దక్షిణ కోస్తా రైల్వే జోన్ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం కేంద్రంగా భారత ప్రభుత్వం భారతీయ రైల్వేలలో కొత్త రైల్వే జోన్ (SCoR) ప్రకటించబడింది. దీని ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉంది. ఈ జోన్ నిర్వహణ కోసం అధికారిక నోటిఫికేషన్ (06.02.2025 నాటికి) ఇంకా జారీ కాలేదు.[1][2] దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కొంతమేరకు తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది.[3]
ఈ జోన్ నాలుగు డివిజనులను కలిగి ఉంది:[4] విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు. ఈ జోను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించి ఉంది (హైదరాబాద్ డివిజన్‌లోని కర్నూలు మరియు సికింద్రాబాద్ డివిజన్‌లోని జగ్గయ్యపేట మినహా). ఇది కర్ణాటక మరియు తమిళనాడు లోని చిన్న భాగాలు ఈ జోను పరిధిలోకి వస్తాయి.
వాల్తేరు డివిజను పరిధిలోని ఒక భాగం ఒడిషా రాష్ట్రం లోని ప్రాంతానికి రాయగడ కేంద్రంగా ఒక కొత్త డివిజను ఏర్పాటు చేశారు. డివిజనులోని మిగిలిన రెండవ భాగం ప్రాంతాన్ని విజయవాడ డివిజనులోకి కలిపారు.
సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోనులో హైదరాబాద్, నాందేడ్, సికింద్రాబాద్ డివిజన్లు ఉంటాయి.
తూర్పు కోస్తా రైల్వే జోను పరిధిలో రాయగడ, ఖుర్దారోడ్, సంబల్‌పూర్ డివిజన్లు ఉంటాయి.
గుంతకల్లు డివిజనులోని రాయచూరు-వాడి మధ్య ఉన్న 108 కి.మీ. రైలు మార్గాన్ని దక్షిణ మధ్య రైల్వే జోనులోని సికింద్రాబాద్ డివిజనుకు కేటాయించారు.
మధ్య రైల్వే , దక్షిణ కోస్తా రైల్వే , దక్షిణ మధ్య రైల్వే జోనులకు ఇంటర్ చేంజ్ పాయింట్‌గా వాడి సెక్షన్ ఉంటుంది.
రాయచూరు-వాడి సెక్షన్‌లో ఉన్న యడ్లపూర్, ఎర్మరాస్ థర్మల్ విద్యుత్తు కేంద్రాలను సికింద్రాబాద్ డివిజనుకు కేటాయించారు.
గుంటూరు డివిజను పరిధిలో ఉన్న జన్‌పహాడ్-విష్ణుపురం, పగిడిపల్లి-విష్ణుపురం మార్గాలలోని 142 కి.మీ. రైలు మార్గాన్ని సికింద్రాబాద్ డివిజనుకు బదిలీ చేశారు.
సికింద్రాబాద్ డివిజను పరిధిలో ఉన్న మోటుమర్రి - కొండపల్లి మార్గంలోని 46 కి.మీ. పరిధిలో ఉన్న రైలు మార్గాన్ని విజయవాడ డివిజనుకు అనుసంధానించారు.
దక్షిణ కోస్తా రైల్వే , దక్షిణ మధ్య రైల్వే జోనుల సరిహద్దుల్లో ఉన్న నార్ల తాతారావు విద్యుత్తు కేంద్రం, రాయనపాడు వాగన్ వర్కుషాప్‌లు పూర్తిగా దక్షిణ కోస్తా రైల్వే జోనులోకి కేటాయించారు.
2014 నాటి ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలో అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ ఏర్పాటులో సాధ్యాసాధ్యాలను పరిశిలించి ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ లోని అత్యధికశాతం రైల్వే మార్గం సికిందరాబాదు కేంద్రంగా పనిజేసే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండేది. దువ్వాడ మొదలు విశాఖపట్టణం, శ్రీకాకుళం మీదుగా ఇచ్ఛాపురము వరకు, విజయనగరం మొదలు పార్వతీపురము మీదుగా కూనేరు వరకు, కొత్తవలస మొదలు అరకు మీదుగా గోరాపుర్ వరకు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతపు రైల్వే మార్గం తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉండేది. ఇది భువనేశ్వర్ కేంద్రంగా పనిచేసేది. విశాఖపట్టణం వరకు ఉన్న రైళ్ళను భువనేశ్వర్ వరకూ తరలించడం వంటి చర్యలతో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పక్షపాతంతో పనిచేస్తున్నదన్న అభిప్రాయం కలిగింది.[5][6] విశాఖపట్టణం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కావాలన్న కోరిక ప్రజల్లో బలంగా ఉండేది.[7] ఈ నేపథ్యంలో 2019 ఫిబ్రవరి 27 న భారత ప్రభుత్వ రైల్వే శాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును ప్రకటించింది.
వాల్తేరు డివిజన్‌కు విశాఖపట్నం డివిజన్ (కుదించిన రూపం) అని పేరు పెట్టనున్నారు. వాల్తేరు డివిజన్ నుండి రాయగడ డివిజన్‌ను ఏర్పాటు చేసిన తర్వాత కింది విభాగాలు విశాఖపట్నం డివిజన్‌లో ఉన్నాయి.
డివిజను యొక్క అధికార పరిధి : 410 కి.మీ.
ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి జోన్ పీక్ సీజన్‌లో 500 కంటే ఎక్కువ రైళ్లను నడుపుతుంది.[8] 2020–2021 ఆర్థిక సంవత్సరానికి, ఈ జోన్ దక్షిణ తీర రైల్వే యొక్క డిపిఆర్ ప్రకారం సంవత్సరానికి ₹13,000 కోట్లు (2023లో ₹150 బిలియన్లు లేదా US$1.8 బిలియన్లకు సమానం) [9] వసూలు చేస్తుందని అంచనా.
దక్షిణ తీర రైల్వే జోన్‌లోని అనేక రైల్వే స్టేషన్లకు వై-ఫై సదుపాయం ఉంది, వీటిని రైల్‌వైర్ గూగుల్‌తో కలిసి అందిస్తోంది, అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.
అర్బన్: విశాఖపట్నం జంక్షన్, విజయవాడ జంక్షన్,గుంటూరు జంక్షన్,గుడివాడ జంక్షన్ ,తిరుపతి జంక్షన్, తిరుపతి, కాకినాడ టౌన్,నెల్లూరు, శ్రీకాకుళం రోడ్డు,భీమవరం టౌన్, సామర్లకోట, కడప, ప్రొద్దుటూరు, రేణిగుంట జంక్షన్, అనంతపురం, ఒంగోలు, గుంతకల్లు జంక్షన్, గూడూరు జంక్షన్ , తాడేపల్లిగూడెం, తెనాలి జంక్షన్ , తుని, విజయనగరం జంక్షన్, చీరాల, యాద్గిర్, మచిలీపట్నం, పాకాల జంక్షన్, రాయచూర్
సబ్ అర్బన్: పవర్‌పేట్-ఏలూరు, కొత్త గుంటూరు- గుంటూరు, దువ్వాడ-విశాఖపట్నం, అనకాపల్లి-విశాఖపట్నం, సింహాచలం-విశాఖపట్నం, సింహాచలం నార్త్-విశాఖపట్నం, మర్రిపాలెం-విశాఖపట్నం, పెందుర్తి-విశాఖపట్నం, విశాఖపట్నం, విశాఖపట్నం, గుణదల-విజయవాడ, కొవ్వూరు-రాజమండ్రి, రాయనపాడు-విజయవాడ, కాకినాడ పోర్టు-కాకినాడ, గోదావరి-రాజమండ్రి.
రూరల్: గొల్లపల్లి, బాదంపూడి, భిక్నూర్, భీమడోలు, చాగల్లు, చేబ్రోలు, దెందులూరు, దుగ్గిరాల, గన్నవరం, కృష్ణా కెనాల్ జంక్షన్, మంగళగిరి, ముస్తాబాద, నవాబ్‌పాలెం, నంబూరు, నిడదవోలు జంక్షన్, నూజివీడు, పెద్ద అవుటపల్లె, పెదవడ్లపూడి, పూళ్ళ, సంగంజాగర్లమూడి, తేలప్రోలు, గుండ్ల, వట్లూరు, తలమడ్ల, ఉప్పలవాయి. [10]
విజయవాడ, గుంతకల్లులో భారతీయ అలాగే విదేశీ రైల్వే సిబ్బందికి సేవలందించే రైల్వే పద్ధతులను బోధించడానికి, నేర్చుకోవడానికి ఈజోన్ శిక్షణా సంస్థలను కలిగి ఉంది.
ఈజోను పరిధిలో ఉన్న విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్, రాయనపాడు ప్రాంతాలలో ప్రాంతీయ, డివిజనల్ హాస్పిటల్స్, రైల్వే ఆసుపత్రులు; గుంటూరులో భారతీయ రైల్వే ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ప్రత్యేకంగా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి. [12]
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ఉత్పత్తి యూనిట్లు
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్-లోకో ఆధునికీకరణ వర్క్స్ · ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ·రైల్ కోచ్ ఫ్యాక్టరీ· రైల్ వీల్ ఫ్యాక్టరీ ·
రైలు స్ప్రింగ్ ఖార్ఖానా · గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్
భారతదేశం రైల్వే ఇంజిన్ షెడ్‌లు
డీజిల్
డీజిల్ లోకో షెడ్, గోల్డెన్ రాక్
డీజిల్ లోకో షెడ్, పూణే
మెమో
కొల్లాం మెమో షెడ్
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ప్రభుత్వ రంగ యూనిట్లు
భారత్ వాగన్, ఇంజనీరింగ్ · భారతీయ కంటైనర్ కార్పొరేషన్ · భారతీయ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ · భారతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) · ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · కొంకణ్ రైల్వే కార్పొరేషన్ · ముంబై రైలు వికాస్ కార్పొరేషన్ · రైల్ వికాస్ నిగం లిమిటెడ్ · భారతీయ రైల్‌టెల్ కార్పొరేషన్ · రైట్స్ లిమిటెడ్
స్వయంప్రతిపత్తం సంస్థలు అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు
కేంద్ర రైల్వే విద్యుదీకరణ సంస్థ · కేంద్ర కార్ఖానాలు ఆధునీకరణ సంస్థలు · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ · పరిశోధన డిజైన్, స్టాండర్డ్స్ సంస్థ · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) · రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు ·రైలు భూమి అభివృద్ధి అధికారిక సంస్థ
భారతీయ రైల్వేల కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వేల కేంద్ర శిక్షణా సంస్థలు
భారతీయ రైల్వే సివిల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే యాంత్రిక, విద్యుత్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే రవాణా నిర్వహణ సంస్థ · రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ (ఆర్పిఎఫ్) · రైల్వే స్టాఫ్ కాలేజ్
భారతదేశం బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు భారతీయ రైల్వేలు అంతర్జాలం
చెన్నై సబర్బన్ రైల్వే · మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (చెన్నై) · డార్జిలింగ్ హిమాలయ రైల్వే · ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే · హైదరాబాదు ఎమ్ఎమ్టిఎస్ · కాశ్మీర్ రైల్వే · కల్కా-సిమ్లా రైల్వే · కోలకతా సబర్బన్ రైల్వే · కోలకతా మెట్రో · కొంకణ్ రైల్వే · ముంబై సబర్బన్ రైల్వే · నీలగిరి పర్వత రైల్వే ·
గోల్డెన్ ఐ.టి. కారిడార్ · హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము · గ్రాండ్ కార్డ్ · సాహిబ్ గంజ్ లూప్ · హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము · హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము ·హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము·ఢిల్లీ-చెన్నై రైలు మార్గము· ముంబై-చెన్నై రైలు మార్గము · హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
సర్వీసులు భారతీయ రైల్వే సేవలు
భారతదేశం ఎక్స్‌ప్రెస్ రైళ్లు · భారతదేశం ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం సూపర్‌ఫాస్ట్ / మెయిల్ రైళ్లు ·డెక్కన్ ఒడిస్సీ· దురంతో· గరీబ్ రథ్ ·జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్· మహారాజా ఎక్స్‌ప్రెస్ · ప్యాలెస్ ఆన్ వీల్స్ · ప్రీమియం రైలు · రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ ·రాజధాని ఎక్స్‌ప్రెస్·శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ · గోల్డెన్ చారియట్ · లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ · రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్ ·ఫెయిరీ క్వీన్