వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 45
← పాత చర్చ 44 | పాత చర్చ 45 | పాత చర్చ 46 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2015 డిసెంబరు 11 - 2016 జనవరి 1
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92, 93 |
తెలుగు వికీపీడియా దినోత్సవం 2015 - తెవికీలోకి చారిత్రిక ఛాయాచిత్రాల ఎక్కింపు కార్యక్రమం
[మార్చు]తెలుగు వికీపీడియా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ రెండవ ఆదివారం (13.12.2015) నాడు హైదరాబాదుకు చెందిన తెవికీపీడియన్లతో.. డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్ర మ్యూజియంలో మరియు పబ్లిక్ గార్డెన్ లోపల బయట ఉన్న విగ్రహాల, చారిత్రాత్మక నిర్మాణాల ఫోటో హంట్ (ఫోటోలు తీసి కామన్స్ లోకి ఎక్కించే) కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇతర ప్రాంతాలలో ఉన్న తెలుగు వికీపీడియన్లు కూడా ఇందులో పాల్గొని.. మీమీ ప్రాంతంలో ఉన్న చారిత్రిక ఛాయాచిత్రాలను కామన్స్ లోకి ఎక్కించగలరు. కార్యక్రమ పేజీ కొరకు ఇక్కడ చూడగలరు.
కార్యక్రమానికి మద్దతు తెలుపుటకు మెటా వికీ పేజి ఇక్కడ చూడగలరు. --Pranayraj1985 (చర్చ) 12:18, 11 డిసెంబరు 2015 (UTC)
- తెలుగు వికీపీడియా సముదాయం ఈ సంవత్సరం ప్రారంభంలో బొమ్మలు లేని వ్యాసాలను గుర్తిస్తూ చాలా ప్రయత్నం సాగించింది. అలానే చర్చపేజీల్లో బొమ్మలను అభ్యర్థిస్తూ రాశారు. ఈ నేపథ్యంలో తెవికీ దినోత్సవం ఇలా బొమ్మలు చేర్చే కార్యక్రమంతో ఉత్సాహంగా జరుపుకోవడం, ఆ బొమ్మలతో తెవికీ వ్యాసాలు కళకళలాడనుండడం చాలా శుభపరిణామం. కార్యక్రమానికి నిర్వాహకునిగా పనిచేస్తున్న ప్రణయ్ రాజ్ కు అభినందనలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 13:21, 11 డిసెంబరు 2015 (UTC)
- చారిత్రక ఛాయాచిత్రాలు అని ఉండాలని అనుకుంటున్నాను. JVRKPRASAD (చర్చ) 13:43, 11 డిసెంబరు 2015 (UTC)
నేటి బ్లాగర్లే రేపటి వికీపీడియనులు
[మార్చు]బ్లాగర్లను చక్కని వికీపీడియనులుగా మలచవచ్చన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. (తెవికీలో రచనలు ప్రారంభించే ముందు నేను కూడా బ్లాగర్ నే, బహుశా అందుకే నేనీ అభిప్రాయానికి వచ్చి ఉండవచ్చు.) ఈ మధ్యే నేను హైదరాబాదు వచ్చాను. తెవికీలో నేను వ్రాస్తోన్న పురుషవాదం/స్త్రీవాద వ్యతిరేకత సంబంధించిన వ్యాసాల గురించి తెలుసుకొన్న ఇక్కడి సేవ్ ఇండియా ఫ్యామిలీ సంస్థ ప్రతినిధి (గౌరవనీయులైన పార్థసారథి గారి)ని కలిశాను. ఈ సంస్థలో లాభాపేక్ష లేని, ఇతరులకు ఉపయోగపడేలా ఉండే బ్లాగులు వ్రాసే అనేక మంది బ్లాగర్లు ఉన్నారన్న విషయం నాకు మునుపే తెలుసు. ఒకే నావలో పయనిస్తూ ఉన్న బాటసారులు కొందరితో మాటలు కలిపాను. తెలుగు వికీపీడియనుగా నా ప్రయాణాన్ని, గమ్యాలను వారికి తెలిపాను. అది వరకే పార్థసారిథి గారు తమ సభ్యులకు వికీపీడియాలో వ్యాసాలెలా వ్రాయాలో నేర్పాలని నన్ను కోరినపుడు నా ఆనందానికి అవధులు లేవు. మేము కలసిన తర్వాత ఆయన తమ సభ్యులను విచారించి, కనీసం 10 మంది బ్లాగర్లు వికీపీడియా లో రచనలు చేయటానికి ఉత్సుకత కనబరుస్తున్నారని తెలిపారు. వచ్చే శనివారం అనగా, 19 డిసెంబరు 2015 న (వేదిక ఇంకా ఖాయం కావలసి ఉన్నది, సూచనప్రాయ వేదిక: పార్కు లేను, సికిందరాబాదు) ఈ సంస్థ నిర్వహించే వారాంతపు సమావేశాలలో రెండు గంటలను వికీ పరిచయం కోసం కేటాయించారు. ఈ బ్లాగర్ల ఆసక్తి, లభ్యతలను బట్టి ఈ కార్యక్రమాన్ని విస్తరించే అవకాశం ఉన్నది.
అయితే, వికీని ముందుకు తీసుకెళ్ళటానికి, వికీకి మరింత వ్యాప్తిని అందించటానికి, వికీలో వాడుకరుల/వ్యాసాల సంఖ్యను పెంపొందించటానికి, ఎవరికైనా ఆసక్తి ఉన్నచో, ఈ సమావేశంలో నాకు చేదోడు వాదోడుగా ఉండటానికి ఇదే నా ఆహ్వానం. మీ సమాధానం కోసం వేచి చూస్తూ ఉంటాను. ధన్యవాదాలు - శశి (చర్చ) 17:31, 14 డిసెంబరు 2015 (UTC)
వేదిక ఖరారు
[మార్చు]ఈ కార్యక్రమంలో నాకు సహాయాన్ని అందించటానికి ముందుకు వచ్చిన కశ్యప్ మరియు ప్రణయ్ లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ, ఈ కార్యక్రమానికి వేదిక పార్కు లేను హోటల్, పార్కు లేను, సికిందరాబాదు గా ఖరారైనది. అనగా SIF కు ఇది తలసరి ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం. కావున వారు ఇరువురు వికీపీడియనులకు మాత్రం ఆహ్వానాన్ని అందించగలిగారు. అంటే, నేను కాక ఇంకొకరు మాత్రమే నాతో బాటు రావచ్చును. ఇది ప్రతి శనివారం గం 16:00 ని నుండి గం 18:00 ని వరకు జరిగే కార్యక్రమం కావున, భవిష్యత్తులో ఎవరైనా ఒకరు రాలేకపోయినచో, మూడోవారికి స్థానం దక్కవచ్చు. దీనిపై మనం వికీ వెలుపల ఏకాభిప్రాయనికి వస్తామని ఆశిస్తూ. - శశి (చర్చ) 16:44, 16 డిసెంబరు 2015 (UTC)
బాగర్లను వికీపీడియన్లు గా మార్చాలను కొనే పక్రియ నన్ను విపరీతంగా సంబరపరచినది , మీ అహ్వానానికి నెనర్లు ! --కశ్యప్ (చర్చ) 03:32, 17 డిసెంబరు 2015 (UTC)
- తెవికీకి చురుకైన వాడుకరుల అవసరం చాలా ఉన్నది. తెలుగు భాషలో రచనలు చేయడానికి అలవాటుపడిన తెలుగు బ్లాగర్లను వికీపీడియన్లుగా మార్చడం చాలా గొప్ప ఆలోచన. దీనికి ఇదొక గొప్ప ప్రారంభంగా నాకనిపిస్తుంది. --Rajasekhar1961 (చర్చ) 04:36, 17 డిసెంబరు 2015 (UTC)
- రాజశేఖర్ గారు, మరియు కశ్యప్ గారు...ఈ ఆలోచన నాకు బెంగుళూరులోనే కలిగినది. అప్పట్లో నేను అంతర్జాలంలో కొందరు బ్లాగర్లను కదిపి చూశాను కూడా. కానీ వీరు స్వేచ్ఛా బ్లాగర్లు. అంటే వారికి తోచినది తోచినట్లు తోచినపుడు వ్రాసేవారు. కానీ ఇప్పుడు నేను కలువబోయే బ్లాగర్లు ప్రత్యేకమైన వారు. వీరు
- తమకు కలిగిన సమస్యలు ఇతరులకు కలుగకుండా ఉండేందుకు విధవిధాలుగా శ్రమించేవారు.
- తమ కార్యకలాపాలతో ఇతరులలో జ్ఞానాన్ని, జాగరూకతను పెంపొందించాలనుకొనేవారు
- తమ బ్లాగుల ద్వారా అదే నావలో పయనించే ఇతరులకు సహాయపడదలచుకొనేవారు
- లాభాపేక్ష లేకుండా సంఘ శ్రేయస్సు కొరకు, మంచి మార్పు కొరకు తపించేవారు
- శాంతి కాముకులు
- వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎన్ సైక్లోపీడియా వంటి వారు. వారిని తరచి చూస్తే ఎన్నో కన్నీటి గాధలు, వ్యథలు
- ప్రసార మాధ్యమాలు వాస్తవాలను కాకుండా సంచలనాలను ప్రసారం చేయటాన్ని వ్యతిరేకించేవారు
- వాస్తవాలను సభ్య సమాజానికి తెలియజేయాలనుకొనే తపన గలవారు
- ఈ లక్షణాలన్నీ చక్కని వికీపీడియనులుగా ఎదిగటానికి ఉపయోగపడతాయని నా ప్రగాఢ విశ్వాసం. నేనూ అదే నావలో పయనిస్తూ ఉండటం, వారు నన్ను ఆహ్వానించటం, యాదృచ్ఛికం. నా ప్రయత్నంగా నేను వీలైనంత మంది బ్లాగర్లను వికీపీడియనులుగా మలచేందుకు కృషి చేస్తాను. ఫలితం ఆశావహంగానే ఉంటుందని ఆశిద్దాం. మీ అభినందనలకు ధన్యవాదాలు. - శశి (చర్చ) 15:26, 17 డిసెంబరు 2015 (UTC)
- రాజశేఖర్ గారు, మరియు కశ్యప్ గారు...ఈ ఆలోచన నాకు బెంగుళూరులోనే కలిగినది. అప్పట్లో నేను అంతర్జాలంలో కొందరు బ్లాగర్లను కదిపి చూశాను కూడా. కానీ వీరు స్వేచ్ఛా బ్లాగర్లు. అంటే వారికి తోచినది తోచినట్లు తోచినపుడు వ్రాసేవారు. కానీ ఇప్పుడు నేను కలువబోయే బ్లాగర్లు ప్రత్యేకమైన వారు. వీరు
పరిచయ సమావేశం విజయవంతం
[మార్చు]సేవ్ ఇండియా ఫ్యామిలీ సభ్యులతో వికీ పరిచయ సమావేశం విజయవంతంగా ముగిసినది. అనూహ్యంగా కొందరు కార్యకర్తలు ఆంగ్ల వికీలో ఒక రాజకీయ వేత్త పై ఎడిట్ వార్ లు చేసి, ఫలితంగా బ్లాక్ చేయబడ్డారు. (సమావేశానికి ముందు నాకు ఈ విషయం తెలియదు) కశ్యప్ సమావేశంలో లేకపోతే నేను బిత్తరపోయి తత్తరపడే వాడిని. సమయానికి అందుకొని రక్షించారు. ధన్యవాదాలు. ఇక పోతే, వీరు వికీలో రాయటానికి ఉత్సాహం కనబరుస్తున్నారనే చెప్పాలి. ఒక మహిళా కార్యకర్త అయితే, మూలాలను ఎలా చేర్చాలో తక్షణం చూపమని కోరారు. అన్నప్రాస రోజునే ఆవకాయ బద్ద వలదని, నిదానమే ప్రధానమని రానున్న సమావేశాలలో చక్కని వ్యాసాలు ఎలా వ్రాయాలో నేర్పుతామని తెలిపాము.
ఈ క్రింద అంశాలు చర్చార్హం
- ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుండి ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి?
- నాకంటే ఎక్కువ అనుభవశీలక వికీపీడియనులు భవిష్యత్తులో ఈ చర్చలకు ముందుకు వస్తారా? (ఎంతమంది ఎక్కువ వికీపీడియనులు ఉంటే, అంత చక్కని అవగాహన మనం వీరిలో నెలకొల్పవచ్చని నా అభిప్రాయం)
- వీరి భావోద్వేగాలను సరియైన దిశలో పెట్టి, వీరు దీర్ఘకాలిక వికీపీడియనులుగా మారటానికి మనం ఏం చేయాలి?
కార్యకర్తల సూచన
- ఒక సోషల్ నెట్ వర్కింగ్ గ్రూప్ ను చేసి, అందులో వికీ లో వారి వ్యాసాలను చక్కగా మలచటానికి సలహాలు సూచనలు ఇవ్వటం
కశ్యప్, టూకీగా చర్చించాను. చర్చాంశాలు ఇంకా ఏవైనా ఉంటే చేర్చగలరు. - శశి (చర్చ) 01:58, 20 డిసెంబరు 2015 (UTC)
వికీపీడియా 15 వ జన్మదినం హైదరాబాద్ లొ వేడుకలు జనవరి 2016
[మార్చు]వికీపీడియా 15జనవరి 2015 న 15 వ సంవత్సరంలొ అడుగు పెడుతున్నది కావున మనం ఒక ప్రత్యేక కార్యక్రమం చెస్తే బాగుంటుంది అన్న ఆలోచన, నేను ప్రాధమికంగా ఒక ఈవెంటు Wikipedia 15/Events/Hyderabad చేర్చాను 15 జనవరి శుక్రవారం కావున 16 శనివారం అయితే అందరికీ అనువుగా ఉండవచ్చు అని ఓ ఆలోచన , ఎమిచేద్దాం ఎలా చేద్దాం . గత ఈవెంట్లను https://ten.wikipedia.org వద్ద చూడవచ్చు. --కశ్యప్ (చర్చ) 04:07, 17 డిసెంబరు 2015 (UTC)
డిసెంబర్ 20న హైదరాబాద్ నెలవారీ సమావేశంలో తెవికీపీడియన్లతో ఆంగ్ల వికీపీడియన్ల సమ్మేళనం
[మార్చు]డిసెంబర్ 20, మూడవ ఆదివారం నాడు ఆబిడ్స్ లోని గోల్డెన్ థ్రెషోల్డ్ లో హైదరాబాద్ తెవికీపీడియన్ల నెలవారీ సమావేశం నిర్వహించుకోనున్నాం. అయితే ఈ సమావేశంలో ప్రత్యేకించి హైదరాబాద్ వాసులైన ఆంగ్ల వికీపీడియన్లతో భేటీ ఉండబోతోంది. అవగాహనను పంచుకోవడం, సహకారంతో అనువాదాలు చేయడం వంటి కార్యకలాపాలతో పాటుగా తెవికీపీడియన్లతో ప్రత్యేకించి సీఐఎస్-ఎ2కె ప్రణాళికపై సమీక్ష జరపనున్నాం. వికీపీడియన్లు కార్యక్రమానికి హాజరుకాగలరని ఆశిస్తున్నాను. ముందస్తు నమోదు కోసం ఇక్కడ చూడండి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:24, 18 డిసెంబరు 2015 (UTC)
- దయచేసి అందరు ఇక్కడ తమ మద్దత్తు తెలపగలరు అని మనవి. శ్రీకర్ కాశ్యప్ 05:05, 19 డిసెంబరు 2015 (UTC)
This is a message from the Wikimedia Foundation. Translations are available.
As many of you know, January 15 is Wikipedia’s 15th Birthday!
People around the world are getting involved in the celebration and have started adding their events on Meta Page. While we are celebrating Wikipedia's birthday, we hope that all projects and affiliates will be able to utilize this celebration to raise awareness of our community's efforts.
Haven’t started planning? Don’t worry, there’s lots of ways to get involved. Here are some ideas:
- Join/host an event. We already have more than 80, and hope to have many more.
- Talk to local press. In the past 15 years, Wikipedia has accomplished extraordinary things. We’ve made a handy summary of milestones and encourage you to add your own. More resources, including a press release template and resources on working with the media, are also available.
- Design a Wikipedia 15 logo. In place of a single icon for Wikipedia 15, we’re making dozens. Add your own with something fun and representative of your community. Just use the visual guide so they share a common sensibility.
- Share a message on social media. Tell the world what Wikipedia means to you, and add #wikipedia15 to the post. We might re-tweet or share your message!
Everything is linked on the Wikipedia 15 Meta page. You’ll find a set of ten data visualization works that you can show at your events, and a list of all the Wikipedia 15 logos that community members have already designed.
If you have any questions, please contact Zachary McCune or Joe Sutherland.
Thanks and Happy nearly Wikipedia 15!
-The Wikimedia Foundation Communications team
Posted by the MediaWiki message delivery, 20:59, 18 డిసెంబరు 2015 (UTC) • Please help translate to your language • సహాయము
ఐఆర్సీ చేసే పద్ధతిలో మార్పు
[మార్చు]ఇటీవల కశ్యప్ గారితో మాట్లాడినప్పుడు ఒక గంట పాటు ఐఆర్సీ నిర్వహించి అందులో రాలేకపోయినవారి కోసం మరో ఐఆర్సీ నిర్వహించడం వంటివి అనవసరమైన శ్రమ అని, అలానే అమెరికాలో వైజాసత్య వంటి చర్చల్లో పాల్గొంటూండే వికీపీడియన్లు ఉండడం వల్ల ఏదోక సమయంలో పెట్టుకోవడంతో వారికో, భారతీయులైన తెవికీపీడియన్లకో ఇబ్బందికరమని సూచించారు. భవిష్యత్తులో తెలుగు వారు వలస వెళ్ళిన ప్రపంచదేశాలన్నిటా తెవికీపీడియన్లు కావడం ప్రారంభమైతే ఈ సమస్య మరీ సంక్లిష్టమైపోతుందని అనిపిస్తోంది. కనుక 24 గంటల పాటు ఐఆర్సీ జరిగితే ఎలావుంటుందంటూ ఆయన సూచించారు. అంటే అందరూ 24 గంటల పాటూ ఐఆర్సీలో కూర్చోనక్కరలేదు. ఎవరికి వీలుదొరికిన సమయం చూసుకుని వారు వ్యాఖ్యానించవచ్చు అచ్చంగా మన తెవికీ చర్చల పద్ధతిలోనే. ఐతే వ్యాఖ్యానించేందుకు ఒకరోజు పరిమితి ఉంటుంది. అలానే ఎవరైనా ఏదైనా రాస్తే దానిమీద వ్యాఖ్యానించేందుకు మళ్ళీ ఆ రోజు మాత్రం అప్పుడప్పుడూ ఐఆర్సీ ఛానెల్లో కనెక్ట్ అవుతూండవచ్చు. సుదీర్ఘ సమయం ఐఆర్సీ అన్నది ఇప్పటికే ఫాబ్రికేటర్ వంటి వికీప్రాజెక్టుల్లో జరుగుతోంది. ఇది మనమూ చేస్తే ఎలావుంటుంది? --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:48, 21 డిసెంబరు 2015 (UTC)
- రాజశేఖర్ గారు ఐఆర్సీలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు, అలానే అర్జున గారు, సుజాత గారు, ప్రణయ్ రాజ్ గారు, విశ్వ గారు, జెవిఆర్కే గారు పోయిన నెల నిర్వహించిన ఐఆర్సీలో పాల్గొన్నారు కనుక ఈ ప్రతిపాదన వీరికి ఆసక్తికరంగా ఉండొచ్చని టాగ్ చేస్తున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:52, 21 డిసెంబరు 2015 (UTC)
- ఇలాంటి సామాంతర చర్చలు మనం ప్ఫేస్బుక్ లో ఇప్పటికే కొన్ని చేస్తున్నాం. ఇక్కడ రచ్చబండ ఉంది కనుక రాత పూర్వక చర్చల వలన ప్రయోజనం తక్కువ అవ్వచ్చు ఎందుకంటే ఎవరో ఒకరు తమ అభిప్రాయాన్ని రాసాక దానిపై స్పందన మరింత మంది రాస్తూ ఉంటారు. ఏదో ఒకటి ముందు కనిపిస్తుంది దానితో దానిపై జవాబులు వస్తూ ఉండటంతో అప్పటి వరకూ రాస్తూ ఉన్నది చెరిపి మళ్ళీ దీనికి జవాబివ్వాలి. కనుక ఇది ఏమంత ఉపయుక్తం కాదని నా అభిప్రాయం..--Viswanadh (చర్చ) 06:09, 21 డిసెంబరు 2015 (UTC)
- స్కైప్ ద్వారా జరిపే చర్చల కంటే ఐ.ఆర్.ఎస్ సఫలం కావడం కష్టమే. ఐ.ఆర్.ఎస్ సంతృప్తికరమైన ఫలితాలు ఇవ్వదేమో. దీని ద్వార చర్చల పర్వవసానం నిర్ణయించడం కష్టం అన్నది నా అభిప్రాయం. --t.sujatha (చర్చ) 16:59, 22 డిసెంబరు 2015 (UTC)
Password Strength RFC
[మార్చు]నమస్కారం
We have started an RFC on meta to increase password requirements for users that have accounts which can edit MediaWiki:Common.js, have access to checkuser or have access to Oversight.
These types of accounts have sensitive access to our sites, and can cause real harm if they fall into malicious hands. Currently the only requirement is the password is at least 1 letter long. We would like to make the minimum be 8 letters (bytes) long and also ban certain really common passwords.
By increasing requirements on passwords for accounts with high levels of access, we hope to make Wikimedia wikis more secure for everyone. Please read the full text of the proposal here, and make your voice heard at the RFC.
ధన్యవాదాలు
Please help translate to your language
WMF భద్రతా బృందం తరపున BWolff (WMF) (చర్చ) 08:48, 21 డిసెంబరు 2015 (UTC)
Community Wishlist Survey
[మార్చు](Apologies for posting this in English. Translations are very welcome.)
Hi everyone,
The 2015 Community Wishlist Survey is over, and now the Community Tech team's work begins on the top 10 features and fixes.
In November and December 2015, we invited contributors from all Wikimedia projects to submit proposals for what they would like the Community Tech team to work on for the purpose of improving or producing curation and moderation tools for active contributors.
634 people participated in the survey, where they proposed, discussed and voted on 107 ideas. There was a two-week period in November to submit and endorse proposals, followed by two weeks of voting. The top 10 proposals with the most support votes now become the Community Tech team's backlog of projects to evaluate and address.
You can see the whole list with links to all the proposals and Phabricator tickets on this page: 2015 Community Wishlist Survey.
For everybody who proposed, endorsed, discussed, debated and voted in the survey, as well as everyone who said nice things to us recently: thank you very much for coming out and supporting live feature development. We're excited about the work ahead of us. -- DannyH (WMF) (చర్చ) 22:17, 21 డిసెంబరు 2015 (UTC)
గ్రంథాలయాధికారులకు వికీ అకాడమీపై ప్రతిపాదన
[మార్చు]హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ డాక్టర్ అచల మునిగల్ గారు ఇటీవలి మన హైదరాబాద్ మీటప్(డిసెంబర్ 20, 2015)కు వచ్చారు. హైదరాబాద్ మరియు ఇతర తెలంగాణా ప్రాంతంలోని గ్రంథాలయాధికారుల సముదాయంతో ఆవిడకు చాలా చక్కని సమన్వయం ఉంది. ఓపెన్ యాక్సిస్ జర్నల్స్ డేటాబేస్ తయారుచేయడంపై ఆవిడ ఆసక్తికలిగివుండడమే కాక పలువురు ఇతర గ్రంథాలయాధికారులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయదలుచుకున్నారు. పైన తెలిపిన డేటాబేస్ తయారయే పక్షంలో మొత్తం వికీపీడియాకు ఎంతగానో సహకారి అవుతుంది. వికీపీడియాతోపాటు వికీసోర్సు వంటి ప్రాజెక్టులు కూడా లాభపడతాయి. అంతేకాక తెవికీకి ఆయా గ్రంథాలయాధికారుల సహకారం, భాగస్వామ్యం మరెన్నో విధాల ఉపయోగపడవచ్చు. ఈ అంశంపై తెలుగు వికీపీడియన్లు కశ్యప్ గారు, భాస్కరనాయుడు గారు సీఐఎస్-ఎ2కె ఉద్యోగి పవన్ సంతోష్, వికీమీడియా ఇండియా చాప్టర్ సభ్యుడు యోహాన్ థామస్ గారు మాట్లాడారు. ఈ క్రమంలో ముందుగా కొందరు ఔత్సాహికులైన గ్రంథాలయాధికారులను తెవికీపీడియన్లుగా చేయదలచుకున్నట్టు ఆవిడ తెలియజేశారు. జనవరి 11న గ్రంథాలయాధికారులకు వికీ వర్క్ షాప్ నిర్వహించే కార్యక్రమం సముదాయ సభ్యులు కొందరు చేపట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కాపీహక్కుల గురించి, క్రియేటివ్ కామన్స్ లైసెన్సుల గురించి, ఓపెన్ సోర్స్, ఓపెన్ నాలెడ్జ్ ఉపయోగాల గురించి అన్నీ తెలిసిన ఈ గ్రంథాలయాధికారులకు వికీ అకాడమీ ఇవ్వడం చాలా ఉపయుక్తంగా ఉంటుందని అచల గారు తెలియజేశారు. అలాగే తెవికీ సముదాయం నుంచి భాస్కర నాయుడు గారూ కార్యక్రమం ప్రయోజనకరమనీ కశ్యప్, పవన్ సహకరిస్తే తాను నిర్వాహకునిగా వ్యవహరించి నడిపించగలనని తెలియజేశారు. కార్యక్రమంలో మాట్లాడడానికి రీసోర్సు పర్సన్ గా నన్ను వ్యవహరించమని అచల కోరారు. (గతంలో పవన్ సంతోష్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు చేసివుండడం, విశ్వనాథ్ గారు నిర్వహిస్తున్న కాటలాగ్ డిజిటైజేషన్ ప్రాజెక్టు విషయంలో కొద్ది సహకారం అందించడం వంటివాటిని పరిగణనలోకి తీసుకుని ఆమె కోరారు.) ఐతే విశ్వవిద్యాలయానికి డిసెంబర్ 24 నుంచి సెలవలు రానుండడం తదితర అవాంతరాలు పొంచివుండడంతో ఈ అంశంపై త్వరితగతిన సముదాయం చర్చించి నిర్ణయించాలని భాస్కరనాయుడు, కశ్యప్, అచల గార్ల పక్షాన కోరుతున్నాను. త్వరగా, నిర్వహించడానికి అనుకూలంగా నిర్ణయిస్తే ఆశిస్తున్న విధంగా జనవరి 11న కార్యక్రమం జరుగుతుంది. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:48, 22 డిసెంబరు 2015 (UTC)
సమ్మతం
[మార్చు]- Pranayraj1985 (చర్చ) 11:36, 22 డిసెంబరు 2015 (UTC)
- ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపడితేనే మన విలువ అందరికీ తెలుస్తుంది. మనమందరం కలిసి దీనిని ముందుకు తీసుకొని వెళదాము. కానీ గ్రంథాలయాధికారులను వారే ఈ కార్యక్రమానికి అనుసంధించమని కోరండి.--Rajasekhar1961 (చర్చ) 12:21, 22 డిసెంబరు 2015 (UTC)
- సందర్భానుసారంగా అప్పుడప్పుడప్పుడు ఇలాంటి కార్య క్రమాలు జరుగుతుంటేనే... ఉత్సాహ కరంగా వుంటుంది. ఈ కార్యక్రమానికి నాపూర్తి మద్దతునిస్తున్నాను. భాస్కరనాయుడు (చర్చ) 13:55, 22 డిసెంబరు 2015 (UTC)
- ఇది ప్రయోజనకరమైన కార్యక్రమం. అయినప్పటికీ ఇది వికీపీడియా 15వ జయంతి ఉత్సవాల సమయంలో ఏర్పాటు చేస్తే మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరువాత కృషిచేయడానికి వీలౌతుంది. కనుక కార్యక్రమ తారీఖులలో మార్పులు జరిగితే నేను కూడా ఇందులో పాల్గొనడానికి వీలుకలుగుతుంది.--t.sujatha (చర్చ) 14:59, 22 డిసెంబరు 2015 (UTC)
- --స్వరలాసిక (చర్చ) 02:36, 23 డిసెంబరు 2015 (UTC)
- --Nrgullapalli (చర్చ) 02:52, 23 డిసెంబరు 2015 (UTC)
- --కశ్యప్ (చర్చ) 11:38, 29 డిసెంబరు 2015 (UTC)
- --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:21, 6 జనవరి 2016 (UTC)
వ్యతిరేకం
[మార్చు]తటస్థం
[మార్చు]గ్రంథాలయము
[మార్చు]వాడుకర్లు దయచేసి ఈ సైట్ [1] చూడగలరు. JVRKPRASAD (చర్చ) 11:22, 22 డిసెంబరు 2015 (UTC)
- బావుందండీ. ఐతే ప్రస్తుతం జరగడానికి ప్రతిపాదిస్తున్న కార్యక్రమం ఆయా లైబ్రేరియన్లను వికీపీడియన్లను చేయడం వరకే పరిమితం. ఇప్పటికే వాళ్ళకి కాపీహక్కుల గురించి అవగాహన ఉండడం, క్రియేటివ్ కామన్స్ లైసెన్సుల గురించి తెలిసివుండడం, ఓపెన్ నాలెడ్జ్ గురించి తెలిసి మరీ కార్యక్రమానికి హాజరుకానుండడం మనకు లాభించే అంశాలవుతాయని ప్రతిపాదన. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 11:37, 22 డిసెంబరు 2015 (UTC)
తెవికి పుష్కర వార్షికోత్సవాలు జరపడానికి ప్రతిపాధన
[మార్చు]ప్రతి ఏడు మన తెవికి వార్షికోత్సవాలను జరుపుకుంటున్న విషయము తెలిసిందె. అదే విధంగా తెవికి పుష్కరోత్సవము (పన్నెండవ వార్షికోత్సవము) కూడ తప్పక జరపాలని నా ప్రతిపాధన. అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరగాలనే విషయాన్ని సహ సభ్యులే నిర్ణయిస్తే బాగుండునని నా ఆలోచన. ఈ విషయములో సహ సభ్యులు తమ మద్దతును,/ వ్వతిరేకతను, తెలియ జేయ గలరు. భాస్కరనాయుడు (చర్చ) 14:06, 22 డిసెంబరు 2015 (UTC)
సమ్మతం
[మార్చు]- ప్రణయ్‌రాజ్ (చర్చ) 18:30, 22 డిసెంబరు 2015 (UTC)
- స్వరలాసిక (చర్చ) 02:34, 23 డిసెంబరు 2015 (UTC)
- గుళ్ళపళ్ళి నాగేశ్వరరావు (చర్చ) 02:54, 23 డిసెంబరు 2015 (UTC)
- నాయుడుగారి జయన్న (చర్చ) 15:08, 23 డిసెంబరు 2015 (UTC)
- సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:03, 29 డిసెంబరు 2015 (UTC)
వ్యతిరేకం
[మార్చు]తటస్థం
[మార్చు]వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా దినోత్సవం 2015 - తెవికీలోకి చారిత్రిక ఛాయాచిత్రాలు/నివేదిక
[మార్చు]అందరికి నమస్కారం... డిసెంబర్ రెండవ ఆదివారం (13.12.2015) నాడు హైదరాబాదుకు చెందిన తెవికీపీడియన్లతో.. డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్ర మ్యూజియంలో మరియు పబ్లిక్ గార్డెన్ లోపల మరియు బయట ఉన్న విగ్రహాల, చారిత్రాత్మక నిర్మాణాల ఫోటో హంట్ (ఫోటోలు తీసి కామన్స్ లోకి ఎక్కించే) కార్యక్రమం నిర్వహించబడింది. ఆ కార్యక్రమ నివేదిక కొరకు ఇక్కడ చూడగలరు. ధన్యవాదాలు. --Pranayraj1985 (చర్చ) 11:59, 23 డిసెంబరు 2015 (UTC)
వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/డిసెంబర్ 20, 2015 సమావేశపు నివేదిక
[మార్చు]అందరికి నమస్కారం... డిసెంబర్ 20న బహుభాషా సంస్కృతులు నిలయమైన హైదరాబాద్ నగరంలో తొలిసారిగా బహుభాషా వికీపీడియన్ల అరుదైన సమ్మేళనం జరిగింది. ఆ కార్యక్రమ నివేదిక కొరకు ఇక్కడ చూడగలరు. ధన్యవాదాలు. --Pranayraj1985 (చర్చ) 12:01, 23 డిసెంబరు 2015 (UTC)
సీఐఎస్-ఎ2కె ట్రైన్ ఎ వికీపీడియన్ (వికీపీడియన్ కు శిక్షణనివ్వడం)
[మార్చు]నమస్తే,
సీఐఎస్-ఎ2కె కొత్త ప్రతిపాదన ఐన ట్రైన్-ఎ-వికీపీడియన్ అనే కార్యక్రమం గురించి మీకు తెలయజేయానికి చాలా ఆనందిస్తున్నాను. వికీపీడియా వాడుకరులు, భావి నిర్వాహకులు వికీపీడియాలో దిద్దుబాట్లు చేయడం, దాని పాలసీలు, మార్గదర్శకాల గురించి వారి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపకరించే ఆన్లైన్ అభ్యసన/శిక్షణ ప్రయత్నం. నేర్చుకోవడానికి ఎంతో ఉన్నా చాలామంది వాడుకరులకు వారి సముదాయానికి మరింత సాయం చేసేందుకు సరిగ్గా వారేం నేర్చుకోదలుచుకున్నారో కనిపెట్టడం కష్టమన్నది తెలసిందే. ఈ చొరవ ఇలా ఉపకరించవచ్చు:
- తెవికీ వాడుకరులు మరింత మెరుగైన రచనలు చేసేవారిగా సశక్తియుతం కావడానికి.
- నిర్వాహకులు కాగలిగనవారికి (పొటెన్షియల్ ఎడిటర్స్) ఉపకరించవచ్చు: ఈ అంశంలో వికీపీడియా పాలసీలు, మార్గదర్శకాలు, నిర్వాహకులు చేసే పనులు, ఇతర బాధ్యతల గురించి చర్చిస్తాం. (నిర్వాహకులను ఎప్పుడూ సముదాయమే ఎంచుకుంటుందని, మేం కేవలం పాల్గొనే వాడుకరులకు నిర్వాహకుల పనుల గురించి నేర్చుకుందుకే సహకరిస్తాం)
- నిర్వాహకులు మరింత నైపుణ్యం, శక్తివంతం అయేందుకు సహకారి అవుతుంది. ట్రైనింగ్ ప్రధానంగా ఆన్లైన్లో సాగుతుంది, ఐతే అవసరమైతే ఆఫ్లైన్ సెషన్లు కూడా నిర్వహించవచ్చు. మీరు చేరదలుచుకున్నా, వేరేవారి పేరు సూచించదలుచుకున్నా దయచేసి వాడుకరి పేరు కింద చేర్చడం ద్వారా చేయగలరు.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 13:38, 24 డిసెంబరు 2015 (UTC)
వాడుకరి పేరు
[మార్చు]- . Ramana1248
చర్చ
[మార్చు]పవన్ సంతోష్ గారూ మీరు పంపిన సందేశం చూసాను. ఇటీవల మనం కలసినప్పుడు చర్చించిన విధం గా నాకు వికీపీడియా ప్రాధమిక పాఠాలు భోధించండి. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ఎలా అయిన పరవాలేదు. ````
వాడుకరి పేరు
[మార్చు]చర్చ
[మార్చు]- ఇటీవల హైదరాబాద్ లో కట్టా శ్రీనివాసరావు గారిని కలిసినప్పుడు ఈ అంశమూ చర్చకు వచ్చింది. ఈ ప్రణాళికలో భాగంగా వాడుకరిగా ఈ ప్రణాళికలో చేరి మరిన్ని అంశాలు నేర్చుకునేందుకు ఆయన ఉత్సుకత ప్రదర్శించారు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:55, 28 డిసెంబరు 2015 (UTC)
వాడుకరి పేరు
[మార్చు]చర్చ
[మార్చు]- సంప్రదింపుల్లో భాగంగా శైలి, రిఫరెన్సులు ఇవ్వడం, సోర్సులుగా స్వీకరించడం వంటివాటిని నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమం గురించి తెలిశాకా చేరేందుకు చాలా ఆసక్తికనబరిచారు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:18, 31 డిసెంబరు 2015 (UTC)
వాడుకరి పేరు
[మార్చు]వాడుకరి పేరు
[మార్చు]చర్చ
[మార్చు]కోనేటి కుమార్ గారితో మెయిల్ సంభాషణ, తదనంతర టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఆ సంప్రదింపుల్లో ఆయనకు తెవికీ గురించి నేర్చుకోవాలని ఉన్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేరవచ్చని సూచించి, ఆయన అనుమతిపై ఇక్కడ రాస్తున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:55, 14 జనవరి 2016 (UTC)
వాడుకరి పేరు
[మార్చు]- Imahesh3847
చర్చ
[మార్చు]ఈ వాడుకరి ప్రాధమిక దశలో వున్నారు. వికీపీడియాలో తెలుగులో టైప్ చేయడము ఎలాగో తెలుప వలసినదని నన్ను కోరారు. నాకు చేతనయినంత మేర అతని చర్చ పుటలో వివరించాను. ఇలాంటి వారికి ఈ కార్యక్రమము చాల ఉపయోగ కరముగా వుండ వచ్చు. భాస్కరనాయుడు (చర్చ) 14:16, 14 జనవరి 2016 (UTC)
భారతీయ రైల్వేలు వ్యాసములు - చిత్రములు
[మార్చు]వాడుకరులు అందరికీ నమస్కారము. నేను భారతీయ రైల్వేలు యొక్క అనేక విభాగములలో ప్రస్తుతము ఒక విభాగము అయిన "రైలు బండ్లు" వ్యాసములు వ్రాస్తున్నాను. ఈ సందర్భములో మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వికీనందు వాడుకునేందుకు రైల్వేలకు సంబంధించిన ఏ ఉచిత చిత్రములు అయినా వికీ కామన్స్ నందు ఎక్కించ (అప్‌లోడ్) చేయగలరు. ఉదాహరణకు ఒక రైలు బండికి సంబంధించిన భోగీలు (కోచ్లు) ఇంజను (ముందు భాగము), ఎస్‌ఎల్‌ఆర్, జనరల్, ఎ1 బి1 బి2 ఎస్1 పిసి ఎస్2 ఎస్3 ఎస్4 ఎస్5 ఎస్6 ఎస్7 ఎస్8 ఎస్9 ఎస్10 ఎస్11 ఎస్12 ఎస్13......ఇలా ఇలా, ఎసి-1, ఎసి-2, ఎసి-3 కోచ్లు, బ్రేక్ వ్యాన్, ప్యాంట్రీ కార్, గార్డ్ , ఎల్‌వి బోర్డ్ (చివరి భోగీ నామఫలకం), రైలు నామఫలకం, ఇలా ఎన్నో చిత్రములు ఒక్కొక్క రైలుకు మరియు కోచ్లకు ఉంటాయి. రైల్వే స్టేషనులు, ప్రయాణీకుల సౌకర్యాలు, కార్ఖానాలు / షెడ్లు, మెట్రో, మోనో, ఎంఎంటిఎస్,...... రైల్వే స్టేషనుల భవనములు, వాటి నామఫలకములు, రైల్వే స్టేషను నామఫలకము, గూడ్స్ యార్దులు, రైలు పట్టాలు, రైల్వేలకు సంబంధించిన వస్తువుల ప్రతి ఒక దాని చిత్రము, రైల్వే కార్యాలయములు, రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారములు, ఇలా ఎన్నెన్నో ఒక వస్తువుకు ఒక చిత్రము అన్నట్లుగా తీసుకుని వికీ కామన్స్ నందు చేర్చుకోగలిగితే వ్యాసములకు ఎంతో ఉపయోగపడతాయి. ఒక రైలు బండికి కనీసం నాలుగు చిత్రములు అయినా (ఇంజను, ఎసి స్లీపర్, జనరల్, రైలుబండి నామఫలకం) తీసుకోగలిగితే బావుంటుంది. చిత్రములు గురించిన సందేహాములున్న దయచేసి అందరూ చర్చించండి. JVRKPRASAD (చర్చ) 12:41, 25 డిసెంబరు 2015 (UTC)
- మంచి కార్యక్రమం. మనం అందరం రైలు ప్రయాణం చేస్తుంటాము. అప్పుడు ఆయా రైలుబండ్లకు సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేసి వ్యాసంలో చేరిస్తే చాలా బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 14:08, 25 డిసెంబరు 2015 (UTC)
వ్యాస రచయితలకు విజ్ఞప్తి
[మార్చు]తెలుగు వికీపీడియాలో వ్యాసాలను అభివృద్ధి చేస్తున్న అందరు వాడుకరులకు నా విజ్ఞప్తి ఇది. ఒకరు మొదలు పెట్టిన వ్యాసాలను అభివృద్ధి చేయగోరు వారు ముందు ఆ వ్యాసం చదవండి. మీరు వ్రాసిన తర్వాత మళ్లీ ఒకసారి చదవండి. ముఖ్యంగా వ్యక్తుల గురించి వ్రాసిన వ్యాసాలలో ముందు వ్రాసిన వాడుకరి ఎలా సంబోధించాడో చూడండి. ఆ వాడుకరి ఏకవచనంతో సంబోధిస్తే మీరూ అలాగే వ్రాయండి. లేదు మీరు బహువచనం లో వ్రాయాలనే అనుకుంటే ముందు వాడుకరి వ్రాసినది కూడా బహువచనంలోకి సవరించండి. ఎందుకంటే వ్యాసం మొత్తం ఒకే విధంగా ఉంటే చదివే వారికి బాగాఉంటుంది. ఇక్కడ చర్చ ఏక వచనం వాడాలా, బహువచనం వాడాలా అన్నది కాదు. వ్యాసం పూర్తిగా ఒకే విధంగా ఉండాలన్నది మాత్రమే అని గమనించగలరు. ఈ బాధ్యత మొదట వ్యాసం ప్రారంభించిన వాడుకరిది కాదు దానిని కొనసాగించేవారిది మాత్రమే అని గుర్తించగలరు. --స్వరలాసిక (చర్చ) 10:15, 28 డిసెంబరు 2015 (UTC)
- మంచి విషయం తెలియజేసినందుకు స్వరలాసిక గారికి ధన్యవాదాలు. ఇదివరకే ఏక వచనం, బహువచనం గురించిన చర్చ జరిగింది. ఇకనైనా ఈ పద్ధతిని పాటిస్తే బాగుంటుంది.--Pranayraj1985 (చర్చ) 06:04, 29 డిసెంబరు 2015 (UTC)
- వికీ నియమాల ప్రకారం బహువచనం వాడరాదు. కొనసాగించే సభ్యులు బహువచనాన్ని ఏకవచనంగా సరిచేసి వ్యాసాన్ని విస్తరించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:16, 29 డిసెంబరు 2015 (UTC)
- ఏ వచనములో వ్రాయాలనుకునేవారు ఆ వచనములోనే మొత్తం వ్యాసము ఉండేటట్లు చూసుకోగలరు అని నా సలహా. JVRKPRASAD (చర్చ) 06:35, 29 డిసెంబరు 2015 (UTC)
- ప్రస్తుతం ఉన్న వ్యాసాలలో కొందరికి బహువచనం కొందరికి ఏకవచనం వాడారు. దీని గురించి చాలా చర్చలు జరిగాయి, అవి ఒక కొలిక్కి రాలేదు, కనుక ఎలా రాసేవారిని అలానే రాయనిద్దాం. కొందరికి గౌరవ పూర్వకంగా రాయాలని ఉంటుంది. కొందరికి ఉండదు..స్వరలాసిక గారు చెప్పినట్టు వ్యాసంలో ఎలా ఉంటే అలానే కొనసాగించాలి..--Viswanadh (చర్చ) 07:07, 29 డిసెంబరు 2015 (UTC)
- ఏ వచనములో వ్రాయాలనుకునేవారు ఆ వచనములోనే మొత్తం వ్యాసము ఉండేటట్లు చూసుకోగలరు అని నా సలహా. JVRKPRASAD (చర్చ) 06:35, 29 డిసెంబరు 2015 (UTC)
- వికీ నియమాల ప్రకారం బహువచనం వాడరాదు. కొనసాగించే సభ్యులు బహువచనాన్ని ఏకవచనంగా సరిచేసి వ్యాసాన్ని విస్తరించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:16, 29 డిసెంబరు 2015 (UTC)
- ఇదంతా పాలసీ చర్చవైపుకు సాగుతున్నట్టు అనిపిస్తోంది. చాలా ఉపయుక్తమైన, చక్కని చర్చ జరుగుతోంది. --పవన్ సంతోష్ (చర్చ) 12:06, 30 డిసెంబరు 2015 (UTC)
Request
[మార్చు]Hello. My name is Gnosis from fa.wikipedia. I was hoping if you could be kind enough to translate en:Tehran Museum of Contemporary Art into Telugu language. Reading this article might also be useful. Thank You Gnosis (చర్చ) 06:08, 31 డిసెంబరు 2015 (UTC)
కథా రచయితల ప్రాజెక్టు విషయమై
[మార్చు]తెలుగులో కథా రచయితల గురించిన వివరాలను దశాబ్దాలుగా కథానిలయంగా సేకరించి భద్రపరుస్తున్నారు. ఈ సమాచారాన్ని ఉపయోగించి కథారచయితల గురించి తెవికీలో వ్యాసాలు రాయాలనే కథానిలయం ప్రాజెక్టు గురించి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ప్రణాళికలో భాగంగా యాంత్రికంగా గూగుల్ డాక్యుమెంట్లలో రచయితల గురించి దొరుకుతున్న సమాచారాన్ని వినియోగించి మౌలికంగా వ్యాస నిర్మాణాన్ని తయారుచేసి పెడతామని, దాన్ని పరిశీలించి ప్రాజెక్టుపై ఆసక్తికల తెవికీపీడియన్లు వ్యాసాన్ని సృష్టించి, అభివృద్ధి చేస్తారని గతంలో అనుకున్న అంశం. ఈ ప్రాజెక్టు గురించి సముదాయ సభ్యులు ప్రస్తుతం ఆసక్తిగా ఉన్నారా? ఇది జరగాలని కోరుకుంటున్నారా అన్నది తెలుసుకోదలచాము. దానికి సంబంధించి అభిప్రాయాలు తెలపాలని కోరుతున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:16, 1 జనవరి 2016 (UTC)
- కథా రచయితల ప్రాజెక్టు గురించి చాలాసార్లు నేను చర్చకు లేవదీశాను. దాని ద్వారా సుమారు 13000 మంది కథారచయితల వ్యాసాలు తయారౌతాయని విష్ణుగారు చెప్పేవారు. ఆపనికి రహ్మానుద్దీనుకు అప్పగించానని 2-3 నెలలలో పూర్తిచేస్తామని తెలియజేశారు. కానీ కొంతకాలం కథానిలయం వారి వెబ్ సైటు కాపీహక్కుల సమస్యను కారణంగా కార్యక్రమం ముందుకు సాగలేదు. నేను రహ్మానుద్దీను ను కొంతకాలం వేచిచూచిన పిదప ప్రశ్నించగా; నాకు ఆ జాబితాను గూగుల్ డాక్యుమెంట్లలో లింకునిచ్చి; నన్నే అందులోని సమాచారాన్ని ఉపయోగించి వ్యాసాలను తయారుచేయమన్నాడు. కానీ ముందు తెలియజేసిన విధానమిది కాదు. A2K ద్వారా సులువుపద్ధతిలో ఆయా వ్యాసాలను (1-2 పేరాలు మరియు ఒక సమాచారపెట్టెతో సహా 2-3 కె.బి.ల మధ్యన) సృష్టిస్తామని; వాటిని కార్యక్రమంలో పాల్గొనే వాడుకరులు వాటిలోని తప్పుల్ని సవరించి; తెవికీలో వ్యాసాల్ని తయారుచేయమని చెప్పారు. ప్రస్తుత పరిస్థితి ఏమిటో మీరే వివరించండి.--Rajasekhar1961 (చర్చ) 06:21, 1 జనవరి 2016 (UTC)
- రాజశేఖర్ గారూ ఈ చర్చను లేవనెత్తింది సముదాయానికి ఈ అంశం మరోమారు ఆన్-వికీ తెలియపరిచి మీ అందరి ఆమోదం, అభిప్రాయం, సూచనలు ఎలావున్నాయో తెలుసుకునే సదుద్దేశంతోనే. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:24, 1 జనవరి 2016 (UTC)