1946
స్వరూపం
1946 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1943 1944 1945 - 1946 - 1947 1948 1949 |
దశాబ్దాలు: | 1920లు 1930లు - 1940లు - 1950లు 1960లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఏప్రిల్ 30: మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు.
- డిసెంబర్ 11: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ అమలులోకి వచ్చింది.
జననాలు
[మార్చు]- జనవరి 10: వేదవ్యాస రంగభట్టర్, రంగస్థల నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత (మ. 2019)
- మార్చి 10: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (మ.2015)
- మే 1: కె.సి.శేఖర్‌బాబు తెలుగు సినిమా నిర్మాత. (మ.2017)
- మే 5: అక్కినేని కుటుంబరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.
- మే 8: జయప్రకాశ్ రెడ్డి, రంగస్థల సినీ నటుడు, దర్శకుడు. (మ.2020)
- మే 14: అప్పాసాహెబ్ ధర్మాధికారి, మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త. పద్మశ్రీ అవార్డు గ్రహీత.
- మే 26: అరుణ్ నేత్రవల్లి, కంప్యూటర్ ఇంజనీర్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత
- జూన్ 1: బాబు, తెలుగులో వ్యంగ్య చిత్రకారుడు.
- జూన్ 4: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, తెలుగు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. (మ.2020)
- జూన్ 8: గిరి బాబు, తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత.
- జూన్ 20: కుందూరు జానారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ హోంశాఖా మంత్రి.
- జూలై 1: కల్లూరు రాఘవేంద్రరావు, కథారచయిత, బాలసాహిత్యవేత్త.
- జూలై 1: శాంతి నారాయణ కథారచయిత,అవధాని.
- జూలై 23: పులి వీరన్న, రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందినాడు
- ఆగష్టు 8: కర్రెద్దుల కమల కుమారి , పార్లమెంటు సభ్యురాలు
- ఆగష్టు 10: కొండవలస లక్ష్మణరావు, తెలుగు నాటక, చలన చిత్ర నటుడు. (మ.2015)
- ఆగస్టు 14: పి.వి. రాజేశ్వర్ రావు: రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి. (మ. 2016)
- ఆగష్టు 19: బిల్ క్లింటన్, అమెరికా మాజీ (42వ) అధ్యక్షుడు.
- ఆగష్టు 20: ఎన్.ఆర్. నారాయణ మూర్తి, 1981లో ఇన్ఫోసిస్ని స్థాపించినవారు.
- ఆగష్టు 21: ఆలె నరేంద్ర, రాజకీయనాయకుడు. (మ.2014)
- సెప్టెంబరు 12: దేవిశెట్టి చలపతిరావు, ఆధ్యాత్మిక గురువు, రచయిత.
- అక్టోబరు 6: వినోద్ ఖన్నా బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. (మ.2017)
- అక్టోబరు 31: కరణం బలరామకృష్ణ మూర్తి, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు.
- నవంబర్ 18: శంకరమంచి పార్థసారధి, కథ, నాటక రచయిత.
- డిసెంబర్ 1: రేగులపాటి కిషన్ రావు, కవి, నవల రచయిత (మ. 2023)
- డిసెంబర్ 9: సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు
మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 22: అబ్దుల్ రెహమాన్ (జిసి), టీష్ ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక సైనికుడు. (జ. 1921)
- ఏప్రిల్ 16: బళ్ళారి రాఘవ, న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (జ. 1880)
- జూన్ 17: చిలకమర్తి లక్ష్మీనరసింహం, తెలుగు రచయిత. (జ.1867)
- జూలై 4: దొడ్డి కొమరయ్య, తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు. (జ.1927)
- ఆగష్టు 11: బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు, వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో హత్య చేయబడ్డాడు. (జ.1918)
- అక్టోబరు 1: గూడవల్లి రామబ్రహ్మం, సినిమా దర్శకులు, సంపాదకులు. (జ.1902)
- నవంబర్ 12: మదన్ మోహన్ మాలవ్యా, భారత స్వాతంత్ర్యయోధుడు. (జ.1861)