Jump to content

వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 52

వికీపీడియా నుండి

పాత చర్చ 51 | పాత చర్చ 52 | పాత చర్చ 53

alt text=2016 ఆగస్టు 11 - 2016 ఆగస్టు 28 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2016 ఆగస్టు 11 - 2016 ఆగస్టు 28

ఒక బాట్ కావలెను

[మార్చు]

మన వ్యాసాల్లో సాధారణంగా దొర్లుతున్న కొన్ని లోపాల గురించి గతంలోనూ చర్చించినట్టు గుర్తు. అయినా మళ్ళీ రాస్తున్నాను. సాధారణంగా దొర్లే లోపాలు ఇవి:

  1. కామా, ఫుల్‌స్టాపుల వంటి విరామ చిహ్నాలకు ముందు స్పేసు పెట్టడం - వచ్చాడు . ఇచ్చి , లాంటివి.
  2. కామా, ఫుల్‌స్టాపుల వంటి విరామ చిహ్నాల తరువాత స్పేసు పెట్టకపోవడం - ..ఇచ్చాడు.ఆ తరువాత మళ్ళీ తీసుకుని,తిరిగి ఇవ్వలేదు -ఇలాంటివి.
  3. ఒకటి కంటే ఎక్కువ స్పేసులు పెట్టడం
  4. ఒకటి కంటే న్యూలైనులు పెట్టడం
  5. శీర్షికలు, ఉపశీర్షికల కోసం పెట్టే "=" ల సంఖ్య రెండు వైపులా సమానంగా ఉండకపోవడం వలన అవి వ్యాసంలో కనబడ్డం
ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా.

వీటిని సవరించేందుకు బాటొకటి రాస్తే బాగుంటుందని గతంలో అనుకున్నాం. అలాంటి బాటొకదాన్ని అప్పుడప్పుడూ నడిపిస్తూంటే, ఇలాంటి లోపాలు సరిదిద్దడం తేలిక. పరిశీలించండి.__చదువరి (చర్చరచనలు) 05:37, 11 ఆగష్టు 2016 (UTC)

చదువరి గారూ, రహ్మానుద్దీన్ దగ్గర ఇలాంటి అక్షర దోషాలు సరే చేసే బాటు ఉండాలి. అందులో ఇలాంటివి కూడా చేర్చమందాం. --రవిచంద్ర (చర్చ) 06:01, 11 ఆగష్టు 2016 (UTC)

నేను మీరు చెప్పిన విధంగా మార్చగలను. వీలైతే ఎలా మారుస్తున్నానో కూడా వివరిస్తాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 12:12, 26 ఆగష్టు 2016 (UTC)

ఊరి పేర్లకు కొత్తగా పేజీలు తయారు చేసేటపుడు..

[మార్చు]

కొన్ని ఊళ్ళకు ఒకటి కంటే ఎక్కువ పేజీలుంటున్నాయి. బహుశా పేరును పలకడంలో ఉండే తేడాల కారణంగా ఇది జరుగుతూ ఉండొచ్చు. ఉదాహరణకు, అఖాన్ పల్లి, ఆకన్‌పల్లి. ఈ రెండూ ఒకే మండలానికి చెందినవి. మొదటి దానికి ఆ మండలం పేజీనుండి లింకు లేదు, రెండోదానికి ఉంది. ఈ రెంటినీ విలీనం చెయ్యడం తప్ప మరో మార్గం లేనట్టనిపించింది. ఇలాంటివి ఇంకా కొన్ని కనబడ్డాయి, నా కీ మధ్య. గ్రామాలకు పేజీలు తయారు చేస్తున్న వాడుకరులకు ఈ సంగతి ఈపాటికే తెలిసి ఉంటుంది. దానికి కారణాలేంటో కూడా వారికి తెలిసే ఉంటుంది. దాన్ని నివారించడానికి, జరిగిపోయిన వాటిని సరిదిద్దడానికీ వారేదైనా సూచనలు చేస్తే మిగతా వారికి ఉపయోగంగా ఉంటుంది. నాకు తోచిన నివారణ పద్ధతిది: కొత్తగా గ్రామాలకు పేజీలు తయారు చేసేటపుడు...

  1. సంబంధిత మండలం పేజీకి వెళ్ళి, ఊరి పేరును ఎలా రాసారో చూడాలి, ఆ పేరుతో పేజీ ఉందేమో చూడాలి.
  2. ఉంటే, కొత్తగా పేజీ తయారు చెయ్యనక్కరలేదు. ఉన్న పేజీలోనే కొత్త సమాచారం రాసెయ్యొచ్చు.
  3. ఆ పేజీ పేరు తప్పుగా రాసారనుకుంటే, దాన్ని సరైన పేరుకు తరలించాలి.__చదువరి (చర్చరచనలు) 15:20, 11 ఆగష్టు 2016 (UTC)
ఇలాంటివి ఉంటే ముందుగా సరి చేసుకోవాలి. మనం ఖమ్మం జిల్లా సమాచారం చేర్చాలనుకుంటున్నాం. ఇలా ఒకే పేరుతో ఉంటే పెద్ద కంఫ్యూజ్ గా ఉంటుంది. అందుకే అవి సరిచూసి మార్పు చేయాలి.--Viswanadh (చర్చ) 15:25, 11 ఆగష్టు 2016 (UTC)
అక్షర బేధాలతో మరో గ్రామ వ్యాసం సృష్టించేటపుడు ఒక సారి వెతికి పరిశీలించమని నేను గుళ్లపల్లి గారికి ఓ సారి తెలియజేశాను.--రవిచంద్ర (చర్చ) 07:37, 12 ఆగష్టు 2016 (UTC)

ప్రాజెక్టు వ్యాసాల్లో అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు, అనువాదాలు

[మార్చు]

దయచేసి ప్రాజెక్టు వ్యాసాల్లో పనిచేస్తున్న వారు అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు, అనువాదాల అవసరాలు పట్టిక వేయగలరు. పదానికి పదానికి, వేసినా ఫర్వాలేదు. ఇప్పటకే వేసిన పట్టిక రేపు రాత్రిలోపుగా వికీలో పెట్టి అందరితో పంచుకుంటాం. దానికి మీరనుకున్నవి చేర్చండి. భవిష్యత్తులో తయారుచేసే మిగతా జిల్లాల వ్యాసాల్లో మరికొంత మెరుగైన పాఠ్యాన్ని తయారుచేసుకోవచ్చు. ఉత్సాహకరంగా పనిచేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఈ వేగంతో, ఉత్సాహంతో ముందడుగు వేస్తే కొద్ది రోజుల్లోనే గ్రామాల వ్యాసాల స్థాయిని మెరుగుచేసుకోవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:56, 12 ఆగష్టు 2016 (UTC)

ఆంధ్రా లయోలా కళాశాల విద్యార్థులకు కార్యశాల

[మార్చు]

అందరికీ నమస్కారం,
విజయవాడకు చెందిన ఆంధ్ర లొయొలా కళాశాల వృక్షశాస్త్ర, తెలుగు, భౌతికశాస్త్ర, సాంఖ్యక శాస్త్ర విద్యార్థులకు ఆగస్టు 16, 2016 నుంచి 3 రోజుల వికీపీడియా కార్యశాల నిర్వహించనున్నాం. ఒక్కో విభాగం నుంచి కార్యశాలలో 10 మంది విద్యార్థుల చొప్పున పాల్గొంటారు. సీఐఎస్-ఎ2కె, ఆంధ్ర లొయోలా కళాశాల సంయుక్తంగా ఈ కార్యశాల కోసం పనిచేస్తున్నాయి. ఇందులో పాల్గొనేందుకు కానీ, కార్యశాల నిర్వహణ విషయమై సూచనలు అందజేసేందుకు కానీ చేసేందుకు సముదాయ సభ్యులను ఆహ్వానిస్తున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:56, 11 ఆగష్టు 2016 (UTC)

మంచి కార్యక్రమం. కానీ, ఇటువంటి కార్యక్రమాలన్ని పండగ రోజులలో ఏర్పాటుచేస్తున్నారు. అందువల్ల రావడానికి అనుకూలంగా ఉండడంలేదు. దయచేసి గమనించగలరు..--Pranayraj1985 (చర్చ) 12:59, 12 ఆగష్టు 2016 (UTC)
కార్యశాలలో ఇలా చెయ్యొచ్చు
  1. వికీలో చెయ్యదగిన వాటిపై ఎక్కువ, చెయ్యకూడని వాటిపై తక్కువా సమయం కేటాయించాలి. వికీలో రాసేందుకు, సరిదిద్దేందుకూ వెనకాడనక్కర్లేదని చెప్పాలి.
  2. వికీ పేజీ ఆకృతి గురించి తక్కువ మాట్లాడి, పాఠ్యం చేర్చడం ముఖ్యమని చెప్పాలి. వికీకరించడం వాళ్ళే ఆటోమాటిగ్గా నేర్చుకుంటారు.
  3. కొన్ని మంచి వ్యాసాలను తీసుకుని అవి ఎంతమంది రాసారో, ఎన్ని కూర్పులున్నాయో, ఎన్నెన్ని మార్పుచేర్పులు జరిగాయో వివరిస్తే, ఏ రూపంతో మొదలై ఏ రూపానికి చేరిందో తెలుస్తుంది. సాముదాయిక కృషి గురించి కొంత అవగాహన వస్తుంది.
  4. ఏవో ఒక పది పదిహేను తెలుగు పదాలను చెప్పమని వాటి కోసం గూగిలించాలి. దాదాపుగా అన్ని ఫలితాల్లోనూ వికీపీడియాయే ముందుండడం వాళ్ళు చూడాలి.
  5. వికీలో తెలుగులో రాయడం ఎంత తేలికో స్పష్టం చెయ్యాలి.
  6. వాళ్ల ఊరి గురించి, విజయవాడ గురించి, కృష్ణా జిల్లా గురించి, కృష్ణా జిల్లా ప్రముఖుల గురించీ, పుష్కరాల గురించీ తెవికీలో ఉన్న పేజీలను చూడమనాలి.
  7. తెవికేయులు ఎంతమంది ఉన్నారో, వాళ్ళలో ఎంతమంది కుర్రాళ్ళున్నారో, ఎంతమంది సాఫ్టువేరు వాళ్ళున్నారో (ఇవన్నీ మనకు చూచాయగా తెలిస్తే) చెప్పాలి.
  8. ఫోటోలు చేర్చడం ఎంత ముఖ్యమో చెప్పాలి.
వికీలో వాళ్ళు ఏమేం చెయ్యొచ్చో చెప్పేందుకు కొన్ని సూచనలు:
  1. ఒక్కొక్కరూ మరో ఒక్కరికి తెవికీని పరిచయం చెయ్యాలి.
  2. వాళ్ళ తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకూ తెవికీని పరిచయం చెయ్యాలి
  3. వాళ్ళకు ఆసక్తి కలిగించే వ్యాసాల్లో పనిచెయ్యడం మొదలు పెట్టాలి:
    1. మీ ఊరి పేజీ
    2. మీ అభిమాన వ్యక్తి పేజీ
    3. మీ అభిమాన సినిమా పేజీ
    4. ఇతర అభిమాన విషయాల్లో ఒక్కటి తీసుకుని దానికో పేజీ
    5. భాషపై ఆసక్తి ఉంటే ఏదో ఒక వ్యాసాన్ని తీసుకుని దానిలో భాషాదోషాలను సవరించవచ్చు
  4. విజయవాడలో కొన్ని రోడ్లకు చిత్రమైన పేర్లుంటాయి. ఆ పేర్లు ఎలా వచ్చాయో రాయొచ్చు. విజయవాడ రోడ్లు అని ఒక పేజీ పెట్టి రాసెయ్యొచ్చు.
  5. ఫొటోలు పెట్టొచ్చు
  6. విజయవాడ లయోలా కాలేజీ కుర్రాళ్ళు చేస్తున్న ప్రాజెక్టు అని పెట్టి తమకు అసక్తి ఉన్న విషయాలపై వ్యాసాలు రాయొచ్చు (ఇది కుదురుతుందో లేదో మనం ఆలోచించాలి). ఈ పద్ధతిలో వాళ్ళు మరింత ఆసక్తిగా పనిచెయ్యొచ్చు. __చదువరి (చర్చరచనలు) 15:43, 12 ఆగష్టు 2016 (UTC)
ప్రణయ్ గారూ ఈ కార్యశాల సమయాన్ని నిర్ధారించడంలో కళాశాల వారి కోణం పుష్కరాల సందర్భంగా వచ్చిన సెలవులను సద్వినియోగం చేసుకోవడం అన్నది కూడా ఉండడంతో ఇలా పుష్కరాల మధ్యలో నిర్వహించాల్సి వచ్చిందండీ. చదువరి గారూ కార్యశాల నిర్వహించేప్పుడు వారికి తెవికీ గురించి తెలియజేయడంలోనూ, ఇతర సందర్భాల్లోనూ మీరు చేసిన చక్కని సూచనలు చాలా ఉపయోగపడ్డాయండీ. వికీలో ఏమేమి చేయవచ్చో, వికీలో వ్యాసం ఎలా ప్రారంభమై ఈ రూపు తీసుకుంటుందో, ఫోటోలు చేర్చడం ఎంత ప్రధానమో, వారి ప్రాంతం గురించి, ఇష్టమైన అంశాల గురించి ఎలా కృషి చేయవచ్చో వగైరాలు చెప్పగలిగాం. ఫోటోలు ఎలా చేర్చవచ్చన్న దానికి కొంత సమయాన్ని కేటాయించి చేయించాం. కొందరు అభిమాన నటుడు, సినిమా పేజీలు రాశారు. మరికొందరు భాషాదోషాలు సరిజేసుకున్నారు. ఇలా దీన్ని ప్రయోజనకరంగా మలిచేలా చేసినందుకు మీకూ ఎంతో ధన్యవాదాలు. ప్రయత్న లోపం లేకుండా బోధించే ప్రయత్నం జరిగింది. అలానే ప్రత్యక్షంగా హాజరు కాలేక వికీ పద్ధతిలో అంతర్జాలంలో ఈ మార్పుచేర్పులను పర్యవేక్షించిన రాజశేఖర్ గారు, రవిచంద్ర గారు, వెంకటరమణ గారు, తదితర వికీపీడియన్లందరికీ ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 13:24, 22 ఆగష్టు 2016 (UTC)

యోగ దానాలు

[మార్చు]

పేజీ పైన ఉన్న మెను లో కంట్రిబ్యూషను అనే లింకు ను యోగదానాలు అని మార్చేశారు. ఇది సరిదిద్దాలి.--రవిచంద్ర (చర్చ) 05:32, 12 ఆగష్టు 2016 (UTC)

ట్రాన్స్ లేట్ వికీ లో నేను సరిచేశాను. MANIKHANTA ఈ మార్పులు చేసినట్లు చూపిస్తోంది. ఇలాంటి మార్పులు చేసేటప్పుడు ఒకసారి సముదాయాన్ని అడిగి చేయండి. --రవిచంద్ర (చర్చ) 06:39, 12 ఆగష్టు 2016 (UTC)

రవిచంద్ర గారు మీరు తెలిపిన విధంగా contributions అనే పదానికి తెలుగు అర్ధం మార్చింది నేనే.కారణం ఏంటంటే ఇంగ్లీషు పదమైన contributions కు తెలుగులో సరైన అర్ధం యోగదానములు' మునుపు తెలిపిన అర్ధం అంటే మార్పుచేర్పులు అనేది ఇంగ్లీషు లో Recent Changes లేదా Changes and Deletions కు సమానం కనుక పదం మార్చబడింది.దయచేసి నా మార్పును మార్చవద్దు.ఈ విషయం తెలిపినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఇట్లు మీ WPMANIKHANTA (talk) 10:16, 12 ఆగష్టు 2016 (UTC)

కాంట్రిబ్యూషన్ కు తెలుగు మాట యోగదానములు అని ఉందేమోగానీ, నేనెక్కడా చదవలేదు. హిందీలో మాత్రం యోగ్‌దాన్ అని అంటారు. యోగదానములు కోసం గూగిలిస్తే, వికీలో తప్ప మరెక్కడా కనబడలేదు. అది సరైన మాట అని నేను అనుకోవడం లేదు. ఎక్కడైనా వాడి ఉంటే మూలాలు ఇవ్వగలరు. __చదువరి (చర్చరచనలు) 12:56, 12 ఆగష్టు 2016 (UTC)
వికీకి సంబంధించి ఏదైనా మార్చాలనుకున్నప్పుడు సమదాయంలో చర్చిస్తే బాగుంటుంది. వికీ తెరవగానే మార్పుచేర్పులు స్థానంలో యోగదానములు కనిపించేసరికి కాస్త ఆశ్చర్యానికి లోనయ్యాను.--Pranayraj1985 (చర్చ) 13:03, 12 ఆగష్టు 2016 (UTC)
కంట్రిబ్యూషను అనే ఆంగ్ల పదానికి ఇక్కడ స్థితి, పరిస్థితిని బట్టి తోడ్పాటు, రచన లేదా రచనలు, సహాయం లేదా సేవలు అని అయినా అందరి అనుమతితో తర్జుమా చేసుకోవచ్చును.--JVRKPRASAD (చర్చ) 13:24, 12 ఆగష్టు 2016 (UTC)
ప్రసాద్ గారు అన్నట్టుగా తోడ్పాటు, రచనలు ఉపకరిస్తుంది, అలానే కృషి అన్నా బానే ఉంటుంది. యోగదానం అంటే సాధారణ పాఠకులకు అర్థమైతేనే అది తెవికీలో వాడదగ్గ పదం అవుతుంది తప్ప తెవికీ ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకురావడం మన పద్ధతి కాదు. అలానే మణికంఠ గారు తెవికీలో మరింతగా కృషిచేస్తున్నందుకు సంతోషం. --పవన్ సంతోష్ (చర్చ) 14:07, 12 ఆగష్టు 2016 (UTC)
యోగదానములు అనే పదం తెవికీలో తప్ప ఎక్కడా అంతర్జాలంలో కనిపించడంలేదు. contributions కు ఇది సరైన పదం కాదనిపిస్తుంది. ఈ పదం సాధారణ పాఠకులకు అర్థం కాదు. కనుక సరైన పదాన్ని ఎంపికచేసి మార్చవలెనని నా అభిప్రాయం. తమిళ వికీలో ఉపయోగించిన పదం பயனர் பங்களிப்புக்கள் తెలుగులో "వాడుకరి రచనలు" అనే అర్థాన్నిస్తుంది. కనుక JVRKPRASAD గారు చెప్పినట్లు రచనలు అనే పదం సరిపోతుందేమో పరిశీలించండి. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:19, 12 ఆగష్టు 2016 (UTC)
సభ్యులందరికి నా మనస్పుర్తి నమస్కారములు నేను ఇటివల చేసిన మార్పును (contributions - మార్పుచేర్పులు నుండి యోగదానములు అనే పదానికి మార్చాను) నా ఉద్యేశం ప్రకారం ఈ పదం కొత్తగా కనిపించినా ఈ పదమే సరితూగుతుందని. ఒకవేళ సభ్యులకు ఆమోదం కాకపోతే మంచి అర్ధం ఇచ్చే పదాన్ని ప్రవేశపెట్టగలరు.ఇందులో ఏదైన నా పట్ల తప్పనిపిస్తే దయచేసి అందరు నన్ను క్షమించగలరు.ఇట్లు మీ తోటి వాడుకరి WPMANIKHANTA' (talk) 16:41, 12 ఆగష్టు 2016 (UTC)
మీరు చేసిన పని చెయ్యడం మనందరి హక్కు, బాధ్యతాను. క్షమించమని మీరు అడగనక్కర్లేదు. అడగడం మీ హుందాతనం. __చదువరి (చర్చరచనలు) 16:58, 12 ఆగష్టు 2016 (UTC)
MANIKHANTA గారూ ఈ మాత్రం దానికి క్షమాపణలు దాకా ఎందుకండీ. నేనే మరీ సూటిగా చెప్పినట్లున్నాను. అన్యధా భావించకండి. తెవికీలో ఉన్న కొద్దిమంది క్రియాశీలక సభ్యులలో మీరు ఖచ్చితంగా మంచి సేవ చేస్తున్నారు--రవిచంద్ర (చర్చ) 14:50, 14 ఆగష్టు 2016 (UTC)
contributions అన్న ఇంగ్లీషు మాటకి "దోహదాలు, దోహదకాలు, చందాలు" అనే తెలుగు మాటలు ఉన్నాయి. ఈ సందర్భంలో మొదటి రెండు నప్పుతాయి. Vemurione (చర్చ) 14:44, 14 ఆగష్టు 2016 (UTC)

పేజీలకు అంతర్గత లింకులు

[మార్చు]

అంతర్జాలంలో లింకుల ప్రాధాన్యత గురించి మనందరికీ తెలిసిందే. జాలంలో ఉన్న పేజీ ఏదైనా సరే.. దాన్ని చేరుకునే లింకు లేకపోతే ఆ పేజీ ఉన్నా లేనట్టే -వికీపీడియాలో నైనా మరెక్కడైనా. తెవికీలో కొత్తగా ఒక పేజీ అంటూ తయారుచేస్తే, తెవికీలోనే ఇతర పేజీల నుండి (అంతర్గత లింకన్న మాట) దానికి కనీసం ఒక్క లింకైనా ఉండేలా (లోపలికి వచ్చే లింకు) చూసుకోవాలి. అది తప్పనిసరి. అంటే అది అనాథ కాకూడదు. అలాగే ఆ పేజీనుండి ఇతర తెవికీ పేజీలకు (మళ్ళీ, అంతర్గత లింకే) కనీసం ఒక లింకు (బయటికి పోయే లింకు) ఉండాలి - అంటే అది అగాధ పేజీ కాకుండా చూసుకోవాలి. ప్రస్తుతం అనాథలు 1320, అగాధాలు 121 ఉన్నాయి. (అనాథలెప్పుడూ అగధాల కంటే ఎక్కువగా -బాగా ఎక్కువగా- ఉంటాయి). వీటిని సున్నా చెయ్యడం మన ప్రథమ లక్ష్యం కావాలి. సున్నా కంటే పెరక్కుండా చెయ్యడం రెండో లక్ష్యం.

కొత్తవాళ్ళే కాకుండా, పాతవాళ్ళు కూడా కొత్త పేజీలు తయారుచేసేటపుడు ఈ నియమాన్ని మరచిపోతున్నారు - నాతో సహా. ఈమధ్య నేను తయారుచేసిన రెండు పేజీలు ఈబాపతువి (అనాథలు) కనిపించాయి. చేసిన పాపం చెబితే పోద్దంటారు గదా, అంచేత ఇక్కడ పెట్టేస్తున్నాను :) తరవాత సరిచేసాన్లెండి. ఆ తప్పుకు పరిహారంగా అనాథలన్నిటికీ ఓ చుట్టాన్ని ఇవ్వాలని తలపెట్టాను.

తప్పు ఇతగాడు చేసి, అందరిమీదా పెడుతున్నాడేంటని అనుకోకండి :) కొందరి విషయంలో అలాంటి లోపాలేమీ లేవులెండి. __చదువరి (చర్చరచనలు) 04:54, 13 ఆగష్టు 2016 (UTC)

మంచి సూచన. దీనికి నేను అనుసరించే టెక్నిక్కు ఏంటంటే అడ్వాంసుడు సర్చ్ వాడితే మనం ఇచ్చిన పేరుతో ఉండే వ్యాసమే కాక ఆ పాఠ్యం ఏయే వ్యాసాలలో ఉందో కూడా కనిపిస్తుంది. ఆ వ్యాసాలలోకి దూకి లింకులు ఇచ్చేయడమే. --రవిచంద్ర (చర్చ) 14:54, 14 ఆగష్టు 2016 (UTC)
అనాథ వ్యాసాలను తగ్గించే విధంలో ప్రస్తుతం నేను చేసే పనుల్లో అదీ ఒకటి. అలా చేస్తూ ప్రస్తుతం ఓ రెండొందల్దాకా తగ్గించాను. మన పంజాబ్ ఎడిటథాన్ ఆ జాబితాను పెంచేసింది. మనాళ్ళు చేస్తున్న సంస్కరణలతో అది తగ్గుతుందని నా ఆశ.__చదువరి (చర్చరచనలు) 16:59, 14 ఆగష్టు 2016 (UTC)

తెలుగు వికీపీడియా నుంచి దిగుమతి

[మార్చు]

తెలుగు వికీపీడియా నుంచి విక్ష్నరీకి కొన్ని పేజీలు దిగుమతి చేసుకోవాల్సి వుండగా ప్రత్యేక:దిగుమతి ద్వారా జరగట్లేదు. దిగుమతి పద్ధతిలో చేయగలిగితే అక్కడి నుంచి చరిత్ర కూడా దిగుమతి అవుతుంది. అయితే ఇది తెలుగు విక్ష్నరీలో స్థాపితం అయిలేనట్టు చూపిస్తోంది. సముదాయంలో ఈ అంశంపై చర్చించి ఆమోదించుకోగలిగితే స్థాపించుకునేందుకు వీలవుతుంది. ఈ అంశంపై జూన్ 19న విక్ష్నరీలోనూ చర్చ ప్రారంభించాను. కనుక దయచేసి సభ్యులు స్పందించగలరు --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:30, 13 ఆగష్టు 2016 (UTC)

ఇప్పటికి చర్చ ప్రారంభించి దాదాపు 13 రోజులకు పైగా కావస్తుంది. చెప్పుకోదగ్గ సంఖ్యలో (ఆరుగురు) వికీపీడియన్లు మద్దతు పలికారు. కనుక ఈ చర్చలో పాల్గొనని నిర్వాహకులెవరైనా నిర్ణయం ప్రకటిస్తే ముందుకు వెళ్ళవచ్చని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:32, 26 ఆగష్టు 2016 (UTC)

ఆమోదం

[మార్చు]
  1. JVRKPRASAD (చర్చ) 08:00, 13 ఆగష్టు 2016 (UTC)
  2. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 08:08, 13 ఆగష్టు 2016 (UTC)
  3. --Viswanadh (చర్చ) 11:26, 13 ఆగష్టు 2016 (UTC)
  4. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:45, 13 ఆగష్టు 2016 (UTC)
  5. --Pranayraj1985 (చర్చ) 06:54, 14 ఆగష్టు 2016 (UTC)
  6. --Palagiri (చర్చ) 07:15, 14 ఆగష్టు 2016 (UTC)

వ్యతిరేకం

[మార్చు]

అభిప్రాయం

[మార్చు]

ఫలితం

[మార్చు]

వోటింగులో పాల్గొన్న ఆరుగురూ తమ ఆమోదం తెలిపారు కాబట్టి, సముదాయం ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లే. (Since all the six participants voted in favour, the proposal to install Import feature in TeWiktionary is deemed accepted.) __చదువరి (చర్చరచనలు) 04:34, 28 ఆగష్టు 2016 (UTC)

పంజాబ్ లోని అన్నీ గ్రామాలలోని విద్యాసస్థలన్నీ అమృతసర్ గ్రామానికి 10 కిలో మీటర్ల కన్నా దూరములో వున్నాయి????

[మార్చు]

1. పంజాబ్ ఎడిట్ దాన్ లో భాగంగా మనం వ్రాసిన గ్రామ వ్యాసాలలో కొన్ని అంశాలలో వున్న వివరణ అసంబద్దంగా వున్నట్టు అనిపిస్తున్నది. ఉదాహరణకు బోహ్లియన్ అనే గ్రామ వ్యాసం తీసుకోండి. అందులోని విద్యా సౌకర్యాలు అనే అంశం లో పొందు పరచిన వివారాలను కొన్నింటిని ఈ క్రింద పేస్ట్ చేసాను. పరిశీలించగలరు. ఉద్సాహరణకు మరి కొన్ని గ్రామాలు తెరా రాజ్‌పుతన్‎ / తెరా ఖుర్ద్‎ / వజీర్ భుల్లార్ / [వనీకె]]...... మనం వ్రాసిన అన్ని గ్రామాలు.....

సమీపమాధ్యమిక పాఠశాలలు (Harar kalan)గ్రామానికి 5 నుంచి 10 కిలోమీటర్ల లోపే ఉంది. సమీపమాధ్యమిక పాఠశాల (Ajnala)గ్రామానికి 5 నుంచి 10 కిలోమీటర్ల లోపే ఉంది. సమీపసీనియర్ మాధ్యమిక పాఠశాలలు (Ajnala)గ్రామానికి 5 నుంచి 10 కిలోమీటర్ల లోపే ఉంది. సమీప"ఆర్ట్స్, సైన్స్, మరియు కామర్సు డిగ్రీ కళాశాలలు" (Ajnala)గ్రామానికి 5 నుంచి 10 కిలోమీటర్ల లోపే ఉంది. సమీపఇంజనీరింగ్ కళాశాలలు (Amritsar) గ్రామానికి 10 కిలోమీటర్ల కన్నా దూరంలో ఉంది సమీపవైద్య కళాశాలలు (Amritsar) గ్రామానికి 10 కిలోమీటర్ల కన్నా దూరంలో ఉంది.

బోహ్లియన్ / ఉఛోకే కుర్ద్ అనే గ్రామ విషయాలు వ్రాస్తూ..... ఆ గ్రామములోని పాఠశాలలు (Ajnala) గ్రామానికి 5 నుంచి 10 కిలోమీటర్ల లోపే ఉంది. అని వ్రాయడము నాకెందుకో తప్పుగా తోస్తున్నది. అదే విధంగా అనేక విద్యా సంస్థలు (Amritsar) గ్రామానికి 10 కిలోమీటర్ల కన్నా దూరంలో ఉన్నవి అని వ్రాయడము కూడ తప్పుగా అనిపిస్తున్నది. పది కిలోమీటర్ల కన్నా దూరములో అని అంటే ఎంత దూరమైనా కావచ్చు. అది 15 కిలోమీటర్ల దూరం కావచ్చు లేదా 150 కిలోమీటర్ల దూరమైనా కావచ్చు. ఆ విధంగా చూస్తే తప్పు కాదు కాని ఆ విషయము ఇక్కడ అవసరమా? ప్రతి గ్రామ వ్వాసములోను ఆ గ్రామ విద్యా సౌకర్యాలు అనే అంశం క్రింద ఆ యా సంస్థలు అమృతసర్ గ్రామానికి 10 కి.మీటర్ల కన్నా ఎక్కువదూరములో వున్నది అని వున్నది. ఈ విషయము ఆ యా వాడుకరులు వ్రాసిన తప్పిదము కాదు గాని ఇదివరకే తయారు చేసిన అయా గ్రామ వ్యాసాన్ని యదా తదంగా కాపి చేసి ఇక్కడ పేస్ట్ చేయమన్నందున జరిగిన తప్పు. మనం వ్రాసిన/వ్రాస్తున్న అన్ని పంజాబు గ్రామాలలోను ఇది పొందు పరుచబడుతున్నది. ఆ సౌకర్యము ఆగ్రామములో లేకుంటే అది ఆ గ్రామానికి ఎంత దూరములో వుందో వ్రాస్తే బాగుంటుంది గాని అమృతసర్ గ్రామాని ఎంతదూరములో వున్నది అనే విషయము వ్రాయడము అవసరము లేదేమో??? ఇది నా చిన్న సందేహము.

నిర్వహకులు ఈ విషయము పరిశీలించి తగు సలహా ఇవ్వగలరని మనవి.

2.మరొక చిన్న విషయము ఏమంటే ...... ఆయా గ్రామ వ్యాసాలలో ఉప విభాగము క్రింద ( అన్ని అంశాలకు) ఉదాహరణకు తాగు నీరు అనే అంశం క్రింద

శుద్ధిచేసిన కుళాయి నీరు గ్రామంలో లేదు. శుద్ధి చేయని కుళాయి నీరు గ్రామంలో ఉంది. మూత వేసిన బావుల నీరు గ్రామంలో లేదు. మూత వేయని బావులు నీరు గ్రామంలో లేదు. చేతిపంపుల నీరు గ్రామంలో ఉంది. గొట్టపు బావులు / బోరు బావుల నీరు గ్రామంలో ఉంది. ప్రవాహం నీరుగ్రామంలో లేదు. నది / కాలువ నీరు గ్రామంలో లేదు. చెరువు/కొలను/సరస్సు నీరు గ్రామంలో లేదు.

అని వున్నది. చేతిపంపుల నీరు గ్రామంలో ఉంది. గొట్టపు బావులు / బోరు బావుల నీరు గ్రామంలో ఉంది. అని వుండగా మిగతా వనరులు లేవు అని వ్రాయడము అవసరమా ? అని నాసందేహము. ఈ విధంగా లేని వనరుల విషయము అవసరము లేదేమో??? నా సందేహ నివృత్తి చేయగలరు. భాస్కరనాయుడు (చర్చ) 09:04, 13 ఆగష్టు 2016 (UTC)

భాస్కరనాయుడు గారూ గ్రామ వ్యాసాల విషయంలో ఎంతో కృషి చేసి, భవిష్యత్తులో మరెంతో కృషిచేస్తూన్న మీవంటి వికీపీడియన్ ఈ అంశంపై ఆసక్తి చూపించడం చాలా సంతోషకరమైన అంశం. ఇవి 2011 జనగణనను ఆధారం చేసుకుని తయారైనవే అయినా వేలాది గ్రామాలపై పనిచేస్తున్నప్పుడు, ప్రభావం చాలా పెద్దది అయినప్పుడు మనం చాలా జాగ్రత్తగా పనిచేయడం అవసరమేనని మౌలికంగా అంగీకరిస్తున్నాను. ఈ క్రమంలోనే గతంలో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేస్తున్నప్పుడే క్షేత్ర స్థాయిలో మాదిరి అధ్యయనం చేయగలిగిన వికీపీడియన్ల కోసం ఆహ్వానించగా ఆసక్తితో ఖమ్మం గ్రామాల విషయమై కట్టా శ్రీనివాసరావు గారు, చిత్తూరు గ్రామాల విషయమై రవిచంద్ర గారు, శ్రీకాకుళం గ్రామాల విషయమై వెంకటరమణ గారూ అందుకు ముందుకు వచ్చారు. మొట్టమొదట ఖమ్మం జిల్లా గ్రామాలను మన ఆకరంలో ప్రచురించుకుని ఉండడంతో కట్టా శ్రీనివాసరావు గారు పరిశీలన ప్రారంభించారు. అలానే వారి అధ్యయన ఫలితాలను కూడా అత్యంత త్వరలో తెవికీలో ప్రచురిస్తానని వెల్లడిస్తున్నారు, ఆ ప్రయత్నమూ ఆన్-వికీనే చేస్తున్నారు. ఈ వ్యాసాల నమ్మదగిన తనం విషయంలో మనం రెండో స్తరం ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పవచ్చు. ఇక మిగతా అంశాలకు సముదాయం చర్చిస్తే బావుంటుందని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:36, 13 ఆగష్టు 2016 (UTC)
గ్రామ వ్యాసాల అభివృద్ధికి పైన చెప్పిన వారి కృషికి అభినందనలు. కానీ నాసందేహం నివృత్తి కాలేదు. ప్రస్తుతం మనం చేస్తున్నట్టుగానే పంజాబ్ గ్రామాల వ్యాసాలు వ్రాయడము కొనసాగించాలా? లేదా నా సందేహం నివృత్తి అయిన తర్వాత కొనసాగించాలా...... అనే సందిగ్దంలో వున్నాను. భాస్కరనాయుడు (చర్చ) 11:03, 13 ఆగష్టు 2016 (UTC)
అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల లోని గ్రామాల వ్యాసాలు తయారు చేసేటప్పుడు మరి కొంత శ్రద్ధ వహించి అనవసరమైన విషయాలు తీసివేసి, అవసరమైన అంశాలను మాత్రమే పొందు పరిస్తే వ్యాసము సమగ్రముగా యుండి ఆ యా వ్యాసాలను ఎత్తి వ్రాసేవాడుకరులకు పని సులబమౌతుందని, విమర్శలకు తావుండదని, పని త్వరగా పూర్తవుతుందని నా వూహ. భాస్కరనాయుడు (చర్చ) 11:08, 13 ఆగష్టు 2016 (UTC)
అలాంటి వివరాలను నేను కొన్నిటిని తొలగిస్తున్నాను. వాటిలో అవసరం అనుకొన్నవి తప్ప మిగతా విషయాలో ఒకేమాదిరి కనిపించే, రాయబడిన వాటినీ తొలగిస్తున్నాను. ఉదాహరణకు విధ్యుత్తు అనే విభాగంలో అన్నిటినీ తొలగించి కేవల్ం గ్రామంలో విద్యుత్ సౌకర్యం ఉంది అని మారుస్తున్నాము. మిగతా అసంబద్దంగా అనిపించే వాటినీ మార్చుకోవచ్చు...మీకు మొదట తెలియపరచినట్టుగా ఇది ఒక ప్రయోగంగా చెసిన ప్రాజెక్టు. ఈ వ్యాసాలను చేయడం ద్వారా మన తెలుగు రాష్ట్రాల గ్రామ వ్యాసాలకు ఏమి, ఎలా, ఎంత చేయవచ్చు అనేది తెలుసుకొనేటందుకు ఉపయోగపడుతుందని చేసిన ప్రయోగం. వీటిని మనకు ఎలా కావాలో అలా మార్చుకొని దానిప్రకారం తెలుగు గ్రామ వ్యాసాలపై పనిచేయాలనే ప్రయత్నం--Viswanadh (చర్చ) 11:14, 13 ఆగష్టు 2016 (UTC)

Help with Bollywood film

[మార్చు]

Help needed here. Thanks and sorry for not writing in telugu.--TaronjaSatsuma (చర్చ) 18:43, 13 ఆగష్టు 2016 (UTC)

Commons Category with all the files.--TaronjaSatsuma (చర్చ) 18:47, 13 ఆగష్టు 2016 (UTC)
TaronjaSatsuma Thank you. రవిచంద్ర గారూ ఇవి నందమూరి కళ్యాణ్‌రాం రానున్న సినిమా యూరప్ షూటింగ్ ఫోటోల్లా కనిపిస్తున్నాయి. ఎవరెవరో గుర్తుపట్టి కామన్స్ లో డిస్క్రిప్షన్ రాసేందుకు, తిరిగి వాడుకునేందుకు మన సహాయం కోరుతున్నారు ఈయన. మీకు ఆసక్తికరంగా ఉండొచ్చు అనిపిస్తోంది. ఓసారి ఆ ఫోటోలు చూస్తారా. --పవన్ సంతోష్ (చర్చ) 18:39, 14 ఆగష్టు 2016 (UTC)
పవన్, చూశాను. చాలా వరకు షూటింగ్ ఫోటోలే. దాదాపు అన్నీ కల్యాణ్ రాం వే. నాకేమీ పెద్దగా ఉపయోగమున్నట్లు కనిపించలేదు.--రవిచంద్ర (చర్చ) 18:50, 14 ఆగష్టు 2016 (UTC)
సరేనండీ. --పవన్ సంతోష్ (చర్చ) 05:26, 15 ఆగష్టు 2016 (UTC)

కృష్ణా జిల్లా గ్రామాలు

[మార్చు]

కృష్ణా జిల్లా గ్రామాలు అనే వర్గం లోని వ్యాసాలు సముదాయం అనుమతి లభిస్తే నేను భారత ప్రభుత్వం వారి సెన్సస్,2011 ప్రకారం వ్యాసాలను సరిదిద్దుతాను. కొంతమంది స్నేహితులు నాకుగా నేను ఆయా వ్యాసాలను సరిదిద్ద వచ్చును కదా అని అభిప్రాయము వెల్లడించ వచ్చును. కానీ ఆయా వ్యాసాలు వ్రాసిన పెద్దలు ఇంకా అనేక వ్యాసాలు ఇప్పటికే వ్రాస్తునే ఉన్నారు. కనుక, నేను ఎకాఎకీ వ్యాసాలు మార్పులు చేర్పులు చేసినట్లయిన, వారి మనసును నొప్పించి, ఒక విధంగా వారిని బాధపెట్టినట్లు అవుతుంది. అందువల్ల మన సముదాయం వారు చర్చించి, మీ నుండి అనుమతి లభించిన తదుపరి, వ్యాసములలో మార్పులు చేయగలను అని తెలియజేసుకుంటున్నాను. JVRKPRASAD (చర్చ) 07:34, 14 ఆగష్టు 2016 (UTC)

Prasad anna! Wikipedia ku emtho seva chesina meeku mee prantham vyasalanu sarididdadaaniki inkokari anumathi adagadam mee abimaanuluga maku badhakaloginchindi. Devuniki devalayam lo amumathi poojarulu ivvala? Anna wikipedia nu swarnawikipediagaa marcheyandi. Mee veerabhimaani.

prasad garu miku evadu addu chepputadu. meeru anukunnadi cheyyandi. mee veerabhimaanuluga mee venka memunnam.

paapam ever emi cheppatledani meeere logout ayyi ip addressulatho kamentlu chesukuntunnara. ayyayyo...
మూడు ఐపీ అడ్రస్సులతో మీరు ఎవరో నాకు తెలియకపోయిన ఎంతో అభిమానముతో వ్రాసిన పెద్దలందరకు ధన్యవాదములు. నేను నా పేరుతోనే నాకు ఉన్న ఒక్క ఖాతాతోనే వ్రాస్తూ వుంటాను. ఐపీ అడ్రస్సులతో మరియు మారు పేర్లతో ఏనాడూ తెలిసి తెలిసీ ఇంత వరకు అటువంటి ప్రయత్నములు చేయలేదు. జీవితంలో చేయాలని కూడా ఉండదండి. నా ఐపీ అడ్రస్సు 192.168.1.2 అని మీకు తెలియజేస్తున్నానండి. దయచేసి , ప్రస్తుతము మీరు మనసులో కూడా అలా ఏనాడూ మరో విధంగా తలచుకోవద్దండి. ఇది నా మనవి. --JVRKPRASAD (చర్చ) 00:09, 15 ఆగష్టు 2016 (UTC)
ప్రసాద్ గారూ, మీరు అనేక గ్రామ వ్యాసాలను యిదివరకు శుద్ధి చేసి వాటిని అభివృద్ధి చేసారు. మీరు వ్యాసాలలో 2011 గణాంకాలను మూలంగా చేసుకొని అభివృద్ధి చేయడానికి మీ వంటి వారికి అనుమతి అవసరమా? మీరు సరైన రీతిలో ఆయా వ్యాసాలను అభివృద్ధి చేయగలరు. మీ కృషిని కొనసాగించగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:46, 14 ఆగష్టు 2016 (UTC)
కె.వెంకటరమణ గారు, మీ స్పందనలకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. --JVRKPRASAD (చర్చ) 00:09, 15 ఆగష్టు 2016 (UTC)
ప్రసాద్ గారూ, మీ వంటి చురుకైన వికీపీడియనులు అనుమతి అడుగుట బాధాకరము . మీ కృషిని కొనసాగించి గ్రామ వ్యాసాలను మెరుగు పరచగలరు. మీరు కొత్తగా మిమ్ముల్ని మీరు నిరూపించుకోవలసిన అవసరం లేదు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:30, 17 ఆగష్టు 2016 (UTC)

గ్రామాల వ్యాసాల గురించి

[మార్చు]

గ్రామాల వ్యాసాల గురించి మళ్ళీ సముదాయం దృష్టికి తెస్తున్నాను. కింది వ్యాసాలు చూడండి

  1. పెద్దసూరారం - ఈ పేరు మండలం పేజీలో లేదు
  2. చిన్నసూరారం - ఈ పేరూ మండలం పేజీలో లేదు
  3. మామిడాల
  4. సూరారం (తిప్పర్తి)

ఈ పేజీలను చూసాక నా గమనింపులు, సూచనలు కొన్ని:

  1. పైవన్నీ కూడా తిప్పర్తి మండలంలోని గ్రామాలేనని ఆయా పేజీల్లో రాసారు. కానీ తిప్పర్తి పేజీలో మాత్రం మొదటి రెండు గ్రామాలూ లేవు. ఆయా పేజీల్లో ఉదహరించిన మూలం (భారత జనగణన శాఖ సైటు)లో కూడా ఆ రెండు గ్రామాల పేర్లు లేవు. మరి ఆ పేజీలు ఎలా తయారయ్యాయి? ఎక్కడో ఒకచోట ఆ పేర్లు ఉదహరించి ఉండకపోతే ఈ పేజీలు తయారయ్యేవి కావు. ఆ పేజీలపై పనిచేసిన వాడుకరులు ఒకసారి తమ మూలాలను మళ్ళీ చూసి ఎక్కడ తేడా జరిగిందో పరిశీలించాలి. ఆ తేడా ఏమిటో సముదాయానికి తెలియజేస్తే ఆలాంటివి ఇకపై జరక్కుండా ఇతర వాడుకరులు కూడా జాగ్రత్త పడవచ్చు.
  2. కాపీ పేస్టులు చేసేటపుడు జాగ్రత్త పడాలన్నది సుస్పష్టం. (అల్డాస్ జానయ్య పుట్టిన సంగతి, (ఆంగ్లం: Mamidala) అనే పాఠ్యం మొదటి మూడు పేజీల్లో ఉంది). __చదువరి (చర్చరచనలు) 05:43, 15 ఆగష్టు 2016 (UTC)
  • చదువరి గారూ, ఈ అంశంపై ప్రయత్నించాలంటే మనకు అవగాహన ఉన్న మండలాన్ని మాదిరి మండలంగా తీసుకోవాలి కనుక నేను తాడేపల్లిగూడెం మండలం గ్రామాలను నమూనాగా స్వీకరించాను. దీనిపై చిన్నపాటి అధ్యయనం సాగించి, ఇక్కడ నివేదిస్తున్నాను. అది చర్చకు ఉపకరిస్తుందని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:27, 15 ఆగష్టు 2016 (UTC)
  • నేను పైన ప్రస్తావించిన నమూనా పరిశీలనలో గమనించింది ఏంటంటే- తాడేపల్లిగూడెం మండలం వరకూ తీసుకుంటే తెవికీలో మనం పంచాయితీ గ్రామాలను పరిగణించి బాట్ ద్వారా వ్యాసాలు సృష్టించాం (వీటిలో కొన్నే రెవెన్యూ గ్రామాల కిందికి వస్తాయి) ఇంకా కొన్ని పంచాయతీలు మిగిలిపోయాయి ఇక హేమ్లెట్లు పరిగణించలేదు, మరికొన్నిటిని పలువురు అజ్ఞాతలు, ఖాతా ఉన్న వికీపీడియన్లు మిగిలిన గ్రామాల్లో కొన్నిటికి, హేమ్లెట్లకు వ్యాసాలు సృష్టించారు. ఆంగ్ల వికీపీడియాలో మాత్రం రెవెన్యూ గ్రామాలనే పరిగణనలోకి తీసుకున్నారు. వారు పరిగణించిన భారత జనగణన సైటులోని పుస్తకంలోనూ రెవెన్యూ గ్రామాల జాబితానే ఉంది కనుక వారు మిగిలిన గ్రామాలను పరిగణించలేదు. ఇది రెండూ రెండు తోవలు పట్టేందుకు ఆ మండలం విషయంలోనైనా కారణం అయిందని తెలుస్తోంది. --పవన్ సంతోష్ (చర్చ) 08:42, 15 ఆగష్టు 2016 (UTC)

వికీపీడియాను విద్యా ప్రణాళికలో భాగం చేసే అంశంపై జాతీయ స్థాయి కాన్ఫరెన్సు

[మార్చు]

ఆంధ్ర లొయోలా కళాశాల వికీపీడియాను విద్యా ప్రణాళికలో చేరుస్తూ, విద్యార్థులను వికీపీడియాలో ఎలా కృషిచేయొచ్చన్న విషయం మీద జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా మరియు ఇతర రాష్ట్రాల నుంచి యూనివర్శిటీలు, ప్రఖ్యాత కళాశాలల్లో పనిచేస్తున్న 40 మంది ఆసక్తి కలిగిన అనుభవం కల ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు పాల్గొంటారు. వికీపీడియా అభివృద్ధికి వారి కళాశాల/విశ్వవిద్యాలయ శాఖలు ఎలా పనిచేయవచ్చు, విద్యార్థులకు ఇది ఎలా ఉపయోగకరంగా ఉంటుంది, దేశ వ్యాప్తంగా అటువంటి కార్యక్రమాలు ఏం జరిగాయి వంటి విషయాలు చర్చలో ఉంటాయి. ఈ కార్యక్రమం కోసం వికీమీడియా ఫౌండేషన్ రాపిడ్ గ్రాంట్ కోసం ఇక్కడ దరఖాస్తు చేస్తున్నాం. ఈ ప్రయత్నం ప్రయోజనం కలిగిస్తుందని అనుకునేవారు సమర్థన తెలపండి. --Kolasekhara (చర్చ) 06:38, 15 ఆగష్టు 2016 (UTC)

గ్రామాల వ్యాసాల అభివృద్ధి విషయములో చంద్రకాంత రావు గారు ఈ ప్రశ్నకు బదులేది???? అనే శీర్షికన అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ముందస్తు హెచ్చరిక లేకుండా.... చివరి అస్త్రంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి ప్రశ్నలకు నాసమాధానము.

[మార్చు]

వాడుకరులు తప్పుదోవ పట్టుతుంటే నిర్వహకులు ముందుగా హెచ్చరిస్తారు, ఆ తర్వాత తప్పులు ఎత్తి చూపుతారు. ఆపమని హెచ్చరిస్తారు చివరి అస్త్రముగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తారు. అటువంటి ముందస్తు చర్యలేవి లేకుండా నాపై చివరి అస్త్రము ప్రయోగించడము న్యాయమా? సరే..... చివరి అస్త్రము ప్రయోగించారు..... మరి అమలు చేయలేదెందుకని?. నా (explanation) వివరణ అడగలేదు.... పంజాబ్ లోని అన్నీ గ్రామాలలోని విద్యాసస్థలన్నీ అమృతసర్ గ్రామానికి 10 కిలో మీటర్ల కన్నా దూరములో వున్నాయి???

మరికొన్ని వివరాలకు పైన రచ్చబండలోని (34) లోని - నా సందేహము చూడగలరు. వారి ఈ ప్రశ్నకు బదులేది అనే శీర్షికన సందించిన ప్రశ్నలకు నా సమాదానము. వారి ప్రశ్న?

1) మండలంలోని అన్ని గ్రామాలు ఒకే ఎత్తులో ఉంటాయా ? ఒక మండలం సరిహద్దు పూర్తికాగానే ఆ గ్రామానికి, సరిహద్దు మండలంలోని మరో గ్రామానికి ఒకేసారి 30 నుంచి 200 మీటర్ల ఎత్తు తగ్గితే అమాంతం పడిపోవాల్సిందేనా ? (ఉదా: నారాయణఖేడ్, కంగ్టి మండల గ్రామాలన్నీ 600 మీటర్ల ఎత్తులో ఉంటే దానికి సరిహద్దు మండలంలోని కల్హేర్ మండల గ్రామాలన్నీ 375 మీటర్ల ఎత్తులో ఉన్నాయట !)

నా సమాధానము: కృష్ణా జిల్లా లోని మండలములలోని గ్రామాలన్ని ఒకే ఎత్తులో వున్నవి. వీటికి మూలము మనము అత్యంత ప్రామాణికముగా భావించే భారత ప్రభుత్వం వారి జనాభా లెక్కలు. ఒక మండలములో గ్రామాలన్నీ సముద్రమట్టానికి ఒకే ఎత్తులో వుంటే....... ఆ అమండలమంతా బల్లపరుపుగా చదునుగా వున్నదన్నమాట..... ఇది సాద్యమా. దీనికి మీ సమాధనము ఏమిటి? సాధారణంగా ప్రతి మండలములోని గ్రామాలన్నీసముద్ర మట్టానికి ఒకే ఎత్తులో వున్నట్టు జనాభా లెక్కలలో సమాచారమున్నది. గమనించ గరలు.

12) వారిది మరొక ప్రశ్న. కేవలం "లేవు" అనే పదం పెట్టడానికి ఒక విభాగం సృష్టించే అవసరం ఉన్నదా ?

పంజాబు ఎడిట్ దాన్ లో భాగంగా మనం వ్రాసిన గ్రామ వ్యాసాలలో చాల వరకు శీర్షికల కెదురుగా లేదు,లేవు, అని గాని, లేదా 0 అని గాని వుంది. ఇది అవసరమా...???? అలా వ్రాసిన వారిపై కూడ చివరికి హెచ్చరిక అస్త్రము( ముందస్తు హెచ్చరిక లేకుండా) ప్రయోగిస్తారా???? అలా వ్రాసిన వారిలో నేను కూడ వున్నాను. నాపై కఠిన చర్యలకు చివరి అస్త్రము ప్రయోగించారు. అయినా నేను మీ ప్రశ్నకు విరుద్ధంగా ప్రవర్తించాను. కనుక నా పై మీరు తీసుకుంటామని హెచ్చరిం చిన కఠిన చర్యలుకు మీకు మార్గము సుగమనమైనది.

ఉదాహరణకు పంజాబు గ్రామ వ్యాసాలలో భూ వినియోగము, త్రాగు నీరు, వంటి ఉప శీర్షికకు ఎదురుగా.... లేదు, లేవు, 0 అని చాల సార్లు వున్నది. ఇవి అవసరమా......

నిర్వాహకులు కుమ్నక్కై గుత్తేదారుల వ్వవహారంలా.... ముందస్తు నోటీసు గానీ, హెచ్చరిక గానీ లేకుండా ఏకంగా కఠిన చర్యలకు నోటీసు ఇవ్వడము, ఆ నోటీసును నిర్వకుల పరిశీలనార్థము ఫేస్ బుక్క్ లో పెట్టడము గుత్తేదారుల వ్వవహారము కాక మరేమిటి. దీనికి మీరేమంటారు?

మీరు నాపై తీసుకోదలచిన కఠిన చర్యల హెచ్చరిక, అవే తప్పులు చేసిన అందరిపైనా తీసుకుంటారా??? లేదా అన్నవిషయము మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.

ఇలా ముందస్తు నోటీసు గాని హెచ్చరిక గానీ లేకుండా ఒకే సారి కఠిన చర్యలకు నోటీసు ఇవ్వడము సమంజసమా...???? అనే విషయమై సమూహములోని సభ్యులందరి అభిప్రాయము కోరడమైనది. మీ అభిప్రాయము చెప్పగలరు. మెజారిటీ సభ్యుల సూచనల మేరకు మీరు ప్రతిపాదించిన చర్యలు తీసుకోగలరు. అకా కాకుండా సహ సభ్యుల అభిప్రాయాలతో పని లేకుండా వ్వక్తిగతంగా మీరు ప్రతిపాదించిన చర్యలు గుత్తేదారు తరహాలో వెంటనే తీసుకో గలరు. భాస్కరనాయుడు (చర్చ) 07:16, 15 ఆగష్టు 2016 (UTC)

భాస్కర నాయుడు గారూ, చంద్రకాంత రావు గారి వ్యాఖ్యలు దయచేసి వ్యక్తిగతంగా తీసుకోకండి. అందులో మీ కృషి పట్ల ఎలాంటి చులకన భావం లేదు. నాకు తెలిసినంతవరకు ఆయన ఎత్తి చూపింది మీరు మూలంగా వాడిన వెబ్ సైటులో కొన్ని తప్పులు మాత్రమే. మూలాల ప్రామాణికత విషయంగా తీసుకున్నప్పుడు ఎవరికైనా ఒక ప్రైవేటు సంస్థ వెబ్ సైటు కన్నా ప్రభుత్వ వెబ్ సైటుకు విలువనివ్వడం సాధారణంగా జరిగేదే. మీరు ప్రభుత్వం వెబ్ సైటులో కూడా తప్పులున్నాయి అంటున్నారు కాబట్టి ఆ సమాచారం మీద మరింత పరిశోధన చేద్దాం. అందులో ఆ వివరాలు తప్పు అని తేలితే వాటిని మనం ఖచ్చితంగా తొలగించవచ్చును. ఇక రాబోయే గ్రామ వ్యాసాలలో కూడా అసలు ఏ వెబ్ సైటు ప్రామాణికం, అందులో సమాచారం సరైందా కాదా అని జిల్లా గురించి అనుభవం ఉన్న వారు సరి చూసి గానీ వ్యాసాలు సృష్టించడం జరగదు. --రవిచంద్ర (చర్చ) 08:58, 15 ఆగష్టు 2016 (UTC)
అయ్యా భాస్కరనాయుడు గారూ, మీరు చర్చను ఏ మాత్రం అర్థం చేసుకోకుండా నాకు విరుద్ధంగా వ్రాశారు. నేను ఎవరిపైనా చివరి అస్త్రం ప్రయోగించలేను. అలాంటప్పుడు దాన్ని అమలుచేసే ప్రశ్నే తలెత్తదు. ప్రక్రియలో భాగంగా చర్చాపేజీలో ముందుగా రెండు మూడు సార్లు సూచించడం, ఆపై కూడా తప్పుడు సమాచారం మానకుంటే హెచ్చరిక పంపడం, దానికీ ప్రతిస్పందన లేకుంటే ఎందుకు చర్య తీసుకోరాదో తెలియజేయడం, అంతవరకు కూడా ఎలాంటి ప్రతిస్పందనలు లేకుండా నియమాలకు విరుద్ధమైన దిద్దుబాట్ల కొనసాగిస్తూంటే ఖచ్చితంగా చర్య తీసుకోబడునని హెచ్చరించడం, ఆపై పరిమితకాలం నిరోధం, నిరోధం తర్వాత కూడా పరిస్థితి మారకుంటే నిరోధం గడుపు పొడిగించడం ఇలా... ఇలా... జరగడం ప్రక్రియలో భాగము. ఇవన్నీ నాకు తెలియనిది కాదు. అయితే అసలు ప్రక్రియే ఇంకనూ మొదలుకాకముందే (రచ్చబండలో మరియు నిర్వాహకుల దృష్టికి తేవడానికి కేవలం నిర్వహక నోటీసుబోర్డులో మాత్రమే పేర్కొనబడింది) అంటే సభ్యుల చర్చాపేజీలో తప్పుడు దిద్దుబాట్లు ఆపమని ఇంకనూ సూచించకముందే సహసభ్యుల సహకారంతో దిద్దుబాట్లు ముగియడంతో ప్రక్రియ ఆగిపోయింది. అదే విషయం నేను నిర్వాహకుల నోటీసు బోర్డులోనూ, రచ్చబండలోనూ స్పష్టంగా పేర్కొన్నాను. నిర్వాహకుల నోటీసు బోర్డులో నేను పేర్కొన్న వాక్యం మరో సారి పరిశీలించండి ("సదరు సభ్యులకు అవకాశం ఇచ్చి, పై లోపములు సవరించుకోని పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడునని తెలియజేయనైనది" అని ఉంది). నిర్వాహకుల నోటీసి బోర్డులో రెండో పర్యాయం వ్రాస్తూ "ఇంకనూ సభ్యులకు ఎలాంటి హెచ్చరిక లేదా నోటీసు జారీచేయలేదని గమనించగలరు. ఈ ప్రక్రియ ఇంకనూ చాలా ఉంది. సంబంధిత సభ్యులకు చర్చాపేజీలలో తెలుపకుండా, హెచ్చరిక జారీచేయకుండా, సవరించుకోవడానికి సమయం ఇవ్వకుండా నిరోధం విధించే అవకాశం లేదు. నిరోధం అనేది ఈ ప్రక్రియ మొత్తాన్ని సభ్యులు ఖాతరుచేయకుండా నిరంతరంగా నిబంధనల ఉల్లంఘన చేస్తున్నప్పుడు చివరి చర్యగా మాత్రమే జరుగుతుంది. పరిస్థితిని గమనించి కాపీహక్కుల ఉల్లంఘనలు మరియు తప్పుడు సమాచారం చేర్చడం మానుకున్నారు కాబట్టి ఈ ప్రక్రియ ఇంతటిలో దాదాపు సమాప్తం అయినట్లే" అని తెలియజేసిననూ మీరు ఏ మాత్రం అర్థం చేసుకోలేరు. పైగా నిర్వాహకులపై నిందలు వేశారు. నిర్వాహకుల నోటీసు బోర్డులో పేర్కొనడం అంటే నిర్వాహకుల దృష్టికి తేవడమే కాని సభ్యులకు నోటీసు ఇవ్వడం కాదు. "నోటీసును నిర్వాహకుల పరిశీలనార్థము ఫేస్ బుక్క్ లో పెట్టడము గుత్తేదారుల వ్వవహారము కాక మరేమిటి" అన్నారు కాని ఫేస్‌బుక్ సంగతి నాకు తెలియదు. దానికి ఆధారం చూపిస్తే పరిశీలిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:10, 21 ఆగష్టు 2016 (UTC)

కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలోని గ్రామాలన్ని సముద్రమట్టానికి ఒకే ఎత్తులో వున్నాయి ????

[మార్చు]

అగిరిపల్లి మండలంలోని గ్రామాలన్నీ సముద్రమట్టానికి 24 మీటర్ల ఎత్తులోనే వున్నాయి. కొన్ని గ్రామాలకు సముద్రమట్టానికి ఎత్తు ఇవ్వలేదు గాని అవి కూడ అంతే ఎత్తులో వుంటాయి. వరదలు, ఉప్పెనలు వంటి జల ప్రళయ సమయంలో.... ఒక్క గ్రామమంలో ఒక్క అడుగు నీరు చేరితె చాలు ఆ మండలమంతా నీట మునగాల్చిందే. అనగా మండలమంతా చదునుగా బల్లపరుపుగా వుందన్న మాట. ఉదాహరణకు కృష్ణజిల్లా ఇచ్చాను. అన్ని మండలాల పరిస్తితి అంతే. వర్షాకాలంలో ఆ మండల ప్రజల బ్రతుకు బాజారు పాలే గదా???? భాస్కరనాయుడు (చర్చ) 05:33, 16 ఆగష్టు 2016 (UTC)

ఒక మండలంలోని గ్రామాలన్నీ బౌగోళికంగా ఒకే ఎత్తులో నున్నందున ఒక ప్రయోజనము కూడ వున్నది. అదేమంటే పంట పొలాలకు నీటి పారుదల సౌకర్యము. మిట్ట ప్రాంతాలకు నీరు ఎక్కదనే సమస్య వుండదు. అంతా సమతల భూమి గదా????భాస్కరనాయుడు (చర్చ) 05:39, 16 ఆగష్టు 2016 (UTC)
పైని ఈ ప్రశ్నకు బదులేది? అనే అంశం పై సందించిన ప్రశ్న .... 6) భారతదేశంలో ఒకే టైం జోన్ అమలులో ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రతి గ్రామవ్యాసంలో Time zone: IST (UTC+5:30) వ్రాసే అవసరం ఉన్నదా ?

కానీ ఇప్పుడు పంజాబ్ గ్రామాల వ్యాసాల లో ప్రతి గ్రామానికి సమయప్రాంతం IST (UTC=+5:30) అని వ్రాసారు.... వ్రాస్తున్నారు. అదె విధంగా తెలుగు రాష్ట్రాల గ్రామాలకు కూడ వ్రాస్తున్నారు. మీరు మీ గుత్తేదార్లు ఏం వ్రాసినా అది వికీ నియమాలకు అనుగుణమే. అదే విషయము ఇతరులు వ్రాస్తే అది వికీ నియమాలకు విరుద్దము. అదే గనుక తప్పు అయితే దాన్ని ఎందుకు తొలిగించరు???? మీకొక న్యాయము వేరొకరికి మరో న్యాయమా?????. రచ్చబండలో ప్రత్యేకంగా ఎత్తి చూపిన తప్పును అదే తప్పును ఇప్పుడు మీవర్గం వారే వ్రాస్తున్నా కళ్ళకు కనపడదు. ఎందుకంటే వారంతా అస్మదీయులు కదా.... ఈ ప్రశ్న మీదే గనుక సమాధానము చెప్పి తీరాలి. భాస్కరనాయుడు (చర్చ) 15:29, 16 ఆగష్టు 2016 (UTC)

నాకు తెలిసినంతవరకు పంజాబ్ గ్రామ వ్యాసాలు సృష్టించేటపుడే ఆ మూస లో సమయప్రాంతం IST (UTC=+5:30) అని ఉంది. అంతే కానీ సభ్యులు పనిగట్టుకుని ఇదివరకే ఉన్న వ్యాసాలకు ఆ విషయం చేర్చలేదు. నా దృష్టిలో ఆ సమాచారం అవసరం లేదు. ఉన్నా నష్టం లేదు. అలాగే ఒక ప్రాంత వ్యాసంలో అది సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నదన్న విషయం కూడా అంతే. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ క్రియాశీలకంగా పని చేసే అందరం సృజనాత్మకంగా వ్యాసాలు రాయగలం, మార్పులు చేయగల వారం. మనుషులుగా బుర్రను వాడి పనిచేస్తున్నాం. అంతే కానీ ఒకే రకమైన మార్పులు వేలకొద్దీ వ్యాసాలలో యాంత్రికంగా మార్పులు చేయడం ద్వారా మనం ఏం సాధిస్తున్నాం? కేవలం దిద్దుబాట్ల సంఖ్యను పెంచుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరాదు. అందుకోసం ఆటో వికీ బ్రౌజరో, బాటునో వాడి చేస్తే సరి. వికీలో ఎవరు బాగా కంట్రిబ్యూషన్ చేశారు అంటే ఎవరైతే ఎక్కువ సంఖ్యలో మంచి నాణ్యతతో కూడిన పెద్ద వ్యాసాలు రాశారో వాళ్ళు అనుకోవాలి గానీ ఎవరైతే ఎక్కువ దిద్దుబాట్లు చేశారో వాళ్ళు అని అభిప్రాయం కలగకూడదు. దయచేసి ఇది అందరూ గుర్తు పెట్టుకోండి. --రవిచంద్ర (చర్చ) 17:19, 16 ఆగష్టు 2016 (UTC)

ఆటో వికీ బ్రౌజర్ (AWB) వాడకం-సభ్యనామం మార్పు

[మార్చు]
ఆటో వికీ బ్రౌజర్ వాడకం లో పాలసీ కొరకు చర్చ జరిపాక దానిని పాలసీగా నిర్ణయించాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు..

దాదాపు నియమాలు తెలిసిన వారే వాడుతుంటారు. సీనియర్ సభ్యులకు మార్పుల సంఖ్య అనేది పెద్ద అవసరమైన విషయంగా అనుకోను. అయితే దాని వాడకంలో ఇటీవలి మర్పుల పరిశీలన కష్టతరం అవడం అనేది జరుగుతుంటుంది. కనుక AWB వాడకంపై ఒక పాలసీ రూపొందించుకోవాలని ఈ మార్పును సూచిస్తున్నాను. క్రింద సూచనలలో మరేవైనా మార్పులు అవసరం అనుకొంటే రాయండి, పాలసీలో మార్పుచేయవచ్చు. --Viswanadh (చర్చ) 04:49, 16 ఆగష్టు 2016 (UTC)

 నేను కొంత త్వరపడ్డాను, దీనిపై చర్చకు పెట్టిన తరువాత పాలసీ రూపకల్పన కొరకు పెట్టాలి.. అందుకే సభ్యులు మన్నించాలి. దీనిని నేను పాలసీ నుండి పాలసీ చర్చకు మారుస్తున్నాను..ఇది పూర్తి అయ్యాక పాలసీ కోసం వెళ్లవచ్చు..--Viswanadh (చర్చ) 08:20, 16 ఆగష్టు 2016 (UTC)

చర్చలు, సలహాలు, సూచనలు

[మార్చు]
  1. Viswanadh గారు ప్రతిపాదించింది తెలుగు వారికి ప్రస్తుత కాలానికి అంతగా సరిపడకపోవచ్చును. చెప్పుకోదగ్గ పనిచేసే వాడుకర్లు సంఖ్య అందుకు అనుగుణంగా లేకపోవడం ఇందుకు కారణం.
  2. నిన్న చాలాకాలానికి ఆంగ్లపదాలు తొలగింపు అవసరమై ప్రయోగాత్మకంగా ఆటో వికీ భ్రౌజర్ వాడాను. అప్పుడే దీని మీద పెద్ద చర్చకు తెర తీయడం జరిగింది. ఇటువంటివి మరో కోణంలో మానసిక అశాంతిని కలిగిస్తాయి. ఇప్పటికి వరకు, అనగా నిన్నటివరకు, అనగా నేను వాడనంత వరకు, అసలు దీని మీద ఎటువంటి అభ్యంతరములు ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు చర్చకు తెర తీసిన Viswanadh గారే ఆటో వికీ భ్రౌజర్ బాగా వాడుకుందాము అన్నట్లుగా చాలా చోట్ల నేను చూశాను. సమయ సందర్భాలు కూడా మనుష్యుల మనసుల మీద ప్రభావితం చేస్తాయి అని నా అభిప్రాయము.
  3. ఆటో వికీ భ్రౌజర్ వాడాలనుకొనే సభ్యులు దేనికొరకు వాడుకోవాలనుకొన్నారో రచ్చబండ లేదా సంభందిత వర్గ చర్చాపేజీలో కాని వివరణ రాసినా వెంటనే సమాధానములు కొంతమందికి మాత్రము ఇక్కడ రావు. దాని వలన పని చేయాలనుకునే వారికి సకాలంలో పెద్దగా ప్రయోజనం ఫలితం ఉండదు.
  4. ఆటో వికీ భ్రౌజర్ వాడాలనుకొనే సభ్యులు అనుమతి పొందిన తదుపరి వేరొక బాటు నామంతో మరొక ఖాతా తెరిచి దానిపై ఆటో వికీ బ్రౌజర్ వాడాలనే నియమం ఉంటే నా లాంటి వారికి బాటులు గురించి తెలియదు. అందుకని అసలు వాడాలా వద్దా అని, చివరికి వాడటం మానేసి, అసలు పని తగ్గించుకోవాల్సి ఉంటుంది.
  5. ఆటో వికీ భ్రౌజర్ వలన పని త్వరగా ముందుకు కదులుతుంది. పని చేసే వారి పని సులువుగా ఉంటుంది.
  6. బాటులున్న వారు పని చేస్తారన్న గ్యారంటీ లేదు. పని చేయాలనుకునే వారికి బాట్లు గురించి అవగాహాన పెద్దగా లేదు.
  7. పని చేసే వారు ఇక్కడ పెద్దగా లేనపుడు, ప్రస్తుతం ఈ కొత్త ప్రతిపాదన నా దృష్టిలో ఇప్పుడు అంతగా ప్రయోజనం కాదు.
  8. మార్పులు సంఖ్య గురించే ఈ ప్రతిపాదన వచ్చిందేమోనని కూడా సందేహం అందరికీ కలగవచ్చును. పనిచేసే వారికి మార్పులు కన్నా ప్రజలకు ఉపయోగపడే మంచి సమాచారం ఎంత చేర్చారు అనేదే ముఖ్యం.
  9. నాకు తక్కువ సమయంలో ఎక్కువ మంచి పనులు చేయాలనేదే నా సంకల్పం. అందుకు ఉపయోగపడే సాధనాలు అన్నీ నా తెలిసినవి అవసరమైనప్పుడు వాడుతూ పని చేసుకుంటాను.
  10. నా అభిప్రాయములు చెప్పాను. సముదాయము వారు తీసుకునే నిర్ణయాలు ఏవైనా పని చేసే వారికి అనుకూలంగా చేస్తే ఈ కొద్దిమంది అయినా కాస్త చురుకుగా పని చేయగలుగుతారు అని నా భావన. JVRKPRASAD (చర్చ) 05:22, 16 ఆగష్టు 2016 (UTC)
ఆటో వికీ బ్రౌజర్ తో అనేక శుద్ధి కార్యక్రమాలను యిదివరకు చేసాము. అందులో వేగంగా మార్పు చేసేకంటే మార్పు సరియైనదేనా అని పరిశీలించి చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అనేక గ్రామ మరియు యితర వ్యసాలలో శుద్ధి కార్యక్రమాలు జరిగాయి. మార్పులు చేసేటప్పుడు చిన్నమార్పు(minor edit) సూచించడం వల్ల ఇటీవలి మార్పులను పర్యవేక్షించడం లో చిన్నమార్పులను దాచి మిగిలినవి చూడవచ్చును. సరైన దిశలో ఉపయొగించుకుంటే ఏ ఉపకరణం తోనైనా యిబ్బంది ఉండదు. మనకు వికీలో ఆటోవికీబ్రౌజర్ ఉపయోగించడంలో దుశ్చర్యలకు ఎవరైనా పాల్పడినారా? అలా ఎవరైనా ఈ ఆటోవికీబ్రౌసర్ ఉపయోగించి దుశ్చర్యలకు పాల్పడినట్లయితే ఆ వివరాలు తెలియజేయండి. వారికి హెచ్చరికలు చేయండి. దానివల్ల వికీలో శుద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, దాని వల్ల వికీ వ్యాసాలను నష్టం కలగనప్పుడు దానికోసం పాలసీ ప్రస్తుతం అవసరమని నేననుకోవడం లేదు. ధన్యవాదాలు. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 06:03, 16 ఆగష్టు 2016 (UTC)
ఇక్కడ నాఅభిప్రాయం వ్యక్తం చేయడంలో పొరపాటు జరిగినట్టుంది. నేను బాటు ద్వారా మార్పుచేయమని చెప్పలేదు. ఆటో వికీ ద్వారా నేను చేసిన మార్పులు 2 కె.బి కూడా ఉన్నాయి. చిన్నమార్పులు దాయడం అనేది దీని ద్వారా సాద్యం కాదు. ఇక వ్యాసంలో ఉన్న ఆన్ని సవరణలను ఒకే సారి చేసుకొనే వీలు ఉన్న AWB ని, ఒక్కో సారి ఒక్కో మర్పుకు మాత్రమే ఉపయోగించడం మార్పుల సంఖ్య పెంచుకోవడానికే తప్ప మరెందుకూ పనికిరాదని నా అభిప్రాయం. ఉదాహరణకు ఒక చిన్న సవరణ ఒకసారి చేయడం ద్వారా 1000 మార్పులు జరిగితే, తరువాత మళ్ళీ మరో సవరణ ద్వార మరో 1000 ఇలా జరగటం అనవసరం. ఇక నేను చెప్పింది. AWB వాడే వారు మరొక ఖాతా తీసుకొమ్మని అంతే. ఇలా చేయడంలో సమస్య ఏమిటి. ఉదాహరణకు నేను ప్రస్తుతం ఉన్న వాడూకరి పేరుకు చివర బాటు అని తగిలించి, దానిని బాటు అకౌంట్‌గా మార్చుకొని AWB వాడుకొంటాను. దీని ద్వారా వచ్చే మార్పులు ఏవీ ఇటీవలి మార్పులలో కానరావు. పనిపూర్తి అవుతుంది. దీని వాడవద్దని దుశ్చర్యలు జరుగుతున్నాయని నేను అనలేదు. ఇటీవల నేను అమృత్‌సర్ వర్గంలో వాడుతున్నపుడు వచ్చిన ఆలోచన ఇది. రెండురోజుల క్రితం వాడిన తరువాత ప్రణయ్ మరికొన్ని మార్పులు సూచించినా చేయకపోవడానికి ఇదే కారణం. ఇపుడు నేను ఒక బాటు అకౌంట్ తీసుకొని దాని ద్వారా AWB వాడుతాను. ఇది బాటు కాదు కనుక దీనిని ఎవరైనా అమలుచేసి హాయిగా వాడుకోవచ్చు. ఇది ఒక ఇబ్బందిలేని ఉపాయం మాత్రమే.దీనిలో నా వ్యక్తిగత ఆశక్తి ఏమాత్రం లేదు...--Viswanadh (చర్చ) 07:14, 16 ఆగష్టు 2016 (UTC)
ఇప్పుడు నేను పంజాబ్ గ్రామ వ్యాసాలలొ ఖాళీ విభాగాలను ఆటో వికీబ్రౌసర్ ద్వారా తొలగించాను. నేను ఏమి చేస్తున్నానో మీకందరికీ తెలిసింది.పేరుతో పాటు బాటు ద్వారా ఎవరో క్రొత్త వాడుకరి దుశ్చర్యలు ఆటోవికీ బ్రౌసర్ ద్వారా దుశ్చర్యలు చేసినట్లయితే ఎవరు పరిశీలించగలరు? Viswanadh గారూ ఒకసారి సందేహ నివృత్తి చేయండి. ఎలాగోలా వికీపీడియాకు సభ్యులు అభివృద్ధి చేస్తున్నారో లేదో పరిశీలించండి. గానీ దిద్దుబాట్లు ఎక్కువవుతున్నాయనే సాకుతో ఇటువంటి విధానాలకు ప్రోత్సహించరాదని మనవి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 07:56, 16 ఆగష్టు 2016 (UTC)

కె.వెంకటరమణ గారు కొత్త వాడుకరులకు బాటు గుర్తింపు ఎలా ఇస్తాం. ఇచ్చిన వాడుకరి ముందుగా రచ్చబండలో గాని లేదా చేయాలనుకొనే వర్గపు చర్చాపేజీలో కాని దేని గురించి చేయాలనుకొన్నాడో వివరణ రాసాకనే కదా మార్పులు మొదలుపెట్తేది..అలా సాద్యం అయితేనే పాలసీ రూపొందుతుంది. లేదా ఇది ఒక చర్చ మాత్రమే అవుతుంది.--Viswanadh (చర్చ) 08:12, 16 ఆగష్టు 2016 (UTC)

ఆయా మార్పుల పర్యవేక్షణ ఎలా జరుగుతుంది?--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 08:13, 16 ఆగష్టు 2016 (UTC)
బాటు మార్పులను చూస్తే తెలుస్తుంది. లేదా వాడుకరి బాటు మార్పులను పరిశీలించవచ్చు. చేసేది బాటు ద్వారా కాదు కనుక, ఇక్కడ కోడింగ్ ద్వారా మార్పులు జరగవు కదా. అన్నీ కనిపిస్తాయి కేవలం. ఇటీవలి మార్పులలో కనిపించకుండా జరిగేందుకు మాత్రమే. ఇది సాద్యం అయితేనే ముందుకు వెళ్ళవచ్చు. నేను కొంత త్వరపడ్డాను, దీనిపై చర్చకు పెట్టిన తరువాత పాలసీ రూపకల్పన కొరకు పెట్టాలి.. అందుకే సభ్యులు మన్నించాలి. దీనిని నేను పాలసీ నుండి పాలసీ చర్చకు మారుస్తున్నాను..ఇది పూర్తి అయ్యాక పాలసీ కోసం వెళ్లవచ్చు..--Viswanadh (చర్చ) 08:20, 16 ఆగష్టు 2016 (UTC)
ఆటో వికీబ్రౌజర్ ద్వారా మార్పులు చేయాలనుకున్నప్పుడు రచ్చబండలో దానికి సంబంధించిన వివరాలు రాసి, తెవికీ సభ్యులకు తెలియజేసి అటుపిమ్మట ఆ పనిని ప్రారంభించాలన్న చర్చ గతంలో నెలవారి సమావేశంలో జరిగింది. కనుక ఇది కొత్తగా అనుకున్న విషయం కాదని సహ సభ్యులు గమనించాలి. నేను గతంలో ఆటో వికీబ్రౌసర్ ని ఉపయోగించి మార్పులు చేశాను. దాంతో నా ఎడిట్ల సంఖ్య 70వేలకు పెరిగింది. రెండు రోజుల్లో నేను తెవికీలో 5వ స్థానాన్ని పొందాను. ఎవరైనా చూస్తే, నేను ఎక్కవ కృషి చేశాను అనుకుంటారు. నిజంగా కృషి చేసినవారు అది కోల్పోయినట్టే కదా... కనుక ఆటో వికీబ్రౌసర్ ను ఉపయోగించేవారు వేరే ఖాతాను తెరవడం మంచిదని నా అభిప్రాయం..--Pranayraj1985 (చర్చ) 08:34, 16 ఆగష్టు 2016 (UTC)
నాకర్థమైంది ఇది. AWB వాడే విషయంలో మనం రెండు ప్రశ్నలను ఎదుర్కొంటున్నాం:
  1. "AWB వాడేముందు, సదరు వాడుకరి తాను చెయ్యదలచిన మార్పులను సముదాయానికి వివరించి, సరే అనుకున్నాక చేస్తే మంచిదా?": అవును మంచిదే. అలాగే చెయ్యాలి. AWB తో చేసిన మార్పులను నేను కొన్ని చూసాను. ఒకచో తప్పు దొర్లింది. కానీ దాన్ని గుర్తించేసరికి బహుశా కొన్ని వేల మార్పులు జరిగిపోయి ఉంటాయి. మళ్ళీ అన్నివేల మార్పులు తిరిగి చెయ్యాల్సివస్తుంది. అది అనవసరం కదా! అంచేత చెయ్యదలచిన మార్పులను వివరించి, ఆ మార్పులను ఒక పేజీలో మానవికంగా చేసి, సముదాయం సరే అనుకుంటే, అప్పుడే ముందుకు పోవాలి.
  2. "ఏ వాడుకరి చెయ్యాలి, మనుష్యులా లేక ప్రత్యేకించిన AWB వాడుకరా?" దిద్దుబాట్ల సంఖ్యకు మనం అవసరమైనదాని కంటే బాగా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామనిపిస్తోంది. తెవికీలో గతంలో జరిగిన పెద్ద చర్చాయుద్ధాలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో దిద్దుబాట్ల సంఖ్యే కారణమని నాకు అనిపించింది. ఎవరైనా వాడుకరి తన పేరుమీదుగానే AWB దిద్దుబాట్లు చేస్తానని అనుకుంటే అలాగే చెయ్యనిద్దాం. లేదూ తాను ప్రత్యేకించి ఒక AWB వాడుకరిపేరును సృష్టించుకుని ఆ పేరు మీద చేస్తానంటే అదీ మంచిదే! ఎలా చెయ్యాలో అది వారిష్టం. చెయ్యడమే మనకు కావాల్సింది. సంఖ్యల గురించి పక్కనబెడదాం. నాకు తెలిసి ఇక్కడ పనిచేసేవాళ్లలో, ఇక్కడ చర్చించుతున్నవారితో సహా, ఈ సంఖ్యల మీద మోజు ఉన్నవాళ్ళ సంఖ్య బహుతక్కువ. ఆ అల్ప సంఖ్యాక వర్గం వారి కోసం విధానాలను నిర్ణయించాలంటారా?__చదువరి (చర్చరచనలు) 14:52, 16 ఆగష్టు 2016 (UTC)
చదువరి గారు, ఏనాడూ సకాలంలో కాదు కదా కనీసం ఏకాలనికి లేదా ఏకాలంలోనూ కొంతమందికి సముదాయం స్పందించదు, అది కొంతమందికి మాత్రమే స్పందిస్తుంది. దయచేసి మీరు గమనించగలరు. --JVRKPRASAD (చర్చ) 15:01, 16 ఆగష్టు 2016 (UTC)
సముదాయం స్పందించదని JVRKPRASAD గారన్నది నిజమే... ఎందుకంటే నెలవారి సమావేశం నిర్వహిస్తున్న ప్రతిసారి.. సమావేశానికి ముందు, సమావేశం తరువాత ఇతర సభ్యులకోసం రచ్చబండలో చేరుస్తున్నాను. కానీ, ఏ ఒక్కసారి ఇతర సభ్యులు స్పందిచలేదు. ఆటో వికీబ్రౌజర్ ద్వారా మార్పులు చేయాలనుకున్నప్పుడు మాత్రం రచ్చబండలో చర్చ పెట్టినపుడు ఇతర సభ్యులు స్పందించాలి.--Pranayraj1985 (చర్చ) 15:24, 16 ఆగష్టు 2016 (UTC)
చదువరి గారు చెప్పినట్లు దిద్దుబాట్ల సంఖ్యకు మనం అవసరమైనదాని కంటే బాగా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామనిపిస్తోంది. కేవలం దిద్దుబాట్ల సంఖ్య ఆధారంగా ఫలానా సభ్యుడు ఎక్కువ మార్పులు చేశాడు అని గుర్తింపులు, అవార్డులు, రివార్డులు గట్రా ఇవ్వడం మానేస్తే సగం సమస్య దారికి వస్తుందని నా అభిప్రాయం. ఒక సభ్యుని కృషి బేరీజు వేయాలంటే అతను ఎన్ని విశేషా వ్యాసాలు రాశాడు, ఎన్ని వ్యాసాలను అభివృద్ధి చేశాడు? ఎంత విలువైన సమాచారం చేర్చాడు? వికీ మూలస్థంభాలైన తటస్థత, సరైన మూలాలు అన్నీ సరిగా అనుసరించాడా? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.--రవిచంద్ర (చర్చ) 17:31, 16 ఆగష్టు 2016 (UTC)

AWB తో మార్పుచేర్పుల కోసం ప్రతిపాదన

[మార్చు]

నేను AWB తో కొన్ని మార్పుచేర్పులు చెయ్యాలని ఆలోచిస్తున్నాను. నేను తలపెట్టిన మార్పు చేర్పుల జాబితాను వికీపీడియా:ఆటో_వికీ_బ్రౌజరుతో_చేయదగ్గ_మార్పులు పేజీలో పెట్టాను. ఆయా మార్పుచేర్పుల విషయంలో సముదాయం అభిప్రాయం తీసుకున్న తరువాత, ముందుకు వెళ్తాను. మీ అభిప్రాయాల కోసం చూస్తాను. __చదువరి (చర్చరచనలు) 06:15, 17 ఆగష్టు 2016 (UTC)

ఆటో వికీ బ్రౌజరు - టైపాట్ల జాబితా

[మార్చు]

ఆటో వికీ బ్రౌజరు సాయంతో టైపాట్లను మూకుమ్మడిగా సరిచేసే వీలుంది. అందుకోసం ఎన్వికీలో టైపాట్ల జాబితా తయారు చేసుకున్నారు. అదే పద్ధతిలో మన కోసం కూడా ఒక పేజీని సృష్టించాను - వికీపీడియా:AutoWikiBrowser/Typos. ఆటోవికీబ్రౌజరు ఈ పేజీ నుండి టైపాట్ల జాబితాను తీసుకుని, ఆ జాబితాలో ఇచ్చిన మార్పులను మనం చెప్పిన పేజీల్లో చేస్తుంది. AWBని డిఫాల్టుగా ఈ పేజీకి కాన్ఫిగరు చేసారు. మనం చెయ్యదలచిన మార్పు చేర్పులన్నీ ఆ పేజీలో, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సూత్రాల కనుగుణంగా రాసుకుంటే AWB దానికనుగుణంగా పనిచేసుకుపోతుంది. ఆ పేజీలో నేను కొన్ని మార్పులను (రెగ్యులర్ ఎక్స్ప్రెషన్‌లను) ఎక్కించాను. AWB లోని REGEX విశేషాన్ని వాడి ఎవరైనా ఈ మార్పులను చెయ్యచెయ్యవచ్చు. ప్రస్తుతం ఈ పేజీ ఇంకా పరీక్షణలో ఉంది. అప్పుడే వాడకండి. పరీక్ష కోసం వాడవచ్చు. __చదువరి (చర్చరచనలు) 14:20, 17 ఆగష్టు 2016 (UTC)

పంజాబ్ ఎడిటథాన్ గ్రామ వ్యాసాల్లో సమస్యలు - సరిదిద్దడం

[మార్చు]

అమృత్‌సర్ జిల్లాలో ట్రైబల్స్ అస్సలు లేరా?

[మార్చు]

లేరనే అనుకోవాల్సి వస్తోంది. పంజాబ్ గ్రామ వ్యాసాలను సుమారు 100 పరిశీలించగా వాటిలో షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0 అని ఉంది. బహుశా మిగతా వ్యాసాలలో కూడా ఇలాగే ఉంటుంది. (ఎవరైనా నిర్ధారించగలరు.) ఒక జిల్లా మొత్తం గ్రామాలలో షెడ్యూల్ తెగల జనాభా శూన్యంగా ఉండడం నమ్మదగినదేనా? ఎవరైనా నా అనుమానాన్ని నివృత్తి చేయగలరు.--స్వరలాసిక (చర్చ) 01:43, 18 ఆగష్టు 2016 (UTC)

Land and People of Indian States and Union Territories: Volume 22 అనే పుస్తకం కూడా అలాగే చెబుతోంది. ఈ క్రింది లింకులో పట్టిక 5.1 చూడండి.
https://books.google.co.in/books?id=awketfu78rsC&pg=PA77&lpg=PA77&dq=population+of+schedule+tribes+in+Amritsar+District,+Punjab&source=bl&ots=b5A3CFBoJt&sig=xhbueLHs6BWEKl7Wv2wznH5Tmlo&hl=en&sa=X&ved=0ahUKEwjwzu7z7snOAhVLQo8KHaOIDV8Q6AEIUDAJ#v=onepage&q=population%20of%20schedule%20tribes%20in%20Amritsar%20District%2C%20Punjab&f=false
ఈ లెక్కన మన రాష్ట్రంలో రిజర్వేషన్ దక్కని ఎస్.టి.లను పంజాబుకు తరిమేస్తే పోలా? :P --స్వరలాసిక (చర్చ) 02:12, 18 ఆగష్టు 2016 (UTC)

సత్తోవాల్ గ్రామములో 870 మంది ప్రజలకు త్రాగు నీరు లేదు.

[మార్చు]

పంజాబ్ లోని సత్తోవాల్ గ్రామంలో 870 జనాభా వుంది. ఇంత మంది జనాభా త్రాగేందుకు నీరు లేకుండానే బ్రతికేస్తున్నారు. త్రాగు నీరు అనే అంశం క్రింద ఈ విధంగా వున్నది. ఈ గ్రామములో శుద్ధిచేసిన కుళాయి నీరుగ్రామంలో లేదు, శుద్ధి చేయని కుళాయి నీరుగ్రామంలో లేదు, చేతిపంపుల నీరుగ్రామంలో లేదు గొట్టపు బావులు / బోరు బావుల నీరుగ్రామంలో లేదు, నది / కాలువ నీరుగ్రామంలో లేదు. చెరువు/కొలను/సరస్సు నీరుగ్రామంలో లేద ట. అనగా ఈ గ్రామములోని ప్రజలు నీరు త్రాగ కుండా జీవిస్తున్నారన్నమాట. ఇదేదో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు ఎక్కాల్చిన విషయము. ఈ విషయము కనిపెట్టిన వారి పేరుతో సహా.... ఇది చాల గొప్ప విషయము కదా... సందేహ నివృత్తి కొరకు సత్తోవాల్ గ్రామ వ్యాసము చూడగలరు. భాస్కరనాయుడు (చర్చ) 05:04, 18 ఆగష్టు 2016 (UTC)

భాస్కరనాయుడు గారూ, మీరు సరిచేస్తే కాదనే వారెవరూ లేరు కదా. తప్పులు ఎత్తి చూపటమే కాదు సరిదిద్దే బాధ్యత కూడా మనదే. ఈ ఒక్క విషయమే కాదు పంజాబ్ ఎడిటథాన్ లో సృష్టించిన గ్రామ వ్యాసాలన్నింటిలో ఉన్న అసంబద్ధ సమాచారాన్ని ఎత్తి చూపండి. అందరికీ మీ కృషి గురించి తెలియ వస్తుంది. ఆ వ్యాసాలు కూడా బాగు పడతాయి. --రవిచంద్ర (చర్చ) 05:20, 18 ఆగష్టు 2016 (UTC)
గతంలో తప్పులు ఎత్తి చూపినపుడు వారే సరిచేయవలసింది. ఈ ఇంగిత జ్ఞానము సాధరణ అక్షర దోషాలను ఎత్తి చూపి రచ్చబండలో వ్రాసి నపుడు ఏమయింది. తప్పు సరిచేయ వలసిందని చెప్పవలసింది. అక్షర దోషాలు.. వ్యాకరణ దోషాలు వంటి వాటి సంగతి నేను ఎత్తి చూపడము లేదు. (మీలో కొందరి లాగా) అటి వంటి తప్పులు సహజమే.. సరిదిద్దుకోగలము. ఈ గ్రామములో అసలు ఎటువంటి త్రాగు నీటి వసతి లేదు అని చెప్పి.. తగు మూలాలను కూడ చేరిస్తే ఎలా సరిదిద్ద గలము. ఇక్కడ త్రాగు నీటి వసతి వుంది అని నేను ఏ ఆధారము తో చూపగలను. తప్పులెన్ను వారు తండోపతండంబు, ఉర్వి జనుల కెల్ల నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు, విశ్వధాభి రామ వినుర వేమా. ఈ సూక్తి మీకు, నాకు మనందరికి వర్తిస్తుంది. భాస్కరనాయుడు (చర్చ) 05:47, 18 ఆగష్టు 2016 (UTC)
నేను తప్పులు చేయను. చేయలేదు అని చెప్పలేను. నేను మనిషినే. తప్పుడు సమాచారం కనిపిస్తే, నాకు సరైన సమాచారంతో కూడిన మూలం దొరికితే సరి చేస్తాను. లేదంటే అలానే వదిలేస్తాను. ఒకవేళ నిజంగా గ్రామంలో నీటి వసతి లేక ఎక్కడో దూరంగా ఉన్న బావుల నుంచో, బోర్ల నుంచో తెచ్చుకుంటాన్నారేమో ఎవరికి తెలుసు. ప్రభుత్వం వారి గణాంకాలు అలా చెబుతున్నాయి. దాన్ని తప్పని నిరూపించాలంటే సరైన ఆధారం చూపాలి లేదంటే మనమే స్వయంగా వెళ్ళి చూసి రావాలి. --రవిచంద్ర (చర్చ) 06:06, 18 ఆగష్టు 2016 (UTC)
అసంబద్దమైన సమాచారము, వ్రాసి దానికి మూలాలు వెదకడంకంటే.... అటు వంటి సమాచారము వదిలెస్తే మంచిదేమో???? ఆచరణ సాద్యంకాని సలహాలు నిష్రయోజనము.( తప్పని నిరూపించాలంటే సరైన ఆధారం చూపాలి లేదంటే మనమే స్వయంగా వెళ్ళి చూసి రావాలి.) భాస్కరనాయుడు (చర్చ) 06:21, 18 ఆగష్టు 2016 (UTC)
అదే నేను కూడా చెప్పేది. :-)--రవిచంద్ర (చర్చ) 06:23, 18 ఆగష్టు 2016 (UTC)
భాస్కరనాయుడు గారు పైన తెల్పిన నీటి వనరుల్లో బావులను చూపలేదు. గ్రామంలో 122 చూపించారు. కొన్ని గ్రామాలకు బావులే నీటి వనరులు కావచ్చును.రాజస్థాన్ గ్రామ్మల్లో కొన్ని గ్రాఅమాలకు అవీ ఉండవు. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి నీళ్ళు తెచ్చుకుంటారు....అక్కడి వరకూ అక్కరలేదు, గత కొద్ది రోజుల ముందు వరకూ కైకలూరు, కలిదిండి వంటి మండలాల్లో స్నానం చేయడానికీ నీళ్ళు టాంకర్లు ఆకివీడు వంటి మండలాల నుండి కొనుక్కొని తెచ్చుకొనేవారు..--Viswanadh (చర్చ) 09:57, 18 ఆగష్టు 2016 (UTC)

సొహియన్ ఖుర్ద్ గ్రామములో సమీపకాలిబాటలు గ్రామానికి 10 కిలోమీటర్ల కన్నా దూరంలో ఉంది.

[మార్చు]

గ్రామం రాష్ట్ర హైవేతో అనుసంధానమై ఉంది. గ్రామం ప్రధాన జిల్లా రోడ్డుతో అనుసంధానమై ఉంది. సమీప కాలిబాటలు గ్రామానికి 10 కిలోమీటర్ల కన్నా దూరంలో ఉంది. అని వున్నది. గ్రామం జిల్లా ప్ర్రధాన రోడ్డుతో అనుసంధానమై ఉంది అన్నప్పుడు ఏదో ఒక రోడ్డుతో అనుసంధానమై వుంటుంది. అలాంటప్పుడు గ్రామములో కాలి బాటలు 10 కి.మీ కన్నా దూరములో వుంది అని వ్రాయడము అసంబద్దంగా అనిపిస్తున్నది. దీన్ని బట్టి చూస్తే ఆ గ్రామములో అసలు కాలి బాటలు కూడ లేవని అర్థం స్పురిస్తుంది. కనుక ఇతరులు సరిదిద్దే విషయం కాదు. ఇది ఆంగ్లము నుండి తర్జుమా చేయడములో దొర్లిన తప్పేమో సరిచూసుకొని సరిదిద్దగలరు. భాస్కరనాయుడు (చర్చ) 05:59, 18 ఆగష్టు 2016 (UTC)

కన్నా దూరంలో ఉంది అనే విభాగాలను నేను తొలగిస్తున్నాను. గమనించలేదనుకుంటాను. అవి అన్ని గ్రామాల్లోనూ ఉండవు. ఉన్నవి నెమ్మదిమీద సరిదిద్దబదతాయి. తప్పులు చూపడం కంటే వాటిని సరిదిద్దగలగడం మంచి ప్రయత్నం..--Viswanadh (చర్చ) 10:00, 18 ఆగష్టు 2016 (UTC)
పైన చెప్పినదాంట్లో నేనేమీ తప్పును ఎత్తి చూపలేదే ?? ఆంగ్లము నుండి తర్జుమా చేయడములో దొర్లిన తప్పేమో అని సందేహము వ్వక్తం చేశాను. అంతే కదా. అక్షర దోషాలైతే సరిదిద్ద వచ్చు. అంత మాత్రానికే ఒక ఉచిత సలహా పారేస్తారు. నిజంగానే తప్పును సరిదిద్దితే ఇంకేమంటారో...... అందుకే అన్నారు ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అని. భాస్కరనాయుడు (చర్చ) 10:17, 18 ఆగష్టు 2016 (UTC)
భాస్కరనాయుడు గారూ, మీరు పంజాబ్ గ్రామ వ్యాసాల్లో తప్పులు సరిదిద్దుతుంటే ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేశారా? ఎక్కడ? ఎప్పుడు? ఎవరు? --రవిచంద్ర (చర్చ) 10:21, 18 ఆగష్టు 2016 (UTC)
దాదాపుగా ఈ వ్యాసాలు మొదలెట్టిన లగాయతు, మీరు మాత్రమే ప్రశ్నిస్తున్నది. పంజాబ్ లోనూ దీనిపై మీకూ మాకూ మద్య చర్చలు నడిచాయి. మీకు వివరణ ఇచ్చాము. మళ్ళీ మీరు వీటిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎవరి సలహాలపై జరుగుతున్నదో అనవసరం కాని ఈ విషయంలో దయచేసి కొంత కాలం సమయమనం పాటించమని విజ్నప్తి చేస్తున్నాను..వ్యాసాలలో మార్పులు కొంత అవరకూ పూర్తి అయ్యాక మీరు ఏవైనా మార్పులు సూచించండి. చేదాం.--Viswanadh (చర్చ) 10:49, 18 ఆగష్టు 2016 (UTC)

వ్యాపారాత్మక బ్యాంకు?

[మార్చు]

వ్యాపారాత్మక బ్యాకు అని పంజాబ్ గ్రామాలలో చాల సార్లు వస్తున్నది. దానికన్నా వాణిజ్య బ్యాంకు అంటే సరిపోతుందేమో పరిశీలించగలరు. భాస్కరనాయుడు (చర్చ) 07:26, 18 ఆగష్టు 2016 (UTC)

మంచి సూచనండీ. మెరుగుపరిచేందుకు ఉపకరిస్తుందనుకుంటాను. --పవన్ సంతోష్ (చర్చ) 18:52, 18 ఆగష్టు 2016 (UTC)

అర్థము వివరించగలరు

[మార్చు]

సమీప నీటితో బౌండ్ అయిన మెకాదం రోడ్డు గ్రామానికి 5 నుంచి 10 కిలోమీటర్ల లోపే ఉంది. అనగా ఏమిటి?. (నాకర్థము కాలేదు) తెలిసిన వారు అందరికి అర్థమయ్యే విధంగా వివరించ గలరు. భాస్కరనాయుడు (చర్చ) 07:15, 18 ఆగష్టు 2016 (UTC)

దీనినీ తొలగిస్తున్నాం.. తొలగిస్తున్న భాగాలకు అర్ధం ఎందుకండి..--Viswanadh (చర్చ) 10:01, 18 ఆగష్టు 2016 (UTC)

వికీ మిత్రులకు విజ్నప్తి - పంజాబ్ గ్రామ వ్యాసాలపై దాడి కొంతకాలం ఆపితే, మునుపు అనుకొన్నట్టుగా వాటిని సరిదిద్దే సభ్యులు వారిపని చేసుకువెళతారు. వారికి సహకరించి మీరూ ఒక చేయి వేయగలిగితే సంతోషమే.. లేదూ అయినా సంతోషమే..పూర్తికాగానే ఇంకా ఏవైనా లోపాలుంటే తెలియచేస్తే అప్పుడు సరిదిద్దవచ్చు..--Viswanadh (చర్చ) 10:04, 18 ఆగష్టు 2016 (UTC)

తొలగించినా ... తొలగించకున్నా నాకేమి అబ్యంతరము లేదు. నేనేమి తొలగించమనలేదే??? అర్థం అడిగానంతే.... భాస్కరనాయుడు (చర్చ) 10:25, 18 ఆగష్టు 2016 (UTC)
  • ఇక్కడ దాని గురించి కొంత తెలుసుకోవచ్చు. వాటర్ బౌండ్ మెకాదం రోడ్డుకు మరింత మెరుగైన అనువాదం లభిస్తే సూచించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 15:31, 18 ఆగష్టు 2016 (UTC)
macadamise : ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008

(పక్కా) రోడ్డు వేయు. macadamise : పత్రికాపదకోశం (ప్రెస్ అకాడెమీ) 2004 పక్కారోడ్డు వేయు Mac-ad'amize : శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972 vt. రాళ్లుపఱచి గట్టిచేసి, ౘదునుచేయు, cover with broken stones and form a hard surface.

To Macadamize : బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852 to level, to smooth, to facilitate.

పై నిఘంటు శోధన ప్రకారం వాటర్ బౌండ్ "మాక్ ఆడమ్‌" రోడ్డును (తారు వాడని) పక్కా రోడ్డు అనొచ్చేమో! కొంచెం మోటుగా చెప్పాలంటే కచ్చాపక్కా రోడ్ఢు :-) --స్వరలాసిక (చర్చ) 17:13, 18 ఆగష్టు 2016 (UTC)

మనం రబ్బీసు రోడ్డంటాం గదా.. అదేమో! రాళ్ళేసి, మొరంలాంటిదేదో వేసి చదును చేస్తారు. __చదువరి (చర్చరచనలు) 17:49, 18 ఆగష్టు 2016 (UTC)
సింపుల్ గా మట్టిరోడ్డు లేదా గులకరోడ్డు అంటే బాగుంటుందేమో. మేము చిన్నప్పుడు మా ఊళ్ళకు అవే రోడ్లుండేవి. కేవలం బండి రెండు చక్రాలు పోవడానికి ఉండే దారైతే అది బండి బాట. అలా కాకుండా ఒకే నడవడానికి ఉండే ఒకే దారి ఉంటే కాలిబాట అనే వాళ్ళం. --రవిచంద్ర (చర్చ) 18:04, 18 ఆగష్టు 2016 (UTC)
కంకర్రోడ్డు - కంకరరోడ్డు - అని కూడా అనేవాళ్ళం__చదువరి (చర్చరచనలు) 18:23, 18 ఆగష్టు 2016 (UTC)
  • ఈ గ్రామవ్యాసాల సమాచారం మెరుగపరిచేందుకు వీటి మూల అనువాదాలను మెరుగుపరిచి మరోమారు ఖమ్మం వ్యాసాలు ప్రచురించేందుకు ప్రయత్నిస్తున్నాం. వీటిలో ఈ సూచనలు ఉపయోగిస్తాం. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 18:45, 18 ఆగష్టు 2016 (UTC)
వాడుకరుల స్నేహితులకు, నాకు తెలిసినది మీకు తెలియజేస్తున్నాను. కేవలం మట్టిరోడ్డు తదుపరి రూపాంతరము గులకరోడ్డు అయితే, ఆతదుపరి ఆ రోడ్డు మీద కావలసిన గ్రావెల్ అనగా ఎర్రమట్టితో చదును చేస్తే అది రబ్బీసు లేదా కచ్చా రోడ్డుగా తయారయ్యి, కొన్నాళ్ళు దానిని ప్రజలు వాడిన పిదప, గట్టి పడిన తదుపరి దానిని మరికొంత గట్టిదనం తెచ్చేందుకు మరొక మారు నీరు, కంకరతో కూడిన గ్రావెల్ రోడ్డు వేస్తారు. దీనినే వాటర్ బౌండ్ మెకడం లేదా పక్కా రోడ్డు అని కూడా అంటారు. ఇటువంటి రోడ్డు రాబోయే కొద్ది రోజులలోనే తారు రోడ్డు వేసేందుకు అనువుగా ఉంటుంది లేదా తారు రోడ్డు వేసేందుకు ముందుగా ఇటువంటి రోడ్డును తయారు చేస్తారు. దీనినే కంకరరోడ్డు అని అంటారు. చదువరులకు అర్థమయితే సంతోషము. ఏమీ అర్థం కాలేదు అంటే మీ చర్చలలో కల్పించుకున్నందుకు దయచేసి మన్నించండి. --JVRKPRASAD (చర్చ) 00:02, 19 ఆగష్టు 2016 (UTC)
తెలియని దానికి అర్థమడిగితే? ఎంత వివరణాత్మకమైన, సంస్కార వంతమైన సమాధానము చెప్పారో..... వారందరికీ నా హృథయపూర్వ వందనాలు. సబ్బుల్లో సంస్కారావంతమైన సబ్బు వుందని టి.వి.యాడ్ లో చూశాను. కానీ సమాధానాల్లో కూడ సంస్కార వంతమైన సమాదానం చెప్పొచ్చన్నమాట ఇప్పుడే తెలిసింది. మరొక్కసారి ధన్యవాదములు. భాస్కరనాయుడు (చర్చ) 09:39, 19 ఆగష్టు 2016 (UTC)
పంజాబు గ్రామ వ్యాసాల అభివృద్ధిలో భాగంగా.... ఆనాడు నేను వ్రాసిన (పైవారి సూచనల ప్రకారం కాపి/పేస్ట్) కొన్ని గ్రామాల వ్యాసాలు కొన్నింటిని సరిదిద్ది (వ్యాసంలోని విషయం మార్చకుండా) పునర్యుక్తమైన పదాలను మాత్రమే తొలగించి, పేరాల రూపములో తిరిగ వ్రాశాను. ఇది పరవాలేదనుకుంటే వుంచండి. బాగోలేదనుకుంటే తొలగించండి. నాకేమి అబ్యంతరము లేదు. ఏమి అనుకోను కూడ. లేదా నాకు చెప్పిన ..... మానుకుంటాను. భాస్కరనాయుడు (చర్చ) 09:53, 19 ఆగష్టు 2016 (UTC)
భాస్కర నాయుడు గారూ, మీరు రాసినట్లుగా రాస్తేనే బావుంటుంది. నేను కూడా కొన్ని వ్యాసాలలో అలాగే రాశాను. సహచరులు ఇచ్చిన సూచనలు మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దని మనవి. ఇక్కడ మనమంతా ఓ కుటుంబంగా తెలుగు కోసం సేవ చేస్తున్నవాళ్ళమే. ఎవరు ఏది చెప్పినా తెవికీ మంచి కోసమేనని గమనించండి. మీ కృషిని కొనసాగించండి. --రవిచంద్ర (చర్చ) 10:00, 19 ఆగష్టు 2016 (UTC)
పైన చర్చించిన విధంగానే ఆ సమాచారం ఉపయోగించి గ్రామ వ్యాసాలను మరింత అర్థవంతంగా, ప్రయోజనకరంగా ఎలా తయారుచేయవచ్చన్న అంశంపై ప్రయత్నించి - ఖమ్మం జిల్లాలోని అడవి రామవరం (గుండాల), అడవి రామవరం (దుమ్ముగూడెం), అచ్యుతాపురం (అశ్వారావుపేట), అచ్యుతాపురం (దుమ్ముగూడెం), అబిచెర్ల, ఆచార్లగూడెం, అబ్బుగూడెం వంటి ఖమ్మం జిల్లా గ్రామ వ్యాసాలు, ఛిన కరంసింగ్, చిచా, చిమబాత్, చోగవాన్, చూగవాన్ రూపొవాలి, చూచక్ వాల్, చంగ్ వంటి అమృత్ సర్ జిల్లా వ్యాసాలను ఆ విధంగా అభివృద్ధి చేశాం. చిన్న చిన్న భేదాలు ఎలా ఉన్నా మొత్తంగా వ్యాసం ఎలా ఉందో పరిశీలించమని చర్చించినవారికి మనవి. నాకు అర్థమైనంతవరకూ జరుగుతున్న చర్చ ప్రధానంగా భాష, శైలి, ఔచిత్యం పరంగా జరుగుతోంది. ఆ మూడిటిని దృష్టిలో పెట్టుకునే రూపొందించడం, ఇంతకు ముందు కొన్ని విభాగాలు మాదిరిగా తీసుకుని కృషిచేసిన భాస్కరనాయుడు గారి ప్రయత్నం పరిగణనలోకి తీసుకున్నాం. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 13:32, 26 ఆగష్టు 2016 (UTC)
పవన్ సంతోష్ గారూ.....

మీరు పైన ఉదహరించిన అన్ని గ్రామాల వ్యాసాలను చూశాను. చాల చక్కగా కుదిరింది. విషయము అర్థమైనా అందులోని వ్యాఖ్య నిర్మాణము సరిగా లేకుంటే చదవడానికి అదో మాదిరిగా వుంటుంది. అటు వంటి ఇబ్బంది లేకుండా వాఖ్య నిర్మాణము, శైలి చాల బాగుంది. ఇదే పద్దతి మన గ్రామాలన్నింటికి ఉపయోగిస్తే గ్రామ వ్యాసాలు చాల చక్కగా వుంటాయి. ఇలా వుంటే దిద్దుబాట్లు చేసే శ్రమ కూడ చాల వరకు తగ్గుతుంది. గ్రామ వ్యాసాలలో ఈ విధానము రవిచంద్ర గారికి కూడ ఆమోద యోగ్యమని గతంలో చెప్పినట్లుగా గుర్తు. ఈ విధానమే కొనసాగిద్దాము. భాస్కరనాయుడు (చర్చ) 14:06, 26 ఆగష్టు 2016 (UTC)

భాస్కరనాయుడు గారూ ప్రచురించేప్పుడు నేరుగా పాఠ్యం మొత్తాన్ని ప్రచురించకుండా, దాన్ని పైన చూపించిన వ్యాసాల్లో మాదిరిగా మార్చుకుని రాసి ప్రచురించాను. మీరన్నట్టుగా దానివల్ల నిర్వహణ శ్రమ తగ్గుతుంది. మీ స్పందనకు ధన్యవాదాలు. దీనిపై మరింతగా రానున్న రోజుల్లో చర్చించి, గ్రామవ్యాసాల మెరుగదలకు ఉపయోగిద్దాం. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 14:47, 26 ఆగష్టు 2016 (UTC)

గ్రామవ్యాసాలగురించి నాసూచన

[మార్చు]

తెలుగుగ్రామాల చరిత్ర అసంపూర్ణం ముందు వాటిని సమగ్రసమాచారంతో నింపవలె. ఇది వదిలి తెలుగుగ్రామవ్యాసాలువ్రాసేవారిని నిరుత్సాహపరుస్తున్నారు. ఏవిషయంచేర్చినా ఇదిలెదని చెబుతున్నారు కొందరు మిత్రులు కాని దానికి తగిమ ఆధారం చూపటం లేదు. అదినిర్ధారించవలసింది మేమేనట. ఇది పనిచేసేవారిని నిరుత్సాహపర్చటం మాత్రమే. బహుశా ఇది మనభాష వారి దురదృష్టమనుకుంటాను. ఒక సీనియర్ మిత్రుడు 'పాతపెదపాడు ' గ్రామం లేదంటారు నేను ఇన్ ఫోబాక్చుపెట్టినతరువాత. ఆగ్రామమం వుంది అచట మాబందువులున్నారు. నేను ఒకసారి వెళ్ళటంజరిగింది. చాలాగ్రామాలకు ఇదే సూత్రం చెప్తూ వుందోలేదో తెలుసుకుని రద్దుచేయనలసినదని నాకుసూఛన. లేవకున్నాయన దానిమీద చ్ఫర్యతీసుకోవచ్చును. ప్రస్తుతం పంజాబుగ్రామాలు ABW ద్వారా ఒకేసమాచారాన్ని నింపుతున్నారు. ప్రతిగ్రామానికి అదేసమాచారం i..e. ఈగ్రామానికి డ్రైనేజికాలువకు పైకప్పులేదు. మొత్తం సమాచారం ఇలానేవుంది. అవలు ABW అనేది అవుసరమా! ఇదికేవలం ఎడిట్సు పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. తెలుగు సంసృతి పెంచడానికి అనర్హం. సీనియర్ సబ్యులు, వ్యాసాలు వ్రాసేమేధావులు కూడా ఇదేబాటపట్టుట చాలాభాధాకరమైనవిషయం. సీనియర్ సబ్యులు వీలుచూసుకుని ఒకసారి హైదరాబాదులో తె.వి.కీ.సమావేశానికి హాజరైతేసంతోషిస్తాము. వారివద్దనుండినేర్చుకోవలసిన అంశాలు చాలవున్నాయి. ఇక్కడమాకు నేర్పేవనరులు చాలాతక్కున. చూడాలని ఆతృతతో ఎదుచూస్తున్నాం. Nrgullapalli (చర్చ) 12:56, 18 ఆగష్టు 2016 (UTC)

Nrgullapalli గారు, మీరు వ్రాసినది చదివాను. ఇప్పుడు వ్రాసిన దాంట్లో మీరు అడిగే లేని గ్రామాలకు ఆధారం ఎలా చూపుతారండి. మీరు ఉన్నాయని అంటే మీరే ఆధారం చూపాలి కదా ! మీ వాదన సరి అయినది అని మీరు అనుకున్నా అవతలి వారు కూడా అలాగే అనుకుంటారు. మీరు స్పష్టంగా మీ మనసులోని విషయము వ్యక్త పరచండి. కొంత వరకు అర్థం చేసుకోవచ్చును. నేనూ గ్రామం లేదు అనే మూస కొన్నింటికి మీరు వ్రాసిన వ్యాసాల దాంట్లో పెట్టాను. అందువల్లనే నేను ఇక్కడ స్పందిస్తున్నాను. మీరు చెప్పిన పాతపెదపాడు గ్రామము సెన్‌సస్, 2011 గ్రామాల జాబితాలో లేదండి. నేను పెట్టిన మూసలు అన్ని పేజీలు గురించి సెన్‌సస్, 2011 గ్రామాల జాబితా చూసే గ్రామం లేదు అనే మూసను చేర్చాను. లేని గ్రామాలకు నేను ఆధారాలు చూపలేను కదా ! అవి వేటిలోనో కాలక్రమం జరిగే మార్పులలో ఒక భాగమై అయి ఉండవచ్చును. నేను ఆంధ్ర ప్రదేశ్ లోని చాలా భాగములలో నివాసం లేదా వెళ్ళడము జరిగింది. ప్రస్తుతకాలంలో చాలా గ్రామాలు కనుమరుగయ్యాయి. అలాగే కొత్త ఊరుపేర్లువి కూడా వచ్చాయి. చాలా గ్రామాలు ప్రభుత్వం వారు కుదించారు. మీరు చెప్పిన పాత పెదపాడు గురించి అయితే మాత్రము సెన్‌సస్, 2011 ప్రకారం పెదపాడు మండలము లోని గ్రామాలలో వచ్చేవి (1) పెదపాడు - I మరియు (2) పెదపాడు - II అని రెండు గ్రామాలుగా చేశారు. నా వరకు నేను ఎవరికీ నిరుత్సాహం కలిగించను. పెద్దవారు అయిన మీరు నాతో స్వేచ్చగా మాట్లాడవచ్చును. మీరు నాతో ఏమయినా అడగాలనుకుంటే తప్పకుండా ప్రశ్నలు అడగండి. మీరు తృప్తి చేందే వరకు జవాబులు చెబుతాను. ఇంక మీదే ఆలస్యం. --JVRKPRASAD (చర్చ) 14:00, 18 ఆగష్టు 2016 (UTC)
Nrgullapalli గారు, మీరు సూచించిన పాత పెదపాడు గ్రామము గురించి ఖచ్చితంగా ఏదైనా ప్రభుత్వ అధికారిక మంచి సమాచారం ప్రస్తుతము మీ దగ్గర ఉన్నది మీరు మూలము చేర్చి వ్రాయవచ్చు కదండి. నాలాంటి అర్భకులాంటి వానికి ఏదైనా తెలియకపోతే తెలిసో తెలియకో అమాయకంగా ఒకవేళ అడిగితే ఆ పేజీలోనే మీరు సంతోషంగానే తెలియజెప్పండి. మీకు ఇందులో ఏ సమస్యలేదు. JVRKPRASAD (చర్చ) 14:41, 18 ఆగష్టు 2016 (UTC)
JVRKPRASAD గారు మీస్పందమలి ధన్యవాదములు. పంచాయతీ లేని గ్రామాలపేర్లు Census of India, One fine nine. com లో వుండవు.--Nrgullapalli (చర్చ) 03:08, 20 ఆగష్టు 2016 (UTC)
వికీలో స్వంతంగా మనకు గ్రామం గూర్చి తెలిసినా మూలాన్ని చేర్చవలసి ఉంటుంది. గ్రామ విషయాన్ని చేర్చేవారు సంబంధిత మూలాన్ని చేర్చితే మిగిలినవారు అది ఉందా? లేదా? అని వెతుకుకొనే అవకాశం ఉండదు. దయచేసి ఆ గ్రామం ఉన్నది అంటే సరియైన మూలాన్ని చేర్చండి. మూసను ఉంచినపుడు ఆ వ్యాసం "నిర్ధారించవలసిన గ్రామ వ్యాసాలు" వర్గంలోనిని చేరుతుంది. తరువాత ఆ వ్యాసం యొక్క ఉనికిని పరీక్షించి ఉంటే మూసను తొలగించడం జరుగుతుంది. మీరే సరియైన మూలాన్ని చేర్చితే ఆ సమస్య ఉండదు. వికీపీడియాలో పనిచేసినవారికి నిరుత్సాహపరచడం ఉండదు. దోషాలు కనిపించినపుడు తెలిసినవారు సరిచేస్తారు. ఆధారాలు ప్రస్తుతం లభించనపుడు ఎక్కడి నుండి ఆ వాక్యాలు చేర్చారో తెలియనప్పుడు {{మూలాలు సమీక్షించండి}} మూసను చేరుస్తున్నాము. అదే మీరు ఒక పుస్తకం నుంచో, వెబ్‌సైటు నుంచో ఆ వ్యాసం చేర్చి ఉంటారు కదా, అదే మూలాన్ని మీరే చేరిస్తే బాగుంటుంది కదా. అందుకే మీరు చేర్చిన వాక్యాలకు మీరే మూలాలను చేర్చితే మిగిలిన వారికి ఆయా వాక్యాలను వెదికి మూలాలు చేర్చడానికి సమయాన్ని ఆదా చేసినవారవుతారు. పంజాబ్ ఎడిటధాన్ లో భాగంగా పంజాబ్ వ్యాసాలను తయారుచేసినపుడు కొన్ని దోషాలు ఉండవచ్చు. వాటిని సరిదిద్దుతున్నాం కదా. AWB వాడినపుడు వేగంగా అనేక వ్యాసాలను శుద్ధి చేయవచ్చును. అది అవసరమే. మానవీయంగా చేస్తే ఎన్ని రోజులు ఆ మార్పులు చేయగలరు? మనకు వికీలో నాణ్యమైన వ్యాసాలు, శుద్ధి చేయబడిన వ్యాసాలు ముఖ్యం కానీ వ్యక్తిగత దిద్దుబాట్లు ముఖ్యం కాదని గమనించాలి. శుద్ధి చేయబడినప్పుడు మార్పులు ఎక్కువవుతాయి. ఆయా వాడుకరులు మార్పులు పెంచుకోవడం కోసం దిద్దుబాట్లు చేయడం లేదని గమనించాలి. అందరూ వికీపీడియా అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నారని దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కువ మార్పులు చేసినవారికి ఏమైనా సన్మానాలు చేస్తున్నారా? ప్రత్యేక గుర్తింపు నిస్తున్నారా? వికీపిడియాలో నాణ్యమైన మంచి వ్యాసాలు వ్రాసేవారికే గుర్తింపు ఉంటుంది. కనుక త్వరగా శుద్ధి కార్యక్రమాలను చేయడానికే AWB వాడుతున్నారు కానీ వ్యక్తిగత మార్పులు పెంచుకోవడానికి కాదని గమనించాలి. వికీలోనికి చేరే వ్యక్తులు స్వచ్చందంగా పనిచేయడానికే ముందుకు వస్తారు. ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించి కాదు. వ్యాసంలో ఎక్కడా వాడుకరి పేరు ఉండదు. ఎవరైనా వికీగూర్చి తెలిసిన వ్యక్తులే చరిత్రలోనికి వెళ్ళి ఎవరు ఎన్ని బైట్లను చేర్చారో పరిశీలిస్తారు. కానీ నాకు తెలిసి చాలామంది సమాచారం మాత్రమే గ్రహిస్తారు. సమాచారం తీసుకున్న వ్యక్తులు అది ఎవరుచేర్చారో గూడా గుర్తించరు. మనం స్వచ్చంద సేవకులం కనుక దిద్దుబాట్లు గురించి ఆలోచించాల్సిన పనేలేదు. ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 00:16, 19 ఆగష్టు 2016 (UTC)

Nrgullapalli గారు వికీలో నేను అనామక వాడుకరిగా కాక- సభ్యనామంతో మార్పుచేయడం మొదలెట్టినది 2007 నుండి. సుమారు 9 సంవత్సరాలలో ఇటీవల AWB చేసిన మార్పులు 3000 మినహాయిస్తే నేను చేసిన మార్పులు మొత్తం 10.000 సుమారు మాత్రమే. వికీలో ఇన్ని సంవత్సరాలలో ఇన్ని తక్కువ మార్పుల సంఖ్య నాదే ఉంటుంది బహుశా.(మీ మార్పులతో కంపేర్ చేసుకోండి) నాకు మార్పుల సంఖ్య అవసరం లేదు. నేనెప్పుడూ వాటిని గురించి పట్టించుకోలేదు. వ్యాసం మొత్తం ఒకే మార్పుతో చేసినవీ ఉన్నాయి, వంద మార్పులు చేసినవీ ఉన్నాయి. ఇటీవల కొందరు సభ్యులు ఇష్టమొచ్చినట్టుగా రాస్తున్నారు. గుత్తేధారులు, గ్రూపులు అంటూ- ఏవో అందలాలు ఎక్కిస్తారనో, మెడల్స్ ఇస్తారనో ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని గంటలు సొంత నెట్ వాడుతూ కష్టపడవలసిన అవసరం లేదు. అలా అనుకొంటే ఇప్పటికి కొన్ని లక్షల మార్పులు నావే అయి ఉండేవి. ఇక్కడ ఎవరైనా ఒకటే. గ్రూపులుగా గుత్తేదారులుగా ఏదో చేయడానికి ఇది మన చేతిలో ఉన్న వ్యవస్థ కాదు. ఇక్కడ ఎవరు ఏది రాసినా పరోపకారం కోసమే...--Viswanadh (చర్చ) 07:16, 19 ఆగష్టు 2016 (UTC)

విశ్వనాద్ గారూ---

అనవసరంగా మీరునన్ను ఎందుకు కెలుకుతున్నాతో అర్ధం కావటంలేదు. నేను మిమ్మలి ఏమీఅడగలేదే! సీనియర్ సభ్యులు/పెద్దలయెడల అగౌరవంగా హేలణగా వ్యంగ్యంగా మాట్లాడడము మీకు వికీపీడియాలోను బైటకూడ అలావుటువున్నదని గమనించాను. తాజావుదాహరణగా మీరు "మాకథాన్ రోడ్దు" అన్నదానికి మీరిచ్చిన సమాధానమే ఉదాహరణ. దానికే మిగతాగౌరవ సభ్యులు కూడా సమాధానం ఇచ్చారు. వారిసమాధానము ఎంతహుందాగావుందో మీసమాధానము ఎంత వ్యూంగ్యంగా వున్నదో గమనించగలరు. అందుకేఅన్నారు అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను-- అని పెద్దలన్నారు. మరొక్కమాట--మీరేసొంత నెట్టు సొంత సమయము వాడుతున్నట్టు చెప్పారు. అంటే? మిగతావాడుకరులు పక్కింటివారి నెట్టు వాడు;తున్నట్టా? ఎందుకీవ్యంగ్య ధోరణి మాటలు. మీ ఎడిట్లు వందల్లోవున్నా, లక్షల్లో వున్నా నాకనవసరం. నాకెందుకు చెపుతునారీసంగతి. నాఎడిట్లు ఎన్ని వున్నాయో చూసుకొనే సాంకేతిక పరిజ్ఞానం నాకు లేదు. నేనెప్పుడూచూసుకోలేదు. సీనియర్ సభ్యులను/పెద్దలను మీవ్యంగ్యధోరణి మాటలతో వెంటాడి వేటాడి వారిని మనోవ్యధకు గురిచేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి ధోరణి వికిపీడియాకు చీడపురుగు లాంటిది. ఈవ్యంగ్యధోరణి ఇకనైనామానుకుంటే వికీపీడియాలో మాపనులు మేముచేసుకుంటాము. అనవసరంగా నన్ను కెలికారు గనుక నాసమయం వృధాచేసుకుని ఇదంతా చెప్పవలసి వచ్చినది. మీరు నిర్వాహకుడు గనుక నిర్వాహకత్వం నిలుపుకోవడానికి ఏదోఒకటి కెలకాలి గనుక వూరుకున్నవారిని కెలుతున్నట్లున్నది. ఇకపైనైనా మీరు నాజోలికి రాకుంటే సంతోషిస్తాను. వూరుకున్నవారిని కూడ కెలికి రచ్చబండలొకి లాగి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నట్టున్నది. మీసమాధానం నాకేమీఅవుసరం లేదు. --Nrgullapalli (చర్చ) 04:42, 20 ఆగష్టు 2016 (UTC)

చాల బాగా చెప్పారండీ గుళ్ళపల్లి గారూ...... భాస్కరనాయుడు (చర్చ) 11:34, 20 ఆగష్టు 2016 (UTC)


AWB ప్రస్తుతం వాడుతున్నది నేనే. దానిపై మార్పుల సంఖ్య పెంచుకోదానికి అని కెలికింది మీరే. మీరు నా గురించి చాలా గమనించారు. అందుకే వికీధాన్‌లో అందరు సభ్యులు కృషి చేస్తున్నపుడు మీరొక్కరే ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. మిమ్మల్ని ఎవరూ కించపరచనక్కరలేదు. అగౌరవంగా మాట్లాడనక్కరలేదు. మీకు అల్పుడిగా కనిపించే నేను. పంజాబ్ వెళుతున్నపుడు సిమ్లా వెల్ళినపుడు తిరుగు ప్రయాణంలోనూ అనేక ఫోన్లు చేస్తూ మీకు సహాయపడవలసి వచ్చినదని మరచిపోవద్దు. నేను ఎవరితోనైనా మంచిగానే ఉంటాను. మీరు కెలికితేనే నేను జవాబు ఇచ్చాను. వ్యక్తిగత కక్షలను ఇక్కడ దయచెసి ప్రదర్శించకండి..వయసు పెద్దదో చిన్నదో అనేవి మీకనవసరం. నిర్వహకులు ఎప్పుడూ ఏదో ఒకటి గెలుకుతూ ఉంటారనుకొనే మీకు ఏం చెప్పాలో తెలియడం లేదు..--Viswanadh (చర్చ) 10:18, 20 ఆగష్టు 2016 (UTC)
Viswanadh గారూ AWB వాడుతున్నది చాలామంది వేలసం ఖ్యలో చేస్తున్నారు ప్రతిరోజు. వికీధాన్ లో ఏమిటి ఎప్పుడు ఏమిచేస్తున్నానో అందరికీ తెలుసు దానిని మీరు చెప్పవలసిన అవుసరంలేదు. ప్రయాణంలో మీరుచేసిన సహాయం తోటి వికీపీడియన్లు గమనిస్తూనేవున్నారు. కాదని ఎవరన్నా అంటేనేకదా మీరు మీపనిని సమర్ధించుకోవలసిన అవుసరం. వయసు చిన్నాపెద్దా అనే మాట ఎవరన్నారు? మీరు నిర్వహకులనేవిషయం ఇప్పుడు మీరుచెప్పేవరకు నాకుతెలియదు. ఇది అసందర్భప్రస్థావన.

--Nrgullapalli (చర్చ) 08:11, 27 ఆగష్టు 2016 (UTC)--Nrgullapalli|చర్చ]]


విశ్వనాథ్ గారు చెప్పిన దాంట్లో తప్పేమి లేదు. అనవసరంగా నిర్వాహకత్వాన్ని అపహాస్యం పాలు చేయడం సమంజసం కాదు. అసలే నిర్వహణ అస్థవ్యస్థమైపోతోందని నేను సంవత్సరాల క్రితం నుంచి చెబుతున్నాను. ఈ మాత్రం నిర్వహణ కూడా లేకుంటే తెవికీ మొత్తం కుప్పకూలుతుంది, అదే సమయంలో సంవత్సరాల నుంచి సమాచారం చేరుస్తున్న విలువైన సభ్యుల కృషి బూడిదలో పోసిన పన్నీరవుతుంది (గణాంకాలపై దృష్టిపెట్టే సభ్యులకు మాత్రం ఏమీ కాదనుకోండి!). సభ్యుల నుంచి ఘాటైన ప్రతిస్పందనలు రాబట్టే నిర్వహణకు ఎవరూ ముందుకు రాకుండా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఇటీవలే రచ్చబండ చర్చలలో నమోదైంది. కుప్పలుగా తప్పులపై తప్పులు జరుగుతున్ననూ నిర్వాహకులు చూసికూడా చెప్పలేని పరిస్థితి రావడం ఆలోచించాల్సిన విషయమే. తెవికీ అనేది సమిష్టిగా అందరూ కలిసి కృషిచేస్తూ ముందుకు నడపాల్సిన వ్యవస్థ కాబట్టి ఎవరికివారు తమ ఇష్టమున్నట్లుగా చేయడం కాకుండా తోటిసభ్యుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం తప్పనిసరి. మా ఇష్టమున్నట్లు దిద్దుబాట్లు చేసుకుంటామనీ, బాటులు- AWBలు (దీనికి కొన్ని పరిమితులుండాలి) వద్దనీ, మాకు ఎవరూ అడ్డుచెప్పరాదనీ, మేము చేసేవాటిలో జోక్యం చేసుకోరాదనీ చెప్పే అధికారం ఎవరికీ లేదు. ఇక్కడ సభ్యులకు దిద్దుబాట్లు చేయడానికి ఎంత హక్కు ఉందో ఇతర సభ్యుల దిద్దుబాట్లపై పరిశీలన చేయడం, వ్యాఖ్యానించడం, విశ్లేషించడం తదితర వాటికి కూడా అంతే హక్కు ఉందని గమనించడం ముఖ్యం. తెవికీ మెరుగుపడాలంటే ఇది అత్యావశక్యం. సూచనలు ఇస్తే నీతులు చెబుతున్నారనీ, పని చేయనివ్వడం లేదనీ రకరకాలుగా అభిప్రాయాలు కొందరి సభ్యుల నుంచి వస్తున్నాయి. ఒకే రకమైన దిద్దుబాట్లు అధికసంఖ్యలో చేయాలంటే మానవీయంగా కాకుండా యాంత్రికంగా చేయడం తప్పనిసరి. AWB వాడేవారు కూడా సభ్యుల సమ్మతితోనే చేయాలనే ప్రతిపాదన రావడం హర్షణీయం సి. చంద్ర కాంత రావు- చర్చ 18:15, 21 ఆగష్టు 2016 (UTC)

పంచాయతీ లేని గ్రామాలపేర్లు

[మార్చు]
JVRKPRASAD గారు మీస్పందనకు ధన్యవాదములు. పంచాయతీ లేని గ్రామాలపేర్లు Census of India, One fine nine. com లో వుండవు.--Nrgullapalli (చర్చ) 03:08, 20 ఆగష్టు 2016 (UTC)

Nrgullapalli గారు, పైన మీరు ఉదహరించిన దాని గురించి మీకు తెలియజెప్పాలంటే ఎంతో ఉంది. మీరు పెద్దవారు, మీకు ఎలా చెబితే సదభిప్రాయముతో అర్థం చేసుకుంటారో అనే శంక నా ఈ అర్భకుడికి ఉంది. ఆ తదుపరి మీరు వ్యక్తిగతంగా తీసుకుంటే అందరికీ మానసిక బాధ మిగులుతుంది. మీకు తెలుసుకోవాలనే తపన, తాపత్రయం ఏమైనా ఉంటే తెలియజేస్తాను. మీ పద్ధతిలో మీరు పని చేసుకుంటానంటే అది సంపూర్ణ ఇష్టము. ప్రస్తుతము మీరు పైన సూచించిన సైటు, గ్రామములు గురించి తెలియజేసినది ఏమిటో మరికొంత వివరించ గలరు. మీ అభిప్రాయము, ప్రశ్నలు సుమనసుతో అడగండి, తెలియజేస్తాను. --JVRKPRASAD (చర్చ) 03:27, 20 ఆగష్టు 2016 (UTC)

- JVRKPRASAD గారు మీస్పందనకు అభివందనములు. మీభాషా పరిజ్ఞానము విషయపరిజ్ఞానము అన్నిటికీ మించి తె.వి.కీ లో వ్యాసాలు వ్రాసే ఓపిక మీకుచాల ఎక్కువని గమనించాను. మనలాంటివారికి పూర్తిస్థాయిలో తె.వి.కీ పనిచేస్తున్నందున మన ఎడిట్లు సంఖ్య పెరిపోతున్నది. తె.వి.కీ లో కొందరికి కష్టంగా అనిపిస్తున్నట్టున్నది. అందుకే మనపై దాడి చేస్తున్నారు. ఇది కూడా మీరు గమనించండి. నాఅవుసరానికి మిమ్మల్ని తప్పకుండా సంప్రదిస్థాను దయచేసి సహకరించండి.

--Nrgullapalli (చర్చ) 05:09, 20 ఆగష్టు 2016 (UTC)

  • అర్థవంతంగా జరుగుతున్న ఈ చర్చ గ్రామ వ్యాసాలకు ప్రత్యక్షంగా ప్రయోజనకరమని తెలుస్తూంది. ఈ అంశంలో నేను ఓ చిరు మాదిరి సమీక్ష (sample review) చేసివున్నాను. దాన్ని ఆధారం చేసుకుని చిన్న మనవి. గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగానూ, పంచాయితీ గ్రామాలుగానూ మౌలికంగా విభజించుకుంటే - 2006లో బాట్ ద్వారా ప్రధానంగా తయారైనవి పంచాయితీ గ్రామాలు. ఈ పంచాయితీ గ్రామాలు రెవెన్యూ గ్రామాలకు దాదాపుగా రెట్టింపు సంఖ్యలో ఉంటాయి. ప్రస్తుతం సెన్సెస్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోని ఈ పీడీఎఫ్ దస్త్రంలో దొరుకుతున్నవన్నీ రెవెన్యూ గ్రామాలే. కనుకనే ఈ సమస్య వస్తోంది. ఈ నేపథ్యంలో పంచాయితీ గ్రామాలకు సంబంధించిన మూలాలు, జాబితాలు ఎక్కడ దొరుకుతాయన్న అంశంపై మేం పరిశీలిస్తున్నాం. మాకు వివరాలు దొరికగానే సముదాయ సభ్యులతో పంచుకుంటాము. చక్కని, చిక్కని చర్చ చేసిన సభ్యులకు అభినందనలతో --పవన్ సంతోష్ (చర్చ) 05:14, 20 ఆగష్టు 2016 (UTC)
Nrgullapalli గారికి ముందుగా ప్రణామములు. మీ పెద్దరిక గౌరవ, మర్యాదలకు ఏనాడూ భంగం కలగనీయకుండా, మీ మనసుకు ఏ మాత్రం కనీసం ఈషణ్మాత్రమైన కష్టం కలుగకుండా, నా నుండి మీకు (మరియు ఇతర సహ వికీపీడియనులుతో సహా వారికి) ఎటువంటి పరుష పదజాలంతో మీ మనసు(లు)కు బాధ కలుగనీయకుండా, మీకు నచ్చిన విధముగా నడుచుకుంటానని, మీ మనసుకు ప్రశాంత చేకూర్చే సదుద్దేశ్య సద్భావనతో ప్రశ్నలు, జవాబులు ఇరుపక్షాలు నుండి పొందగలమని, ఇదే స్ఫూర్తి కొనసాగించగలగని హామీగా ఈ సందర్భముగా నా ఆన అని ఎంతెంతో సహకార సంతసముతో మీకు తెలియజేయుచున్నాను. మనమే పెద్ద మనసు చేసుకుందాం. దయచేసి గ్రహించగలరు మరియు మీకు మరోమారు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 06:04, 20 ఆగష్టు 2016 (UTC)
పవన్ సంతోష్ గారికి , మీ స్పందనలను చూశాను, విషయము గ్రహించాను. ఈ సందర్భముగా మీకు ధన్యవాదములు. --JVRKPRASAD (చర్చ) 06:06, 20 ఆగష్టు 2016 (UTC)
పవన్ సంతోష్ గారూ, 2006లో బాటుద్వారా చేర్చినవి పంచాయతీ గ్రామాలు కావండి, అవి రెవెన్యూ గ్రామాలు. సెన్సెస్ ఆఫ్ ఇండియాలో ఉండేవి కూడా రెవెన్యూ గ్రామాలే. గ్రామాలనేవి చాలా రకాలుగా ఉంటాయి - రెవెన్యూ గ్రామాలు, పంచాయతీలు, శివారు గ్రామాలు, అనుబంధ గ్రామాలు, తండాలు ... ఇలా. కాని అధికారికంగా మనకు సమాచారం లభ్యమయ్యేది రెవెన్యూ గ్రామలగురించే. (రెవెన్యూ గ్రామాలన్నీ పంచాయతీలు కావు, రెవెన్యూ గ్రామాలు కాకుండా కూడా పంచాయతీలు ఉండవచ్చు, రెవెన్యూ గ్రామాలు కొన్ని నిర్జన గ్రామాలు కావచ్చు కూడా). రెవెన్యూ గ్రామాలు కానివాటికి సమాచారం లభ్యమైతే తప్ప ఏక వాక్యాలతో ప్రత్యేక పేజీ సృష్టించే అవసరం లేదు. ఇలాంటి గ్రామాలను సంబంధిత రెవెన్యూ గ్రామాలలో చేర్చితే సరి. రెవెన్యూ గ్రామాలన్నీ తెవికీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ సృష్టించాల్సిన అవసరం లేదు, కాకుంటే కొద్దిపాటి పేరుమార్పులతో ఉన్న ఆ గ్రామాలను శోధించి పట్టుకోవాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:25, 21 ఆగష్టు 2016 (UTC)
చంద్రకాంత రావు గారూ ఈ విషయంపై ఓ చిరు పరిశీలన ఇక్కడ చేశాను. గమనించండి. నా పరిశీలనలో లోటుపాట్లు ఏమైనా ఉంటే సూచించండి. ఆపైన మరింతగా చర్చించవచ్చని భావిస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 04:06, 22 ఆగష్టు 2016 (UTC)
పవన్ గారూ, మీ పరిశీలన బాగుంది. వాస్తవానికి వికీలో అన్ని రెవెన్యూ గ్రామాల పేజీలున్నాయి. కాకుంటే గ్రామాల పేర్లు కల్గిన మండలాల మూసలు చేసే సమయానికి ముందే ఈనాడు దినపత్రికలో తెవికీ గురించిన వచ్చిన కవర్‌పేజీ వ్యాసం వల్ల వేలాదిమంది ఉప్పెనలా వచ్చి గ్రామవ్యాసాల పేర్లలో చాలామార్పులు చేశారు. దానివల్ల మండలవ్యాసంలో ఉన్న గ్రామాల లింకులు ఎర్రలింకులో మారడం, ఆ వ్యాసాలు లేవనీ మళ్ళీ కొందరు సృష్టించడం ఇలా జరగడం వల్ల ఒకే గ్రామానికి చెందిన వ్యాసాలు కొద్ది పేరుమార్పులతో మళ్ళీమళ్ళీ సృష్టించబడ్డాయి. ఇటీవలి కాలంలో కూడా కొందరు సభ్యులు ఇప్పటికే కొద్దిపేరుమార్పులతో ఉన్న గ్రామవ్యాసాలను సృష్టించడం, నిర్వహణలో భాగంగా నిర్వాహకులు తొలిగించడం జరుగుతోంది. దీనివల్ల సభ్యుల అనవసర కృషివల్ల నిర్వహణపై భారం పెరిగిపోతోంది. అసలు అన్ని రెవెన్యూ గ్రామాలు తెవికీలో ఉన్నాయి, రెవెన్యూయేతర గ్రామాల సమాచారం కొన్నిపేరాల సమాచారమైనా (మూలాలతో సహా) లభ్యమైతే తప్ప చేర్చేఅవసరం లేదు. కాబట్టి కొత్తగా గ్రామవ్యాసాలు సృష్టించే అవసరం ఉండరాదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:04, 23 ఆగష్టు 2016 (UTC)
  • వాస్తవానికి వికీలో అన్ని రెవెన్యూ గ్రామాల పేజీలున్నాయి. నా అవగాహన ప్రకారం ఇది సరైనదే. కొత్త గ్రామ వ్యాసాల సంగతి ఎలా వున్నా, పదేళ్ళ క్రితం తయారైవున్న గ్రామపంచాయితీ కల గ్రామ వ్యాసాలు కూడా ఈ వివాదంలో ఉండడంతో నేను ఆ ప్రయత్నం చేశాను. ప్రస్తుతం జిల్లా పంచాయితీ అధికారికి అర్జీ పెట్టి జిల్లాలోని అన్ని మండలాల్లోని పంచాయితీ గ్రామాల జాబితా సంపాదించవచ్చని తెలిసింది. ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి జిల్లా జాబితా అయితే వచ్చేసే వీలుంది. దీన్ని ఆధారం చేసుకుని మూసల్లో మార్పులు చేస్తే కొంత స్పష్టత వస్తుందంటారా? లేక ఆ ప్రయత్నం పెద్దగా ఫలితమివ్వదంటారా? --పవన్ సంతోష్ (చర్చ) 01:50, 24 ఆగష్టు 2016 (UTC)
మీరన్నట్టు మూసలలో మార్పులు చేయడం అవసరమే. మూసలో 3 విభాగాలు పెట్టి రెవెన్యూ గ్రామాలు, పంచాయతీ గ్రామాలు, శివారు లేదా అనుబంధగ్రామాలు (తండాలు కూడా) ఉంచితే బాగుంటుంది. ఉదా:కు నా పాలమూరు విజ్ఞానసర్వస్వం బ్లాగులో ఏ మండల విభాగమైనా చూడండి. రెవెన్యూ గ్రామాలు, రెవెన్యూ గ్రామాలు కాని పంచాయతీలను వేరుచేశాను. అనుబంధగ్రామాలకు సంబంధించి సమాచారం లభిస్తేనే ప్రారంభించడం బాగుంటుంది. మీరు పంచాయతీ గ్రామాల జాబితాకై జిల్లా పంచాయతీ అధికారికి సంప్రదించే బదులు అంతర్జాలంలోనే రాష్ట్రఆడిటు శాఖ వెబ్‌సైట్‌లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) లభిస్తుంది. ఇవన్నీ ఆయా జిల్లాల పంచాయతీ అధికారుల నుంచే సంగ్రహించబడింది. మూసల్లో మార్పులు చేయడం స్పష్టత రావడం ఖచ్చితం కాని ఎంత ఫలితం ఇస్తుందో మాత్రం చెప్పలేము. ఎందుకంటే రెవెన్యూ గ్రామాలు కాని పంచాయతీలకు సంబంధించిన సమాచారం లభించడం అరుదే. ఈ విషయంలో మీరు జిల్లా పంచాయతీ అధికారిని సంప్రదిస్తే ఫలితం ఉండవచ్చు. ఒక్కో పంచాయతీకి సంబంధించిన పూర్తివివరాల 4 పేజీల ఫారం ప్రతియేటా డిపీవోకు సమర్పించబడుతుంది. ఇందులో పంచాయతీలకు సంబంధించిన పూర్తివివరాలు అనగా పంచాయతీలోని రోడ్ల పొడవు, డ్రైనేజీ కాల్వల పొడవు, బోర్‌వెల్స్, స్తంభాలు, వీధిదీపాలు, ఇండ్ల సంఖ్య, పంచాయతీ ఆదాయ-ఖర్చు వివరాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ భవనాలు, దుకాణాల వివరాలు తదితరాలు ఉంటాయి. వివరాలు లభ్యంకానప్పుడు మాత్రం ఏకవాక్యాలతో పేజీలను సృష్టించకపోవడమే మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:32, 24 ఆగష్టు 2016 (UTC)
చంద్రకాంతరావు గారూ మీరు ఇచ్చిన వివరణ చాలా ప్రయోజనకరంగా ఉంది. నాకు అనిపించేదేంటంటే మీరన్నట్టుగా డీపీవో నుంచి పూర్తి వివరాలు లభించేవరకూ మూసల్లో మార్పులు చేస్తే స్పష్టతతో పాటు ఏకవాక్య వ్యాసాలు కూడా వచ్చేట్టున్నాయి. కనుక మొమ్మొదట వివరాలు సేకరించి, ఏయే జిల్లాలకు సమాచారం లభిస్తే ఆయా జిల్లాలకే మూసల్లో మార్పులు చేపట్టడం ఉత్తమం అనిపిస్తోంది. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 16:48, 25 ఆగష్టు 2016 (UTC)
అలాగే చేయండి. ముందు సమాచార సేకరణ చేసి మూసల్లో మార్పులు చేస్తూ వ్యాసాలు సృష్టించండి. రెవెన్యూ గ్రామాలను, పంచాయతీలను వేరుచేయడం చాలా ఉపయోగకరమైనది. ఈ విషయంలో అవసరమైతే నా వంతు సహకారం అందించగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:33, 27 ఆగష్టు 2016 (UTC)

క్రొత్త వ్యాసాల సృష్టి

[మార్చు]

వికీలో కొత్త వ్యాసం వ్రాయాలంటే యిదివరకు ఆ వ్యాసం ఉన్నదో లేదో పరిశీలించి ఒకవేళ లేకపోతే సరైన మూలాలు దొరికితే వ్రాయాలి. కానీ యిదివరకు ఉన్న వ్యాసాలను అక్షర భేదాలతో సృష్టించడం సరికాదు. ఎన్నని నిర్వాహకులు పరిశీలించగలరు. దయచేసి వ్యాసం ఉన్నదో లేదో పరిశీలించి వ్యాసాన్ని సృష్టించండి. ఉదాహరణకు పన్నూరు (విజయపురం) అనే వ్యాసం ఉండగా పన్నూరు (THELLAGUNTA) వ్యాసం సృష్టించారు. నర్సాపూర్ (మంగపేట్) అనే వ్యాసం ఉండగా Bore నర్సాపూర్ (మంగపేట్) వ్యాసం సృష్టించారు. కోటబొమ్మాళి ఉండగా కోటబొమ్మాలి సృష్టి. ఇంకా యిలాంటివి ఎన్ని ఉన్నాయో! దయచేసి పరిశీలించగలరు. చాలా గ్రామ వ్యాసాలకు ఏ విధమైన మూలం లేకుండా వ్రాస్తున్నారు. సరియైన మూలం ఉంటేనే వ్యాసం ప్రారంభించండి. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 04:10, 21 ఆగష్టు 2016 (UTC)

వ్యాసాలలో "లేవు" వాక్యాలు

[మార్చు]

కొన్ని వ్యాసాలలో "లేవు" అనే విభాగాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు పంజు కలల్ వ్యాసంలోని తాగునీటి విభాగంలో శుద్ధిచేసిన కుళాయి నీరుగ్రామంలో లేదు శుద్ధి చేయని కుళాయి నీరుగ్రామంలో లేదు మూత వేసిన బావుల నీరుగ్రామంలో లేదు మూత వేయని బావులు నీరుగ్రామంలో లేదు చేతిపంపుల నీరుగ్రామంలో ఉంది గొట్టపు బావులు / బోరు బావుల నీరుగ్రామంలో లేదు ప్రవాహం నీరుగ్రామంలో లేదు నది / కాలువ నీరుగ్రామంలో లేదు చెరువు/కొలను/సరస్సు నీరుగ్రామంలో లేదు అనే వాక్యాలు ఉన్నాయి. తాగునీటి కోసం ఏ వసతీ లేనప్పుడు అక్కడి ప్రజలు ఏవిధంగా నివసిస్తున్నారు? అయినా ఈ లేవు విభాగాలు ఎందుకు? ఈ విభాగాలతో వ్యాస పరిమాణం పెరిగిపోయింది. యిలా లేవు అనే విభాగాలతో గ్రామవ్యాసాలను అభివృద్ధిచేస్తే త్వరగా మొలక స్థాయి దాటుతాయేమో! దయచేసి వ్యాసంలో ఉన్న సౌకర్యాలు, ప్రముఖులు, పాఠశాలలు, జనాభా, భౌగోళికాంశాలు, దేవాలయాలు, గ్రామ చరిత్ర వంటి అంశాలు ఉన్నవి వ్రాయండి. లేనివి ఎందుకు? ఒక గ్రామ వ్యాసం వ్రాస్తూ విమానాశ్రయం లేదు. రైల్వేస్టేషను లేదు. బస్సు స్టాపులేదు. చెరువులు లేవు. నదులు లేవు. కాలువలు లేవు. నల్ల రేగడి భూములు లేవు. అడవులు లేవు. కొన్ని రకాల జంతువులు లేవు.....యిలా వ్రాస్తూ పోతే ఆ వ్యాసం ఎందుకు ఉపయోగపడుతుందో అర్థం చేసుకోండి. కనుక అటువంటి వ్యాసాలలో "లేవు" అనే వాక్యాలను తొలగించాలి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 06:04, 21 ఆగష్టు 2016 (UTC)

వెంకటరమణ గారూ 4 విషయలు లేవు అని రాయడానికి నాలుగు వాక్యాలు అనవసరమే కావచ్చు. మీరు ఇచ్చిన ఉదాహరణలో గ్రామంలో కుళాయి, బావులు, గొట్టపు బావులు, ప్రవాహాలు, కాలువ, చెరువు వంటి జల వనరులు లేవు అని చెప్పడం వల్ల గ్రామం ఏ స్థితిలో ఉందో తెలుస్తుంది కదా. అలానే ఏ వనరులు లేకుండా ప్రజలు ఎలా నివసిస్తున్నారు అన్న ప్రశ్న 2011 జనగణన సమాచారం ప్రామాణికతను ప్రశ్నిస్తోంది. మీరే ఇచ్చిన సమాచారం గమనిస్తే - గ్రామంలో జలవనరులు లేకుండా పోలేదు, గ్రామంలో చేతిపంపుల నీరు ఉంది. దాని ఆధారంగా జీవిస్తున్నారని గమనించవచ్చు. అలానే అమృత్ సర్ జిల్లాలోని గ్రామాల స్థితిగతులు గమనిస్తే ఇలా తెలుస్తోంది: జిల్లా మొత్తమ్మీద 15 శాతం మాత్రమే కాలువల నీరు లభిస్తోంది. మిగతా ప్రాంతమంతా గొట్టపు బావులు వేసుకుని పండించుకుంటున్నారు. ఇందుకు తోడు చెరువులు, బావులు వంటి వాటి నుంచి నీటి లభ్యత లేదు. ఈ మూలం కూడా అదే స్పష్టం చేయడం గమనించాలి. అంతేకాక లేవు అనే సమాచారం ఎందుకూ పనికిరానిదని భావించడం ఆశ్చర్యకరమే. ఒక గ్రామంలో రైల్వేస్టేషన్, విమానాశ్రయం లేదు అని రాయడం అనవసరమే కావచ్చు, కానీ బస్టాపు లేదంటే గ్రామంలో రవాణా దుస్థితి తెలుస్తోంది కదా. గ్రామానికి సురక్షిత మంచినీటి వనరులు లేకుండా జీవిస్తున్నారని ప్రభుత్వ జనగణన చెప్తోంటే ఆ గ్రామ ఆరోగ్య ముఖ చిత్రానికి అదొక అద్దం కదా. విజ్ఞులైన సభ్యులు ఒక గ్రామానికి ఏవి లేకుంటే లోటు అన్నది గుర్తించుకుంటూ ఆ లేవు అన్న వాక్యాలను అవసరమైతే ఒక వాక్యంగా మలుచుకుని, మిగతా అనవసరమైన వాక్యాలను తొలగిస్తే సరిపోతుందని నా వ్యక్తిగతమైన అంచనా. --పవన్ సంతోష్ (చర్చ) 09:23, 21 ఆగష్టు 2016 (UTC)
పి.ఎస్. అలానే గ్రామంలో ఉన్నత పాఠశాల లేకపోవడం, అది చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలో లేకపోవడం వల్ల బాలికల విద్య ఎంతగా కుంటుపడుతుందో గత పదేళ్ళ క్రితం వరకూ ప్రాథమికోన్నత పాఠశాల సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన నాకు బాగా తెలుసు. --పవన్ సంతోష్ (చర్చ) 09:27, 21 ఆగష్టు 2016 (UTC)
పంజు కలల్ వ్యాసంలో నీటి సౌకర్యం విభాగంలో "చేతి పంపులు ఉన్నాయి" అనే ఒక్క వాక్యం మాత్రమే సరిపోతుందని నా అభిప్రాయం. మిగిలినవి తొలగించాలి. జనగణన చేసినప్పుడు ప్రతీ ఇంటికి వెళ్ళి అనేక అంశాలను అడిగి నమోదు చేస్తారు. ఆయా విషయాలను పట్టికలో నమోదు చేస్తారు. అంత మాత్రాన అన్ని విభాగాలను "ఉన్నవి" మరియు "లేనివి" వ్యాసంలో చేర్చాలని లేదు. ఒకవేళ నీటి సౌకర్యం లేకపోతే "గ్రామంలో తాగునీటి వసతి లేదు" అంటే సరిపోతుంది. భూములకు సంబంధించిన "0" విభాగాలను యిదివరకు తొలగించాను. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 10:13, 21 ఆగష్టు 2016 (UTC)
అవునండీ. నేనూ అదే అంటున్నాను. ఉన్నవన్నీ, లేనివన్నీ చేర్చమని కాదు. ఇంతకుమునుపే చెప్పినట్టుగా గ్రామ వ్యాసం స్థాయిలో గ్రామ స్థితిగతులను అవగాహన చేసేందుకు ఉపకరించేవాటిని చేరిస్తే చాలు. ఐతే లేవు కదా అన్న కారణంగా మొత్తంగా తీసేయడంపైనే చిన్న అభ్యంతరం వ్యక్తం చేశాను. ధన్యవాదాలతో ముగిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:25, 21 ఆగష్టు 2016 (UTC)
గ్రామ వ్యాసాలలో పవన్ సంతోష్ చెప్పినట్లు లేవు అన్న విభాగలు అన్నింటిని తొలగించ వలసిన అవసరము లేదు అని నా అభిప్రాయము కూడ. ఉదాహరణకు గ్రామములో పాఠశాల లేదు అన్న దానికి వ్రాయడమే మంచిది. ఎందుకంటే ఆ గ్రామములో పాఠశాల కూడ లేదు అనే విషయము తెలుస్తుంది. కానీ గ్రామములో ఇంజనీరింగు కళాశాల లేదు అన్నదానికి వ్రాయక పోవడమే మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయము. ఇలా ఏది వుండాలి, ఏది వుండకూడదు అని విశ్లేషించి తయారు చేసుకుంటె మన తెలుగు రాష్ట్రాల గ్రామ వ్యాసాలు వ్రాసేటప్పుడు ఈ విధానాన్ని వాడుకోవచ్చు. భాస్కరనాయుడు (చర్చ) 15:43, 29 ఆగష్టు 2016 (UTC)
పాఠశాల లేదు అనే విషయం చాలా ముఖ్యమైన అంశం. ఇది ఉండాలి. ఇంజనీరింగ్ కళాశాల లేదు అని రాయకపోయినా సమీప ఇంజనీరింగ్ కళాశాల ఇంత దూరంలో ఉంది అని రాస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన. భాస్కరనాయుడు గారూ మనం మంచి చర్చ చేస్తున్నాం. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటేనే మంచి వ్యాసాలు రాయగలం. --రవిచంద్ర (చర్చ) 15:49, 29 ఆగష్టు 2016 (UTC)
చర్చ బావుంది. ఐతే ఇక ఈ చర్చను ప్రాజెక్టు ఉపపేజీ తయారుచేసి గ్రామవ్యాసాల రూపురేఖలు ఎలా ఉండాలో అక్కడి చర్చాపేజీలో చర్చించి ముందుకువెళ్ళడం బావుంటుందని భావిస్తున్నాను. ఇప్పటికే అందుకు రచ్చబండలోనే వేరే శీర్షికతో ప్రతిపాదించాను. ఇందుకు సభ్యులు ముందుకువస్తే ఆ పేజీ సృష్టించుకుని కృషి ముందుకు తీసుకువెళ్దాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:03, 30 ఆగష్టు 2016 (UTC)
నా అభిప్రాయము ప్రకారము..... అన్నిటి కన్నా ముఖ్య విషయమేమంటే.... ఈ గ్రామ వ్యాసాలలో వాఖ్య నిర్మాణము సరిగా వుండటము లేదు. ఇదంతా గూగుల్ అనువాదము వలన వచ్చిన ఇబ్బంది అనుకుంటాను. వాటిని సరి చేయడానికి చాల సమయము పట్టుతుంది. కనుక వాటిని ముందుగానే సరిచేసుకుంటే సమయ యాపన తగ్గవచ్చు. ఉదాహరణకు ఇవి చూడండి. గ్రంధాలయము గ్రామములో లేదు. ట్రాక్టరు గ్రామములో లేదు. అన్న వాఖ్యాలు తెలుగు పద్దతిలో లేవు. తెలుగు సాంప్రదాయములో వాఖ్య నిర్మాణము కొంత వేరుగా వుంటుంది. కర్త, కర్మ, క్రియ వరుసగా ఒక పద్ధతిలో వుంటుంది. ఇందులో తేడావస్తే అర్థము మారకపోయినా వాఖ్య నిర్మాణములో అందము వుండదు. అదే వాఖ్యాలను ఇలా వ్రాయవచ్చు. ఈ గ్రామములో గ్రంధాలయము లేదు/ వున్నది. ఈ గ్రామములో ట్రాక్టరు లేదు/వున్నది. ఇలా వ్రాస్తే తెలుగు తనము తో అందంగా వుంటుంది. ఇటువంటివే మనము వ్రాసిన గ్రామ వ్యాసాలలో చాల వున్నవి. వాటిని మనం ముందుగానే గుర్తించి సరిచేస్తే.... వ్రాసిన తరువాత సరిచేయడానికి పట్టే సమయము వృథాకాకుండా నివారించ వచ్చు. ఎలా వ్రాసినా అర్థము ఒకటే కదా???? అని అనవచ్చు. నిజమే.... కాని నాకు ఈ విధానము కొంత ఎబ్బెట్టుగా అనిపిస్తున్నది. తెలుగు సరిగా మాట్లాడ లేని ఇతర భాషల వారు తెలుగు మాట్లాడినట్లుగా వున్నదని నాకనిపిస్తున్నది. ఇది నా వ్వక్తిగత అభిప్రాయము. సలహా కాదని గుర్తించంచ గలరు. భాస్కరనాయుడు (చర్చ) 00:24, 31 ఆగష్టు 2016 (UTC)
ఒక సమాచారపెట్టెలో పెట్టాల్సిన డేటాను వ్యాసంగా విస్తరిస్తున్నాం - ఒక్కో డేటా ఐటముకు అటూ ఇటూ పదాలను/వాక్యాలను చేర్చి. డేటాను డేటాగానే సమాచారపెట్టెలో పెడితే ఏం? పేజీ పరిమాణం తక్కువగా ఉంటుందని తప్పిస్తే మరో కారణమేదైనా ఉందా? ఇలాంటి మౌలికమైన ప్రశ్నను పక్కన పెడదామని భావిస్తే, కింది సూచనలను పరిశీలించండి.
  1. లేవు అని రాయనక్కరలేదు
  2. ఫలానా సౌకర్యం గ్రామానికి 10 కిమీ లోపు ఉంది అనే వాక్యం కన్నా, ఫలానా సౌకర్యం గ్రామానికి 7 కిమీ దూరంలోని మణుగూరులో ఉంది అనో, గ్రామానికి సమీపంలోని మణుగూరులో ఉంది అనో రాస్తే కొంత ఉపయోగం. అది తెలియకపోతే మానెయ్యాలి. Nearest Hospital is at Manuguru -దీన్ని ఎలా అనువదించాలో నిర్ధారించుకోవాలి. అన్ని పేజీల్లోనూ అలానే రాయాలి. అది కూడా కొన్ని సౌకర్యాల వరకూ పరిమితం చెయ్యాలి.
  3. ఇదోసారి చూడండి __చదువరి (చర్చరచనలు) 03:08, 31 ఆగష్టు 2016 (UTC)
వ్యాసంలోని సమాచారపెట్టె ఉన్నది వ్యాసంలో చెప్పిన విషయాన్నే పైపైన చూసినా అర్థమయ్యే వీలుగా అందించడానికి కదా. వ్యాసంలో ఇప్పటికే ఎక్కడైనా ఉపయోగించిన సమాచారాన్ని సమాచారపెట్టెలో మొత్తం వ్యాసం చదవనక్కర లేకుండా తేలికగా తెలుసుకునేందుకు ఉపయోగించడమే సరి అని భావిస్తున్నాను. ఈ విషయం మీద ఇక్కడ ఉన్న సహాయ పేజీ మనకు కొంతమేరకైనా ఉపయోగపడవచ్చు. (ఆంగ్ల పేజీ ఇచ్చినందుకు క్షమించాలి) ఐతే వ్యాసంలోనే ఎక్కడైనా బాక్స్ కట్టి రాయడం బావుంటుందేమో చూడాలి. ఐతే ఇది క్రమేణా అభివృద్ధి చెందుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఇక లేవు అన్నది రాయనక్కరలేదన్న అంశంపై నా వ్యక్తిగత అభిప్రాయం ఏమంటే లేవని రాస్తున్నదేమిటి అన్నది గ్రామానికి రక్షిత మంచినీటి సౌకర్యం లేదని తప్ప మిగతా చోట్లు లేవు అన్నది తీసేసి ఎక్కడ ఉందో రాసుకునే వీలు ఉంది. ఆ ఒక్కచోటే లేవు అని రాయడం సముచితం అనుకుంటాను. --పవన్ సంతోష్ (చర్చ) 06:30, 31 ఆగష్టు 2016 (UTC)
* భాస్కరనాయుడు గారూ, ఈ ఆకరాల అభివృద్ధికి గూగుల్ అనువాదాలేమీ వాడలేదండీ. ఆసక్తి కలిగిన కొందరు వికీపీడియన్లతో కలిసి వ్యాసంలో వచ్చే phrases, sentences అనువదించాము. ఐతే దీన్ని క్రమంగా మెరుగుపరుచుకోవచ్చు, ప్రస్తుతానికి మనం ఆ పాఠ్యాన్ని యధాతథంగా ఇకపై ప్రచురించరాదని, వాడుకరులు దాన్ని పైన చేస్తున్న చర్చను అనుసరించి కానీ, మరింత మెరుగైన తమ శైలిలోకి కానీ తిరగరాసుకుని నేరుగా ప్రచురించాలని కట్టుదిట్టం చేసుకోవచ్చు. అలానే ప్రచురించుకుని సరిజేసుకుంటామన్న పద్ధతి కాకుండా నేరుగా సరిజేసుకుని ప్రచురించుకుంటూ (ఒక్కో వాక్యం ప్రచురించినా ఫర్వాలేదు) వెళ్ళాలన్న మార్గదర్శకం ఉంటే మేలేమో ఆలోచించి చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 09:15, 31 ఆగష్టు 2016 (UTC)

వాడుకరుల సవరణలు లెక్కింపులో సాంకేతిక లోపం(Technical problem in counting user edits)

[మార్చు]

అందరికి నమస్కారములు! నేను enwiki(ఇంగ్లీషు వికీపీడియా) లో సవరణలు చేసినప్పుడు వ్యాసానికి చేర్చిన బైట్లు ఆధారంగా సవరణలు(edits) ను లెక్కకట్టేది అంటే ఉదాహరణకు లింకులు( [[ ]] )జత చేసినా ఆ సవరణకు లెక్క కట్టకుండా మరోక సవరణ అధిక బైట్లలో చేసినప్పుడు దాన్ని మరియు దీన్ని కలిపి లెక్కిస్తుంది.ఒక వేల అధిక బైట్లు సవరించినప్పుడు ఒక్కసారిగా అధిక సవరణలుగా(more edits) గా పరిగణిస్తుంది.కాని tewiki(తెలుగు వికీపీడియా) లో మాత్రం చిన్న చుక్క( • ) పెట్టినా లేదా సూమారు 1000 బైట్లను జతచేసినా సరే అది కేవలం ఒక సవరణ(only single edit)గా మాత్రమే పరిగణిస్తుంది.ఇలా అయితే అధిక సమాచారం చేర్చే వాడుకరుల ను గుర్తించడం కొంత వరకు కష్టం లేదా అధిక మొత్తం లో edits కోరుకునేవారు కేవలం చిన్న చిన్న సవరణలు చేస్తే సరిపోతుంది.ఈ సమస్యను పరిష్కరించగలరు. ఇట్లు మీ తోటి వాడుకరి WPMANIKHANTA' (talk) 13:00, 21 ఆగష్టు 2016 (UTC)

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ ఆగష్టు 28, 2016

[మార్చు]

అందరికి నమస్కారం...వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ ఆగష్టు 28, 2016 సమావేశం… ఆగష్టు 28, 2016 (నాలుగవ ఆదివారం) నాడు మధ్యాహ్నం 3 గం.లకు హైదరాబాద్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో ఏర్పాటు చేయబడుతుంది.

చర్చించాల్సిన అంశాలు

[మార్చు]
  • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • 12వ వార్షికోత్సవ నిర్వాహణ

సభ్యులు హాజరుకాగలరు. వివరాలకు వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ ఆగష్టు 28, 2016 సమావేశం లో చూడగలరు. --Pranayraj1985 (చర్చ) 15:43, 22 ఆగష్టు 2016 (UTC)

Why Rio Olympics 2016 Matters for India

[మార్చు]

While India struggled to win medals, ending its tally with just two medals, there had been some spectacular performances. Abhinav Bindra, Jitu Rai were only marginally short at conceiving medals, while Saina-Bopana reached till the Bronze medal match, Depika Kumari lost to the world's best. At the most, Indian Hockey contingent reached the knock-out stage after so many years.

Let us keep doing our bit, Tokoyo 2020 Olympics would definitely bring more medals to India. The India At Rio Olympics 2016 is still in progress. Let's keep building it. Thank You. --Abhinav619 (sent using MediaWiki message delivery (చర్చ) 15:57, 23 ఆగష్టు 2016 (UTC))

గ్రామ వ్యాసాల అభివృద్ధి గురించి సమావేశం

[మార్చు]

అందరికీ నమస్కారం,
తెలుగు వికీపీడియా గ్రామ వ్యాసాల అభివృద్ధి గురించి ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రాజెక్టుకు సహకరిస్తున్న పర్యావరణవేత్తల టీంకు చెందిన సుబోధ్ కులకర్ణి సెప్టెంబర్ 2వ తేదీన హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో వారితో హైదరాబాద్ గోల్డెన్ థ్రెషోల్డ్ లో ఆసక్తి కలిగిన తెలుగు వికీపీడియన్లతో సమావేశం నిర్వహించే ప్రయత్నంలో ఉన్నాం. ఈ సమావేశంలో భాగంగా జనగణన సమాచారాన్ని ఉపయోగించి విజ్ఞాన సర్వస్వ వ్యాస నిర్మాణం చేయడంలో వారి సహకారం, దాని ప్రయోజనం, తెవికీకి ఏ మేరకు ఉపయోగపడుతుందన్న అంశాలపై చర్చ ఉంటుంది, ఈ అంశాలపై జరిగిన భౌతిక చర్చను సవివరంగా తెవికీలో పెట్టి మరో దఫా చర్చించగలము. ఈ నేపథ్యంలో కార్యక్రమం హాజరుకు ఆసక్తి చూపే వికీపీడియన్లను ఆ విషయం తెలియజేయమని, సూచనలు ఉంటే అందించమని కోరుతున్నాము. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:27, 24 ఆగష్టు 2016 (UTC)

నేను హాజరవుతున్నాను ఇది ఉపయోగకరమైనసమావేశం --Nrgullapalli (చర్చ) 07
25, 27 ఆగష్టు 2016 (UTC)
మంచి కార్యక్రమం. అందరూ పాల్గొనాలని ఆశిస్తున్నాను. --Pranayraj1985 (చర్చ) 07:18, 30 ఆగష్టు 2016 (UTC)
సమావేశానికి హాజరు కాదలచిన వారు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:11, 2 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

The visual editor will be enabled on this wiki in some days

[మార్చు]

Hello again. Please excuse the English. Please help translate to your language. కృతజ్ఞతలు!

As per previous announcements earlier this year, the visual editor (విజువల్ ఎడిటరు) will be enabled at this Wikipedia in some days. It allows people to edit articles as if they were using a typical word processor. Here's a quick explanation of what is going to happen: you can find a more detailed one, with pictures, at mediawiki.org.

Side by side screenshots, showing the visual appearance of both editing systems
What's changing?
In the new system, you get a single edit tab which follows your preferences, and that therefore will launch the wikitext editor or the visual editor depending on which one you opened the last (క్రిందటిసారి వాడిన ఎడిటరును గుర్తుంచుకో).
This applies to everyone who edited recently, including anonymous users.
How do I switch to the other editor then?
Buttons on the toolbars of both editors were added months ago so that you can switch from one to the other every time you want to, without losing your changes and without having to save first.
The button, located on the right side of the toolbar, looks like square brackets ([[ ]]) in the visual editor, and like a pencil () in the wikitext editor.
Are there other options available?
Yes. You can choose whether you want:
  • వీలైతే అన్నివేళలా విజువల్ ఎడిటరునే ఇవ్వు (if you temporarily switch to the wikitext editor through the button on the toolbar, the system won't remember it; also, it only applies to namespaces where the visual editor is available).
  • ఎల్లప్పుడూ వీకీపాఠ్యం ఎడిటరునే ఇవ్వు (if you temporarily switch to the visual editor through the button on the toolbar, the system won't remember it)
  • దిద్దుబాటు ట్యాబ్‌లు రెంటినీ చూపించు (a system in place at multiple wikis since 2013. You are familiar with this option if you have been using the visual editor here.)
    • Please note: all the users will always have the opportunity to switch to the other editor via buttons on the toolbars, for occasional edits.
How do I set my preference?
  • If you want to try or to stay in the new system: you don't need to do anything.
  • If you had explicitly disabled the visual editor in the past and want to keep it disabled: you don't need to do anything.
  • All the registered users have a dropdown menu in the Editing tab of their Preferences (దిద్దుబాట్లు --> సవరణ విధం:), where they can choose from. This only needs to be done once. Don't forget to save ;)
    • Users with the visual editor disabled need to re-enable it if they're interested in accessing that menu!
  • People who use the visual editor regularly will see a pop-up (only once after the single edit tab system is introduced), and they can choose their favorite setting there. Of course, they can change their mind at any time just like the others, and pick a different setting from their Preferences.
    • Anonymous users who have used the visual editor recently will also be able to choose which editor they want to edit with.
    • Reminder: all the users will always have the opportunity to switch to the other editor via buttons on the toolbars, for occasional edits.
Final remarks
  • Please spread the word about this major change in any way that you deem appropriate for this community, by linking to this announcement elsewhere, putting up a site notice, etc. Please note it will affect all the registered users at first, and after some days it will reach logged-out contributors as well if no major technical issues have arisen. రహ్మానుద్దీన్, Rajasekhar1961 : given your experience with this language and this community, I appreciate your support in making sure everyone here is aware of this change. Don't hesitate to ask questions, I'll be around for a while to help!
  • Please do let us know about any anomalies you think you're experiencing, and do post any other feedback below. I'd like to thank everyone who works to make the transition easier for this community, and whoever will help me processing feedback in your language.
  • You can learn more about optimizing the visual editor experience here by reading a guide on mediawiki.org.

Thank you! Elitre (WMF) (చర్చ) 13:07, 24 ఆగష్టు 2016 (UTC)

కొత్త వ్యాసాల సృష్టి

[మార్చు]

తెవికీలో యిదివరకే ఉన్న వ్యాసాలను పరిశీలించకుండా తిరిగి సృష్టిస్తున్నారు. అనేక గ్రామ వ్యాసాలు అక్షరభేదాలతో ఉన్నప్పటికీ వాటిని ఏ మాత్రం పరిశీలన చేయకుండా విపరీతంగా మొలకలను సృష్టిస్తున్నారు. సృష్టించిన వారి చర్చాపేజీలలో తెలియజేసినప్పటికీ వారి ధోరణిలో మార్పులేదు. ఎన్నని పరిశీలించగలము? ఎన్నని తొలగించగలం? వారూ సృష్టించిన ప్రతీ వ్యాసాన్ని పరిశీలంచవలసి వస్తుంది. అనుభవమున్న వాడుకరులు దయచేసి గమనించాలని మనవి. ఏ మూలం లేకుండా ఏక వాక్య వ్యాసాలను సృష్టిస్తున్నారు. ఎన్ని వ్యాసాలలో "మూలాలు లేవు" అనే మూసను చేర్చుతాము చెప్పండి. మూలాలు లేనప్పుడు వ్యాసాలను ఎందుకు సృష్టించాలి? వ్యాసాల సంఖ్య పెంచుకోవడానికా? ఏ విధంగాను ఎవరికీ ఉపయోగపడని ఈ మూలాలు లేని వ్యాసాలెందుకు? వికీనియమావళి ప్రకారం వ్యాసాలను వ్రాయండి. దయచేసి ఆయా వాడుకరులు మరల ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటారని మనవి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:03, 24 ఆగష్టు 2016 (UTC)

సమిష్టిగా కృషిచేయాల్సిన వ్యవస్థలో తోటిసభ్యుల సూచనలకు ఏ మాత్రం పట్టించుకోకపోవడం, సూచనలిస్తే నీతులు చెబుతున్నారని ఎదురుచెప్పడం, చర్చలు జరుగుతున్ననూ దానికి విరుద్ధంగా ప్రవర్తించడం, తెవికీ నియమాలను ఏ మాత్రం పట్టించుకోకుండా తమనిష్టమైనట్టు చేయడం, పైగా తెవికీకి ఎనలేని కృషిచేస్తున్నట్టు ప్రవర్తించడం గతకొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న దుష్పరిణామాలే. కొందరి దిద్దుబాట్లు తెవికీకి పెద్ద గుదిబండలా మారుతున్నాయి. వారికృషి కంటే ఆ దిదుబాట్లను పరిశీలించడానికి నిర్వాహకులకు భారం అధికమైంది. ఏమిచేసిననూ తమను ఎవరూ ఏమి చేయజాలరనే ప్రవర్తనకు బంధం వేయాలంటే నిర్వాహకులు ఉదాసీనత వైఖరి వీడాల్సిన అవసరం రావాలేమో ! సి. చంద్ర కాంత రావు- చర్చ 21:00, 24 ఆగష్టు 2016 (UTC)
పనిచేస్తున్న పెద్దవయసు వారితో ఎలా ప్రవర్తించాలో తోటిసభ్యులకు తెలియక పోవడం వలన ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. సమిష్టిగా కృషిచేయాల్సిన చోట మాత్రము అయిననూ ఆ అవసరము కోసం ప్రతి ఒకరికి అదే పద్ధతి ఉండాలి అనే కఠిన నియమము వర్తించదు. ఎవరి పని వారు చేసుకుపోతున్న సందర్భాలు కోకొల్లలు. ఎవరైనా కాసేపు వచ్చి వెళ్ళేపోయే వారు, పనిచేసుకునే వారికి ఎన్నెన్నో విధాలుగా మానసిక బాధ, హింస పెట్టడం, ప్రోత్సాహం లేకపోవడం, చేసిన పనిని మెచ్చుకోక తూలనాడటం, వాడుకరి మీద ఏమాత్రం మెచ్చుకోళ్ళు లేకపోవడం, మనసుకు కష్టం కలిగే విధంగా ప్రవర్తించడం వలన కొత్త కొత్త సమస్యలు పుట్టుకు వస్తున్నాయి. ముందు పనిచేయని నిర్వాహకులను వెంటనే తొలగించాలి. కొత్తవారికి అవకాశం కల్పించాలి. కొంతవరకు ఉటంకిస్తున్న ప్రస్తుత నిర్వాహకుల మీద పనిభారం ఒత్తిడి తగ్గి, వారు మరో మంచి పనులు చేసేందుకు కొత్త నిర్వాహకులు ఆసరాగా ఉంటారు. అందరూ ఒకటే అన్న భావన కొంతమందిలో ఎక్కడా కనబడదు. మేము వ్యవస్థాపకుల సమయంలో వచ్చాము మమ్మల్ని ఎవరూ ఏమిచేయలేరని, ఎల్లకాలం ఎవరైనా మా బానిసలే అన్న భేషజాలు, అహంభావాలు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఎప్పుడూ పెద్దగా కనిపించని వారు వికీ వ్యవస్థాపకులం అంటూ, మేము చెప్పిందే వేదం, చూపిందే మార్గం, చెప్పిందే చేయాలి, చేసేదేదే ముందుగా చెప్పాలి, మేము ఏదంటే అదే శిరోధార్యం, ఇలాంటి గుదిబండల మనసున్న వారు హాజరుకోసం వచ్చి వికీనియమాలు అంటూ పనిచేసే వాళ్ళ బుర్రలు రకరకాలు వేధించడం, ఆ వేదనలకు తట్టుకోలేక కొంతకాలం మానుకోవడం, ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో వ్యధ కారణాలు వలన తోటి వాడుకరులు మెండికేయడం మరోకారణం. ఎనలేని కృషి చేసిన వ్యక్తులను కూడా అనామకులు నుండి అధికారుల వరకు బీరుపోకుండా అదేపనిగా తూలనాడటం, దూషించడం జరుగుతోంది. పాతకాపులకు చేసిన మంచిపనులు కనబడక పోవటం, వాళ్లకి తోచిన వాళ్ళని ఎంచుకొని వారిని రకరకాలు వేధింపులుకు గురిచేయడం, తప్పులు ఎక్కడ దొరుకుతాయా అని ఎదురుచూస్తూ కూర్చోవడం, జీవితకాలం పాటు ఆ వాడుకరి యొక్క పొరపాట్లను ఒక్కొక్కళ్ళుగా వచ్చి పదేపదే ఎడతెరపి లేకుండా ఏకరువు పెట్టడం వికీకి గొడ్డలిపెట్టు లాంటిది. ఇలాంటి వాళ్ళను కొత్త వారు ఎవరు ఏమీ చేయలేరనే ధోరణికి బంధం వెయ్యాలంటే కొత్తవారు ఖచ్చితంగా వికీలో వ్యక్తికి సంబంధించిన వ్యాసాలలో గౌరవం మర్యాదలు అనేవి ఒక వ్యక్తి ఇవ్వని విధంగానే, మనిషికి ఇచ్చే అనవసర మర్యాద, గౌరవాలు అనేవి ఏనాడో విడనాడాల్సిన అవసరం ఆసన్నమయ్యిందేమో, ఖచ్చితంగా అమలు పర్చాల్సిన సమయం ప్రస్తుతం ఉందేమో ? భారతదేశము ప్రజాస్వామ్య దేశం, నియంతృత్వ పోకడలు ఎక్కడా పనికిరావు.JVRKPRASAD (చర్చ) 00:14, 25 ఆగష్టు 2016 (UTC)
Pedda vayasu vikipedianlaku pratyeka rules undali.peddavaripai dadulu cheyakoodadu.vaalla pani vallani chesukonivvali--05:23, 25 ఆగష్టు 2016‎ 59.98.109.192 (చర్చ | నిరోధించు)

చర్చ ఒకటి - చర్చించేది ఇంకొకటి

[మార్చు]
  • ఈ విభాగంలో నేను తెలియజేసేది ఎన్ని మార్లు హెచ్చరించినా మూలాలు లేని వ్యాసాలు, యిదివరకు ఉన్న వ్యాసాలను అక్షరభేదాలతో సృష్టిస్తున్న వాడుకరుల గురించి. ఆయా వాడుకరులు వికీనియమాళిలి పాటించాలని తెలియజేసాను. వారి వ్యాసాల మూలంగా నిర్వాహకులకు వచే యిబ్బందులను తెలియజేసాను.
  • వికీపీడియాలో వయసుతో సంబంధం లేకుండా అందరూ నియమావళి ప్రకారం నడుచుకోవాలి. కొత్తవాడుకరి మూలాలతో వ్యాసం వ్రాస్తే, వయసు ఎక్కువ ఉన్న వాడుకరులు ఏమైనా వ్రాయవచ్చా? వారికి నియమావళి వర్తించదా?
  • ఇక్కడ చేరిన వాడుకరులు, నిర్వాహకులు నిరంతరం 24 గంటలు, జీవితకాలం పనిచేయాలనే నియమం లేదు. తమకు ఖాళీ ఉన్నప్పుడే వ్యాసాలు వ్రాయడం కానీ, దిద్దుబాట్లు చేయడం గానీ, నిర్వాహకత్వం చేయడాం కానీ చేస్తారు. ఇది వృత్తి కాదు. ప్రవృత్తి మాత్రమే. అందువల్ల ఎప్పుడో వచ్చిన వాడుకరులు నీతులు చెప్తారు అనే వాక్యానికి అర్థం లేదు.
  • వికీపీడియా విజ్ఞాన సర్వస్వం కనుక ఏ తప్పుడు వాక్యాలు సమాజానికి అందిచరాదనే దృక్పథంతో అందరూ తప్పులను పరిశీలిస్తారు కానీ ఎవరినీ తప్పుపట్టాలని కాదని గ్రహించాలి. ఒక చిన్న ఆహ్వాన పత్రిక ముద్రిస్తే అనేకసార్లు దోషాలను సరిచూసి అందులో దోషాలు లేవని తెలిసాకనే ముద్రణకు యిస్తారు. అలాంటిది అనేక మంది మేధావులు, విద్యార్థులు నిరంతరం ఇందులో సమాచారాన్ని గ్రహిస్తున్నప్పుడు దోషాలు లేకుండా చూసుకోవడం వాడుకరుల భాద్యత. ఒకవేళ వాడుకరులు వ్రాస్తే దానిని సరిచేయడం అందరి భాద్యత. సరైన సలహాలు, వికీ నియమావళి తెలియజేయడం అందరి భాద్యత. ఇక్కడ వయసుతో సంభంధంలేదు.
  • అనామక వాడుకరి "పెద్ద వయసున్న వారిని వదిపెట్టాలి" అంటారు. ఇక్కడ వయస్సుతో సంభంధం లేదు. ఎవరైనా వికీలో చేరి వారి జ్ఞానాన్ని వ్యాసాలలో ఉంచవచ్చు. కానీ అందులో చేర్చిన వాక్యాలకు సరైన మూలాలు ఉంచాలి. స్వంత అభిప్రాయాలు పనికిరావని గ్రహించాలి. రూల్స్ అందరికీ ఒక్కటే అని గ్రహించాలి. మొదట వికీ నియమావళిని తెలుసుకొని వ్యాసాలను వ్రాయాలి. ఒకవేళ నియమాలు తెలియనప్పుడు యితరులు (ఏ వయసువారైనా సరే) తెలియజేస్తే నేర్చుకోవాలి. ఇది బ్లాగు కాదు కదా. స్వంత అభిప్రాయాలు వ్రాయడానికి.
  • వారిపని వారిని చేసుకోనివ్వండి అంటున్నారు. ఇక్కడ ప్రతీ విషయానికీ నియమాలున్నాయి. వాటిని పాటించి ఎవరైనా వ్రాసుకోవచ్చును. విరుద్ధంగా ఏమైనా వ్రాసి పనిచేసుకోవడానికి లేదు.
  • చర్చలు విషయం పై జరగాలి కానీ వ్యక్తులపై కాదని గ్రహించాలి. ఎవరు చర్చలు చేసినా వికీ అభివృద్ధికేనని గ్రహించాలి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 06:06, 25 ఆగష్టు 2016 (UTC)

evadu buddimantudo vaadu vruddudu kaani yendlu meerinavaadaa vruddudu. (The man's wisdom is old, how can a man more age can be)-- ‎Nagendra405 (చర్చ | రచనలు | నిరోధించు)‎

ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఒక వాడుకరి ఇచ్చే సమాధానం ఒకో కోణంగా అర్థం అవుతుంది. దానికి ఎవరిదీ తప్పు కాదు. నిజానికి ఎవరూ ఇక్కడ ఇంతకాలం ఉండి పనిచేయాలనే నియమము లేదు, వెచ్చించాల్సిన సమయము ఎంతో వారే కేటయించుకుని, ఎవరికి నచ్చిన సమయములలో వారికి నచ్చిన పని వికీకి అనుగుణంగా పనిచేసుకోవాలి, ఎవరైనా ఎవరికయినా ఎటువంటి విషయములోనైనా, వికీ నియమాలలోబడి చర్చలు చేయవచ్చును. వ్యక్తులు చేసే పనులు మీద దోషాలు చెప్పవచ్చును, కానీ వ్యక్తుల మీద ద్వేషం ఏ రూపంలో అయినా పనికి రాదు. విద్యార్థులు పొందే సమాచారము సభ్యత సంస్కారములతో కూడినది అయి ఉండాలి. పెద్ద వయసు వారు చేసే తప్పులు ఏమైనా ఉంటే ఇతరులు పెద్ద మనసు చేసుకుని వారికి ఆసరాగా నిలబడాలి. ఆరోగ్యం సరిలేని వారు అయినా, ఏకారణాలు వల్ల మనసులో కష్టమొచ్చిన వారైనా, ఎవరైనా 60 సం. వయసు దాటిన వారిలో కొంతమందికి చిన్నపిల్లల మనస్థత్వంనకు చేరుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది వికీకి వచ్చి కాస్త మనశ్శాంతి పొందేవారు కూడా ఉంటారు. కేవలం ఇతరులు మరియు చిన్నపిల్లల నుండి మంచి మాటలు మనసు ప్రశాంతత కోరకు కోరుకుంటారు, కాబట్టి కాస్త పెద్దవారితో మర్యాద, సంస్కారములతో ప్రవర్తించాలి అని ప్రస్తావించటం జరిగింది. అంతేకాని, మరో ఉద్దేశ్యముతో కాదు. నేను మరో మాట చెప్పేది, ఎవరి పనివారిని చేసుకోనిమ్మని అనేది. దానికి కారణం ఒకటే. తను వ్రాయదలచుకున్నది, మనం వారిని వదిలేస్తే, వారి వ్యాసం పూర్తి అయ్యాక ఏమైనా ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చును అని నా భావన చెబుతున్నాను. అనామక వాడుకరుల స్పందనలకు అవసరాన్ని బట్టి స్పందించాలి. సోషల్ మీడియాలలో వలె వికీ ఆడ్మిన్ కూడా ఎక్కువమంది అనుకుంటారు. వికీలో కొత్తవారికి వికీ ఆడ్మిన్ జాబితాలో ప్రదర్శనకు లేదు. పాతవారే కొత్తవారిలా మాట్లాడేందుకే అవకాశం ఉంది. వ్యాసమే వికీ నియమాలకు విరుద్ధంగా ఉంటే ఆ వ్యాసము మొదలు నుండి తుది వరకు ఏవిధమైన నిర్ణయాలు ఎవరు తీసుకున్న అందులో అభ్యంతరం ఎవరికీ ఉండదు. నా పనిలో తప్పులుంటే చేసే పని దగ్గరే ఎవరైనా మీ స్పందనలు వ్రాయవచ్చును. నేను వికీకి అనుగుణంగా మార్చుకోవాల్సినవి ఉంటే మార్చుకుంటాను మరో చర్చ చేయను. నేను చేప్పే తెలుగు భాష పదాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా మనసుకు నాటుకుంటున్నాయి. ఇంక ముందు ముందు నా అభిప్రాయాలు వ్రాయడం వీలున్న వెంటనే మానుకుంటాను. నా పదాలు ఇచ్చే అర్థం అందుకోవడంలో వాడుకరులు చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా ఉన్నారు. నా స్పందనలు తగ్గీంచుకోవడం ఒకటే దీనికి పరిష్కార మార్గం. --JVRKPRASAD (చర్చ) 08:16, 25 ఆగష్టు 2016 (UTC)

sriramuni dhanassu guccukoni kappa mounamgaa untee kaasepatiki ramudu adigadanta kaneesam ceppaledani...daaniki kappa rama.... badha kaligithe srirama...naakee baadha vachindi dani numchi rakshinchu ani saranu koratamu kaani nee muulamugaa ayithe evariki cheppukonu adigindanta.. alaagee.. vikipedia lo .kottavaarini evaraina addukonte leda dushiste admin tho ceppukunthamu. admine dooshanalu cheste evaritho ceppukovali. be polite.09:46, 25 ఆగష్టు 2016‎ Nagendra405 (చర్చ | రచనలు | నిరోధించు)

meelaanti vaallu ikkada pani cheyali, manchiperu techukuni admin mariyu officer avvaali.09:59, 25 ఆగష్టు 2016‎ JVRKPRASAD (చర్చ | రచనలు | నిరోధించు)‎
అజ్ఞాత వాడుకరిగారూ, ఇక్కడ నిర్వాహకులందరూ వికీపీడియా:వికీ సాంప్రదాయం ప్రకారం నడుచుకుంటారు. వికీపీడియా:వ్యక్తిగత దాడులు కూడదు లో " వికీపీడియాలో ఎక్కడైనా వ్యక్తిగత దూషణలు చేయవద్దు. విషయం పై వాఖ్యానించండి, విషయం చేర్చిన వాడుకరిపై కాదు'. వ్యక్తిగత దూషణలు మీరు చెప్పదలచుకున్నదానికి సహాయపడవు. వీటివళ్ళ ఒరిగేదేమీ లేదు. ఇవి వికీపీడియా సముదాయానికి నష్టం మాత్రమే కలుగజేస్తాయి. ఇవి సభ్యులు కలిసి ఒక మంచి విజ్ఞానసర్వస్వాన్ని తయారుచేయడంలో అడ్డుపడతాయి. ఇతర వాడుకరులపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను ఏ వాడుకరి అయినా తొలగించవచ్చు. పదే పదే ఇతర వాడుకరులపై వ్యక్తిగత దూషణలకు దిగితే, వ్యక్తిగత దూషణలు చేసిన వాడుకరులు నిరోధానికి గురౌతారు." అని ఉన్నది ఈ వాక్యం అందరికీ వర్తిస్తుంది. కనుక స్వేచ్ఛగా రచనలు చేయండి. వాడుకరులు తగిన సహకారాన్నందిస్తారు. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 10:06, 25 ఆగష్టు 2016 (UTC)
తెవికీలో కొంతకాలం చీకటిలోనే జీవితకాలం గడుపుకునే విధంగా, ఎవరూ ఎటువంటి అభ్యంతరము పెట్టని పనులు చేసుకుంటే చాలా అనవసర మానసిక సమస్యల ఒత్తిడి తగ్గవచ్చునేమో ? JVRKPRASAD (చర్చ) 10:29, 25 ఆగష్టు 2016 (UTC).

Meeku chikkatilo unavalsina kharma enduku. Evadu emanna meeru lekka cheyyavalasina avasaram ledu. Wiki valla babuladi kaadu. Evadu emanukunna meeru mee paddati maarchukovaddu. Meeku nachhinattu chesuku vellandi.. Mee abhimaani

కె.వెంకటరమణ గారి వివరణ సముచితంగా,విశ్లేషనాత్మకంగా ఉన్నది.అయన స్టేట్‌మెంటును సమర్దిస్తున్నాను.13:43, 26 ఆగష్టు 2016 (UTC)
ఇక్కడ వ్యాఖ్యలు చేసిన అనామక సభ్యులు సాక్ పప్పెట్ అని నాకు అనుమానంగా ఉన్నది. అధికారులెవరైనా వచ్చి ఆ వ్యాఖ్యలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోగోరుతున్నాను. --రవిచంద్ర (చర్చ) 10:35, 29 ఆగష్టు 2016 (UTC)
స్టీవార్డుగానీ, చెక్‌యూజరు హక్కున్న వాడుకరిగానీ అది చూడగలరు. తెవికీలో ఎవరూ లేరు. వచ్చే స్టీవార్డు ఎన్నికల్లో ఒకరెవరైనా నిలబడితే బాగుంటుంది. లేదా ఇద్దరికి చెక్‌యూజర్ హక్కు ఇప్పించాలి. అందుకు సముదాయం ఇద్దరిని ఎంచుకోవాలి. __చదువరి (చర్చరచనలు) 11:07, 29 ఆగష్టు 2016 (UTC)
అవునండీ. నాక్కూడా అధికారులకు ఆ సౌలభ్యం లేదని ఇంతకుముందే తెలిసింది. --రవిచంద్ర (చర్చ) 11:23, 29 ఆగష్టు 2016 (UTC)
sock puppet యొక్క నిర్వచనము: An account made on an internet message board, by a person who already has an account, for the purpose of posting more-or-less anonymously. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:19, 29 ఆగష్టు 2016 (UTC)
మనకు స్టీవార్డులు అవసరమే. వారు తెవికీలో లేకున్ననూ ప్రస్తుతం మనం మెటా స్టీవార్డులను అభ్యర్థిస్తే సాక్ పప్పెట్ ఎవరో తెలిసే అవకాశం ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:35, 30 ఆగష్టు 2016 (UTC)

CIS-A2K Newsletter: July 2016

[మార్చు]

Hello,
CIS-A2K has published their newsletter for the months of July 2016. The edition includes details about these topics:

  • Event announcement: Tools orientation session for Telugu Wikimedians of Hyderabad
  • Programme reports of outreach, education programmes and community engagement programmes
  • Ongoing event: India at Rio Olympics 2016 edit-a-thon.
  • Program reports: Edit-a-thon to improve Kannada-language science-related Wikipedia articles, Training-the-trainer programme and MediaWiki training at Pune
  • Articles and blogs, and media coverage

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscibe this newsletter, click here. MediaWiki message delivery (చర్చ) 20:46, 24 ఆగష్టు 2016 (UTC)

AWB ఉపయోగించి గ్రామ వ్యాసాలలో మార్పు

[మార్చు]

అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు ఖమ్మం జిల్లా నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపిన 7 మండలాల గ్రామ వ్యాసాలలో జిల్లా పేరు ఖమ్మంగానే ఉంది. ఆ 7 మండలాల గ్రామ వ్యాసాలలో జిల్లా పేరు మరియు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల గ్రామ వ్యాసాలలో జిల్లా పేర్లను AWB ఉపయోగించి (సోమవారం నాడు) మార్పులు చేయాలని అనుకుంటున్నాను. ఈ విషయంపై సభ్యులు స్పందిచగలరు. --Pranayraj1985 (చర్చ) 13:43, 27 ఆగష్టు 2016 (UTC)

మార్పులు ఎప్పుడైనా మీ సౌకర్యాన్ని బట్టి చేయవచ్చుననుకుంటాను. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల గురించి మాత్రం అధికారికంగా నేను చూడలేదు కనుక నాకు తెలియదండి. JVRKPRASAD (చర్చ) 13:50, 27 ఆగష్టు 2016 (UTC)
మీ స్పందనకు ధన్యవాదాలు JVRKPRASAD గారు... తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన జిల్లాల పటాలను విడుదలచేసింది. అధికారికంగా ధృవీకరించిందో లేదో నాక్కూడా తెలియదు. AWBతో మార్పుల విషయమై సముదాయంతో చర్చించిన తరువాతే చేయాలనుకున్నాం కాబట్టి, ముందుగా ఇక్కడ రాశాను. తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాల గురించి అధికారికంగా ధృవీకరించిన తరువాతే ఆయా గ్రామ వ్యాసాలలో మార్పులు చేస్తాను.--Pranayraj1985 (చర్చ) 14:07, 27 ఆగష్టు 2016 (UTC)
ప్రణయ్ గారు, నిజానికి AWBతో మార్పుల విషయమై సముదాయంతో చర్చించే అందరూ చేస్తున్నారాండీ ! నాకు తెలియదండి. దయచేసి సమగ్రంగా సంపూర్ణ వివరం తీసుకుని, వీలయితే నిర్ణయాలు తీసుకున్న లింకులు ఇవ్వగలరు. --JVRKPRASAD (చర్చ) 14:41, 27 ఆగష్టు 2016 (UTC)
ముందుగా రచ్చబండలో సముదాయంతో చర్చించి యింతవరకు ఏ మార్పులు జరగడంలేదు. ఇదే రచ్చబండలో పైన ఈ విషయంలో చర్చ జరుగుతుంది. తరువాత అది పాలసీగా మారితే రచ్చబండలో మనం చేయదగ్గ మార్పులు చర్చించిన తదుపరి సముదాయం ఆమోదంతో మార్పులు చేయవచ్చు. ప్రస్తుతం సరియైన మూలాలున్నప్పుడు మనం ఆటోవికీ బ్రౌసర్ మార్పులు చేయవచ్చు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించినట్లైతే మూలాలు లభ్యమవుతాయి కాబట్టి ఆయా వ్యాసాలలో మార్పులు చేయవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:53, 27 ఆగష్టు 2016 (UTC)
JVRKPRASAD గారు... AWBతో మార్పుల విషయమై సముదాయంతో చర్చించి మార్పులు చేస్తే బాగుంటుందని నేను అనుకోవడం వల్ల సభ్యులకు తెలియజేస్తున్నాను. అయితే, ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి (ఇక్కడ చూడండి). అవి ఇంకా సంపూర్ణం కాలేదు. సముదాయమంతా కలిసి ఈ విషయమై చర్చించాల్సివుంది--Pranayraj1985 (చర్చ) 15:01, 27 ఆగష్టు 2016 (UTC)
రమణ గారికి మరియు ప్రణయ్ గారికి, మీ స్పందనలకు ధన్యవాదములు.--JVRKPRASAD (చర్చ) 16:22, 27 ఆగష్టు 2016 (UTC)
తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలను అధికారికంగా ప్రకటించడానికి ఇంకనూ సమయం ఉంది. ఆగస్టు 22న హైదరాబాదు జిల్లా మినహా మిగితా 9 జిల్లాలలో భౌగోళిక మార్పులపై 9 ఉత్తర్వుల ద్వారా ముసాయిదా జిల్లాలను ప్రతిపాదించింది. ఆ ముసాయిదా జిల్లాలపై ప్రజల అభిప్రాయాలకు గాను ఒక మాసం సమయం కేటాయించింది. అందులో భాగంగానే ముసాయిదా జిల్లాలకు సంబంధించిన పటాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 22న నేను కొత్తగా చేర్చిన 17 జిల్లా వ్యాసాలలో కూడా ప్రతిపాదిత జిల్లాలుగా మాత్రమే పేర్కొన్నాను. వేలాది గ్రామ వ్యాసాలలో మార్పులకు తుది ప్రకటన మాత్రమే ఆధారం కావాలి. కాబట్టి సభ్యులు అంతవరకు ఈ విషయంలో మార్పులు చేయకపోవడం మంచిది. అలాగే ఈ మార్పులు సభ్యులు ప్రత్యేక AWB సభ్యనామంతో చేస్తేనే బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఒక పద్దతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:21, 27 ఆగష్టు 2016 (UTC)
తగు సూచనలు చేసిన సి. చంద్ర కాంత రావు గారికి ధన్యవాదాలు. అయితే, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేర్చిన 17 జిల్లాలకు సంబంధించి తుది ప్రకటన వెలువడిన తరువాతే ఆయా గ్రామ వ్యాసాలలో మార్పులు చేస్తాను. మళ్ళీ మళ్ళీ మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఒక పద్దతి ప్రకారం చేయాల్సి ఉంటుంది అన్న మీ సూచనను నేను అంగీకరిస్తున్నాను. --Pranayraj1985 (చర్చ) 19:27, 27 ఆగష్టు 2016 (UTC)
ఆంధ్రలో కలిపిన ఆ ఏడు మండలాల్లోనూ మూడిట్నో నాలుగిట్నో పాక్షికంగానే కలిపారు. వాటి భౌగోళిక స్వరూపాలు మారతాయి గానీ ఆ పేర్లుగల మండలాలు ఇంకా తెలంగాణాలో ఉన్నట్లే నేమో చూడండి.__చదువరి (చర్చరచనలు) 04:45, 28 ఆగష్టు 2016 (UTC)

తప్పకుండా చదువరి గారు.. వేలేరుపాడు, కుక్కునూరు మండలాలను పశ్చిమ గోదావరి జిల్లా లోనూ... వరరామచంద్రపురం, చింతూరు, కూనవరం మండలాలను తూర్పు గోదావరి జిల్లా లోనూ కలిపినట్లుగా ఆయా మండలాల పేజీలలో ఉంది. అయితే ఈ మండలాల్లోని గ్రామ వ్యాసాలలో మాత్రం ఖమ్మం జిల్లా గా ఉంది. అందుకే ఈ మార్పులు చెయ్యాలి అనుకున్నాను. స్పందనకు ధన్యవాదాలు--Pranayraj1985 (చర్చ) 07:08, 28 ఆగష్టు 2016 (UTC)