2008
స్వరూపం
2008 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 2004 2005 2006 - 2007 - 2008 2009 2010 |
దశాబ్దాలు: | 1980లు 1990లు - 2000లు - 2010లు 2020లు |
శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జనవరి
[మార్చు]- జనవరి 3: 95వ భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సంస్థ వార్షిక సమావేశం విశాఖపట్నంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చే ప్రారంభం.
- జనవరి 7: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అనిల్ రమేశ్ దవే ప్రమాణస్వీకారం చేశాడు.
- జనవరి 7: భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ గా వినోద్ రాయ్ ప్రమాణ స్వీకారం చేశాడు.
- జనవరి 15: అమెరికాలో లూసియానా రాష్ట్రానికి భారత సంతతికి చెందిన పియూష్ బాబీ జిందాల్ 55వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాడు.
- జనవరి 17: టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు.
- జనవరి 21: శ్రీహరికోట నుంచి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్-10 ద్వారా ఇజ్రాయెల్‌కు చెందిన పోలరైస్ ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైంది.
- జనవరి 22: ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ ఎంపికయ్యాడు.
- జనవరి 24: అరుణాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ గా జోగీందర్ జస్వంత్ సింగ్ నియమించబడ్డాడు.
- జనవరి 25: సెనేట్ విశ్వాస పరీక్షలో ఓడిపోయినందుకు ఇటలీ ప్రధాన మంత్రి రొమానో ప్రోది పదవికి రాజీనామా చేశాడు.
- జనవరి 29: థాయ్‌లాండ్ కొత్త ప్రధానమంత్రిగా సమక్ సుందరవేజ్ ఎన్నికయ్యాడు.
ఫిబ్రవరి
[మార్చు]- ఫిబ్రవరి 5: వన్డే క్రికెట్లో సచిన్ టెండుల్కర్ 16000 పరుగులు పూర్తి చేసిన ఘనతను పొందినాడు.
- ఫిబ్రవరి 15: తొమ్మిదిసార్లు గ్రాండ్‌స్లాం మహిళల టైటిళ్ళ విజేత మోనికా సెలెస్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్.
- ఫిబ్రవరి 19: 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా.
- ఫిబ్రవరి 19: పాకిస్తాన్ ఎన్నికలలో దివంగత బెనజీర్ భుట్టోకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.
- ఫిబ్రవరి 20: నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆమోదం తెలిపింది.
- ఫిబ్రవరి 23: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంటును నార్త్‌జోన్ 17వ సారి కైవసం చేసుకొంది.
- ఫిబ్రవరి 25: క్యూబా అధ్యక్షుడిగా ఫిడేల్ కాస్ట్రో సోదరుడు రావుల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు.
మార్చి
[మార్చు]- మార్చి 1: బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్‌లు తొలి వికెట్టుకు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. దీనితో 52 సంవత్సరాల క్రితం భారత ఓపెనర్లు వినూ మన్కడ్, పంకజ్ రాయ్‌లు నెలకొల్పిన రికార్డు ఛేదించబడింది.
- మార్చి 2: కౌలాలంపూర్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్‌ను భారత్ విజేతగా నిలిచింది. ఈ కప్‌ను భారత్ గెలవడం ఇది రెండో సారి.
- మార్చి 3: రష్యా అధ్యక్ష ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.
- మార్చి 10: త్రిపుర ముఖ్యమంత్రిగా మూడవసారి మణిశంకర్ బాధ్యతలు చేపట్టాడు.
- మార్చి 12: మేఘాలయలో ముఖ్యమంత్రి డి.డి.లపాంగ్ నేతృత్వంలో ఏడుగురు మంత్రుల ప్రమాణస్వీకారం.
- మార్చి 14: హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ ప్రారంభోత్సవం.
- మార్చి 15: చైనా అధ్యక్షుడిగా మళ్ళీ హు జింటావో ఎన్నిక, ఉపాద్యక్షుడిగా జిన్‌షింగ్ నియామకం.
- మార్చి 19: పాకిస్తాన్ లోని తక్షశిలలో 2000 సంవత్సరాల నాటి బుద్ధ విగ్రహం లభ్యమైంది.
- మార్చి 25: పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.
- మార్చి 26: భూటాన్‌లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
- మార్చి 28: చెన్నై లోని చేపాక్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ రెండో ట్రిపుల్ సెంచరీని సాధించాడు.
- మార్చి 29: రాహుల్ ద్రవిడ్ టెస్టులలో 10,000 పరుగులు పూర్తి చేసి ఈ ఘనత సాధించిన ఆరవ బ్యాట్స్‌మెన్‌గాను, మూడవ భారతీయుడిగాను స్థానం సంపాదించాడు.
ఏప్రిల్
[మార్చు]- ఏప్రిల్ 12: హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
మే
[మార్చు]- మే 12: మహిళల అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 3000 పరుగులు పూర్తిచేసిన ఐదవ క్రీడాకారిణిగా భారత్‌కు చెందిన మిథాలి రాజ్ రికార్డు సాధించింది.
- మే 12: చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 7.8 పాయింట్లుగా నమోదైంది.
- మే 13: పింక్ సిటీగా పెరుపొందిన జైపూర్‌లో ఉగ్రవాదులచే 8 బాంబుపేలుళ్ళు, 75 మంది మృతి.
- మే 14: మహిళా టెన్నిస్‌లో క్రీడాకారిణి బెల్జియంకు చెందిన జస్టిన్ హెనిస్ రిటైర్మెంట్ ప్రకటన.
- మే 19: వైఎస్ఆర్ జిల్లా తాళ్ళపాకలో అన్నమయ్య 600వ జయంతోత్సవాలు ప్రారంభమయ్యాయి.
- మే 20: తైవాన్ అధ్యక్షుడిగా మా యింగ్ జ్యో పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
- మే 22: నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది
- మే 25: కర్ణాటక శాసనసభ ఉపఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించింది.
- మే 28: నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన ముగిసింది.
- మే 30: కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం.
జూన్
[మార్చు]- జూన్ 5: 3000 మీటర్ల పరుగులో సురేంద్రసింగ్ భారత జాతీయ రికార్డు సృష్టించాడు. 16 సంవత్సరాల బహదూర్ ప్రసాద్ రికార్డు ఛేదించబడింది.
- జూన్ 7: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అనా ఇవనోవిచ్ కైవసం చేసుకొంది.
- జూన్ 8: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్ వరుసగా 4వ సారి కైవసం చేసుకున్నాడు.
- జూన్ 12: నేపాల్ రాజు జ్ఞానేంద్ర రాజభవనాన్ని ఖాళీచేసి కాఠ్మండు సమీపంలోని నాగార్జున ప్యాలెస్‌కు నివాసం మార్చాడు.
- జూన్ 15: శ్రీనగర్‌లో జరిగిన సంతోష్ ట్రోఫి ఫైనల్లో పంజాబ్ జట్టు సర్వీసెస్‌పై విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది.
- జూన్ 21: నేపాల్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల టైటిల్‌ను భారత్‌కు చెందిన చేతన్ ఆనంద్ చేజిక్కించుకున్నాడు.
- జూన్ 23: తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత దేవేందర్ గౌడ్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా.
- జూన్ 26: నేపాల్ ప్రధానమంత్రి పదవికి గిరిజా ప్రసాద్ కొయిరాలా రాజీనామా చేశాడు.
జూలై
[మార్చు]- జూలై 1: ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది.
- జూలై 5: వీనస్ విలియమ్స్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
- జూలై 6: లండన్‌లో జరిగిన వింబుల్డన్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్‌ను రాఫెల్ నాదల్ కైవసం చేసుకున్నాడు.
- జూలై 6: కరాచిలో జరిగిన ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో శ్రీలంక జట్టు 100 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించి కప్ గెలుచుకుంది.
- జూలై 8: మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి.
- జూలై 8: కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది.
- జూలై 10: సల్మాన్ రష్డీ రచించిన ప్రముఖ నవల "మిడ్నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
- జూలై 10: జమ్ము కాశ్మీర్లో గవర్నర్ పాలన విధించబడింది.
- జూలై 11: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ ప్రజా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ స్థాపించాడు.
ఆగష్టు
[మార్చు]- ఆగష్టు 1: భారత్‌కు చెందిన వైద్య దంపతులు ప్రకాష్ ఆమ్టే, మందాకినీ ఆమ్టేలకు రామన్ మెగ్సేసే అవార్డు లభించింది.
- ఆగష్టు 3: హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 145 భక్తులు మృతి చెందారు.
- ఆగష్టు 11: బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్లో స్వర్ణపతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం రావడం భారత్‌కు ఇదే తొలిసారి.
- ఆగష్టు 16: పరాగ్వే నూతన అధ్యక్షుడిగా ఫెర్నాండో ల్యూగో ప్రమాణస్వీకారం చేశాడు.
- ఆగష్టు 26: తెలుగు సినిమా నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు.
- ఆగష్టు 29: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూ సోరెన్ మరోసారి పీఠాన్ని అధిష్టించాడు.
- ఆగష్టు 29: శ్రీకృష్ణ నేతృత్వంలోని 6వ వేతన సంఘం సిపార్సులను భారత ప్రభుత్వం ఆమోదించింది.
- ఆగష్టు 30: పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత కృష్ణకుమార్ బిర్లా కోల్‌కతలో మరణించాడు.
సెప్టెంబర్
[మార్చు]- సెప్టెంబర్ 1: భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్‌గా దువ్వూరి సుబ్బారావు నియమితులైనాడు.
- సెప్టెంబర్ 1: హైదరాబాదులోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇస్రో పరిధిలోకి తీసుకువచ్చారు. ఇదివరకు ఎన్.ఆర్.ఎస్.ఏ.అంతరిక్ష విభాగం అధీనంలో ఉండేది.
- సెప్టెంబర్ 4: లియాండర్ పేస్ అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ టైటిట్ కైవసం చేసుకున్నాడు. కారా బ్లాక్ (జింబాబ్వే) తో జతకట్టిన పేస్ ఫైనల్లో 7-6 (8-6), 6-4 స్కోరుతో లీజెల్ హ్యూబెర్, జేమీ ముర్రేలపై విజయం సాధించారు.
- సెప్టెంబర్ 5: బెంగుళూరులో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ కు చెందిన పంకజ్ అద్వానీ విజయం సాధించాడు.
- సెప్టెంబర్ 17: థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్‌సవత్ ఎన్నికైనాడు.
- సెప్టెంబర్ 17: బీజింగ్‌లో పారాలింపిక్స్ క్రీడలు ముగిశాయి. 89 స్వర్ణాలతో సహా మొత్తం 211 పతకాలు సాధించి చైనా ప్రథమస్థానం పొదగా, బ్రిటన్, అమెరికాలు రెండో, మూడో స్థానాలలో నిలిచాయి.
- సెప్టెంబర్ 27: చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది.
- సెప్టెంబర్ 27: ఇరానీ ట్రోఫి క్రికెట్‌ను రెస్టాఫ్ ఇండియా విజయం సాధించింది. ఈ ట్రోఫీ రెస్టాఫ్ ఇండియా చేజిక్కించుకోవడం ఇది 21వ సారి. వదోదరలో జరిగిన ఫైనల్లో ఢిల్లీ జట్టుపై 187 పరుగుల ఆధిక్యతతో గెల్చింది.
- సెప్టెంబర్ 27: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితులైనాడు. కార్యదర్శి పదవి ఎన్.శ్రీనివాసన్‌కు దక్కింది.
- సెప్టెంబర్ 28: అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
- సెప్టెంబర్ 28: సింగపూర్ గ్రాండ్‌ప్రిని గెలిచి తొలి రాత్రి ఫార్మూలా-1 రేసు విజేతగా నిల్చి ఫెర్నాండో అలోన్సో రికార్డు సృష్టించాడు.
- సెప్టెంబర్ 29: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ పెండ్యాల హరికృష్ణ స్పైస్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంటు విజేతగా నిలిచాడు.
- సెప్టెంబర్ 30: రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 పైగా భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు.
అక్టోబర్
[మార్చు]- అక్టోబర్ 2: భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.
- అక్టోబర్ 5: జర్మనీలో జరిగిన బిట్‌బర్గర్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో చేతన్ ఆనంద్ టైటిల్ సాధించాడు. చేతన్ ఆనంద్ భార్య గుత్తా జ్వాల మిక్స్డ్ డబుల్స్‌లో విజయం సాధించింది.
- అక్టోబరు 22: భారతదేశం తొలి మానవరహిత చంద్రమండల నౌక చంద్రయాన్-1ను ప్రయోగించింది.
- అక్టోబర్ 31: తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీన హోదా కల్పించబడింది.
నవంబర్
[మార్చు]- నవంబర్ 2: అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ నుండి అనిల్ కుంబ్లే రిటైర్మెంట్.
- నవంబర్ 26: ముంబాయిలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 200పైగా మృతి చెందారు.
డిసెంబర్
[మార్చు]- డిసెంబర్ 6: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రిగా అశోక్ చవాన్ నియామకం.
- డిసెంబర్ 8: ఢిల్లీ, రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించింది. మధ్య ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది.
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]- జనవరి 7: ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త. (జ.1927)
- జనవరి 11: ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు. (జ.1919)
- జనవరి 17: బాబీ ఫిషర్, చదరంగం క్రీడాకారుడు.
- జనవరి 20: సయ్యద్ హుసేన్ బాషా, నాటక, చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత. (జ.1939)
- జనవరి 27: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (జ.1921)
- ఫిబ్రవరి 6 : కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. (జ.1950)
- ఫిబ్రవరి 9: మరళీధర్ దేవదాస్ ఆమ్టే, సంఘసేవకుడు. (జ.1914)
- ఫిబ్రవరి 25: హంస్రాజ్ ఖన్నా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి.
- మార్చి 19: రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు. (జ.1958)
- మార్చి 20: శోభన్ బాబు, తెలుగు సినీ నటుడు. (జ.1937)
- ఏప్రిల్ 13: విరంచిదాస్, పరుగుల బాలుడు బుధియాసింగ్ మాజీ కోచ్.
- మే 1: నిర్మలా దేశ్‌పాండే, గాంధేయవాది, రాజ్యసభ సభ్యురాలు. (జ.1929)
- జూన్ 14: నాగభైరవ కోటేశ్వరరావు, కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత. (జ.1931)
- జూన్ 22: జార్జ్ కార్లిన్, అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు,, రచయిత. (జ.1937)
- జూన్ 24: మల్లికార్జునరావు, తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు. (జ.1960)
- జూన్ 27: మానెక్షా, భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. (జ.1914)
- జూలై 7: వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (జ.1963)
- ఆగష్టు 3: పువ్వుల లక్ష్మీకాంతం, తొలితరం సినిమా నటి, గాయని, నర్తకీమణి, రంగస్థల నటి.
- ఆగష్టు 13: శాండీ అల్లెన్ Archived 2011-08-10 at the Wayback Machine, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7'7 1/4" (232 సెంటిమీటర్లు). (జ.1955)
- ఆగష్టు 30: కృష్ణ కుమార్ బిర్లా, పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (జ.1918)
- సెప్టెంబర్ 16: గోవాడ మల్లికార్జునరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి.
- సెప్టెంబర్ 27: మహేంద్ర కపూర్, సినీ గాయకుడు.
- సెప్టెంబర్ 27: పాల్ న్యూమన్, హాలీవుడ్ నటుడు.
- సెప్టెంబరు 29: జాగర్లమూడి వీరాస్వామి, హేతువాది, వృత్తిరీత్యా న్యాయవాది అయిన వీరాస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ మాజీ కమిషన్ ఛైర్మన్. (జ.1919)
- సెప్టెంబర్ 29: పేర్వారం జగన్నాథం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త. (జ.1934)
- అక్టోబర్ 3: ఆర్.ఎస్.లోధా, చార్టర్డ్ అక్కౌంటెంట్, బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు.
- అక్టోబర్ 8: చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త సంఘ సేవకురాలు, చిత్రకారిణి. (జ.1917)
- నవంబర్ 27: విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (జ.1931)
- డిసెంబరు 5: కొమ్మినేని శేషగిరిరావు, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (జ.1939)
- డిసెంబరు 14: జ్వాలాముఖి, రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. (జ.1938)
- డిసెంబర్ 17: భార్గవి, సినీ నటి.
పురస్కారాలు
[మార్చు]- రైట్ లివ్లీహుడ్ అవార్డు: భారత్‌కు చెందిన కృష్ణమ్మాళ్, శంకరలింగంజగన్నాథన్ దంపతులకు.
- నోబెల్ బహుమతులు: