తాళ్ళపాక
తాళ్ళపాక, ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం గ్రామం. ఇది మండల కేంద్రమైన రాజంపేట నుండి 5 కి. మీ. దూరంలో ఉంది.
తాళ్ళపాక | |
---|---|
![]() | |
అక్షాంశ రేఖాంశాలు: 14°16′N 79°9′E / 14.267°N 79.150°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య |
మండలం | రాజంపేట |
విస్తీర్ణం | 12.43 కి.మీ2 (4.80 చ. మై) |
జనాభా (2011)[1] | 7,658 |
• జనసాంద్రత | 620/కి.మీ2 (1,600/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 3,862 |
• స్త్రీలు | 3,796 |
• లింగ నిష్పత్తి | 983 |
• నివాసాలు | 1,834 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 516115 |
2011 జనగణన కోడ్ | 593650 |
ఈ గ్రామం పదకవితా పితామహుడు, అన్నమాచార్యుడు పుట్టిన ఊరుగా చారిత్రక ప్రసిద్ధి పొందింది.
భౌగోళికం
[మార్చు]
కడప - రాజంపేట రహదారిలో రాజంపేటకు సమీపంలో ప్రధాన రహదారి నుండి తూర్పుగా 3 కి.మీ. దూరంలో తాళ్ళపాక గ్రామం వుంది.
చారిత్రక ప్రాముఖ్యత
[మార్చు]కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని 32 వేల కీర్తనలతో ఆరాధించిన పదకవితా పితామహుడు, అన్నమాచార్యుడు సా.శ. 1426వ సంవత్సరం క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున తాళ్లపాకలో జన్మించాడు. తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. అన్నమయ్య చిన్నప్పుడే తిరుమల చేరుకున్నాడు. తల్లిదండ్రులు కోరగా తిరిగి తాళ్ళపాకకు వచ్చి వివాహం చేసుకున్నా తిరిగి తిరుమలకు వెళ్ళాడు. "చందమామ రావే జాబిల్లి రావే", "అదివో అల్లదివో శ్రీహరివాసము" వంటి ఆయన పాటలు ప్రాచుర్యం పొందాయి. ఆయన ఇల్లాలు తిమ్మక్క సుభద్రాపరిణయం రచించింది. తెలుగులో ఆమే తొలి కవయిత్రి. అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుడు కూడా కీర్తనలు రచించాడు.
జనగణన వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1834 ఇళ్లతో, 7658 జనాభాతో 1243 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3862, ఆడవారి సంఖ్య 3796. [2]
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 15, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉంది. 2 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. సమీప బాలబడి, సమీప జూనియర్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం రాజంపేట లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, కడప లో ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు
[మార్చు]రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి.
భూమి వినియోగం
[మార్చు]భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 114 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 348 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 84 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 12 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 106 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 416 హెక్టార్లు
- బంజరు భూమి: 53 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 107 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 486 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 91 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 91 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]దర్శనీయ ప్రదేశాలు
[మార్చు]తాళ్ళపాకలో చెన్నకేశవాలయం, సుదర్శనాలయం ఉన్నాయి. సుదర్శనాలయంలో సుదర్శన చక్రం ప్రతిష్ఠించబడి ఉంది. సుదర్శన చక్రం కాశీలో తప్ప మరెక్కడా లేదు. తాళ్ళపాకలో సిద్ధేశ్వరాలయం కూడా ఉంది. ఈ ఆలయాలు 9, 10 శతాబ్దాల నాటివి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1982లో అన్నమయ్య ఆరాధన మందిరాన్ని నిర్మించి ఆ మందిరంలో అన్నమయ్య విగ్రహాన్ని నెలకొల్పారు.
చిత్రమాలిక
[మార్చు]-
చెన్నకేశవస్వామి ఆలయ ముఖద్వారం
-
చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులు
-
అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య విగ్రహం
-
సిద్ధేశ్వరస్వామి ఆలయం
-
కళామందిరం పక్కన మండపంలో అన్నమయ్య విగ్రహం
-
కడప- తిరుపతికి ప్రధాన రహదారిలో తాళ్ళపాక గ్రామానికి ముఖద్వారం
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
వెలుపలి లంకెలు
[మార్చు]వైఎస్ఆర్ జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి, విద్వాన్ కట్టా నరసింహులు