మెటాలో వివిధ గ్రాంట్ల కోసం అభ్యర్థించినవారు ఆ సంగతిని ఇక్కడ రచ్చబండలో తెలియపరచండి. ఇక్కడ చెప్పకపోతే ఆ గ్రాంటు కోరిన సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. అసలు ఎవరికీ తెలియకనే పోయే అవకాశం కూడా ఉంది. మీ అభ్యర్థనను ఎండార్సు చేసే అవకాశం అందరికీ కల్పించవలసినది. __చదువరి (చర్చ • రచనలు) 12:28, 7 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఇదే విషయం గురించి మన సభ్యుల అవగాహన కొరకు అంటే వికీమీడియా ఫౌండేషన్ నుంచి గ్రాంటులు పొందడం, ఇంకా ఫౌండేషన్ వారి సహకార కార్యక్రమాలలో (collaboration programs) పాల్గొనడం ఎలా? అనేది అంశం మీద పవన్ సంతోష్ (CIS/A2K) గారు తెవికీ బడి శిక్షణా కార్యక్రమంలో మొదట కొంతసేపు ప్రసంగిస్తారు.
తేదీ: 12.05.2024 ఆదివారం.సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి గూగుల్ మీట్ లో - లింక్
తరువాత శిక్షణాంశం: "వికీపీడియాలో అనువాద పరికరం ఉపయోగించి నాణ్యమైన వ్యాసాలు రాయడం ఎలా?" ప్రణయరాజ్ వంగరి గారితో కొనసాగుతుంది.
సభ్యులకు నమస్కారం
తెవికీ సభ్యుల అభీష్టం మేరకు, తెలుగు వికీమీడియన్ల యూజర్ గ్రూప్ తరపున తెవికీ బడి శిక్షణా కార్యక్రమాలు 6 వారాలుగా 2024 ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రతి ఆదివారం మాధ్యాహ్నం 2.00గం నుండి నిర్వహింపబడుతున్నాయి. ఇక్కడ తెవికీ బడి శిక్షణాంశాలు కూడా వివరంగా ఇవ్వడం జరిగింది.
అయితే ఈ కార్యక్రమం మెరుగుపరిచే లక్ష్యంతో సభ్యుల నుండి వారి స్పందనను - శిక్షణాంశాలు గురించి, శిక్షణా కార్యక్రమం సమయం, ఏ ఇతర సంబంధిత విషయం గురించి కానీ కోరడమైనది. సభ్యులు తమ స్పందనను వికీపీడియా చర్చ:తెవికీ బడి పేజీలో తెలియచేసి సహకరించవలసినది.
ధన్యవాదాలు - తెవికీ బడి ''వి.జె.సుశీల'' (చర్చ) 17:59, 12 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
We are pleased to present our monthly newsletter for April, highlighting the impactful initiatives undertaken by CIS-A2K during the month. This newsletter provides a comprehensive overview of the events and activities conducted, giving you insight into our collaborative efforts and engagements.
WMF’s Annual Plan Draft (2024-2025) and Session during the South Asia Open Community Call (SAOCC)
Hi Everyone,
This message is regarding the Wikimedia Foundation’s Draft Annual Plan for 2024-2025, and in continuation of Maryana’s email; inviting inputs from members of the movement. The entire annual plan is available in multiple languages and a shorter summary is available in close to 30 languages including many from South Asia; and open for your feedback.
We invite you all to a session on the Annual Plan during 19th May's [:m:South Asia Open Community Call|South Asia Open Community Call (SAOCC)]], in line with the collaborative approach adopted by the foundation for finalizing Annual Plans. The discussion will be hosted by members of the senior leadership of the Wikimedia Foundation.
Call Details (Please add the details to your respective calendars)
Sign up for the language community meeting on May 31st, 16:00 UTC
Hello all,
The next language community meeting is scheduled in a few weeks - May 31st at 16:00 UTC. If you're interested, you can sign up on this wiki page.
This is a participant-driven meeting, where we share language-specific updates related to various projects, collectively discuss technical issues related to language wikis, and work together to find possible solutions. For example, in the last meeting, the topics included the machine translation service (MinT) and the languages and models it currently supports, localization efforts from the Kiwix team, and technical challenges with numerical sorting in files used on Bengali Wikisource.
Do you have any ideas for topics to share technical updates related to your project? Any problems that you would like to bring for discussion during the meeting? Do you need interpretation support from English to another language? Please reach out to me at ssethi(__AT__)wikimedia.org and add agenda items to the document here.
You can find the details on this page, as well as the ways to give your feedback from today until the end of the day on June 23, 2024, anywhere on Earth.
You can also share information about this with the interested project communities you work with or support, and you can also help us translate the procedure into more languages, so people can join the discussions in their own language.
మూడేళ్ళ కిందటి వరకు కూడా తెవికీలో సగటున రోజుకు ఆరేడు కొత్త వ్యాసాలకు మించి వచ్చేవి కావు. ఇప్పుడు రోజుకు 30 కి పైగా వస్తున్నాయి. కొత్త వాడుకరులు ఉత్సాహంగా రాస్తూ ఉండడం, పాతవారు కూడా స్పీడు పెంచడం, వివిధ వికీప్రాజెక్టుల ద్వారా ఏకోన్ముఖమైన కృషి జరగడం వీటికి కారణాలు. లక్ష వ్యాసాల మైలురాయి చేరుకోడానికి 4,500 వ్యాసాల దూరం లోనే ఉన్నాం. ఇంకో నాలుగైదు నెలల్లో ఆ అంకె చూస్తాం కూడా. ఈ క్రమంలో, వ్యాసాల సంఖ్యలో మలయాళాన్ని వెనక్కి నెట్టాం. ఇంకో రెణ్ణెల్లలో మరాఠీని కూడా దాటతాం.
రోజుకో వ్యాసం, రోజుకు రెండు, 5, 10 వ్యాసాలు - రాస్తున్న వాడుకరులున్నారు మనకు. ఇంగ్లీషులో 68 లక్షల పైచిలుకు వ్యాసాలున్నాయి కాబట్టి, ఏ విషయమ్మీద వ్యాసం రాయాలి అనేది పెద్దగా ఆలోచించనక్కరలేదు. ఏదో ఒక ఇంగ్లీషు వ్యాసం తీసుకుని అనువదించవచ్చు. అయితే తెవికీకి దగ్గరగా ఉండేవి, భారతదేశానికి సంబంధించినవి, విషయ పరంగా ప్రాముఖ్యత కలిగినవీ అయిన వివిధ ఆవశ్యక వ్యాసాల జాబితాలు మనకు ఈసరికే ఉన్నాయి. వీటన్నిటినీ ఒకచోట చేర్చిన ఏ వ్యాసాలను సృష్టించాలి అనే ఒక వ్యాసం ఇదివరకే ఉంది. అందులో ఉన్న లింకుల ద్వారా, ఆవశ్యక పేజీల జాబితాలను చూడవచ్చు. పరిశీలించండి. అలాగే వికీపీడియా జాబితాలు అనే వర్గం కూడా చూడవచ్చు.
అలాగే, పై పేజీల్లో ఉన్న సమాచారంతో పాటు ఇప్పుడు మరొక జాబితా కూడా తయారుచేసాను. ఇదొక జాబితాల జాబితా. భారతదేశానికి సంబంధించిన వివిధ విషయాలపై ఎన్వికీలో ఉండి, తెవికీలో లేని వ్యాసాల జాబితాలు ఇవి. మొత్తం వ్యాసాలు 40 - 50 వేలు ఉండొచ్చు బహుశా. కింద చూపిన లింకులకు వెళ్ళి నచ్చిన పేజీని ఎంచుకుని వ్యాసం రాయవచ్చు. ఆ జాబితాల జాబితా ఇది:
అనువాదయంత్రం మానవీయ అనువాదపరిమితి తగ్గించుటకు ప్రవేశపెట్టిన చర్చలో మీ స్పందనలు తెలుపగలరు
తెవికీ అనువాదయంత్రాన్ని ఎక్కువ మంది ఉపయోగించటాన దాని నాణ్యత చాలావరకు పెరిగింది. అనువాదంలో వాక్యనిర్మాణం గాని, ఆంగ్ల పదాలకు సరియైన తెలుగు అర్థాలను సూచించటంలో గాని గణనీయంగా అభివృద్ది చెందింది. గత రెండు సంవత్సరాల క్రిందట అనువాదయంత్రం ద్వారా అనువదించటానికి, ఈరోజున అనువదించటానికి చాలా తారతమ్యం ఉంది. ఇప్పటి పరిస్థితులలో గతంలో కష్టపడవలసినంత అవసరం లేదు. అలా అని పూర్తిగా అనువాదయంత్రమే అనువదిస్తుందని కాదు, చాలా మెరుగుపండిందని దాని అర్థం. కావున ఈ పరిస్థితులలో ప్రస్తుతం మానవీయ అనువాద పరిమితిఆంక్ష 30% నుండి 25% తగ్గించటానికి ప్రతిపాదనలు ఈ లింకులో ప్రవేశపెట్టబడినవి. . అనువాదయంత్రం ద్వారా వ్యాసాలు సృష్టించే వాడుకరులు ఆ చర్చలో రెండు, మూడు రోజులలోపు పై లింకులోకి వెళ్లి స్పందించగలరు.దానిమీద తరువాత తదుపరి చర్యలు గైకొనవలసిఉంది.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 14:29, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీ 20వ పుట్టినరోజు నేపథ్యంలో 2024 జనవరిలో విశాఖపట్నంలో 'తెవికీ 20వ వార్షికోత్సవం (తెవికీ పండగ 2024)'ను ఘనంగా నిర్వహించుకున్నాం. ఆ సందర్భంగా వికీపీడియన్ల కలయికతోపాటు గత ప్రగతిని, భవిష్యత్ వ్యూహాలనూ చర్చిస్తూ, నైపుణ్యాలు పెంచుకుంటూ, ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. వేడుకలతోపాటుగా ప్రాజెక్టు గతం-ప్రస్తుతం-భవిష్యత్తు గురించిన ముఖ్యమైన ప్రశ్నలు వేసుకుని, వాటిపై భవిష్యత్ వ్యూహాలను రూపొందించుకున్నాం.
వార్షికోత్సవం నిర్వహణ గురించి జరిగిన చర్చలలో, తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు ఆధ్వర్యంలో తెవికీ 20వ వార్షికోత్సవం నిర్వహించుకోవాలని ప్రతిపాదనలు వచ్చినా... పలు కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. అప్పుడు సముదాయం విజ్ఞప్తి మేరకు సిఐఎస్-ఎ2కె వారు సహ-నిర్వాహకులుగా వ్యవహరించి, వార్షికోత్సవ కార్యక్రమ నిర్వాహణకు సహకరించారు. అయితే, తెవికీ పండగ అనేది ప్రతిఏటా నిర్వహించే కార్యక్రమం కాబట్టి, వచ్చే తెవికీ పండగతోపాటు మరిన్ని కార్యక్రమాలను తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు ద్వారా నిర్వహించాలని గతంలోనే చర్చించుకోవడం జరిగింది.
దాంతోపాటు, ప్రతి ఏటా నిర్వహించబడుతోన్న 'హైదరాబాదు బుక్ ఫెయిర్' లో 2014 నుండి క్రమం తప్పకుండా 'తెవికీ స్టాల్'ను ఏర్పాటుచేసి, బుక్ ఫెయిర్ సందర్శకులకు తెవికీ గురించిన అవగాహన కలిగిస్తున్నాం. బుక్ ఫెయిర్ లో స్టాల్ నిర్వహణ కూడా తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు ద్వారానే నిర్వహించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది.
అయితే, 'తెవికీ 21వ వార్షికోత్సవం - తెవికీ పండగ 2025', 'తెవికీ స్టాల్' నిర్వహణకు కావలసిన బడ్జెట్ కోసం వికీమీడియా ఫౌండేషన్ వారికి వీలైనంత త్వరగా అభ్యర్థన చేయాల్సివుంటుంది. గ్రాంట్ అభ్యర్థన నుండి తెవికీ పండుగ నిర్వహణ వరకు వివిధ దశలలో మనకు కావలసిన సహకారానికి సిఐఎస్-ఎ2కె వారికి కోరవచ్చు.
'తెవికీ పండగ 2025' ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేద్దాము?
బుక్ ఫెయిర్ లో తెవికీ స్టాల్ లో పలు కార్యకలాపాల నిర్వహణ
ఈ విషయాన్ని చర్చకు తెచ్చినందుకు Pranayraj1985 గారికి ధన్యవాదాలు. ఈ రెండు ఘటనలూ తెవికీకి ముఖ్యమైనవి.
పుస్తక ప్రదర్శనలో స్టాలు పెట్టడం అనేక ఏళ్ళుగా చేస్తూ వస్తున్నాం. అయితే ఏ విధమైన ధన సహాయం లేకుండా, కొద్దిపాటి వస్తు సహాయంతో ఇది చేస్తూ వస్తున్నాం. స్టాలు నిర్వాహకులపై ఎంతో బరువు పడుతూ వస్తోంది. ఇది ఏటా జరిగే కార్యక్రమం కాబట్టి, వ్యవస్థీకృతంగా చేస్తే నిర్వహణ మరింత సులువుగా ఉంటుంది. స్టాలుకు, నిర్వాహకులకూ కనీస మాత్రపు సౌకర్యాలు కల్పించడానికీ డబ్బు అవసరం. అంచేత గ్రాంటు కోసం ప్రయత్నించాలి.
అలాగే, తెవికీ పుట్టిన రోజు పండగ కూడా. గతంలో ప్రతి ఏడూ ఉత్సవాలు జరపక పోయినా, మొన్న జనవరిలో పెద్దయెత్తునే చేసాం. ఏ యేటి పుట్టినరోజు కూడా అలాగే జరుపుకుందాం. దీన్ని ఏటా కొనసాగించాలి కూడా. గత ఉత్సవాలకు సిఐఎస్ వారి ఆర్థిక, నిర్వహణా సహాయం తీసుకున్నాం. ఈసారి ఫౌండేషన్‌ను ఆర్థిక సాయం అడుగుదాం.
ఈ ఏడు ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. పుట్టినరోజు నాటికి తెవికీ లక్ష వ్యాసాలకు చేరబోతోంది. తెవికీ చరిత్రలో ఇదొక పెద్ద మైలురాయి. పై రెండు ఉత్సవాలకు దీన్ని థీమ్‌గా చేసుకుందాం.
ముందుగా ఈ విషయాన్ని చర్చకు తెచ్చినందుకు Pranayraj1985 గారికి ధన్యవాదాలు. తెవికీ పండగ 2025', బుక్ ఫెయిర్ లో తెవికీ స్టాల్ నిర్వహణ ఈ రెండు కార్యక్రమాలు తెవికీకి ముఖ్యమైన కార్యక్రమాలు.ఈ ఉత్సవాలను యూజర్ గ్రూపు ద్వారా నిర్వహించటానికి, ఈ రెండు కార్యక్రమాలకు అవసరమయ్యే గ్రాంటును వికీమీడియా ఫౌండేషన్‌ను వారిని కోరుటకు నేను అంగీకరిస్తున్నాను. అలాగే 'తెవికీ పండగ 2025' ఈ సారి పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగుళూరులో నిర్వహించటానికి అలోచించవలసిందిగా సముదాయసభ్యులను కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 03:22, 27 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ విషయాన్ని చర్చకు తెచ్చినందుకు Pranayraj1985 గారికి ధన్యవాదాలు.తెవికీ పండగ 2025, బుక్ ఫెయిర్ లో తెవికీ స్టాల్ నిర్వహణ ఈ రెండు ఉత్సవాలను యూజర్ గ్రూపు ద్వారా నిర్వహించటానికి, ఈ రెండు కార్యక్రమాలకు అవసరమయ్యే గ్రాంటును వికీమీడియా ఫౌండేషన్‌ను వారిని కోరుటకు నేను అంగీకరిస్తున్నాను.KINNERA ARAVIND (చర్చ) 04:31, 28 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఎక్కడ జరపాలనే విషయానికి వస్తే బెంగళూరు కన్నా తెలుగు రాష్ట్రాలలోనే జరుపుకుంటే బాగుంటుంది. కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని కానీ, కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని కానీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఆయా పట్టణాలలో నిర్వహించగలిగితే అక్కడి విద్యార్థులను, అధ్యాపకులను వికీపీడియావైపుకు ఆకర్షించవచ్చు. --స్వరలాసిక (చర్చ) 06:17, 28 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
'తెవికీ పండగ 2025', బుక్ ఫెయిర్ లో తెవికీ స్టాల్ నిర్వహణ ఈ రెండు కార్యక్రమాలు తెవికీకి ముఖ్యమైన కార్యక్రమాలు. ఈ ఉత్సవాలను యూజర్ గ్రూపు ద్వారా నిర్వహించటానికి, ఈ రెండు కార్యక్రమాలకు అవసరమయ్యే గ్రాంటును వికీమీడియా ఫౌండేషన్‌ను వారిని కోరుటకు నేను అంగీకరిస్తున్నాను.--Nagarani Bethi (చర్చ) 11:00, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985 తెవికీ బడిలో నేను ప్రస్తావించినట్టుగానే ఈ గ్రాంట్లు రెండూ తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ నిర్వహించేట్టుగా ఎవరైనా ప్రతిపాదించాలని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా తెవికీలో గ్రాంట్లు తీసుకోవడం, వాటిని పారదర్శకంగా నిర్వహించడం, పబ్లిక్ గా వివరాలన్నీ ప్రచురించడం వంటి పనులు చేయడం ఎక్కువమందికి రావాలని కూడా నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. పవన్ సంతోష్ (చర్చ) 12:03, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
'తెవికీ పండగ 2025' బెంగళూరులో నిర్వహించాలి ఎర్ర రామారావు గారి సూచన బాగుంది అనిపిస్తుంది, 2024 జనవరిలో నిర్వహించిన వైజాగ్ నందు సౌకర్యాలు పవన్ సంతోష్ గారు చాలా బాగా డిజైన్ చేసి నిర్వహణ పూర్తిగా సంతోషంగా గడిచింది, వారికి అభినందనలు. ఈసారి యూజర్ గ్రూప్ ద్వారా నిర్వహించాలంటే దానికి కూడా సమ్మతమే, ఈ కార్యక్రమానికి, పుస్తక ప్రదర్శన కార్యక్రమానికి, విక్కీమీడియా ఫౌండేషన్ ను గ్రాంటును కోరడానికి నేను అంగీకరిస్తున్నాను.ప్రభాకర్ గౌడ్చర్చ15:51, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్ రాజ్ గారి పతిపాదనకునకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ప్రణయ్ రాజ్ గారి ప్రణాళిక బాగుంది. స్వరలాసిక గారి ఆలొచన కూడా బాగుంది. నా అభిప్రాయం ప్రకారం మన తెలుగు రాష్త్రాలలొ ఏదైన యూనివర్సిటీ లొ ఏర్పాటుచేస్తే బాగుంటుంది.
ఈ విశ్వవిద్యాలయాలలో నిర్వహించే కార్యక్రమాలు మన వికితో బాగా కలిసిపోయేలా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఈ కార్యక్రమాలకు వికిపీడియన్లు భాగస్వామ్యులుగా ఉంటేనే అవి సఫలంగా జరుగుతాయి. లేకపోతే, ఈ రెండు రోజుల కార్యక్రమాల నిర్వహణలో అనేక లాజిస్టిక్ వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కావాలంటే అయా యునివర్సిటీలలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టవచ్చు, 'తెవికీ పండగ 2025' బెంగళూరులో నో చెన్నై లోనో నిర్వహింస్తే బాగుంటుంది. ఎప్పటిలాగనే తెవికీ స్టాల్ నిర్వహణ కు నా పూర్తి తోర్పాటు ఉంటుంది Kasyap (చర్చ) 13:33, 31 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో తెలుగు వికీపీడియా స్టాలు పెట్టేందుకు, అందుకోసం గ్రాంటు పొందేందుకూ పైన వచ్చిన ప్రతిపాదన చూసే ఉంటారు. ఆ ప్రదర్శన రోజుల్లో మనం ఏమేం చెయ్యాలనేది కూడా ఒక మాట అనుకుంటే బాగుంటుందని భావించి ఇది రాస్తున్నాను. ఈసారి ప్రదర్శనలో కింది పనులు చెయ్యాలని నేను భావిస్తున్నాను
ఈసారి "లక్ష వ్యాసాల తెవికీ"ని ముఖ్యమైన థీముగా పెట్టుకుందాం. బ్యూనర్లు, పోస్టర్లు, కరపత్రాలు వగైరాల్లో దీన్ని హైలైటు చేద్దాం
స్టాలు నిర్వహణ కోసం రోజూ కనీసం ముగ్గురు ఉండేలా చూసుకుందాం. ఈ నిర్వాహకులు రానుపోను, భోజనాలకీ ఏర్పాట్లు చేద్దాం
బ్యానర్లు, పోస్టర్లు, ఫొటోలు, కరపత్రాలు మామూలే
ఎప్పటి లాగానే సందర్శకుల డేటాను తీసుకుందాం. వారికి తెవికీని పరిచయం చేద్దాం
తెవికీ గురించి ఇప్పటికే తెలిసిన సందర్శకుల డేటాను కూడా తీసుకుందాం. వారి చేత ఖాతాను సృష్టింప జేద్దాం
ఖతా సృష్టించుకున్నవారికి గురువుగా ఉంటూ చెయ్యి పట్టి కొన్నాళ్ళ పాటు నడిపించేందుకు ముందుకు వచ్చే కొందరు అనుభవజ్ఞులైన వాడుకరుల జాబితా తయారు చేసుకుందాం
ఈ సారి ప్రదర్శనలో ఒకరోజున తెవికీ లక్ష వ్యాసాల ఉత్సవం చేద్దాం. దానికి ఎవరైనా ప్రముఖ వ్యక్తిని ఆహ్వానిద్దాం.
పైన సూచించిన గ్రాంటు ప్రతిపాదనలో ఈ ఖర్చులన్నిటినీ చేరుద్దాం.
@Chaduvari గారూ, @Pranayraj1985 గారూ చేసిన ప్రతిపాదనలు లేదా సూచనలు బాగున్నవి.ఇలాంటి కార్యక్రమాలు తెలుగు వికీపీడియాకు మరింతమంది దగ్గరవటానికి ఇదొక మెట్టు. అలాగే అవకాశం ఉన్న వాడుకరులు మరింత మంది స్టాల్ లో సర్వీసు చేస్తే కార్యక్రమం ఇంకా మంచి ఫలితాలు ఇవ్వగలదని నేను భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 04:44, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
గత నాలుగేళ్ళలో తెలుగు వికీపీడియా ప్రగతిని రెండు గణాంకాల రూపంలో పరిశీలిస్తే రెండు విషయాలు తెలుస్తున్నై.. కొత్త వ్యాసాల సంఖ్య పెరుగుదలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. అదే సమయంలో కొత్త వాడుకరుల సంఖ్యలో పెరుగుదల గణనీయంగా తగ్గిపోయింది. కింది పట్టికలో వివరాలు చూడవచ్చు. దీన్నిబట్టి మనం తెవికీ లోకి కొత్త వాడుకరులను తీసుకురవాల్సిన అవసరం ఉంది. అందుకు గాను పుస్తకప్రదర్శన మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను.
@Chaduvari గారూ, గత ఆదివారం జరిగిన తెవికీ బడిలో పుస్తక ప్రదర్శనలో మన స్టాల్ విషయమై గ్రాంటు అడగాలని, ఇంతకుముందు మనం వనరులు లేకపోవడం వల్ల ఈ స్టాల్ ద్వారా చేయలేకపోయిన పనులన్నిటినీ ఇప్పుడు చేయగలగాలని నేను అన్నందున ఈ కారణాల మీదనే ఇప్పుడు ఈ ప్రస్తావనని పూర్తిగా సమర్థిస్తున్నాను.
@Chaduvari గారూ, పైన పలు సూచనలు చెప్పినవి చాలా బాగున్నాయి, తెవికీలో ఈ మధ్య చర్చలు సూచనలు అభిప్రాయాలు చాలా బాగా జరుగుతున్నాయి. పుస్తక ప్రదర్శనలో చాలా సంవత్సరాల నుండి కశ్యప్ గారు, ప్రణయ్ రాజుగారు మాత్రమే స్టాల్ లో ఎక్కువ సమయం ఉంటున్నారు వారికి తోడుగా ఇప్పటి నుండి అయినా అందుబాటులో ఉన్నవారు తప్పకుండా పాల్గొనే విధంగా చేసే విధంగా పై సూచనలు అందరివి బాగున్నాయి. అభినందనలు ధన్యవాదాలు.ప్రభాకర్ గౌడ్చర్చ15:32, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో తెలుగు వికీపీడియా స్టాలు నిర్వహణలో చేయవలసిన కార్యకలాపాల గురించి Chaduvari గారు చేసిన సూచనలు బాగున్నాయి. అదేవిధంగా వికీలో మహిళా వాడుకరుల సంఖ్యను పెంచేదిశగా, మహిళలను వికీ రచనలో భాగం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందుకోసం స్టాల్ లో ప్రతిరోజూ ఒక మహిళా వాడుకరి కూడా ఉండేలా చూడాలి.--Nagarani Bethi (చర్చ) 03:29, 30 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
స్టాలు నిర్వహణ గురించి పైన ఇచ్చిన సూచనలు బాగున్నాయి. అలాగే సామజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్న వాడుకరులు స్టాలు గురించి, ఏ రోజుకారోజు స్టాల్లో జరగబోయే కార్యక్రమాల గురించి వారి వారి అకౌంట్లలో తెలియజేస్తే దీని గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది.
అలాగే 'ఎందరో వికీమీడియన్లు' పుస్తకం కొత్త వాడుకరులకు వికీపీడియాలో చేయదగ్గ పనులు ఏమిటి అనే అవగాహన కల్పించడంతో పాటు, ఇప్పటి దాకా జరిగిన కృషి గురించి చెప్పి స్ఫూర్తినిస్తుంది. దీన్ని స్టాల్లో అందుబాటులో ఉంచి, ఆన్లైన్లో ఎక్కడ చదవచ్చో చెప్తే బాగుంటుంది. కిమీర (చర్చ) 09:52, 4 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
హైదరాబాదులో చిత్ర ప్రదర్శన, ఫోటోవాక్
అందరికీ నమస్కారం!
ఈ నెల 3, 10వ తేదీలలో నేనూ, @పవన్ గారూ 24 Hour Project అనే సంస్థతో మాట్లాడాం. ఈ జులై 6-14 తేదీల మధ్య వారు హైదరాబాదులో ఒక అంతర్జాతీయ చిత్ర ప్రదర్శన పెడుతున్నారు. దీనికి మన నగరంలోని వారే కాకుండా, వివిధ రాష్ట్రాలు, పలు దేశాలు నుంచి వేళాది మంది ఫోటోగ్రాఫర్లు హాజరవుతున్నారు. జులై 7 (ఆదివారం) మనం వారితో కలిసి ఒక ఫోటోవాక్ చేయుంచడమే కాక, ఒకటి-రెండు రోజులు మనం వికీమీడియా కామన్స్ గురించి, ఆసక్తి ఉన్నవారికి వికీపీడియా గురించి కూడా తెలియజేయవచ్చు. భధ్రాచలంలో మనం చేసిన కార్యక్రమంలోని ఒక సభ్యుడే ఈ ప్రదర్శనను హైదరాబాదు అంబాసెడరుగా వ్యవహరిస్తున్నారు. వివిధ కళాశాలలకు చెందిన పిల్లలు కూడా రావడంతో హైదరాబాదులోని యువతకు వికీమీడియా ప్రాజెక్టులను చాలా సులువుగా పరిచయం చేయవచ్చని నేను భావిస్తున్నాను.
మనం చేయవలసిన పనులు:
Thank you again to everyone who participated in this process and much appreciation to the candidates for your leadership and dedication to the Wikimedia movement and community.
Over the next few weeks, the U4C will begin meeting and planning the 2024-25 year in supporting the implementation and review of the UCoC and Enforcement Guidelines. Follow their work on Meta-wiki.
Hi! It seems that te.wiki have/upload many photos as fair use of living people. According to wmf:Resolution:Licensing_policy#Resolution #3 "Such EDPs must be minimal. ... An EDP may not allow material where we can reasonably expect someone to upload a freely licensed file for the same purpose, such as is the case for almost all portraits of living notable individuals. ..."
హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన 2024-25 - గ్రాంట్ దరఖాస్తుకు మద్దతు
సభ్యులకు నమస్కారం
ప్రతి సంవత్సరం మన తెలుగు వికీపీడియా సభ్యులు హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలు స్వచ్చందంగా నిర్వహిస్తున్న విషయం అందరకు తెలిసినదే. మనలో చాలామంది ఈ స్టాలును సందర్శించుతుంటారు. ఈ విధమైన అవుట్ రీచ్ కార్యక్రమాల వలన తెలుగు వికీపీడియాకు విస్తృత ప్రచారం, అవగాహన, కొత్త సభ్యులు ఏర్పడుతుంటారు. ఇదే లక్ష్యంతో తెలుగు వికీపీడియా స్టాలుకు మరింత హంగులు చేకూర్చడానికి తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తరపున వికీమీడియా ఫౌండేషన్ వారినుంచి గ్రాంట్ కు దరఖాస్తు చేశాను (గ్రూప్ నుంచి చేయడానికి సాంకేతికకారణాల పరిమితి వలన వీలుపడలేదు).
కాబట్టి ఈ గ్రాంట్ దరఖాస్తును పరిశీలించి చర్చాపేజీ (Discussion Page)లో తమ మద్దతును ప్రకటించవలసినదిగా సభ్యులందరినీ కోరుతున్నాము
Apply for Wikimedia Technology Summit (WTS) 2024 scholarships
Wikimedia Technology Summit (WTS) 2024 is focused on using technology to enhance inclusivity across Wikipedia and its associated projects. We aim to explore strategies for engaging underrepresented communities and languages while also strengthening the technical foundation. By fostering collaboration between developers, users, and researchers, we can unite our efforts to create, innovate, and advance the technology that drives open knowledge.
We invite community members residing in India who are interested in attending WTS 2024 in person to apply for scholarships by July 10, 2024. The summit will be held at IIIT Hyderabad, India, in October 2024. To apply, please fill out the application form by clicking this link]. On behalf of the WTS 2024 Scholarship Committee : Kasyap (చర్చ) 07:33, 11 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
The final text of the Wikimedia Movement Charter is now on Meta
The final text of the Wikimedia Movement Charter is now up on Meta in more than 20 languages for your reading.
What is the Wikimedia Movement Charter?
The Wikimedia Movement Charter is a proposed document to define roles and responsibilities for all the members and entities of the Wikimedia movement, including the creation of a new body – the Global Council – for movement governance.
Join the Wikimedia Movement Charter “Launch Party”
Join the “Launch Party” on June 20, 2024 at 14.00-15.00 UTC (your local time). During this call, we will celebrate the release of the final Charter and present the content of the Charter. Join and learn about the Charter before casting your vote.
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గ్రామ వ్యాసాలలో సమాచారపెట్టెను వికీడేటా ఆధారితంగా మార్చటం
గొత్తివాడ రెవెన్యూ గ్రామ వ్యాస సమాచారపెట్టె ఉదాహరణ
ప్రస్తుత పాఠ్య ఆధారిత సమాచారపెట్టె
ప్రతిపాదిత వికీడేటా ఆధారిత సమాచారపెట్టె
2019 మే లో, పాత ప్రకాశం జిల్లాలో ప్రయోగాత్మకంగా వికీడేటా ఆధారిత సమాచారపెట్టెలు ప్రవేశ పెట్టటం జరిగింది. అప్పట్లో వికీడేటాలో చాలా దోషాలు వున్నందున, సహసభ్యుల ఆసక్తి, నైపుణ్యాలు తగిన ప్రమాణంలో లేనందున ఆ ప్రయోగం ఇతర రెవెన్యూ గ్రామాలకు విస్తరింపబడలేదు. ఇటీవలి రెండు, మూడు నెలల కాలంలో వికీడేటాలో అంగ్ల, తెలుగు భాషా వికీపీడియన్లు, వికీడేటా సభ్యులు, ఓపెన్ స్ట్రీట్ మేప్ సభ్యులు విశేష కృషి చేయడం ద్వారా గ్రామానికి సంబంధించిన ప్రధాన దత్తాంశాలను శుద్ధి చేయడం జరిగింది. గ్రామ అక్షాంశరేఖాంశాలు, పరిపాలన వ్యవస్థ, జనాభా గణాంకాలు, విస్తీర్ణం, పిన్ కోడ్ వివరాలు అధికారిక డేటాబేస్ లను తనిఖీ చేసి సరిచేయటం, అవసరమైన చోట్ల అధికారిక డేటాబేస్ లనుండి సంగ్రహించి చేర్చటం, వాటి నాణ్యతను ఇతర డేటాబేస్‌ల తో తనిఖీ చేసి అవసరమైన సవరణలు చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా పేర్కొనదగినవి: రెవెన్యూ గ్రామ పేరుతోనే ఆవాసాలున్న దాదాపు 10000 గ్రామాలకు వికీడేటా అక్షాంశరేఖాంశాలు, ఓపెన్ స్ట్రీట్ మేప్ లోని గ్రామ స్థానాలతో పోల్చి ఎక్కువ నాణ్యత గల ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన సంస్ధ సేకరించిన అక్షాంశ రేఖాంశాలకు 2 కి.మీలకు లోపలగా వుండేలా తనిఖీ మరియు సవరణలు, 6000 పైబడి తాజా లేక సరియైన పిన్ కోడ్లు చేర్చడం, విస్తీర్ణం,జనాభా, ఆవాసాల సంఖ్యలలో దోషాలు పరిష్కరించడం వంటివున్నాయి. అందువలన ప్రస్తుత రెవెన్యూ గ్రామపేజీలలోని సమాచారపెట్టెలను వికీడేటా అధారిత సమాచారపెట్టెకు మార్పు తలపెట్టాను. దీనితో పాటు, వ్యాసాలలో పిన్ కోడ్, తనిఖీ చేయబడని అక్షాంశరేఖాంశాల తొలగింపు కూడా చేయదలచాను. అందువలన ఈ వివరాల గురించి సందిగ్ధతకు అవకాశం వుండదు. ఈ మార్పు ముందు ముందు గ్రామ పేజీల నిర్వహణకు సౌలభ్యంగా వుంటుంది. ఉదాహరణ సమాచారపెట్టె (గతిశీల పటంతో) మార్పు చూడండి. మీకు ఆసక్తి వున్న గ్రామపేజీలో {{Infobox India AP Village}} అనే మూస చేర్చి మునుజూపులో కొత్త సమాచారపెట్టె కనబడుతున్న విధము,అలాగే సంబంధిత వికీడేటాలో ఏమైనా దోషాలుంటే, లేక ఈ ప్రతిపాదిత మార్పుపై సందేహాలు, అభ్యంతరాలు ఒక వారంలోగా (18 జూన్ 2024) లోగా తెలపండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 11:02, 11 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ ఈ చర్చలో మీరు సూచించిన సమాచారపెట్టెపై అభిప్రాయాలు లేదా స్పందనలు తెలియచేయటానికి ప్రస్తుతం ఎన్నికలు వ్యాసాలు తాజాసవరింపులు, కాలానుగుణంగా సృష్టించవలసిన వ్యాసాలు పనిలో బిజీగా ఉన్నందున నాకు సమయం పట్టింది.నేను మీ దృష్టికి తీసుకురావలసిన స్పందనలు,లేదా అభిప్రాయాలు ఉన్నవి.అందువలన నాకు ఒకవారం రోజులు సమయం పట్టింది గమనించగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 11:27, 11 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ అంత పెద్దగా వీక్షణలు ఉండని, నాకిష్టమైన గ్రామ వ్యాసాల పేజీలలో భారీ ఎత్తున మంచి కార్యక్రమం తలపెట్టినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు చెపుతున్నాను.అయితే మీరు ఈ చర్చలో ఉదాహరణగా సూచించిన వికీడేటా ఆధారిత సమాచారపెట్టె పరిశీలించగా దానిపై నాకు కొన్ని సందేహాలు ఉన్నవి.
సందేహాలు
అసలు గ్రామ వ్యాసాలలో ఎన్ని మ్యాపులు ఉండవచ్చు. మీరు సూచించే వికీడేటా ఆధారిత సమాచారపెట్టెలో రెండు పటాలు ఉన్నవి. అంతకు ముందు కొన్ని రెవెన్యూ గ్రామాలలో Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point అనేది ఒకటి చేర్చారు. వికీడేటా ఆధారిత సమాచారపెట్టె పెట్టిన తరువాత పైదానిని తొలగించవచ్చా లేక అది కూడా ఉండాలనా అనేది వివరించగలరు.
వికీడేటా ఆధారిత సమాచారపెట్టెలో కాలానుగుణంగా అదనంగా ఏదైనా తాజా సమాచారం చేర్చవలసి వస్తే. ఈ పని అందరూ చేసేదికాదు.ఏదైనా వికీపీడియాలో అందరూ సవరించే అవకాశం ఉండాలిగాని, ఇది అర్జనరావుగారు లేదా మరెవరో మాత్రమే చేయగలుగుతారు అనేది ఉండకూడదు. నా ఉద్దేశ్యం అది సులభతరంగా ఉండాలిగానీ, దానిని బంధించకూడదు అని అర్థం.దీని ఎలా అధిగమిస్తాం.
ఏప్పుడైనా మూలంలో లేదా మరొక దానిలో సాంకేతిక సమస్య లేదా ఎర్రర్ వచ్చినప్పుడు, ఎవరిని సంప్రదించాలి. ఇంతకముందు మండల వ్యాసాలలో వచ్చింది చాలాకాలం అలానే ఉంది. తరువాత మీరు మాత్రమే సరిచేసారు. కాబట్టి దీనిని ఎలా అధిగమిస్తాం,
వికీడేటా ఆధారిత సమాచారపెట్టె వ్యాసంలో ఎక్కువ వెడల్పుతో స్థలం ఆక్రమించి ఎబ్బెట్టుగా ఉంటే వ్యాస నాణ్యత దెబ్బతింటానికి అవకాశం ఉంది. వికీడేటా అక్షాంశరేఖాంశాలు, ఓపెన్ స్ట్రీట్ మేప్ జూమ్ చేయకపోతే ఆ రెవెన్యూ గ్రామం కనపడకుండా ఉండటానికి అవకాశం ఉందా అనేది నా సందేహం.
ఇక సమాచారపెట్టెలో చేర్చవలసిన ప్రతిపాదనలు
ప్రాధమిక సమాచారం
జిల్లా:అనకాపల్లి అని ఉంటే చాలు అనకాపల్లి జిల్లా అని రానక్కరలేదు
మండలం:కోట ఉరుట్ల అని ఉంటే చాలు. మండలం అని రానక్కరలేదు
గ్రామ విస్తీర్ణం: 3.22 చ.కి (1.24 చ.మై) అని ఉంటే బాగుంటుంది.విస్తీర్ణం కింద మరలా మొత్తం అని అవసరంలేదని నా అభిప్రాయం
పై విధంగా సమాచారం ఉంటేనే ఆ సమాచారపెట్టె పరిపూర్ణంగా ఉంటుందని నా అభిప్రాయం.గతంలో మండల సమాచారపెట్టెలలో కూడా పూర్తి సమాచారం రాలేదు. అవసరమయితే ఈ ప్రాజెక్టులో నా పూర్తి సహాయసహకారాలు అందిస్తాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:39, 14 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. గతకాలపు దోషాలను సరిదిద్దడానికి, గూగుల్ మేప్స్ లో తెలుగు ఊర్లపేర్లు కొన్ని సార్లు వింతగా కనిపిస్తుండటంతో (చిన కొత్తపల్లి అనేది గూగుల్ మేప్స్ లో చైనా కొత్తపల్లి) కనబడటం, OSM పటాలు సరియైన తెలుగు పేర్లతో కనబడడానికి చేర్చిన కృషిలోభాగంగా, తెవికీలో గ్రామపేజీలలోని సమాచారపెట్టెల మెరుగు మరల చేపట్టాను. మీ సందేహాలకు సమాధానాలు ఉపవిభాగాలుగా చేసి ఇస్తున్నాను. గమనించండి. అర్జున (చర్చ) 01:12, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Saiphani02 గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. వికీడేటా ఫొటో చేర్చటానికి ప్రయత్నిస్తాను. పటం జూమ్ స్థాయి పెంచి గ్రామ పరిసరాలు చూపించవచ్చు కాని, ప్రస్తుత వికీమీడియా పటరూపంలో కేవలం రోడ్లు, నదులు, చెరువులు లాంటి భౌతిక సౌలభ్యాలు మాత్రమే కనబడతాయి. అందువలన గ్రామానికి చుట్టు పక్కల గల పెద్ద గ్రామాలు, పట్టణాలు కనిపించేటట్లు చేయడం ద్వారా గ్రామ స్థానం తెలుసుకోవటానికి ఉపయోగం అని నా అభిప్రాయం. ఇతర సభ్యులు కూడా జూమ్ పెంచడానికి ఆసక్తి కనబరిస్తే మారుస్తాను. ఈ ప్రతిపాదనకు సంబంధించి, ప్రత్యేకంగా ఉత్తర ఆంధ్ర జిల్లాల వ్యాప్తంగా వికీడేటా, OSM లో విస్తారమైన మీ కృషికి ధన్యవాదాలు. అర్జున (చర్చ) 00:42, 13 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, నేను సమాచార పెట్టెల సవరణలు ఎక్కువ చెయ్యలేదు గనుక కొన్ని సందేహాలు ఉన్నాయి. కొత్త సమాచార పెట్టెలో Area, Population, Density, Area code అనేవి తెలుగులోకి మార్చడం కుదురుతుందా? అలా వీలు కాకపోతే ఆ పదాలు కనపడకుండానైనా చెయ్యొచ్చా? ఉదా: Area అసలు కనపడకుండా దాని కింద 'మొత్తం' స్థానంలో 'మొత్తం విస్తీర్ణం' అని వచ్చేలా చెయ్యొచ్చా?
@Kimeerat గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రతిపాదిత రూపు, ఆంగ్లవికీ మూస {{Infobox settlement}} పై ఆధారపడింది. నిర్వహణ కొరకు వ్యాసాలు, సంబంధిత మూసలు దిగుమతి చేసినప్పుడు, ఆ మూసలో పదాలు మరల ఆంగ్లంలోకి మారుతుంటాయి. మరల అనువాదం చేర్చవలసివస్తుంది. ఇప్పుడు అవసరమైన అనువాదాలు చేర్చాను. మూస_చర్చ:Infobox_India_AP_Village#ఆంధ్రప్రదేశ్_అన్ని_రెవెన్యూ_గ్రామాలకు_వికీడేటా_ఆధారిత_సమాచారపెట్టె_మార్పుకు_ఉదాహరణ లో తాజా అనువాదాలతో పటం చూడండి. అ ఇబ్బంది లేకుండా వుండాలంటే ఆంగ్ల మూసకి తెలుగు నకలు చేసి, ఆ మూస వాడటం. అయితే ఆంగ్లంలో మెరుగుపడినప్పుడు మరల మానవీయంగా ఆ మార్పులు మన నకలు మూసలోకి చేయవలసివస్తుంది. ఈ మూస గ్రామాలకొరకు విస్తారంగా వాడే ప్రతిపాదన చేస్తున్నందున ఆ పని చేయక తప్పదనిపిస్తుంది. చర్చపూర్తయిన తర్వాత చేస్తాను. అర్జున (చర్చ) 01:04, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
గ్రామ వ్యాసాలలో మ్యాపుల సంఖ్యపై పరిమితి వుండనవసరం లేదు. విషయ అవగాహనకు తగినన్ని వుండవచ్చు. గతంలో
గ్రామ వ్యాసాలలో సమాచారపెట్టెలో కనబడ్డ పటాలు కాకుండా, గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామాల పటం పెద్ద విస్తీర్ణంలో కనబడేటట్లు {{|Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}} అనే మూస కోడ్ చేర్చాను. (ఇంకొల్లు ఉదాహరణ (శాశ్వత లింకు)) అయితే అటువంటి రూపు సమాచారపెట్టె లో గల గతిశీల పటాన్ని పూర్తి విండోలో చూసి జూమ్ మార్చి చేరుకునే అవకాశం వున్నందున అటువంటి మేప్ అవసరంలేదని నా ప్రస్తుత అభిప్రాయం. దీనిపై స్పందనల ప్రకారం తగిన మార్పులు చేస్తాను.--అర్జున (చర్చ) 01:26, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
సమాచారపెట్టె విస్తీర్ణం ఎక్కువ, జూమ్ చేయకుండా రెవెన్యూ గ్రామం
ప్రతిపాదిత నమూనాతో ఇంకో పటం చేరినందున సమాచారపెట్టె విస్తీర్ణం ఎక్కువవుతుంది. దీనివలన వ్యాసం ఎబ్బెట్టుగా వుంటుందని నాకనిపించుటలేదు. ప్రతిపాదన నమూనాలో జూమ్ స్థాయి, పరిసర పట్టణాలను చూపించేదిగా వాడాము. జూమ్ స్థాయి పెంచి రెవిన్యూ గ్రామ పరిసరాలు మాత్రమే కనబడేటట్లు చేయవచ్చు. OSM లో ప్రస్తుతం చాలావరకు గ్రామానికి చేరుకునే ప్రధాన రహదారి, అడవులు, చెరువులు వంటి భౌతిక సౌలభ్యాలు మాత్రమే కనబడతాయి కావున, వికీమీడియా మేపు రూపుదిద్దిన పద్ధతిలో OSM లో గ్రామ దేవాలయాలు, పాఠశాల లాంటి సౌలభ్యాలున్నా కనబడవు కావున అంత ఉపయోగంగా వుండకపోవచ్చు. ఎక్కువ జూమ్ స్థాయికి గొత్తివాడ వికీడేటా అంశంలో Coordinate location అంశం ఎదురుగా కనబడే OSM పటం చూడండి. User:యర్రా రామారావు, User:Saiphani02 గార్లు, సహసభ్యులు ఆ విధమైన జూమ్ స్థాయి ఇప్టపడితే తెలపండి.--అర్జున (చర్చ) 02:02, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, సమాచారపెట్టెలో జూమ్ స్థాయి మార్చిన, వెడల్పు ప్రత్యేక పరామితిలో మార్చితే తప్ప మారదు. గ్రామాన్ని చాలా దగ్గరగా అంటే OSM లో దాని పేరు కనిపించేటట్లు చూపించాలా, లేక గ్రామ స్థానాన్ని మార్కర్ తో, చుట్టుపక్కల పట్టణాలు లేక మండల కేంద్రాలు చూపించితే మంచిదా అనే విషయంపై మీ అభిప్రాయాన్ని తెలపండి. అర్జున (చర్చ) 01:47, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రతిపాదన ఆంగ్ల మూస పై ఆధారపడింది. ఆంగ్ల మూసలో మొత్త విస్తీర్ణం, భూ విస్తీర్ణం, జల విస్తీర్ణం లాంటి వివరాలు చేర్చే వీలుంది, కావున మనకు ప్రస్తుతం మొత్తం విస్తీర్ణం మాత్రమే లభ్యమవుతున్నందున మొత్తం విస్తీర్ణం మాత్రమే కనబడుతున్నది. మొత్తం పదం తీసివేస్తే, విస్తీర్ణం ఒక వరుసలో, సంఖ్య రెండో వరుసలో వస్తుంది. Area కనబడకుండా, మొత్తం బదులు మొత్తం విస్తీర్ణం కనబడేటట్లు చేయవచ్చు. కాని సమాచారపెట్టెలో శీర్షికల క్రమం దెబ్బతింటుంది కావున రూపం కూడా కాస్త ఎబ్బెట్టుగా వుంటుంది. కావున ప్రస్తుత కూర్పుని కొనసాగించడమే మంచిదని నా అభిప్రాయం. పై వివరాలు పరిశీలించి, user:యర్రా రామారావు, user:Kimeerat గార్లు, సహ సభ్యులు స్పందించండి.--అర్జున (చర్చ) 02:32, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
విస్తీర్ణం కొలమానం( km2 బదులుగా చ.కి.మీ లాంటివి) కూడా ఆంగ్ల వికీ నుండి అదేపేరుతో దిగుమతి చేసుకున్న మూసపై ఆధారపడింది. తాత్కాలిక అనువాదాలు, మరల ఆంగ్ల వికీనుండి దిగుమతి చేసినప్పుడు రద్దవుతాయి. కావున సంబంధిత మూసను తెలుగులో వాడుకకు నకలు చేయాలి. ప్రయత్నిస్తాను. --అర్జున (చర్చ) 04:17, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Kimeerat, @యర్రా రామారావు గార్లకు, మూసలో ప్రధాన ఆంగ్లపదాల కొత్త రూపం దిగుమతైనప్పుడు మారకుండా, స్థానికంగా {{infobox settlement te}} అనే మూస వాడాను. కొత్త రూపు దిగుమతైనప్పుడు, కొలమానాలు ఆంగ్లానికి మారితే, పాత అనువాద రూపులో మానవీయంగా చేర్చాలి. విస్తీర్ణం కొరకు,
నా ఇటీవల కృషిలో తెలిసినదేమంటే, ఒక రెవెన్యూ గ్రామానికి ఒకటి లేక అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలుండవచ్చు, అలాగే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం లాంటి ఆదివాసి ప్రాంత జిల్లాలలో ఒకటి కంటే ఎక్కువ రెవెన్యూ గ్రామాలకు ఒక గ్రామ పంచాయతీ వుంటుంది. అలాగే 25% రెవెన్యూ గ్రామాలకు అదే పేరుతో ఆవాసాలు గల గ్రామం,పంచాయతీ వుండదు. కావున పంచాయతీ వివరాలను, వికీడేటాలో చేర్చి, రెవెన్యూ గ్రామాలతో అనుసంధానంచేసేవరకు, పంచాయతీ, సర్పంచి లాంటి వివరాలను చేర్చటం వీలుకాదు. అప్పుడు కూడా గ్రామపంచాయతీ ప్రత్యేక విషయంగా గల వ్యాసాలలో ఆయా వివరాలను చేర్చడం ఉపయోగం అని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 02:17, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అది లేకపోతే అజ్ఞాత వాడుకరులు ఎవరోకరు వ్యాసపేజీలను డిస్టర్బ్ చేస్తుంటారు.గ్రామానికి ఇది ముఖ్యమైన కాలమ్. పాత సమాచారపెట్టెలో ఈ వివరాలు ఉన్నవి. అవకాశం ఉన్నంతవరకు చేయగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 13:02, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారికి, సర్పంచి వివరాలు ప్రతిపాదిత మూస ద్వారా చేర్చటానికి సరైన సమాచారం వికీడేటాలో లేదు. అవసరమనుకుంటే మూస వాడుక infobox settlement సంబంధిత పరామితిలు వాడి చేర్చటానికి వీలు చేశాను. అర్జున (చర్చ) 10:18, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారికి, సర్పంచి వివరాలు ప్రతిపాదిత మూస ద్వారా చేర్చటానికి సరైన సమాచారం వికీడేటాలో లేదు. అవసరమనుకుంటే మూస వాడుక infobox settlement సంబంధిత పరామితిలు వాడి చేర్చటానికి వీలు చేశాను. మూస:Wikidata example లో లింకులు వాడవచ్చు, లేక మీకు ఆసక్తి గల రెవెన్యూ గ్రామ వ్యాసంలో పరీక్షించవచ్చు. మూస వాడినప్పుడు ఏమైనా దోషాలుంటే తెలపండి. అర్జున (చర్చ) 10:26, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రస్తుతానికి 2011 అధికారిక జనగణన వివరాలుమాత్రమే వున్నందున ప్రామాణిక సంవత్సరం 2011 మాత్రమే. 2021 జనగణన జరగలేదు. భవిష్యత్తులో కొత్త జనగణన అంశాలు అందుబాటులోకి వచ్చినప్పుడు వికీడేటాలో ప్రవేశపెట్టి, అపుడు ఆ జనగణన సంవత్సరానికి తగినట్లుగా మూసలో స్వల్పమార్పులు చేయాలి.
జనగణాంకాలలో గృహాల సంఖ్య చేర్చటానికి నాకు సమ్మతమే. ప్రత్యేకంగా పురుషులు, స్త్రీల సంఖ్యలు, లింగ నిష్పత్తి చేర్చటం వలన గ్రామస్థాయిలో పెద్దగా ఉపయోగం లేదని నా అభిప్రాయం. వీటివలన సమాచారపెట్టె నిడివి కూడా పెరుగుతుంది. ఇతర సభ్యులు కూడా తమ అభిప్రాయాలు తెలిపితే మెజారిటీ అభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేస్తాను. --అర్జున (చర్చ) 02:22, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, Chaduvari గారు కూడా ఈ విషయం తమ స్పందనలో ప్రస్తావించారు. పురుషులు, స్త్రీల జనసంఖ్యలు చూపించడం సమస్య కాదు, కాని అలా చూపించడం వలన సమాచారపెట్టె విలువ,ఉపయోగం ఎంతవరకు మెరుగవుతుంది అనేది సమస్య. ఆంగ్లవికీ వ్యాప్తంగా వాడే infobox settlement ప్రధాన మూసలో పురుషులు, స్త్రీల జన సంఖ్యలకు పరామితి లేదని గమనించారనుకుంటాను. ఆంగ్ల వికీపీడియా వ్యాసాలలో సమాచారపెట్టెలో బొమ్మ చూపించవచ్చనే సౌకర్యం వుంది కాబట్టి ఐదారు బొమ్మలు చూపిస్తున్నారు. అలా చేయడంవలన సమాచారపెట్టెలో ఇతర ముఖ్యమైన సమాచారంపై ఫోకస్ తగ్గుతుంది అని నా అభిప్రాయం. ఆంగ్లవికీలో ఆంధ్రప్రదేశ్ వ్యాసంలో చర్చ తరువాత మూడు ఫొటోలకు కుదించాను. ఈ విషయంపై గతంలో కూడా చర్చించాము. అందువలన ఈ చర్చని పొడిగించదలచుకోలేదు. సమాచారపెట్టె కూర్పులో ఇవి కూడా చూపించటానికి ప్రయత్నిస్తాను. అర్జున (చర్చ) 02:18, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ముందుగా, {{Infobox India AP Village}} మూసపై తిరిగి పనిచేస్తున్నందుకు అర్జున గారికి ధన్యవాదాలు. ఇందులో ప్రస్తుతం చూపిస్తున్న అంశాలతో పాటు పురుషుల స్త్రీల జనసంఖ్యలను కూడా చూపిస్తామని ఆయన చెప్పారు, బాగుంది. అయితే, బొమ్మ కూడా ఆ సమాచారపెట్టెలో ఉండాలనేది నా అభిప్రాయం. ఆ విధంగా ఆ మూస మరింత సమగ్రంగా ఉంటుంది. ప్రస్తుతం అది రావడం లేదు. నేను కావూరు (చెరుకుపల్లి మండలం) పేజీలో దీన్ని పరిశీలించాను. సంబంధిత వికీడేటా పేజీలో బొమ్మ ఉంది. ఇది ఎలా చెయ్యాలనేది అర్జున గారికి ఎరుకే కాబట్టి దాని గురించి ఇక చర్చించాల్సిన పనిలేదు. అయితే, ఆపని చేసాక కూడా కింది సందర్భాలలో కొత్త మూస, బొమ్మను చూపించదు:
వికీడేటాలో బొమ్మ లేదు, కానీ కామన్సులో ఉంది. తెవికీలో ఇప్పటి సమాచారపెట్టెలో కూడా ఆ బొమ్మే ఉంది. ఈ సందర్భంలో కొత్త మూస బొమ్మను చూపించదు.
వికీడేటాలో బొమ్మ లేదు, కామన్సులో కూడా లేదు. కానీ తెవికీలో ఇప్పటి సమాచారపెట్టెలో స్థానికంగా ఎక్కించిన సముచిత వినియోగపు బొమ్మ ఉంది. అపుడు కూడా కొత్త మూస బొమ్మను చూపించదు.
బొమ్మ ఉన్న సమాచారపెట్టెను తీసేసి బొమ్మ లేని పెట్టెను పెట్టడం సరైన పని కాదు గాబట్టి, నాకు కింది పరిష్కారాలు తోచాయి
సంబంధిత వికీడేటా పేజీలో బొమ్మ ఉన్న తెవికీ పేజీల్లోనే కొత్త సమాచారపెట్టెను చేర్చాలి. లేదా
కొత్త సమాచార పెట్టెను చేర్చాక, పేజీలో వేరే చోట బొమ్మను చేర్చాలి. లేదా
కొత్త మూసలో బొమ్మను ఇచ్చే పరామితిని పెట్టాలి. వికీడేటాలో బొమ్మ ఉంటే తెస్తుంది. లేనట్లైతే ఈ పరామితిలో ఇచ్చిన బొమ్మను చూపిస్తుంది. రెండూ లేకపోతే ఏమీ చూపించదు.
ఈ మూడోది నాకు మెరుగ్గా అనిపించింది. పరిశీలించవలసినది.
పోతే -
రేపు WPWP పోటీయో, కొత్తగా గ్రామాల ఫొటోలను ఎక్కించే పోటీయో జరిగినపుడు వచ్చే ఫొటోలను కామన్సు లోకి ఎక్కించడమే కాకుండా, వికీడేటా పేజీల్లోకి ఎక్కించాలి అనే అంశం చేర్చాలి అని ప్రకటించాలి. గతంలో కామన్సు లోకి ఫొటో ఎక్కించాక తెవికీలో సంబంధిత పేజీలో చేర్చాలి అని ఉండేది. __చదువరి (చర్చ • రచనలు) 14:39, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
పాత సమాచారపెట్టెలో ఆ వ్యాసానికి చెందిన బొమ్మ చేర్చటానికి అవకాశం ఉంది. ఆ సదుపాయం ఎలాగూ ఉంటుందనుకున్నాను.అందువలన బొమ్మను గురించి నేను అంతలోతుగా ఆలోచించలేదు. ముందు ముందు ప్రతి గ్రామం తాలూకూ ఏదో ఒక బొమ్మ అందుబాటులో ఉండటానికి అవకాశం ఉంది. ఈ విషయపై @Chaduvari గారు పరిశీలించి @అర్జున గారి దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 15:11, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మండల జిల్లా లింకులలో ప్రత్యయాల తొలగింపు, Government కు సంబంధించి వివరాలు లేకున్నా అ పదము కనబడుతున్న బగ్ కూడా పరిష్కరించాను. నిన్నటి సందేశానికి ఇంకా స్పందనలు రానందున, అదే మూసలో మార్పులు చేశాను. అర్జున (చర్చ) 00:50, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Saiphani02 గారు, ధన్యవాదాలు. రెవెన్యూ గ్రామ విస్తీర్ణానికి తగ్గట్టుగా జూమ్ స్థాయి ఎంపిక మూసలో వున్నందున, కొండప్రాంత జిల్లాలలో అధిక జూమ్ లో కనబడుతుంది. అన్నట్లు, భీమవరం (మారేడుమిల్లి) లోని బొమ్మకు వికీడేటా లో qualifier గా "media legend" లక్షణానికి బొమ్మ వ్యాఖ్య చేర్చాను. ఆ విషయం సమాచారపెట్టెలో కనబడేటట్లు {{infobox India AP Village/sandbox2}} లో మార్చాను. స్పందనలన్నీ పరిశీలించినతరువాత తుది కూర్పులో ఈ మార్పులు చేరుస్తాను. అర్జున (చర్చ) 04:36, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, నేను మరచాను. సాధారణ పదాలకు లింకులివ్వకూడదనే నియమం వుంది కావున లింకులు మీరు చెప్పినవాటిలో జనసాంద్రతకు మాత్రమే లింకు వచ్చేటట్లుగా మార్పులు చేశాను. సర్పంచి కి లింకు మూసని వాడేవారు లింకుతో చేర్చవచ్చు. అర్జున (చర్చ) 01:05, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, ఎక్కువ పటాలు చూపటానికి రేడియో బటన్ వాడి సమాచారపెట్టె పరిమాణం కుదించటానికి వీలవుతుంది. ఇక్కడ రెండు పటాలు మాత్రమే వాడుతున్నందున అది అవసరంలేదు. ఇంకొక విషయం, ఆంధ్రప్రదేశ్ లో స్థానం పటం చూపటానికి వాడుతున్న సాంకేతికత, వికీమీడియా మేప్ చూపటానికి వాడుతున్న సాంకేతికత భిన్నమైనవి కావున, వాటి రెంటిని రేడియో బటన్ తో ఒకే పటంగా చూపటం వీలుపడదు. అర్జున (చర్చ) 01:10, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఇప్పుడు infobox settlement లో గల అప్రమేయ వెడల్పు 250px వాడుతున్నాము. ఈ మూస పై ఆధారపడిన పేజీల ఏకరీతి కూర్పుకు అలానే వుంచటమే మేలనిపిస్తుంది. ఇతరులు కూడా స్పందిస్తే పరిశీలిస్తాను. అర్జున (చర్చ) 04:39, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రస్తుత సమాచారపెట్టె కంటే దీని వెడల్పు ఎక్కువగా ఉన్నట్టుంది సార్ - దాదాపు 325 వరకు ఉంది. 23em ఉన్నట్టు స్టైల్ షీటులో చూసాను. అంటే అక్కడి ఫాంటు సైజును బట్టి అది 322px ఉన్నట్టు. 250px ఉండాలంటే 18em వరకు సరిపోతుంది. పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 04:52, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ సమాచారపెట్టె వ్యాసంలో సాధ్యమైనంత తక్కువ పరిమాణంలో ఉంటేనే బాగుంటుంది.దానికి తార్కాణం సమాచారపెట్టె ఎక్కువ వెడల్పు పరిమాణం ఉంటే కొన్ని వ్యాసాలలో పట్టికలు ఉంటవి, ఆ వ్యాసాలలో సమాచారపెట్టె పొడవుకు తగిన విషయసంగ్రహం ఉండదు.ఆ వ్యాసాలలో ఒక్కోసారి ఖాళీ స్పేస్ ఉంటుంది.అలా ఎన్నికల ప్రాజెక్టులో చాలా వ్యాస పేజీలు ఎబ్బెట్టుగా ఉన్నవి.దీనికి మరో ప్రత్యామ్నాయం ఉందేమో నాకు తెలియదు. యర్రా రామారావు (చర్చ) 04:56, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
Infobox settlement మూస,దాని ఆధారిత మూసలు వాడే వ్యాసాలలో సమాచారపెట్టె పరిమాణం పోలిక
@Chaduvari, @యర్రా రామారావు గార్లకు , బొమ్మ 250px వుంటే రెండు వైపుల మార్జినుతో కాస్త ఎక్కువగా వుంటుంది. మూల మూస, దాని ఆధారిత గ్రామాలలో వాడే మూస వ్యాసాలను పోల్చిన ఫొటో చూడండి. నేను వాడిన జూమ్ లో బొమ్మ వెడల్పు 378px, సమాచారపెట్టె వెడల్పు 422px వుంది. బ్రౌజర్ లో జూమ్ స్థాయి మార్చుకునే (CTRL తో + లేక -) సౌలభ్యంతో పాఠకులకు సమాచారపెట్టె కనబడే పరిమాణం మారుతుంది కూడా. వ్యాసంలో పట్టికలున్నప్పుడు వాటి వాడుక ఎబ్బెట్టుగా లేకుండా సరిదిద్దటానికి వ్యాసాన్ని సరిచేయటం, లేక ఇతర మూసలు వాడటం చేయవచ్చు. మీరు సమస్యగలవ్యాసం లింకు తెలిపితే పరిశీలిస్తాను. అర్జున (చర్చ) 05:51, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
సమాచారపెట్టె వెడల్పు ఎక్కువగా ఉంది, దాన్ని తగ్గిస్తే బాగిఉంటుంది అనేది నేను చెప్పినది. అందుకే నేను పోలిక చూపించాను. మీరు ఎన్వికీలో అలా ఎందుకుందో చెప్పారు. అలా ఎందుకుంది అనేది కాదు మన చర్చ, వెడల్పు తక్కువగా ఉంటే బాగుంటుందని నేను అన్నాను. ఎక్కువగా ఉంటేనే మీకు బాగుంటే, సరే అలాగే కానివ్వండి.
పెట్టె వెడల్పుగా ఉందని భావించినవాళ్ళు బ్రౌజరులో జూమౌట్ చేసుకుని చూడండి అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అప్పుడు ఫాంట్లు చిన్నవైపోయి కనబడవు గదా!
@Chaduvari గారు, నేను సమాచారపెట్టె ఏకరూపత గురించి, సమాచారపెట్టె వెడల్పు బ్రౌజర్ జూమ్ ప్రకారం మారేవిధం, వెడల్పు మార్పుల ప్రభావం గురించి మాట్లాడాను. మీరు నా వ్యక్తిగత ఇష్టాలుగా అపార్ధం చేసుకుంటున్నారు. వికీపీడియాలో మార్పులు ఎవరైనా చేయవచ్చు. ఆ మార్పులు వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై కాక. తర్కబద్దంగా, ఎక్కువమంది సభ్యుల అభీష్టంమేరకు చేయటం మంచిది. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 01:34, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియాలో చేసే మార్పులు వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై కాక. తర్కబద్దంగా, ఎక్కువమంది సభ్యుల అభీష్టంమేరకు చేయటం మంచిదనే విషయంలో మరొక అభిప్రాయానికి తావే లేదు. కాకపోతే ఒక విషయంపై చర్చించేటపుడు చర్చను పక్కదారి పట్టించకుండా, అంశంపైననే మాట్లాడాలి. అపుడే మనం ఒక నిర్ణయానికి రాగలం సార్. లేకపోతే ఇదిగో ఈ చర్చలాగే అవుతుంది. సరే, మీరు చెయ్యదలచినది చేసెయ్యండి. __ చదువరి (చర్చ • రచనలు) 01:42, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ చర్చలో నా వాదనలు అంశంపైనే మాట్లాడానే, మీకు పక్కదారి పట్టించినట్లుగా ఎలా అనిపించిందో నాకైతే అర్ధంకాలేదు. బహుశా ఇది చదివే ఇతర సభ్యులు ఎవరైనా శ్రమదీసుకొని విశదీకరించితే నాకు ఉపయోగంగా వుంటుంది. అర్జున (చర్చ) 02:25, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వికీలో బొమ్మ అప్రేయ పరిమాణం 220px అనుకుంటాను.దానికి కుదించటానికి అవకాశం ఉంటే చేయగలరు.ఇప్పుడు మీరు ప్రక్కన చూపిన పటంలో అయితే కాస్త ఎబ్బెట్టుగానే ఉంది.ఒకవేళ చిన్న పరిమాణంలో చూడటాన అలా ఉందేమో నాకు అర్థమగుటలేదు.దీనిమీద చదువరి గారూ స్పందిస్తే బాగుంటుంది. యర్రా రామారావు (చర్చ) 06:10, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రతిపాదిత మూస చర్చలో స్పందించిన అందరికి ధన్యవాదాలు. ప్రతిపాదిత మూస రూపం దాదాపుగా ఖరారైనందున, ఇక దీని అమలుకు సన్నాహాలు ప్రారంభించాను. వికీడేటాలో బొమ్మ, STD code తప్పించి ఇతర వివరాలు ఇప్పటికే వున్నాయి. పెట్ స్కాన్ క్వెరీ ప్రకారం 404 వ్యాసాలలో సమాచారపెట్టెలో కాని ఇతర వ్యాసవిభాగాలలో కాని బొమ్మలు వున్నాయి. సమాచారపెట్టెలో గల బొమ్మలను, వాటి వ్యాఖ్యను ఇప్పటికే వికీడేటాలో లేకపోతే నేను చేరుస్తాను. ఎస్ టి డి కోడ్లు చాలావరకు నగరాలు, పట్టణాలకు మాత్రమే నెట్లో అందుబాటులో వున్నాయి. ప్రస్తుత సమాచారపెట్టెలో గలవి మూలాలు లేకుండా చేర్చినవి, వాటిని చేర్చటానికి నేను గమనించిన చోట్ల area code పరామితి కాక ఇతరాలు(ఉదా: blank_info) వాడారు. అలాగే సర్పంచి వివరం వికీడేటాలో ప్రస్తుతం చేర్చలేము, గ్రామ సమాచారపెట్టెలో కూడా పేరు తప్ప మూలాలతో చేర్చినవి చాలా అరుదు. కొత్త సమాచారపెట్టె ప్రవేశపెట్టినపుడు ఇవి తొలగించబడతాయి. ఈ విషయమై ఏమైనా సందేహాలుంటే తెలియచేయండి.--అర్జున (చర్చ) 01:27, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
హైదరాబాదు పుస్తక ప్రదర్శన గ్రాంటు దరఖాస్తుకు మద్దతు
హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో స్టాలును నిర్వహించేందుకు గాను, గ్రాంటు కోసం దరఖాస్తుకు చేసిన సంగతి రచ్చబండ లోనే పైన రాసారు. మెటాలో ఈ దరఖాస్తును పరిశీలించి అక్కడే దాని చర్చ పేజీలో మద్దతును ప్రకటించవలసినది. ఈసరికే కొందరు మద్దతు ప్రకటించారు. ఇంకా దాన్ని చూడని వాళ్ళ కోసం ఈ పిలుపు. __ చదువరి (చర్చ • రచనలు) 13:43, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియాలో ఇప్పటి వరకు వెయ్యికంటే ఎక్కువ వ్యాసాలు రాసిన వారి జాబితా ఇది. ఈరోజు ఇదయం 7 గంటలకు తీసిన జాబితా. ఒక విశేషం ఏమిటంటే, అన్నిటికంటే పైనున్న వినయ్ కుమార్ గౌడ్ గారు 10,000 వ్యాసాల సంఖ్యను చేరుకున్నారు.
రోజుకో వ్యాసం చొప్పున 100 రోజులు రాయడం సాధ్యమేనా అని అనుకునేవాణ్ణి నేను. రోజుకు ఒకటి కాదు, పది వ్యాసాలు రాయొచ్చని, 100 రోజులు కాదు, విడవకుండా వరసబెట్టి ఏళ్ళ తరబడి రాయొచ్చనీ నిరూపించారు వినయ్ గారు. అలాగని నాణ్యత విషయంలో అయన రాజీ పడలేదు. ఆయనకు అభినందనలు.
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/చర్చావేదిక, వికీసోర్స్ కు గ్రంథాలయ సర్వస్వం
సభ్యులకు నమస్కారం
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తరపున కొన్ని కార్యక్రమాలు చేపట్టాము. అవి తెవికీ బడి, ప్రాజెక్ట్ సురవరం ఇతర శిక్షణా కార్యక్రమాలు ఇంకా ...
అయితే యూజర్ గ్రూప్ కార్యాచరణకు వీలుగా అనుసరించవలసిన ప్రక్రియలు గురించి చర్చించేందుకు వీలుగా పవన్ గారి సలహా మీద యూజర్ గ్రూప్ పేజీ కి అనుబంధంగా ఒక చర్చావేదికను ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యులు పరిశీలించవలసినదిగా కోరుతున్నాను.
ఇంకొక విషయం ఏమంటే ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం(APLA) ప్రచురించే గ్రంథాలయ సర్వస్వం పత్రిక డిజిటల్ ప్రతులను వికీసోర్స్ కు ఇచ్చే ప్రక్రియ గురించి చర్చావేదికలో ప్రతిపాదన పెట్టడం జరిగింది. సభ్యులు పరిశీలించి తమ అభిప్రాయాలు తెలుపవలసినది.
ధన్యవాదాలు V.J.Suseela (చర్చ) 13:12, 18 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
నా చిన్నపుడు ఈ పత్రికను లోకల్ లైబ్రరీ అథారిటీ వారి గ్రంథాలయాల్లో చూసేవాడిని. అప్పుడు పాతూరి నాగభూషణం గారు సంపాదకులుగా ఉండేవారు. మంచి విలువైన వ్యాసాలతో నిండి ఉండే ఈ పత్రిక నిరాటంకంగా నడుస్తూవుండటం ముదావహం. మంచి ప్రక్రియ. నేను మద్దతు ప్రకటిస్తున్నాను. --Ramesam54 (చర్చ) 06:38, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఇటీవల వికీలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి తెవికీ యువ సహాయంతో ఒక కార్యక్రమానికి వికీమీడియా వారి నుండి గ్రంటూ తీసుకున్న విషయం అందరికి తెలిసినదే. అయితే ఈ గ్రాంటూ లో చెప్పిన విధంగా రెండు రోజుల పాటు వి యన్ ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాలలో మహిళల, అన్య లింగాల భాగస్వామ్యం పెంచే విధంగా జూన్ 20,21 తారిఖుల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాను.
తెవికీలో ఇప్పటికి 96,319 వ్యాసాలున్నాయి. 96,393 త్వరలోనే లక్ష వ్యాసాల మైలురాయిని చేరుకోబోతున్నాం. బహుశా మరో మూడు నెలల్లో దీన్ని అందుకుంటాం. మిగిలిన 3700 వ్యాసాలను రాయడంలో మనమందరం ఒక చెయ్యి వేద్దాం. ప్రస్తుతం అత్యధిక వ్యాసాలు రాస్తున్న మొదటి ముగ్గురూ (వినయ్ కుమార్ గౌడ్, ప్రణయ్ రాజ్, మురళీకృష్ణ గార్లు) కలిసి రోజుకు 20 వ్యాసాలు రాస్తున్నారు. మిగతా అందరం కలిసి ఒక ఏడెనిమిది రాస్తున్నాం. లక్షకు చేరుకునే క్రమంలో అందరం కలసికట్టుగా, సాముదాయికంగా కృషి చేసేందుకు లక్ష వ్యాసాల దిశగా ప్రగతి అనే ప్రాజెక్టు మొదలుపెట్టాను. అందరం చేయీ చేయీ కలిపి, ఆడుతూ పాడుతూ లక్షవ మెట్టు ఎక్కేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 01:22, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]