 1980లు 1990లు 2000లు 2010లు 2020లు |
శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జనవరి
[మార్చు]- జనవరి 1: ప్రపంచ వ్యాప్తంగా మిలీనియం వేడుకలు నిర్వహించబడ్డాయి.
ఫిబ్రవరి
[మార్చు]- ఫిబ్రవరి 6: ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది.
- ఫిబ్రవరి 17: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్) ను విడుదల చేసింది
మార్చి
[మార్చు]- మార్చి 22: భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.
- మార్చి 26: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు.
మే
[మార్చు]జూలై
[మార్చు]సెప్టెంబర్
[మార్చు]- సెప్టెంబర్ 5: తువాలు దేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశంగా చేరింది.
- సెప్టెంబర్ 8: అల్బేనియా ప్రపంచ వాణిజ్య సంస్థలో అధికారికంగా చేరింది.
- సెప్టెంబర్ 14: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ మి (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్) ను విడుదల చేసింది.
- సెప్టెంబర్ 15: 27వ వేసవి ఒలింపిక్ క్రీడలు సిడ్నీలో ప్రారంభమయ్యాయి.
నవంబర్
[మార్చు]- నవంబర్ 15: భారతదేశంలో కొత్తగా ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. బీహార్ రాష్ట్రాన్ని విభజించి ఛోటానాగ్పూర్ ప్రాంతంలో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]- జనవరి 3: అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (జ.1934)
- జనవరి 19: బెట్టినో క్రాక్సి, ఇటలీ ప్రధానమంత్రి.
- ఏప్రిల్ 21: నిగార్ సుల్తానా, భారతీయ సినిమా నటి. (జ.1932)
- మే 6: బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత. (జ.1927)
- జూన్ 3: మెర్టన్ మిల్లర్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- జూన్ 10: హఫెజ్ అల్ అస్సాద్, సిరియా అధ్యక్షుడు.
- జూలై 24: ద్వారం భావనారాయణ రావు, వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కుమారుడు. (జ.1924)
- ఆగష్టు 11: పైడి జైరాజ్, భారత సినీ నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1909)
- ఆగష్టు 27: అబు అలీ ముస్తాఫా, పాలస్తీనా విమోచనా ప్రజా కూటమి అనే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు.
- అక్టోబర్ 9: కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత, తబలా, హార్మోనియం విద్యాంసుడు. (జ.1924)
- అక్టోబర్ 24: సీతారాం కేసరి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.
- అక్టోబర్ 25: గోపగారి రాములు, తెలంగాణకు చెందిన కథా రచయిత, కవి, అనువాదకుడు. (జ. 1926)
- నవంబర్ 7: సి.సుబ్రమణ్యం, భారతీయుడు, భారతరత్న గ్రహీత. (జ.1910)
- డిసెంబరు 18: మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (జ.1922)
పురస్కారాలు
[మార్చు]నోబెల్ బహుమతులు
[మార్చు]- భౌతికశాస్త్రం: జోరెస్ ఇవనోవిచ్ అల్ఫెరోవ్, హెర్బెర్ట్ క్రోమెర్, జాక్ కిల్బీ.
- రసాయనశాస్త్రం: అలాన్ హీగర్, అలాన్ మక్ డైర్మిడ్, హిడెకి షిరకావా.
- వైద్యం: అర్విడ్ కార్ల్సన్, పాల్ గ్రీన్గర్డ్, ఎరిక్ కాండెల్.
- సాహిత్యం: గావో జింగ్జియాన్.
- శాంతి: కిం డే జంగ్
- ఆర్థికశాస్త్రం: జేమ్స్ హెక్మన్, డేనియల్ మెక్ ఫాడెన్.