Jump to content

కచార్ జిల్లా

వికీపీడియా నుండి
కచార్ జిల్లా
View from an aeroplane
సిల్చార్ విహంగ వీక్షణ
Cachar district's location in Assam
Cachar district's location in Assam
Countryభారతదేశం
Stateఅసోం
Administrative DivisionHills and Barak Valley
ప్రధాన కార్యాలయంSilchar
విస్తీర్ణం
 • Total3,786 కి.మీ2 (1,462 చ. మై)
జనాభా
 (2011)
 • Total17,36,391
 • జనసాంద్రత460/కి.మీ2 (1,200/చ. మై.)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-AS-CA
అధికార languageBengali (Bangla)
Websitehttp://cachar.gov.in/

కచార్ జిల్లా, (అస్సామీ:কাছাড় জেলা), (బెంగాలీ:কাছাড় জেলা) భారతదేశం, అస్సాం రాష్ట్రం లోని జిల్లా. ఒకటి. దింసా పదం కచారీ నుండి కచార్ అనే పేరు వచ్చింది. జిల్లా కేంద్రంగా సిల్చార్ ఉంది. కాచర్ కచారీ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. మదూయుగంలో కచారీ రాజ్యాన్ని దింసా అనేవారు.

చరిత్ర

[మార్చు]

స్వాతంత్ర్యానికి ముందు

[మార్చు]

కచార్ ప్రాంతం హైలకండి, కరీంగంజ్ ప్రాంతాలతో చేర్చి ఒకప్పుడు కచారి సామ్రాజ్యంలో భాగంగా ఉంది. కచార్ చివరి రాజుగా రాజా గోవింద చంద్రధ్వజ నారాయణా హంసు కాలంలో కాచర్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. బ్రిటిష్ సామ్రాజ్యంలో మిళితం చేయబడిన భారతీయ రాజ్యాలలో కాచర్ ఒకటి. కాచర్ ప్రాతాన్ని ఇద్దరు పాలించారు. రాకురుడైన రాజా గోవింద చంద్రధ్వజ నారాయణా హంసు రెండవ పాలకుడయ్యాడు. 1832లో రాజా గోవింద చంద్రధ్వజ నారాయణా హంసును గంభీర్ సింగ్ కాల్చి చంపిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం కాచర్ రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో మిళితం చేసింది. తరువాత ఈ కొండ రాజ్యానికి తులారాంను రాజప్రతినిధిగా చేసాడు. 1854లో తులారాం మరణించిన తరువాత ఆయన పాలించిన భూభాగం కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపబడింది. తరువాత మొత్తం కాచర్ బ్రిటిష్ ఆధీనం అయింది.[1]

స్వాతంత్రోద్యమం

[మార్చు]

స్వాతంత్ర్య సమరంలో ఈ జిల్లా ప్రజలు చురుకుగా పాల్గొన్నారు. కామిని కుమార్ చంద్ర, ఆయన కుమారుడు అరుణ్ కుమార్ చంద్ర, అబ్దుల్ ముతాలిబ్ మజుందార్ మొదలైన స్వాతంత్ర్య సమరయోధులు ఈ జిల్లా వాసులే అన్నది గుర్తించతగిన విషయం. వీరు ప్రజలను స్వాతంత్ర్య సమరంలో పోరాడడానికి సమాయత్తం చేసారు. చంద్ర బెంగాలీ హిందువులకు మద్దతుగా నిలిచాడు. ప్రముఖ ముస్లిం నాయకుడు మజుదార్ ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ (ఈయన తరువాత భారతదేశ అద్యక్షుడుగా నియమించబడ్డాడు) తో కలిసి ముస్లిములకు అండగా నిలబడి హిందూముస్లిం సమైక్యతకు పాటుబడ్డాడు. తూర్పు భారతంలో వీరు విభజనవాద ముస్లిములకు ఎదురు నిలిచి పోరాడారు. అధికరిస్తున్న ముస్లిం లీగ్ ప్రాబల్యం తగ్గించడానికి ఈయన " జమైత్ ఉల్లేహ్- ఈ - హింద్" ఉద్యమం జరిపాడు. కాంగ్రెస్ పార్టీకి ముస్లిముల మద్దతు లభించడానికి జమైత్ వారధిగా నిలిచింది. 1945 ఇండియన్ జనరల్ ఎన్నికలలో మజుందర్ హైలకండి నియోజకవర్గంలో ముస్లిం లీగ్‌కు ఎదురుగా నిలిచి విజయం సాధించాడు. ఈ విజయం దక్షిణ అస్సాం ముస్లిం లీగ్ విశ్వాసాన్ని బలంగా దెబ్బతీసింది.

సుర్మా లోయ

[మార్చు]

అస్సాం సుర్మా వెల్లీ (ప్రస్తుతం ఇది కొంత బంగ్లాదేశ్లో ఉంది) లో ముస్లిములు అధికంగా ఉన్నారు. స్వతత్రం పొందిన సమయంలో ముస్లిం లీగ్, జాతీయ కాంగ్రెస్ ప్రేరిత ఉద్యమకారుల ఉద్రేకం శిఖరాగ్రానికి చేరింది. మజుందార్ అప్పటి హోం మంత్రి కుమార్ దాస్‌తో కలిసి వెల్లీ అంతా పర్యటిస్తూ దేశ విభజన, ముస్లిం సమైక్యత గురించి ఉపన్యసించారు. 1947 ఫిబ్రవరి 20 న మౌలవి మజుందర్ అస్సాం నేషనలిస్ట్ సభను ఏర్పాటు చేసాడు. తరువాత 1947 జూన్ 20 తేదీన సిల్చర్ వద్ద కూడా పెద్ద సభ ఏర్పాటు చేయబడింది.[2] రెండు సభలు చక్కని ఫలితం ఇచ్చాయి. అస్సాం లోని బారక్ వెల్లీ ప్రాంతం ప్రత్యేకంగా కరీంగజ్ భారత్‌లో విలీనం కావడానికి మజుందర్ కూడా కృషిచేసాడు.[3][4] సైలహట్‌లో కొంతభాగం (ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఓ ఉంది) చేరడానికి " రాడ్క్లిఫ్ కమీషన్ " వద్దకు పంపబడిన దౌత్యవర్గంలో మజుందర్ కూడా ఒకడు.[5][11].

స్వాతంత్రం తరువాత చెలరేగిన మతకలవరం

[మార్చు]

1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం తరువాత భారతదేశం అంతటా మతకహాలు విజృంభించాయి. గుంపులు గుంపులుగా హిందువులు తూర్పు పాకిస్థాన్ నుండి భారతదేశంలోకి పారపోయి వచ్చారు. అలాగే ముస్లిములు తూర్పు పాకిస్థానుకు వెళ్ళారు. మతకలహాలలో అనేక మంది ప్రాణాలుకోల్పోయారు. అవిభాజిత కాచర్‌లో మజుందర్ మాత్రమే మంత్రి వర్గంలో భాగస్వామ్యం వహించాడు. పార్టీ సభ్యులు కచార్‌లో హిందూ ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారు. అలాగే పార్టీ సభ్యులు శరణార్ధుల పునరావాసానికి అత్యవసర సమాగ్రి సరఫరాకు సహకరించారు. 1960లో క్యాబినెట్ మంత్రి మొయినుల్ హాక్యూ చౌదరి (1957-1966) జిల్లాలో ప్రముఖ రాజకీయనాయకుడు అయ్యాడు. 1971లో ఆయన క్రి.శే ఇందిరా గాంధి మంత్రి సభలో పారిశ్రామిక మంత్రి అయ్యాడు. కీ.శే అరుణ్ కె.ఆర్. చంద్రా భార్య జ్యోత్స్న చందా పార్లమెంటులో స్థానం సంపాదించాడు. 1983 జూలై 1 కచార్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి కరీంగంజ్ జిల్లా ఏర్పాటు చేయబడింది.[6] 1989లో కరీంగంజ్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి హైలకండి జిల్లా ఏర్పాటు చేయబడింది. .[6]

భౌగోళికం

[మార్చు]

కచార్ జిల్లా వైశాల్యం 3786 చ.కి.మీ.[7] ఇది సౌత్ జార్జియా వైశాల్యానికి సమం.[8] జిల్లాలోని బరక్ నది ప్రధాన జలవనరుగా ఉంది. అంతేకాక దిమా హసాయో జిల్లా, మణిపూర్, మిజోరాం నుండి అనేక ఉపనదులు కూడా ప్రవహిస్తున్నాయి. జిల్లా అంతటా పలు మైదానాలు మద్యమద్యలో కొండలు విస్తరించి ఉన్నాయి. కాచర్ సరాసరి వర్షపాతం 3,000 మి.మీ. జిల్లాలో ఉష్ణమండల ఉష్ణోగ్రత నెలకొని ఉంది. తేమతో కూడిన వేడి వేసవి, చలితో కూడిన శీతాకాలం సహజం.

ఆర్ధికం

[మార్చు]

జిల్లా కేంద్రం సిల్చర్ అస్సాం లోని ప్రముఖ వ్యాపార కేంద్రాలలో ఒకటి. 2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కరీంగంజ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[9] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న అస్సాం రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి[9]

విభాగాలు

[మార్చు]
  • జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: సిల్చర్, సొనై, ధొలై, అఫర్బాండ్, లఖింపూర్, బర్ఖొల, కటిగొర్.[10]

వీటిలో ధొలై నియోజక వర్గం షెడ్యూల్డ్ కుల్లాలకు ప్రత్యేకించబడింది.[10]

  • మిగిలిన 6 అసెంబ్లీ నియోజకవర్గాలు సిల్చర్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[11]

జిల్లాలోని అధికారులు

[మార్చు]

ప్రయాణసౌకర్యాలు

[మార్చు]
View of passenger terminal.
Silchar Airport

సిల్చర్ అస్సాం రాష్ట్రంలోని 6 నగరాలలో ఒకటి. సిల్చర్ లోని కుంభీర్‌గ్రాం వద్ద " విమానాశ్రయం " ఉంది. జిల్లా నుండి ఎయిర్ ఇండియా దినసరి విమానాలు లభ్యం ఔతున్నాయి. ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్, నార్త్ ఈస్ట్ షట్టిల్స్ వంటి విమానసర్వీసులు లభిస్తున్నాయి. జిల్లాలో మీటర్‌గేజ్ రైలు సర్వీసులు లభ్యం ఔతున్నాయి. జిల్లా రహదార్లతో మిగిలిన దేశంతో అనుసంధానించబడి ఉంది. ఈశాన్య జిల్లాలతో రైలు, రహదారి మార్గాలతో కాచర్ జిల్లా చక్కగా అనుసంధానించబడి ఉంది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,736,319, [13]
ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[14]
అమెరికాలోని. నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం..[15]
640 భారతదేశ జిల్లాలలో. 278 వ స్థానంలో ఉంది.[13]
1చ.కి.మీ జనసాంద్రత. 459 [13]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.17%.[13]
స్త్రీ పురుష నిష్పత్తి. 958:1000 [13]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 80.36%.[13]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
హిందువులు 886,761
ముస్లిములు 522,051 (36.13%)
క్రైస్తవులు 31,306

భాషలు

[మార్చు]

జిల్లాలో బెంగాలీ అధికార భాషగా ఉంది. బెంగాలీ, సిల్హేటీ (బెంగాలీ భాషా కుంటుంబానికి చెందింది) ప్రజలలో వాడుకలో ఉన్నాయి. బెంగాలీ భాషతో జిల్లాలో మైటేయీ మణిపురి, బిష్ణుప్రియా మణిపురి, దింసా, రొంగ్‌మెయి భాషలు వాడుకలో ఉన్నాయి. జిల్లాలో మిజో, కుకి ప్రజలు, ఖాసి ప్రజలు కూడా స్వల్పంగా నివసిస్తున్నారు.

వృక్షజాలం , జంతుజాలం

[మార్చు]
Gibbon in a tree.
Hoolock gibbon

జిల్లాలో వృక్షజాలం అత్యధికంగా ఉష్ణమండలానికి చెందింది. జిల్లాలో ఉత్తర భూభాగంలో వర్షాధార అరణ్యాలు అధికంగా ఉన్నాయి. దక్షిణ భూభాగంలో పులి, సింహం, ఆదియన్ ఏనుగులు, హూలాక్‌గిబ్బన్, గౌర్ మొదలైన జంతువులు ఉన్నాయి. కాచర్ అరణ్యాలు ఒకప్పుడు దట్టంగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం మానవ ఆక్రమణల కారణంగా అరణ్యం సన్నగిల్లుతూ ఉంది. ఇక్కడ హూలాక్ గిబ్బన్, ఫయ్‌రే లీఫ్ మంకీ, పిగ్- టైల్డ్ మకక్యూ, స్టంప్- టైల్డ్ మకక్యూ, మస్క్డ్ ఫిన్‌ఫూట్, వైట్ - వింగ్డ్ వుడ్ డక్ మొదలైన అరుదైన జంతుజాలం కూడా ఉంది. ఆసియన్ ఏనుగులు ఇప్పటికే అంతరిచి పోయాయి.[16][17] దక్షిణ ప్రాంతంలో " ధలేశ్వరి విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ " ఉంది.[18][19] బరక్ లోయ ప్రాంతంలో " బరైల్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " మాత్రమే ఉంది. దీనిని 1980లో ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త డాక్టర్ అంవరుద్దీన్ చౌదరీ " స్థాపించాడు. .[20] ఈ అభయారణ్యం 2004 నుండి గుర్యింపును సంతరించుకుంది. .[21]

విద్య

[మార్చు]

కచార్ జిల్లాలో గుర్తింపు పొందిన పలు విద్యాసంస్థలు ఉన్నాయి. జిల్లా కేంద్రం సిల్చర్ నగరం అస్సాంలోని ప్రముఖ విద్యాకేంద్రాలలో ఒకటిగా ఉంది.సిల్చర్‌కు 18 కి.మీ దూరంలో దుర్గా కోనవద్ద సెంట్రల్ యూనివర్శిటీ, అస్సాం యూనివర్శిటీ ఉన్నాయి.[22] జిల్లాలో నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సిల్చర్) ఉంది. భారతదేశంలోని 30 నేషనల్ ఇంస్టిట్యూట్స్‌లో ఇది ఒకటి.[23] దక్షిణ అస్సాంలో ఉన్న ఒకేఒక మెడికల్ కాలేజ్ సిల్చర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ [24] శ్రీ కోన వద్ద ఐటిఐ పలు విధాల వ్యాపారాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందిస్తుంది. జిల్లాలో గురుచరణ్ కాలేజ్, కాచర్ కాలేజ్, రాధామాధవ్ కాలేజ్, రామానుజ్ గుప్తా మెమోరియల్ జూనియర్ కాలేజ్, సోనై కాలేజ్ వంటి పలు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. సిల్చర్ కాల్గియేట్ స్కూల్, కాచర్ ఉన్నత పాఠశాల, అధార్ చంద్ హైయ్యర్ సెకండరీ స్కూల్, నరసింగ్ స్కూల్, ప్రభుత్వ బాయ్స్ & గాళ్స్ స్కూల్, హోలీ స్కూల్, ప్రనబానందా హోలీ చైల్డ్ స్కూల్, ప్రనబానందా విద్యా మందిర్, సౌత్ పాయింట్ స్కూల్, మహర్షి విద్యా మందిర్, కేంద్రీయ విద్యాలయ, డాన్‌బాస్కో స్కూల్ ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. Chaudhuri Kalyan.(1999):New History of Assam & IndiaGuwahati: Oriental Book Company.
  2. Bhattacharjee, J. B. (1977). Cachar under British Rule in North East India. Radiant Publishers, New Delhi.
  3. Barua, D. C. (1990). Moulvi Matlib Mazumdar- as I knew him. Abdul Matlib Mazumdar – birth centenary tributes, pp. 8–9.
  4. Purkayashta, M. (1990). Tyagi jananeta Abdul Matlib Mazumdar. The Prantiya Samachar (in Bengali). Silchar, India.
  5. Roy, S. K. (1990). Jananeta Abdul Matlib Mazumdar (in Bengali). Abdul Matlib Mazumdar – birth centenary tributes, pp. 24–27.
  6. 6.0 6.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  7. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  8. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. South Georgia 3,718
  9. 9.0 9.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
  10. 10.0 10.1 "List of Assembly Constituencies showing their Revenue & Election District wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  11. "List of Assembly Constituencies showing their Parliamentary Constituencies wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  12. Namasthe Telangana (27 May 2022). "భ‌ళా ఐఏఎస్‌.. భ‌ళా.. మన తెలంగాణ బిడ్డ‌ నిబ‌ద్ధ‌త‌కు ప్ర‌జ‌ల హ్యాట్సాఫ్‌". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  13. 13.0 13.1 13.2 13.3 13.4 13.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  14. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est.
  15. "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nebraska 1,826,341
  16. Choudhury, A.U. (1999). Status and Conservation of the Asian elephant Elephas maximus in north-eastern India. Mammal Review 29(3): 141-173.
  17. Choudhury, A.U. (2004). Vanishing habitat threatens Phayre’s leaf monkey. The Rhino Found. NE India Newsletter 6:32-33.
  18. Choudhury, A.U. (1983). Plea for a new wildlife refuge in eastern India. Tigerpaper 10(4):12-15.
  19. Choudhury, A.U. (1983). Plea for a new wildlife sanctuary in Assam. WWF - India Newsletter 4(4):15.
  20. Choudhury, A.U. (1989). Campaign for wildlife protection:national park in the Barails. WWF-Quarterly No. 69,10(2): 4-5.
  21. Choudhury, A.U. (2005). Amchang, Barail and Dihing-Patkai – Assam’s new wildlife sanctuaries. Oryx 39(2): 124-125.
  22. Assam University, Official website
  23. Official NIT, Silchar website
  24. Official website of Silchar Medical College

వెలుపలి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

భౌగోళిక స్థితి

[మార్చు]