ఈస్టర్న్ రైల్వే (ER) భారతీయ రైల్వేలు లోని 17 మండలాలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం ఫెయిలీ ప్లేస్, కోలకతా వద్ద ఉంది, ఈ జోను నాలుగు విభాగాలుగా ఉంది: హౌరా మాల్డా, సీల్దా,, అసన్సోల్. ప్రతి విభాగానికి ఒక డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్‌ఎం) అధికారి బాధ్యత వహిస్తారు. డివిజను పేరు నగరం యొక్క పేరు సూచిస్తుంది, డివిజను ప్రధాన కార్యాలయం ఉన్నచోటును సూచిస్తుంది.
తూర్పు రైల్వేలో జమాల్‌పూర్, లిలూహ, కాంచ్రాపారా మూడు ప్రధాన కార్ఖానాలు ఉన్నాయి. జమాల్‌పూర్ వర్క్‌షాప్ వాగన్ మరమ్మత్తు, డీజిల్ వాహనములు పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పిఒహెచ్) క్రేన్లు, టవర్-వ్యాగన్ల తయారీ కోసం, లిలూహ వర్క్‌షాప్ కోచింగ్ & సరుకు వాహనాల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పిఒహెచ్) కోసం, కాంచ్రాపారా వర్క్‌షాప్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్, స్థానిక ఈఎంయు, కోచ్‌లు పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పిఒహెచ్) కోసం పనిచేస్తున్నాయి.
చరిత్ర
ఈస్ట్ ఇండియన్ రైల్వే (ఈఐఆర్) కంపెనీ ద్వారా ఢిల్లీకి తూర్పు భారతదేశం నకు 1845 సం.లో అనుసంధానం ఏర్పడింది. మొదటి రైలు 1854 ఆగస్టు 15 సం.న హౌరా, హుగ్లీ మధ్య నడిచింది. రైలు 08:30 గంటలకు హౌరా స్టేషన్ వదిలి, 91 నిమిషాల హుగ్లీ చేరుకుంది. ఈస్ట్ ఇండియన్ రైల్వే నిర్వహణ 1925 జనవరి 1 న బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.[1]
తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న (1) ఈస్ట్ ఇండియన్ రైల్వే మూడు తక్కువ విభాగాలు అయిన హౌరా, అసన్సోల్, డానాపూర్ తో, (2) మొత్తం బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్‌ఆర్) (3) గతకాలపు బెంగాల్ అస్సాం రైల్వేలకు చెందిన సీల్దా డివిజన్ (ఇది అప్పటికే 1947 ఆగస్టు 15 న ఈస్ట్ ఇండియన్ రైల్వే జోడించబడింది) విలీనం ద్వారా ఏర్పడింది.[2] ఆగస్టు 1955 న 1, బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్‌ఆర్) దక్షిణ భాగం హౌరా నుంచి విశాఖపట్నం దాకా, మధ్య ప్రాంతంలో నాగ్‌పూర్ నుండి హౌరా వరకు, నార్త్ సెంట్రల్ ప్రాంతంలో కాట్నీ వరకు తూర్పు రైల్వే నుండి వేరు చేయడంతో సౌత్ ఈస్ట్రన్ రైల్వేగా మారింది.[3][4] మూడు అదనపు డివిజనులు అయిన ధన్‌బాద్, మొఘల్సరాయ్, మాల్డా తరువాత ఏర్పడ్డాయి.[5] 2002 సెప్టెంబరు 30 వరకు తూర్పు రైల్వేలో ఏడు డివిజన్లు ఉన్నాయి. తదుపరి, 2002 అక్టోబరు 1 న ఒక కొత్త జోన్, ఈస్ట్ సెంట్రల్ రైల్వేను నుండి తూర్పు రైల్వే దాని యొక్క డానాపూర్, ధన్‌బాద్, మొఘల్సరాయ్ విభాగాలు వేరు చేయడాం ద్వారా ఏర్పరచారు.[4] ప్రస్తుతం, తూర్పు రైల్వే నాలుగు విభాగాలు (డివిజనులు)గా ఉంది.
రైలు మార్గములు
తూర్పు, దక్షిణ తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయము, కోలకతా
ప్రధాన రైలు మార్గములు
హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
గ్రాండ్ కార్డ్
సాహిబ్ గంజ్ లూప్
ఇతర రైలు మార్గములు
హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము లోని హౌరా-బర్ధమాన్ ప్రధాన రైలు మార్గము
బండేల్-కట్వా బ్రాంచ్ సింగిల్ రైలు మార్గము
షియోరాఫులి -తారకేశ్వర్ బ్రాంచ్ లైన్ డబుల్ బ్రాడ్ గేజ్ లైన్
తారకేశ్వర్ - అరంబాగ్ బ్రాంచ్ సింగిల్ రైలు మార్గము
హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము లోని హౌరా-బర్ధమాన్ కార్డ్
బర్హర్వ - అజీంగంజ్ - కట్వ లూప్ మార్గము
జసిధి దుమ్కా రాంపూర్‌హట్ రైలు మార్గము
హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము లోని బర్ధమాన్ - అసన్‌సోల్ విభాగం
సాహిబ్ గంజ్ లూప్ లోని ఖనా-బర్హర్వ విభాగం
రాణాఘాట్ - గేడే బ్రాంచ్ డబుల్ లైన్స్
ఆండాళ్ - సైంతియా శాఖ రైలు మార్గము
సీల్డా-రాణాఘాట్ రైలు మార్గము (సీల్డా-దంకుని, బండేల్-నైహతి రైలు మార్గములు కలుపుకుని)
రాణాఘాట్ - కృష్ణనగర్ సిటీ - లాల్‌గోల
రాణాఘాట్ - శాంతిపూర్ - కృష్ణనగర్ సిటీ
హౌరా-బేలూరు మఠం
సీల్డా-బర్సాత్-బంగావ్-రాణాఘాట్ రైలు మార్గము
బర్సాత్ - హసన్‌బాద్ బ్రాంచ్ సింగిల్ రైలు మార్గము
డం డం - బిమన్ బ్యాండర్
సీల్డా దక్షిణ రైలు మార్గములు లోని సీల్డా - బరుయీపూర్ - డైమండ్ హార్బర్
సీల్డా దక్షిణ రైలు మార్గములు లోని సోనార్‌పూర్ - కానింగ్
సీల్డా దక్షిణ రైలు మార్గములు లోని బరుయీపూర్ - లక్ష్మీకాంతపూర్ - నంఖానా
సీల్డా దక్షిణ రైలు మార్గములు లోని సీల్డా - బడ్జె బడ్జె
కోలకతా సర్క్యూలర్ రైల్వే
అహ్మద్‌పూర్ కట్వ రైల్వే (నారో గేజ్)
బుర్ద్వాన్ కట్వ రైల్వే (నారో గేజ్)
తూర్పు రైల్వే నుండి ముఖ్యమైన రైళ్లు
సీల్డా ప్రధాన రైల్వే స్టేషను
సీల్డా - న్యూ జల్పైగురి డార్జిలింగ్ మెయిల్ (సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్)
సీల్దా - న్యూ జల్పైగురి పాదతిక్ ఎక్స్‌ప్రెస్
న్యూ జల్పైగురి హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (నారో గేజ్)
హౌరా రాజధాని / హౌరా - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (గయ / పాట్నా మీదుగా)
సీల్డా రాజధాని ఎక్స్‌ప్రెస్ / సీల్డా - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (గయ మీదుగా)
హౌరా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
సీల్డా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
కల్కా మెయిల్
యువ ఎక్స్‌ప్రెస్- హౌరా / హౌరా - న్యూ ఢిల్లీ యువ ఎక్స్‌ప్రెస్
↑Rao, M.A. (1988). Indian Railways, New Delhi: National Book Trust, pp.13,34
↑"Sealdah division-Engineering details". The Eastern Railway, Sealdah division. Archived from the original on 2012-02-15. Retrieved 2015-02-11. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
↑Rao, M.A. (1988). Indian Railways, New Delhi: National Book Trust, pp.42–3
↑ 4.04.1"The Eastern Railway-About us". The Eastern Railway. Archived from the original on 2008-09-14. Retrieved 2015-02-11. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ఉత్పత్తి యూనిట్లు
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్-లోకో ఆధునికీకరణ వర్క్స్ · ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ·రైల్ కోచ్ ఫ్యాక్టరీ· రైల్ వీల్ ఫ్యాక్టరీ ·
రైలు స్ప్రింగ్ ఖార్ఖానా · గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్
భారతదేశం రైల్వే ఇంజిన్ షెడ్లు
డీజిల్
డీజిల్ లోకో షెడ్, గోల్డెన్ రాక్
డీజిల్ లోకో షెడ్, పూణే
మెమో
కొల్లాం మెమో షెడ్
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ప్రభుత్వ రంగ యూనిట్లు
భారత్ వాగన్, ఇంజనీరింగ్ · భారతీయ కంటైనర్ కార్పొరేషన్ · భారతీయ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ · భారతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) · ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · కొంకణ్ రైల్వే కార్పొరేషన్ · ముంబై రైలు వికాస్ కార్పొరేషన్ · రైల్ వికాస్ నిగం లిమిటెడ్ · భారతీయ రైల్‌టెల్ కార్పొరేషన్ · రైట్స్ లిమిటెడ్
స్వయంప్రతిపత్తం సంస్థలు అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు
కేంద్ర రైల్వే విద్యుదీకరణ సంస్థ · కేంద్ర కార్ఖానాలు ఆధునీకరణ సంస్థలు · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ · పరిశోధన డిజైన్, స్టాండర్డ్స్ సంస్థ · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) · రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు ·రైలు భూమి అభివృద్ధి అధికారిక సంస్థ
భారతీయ రైల్వేల కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వేల కేంద్ర శిక్షణా సంస్థలు
భారతీయ రైల్వే సివిల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే యాంత్రిక, విద్యుత్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే రవాణా నిర్వహణ సంస్థ · రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ (ఆర్పిఎఫ్) · రైల్వే స్టాఫ్ కాలేజ్
భారతదేశం బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు భారతీయ రైల్వేలు అంతర్జాలం
చెన్నై సబర్బన్ రైల్వే · మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (చెన్నై) · డార్జిలింగ్ హిమాలయ రైల్వే · ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే · హైదరాబాదు ఎమ్ఎమ్టిఎస్ · కాశ్మీర్ రైల్వే · కల్కా-సిమ్లా రైల్వే · కోలకతా సబర్బన్ రైల్వే · కోలకతా మెట్రో · కొంకణ్ రైల్వే · ముంబై సబర్బన్ రైల్వే · నీలగిరి పర్వత రైల్వే ·
గోల్డెన్ ఐ.టి. కారిడార్ · హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము · గ్రాండ్ కార్డ్ · సాహిబ్ గంజ్ లూప్ · హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము · హౌరా-నాగ్పూర్-ముంబై రైలు మార్గము ·హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము·ఢిల్లీ-చెన్నై రైలు మార్గము· ముంబై-చెన్నై రైలు మార్గము · హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
సర్వీసులు భారతీయ రైల్వే సేవలు
భారతదేశం ఎక్స్‌ప్రెస్ రైళ్లు · భారతదేశం ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం సూపర్‌ఫాస్ట్ / మెయిల్ రైళ్లు ·డెక్కన్ ఒడిస్సీ· దురంతో· గరీబ్ రథ్ ·జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్· మహారాజా ఎక్స్‌ప్రెస్ · ప్యాలెస్ ఆన్ వీల్స్ · ప్రీమియం రైలు · రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ ·రాజధాని ఎక్స్‌ప్రెస్·శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ · గోల్డెన్ చారియట్ · లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ · రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్ ·ఫెయిరీ క్వీన్