నవంబర్ 5
స్వరూపం
నవంబర్ 5, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 309వ రోజు (లీపు సంవత్సరములో 310వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 56 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2025 |
సంఘటనలు
[మార్చు]- 1556: రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బరు సైన్యం హేమును ఓడించిన రోజు. అప్పటికి అక్బరుకు పదమూడేళ్లు. సైన్యాధ్యక్షుడు బైరాంఖాన్ ఆధ్వర్యంలో మొఘలులకు ఈ విజయం సొంతమైంది.
- 1605: బ్రిటిష్ పార్లమెంటు భవనాన్ని పేల్చివేసేందుకు రోమన్ క్యాథలిక్కులు పన్నిన కుట్ర విఫలమైన రోజు. దీన్నే 'గన్‌పౌడర్ ప్లాట్' అంటారు. 'గై ఫాకెస్' అనే వ్యక్తి పేలుడు సామగ్రితో పార్లమెంటు లోపలికి వెళ్తుండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. నాటి నుంచి ఏటా నవంబర్ 5న ఇంగ్లండ్‌లో బాణాసంచా కాల్చి 'గై ఫాకెస్ డే'గా జరుపుకుంటారు.
- 1895: జార్జ్ సెల్డెన్ రూపొందించిన గ్యాసోలిన్‌తో నడిచే ఇంజిన్‌కు పేటెంటు హక్కులు లభించాయి. అమెరికన్ ఆటోవెుబైల్ రంగానికి సంబంధించినంత వరకూ ఇదే మొదటి పేటెంటు.
- 1920: భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది.
- 1951: పశ్చిమ, మధ్య రైల్వేలు ముంబయిలో ఏర్పాటయ్యాయి.
- 1967: ఏటీఎస్-3 కృత్రిమ ఉపగ్రహాన్ని అమెరికా ప్రయోగించింది. రోదసి నుంచి పూర్తిస్థాయిలో భూమి ఛాయాచిత్రాలను తీసిన మొదటి ఉపగ్రహం అది.
- 1976: ఎమర్జెన్సీ కాలం. లోక్‌సభ పదవీకాలం ముగిసినా, మరో సంవత్సరం పాటు ఈ కాలాన్ని తనకు తానే పొడిగించుకుంది.
- 1977: భారత విదేశ వ్యవహారాల శాఖా మంత్రి, అటల్ బిహారీ వాజపేయి, ఐక్యరాజ్యసమితిలో హిందీ లో ప్రసంగించాడు.
- 1976: భారత లోక్‌సభ స్పీకర్‌గా భలీరామ్ భగత్ పదవిని స్వీకరించాడు.
- 1989: అంతర్జాతీయ ఒకరోజు క్రికెట్ పోటీల్లో బ్యాట్స్‌మన్‌గా సచిన్ టెండూల్కర్ అరంగేట్రం.
జననాలు
[మార్చు]- 1877: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (మ.1950)
- 1892: జె.బి.ఎస్. హాల్డేన్, బ్రిటిష్ జన్యు శాస్త్రవేత్త. (మ.1964)
- 1925: ఆలూరి బైరాగి, తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మానవతావాది. (మ.1978)
- 1952: వందన శివ, ఒక తత్త్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ, స్త్రీవాద రచయిత్రి.
- 1995:మోహ్రీన్ పిర్జాదా, హిందీ, తెలుగు, చిత్రాల నటి, మోడల్.
మరణాలు
[మార్చు]- 1972: సుభద్రా శ్రీనివాసన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (జ.1925)
- 1987: దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (జ.1925)
- 1993: నల్లా నరసింహులు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, సిపిఐ నాయకుడు. (జ. 1926)
- 1995: ఇల్జక్ రాబిన్, ఇజ్రాయిల్ మాజీ ప్రధానమంత్రి.
- 2019: కర్నాటి లక్ష్మీనరసయ్య నటుడు, ప్రయోక్త, దర్శకుడు, జానపద కళాకారుడు. (జ.1927)
పండుగలు, జాతీయ దినాలు-
[మార్చు]. ప్రపంచ సునామీ దినోత్సవం
- -
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 5
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబర్ 4 - నవంబర్ 6 - అక్టోబర్ 5 - డిసెంబర్ 5 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |