Jump to content

ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థానికతజార్ఖండ్,పశ్చిమ బెంగాల్,ఒడిషా,ఆంధ్ర ప్రదేశ్,తమిళనాడు,కేరళ
ప్రస్తుతం నడిపేవారుతూర్పు మధ్య రైల్వే మండలం
మార్గం
మొదలుధన్‌బాద్
ఆగే స్టేషనులు94
గమ్యంఅలప్పుఝ
ప్రయాణ దూరం2,546 kమీ. (8,353,018 అ.)
రైలు నడిచే విధంరోజూ
రైలు సంఖ్య(లు)13351/13352
సదుపాయాలు
శ్రేణులుఎ.సి 2వ తరగతి,ఎ.సి ముడవ తరగతి,స్లీపర్,సాధరణ
కూర్చునేందుకు సదుపాయాలులేదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్ కలదు
చూడదగ్గ సదుపాయాలుఇండియన్ కోచ్
వినోద సదుపాయాలులేదు
బ్యాగేజీ సదుపాయాలులేదు
సాంకేతికత
రోలింగ్ స్టాక్6
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం45 km/h (28 mph), including halts

ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు , తూర్పు మధ్య రైల్వే మండలం ద్వార నిర్వహింపబడుతున్న ఒక ఎక్స్‌ప్రెస్.ఇది జార్ఖండ్ రాష్టంలో గల ధన్‌బాద్ నుండి బయలుదేరి కేరళ లో గల అలప్పుఝ వరకు ప్రయాణిస్తుంది. 

సర్వీస్

[మార్చు]

ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ 13351 నెంబరుతో ధన్‌బాద్ లో మొదటి రోజు ఉదయం 10గంటల 30నిమిషాలకు బయలుదేరి రాంచీ,సంబల్‌పుర్,రాయగడ,విశాఖపట్నం,విజయవాడ,చెన్నై,ఈ రోడ్, సేలం,కోయంబత్తూరు,పాలక్కాడ్ లమీదుగా ప్రయాణంచేసి మూడవ రోజు రాత్రి 7గంటల 25నిమిషాలకు అలప్పుఝ చేరుతుంది.తిరుగు ప్రయాణంలో అలప్పుఝ లో ఉదయం 05గంటల 55నిమిషాలకు బయలుదేరి మూడవరోజు మధ్యహ్నం 1గంట 30నిమిషాలకు ధంబాద్ చేరుతుంది. ఈ రెలు ఒక లింకు ఎక్స్‌ప్రెస్,ఈ రైలులో ఆరు భోగీలు టాటానగర్ -అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ కు కేటాయించబడినవి.

కోచ్ల అమరిక

[మార్చు]
Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23
SLR UR S1 S2 S3 S4 S5 S6 S7 S8 PC ST1 ST2 ST3 ST4 ST5 B1 B2 B3 A1 A2 UR SLR

ట్రాక్షన్

[మార్చు]

ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ ధన్‌బాద్ నుండి రూర్కెలా వరకు టాటానగర్ లోకోషెడ్ అధారిత WAG-5 లేదా WAM-4 లోకోమోటివ్ను అక్కడి నుండి విశాఖపట్నం వరకు విశాఖపట్నం లోకోషెడ్ అధారిత WDM-3A/,లేదా WDG-3A/twins రెండు డీజిల్ ఇంజన్లను ఉపయోగిస్తారు.అక్కడినుండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను వరకు అరక్కోణం లోకోషెడ్ అధారిత WAM-4 లేదా WAP-1 లోకోమోటివ్ను,అక్కడి నుండి అలప్పుఝ వరకు రాయపురం అధారిత WAP-7 లేదాWAP-4 అధారిత లోకోమోటివ్ను లేదా,ఈ రోడ్ అధారిత WAP-4 లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.

సగటు వేగం

[మార్చు]

ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ ధన్‌బాద్ జంక్షన్ నుండి అలప్పుఝ వరకు 2548 కిలోమీటర్ల దూరాన్ని 55 గంటల్లో 46కిలోమీటర్ల సగటు వేగంతో అధిగమిస్తుంది. ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ గోమోహ్,విశాఖపట్నం,చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను,షోరనూర్ జంక్షన్ ల వద్ద తన ప్రయాణదిశను మార్చుకుంటుంది.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]