Jump to content

ఉత్తర మధ్య రైల్వే

వికీపీడియా నుండి
(ఎన్‌సిఆర్ నుండి దారిమార్పు చెందింది)
ఉత్తర మధ్య రైల్వే జోన్ (13వ నెంబరు)

భారతదేశం లోని 18 రైల్వే జోన్‌లలో ఉత్తర మధ్య రైల్వే (North Central Railway) ఒకటి. ఉత్తర మధ్య రైల్వేలో కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషను స్థానము కాగా మొఘల్ సారాయ్ రైల్వే స్టేషను రెండవ స్థానములో ఉంది. ఈ రైల్వే జోన్ అలహాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

జోన్స్ పునరుద్దరించ బడినప్పుడు, గతకాలపు ఉత్తర రైల్వే జోన్ లోని అలహాబాద్ డివిజన్, గతకాలపు మధ్య రైల్వే జోన్ లోని విభజన అనంతరం ఏర్పడిన ఝాన్సీ రైల్వే డివిజను, కొత్త ఏర్పడిన ఆగ్రా డివిజనుతో కలిపి మూడు (డివిజన్స్) విభాగాలు ఉత్తర మధ్య రైల్వే ఉన్నాయి.

చరిత్ర

కాన్పూర్ రైల్వే స్టేషను

ఉత్తర మధ్య రైల్వే, దాని ప్రస్తుత రూపంలో, 2003 ఏప్రిల్ 1 లో ఉనికిలోకి వచ్చింది. ఉత్తర మధ్య భారతదేశం|ఉత్తర మధ్య భారతదేశం యొక్క ఒక పెద్ద ప్రాంతంలో విస్తరించి ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు ప్రస్తుతం ఉత్తర మధ్య రైల్వే|ఉత్తర మధ్య రైల్వే పరిధిలో ఉన్నాయి. 2022 సం.లో, ఉత్తర మధ్య రైల్వే జోన్ దాని నెట్‌వర్క్‌లో 100% విద్యుదీకరణను సాధించింది.[1]

డివిజన్లు

భారతదేశ కేంద్ర భూభాగానికి సేవలందిస్తున్న ఉత్తర మధ్య రైల్వేలు ఈ క్రింది మూడు విభాగాలను కలిగి ఉన్నాయి.[2]

  1. ప్రయాగ్రాజ్ రైల్వే డివిజన్
  2. ఝాన్సీ రైల్వే డివిజన్
  3. ఆగ్రా రైల్వే డివిజన్

విస్తరణ పరిధి

  • రైల్వేకు భౌగోళికంగా ఉత్తర మధ్య రైల్వే గుండెకాయ లాంటిది. ఇది ఉత్తరాన ఘజియాబాద్ (తప్ప) నుండి తూర్పున న్యూఢిల్లీ-హౌరా ట్రంక్ మార్గంలో మొఘల్సరాయ్ (తప్ప) వరకు మరియు న్యూఢిల్లీ ముంబై/చెన్నై కారిడార్‌లోని పాల్వాల్ (తప్ప) నుండి బినా (తప్ప) వరకు విస్తరించి ఈ జోన్ విస్తరించి ఉంది.ఉత్తర మధ్య రైల్వే ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలను విస్తరించి ఉంది, ఇందులో ప్రధానంగా డబుల్ లైన్-విద్యుదీకరించబడిన విభాగాలు ఉన్నాయి, ఇవి స్వర్ణ చతుర్భుజం యొక్క సైడ్స్ (భుజాలు) మరియు డయాగ్నల్స్ (వికర్ణాలను) లను నిర్వచిస్తాయి.[3]
  • ఈ జోన్‌లో ప్రధానంగా మొత్తం 3062 రూట్ కిలోమీటర్లుతో డబుల్ లైన్ విద్యుదీకరించిన విభాగంఉన్నది.
  • ఈ విద్యుదీకరించిన మార్గం లోని ఒక భాగమయిన ఘజియాబాద్ నుండి మొఘల్‌సరాయి (వారణాసి) మార్గము గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రూట్ (మార్గము) లోని ఒక భాగం అయి ఉంది.
  • ఈ జోన్‌లో 202 ప్రధాన లైన్ స్టేషన్లు, 221 శాఖ లైన్ స్టేషన్లు ఉన్నాయి.
  • ఈ జోన్ అన్ని దిక్కులకు ఒక రైల్వే కారిడార్‌గా విభాసిల్లు చున్నది. అనగా ప్రతి రోజు తూర్పు నుండి ఉత్తరమునకు, ఉత్తరము నుండి తూర్పునకు 29 జతల మెయిల్/ఎక్స్‌ప్రెస్‌లు, పడమర/దక్షిణము నుండి ఉత్తరమునకు, ఉత్తరము నుండి దక్షిణ/పడమరలకు మొత్తం 37 జతల మెయిల్/ఎక్స్‌ప్రెస్‌లు, అదేవిధముగా తూర్పు నుండి దక్షిణ పడమరలకు, దక్షిణ పడమరల నుండి తూర్పు నకు 25 జతల మెయిల్/ఎక్స్‌ప్రెస్‌లు, ఇంకా తూర్పు నుండి పడమరకు, పడమర నుండి తూర్పు నకు 12 జతల మెయిల్/ఎక్స్‌ప్రెస్‌లు నడపబడు తున్నాయి.[2]

వర్క్‌షాపులు, మానవశక్తి

నార్త్ సెంట్రల్ రైల్వేలో రెండు వర్క్‌షాప్‌లు ఉన్నాయి. ఝాన్సీలోని వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్ 1895లో స్థాపించబడినది. భారతీయ రైల్వేల వ్యాగన్ స్టాక్‌తో రమ్మత్తులు నిర్వహిస్తాయి.

  • ఉత్తర మధ్య రైల్వేలో ఝాన్సీ, సితౌలి (గౌలియార్) వద్ద కార్ఖానాలు ఉన్నాయి.
  • ఉత్తర మధ్య రైల్వేలో మొత్తం 69.644 మంది సిబ్బంది బలం ఉంది.
  • ఉత్తర మధ్య రైల్వేకు ఆధునిక ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఉంది. ఇంతకు ముందు రైలు ప్రమాదములో దెబ్బతిన్న మగధ్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌ను ఆధునిక సాంకేతికతతో ఆధునీకరించి, ఢిల్లీ నుండి హౌరా వరకు దురంతో ఎక్స్‌ప్రెస్ గా నడుపు చున్నారు.

రైల్ స్ప్రింగ్ కార్ఖానా, సిథౌలి మరియు గ్వాలియర్‌ వర్క్‌షాపులలో కోచింగ్ స్టాక్ స్ప్రింగ్‌లు మరియు లోకోమోటివ్ స్ప్రింగ్‌ల తయారీని నిర్వహిస్తాయి. ఉత్తర మధ్య రైల్వేలో ఒక ఎలక్ట్రిక్ లోకో షెడ్ కూడా ఉంది, ఇక్కడ మగధ్ ఎక్స్‌ప్రెస్ యొక్క దెబ్బతిన్న ఇంజిన్‌లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమర్చి ఢిల్లీ-హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్‌ను నడిపిస్తారు. ఉత్తర మధ్య రైల్వేలో 69,644 మంది సిబ్బంది ఉన్నారు.[2]నేషనల్ సోలార్ మిషన్ కింద సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా, ఝాన్సీ జంక్షన్ రైల్వే స్టేషన్‌లోని వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్‌లో మొత్తం 1.5 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి గ్వాలియర్‌కు చెందిన వివాన్ సోలార్ అనే కంపెనీని ఉత్తర మధ్య రైల్వే ఎంపిక చేసింది.కాంప్లెక్స్‌లోని ప్రొడక్షన్ షెడ్‌లు మరియు సర్వీస్ భవనాలపై కంపెనీ రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేస్తుంది.[4]

ముఖ్యమైన రైళ్ళు

  1. ఆగ్రా కంటోన్మెంట్ - న్యూఢిల్లీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
  2. శ్రమ్ శక్తి ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ - కాన్పూర్ సెంట్రల్
  3. ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ - ప్రయాగ్‌రాజ్ జంక్షన్
  4. కాన్పూర్–న్యూ ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ - కాన్పూర్ సెంట్రల్
  5. అలహాబాద్ – న్యూ ఢిల్లీ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ / ప్రయాగ్‌రాజ్ – న్యూ ఢిల్లీ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ – ప్రయాగ్‌రాజ్ జంక్షన్
  6. అలహాబాద్ – ఆనంద్ విహార్ టెర్మినల్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ / ప్రయాగ్‌రాజ్–ఆనంద్ విహార్ టెర్మినల్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్, ఆనంద్ విహార్ టెర్మినల్ – ప్రయాగ్‌రాజ్ జంక్షన్
  7. కాన్పూర్ సెంట్రల్ – ఆనంద్ విహార్ టెర్మినల్ ఎక్స్‌ప్రెస్, ఆనంద్ విహార్ టెర్మినల్ – కాన్పూర్ సెంట్రల్
  8. చంబల్ ఎక్స్‌ప్రెస్, హౌరా జంక్షన్ - గ్వాలియర్ జంక్షన్ / మధుర జంక్షన్

లోకో షెడ్‌లు

  • ఎలక్ట్రిక్ లోకో షెడ్, కాన్పూర్
  • ఎలక్ట్రిక్ లోకో షెడ్, ఝాన్సీ
  • డీజిల్ లోకో షెడ్, ఝాన్సీ

గ్యాలరీ

బయటి లింకులు

మూలాలు

  1. "Indian Railways touches another milestone! North Central Railway is now 100 percent electrified". Financialexpress (in ఇంగ్లీష్). Retrieved 2022-11-29.
  2. 2.0 2.1 2.2 "North Central Railways / Indian Railways Portal". www.ncr.indianrailways.gov.in.
  3. "उत्तरी रेलवे क्षेत्र (Northern Railway Zone)". Pnr status, train running status, seat availability, PNR (in హిందీ). 2018-10-22. Archived from the original on 2018-10-24. Retrieved 2018-10-24.
  4. "Happy Birthday Indian Railways! First passenger train started 165 years ago; unknown facts about the network". The Financial Express. 2018-04-16. Retrieved 2018-10-24.

మూసలు , వర్గాలు