అక్టోబర్ 2
స్వరూపం
అక్టోబర్ 2, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 275వ రోజు (లీపు సంవత్సరములో 276వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 90 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1535: ఫ్రెంచ్ విశ్లేషకుడు జాక్యూస్ కార్టైర్ 1535 అక్టోబరు 2న హోచెలాగా (మాట్రియల్ చూడండి) ను సందర్శించాడు, హోచెలాగాలో నివాస ప్రజలు "వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం" నుండి ఉంటున్నట్లు అంచనా వేశాడు.
- 1844: మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రిక క్రిసెంట్‌ను గాజుల లక్ష్మీనర్సు శెట్టి స్థాపించారు.
- 1845: భారతదేశంలో మొదటి షిప్పింగ్ కంపెనీ ప్రారంభమైంది
- 1934: భారత నావికాదళం ( అప్పటి పేరు రాయల్ ఇండియన్ నేవీ) స్థాపించబడింది.
- 1951: శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు
- 1952: సంఘ ప్రెంపుదల కార్యక్రమం ప్రారంభమైంది.
- 1954: ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న చందర్‌నగర్ పశ్చిమ బెంగాల్‌లో భాగంగా మారింది
- 1955: చెన్నై లోని పెరంబూరులో ఉన్న సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము (ICF) తన పనులు మొదలుపెట్టింది.
- 1961: బొంబాయిలో (నేటి ముంబై) షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది.
- 1966: భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే ఏర్పడింది.
- 1971: అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి గాంధీ సదన్‌గా ఇప్పుడు మనకు తెలిసిన బిర్లా హౌస్‌ను దేశానికి అంకితం చేశారు . ఇక్కడే మహాత్మా గాంధీ హత్య జరిగింది.
- 1972: భారతదేశపు మొట్టమొదటి టెలివిజన్ స్టేషన్ బొంబాయిలో మొదలయ్యింది.
- 1985: వరకట్న నిషేధ సవరణ చట్టం అమలులోకి వచ్చింది
- 1988: సెప్టెంబర్ 17 నుంచి దక్షిణ కొరియాలోని సియోల్లో మొదలయిన 24వ ఒలింపిక్ క్రీడలు ముగిసాయి.
- 1988: తమిళనాడులోని మండపం ఇంకా పంబన్ నడుమ సముద్రంపై పొడవైన వంతెన తెరవబడింది.
- 1991: బీహార్ రాజధాని పాట్నా ఇంకా క్రొత్త ఢిల్లిల నడుమ శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ను మొదలుపెట్టారు
- 1992: ఒడిషా రాష్ట్రంలోని పట్టణం, మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి వేరుచేయబడింది.
- 1994: 12వ ఆసియా క్రీడలు జపాన్ లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి.
- 2004: అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన రెండు బాంబు ప్రేళుల్లలో 57 మంది ప్రజలు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
- 2006: అణు ఇంధన సరఫరా సమస్యపై భారత్‌కు మద్దతు ఇవ్వాలని దక్షిణాఫ్రికా నిర్ణయించింది.
- 2008: భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది
- 2009: తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మంత్రాలయం లతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.
- 2012: తెదేపా అధినేత చంద్రబాబు చేసిన 'వస్తున్నా మీకోసం' 208 రోజుల పాదయాత్ర మొదలుపెట్టారు.
- 2014: స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం మొదలయ్యింది.
- 2016: భారతదేశంలో విద్య విధానాలమీద సంస్కరణల కోసం దేశంలో వున్నా స్వచ్ఛంద సంస్థలను, యువతను భాగస్వామ్యం చేస్తూ దేశంలో యువత ద్వారా సంస్కరణల స్థాపనే ఏకైక లక్ష్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో యూత్ పార్లమెంట్ ప్రోగ్రాం (వైపిపి) ఏర్పడింది
జననాలు
[మార్చు]- 1852: విలియం రామ్సే, స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (మ.1916)
- 1869: మహాత్మా గాంధీ, భారత జాతిపిత. (మ.1948)
- 1891: కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (మ.1962)
- 1902: అన్నాప్రగడ కామేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1987).
- 1904: లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (మ.1966)
- 1908: పర్వతనేని బ్రహ్మయ్య, ఛార్టర్డ్ అకౌంటెంట్. (మ.1980)
- 1910: డి. అర్కసోమయాజి, ఆంధ్ర విద్యావేత్త
- 1911: అంబత్ మీనన్, కేరళ విద్యావేత్త
- 1911: జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (మ.1997)
- 1923: ఎం.శాంతప్ప, రాయలసీమకు చెందిన విద్యావేత్త, మాజీ వైస్‌ఛాన్స్‌లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (మ.2017).
- 1924: తపన్ సిన్హా, ప్రముఖ సినీ దర్శకుడు (మ. 2009)
- 1926: నల్లా నరసింహులు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, సిపిఐ నాయకుడు. (మ. 1993)
- 1928: ఎస్.వి.జోగారావు, సాహిత్యవేత్త. (మ.1992)
- 1931: తాడూరి బాలాగౌడ్, భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడు. (మ.2010)
- 1935: ఎన్.నిత్యానంద్ భట్, చలనచిత్ర నిర్మాత
- 1942: ఆశా పరేఖ్, ప్రముఖ సినీ నటి
- 1943: కావూరు సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.
- 1943: మినతీ సేన్, భారత 12, 13, 14 లోక్ సభ సభ్యుడు.
- 1961: సోలిపేట రామలింగారెడ్డి, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ.2020)
- 1974: రచనా బెనర్జీ, ఒరియా, బెంగాలీ, దక్షిణాది చిత్రాలనటీ.
- 1900 : అక్టోబర్ 2 లీలా రాయ్ జన్మించింది
- 1974: Veldi Indira అక్టోబర్ 2 జన్మించింది
మరణాలు
[మార్చు]- 1422: ఫిరుజ్ షా బహమనీ.
- 1906: రాజా రవివర్మ, ప్రముఖ చిత్రకారుడు (జ. 1848)
- 1961: శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి. (జ.1906)
- 1974: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (జ.1900)
- 1975: కుమారస్వామి కామరాజ్, తమిళనాడుకు చెందిన భారత రాజకీయనాయకుడు.
- 1982: సి.డి.దేశ్‌ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్‌ముఖ్ భర్త. (జ.1896)
- 1992: హొన్నప్ప భాగవతార్, దక్షిణ భారత కర్ణాటక సంగీతకారుడు, నాటకరంగ ప్రముఖులు. (జ. 1915)
- 2018: ఎం.వి.వి.ఎస్. మూర్తి, విశాఖపట్నం లోని గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు అమెరికా లోని అలాస్కాలో మరణం (జ. 1938 జూలై 3).
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- గాంధీ జయంతి. (అంతర్జాతీయ అహింసా దినం, )
- లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.
- అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం.
- ప్రపంచ సాధు జంతువుల రోజు.
- మానవ హక్కుల పరిరక్షణ దినం .
- గ్రామ స్వరాజ్ డే.
- ఖైదీల దినోత్సవం.
- జాతీయ ఖాదీ దినోత్సవం
- దానోత్సవ వారం (జాయ్ ఆఫ్ గివింగ్) అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు.
- మాదకద్రవ్య వినిమయ వ్యతిరేక దినం[1]
బయటి లింకులు
[మార్చు]- BBC: On This Day Archived 2007-01-20 at the Wayback Machine
- This Day in History Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 2
- చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 1: అక్టోబర్ 3: సెప్టెంబర్ 2: నవంబర్ 2:- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |
మూలాలు
[మార్చు]- ↑ telugu, NT News (2022-10-02). "October 2 | గాంధీ జయంతి మాత్రమే కాదు.. ఈ రోజుకు మరెన్నో విశేషాలున్నయ్ !!". Namasthe Telangana. Retrieved 2022-10-02.