శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
![]() | |
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ |
స్థానికత | ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్ |
తొలి సేవ | అక్టోబర్ 2, 1991 |
ప్రస్తుతం నడిపేవారు | తూర్పు మధ్య రైల్వే మండలం |
మార్గం | |
మొదలు | రాజగిరి |
ఆగే స్టేషనులు | 30 |
గమ్యం | న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ |
ప్రయాణ దూరం | 1,101 కి.మీ. (684 మై.) |
సగటు ప్రయాణ సమయం | 21 గంటలు |
రైలు నడిచే విధం | రోజూ |
సదుపాయాలు | |
శ్రేణులు | AC 1st Class, AC 2 Tier, AC 3 Tier, Sleeper 3 Tier, General |
కూర్చునేందుకు సదుపాయాలు | కలదు |
పడుకునేందుకు సదుపాయాలు | కలదు |
ఆహార సదుపాయాలు | పాంట్రీకార్ కలదు |
సాంకేతికత | |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 52 km/h (32 mph) average with halts avg speed between ghaziabad and moradabad is 70 kmph |
శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, తూర్పు మధ్య రైల్వే మండలం ద్వారా నిర్వహిస్తున్న రోజువారి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.ఇది బీహార్ రాష్టంలో గల నలంద ప్రాంతానికి సమీపంలో గల రాజగిరి నుండి బయలుదేరి భారతదేశ రాజధాని అయిన క్రొత్త ఢిల్లి చేరుతుంది.
చరిత్ర
[మార్చు]శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను బీహార్ రాజధాని పాట్నా ,క్రొత్త ఢిల్లి ల మద్య 1991 అక్టోబర్ 2 న ప్రారంభించారు.నలందా ఎక్స్‌ప్రెస్ ను రాజగిరి,క్రొత్త ఢిల్లి మధ్య నడిచే రైలు భోగీలను పాట్నా లో శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కు కలపడం,లేదా తొలగించడం జరిగేది.తరువాతి కాలంలో పూర్తిస్థాయిలో శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్లను కేటాయించడం జరిగింది.మొదటగా శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను ఉత్తర రైల్వే నిర్వహించినప్పటికి తరువాత దీనిని తూర్పు మధ్య రైల్వే మండలం నిర్వహించడం జరుగుతున్నది.
ప్రయాణ మార్గం
[మార్చు]శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బీహార్ రాష్టంలో గల రాజగిరి నుండి ఉదయం 8గంటలకు 12391నెంబరుతో బయలుదేరి,మరుసటిరోజు ఉదయం 05గంటల 10నిమిషాలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ను చేరుతుంది తిరుగుప్రయాణంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 12392 నెంబరుతో 01గంట 15నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10గంటల 10నిమిషాలకు రాజగిరి చేరుతుంది.
ప్రయాణ సమయం
[మార్చు]శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బీహార్ రాష్టంలో గల రాజగిరి నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మధ్యగల 1102 కిలొక్వ మీటర్ల దూరాన్ని 21గంటల 10నిమిషాల సమయంతో గంటకు 52కిలో మీటర్ల సగటు వేగంతో అధిగమిస్తున్నది.
స్థానికత
[మార్చు]శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ,ఉత్తర ప్రదేశ్,బీహార్ రాష్టాల్లో ముఖ్యప్రాంతాలైన నలందా,పాట్నా,బక్సార్,వారణాశి,లక్నో,బరేలీ,ఘజియాబాద్ ల మీదుగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ను చేరుతుంది.
ట్రాక్షన్
[మార్చు]శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మొదటగా WDM-2 రెండు డీజిల్ ఇంజన్లను ఉపయోగించినప్పటికి,ప్రస్తుతం ఘజియాబాద్ లోకోషెడ్ అధారిత WAP 4లేదాWAP 7 లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.
కోచ్ల అమరిక
[మార్చు]శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మొదటి తరగతి ఎ.సి భోగీ 1,రెండవ తరగతి ఎ.సి భోగీ 1,మూడవ తరగతి ఎ.సి భోగీలు 3,12 స్లీపర్ భోగీలు,4 జనరల్ భోగీలు,1 పాంట్రీకార్ తో కలిపి మొత్తం 24 భోగీలుంటాయి.
Loco | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
![]() |
SLD | UR | UR | S1 | S2 | S3 | S4 | S5 | S6 | S7 | S8 | S9 | S10 | S11 | S12 | PC | B1 | B2 | B3 | A1 | HA1 | UR | UR | SLR |