వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 51
← పాత చర్చ 50 | పాత చర్చ 51 | పాత చర్చ 52 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2016 జూన్ 29 - 2016 ఆగస్టు 9
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92, 93 |
గ్రామ వ్యాసాల అభివృద్ధి... వాటిలో ఫోటోలను చేర్చడము గురించి
[మార్చు]గత నెల రచ్చబండ చర్చ (49 వ పుట క్రమసంఖ్య 9) లో పై విషయముపై మేము ఒక ప్రతిపాధన చేశాము. గ్రామ వ్యాసాలు చాల వరకు మొలక స్థాయికి మించి లేవు. ఫోటోలు లేవు, మరియు రెఫరెన్సులు కూడ తక్కువగా వున్నాయి. వాటిని సమగ్ర వ్యాసాలుగా ఆభివృద్ధి చేసి తగు ఫోటోలను, రెఫరెన్సులను చేర్చి ఆభివృద్ధి చేయడానికి ఒక ప్రణాలిక రూపొందించి సహకారము అందించమని, ప్రస్తుత వాడుకరలను, మరియు క్రొత్తవారిని కోరుతూ రచ్చబండలో పెట్టాము. దానికి వాడుకరలనుండి గాని, కొత్తవారి నుండి గాని అనుకున్నంత స్పంధన రాలేదు. గ్రామాలకు వెళ్లి ఫోటోలు తీసి, పెట్టడము ఖర్చుతో కూడిన పని గనుక దానికి తగిన ధనము మరియు ఇతరములు సమకూర్చమని కూడ సి.ఎస్.కే వారికి కూడ ప్రతిపాధనలు పంపించాము. వారి నుండి కూడ స్పంధన లేదు. ఈ ప్రణాళిక నిర్వహుకులుగా, వున్న మేము (భాస్కరనాయుడు మరియు గుళ్ళపల్లి నాగేశ్వర రావు) ఈ ప్రణాళిక అమలులో వున్న సాధ్యాసాధ్యాలను పరిశీలించ దలచి అందులోవున్న కష్టనష్టాలను బేరీజు వేసే వుద్ధేశముతో ముందుగా అనుకున్నట్లు జూన్ 2016 మొదటి వారములోనే పని ప్రారంబించాము. రోజుకు సుమారు 50 గ్రామ వ్యాసాలను అభివృద్ధి చేస్తూ వాటికి తగు రెఫరెన్సులు ఇస్తూ మొలక స్థాయి నుండి చాల ఎక్కువగా వాటి పరిధిని దాటించాము. ఆ విధంగా జూన్ 2016 నెలలో సుమారు 1500 గ్రామ వ్యాసాలు వాటి బైట్ల పరంగా చెప్పుకోదగ్గ స్థాయికి చేరాయి. ఇది మొదటి దశ. ఇక రెండో దశ గ్రామాలకు వెళ్లి అక్కడి ఫోటొలను తీసి, కామన్సులో ఎక్కించి తర్వాత వాటిని ఆ యా గ్రామాలలో చేర్చడము. ఇది డబ్బు ఖర్చుతోను, శారీరిక శ్రమ మరియు పరికరముల అందుబాటు (కెమరా వంటివి) తో కూడుకున్న పని. అయినా ఇందులో సాద్యాసాధ్యాలను పరిశీలించే ఉద్దేశముతో ముందుకెళ్ళ దలచి వ్యక్తిగతంగా డబ్బు మరియు కెమరా వంటి ఇతర వనరులు సమ సమకూర్చుకొని ఈ నెల 26 ఆదివారము నాడు 10.30 గంటలకు బయలుదేరి సమీపములోని రంగారెడ్డి జిల్లాలోని మండలాలకు వెళ్ళాము.
ఆవిధంగా ఆరోజున రంగారెడ్డి జిల్లాలోని నాలుగు మండలాలలోని 21 గ్రామాలను సందర్శించి ఆ యా గ్రామాలలో మనకు కావలసిన ఫోటోలను తీసుకొచ్చాము. మేము పర్యటించిన మండలాలు ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల్, మరియు హయత్ నగర్ మండలాలు. పర్యటించిన గ్రామాలు ఇబ్రహీం పట్నం., మాధాపూర్, మంగల్పల్లి, నందివనపర్తి, జాపాల్, పోచారం, యాచారం, చౌదర్ పల్లి, తుర్క యాంజాల్, మల్కీజ్ గూడ, గునగల్, మంచాల్, ఉప్పరిగూడ, గుండ్లమల్లయ్యగూడ, కమ్మగూడ, సేరిగూడ, రంగాపూర్, తులెకుర్దు, నోముల, రాగన్నగూడ మరియు పటేల్ గూడ. ఈ ప్రయాణములో సుమారు 160 ఫోటోలను తీశాము, సుమారు 200 కి.మీటర్ల వరకు తిరిగాము. దీనికి గాను మాకు ఒక్క రోజుకు వ్వక్తిగతంగా అయిన ఖర్చు సుమారు 3,500 రూపాయలు. (కారుకు, డ్రైవరకు మరియు భోజనాలకు మాత్రమె) తీసిన ఫోటోలను కామన్స్ లో ఎక్కించడము కూడ పూర్తయినది. గమనించ వచ్చు. ఇక వాటిని ఆయా గ్రామ వ్యాసాలలో వీలు వెంబడి ఎక్కిస్తాము. మేము తీసిన కొన్ని పోటోలను ఇక్కడ పెడుతున్నాము.చూడండి.
రంగారెడ్డి జిల్లాలోని నాలుగు మండలాలలో తీసిన కొన్ని చిత్రాలు |
ఈ ప్రణాళిక/ప్రయాణములో మాకు కలిగిన అనుభవమేమంటే........
[మార్చు]35000 పైగా వున్న గ్రామ వ్యాసాలు చాల కాలమునుండి చాల వరకు మొలక స్థాయిలోపలే వున్నాయి. వాటి ప్రాముఖ్యత గుర్తించి వాటిని తొలిగింపు జాబితాలో చేర్చలేదు. ఏదైనా చేసి వాటిని అభివృద్ధి చేయకుంటే ఎంతకాలమైనా అవి అలాగే వుండి పోతాయి. మొన్నటి మా అనుభవము ప్రకారము...... మాప్రణాలిక ప్రకారము నెలకు సుమారు 1500 వ్యాసాలను బైట్ల పరంగా పెద్ద వ్యాసాలుగా మార్పుచేయవచ్చు, సుమారు 160 ఫోటోలను చేర్చ వచ్చు. ఇతర లింకులు, రెఫరెన్సులు చేర్చ వచ్చు. తగు వనరులు సమకూర్చితే ఈ ప్రణాలిక మంచి ఫలితాలను తప్పక ఇస్తుందని మాకు కలిగిన అనుభవము వలన తెలిసింది.
ఈ ప్రతిపాధనకు కావలసిన వనరులు సి.ఐ.ఎస్.కె నుండి.
[మార్చు]నెలకు నాలుగు రోజులు గ్రామాలలో పర్యటించడానికి ఒక్క రోజుకు సుమారు 4 వేల నుండి 5 వేల రూపాయలు ఖర్చవుతుంది (దూరము ఎక్కువయ్యేకొలది ఖర్చు ఎక్కువవుతుంది అనే ప్రతిపాదికన) ప్రతి ఆదివారము గ్రామ పర్యటన, మిగతా రోజులలో గ్రామాల వ్యాసాభివృద్ది, పోటోలను ఎక్కించడము చేయ వచ్చు. అనగా నెలకు సుమారు 20, వేల రూపాయలు ఖర్చు. దీనికి అధనముగా ఒక మంచి కెమెరాను సమకూర్చాలి. ఎలాగు గ్రామాలలో పర్యటిస్తున్నాము గనుక అక్కడి వారికి వికీపీడియా పై అవగాహన కలిగించడానికి ఒక చిన్న చేపుస్తకమును అక్కడి వారికి సమకూర్చ గలిగితే మన పర్యటన సమగ్రమౌతుంది. సహ సభ్యులు ఇంకేమైనా సలహాలివ్వవచ్చు.
చివరి విన్నపము.
[మార్చు]సముధాయానికి, సి.ఐ.ఎస్.కె వారికి, సహ వికీపీడియనులకు, ముఖ్యంగా మనకు అనుసంధాన కర్థగా వున్న పవన్ సంతోష్ గారికి......... ఈ ప్రణాళికను సమగ్రంగా చదివి జూన్ నెలలో ఈ విషయమై మేము చేసిన కృషిని గమనించి (ఆదారాలతో సహా) తెవికీకి ఈ ప్రణాలిక ఉపయోగకరమనుకుంటే.... దీనిని సమర్దించి తగు వనరులు సమకూర్చే చర్యలు తీసుకోగలరు...... భాస్కరనాయుడు (చర్చ) 04:12, 29 జూన్ 2016 (UTC)(భాస్కరనాయుడు మరియు గుళ్ళపల్లి నాగేశ్వర రావు).
అభిప్రాయాలు
[మార్చు]- నిజంగా అభినందించవలసిన మంచి ప్రయత్నం. మీ కృషికి ధన్యవాదాలు.Palagiri (చర్చ) 06:55, 29 జూన్ 2016 (UTC)
- మీరిద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి కృషి ఇంతకు ముందెవరూ తెవికీలో చేయలేదు. కానీ మీకు చాలా శ్రమ అవుతుందేమో (మీ ఆరోగ్యం గురించి కూడా). ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఫండింగ్ కు ప్రయత్నించి ముందుకు తీసుకొనిపోతే బాగుంటుంది. పవన్ తో చర్చించి సి.ఐ.ఎస్.ను సంప్రదించండి. ధనసహాయం తప్పకుండా చేయాల్సిన ప్రాజెక్టుగా నాకు అనిపిస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు సుళువుగా చేయవచ్చును. కానీ దూరంగా ఉండే జిల్లాలకు చేరుకోవడానికి, అక్కడ ప్రయాణానికి అనువైన వ్యక్తి మరియు వాహనం సంపాదించుకోవడం కీలకం. తెవికీలో ఇదొక చారిత్రాత్మకమైన పనిగా మిగిలిపోవాలని నా అభిలాష.--Rajasekhar1961 (చర్చ) 07:25, 29 జూన్ 2016 (UTC)
- భాస్కరనాయుడు గారూ ఫలితం ఒకటే అయినా ప్రణాళిక విషయంలోనూ, బడ్జెట్ విషయంలోనూ ప్రధానమైన మార్పులు ఉన్నప్పుడు (నా అవగాహన మేరకు ఫోటో కాంటెస్ట్ అన్నది గ్రామాల పర్యటన-ఫోటోల సేకరణ అవుతోంది కదా) రచ్చబండలో అప్డేట్ చేసినట్టుగానే, మీరు గత ప్రతిపాదన సమర్పించిన సీఐఎస్-ఎ2కె రిక్వెస్ట్ పేజీలో కూడా ఆయా విషయాల్లో గల మార్పులను సూచిస్తూ రాయమని మనవి. --పవన్ సంతోష్ (చర్చ) 08:16, 29 జూన్ 2016 (UTC)
- భాస్కరనాయుడు మరియు నాగేశ్వరరావుల కృషికి అభినందనలు. అనేక సంవత్సరాలుగా మొలకలుగా ఉన్న అనేక గ్రామవ్యాసాలకు మూలాలను, విషయాన్ని చేర్చి మొలక స్థాయి దాటించారు. ఇప్పుడు ఫోటోలు జతపరచే మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజంగా అభినందించవలసిన మంచి ప్రయత్నం. మీ కృషికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సి.ఐ.ఎస్. సహకారమందిస్తే బాగుంటుంది. ఈ ప్రాజెక్టు తెలుగు వికీపీడియాలో చారిత్రాత్మకంగా మిగిలిపోవాలని నా ఆకాంక్ష.--
కె.వెంకటరమణ⇒చర్చ 09:36, 30 జూన్ 2016 (UTC)
- చాలా మంచి కార్యక్రమం. దీనికి సి.ఐ.ఎస్. తప్పకుండా సహకారమందిస్తుందని నా అభిప్రాయం. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటాను. --Pranayraj1985 (చర్చ) 10:21, 1 జూలై 2016 (UTC)
- గతంలో నేను ఈ విషయంలో కొంత కృషి చేసి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన చిత్రాలు, నా చిత్రాలుకొన్ని తెవికీకి సమర్పించాను. ఇది మంచి కార్యక్రమం. దీనికి నా మద్దతు, అభినందనలు కూడా...---నాయుడుగారి జయన్న (చర్చ) 14:06, 1 జూలై 2016 (UTC)
నాకు హెలికప్తర్ ఇస్తీ ప్రతి ఆదివరం ఒక్ ఒక్ జిల్ల తిరిగి ఫొతొలు తిస్తాను.ఒక్క రొజుకి హెలికాప్తర్ కిరయ్ 10 లక్ షలు.మొత్తం 10 జిల్లలకు ఒక కోతి మత్రం ఖర్చు అవుతుంది. ఆ తర్ వాత్ ప్రతి రష్త్రం ప్రతి దెషం కూద ప్లేను లొ తిరుగు తాను.దాంకి 10 కొత్లు ఖర్ చు అవుత్ ది. రాకెత్ల ఇతర గ్రహలు కూద తిరుగి ఫొతొలు తిస్తను. దినికి 1000 కోత్లు ఖర్చ అవుది. మజూరు చెయగర తొందర్ గ. తిందనికి ఖర్చ్ నెనె పెత్తుకుంత కెవల్ం హెలికాప్తర్, ప్లేను, రాకెత్ ఖర్చు మత్రమె మిరు ఇవ్వల/ / మి ఆన్ంద్
Compact Links coming soon to this wiki
[మార్చు]Please help translate to your language

Hello, I wanted to give a heads up about an upcoming feature for this wiki which you may seen already in Tech News. Compact Language Links has been available as a beta-feature on all Wikimedia wikis since 2014. With compact language links enabled, users are shown a much shorter list of languages on the interlanguage link section of an article (see image). This will be enabled as a feature in the coming week for all users, which can be turned on or off using a preference setting. We look forward to your feedback and please do let us know if you have any questions. Details about Compact Language Links can be read in the project documentation.
Due to the large scale enablement of this feature, we have had to use MassMessage for this message and as a result it is only written in English. We will really appreciate if this message can be translated for other users of this wiki. The main announcement can also be translated on this page. Thank you. On behalf of the Wikimedia Language team: Runa Bhattacharjee (WMF) (talk)-12:57, 1 జూలై 2016 (UTC)
Wikipedia to the Moon: invitation to edit
[మార్చు]Three weeks ago, you were invited to vote on how to take Wikipedia articles to the Moon. Community voting is over and the winning idea is to send all ‘’featured articles and lists’’ to the Moon. This decision means that, starting today, Wikipedians from all language communities are warmly invited to intensively work on their best articles and lists, and submit them to Wikipedia to the Moon. The central site to coordinate between communities will be Meta-Wiki. You will find an overview and more information there. Hopefully, we will be able to represent as many languages as possible, to show Wikipedia’s diversity. Please feel kindly invited to edit on behalf of your community and tell us about your work on featured content!
Best, Moon team at Wikimedia Deutschland 14:10, 1 జూలై 2016 (UTC)
వికీమీడియా ఫౌండేషన్ వారి కొత్త ప్రాజెక్ట్ గ్రాంట్లు
[మార్చు]వికీమీడియా ఫౌండేషన్ ప్రాజెక్ట్ గ్రాంట్ ప్రోగ్రాంకు జూలై 1 నుంచి ఆరంభిస్తున్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి వికీపీడియా మరియు ఇతర వికీమీడియా ప్రాజెక్టులు అభివృద్ధి చేసే ప్రతిపాదనలు దీని క్రింద అంగీకరిస్తారు. <https://meta.wikimedia.org/wiki/Grants:Project>. ప్రాజెక్టు గ్రాంట్లు ఇండివిడ్యువల్ ఎంగేజ్మెంట్ గ్రాంట్లు (ఐఈజీ) మరియు ప్రోగ్రాం & ఈవెంట్ గ్రాంట్లు (పీఈజీ)ల స్థానంలో వస్తుంది.
వ్యక్తులు, సమూహాలు, సంస్థలు - కొత్త ఉపకరణమో, గాడ్జెట్ తయారుచేసేందుకో, మరింత మెరుగైన పద్ధతిని మీ వికీలో నిర్వహించేందుకు, ఒక ప్రధానమైన అంశంపై పరిశోధించేందుకో, వరుసగా కొన్ని ఎడిటథాన్లు నిర్వహణను సమన్వయం చేసేందుకో, సముదాయాన్ని సశక్తియుతం చేసేందుకు (కమ్యూనిటీ బిల్డింగ్) మరేదైనా మద్దతు కల్పించేందుకో కొత్త ప్రయోగాలు చేయడానికి కానీ, నిరూపణ పొందిన ఐడియాలు ఆచరణలో పెట్టేందుకు కానీ నిధులు (ఫండ్స్) అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం వేధింపులను గురించిన ఇన్స్పైర్ కాంపైన్ నుంచి ఐడియాలను కూడా స్వాగతిస్తున్నాం. <https://meta.wikimedia.org/wiki/Grants:IdeaLab/Inspire>
మీ వద్ద ఏదైనా మంచి ఐడియా ఉండి దరఖాస్తు (అప్లై) చేయడానికి ముందు మీరు ఆ ఐడియా మీద ఫీడ్ బాక్ కోరుకుంటున్నారా? వాలంటీర్లూ, సిబ్బందీ మీకు సలహాలు, మార్గదర్శకాలు ఇచ్చి, దాన్ని లైవ్ చేసేందుకు వీలుగా ఐడియా ల్యాబ్ లో పెట్టండి. <https://meta.wikimedia.org/wiki/Grants:IdeaLab> ఒకసారి మీ ఐడియా సిద్ధమైతే, అది తేలిగ్గా గ్రాంట్ రిక్వెస్ట్ కు తరలించవచ్చు.
ప్రాజెక్ట్ గ్రాంట్స్ ఓపెన్ కాల్ గురించి నిజ జీవిత తరహా చర్చలకు మార్టీ జాన్సన్ మరియు అలెక్స్ వారంవారీ ప్రతిపాదనల క్లినిక్స్ హ్యాంగవుట్స్ లో అందుబాటులో వుంటారు. మీ ప్రశ్నలకు సమాధానాలిచ్చి, మీ ప్రతిపాదనలు మెరుగుపరిచేందుకు సహకరిస్తారు. తేదీలు, సమయాలు ఇలా ఉన్నాయి.
- గురువారం, జూలై 5 - 16:00 UTC
- గురువారం, జూలై 14 - 02:00 UTC
- బుధవారం, జూలై 20 - 15:00 UTC
- శుక్రవారం, జూలై 29 - 02:00 UTC
- మంగళవారం, ఆగస్టు 2 - 01:30 UTC
- మంగళవారం, ఆగస్టు 2 - 16:00 UTC
హ్యాంగవుట్స్ కు సంబంధించిన లంకెలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి: <https://meta.wikimedia.org/wiki/Grants:IdeaLab/Events#Upcoming_events>
మన సముదాయానికి మద్దతునిచ్చే, వికీమీడియా ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రభావం చూపే గ్రాంట్ ఐడియాల కోసం వికీమీడియా ఫౌండేషన్ కమ్యూనిటీ రీసోర్సెస్ జట్టు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మీ ఐడియాలకు కదలిక తెచ్చి జూలై 1 నుంచి ఆగస్టు 2 మధ్య కాలంలో సమర్పించండి! <https://meta.wikimedia.org/wiki/Grants:Project/Apply>
అలెక్స్ (awang@wikimedia.org) లేదా మార్టి జాన్సన్ (mjohnson@wikimedia.org)లకు మీ ప్రాజెక్టును ప్రారంభించే అంశంపై ప్రశ్నలతో రాయవచ్చు! --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:56, 1 జూలై 2016 (UTC)
- పవన్, విశ్వనాథ్ ల తర్వాత మరొక IEG project కి సభ్యుల్లో ఎవరైనా ఆసక్తి కలవారుంటే దయచేసి తెలియజేస్తే ; మేము సహాయం అందించగలము. సమయం తక్కువగా ఉన్నందున త్వరగా స్పందించమని మనవి.--Rajasekhar1961 (చర్చ) 10:41, 8 జూలై 2016 (UTC)
Punjab Edit-a-thon : WikiConference India 2016
[మార్చు]
Hello
Greetings from WikiConference India team.
An edit-a-thon is being conducted with an aim to create or improve articles related to Punjab. This edit-a-thon is a part of WikiConference India 2016. You and your community are cordially invited to join this edit-a-thon as participants or co-ordinators. This will be our gift for the Chandigarh team which is hosting us for the conference. The community that adds most number of words or bytes to the articles will be awarded a trophy during the conference!
Participate or learn more here.
Thank you. -- WikiConference India team (Discuss) sent using MediaWiki message delivery (చర్చ) 09:15, 2 జూలై 2016 (UTC)
పంజాబ్ ఎడిటథాన్
[మార్చు]అందరికీ నమస్కారం,
పంజాబ్ కు సంబంధించిన వ్యాసాలు సృష్టించడానికి, అభివృద్ధి చేయడానికి ఒక బహుభాషా ఎడిటథాన్ జరుగుతోంది. ఇది వికీకాన్ఫరెన్స్ ఇండియా 2016లో భాగంగా జరుగుతోంది. తమ నగరంలో ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తున్న ఛండీగఢ్ జట్టుకు ఇది బహుమతి. భారతదేశంలోని వివిధ భాషా సముదాయాలు చేస్తున్న ఈ ఎడిటథాన్లో భాగంగా వ్యాసాల్లో ఎక్కువ పదాలు, బైట్లు చేరుస్తున్న సముదాయానికి కాన్ఫరెన్సులో ట్రోఫీని అందజేస్తారు. ఎడిటథాన్లో భాగంగా పంజాబ్ కు చెందిన వ్యాసాలు సృష్టించి, అభివృద్ధి చేస్తామని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 11:08, 3 జూలై 2016 (UTC)
- చేరడానికి ఇక్కడ చూడండి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:52, 3 జూలై 2016 (UTC)
- వికీ మిత్రులకు, పంజాబ్ ఎడిటథాన్ 6 ఆగష్టు 2016 వరకు పొడగించారు. మీరు వ్యాసాలు మార్పులు/సృష్టించడానికి 6 ఆగష్టు వరకు వ్యాసాలు విస్తరించవచ్చు. చూడండి JVRKPRASAD (చర్చ) 07:39, 30 జూలై 2016 (UTC)
- చేరడానికి ఇక్కడ చూడండి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:52, 3 జూలై 2016 (UTC)
వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ జూలై 10, 2016 సమావేశం
[మార్చు]అందరికి నమస్కారం...వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ జూలై 10, 2016 సమావేశం… జూలై 10, 2016 (రెండవ ఆదివారం) నాడు ఉదయం గం. 10.30 ని.లకు హైదరాబాద్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో ఏర్పాటు చేయబడుతుంది.
చర్చించాల్సిన అంశాలు
[మార్చు]- గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
- 12వ వార్షికోత్సవ నిర్వాహణ
- తెలంగాణా ప్రభుత్వ డిజిటల్ మీడియాతో కలసి పనిచేసే ప్రతిపాదనలు
- భవిష్యత్ ప్రణాళిక
సభ్యులు హాజరుకాగలరు. వివరాలకు వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ జూలై 10, 2016 సమావేశం లో చూడగలరు.--Pranayraj1985 (చర్చ) 09:46, 4 జూలై 2016 (UTC)
- ఇక్కడ సమయం 10.30 అని ఉంది. పై లంకెలో ఉన్న పేజీలో మధ్యాహ్నం 2గంటలు అని ఉంది. ఏది సరైనది?--స్వరలాసిక (చర్చ) 08:06, 8 జూలై 2016 (UTC)
- సభ్యులు క్షమించాలి. గత నెల సమావేశపు పేజీలో ఉన్నదాన్ని ఈ నెల సమావేశపు పేజీలోకి కాపీ చేయడంవల్ల సమయం విషయంలో పొరపాటు జరిగింది. చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ నెల సమావేశంను మధ్యాహ్నం 2 గంటలనుండి నిర్వహించాలనుకుంటున్నాము. సభ్యులు సహకరించగలరు...--Pranayraj1985 (చర్చ) 08:13, 8 జూలై 2016 (UTC)
వ్యాసాలకు తెలుగు పేర్లా? ఆంగ్ల లిప్యంతరీకరణా?
[మార్చు]తెలుగు 'అజంత భాష '(అచ్చుతో అంతమయ్యే భాష). తెలుగు వికీపీడియాలోని వ్యాసాలకు తెలుగు పేర్లు ఉంటే బాగుంటుంది. కానీ చాలా తెలుగు వ్యాసాలకు, ముఖ్యంగా గ్రామ వ్యాసాలకు(ఉదా: మానోపాడు కు బదులుగా మానోపాడ్) ఆంగ్ల లిప్యంతరీకరణే శరణ్యమయ్యింది. ఆంగ్లేయులు రాకముందే తెలుగు నేలలో ఊర్లున్నాయి. వాటికి పేర్లు ఉన్నాయన్న విషయం ఎవరికి తెలియనిది కాదు. తెలుగుకు అనుగుణంగా ఆంగ్లంలో రాసుకోవలసినది పోయి, ఆంగ్లానికి అనుగుణంగా తెలుగులో పేర్లు పెట్టుకొనే పరిస్థితి రావడం బాధాకరం. ఇది ఇప్పటికిప్పుడు వికీపీడియాకు పెద్ద సమస్య కాకపొవచ్చు గానీ, తెలుగు భాషకు మాత్రం ఎప్పటికో ఒకప్పటికి తీరని ద్రోహం చేసినట్లే. ఆంగ్లాన్ని అనుసరిద్దామా? తెలుగు దనాన్ని నిలుపుకుందామా?---నాయుడుగారి జయన్న (చర్చ) 04:47, 7 జూలై 2016 (UTC)
- తెవికీ వ్యాసాల పేర్లలో ఈ సమస్యను ఇంతకుముందు సభ్యుల దృష్టికి తీసుకొని వచ్చాను. కొన్నింటిని మార్చాను. వ్యక్తిగతంగా నాకు స్వచ్చమైన అజంత తెలుగు భాషకు అనుగుణంగా వ్యాసాల పేర్లు ఉంటేనే బాగుంటుంది. అదేమంత కష్టమైన పని కాదు. (మరో ఉదాహరణ: కొత్తపేట్ మరియు కొత్తపేట) గ్రామాల పేర్లలో దీనిని సుళువుగా సాధించవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 05:05, 7 జూలై 2016 (UTC)
ఇది అతి స్వల్ప విషయమైనా చాల ప్రథానమైన విషయము అని నాభావన. ఆ పేర్లు ఖచ్చితంగా అజంతముగా వుండాలి. కాని ఇప్పుడు మారిస్తే ఆ పేరు ఎర్ర లింకు వస్తుంది. అనగా ఆ ఊరు లేనట్టు చూపిస్తుంది. కనుక ఆ పేరును ముందుగా మార్చాలి. అది చేయ గలిగింది నిర్వహకులే. ఇంత లోపల అటువంటి పేర్లను అజంతంగా వ్రాస్తాను. సమయానుకూలంగా మొతటి పేరును మార్చ వచ్చు. ఈ మార్పు ప్రతి హలంతంగా వున్న గ్రామాలన్నిటికి మార్చ వలసిన అవసరము లేదని నా అభిప్రాయము. ఉదాహరణకు మేడ్చెల్ అనే గ్రామా నామాన్ని అజంతంగా వ్రాయదలిస్తే అది మేడ్చల్లు / మేడ్చల్ల/ మేడ్చెల అవుతుంది. ఇటువంటి వాటిని ఏలా వ్రాయాలనే సందిగ్దం కలుగు తుంది. అలాంటి వాటిని వదిలి ఊరు పేరు చివరన పేట్ అని వుంటే వాటిని మాత్రము పేట అని వ్రాయవచ్చు. మరికొన్ని ఉదాహరణలు చూడండి..... నర్సాపూర్ , నారాయణ ఖేడ్ , శనత్ నగర్ , బాలానగర్., వీటిని నర్సాపూరు అని గాని నర్సాపురం అని గాని వ్రాయవచ్చు. అలాగే శనత్ నగర్ ని శనత్ నగరు లేదా శనత్నగరం అని గాని వ్రాయవచ్చు. ఏది సరైనది???? కనుక ఇలాంటి వాటిని అలానే వుంచితేనే అందంగా వుంటుందని నా భావన. భాస్కరనాయుడు (చర్చ) 07:22, 7 జూలై 2016 (UTC)
- సభ్యులకు నమస్కారం. తెలుగు వాడిగానూ, తెలుగు భాషాభిమానిగానూ తెలుగు పదాలుగానే మిగిలిన భాషా పదాలు వాడుకలోకి రావాలని నేనూ కోరుకుంటున్నాను. రాజమండ్రిని రాజమహేంద్రవరంగా ప్రభుత్వం పేరు మార్చడం నాకు చాలా సంతోషం కలిగించింది. భవిష్యత్తులో ఇలాంటి మార్పులు కొనసాగాలనీ ఆశిస్తున్నాను. కానీ ఇలాంటి ఉద్యమానికి, సిద్ధాంత ప్రచారానికి తెలుగు వికీపీడియా మార్గం కాదని నా అభిప్రాయం. పైగా గ్రామాలు, పట్టణాల పేర్లు ఈ రకంగా మార్చడం చాలా ఇబ్బందికరం. పైన భాస్కరనాయుడు గారు ఇచ్చిన ఉదాహరణ పరిశీలించినా నర్సాపూర్ నూ, నరసాపురాన్ని ప్రజలు వేర్వేరుగా గుర్తుపడతారు. ఇది అలా ఉంచితే ప్రజల్లో కానీ, ప్రభుత్వ రికార్డుల్లో కానీ లేని పేరును పెట్టడం విజ్ఞాన సర్వస్వ వ్యాసానికి శోభనివ్వదని నా నమ్మకం. --పవన్ సంతోష్ (చర్చ) 07:40, 8 జూలై 2016 (UTC)
అచ్చుతోఅంతమయ్యేభాష , వినసొంపుగా వుంటుంది గనుక తెలుగును ఇటలీ భాషతో పోల్చారు హెన్రీ మారిస్. సాద్యమైన వాటిని మాత్రమే మార్చగలం. కొన్నిపదాలు మార్చటం సాద్యం కాదు అలాంటి పదాలను మార్చేప్రయత్నం చేయటం మంచి సంప్రదాయం కాదు. --Nrgullapalli (చర్చ) 08:48, 8 జూలై 2016 (UTC)
- ఈ చర్చను నిర్ధిష్టమైన ఊరి పేరు గురించిన చర్చగా ఆయా ఊర్ల చర్చా పేజీలలో కొనసాగిద్దాము. సభ్యులను సహకరించమని మనవి.--Rajasekhar1961 (చర్చ) 10:37, 8 జూలై 2016 (UTC)
Compact Language Links enabled in this wiki today
[మార్చు]Please help translate to your language

Compact Language Links has been available as a beta-feature on all Wikimedia wikis since 2014. With compact language links enabled, users are shown a much shorter list of languages on the interlanguage link section of an article (see image). Based on several factors, this shorter list of languages is expected to be more relevant for them and valuable for finding similar content in a language known to them. More information about compact language links can be found in the documentation.
From today onwards, compact language links has been enabled as the default listing of interlanguage links on this wiki. However, using the button at the bottom, you will be able to see a longer list of all the languages the article has been written in. The setting for this compact list can be changed by using the checkbox under User Preferences -> Appearance -> Languages
The compact language links feature has been tested extensively by the Wikimedia Language team, which developed it. However, in case there are any problems or other feedback please let us know on the project talk page. It is to be noted that on some wikis the presence of an existing older gadget that was used for a similar purpose may cause an interference for compact language list. We would like to bring this to the attention of the admins of this wiki. Full details are on this phabricator ticket (in English).
Due to the large scale enablement of this feature, we have had to use MassMessage for this announcement and as a result it is only written in English. We will really appreciate if this message can be translated for other users of this wiki. Thank you. On behalf of the Wikimedia Language team: Runa Bhattacharjee (WMF) (talk)-03:03, 8 జూలై 2016 (UTC)
2011 జనగణనతో గ్రామవ్యాసాల్లోకి మరింత సమాచారం
[మార్చు]తెలుగు గ్రామవ్యాసల్లోకి మరింత సమాచారాన్ని చేర్చి మొలక స్థితి నుంచి అభివృద్ధి చేసేందుకు 2011 జనగణనల సమాచారాన్ని మరింత వినియోగించుకోవాలని ప్రయత్నం. ప్రముఖ పర్యావరణవేత్త పద్మభూషణ్ మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలోని బృందం 2011 భారత జనగణన సమాచారాన్ని ఆధారం చేసుకుని వికీ మార్కప్ కోడ్ లో వికీపీడియాకు ఉపకరించే గ్రామ, పట్టణ సమాచారాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వీరితో భాగస్వామ్యమై ఆంగ్లంలో వారు ఇచ్చిన ప్రధానమైన కొన్ని పదాలు, వాక్యాలకు అనువాదం మనం సూచిస్తే, దాని ఆధారంగా వికీపీడియా గ్రామ వ్యాసాలకు, పట్టణ వ్యాసాలకు ఉపకరించే సమాచారాన్ని తయారుచేసి వేరేచోట ప్రచురిస్తారు. దీన్ని మనం మానవీయంగా చదువుకుని వ్యాసంలో ప్రచురించుకోవడానికి అనువైన విధంగా మలచుకోవచ్చు. ఈ వ్యాసాలు ఉంచే దస్త్రాలు రాష్ట్రాల వారీగా ఉంటాయి. ప్రస్తుతానికి కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల గ్రామ, పట్టణ వ్యాసాలను ఇక్కడ చూడొచ్చు. ఇవి ఆంగ్లంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రధాన స్థానిక భాషల్లోనూ ఉన్నాయి. ఆంగ్లంలోని ఆయా వ్యాసాలు సభ్యులు చదివి చూడవచ్చు.
ఈ ప్రాజెక్టులో ముందస్తు పరిశీలన, ప్రచురణ మానవీయంగా వికీపీడియన్ల చేతిలోనే ఉండడం, సమాచారం మూలాల సహితంగా - అదీ జనగణన సమాచారాన్ని ఆధారం చేసుకుని ఉండడం, దీని వల్ల గ్రామ వ్యాసాల్లో మొలక స్థాయి దాటి సమాచారం వచ్చి చేరటం వంటివి కలిసివస్తాయని ఆశిస్తున్నాం. ఐతే సమాచారం ఏమేరకు ఉపకరిస్తుందన్నది వికీపీడియన్లు పరిశీలించి అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 02:08, 10 జూలై 2016 (UTC)
- చాలా బావుంది. ప్రాజెక్టుకు ఎలాంటి సహాయం మనం చేయగలమో కొంత వివరిస్తే ముందుకు వెళ్ళవచ్చు. కన్నడ నుండి గూగుల్ ట్రాంస్లేటర్ ద్వారా అనువాదం కూడా ఆంగ్లం కంటే చాలా బాగా వస్తున్నది.వాటిని కూడా మనం తెలుగుకు వాడుకోవచ్చు.--Viswanadh (చర్చ) 04:37, 10 జూలై 2016 (UTC)
- కర్ణాటక గ్రామాలు చూసాను. విషయము చాల విపులముగా వున్నది. అందులో కొంత భాగము మనకు అనవసరమనిపిస్తున్నది. అయినా, అందులో మనకు కావలసినది మాత్రమే తీసుకొన వచ్చునులే. మనము చేయవలసిన, చేయగలిగినది ఏమిటో చెప్పండి. భాస్కరనాయుడు (చర్చ) 04:42, 11 జూలై 2016 (UTC)
- ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. దీని గురించి ఇంకా విపులంగా చర్చిస్తే బాగుంటుంది.--Pranayraj1985 (చర్చ) 13:53, 13 జూలై 2016 (UTC)
- ప్రణయ్ రాజ్, విశ్వనాథ్, భాస్కరనాయుడు గార్లు తమ అభిప్రాయాలు తెలియజేసినందుకు, ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు. భాస్కరనాయుడు గారూ అక్కడ కర్ణాటక దస్త్రాలు కనుక కన్నడం, ఇంగ్లీష్ భాషల్లో ఉన్నాయి. తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల గ్రామాల వ్యాసాలైతే తెలుగు, ఆంగ్ల భాషల్లోనే ప్రచురితమవుతాయి. మనం గూగుల్ ట్రాన్స్ లేట్ వాడవలసిన అవసరం ఉండదు. ఇక మరింత స్పష్టత, ఏం చేయగలమన్న అంశం కోరిన విశ్వనాథ్, ప్రణయ్ గార్లకు - ఈ ప్రాజెక్టు కోసం ఆంగ్లంలో వారు ఇచ్చే పదాలు, వాక్యాలు, వంటివి తెలుగులోకి అనువదించి ఇవ్వవలసి వుంటుంది. అది కూడా ఆ పదాలు, వాక్యాలు వాడి వ్యాసాలు సృష్టిస్తారన్న గమనికతో అనువదించాలి. ఇప్పటికే చాలావరకూ అనువాదం పూర్తైంది. ఆసక్తి చూపుతున్న పై ముగ్గురుకి, లేదా మరెవరైనా ఉంటే వారికీ కూడా ఆయా అనువాదాల ఫైళ్ళు పంచుకుంటాను. పరిశీలించి చూసి అంతా సరిపోతోందనుకుంటే ముందుకు వెళ్ళి వారికి అందిచవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:12, 15 జూలై 2016 (UTC)
- అన్నీ సరిగ్గానే ఉన్నాయి. ముందుకు వెళ్ళమని చెప్పవచ్చు. తదుపరి చిన్న తప్పులున్నా సరిదిద్దుకోవచ్చు..మంచి ప్రయత్నానికి అభినందనలు..--Viswanadh (చర్చ) 03:52, 16 జూలై 2016 (UTC)
కొణతం దిలీప్ తో మీటింగ్
[మార్చు]నేను మరియు పవన్ సుమారు 6 నెలల క్రిందట కొణతం దిలీప్ గార్ని సెక్రటేరియట్ లో కలిశాము: మా సమావేశంలో చర్చించిన అంశాలు.
- వారు ఆశిస్తున్నది:
- వికీపీడియాలో తెలంగాణా చరిత్ర, సంస్కృతి, వ్యక్తుల గురించి ఉండాల్సిన 100-150 వ్యాసాలను గుర్తించి, అభివృద్ధి చేయడం.
- ప్రతి జిల్లాలోనూ వికీపీడియా అవుట్ రీచ్ కార్యక్రమాలు చేపట్టడం, తద్వారా జిల్లాల్లోని వ్యక్తులు వికీపీడియన్లు కావడం.
- తెలంగాణా గురించి అంతర్జాలంలో నమ్మదగ్గ సమాచారం అభివృద్ధి చెందడం.
- వారు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది
- ప్రభుత్వం కాపీహక్కుదారుగా ఉన్న పలు ఫోటోలు, జీవోలు కామన్స్, వికీసోర్సుల ద్వారా విడుదల చేయడం
- తెలంగాణా ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాలు, కళాశాలతో కార్యక్రమాలు చేసేందుకు సహకారం అందించడం
- ఈ కార్యక్రమంపై పనిచేయడానికి ఆసక్తి కలిగిన మేధావులు, ఔత్సాహికులను ఒక తాటిపైకి తీసుకురావడం
- జర్నలిస్టులు, విద్యావేత్తలు వంటివారితో వర్క్ షాపులు వంటివి నిర్వహించుకునేలా ఆతిథ్యమివ్వడం
- రాష్ట్రస్థాయి వికీపీడియా వ్యాస రచన పోటీలు నిర్వహించేందుకు సహకరించడం
- వారు దేనికి ఆసక్తిచూపడం లేదు
- పుస్తకాలు, సోర్సులు వంటివి వికీసోర్సులో చేర్చే విషయంలో సహకారం అందించడానికి (దీనికి జీవోలు మాత్రమే మినహాయింపు).
- మన నుంచి ప్రస్తుతం ఆశిస్తోంది
- కొంత పరిశోధన జరిపి ప్రణాళిక తయారుచేయడం
- గతంలో ప్రభుత్వాలు వికీపీడియాలతో పనిచేసిన సందర్భం, ఎలా పనిచేశాయి వంటివి బెస్ట్ ప్రాక్టీసులు తెలియజేడం.--Rajasekhar1961 (చర్చ) 10:54, 15 జూలై 2016 (UTC)
ఈనాడు సమావేశం
[మార్చు]కొణతం దిలీప్ (తెలంగాణ ఐ.టి. డైరెక్టర్) తెవికీపీడియన్లతో కలవాలనుకుంటున్నారు. ఆసక్తి ఉన్నవారు రాగలరు.
- తేది: 15 జూలై (శుక్రవారం), 2016.
- సమయం: 3 గం.లకు,
- స్థలం: తెలంగాణ సచివాలయము
--Pranayraj1985 (చర్చ) 09:50, 12 జూలై 2016 (UTC)
అనువాదాల పేజీ విషయంలో సమస్య
[మార్చు]ఇన్నాళ్ళూ నేను కంటెంట్ ట్రాన్సిలేషన్ ద్వారా అనువాదాలు చేశాను. ఈవాళ దాదాపు 8.30 గంటల ప్రాంతం నుండి ఆ పేజీ లభించుటలేదు. సాంకేతిక సమస్య ఏర్పడినట్టుంది. తెలిసినవారు పరిశీలించగలరు.--Meena gayathri.s (చర్చ) 17:36, 12 జూలై 2016 (UTC)
- సమస్య తీరినట్లుంది చూడగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:15, 15 జూలై 2016 (UTC)
CIS-A2K Newsletter : May and June
[మార్చు]
Hello,
CIS-A2K has published their consolidated newsletter for the months of May and June, 2016. The edition includes details about these topics:
- Train-the-trainer and MediaWiki training for Indian language Wikimedians
- Wikimedia Community celebrates birthdays of Odia Wikipedia, Odia Wiktionary and Punjabi Wikipedia
- Programme reports of outreach, education programmes and community engagement programmes
- Event announcements and press releases
- Upcoming events (WikiConference India 2016)
- Articles and blogs, and media coverage
Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here. -- CIS-A2K (talk) sent using MediaWiki message delivery (చర్చ) 04:37, 14 జూలై 2016 (UTC)
కతిన చర్యలు
[మార్చు]నెను పెత్తిన ఇన్ ఫర్ మెషన్ ను దిలిత్ చెసిరు.వారిపయి కతిన చర్యల్కు తిసుకొనును / / మి అనంద్
IMPORTANT: Admin activity review
[మార్చు]Hello. A new policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc) was adopted by global community consensus in 2013. According to this policy, the stewards are reviewing administrators' activity on smaller wikis. To the best of our knowledge, your wiki does not have a formal process for removing "advanced rights" from inactive accounts. This means that the stewards will take care of this according to the admin activity review.
We have determined that the following users meet the inactivity criteria (no edits and no log actions for more than 2 years):
- Mpradeep (bureaucrat, administrator)
These users will receive a notification soon, asking them to start a community discussion if they want to retain some or all of their rights. If the users do not respond, then their advanced rights will be removed by the stewards.
However, if you as a community would like to create your own activity review process superseding the global one, want to make another decision about these inactive rights holders, or already have a policy that we missed, then please notify the stewards on Meta-Wiki so that we know not to proceed with the rights review on your wiki. Thanks, Rschen7754 06:40, 21 జూలై 2016 (UTC)
ఆనంద్ మార్పులు - తెవికీకి గుణపాఠాలు
[మార్చు]ఆనంద్ కొత్త సభ్యుడా, పాత సభ్యుడా అనే విషయం ప్రక్కన పెడితే ఆ సభ్యుడి దిద్దుబాట్లు ముఖ్యంగా రెండు విషయాలను తెలుపుతాయి. గ్రామవ్యాసాలలో ఇద్దరు సభ్యుల దిద్దుబాట్ల అసహనత మరియు తెవికీకే ఆశ కల్పించి డబ్బు ఆశించడం. పరిశీలించిన దిద్దుబాట్ల ఆధారంగా చెప్పాలంటే గ్రామవ్యాసాలలో చేర్చుతున్న సమాచారం చాలా ఘోరంగా ఉంది. సమాచారం లభ్యమౌతుంది కదాని తప్పులతడక వెబ్‌సైట్ల నుంచి అధికమొత్తంలో తప్పుడు సమాచారం కాపీ చేయడం నిబంధనలను అతిక్రమించడమే. సంవత్సరాల క్రితమే ఈ తప్పులతడక వెబ్‌సైట్ సమాచారం ఏ మాత్రం ప్రామాణికం కాదని చర్చలలో వ్యక్తమైంది. అప్పుడు తాత్కాలికంగా ఆపివేయబడిననూ చాలాకాలంగా అప్పటి చురుకైన సభ్యులు ఇప్పుడు చురుకుగా లేరని మళ్ళీ త.త.వెబ్‌సైట్ నుంచి గంపగుత్త సమాచారం చేర్చడం, ఇప్పుడు చురుకైన సభ్యులు, చురుకుగా ఉన్న నిర్వాహకులు కూడా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్రామవ్యాసాలలో సమాచారం చేర్చాలంటే ప్రామాణిక వెబ్‌సైట్ల సమాచారం అంతర్జాలంలో లభ్యమౌతున్ననూ అప్రామాణికమైన, వ్యాపారధోరణితో నడిచే త.త.వెబ్‌సైట్ నుంచి సమాచారం తెవికీలో చేర్చే ఉద్దేశ్యం స్పష్టంగానే కనిపిస్తోంది. నేను పరిశీలించిన కొన్ని మండలాల గ్రామాలు ముఖ్యంగా నా స్వంతమండలం తాండూరు మండలానికి చెందిన గ్రామాలలో చేర్చిన సమాచారం ఆధారంగా చెప్పాలంటే తాండూరు సమీపంలోని గ్రామాలకు కూడా సమీప రైల్వేస్టేషన్ తాండూరు కాకుండా దూరాన ఉన్న రైల్వేస్టేషన్ పేర్లు ఇవ్వబడ్డాయి. సమీప గ్రామాలు అని చెబుతూ ఎక్కడో 100 కిమీ పైబడి దూరాన ఉన్న పట్టణాల పేర్లు ఇవ్వబడ్డాయి. తాండూరు పట్టణంలో భాగంగా ఉన్న ప్రాంతాలు కూడా కొత్తగా గ్రామవ్యాసాలుగా సృష్టించబడ్డాయి. ఈ ప్రాంతాలకు బస్సులు కూడా తిరుగుతున్నాయని తప్పుడు సమాచారం చేర్చబడింది. ఉదా:కు పురపాలక సంఘంలో తొలివార్డు అయిన మాల్ రెడ్డిపల్లి(తాండూరు) ప్రాంతానికి అసలు బస్సులే లేవు. పాత తాండూర్ వ్యాసంకూడా కొత్తగా సృష్టించి సమీప మండలాలు అని విభాగం పెట్టి పట్టణంలోని ప్రాంతాలనే చేర్చారు. సమీప రైల్వేస్టేషన్ అంటూ దూరాన ఉన్న నవాండ్గి, ఆ తర్వాత తాండూరు ఉంచారు. అసలు తాండూరు రైల్వేస్టేషన్ ఉన్నదే పాతతాండురు ప్రాంతంలో. బస్సులే నడవని ఈ ప్రాంతానికి కూడా బస్సులు కూడా నడుస్తున్నాయి అని వ్రాయబడింది. చిన్న వ్యాసాలలో కూడా ఇన్ని తప్పులు ఉండడానికి కారణం సభ్యులు త.త.వెబ్‌సైట్ పైనే ఆధారపడి సమాచారం చేర్చడం. ఇలాంటి తప్పుడు సమాచారం చదివిన పాఠకులు తెవికీని ఎలా ఆదరిస్తారు, అభిమానిస్తారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుమస్తా నగర్ గ్రామవ్యాసం కూడా తాండూరు పట్టణంలోని ఒక ప్రాంత వ్యాసమే. ఇందులో జనాభా విభాగం పెట్టి ఏవో గణాంకాలు రాశారు కాని అవి ఏ మాత్రం సరైనవి కావు, అసలు అవి ఎక్కడ లభ్యమైనాయి ? పట్టణంలో భాగంగా ఉన్న ఖాన్ కాలని వ్యాసాన్ని ఒక గ్రామవ్యాసంగా సృష్టించి "ఇక్కడికి దగ్గరి రైల్వే స్టేషనులు నావాంద్గి, మంతట్టి రైల్వే స్టేషనులు" అనీ, "బస్సులు కూడ నడుస్తున్నవి" అనీ వ్రాశారు కాని తాండూరు పట్టణంలోని ఒక ప్రాంతానికి తాండూరు రైల్వేస్టేషన్ మాత్రం దగ్గర కాదట! బస్సులు నడవని ప్రాంతానికి తప్పు సమాచారం చేర్చబడింది. మార్వాడి బజార్ వ్యాసం సమాచారం కూడా తప్పులతడకే. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇక రెండో విషయానికి వస్తే ఏడెనిమిది సంవత్సరాల క్రితం తెవికీలో అందరూ స్వచ్ఛందంగా పనిచేస్తూ కష్టాన్ని, నష్టాన్ని భరిస్తూ తెవికీకి తోడ్పడేవాళ్ళము. సమాచారం చేర్చే కష్టమే కాదు స్వయంగా పలుప్రాంతాలను స్వంతఖర్చుతో భరిస్తూ ఫోటోలు తీస్తూ తెవికీలో ఇష్టాపూర్వకంగా చేర్చేవాళ్లము. దీన్ని కష్టం, నష్టంగా భావించకుండా పాఠకుల ప్రయోజనాలకోసం సంతోషంగా పనిచేసేవాళ్ళము. క్రమక్రమంగా పరిస్థితులు మారి వికీలలో డబ్బు పాత్ర పెరుగుతూ సభ్యులమధ్య వాదోపవాదాలు కూడా జరిగాయని చర్చాపేజీల ద్వారా తెలుస్తోంది. ఎప్పుడైతే డబ్బు రంగప్రవేశం చేసిందో అప్పుడే తెవికీ దిగజారడం మొదలైంది. స్వచ్ఛందంగా పనిచేసేవారు దాదాపు అందరూ దూరమయ్యారు. ఇప్పుడు సభ్యులు మరింతగా ముందుకు వెళ్ళి ఏవో కొన్ని ఫోటోలు అప్‌లోడ్ చేసి, తెవికీకి ఆశకల్పించి, కారు ఖర్చులిస్తే ఇలాంటివి మరిన్ని అప్‌లోడ్ చేస్తామనడం ఆశ్చర్యానికి గురిచేసే విషయమే ! తెవికీ అనేది ఎవరి నుంచి ఏమీ ఆశించదు, కేవలం స్వచ్ఛందంగా పనిచేసేవారే తెవికీకి సంపద లాంటివారు. అలాంటి తెవికీకే ఆశకల్పించడం, కొందరు సభ్యులు కూడా మద్దతు పలకడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
ఈ ప్రశ్నలకు బదులేది?
[మార్చు]1) మండలంలోని అన్ని గ్రామాలు ఒకే ఎత్తులో ఉంటాయా ? ఒక మండలం సరిహద్దు పూర్తికాగానే ఆ గ్రామానికి, సరిహద్దు మండలంలోని మరో గ్రామానికి ఒకేసారి 30 నుంచి 200 మీటర్ల ఎత్తు తగ్గితే అమాంతం పడిపోవాల్సిందేనా ? (ఉదా: నారాయణఖేడ్, కంగ్టి మండల గ్రామాలన్నీ 600 మీటర్ల ఎత్తులో ఉంటే దానికి సరిహద్దు మండలంలోని కల్హేర్ మండల గ్రామాలన్నీ 375 మీటర్ల ఎత్తులో ఉన్నాయట !)
2) మండలం ఒక జిల్లా సరిహద్దులో ఉన్నంత మాత్రానా మండలంలోని అన్ని గ్రామాలు జిల్లా సరిహద్దులో ఉన్నట్లేనా ?
3) మండలంలోని ఒక గ్రామానికి కాని, కొన్ని గ్రామాలకు కాని, ఒక పట్టణం నుంచి రవాణా సౌకర్యం ఉన్నంత మాత్రానా మండలంలోని అన్ని గ్రామాలకు ఫలానా పట్టణం నుంచి రవాణా సౌకర్యం ఉన్నట్లేనా ?
4) సమీప గ్రామాలు అని విభాగం పేరుపెట్టి అందులో ఎక్కడెక్కడో సుదూరాన ఉన్న పట్టణాల పేర్లు ఉంఛడం భావ్యమేనా ?
5) మండల వ్యాసంలో సరిహద్దు మండలాలు పెట్టవచ్చు కాని గ్రామ వ్యాసాలలో కూడా సరిహద్దు మండలాలు పెట్టే అవసరం ఉన్నదా ?
6) భారతదేశంలో ఒకే టైం జోన్ అమలులో ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రతి గ్రామవ్యాసంలో Time zone: IST (UTC+5:30) వ్రాసే అవసరం ఉన్నదా ?
7) కేవలం వాణిజ్య ప్రయోజనాలకై నిర్వహిస్తున్న తప్పులతడక వెబ్‌సైట్ నుంచి పెద్దమొత్తంలో తప్పుడు సమాచారం తీసుకొని తెవికీలో చేర్చడం న్యాయమేనా ?
8) సీనియర్ సభ్యులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు మిగితా నిర్వాహకులు, సభ్యులు చురుకుగా ఉండి కూడా పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటి ?
9) కేవలం యాంత్రికంగా మాత్రమే లెక్కవేసి దూరాలు తెలిపే తప్పులతడక వెబ్‌సైట్ నుంచి సమాచారం తీసుకోవడం ఎంతవరకు ప్రామాణికం ?
10) ప్రామాణిక గ్రంథాలు, వెబ్‌సైట్ల నుంచి కాపీహక్కుల నిబంధనలను అనుసరిస్తూ కొన్ని కొన్ని పాయింట్లు మాత్రమే తీసుకుంటూ వ్యాసాలు తయారుచేయాలనే స్పష్టమైన మూలనిబంధనలున్న వికీలలో అప్రామాణికమైన వెబ్‌సైటు నుంచి, తప్పుల తడక వెబ్‌సైట్ నుంచి అధికమొత్తంలో సమాచారం తీసుకుంటూ తెవికిని తప్పుదారిపట్టించడం ఎంతవరకు సమంజసం ?
11) గ్రామవ్యాసాలలో సమాచారం పూర్తిచేయడానికి పలు ప్రామాణిక వెబ్‌సైట్లు అంతర్జాలంలో అందుబాటులో ఉన్ననూ, వాటిని విస్మరించి కేవలం సునాయాస దిద్దుబాట్లు చేయవచ్చనే లక్ష్యంతో తప్పుల తడక వెబ్‌సైటుపై ఆధారపడటం నిబంధనలను అతిక్రమించడం కాదా ?
12) కేవలం "లేవు" అనే పదం పెట్టడానికి ఒక విభాగం సృష్టించే అవసరం ఉన్నదా ?
13) పట్టణంలో భాగంగా ఉన్న ప్రాంతాలను కూడా గ్రామాలుగా కొత్త వ్యాసాలు సృష్టించడమే తప్పు అయితే అందులో మరింత తప్పు సమాచారం చేర్చి పాఠకులను తప్పుదోవ పట్టించడం న్యాయమేనా ?
14) మండలంలోని అన్ని గ్రామవ్యాసాలలో ఒకే సమాచారాన్ని కాపీచేస్తున్నట్లుగా ఎవరైనా గమనించవచ్చు. అక్షరదోషాలు కూడా మండలం మొత్తం వ్యాపిస్తున్నాయనేందుకు నారాయణ్‌ఖేడ్ మండలపు అన్ని గ్రామాలలోని "బీదర్ నుండి తోడ్డురవాణా సౌకర్యం కలదు" వాక్యమే ఉదాహరణ.
15) సభ్యులు సభ్యులు కలిసి ఊర్లు పంచుకొని తప్పులతడక వెబ్‌సైట్ నుంచి తప్పు సమాచారం పెడుతూ తెవికీని తప్పుడ్వికీగా మార్చడం ఏ మాత్రం సమంజసం ?
16) సభ్యులు తమకు ఇష్టమైన రంగాలలో పని చేసుకోవచ్చు అంటే ఇష్టమైనట్టు పని చేసుకోవచ్చు అనికాని, ఇష్టమైన విధంగా పనిచేసుకోవచ్చు అని అర్థం చేసుకోవచ్చా? నిబంధనలను త్రుంగలోతుక్కి ప్రవర్తించడం తగునా ?
17) ఏదో ఆధారం దొరికిందనీ, మూలం చేర్చుతున్నాం కదా అనీ ఇక్కడ సమాచారం చేర్చడమే ప్రధానమా? సమాచారం ప్రామాణికమా, కాదా అని విశ్లేషించకుండా పెద్ద ఎత్తున సమాచారం చేర్చడం సమంజసమేనా ?
(చర్చను విడదీయకండి) సి. చంద్ర కాంత రావు- చర్చ 19:37, 22 జూలై 2016 (UTC)
సమాధానాలు, అభిప్రాయాలు
[మార్చు]- సహ సభ్యులకు - సి. చంద్ర కాంత రావు గారి ఆవేదనకు సభ్యులు తప్పక ప్రతిస్పందించాలి.. నేను ఆయన ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వలేను. చర్చను విడదీయవద్దాన్నా నా అభిప్రాయం మాత్రం రాస్తున్నాను.
- మన మార్పులు మనం చేసుకుపోతున్నాం, మన పని మనదే అని కాక సముదాయంగా మనం ఏం చేస్తున్నామో గమనించడం అత్యవసరం.
- నేను - నా పని అనే వ్యక్తిగత మార్పులకో, వ్యాస సంఖ్యలకో కాక అందరితో కలసి పని చేస్తూ, ఏవి ప్రస్తుత అవసరాలో వాటిపై శ్రద్ద పెడుతూ నిర్వహణ పరంగా కూడా సీనియర్ సభ్యులు శ్రద్ద తీసుకోవాలి
- ఏం చెపితే ఏం జరుగుతుందో, ఎవరేమనుకొంటారో అని పట్టించుకోకపోవడం అనేది అంత మంచి పర్యవసానం కాదు. ప్రస్తుతం అందరికీ అందరూ పరిచయం ఉన్నారు. అందువలన అలాంటి అభిప్రాయ్ం ఉంటే ఉండవచ్చు. అయినంత మాత్రాన దానికి వికీ నియమాలను పణంగా పెట్టలేము.
- ఉన్న సభ్యులలో ఎక్కువ మంది సీనియర్స్, మనకు తెలుసు ఏమి చేస్తున్నామో. దయచేసి అలాంటివి సరి దిద్దుకోవడానికి వెనుకాడవద్దు. వ్యాసరచనలో సృజనాత్మకత అవసరం. దయచేసి వికీ యొక్క ప్రతి విషయం పైనా స్పందించండి. చర్చించండి.--Viswanadh (చర్చ) 03:18, 24 జూలై 2016 (UTC)
- నేను కూడా గ్రామవ్యాసాలలోని తప్పులను గమనించాను.కాని ప్రస్తుతం సహ వికీపిడియనులు చెప్పితే ,అలాంటీ సమాచారం చేర్చేవాళ్ళు వినే పరిస్థితిలో లేరు.మీ గోల మీదే మాపని మాదే అన్నట్లు ప్రవర్తిసున్న మాటనిజం.చంద్రకాంతరావు గారు అన్నట్లు, చురుకుగా ఉన్న అదికారులు,నిర్వహాకులు కూడా మిన్నకుండటమే కొంతవరకు అటువంటీ రాతలకు కారణమని భావిస్తున్నాను.సహా వికీపీడీయన్లు,నిర్వహకులు ఈ చర్చలో పాల్గొని,ఈసమస్యకు ఒక పరిస్కారాని కనుగొనాలి.Palagiri (చర్చ) 04:13, 24 జూలై 2016 (UTC)
- గ్రామవ్యాసాలలోనూ, యితర వ్యాసాలలోనూ తప్పులు చేర్చుట గమనిస్తున్నాము. వాటిని ఎవరైనా సరిదిద్దవచ్చును. ఈ పని నిర్వాహకులే చేయాలని లేదు. ఎవరైనా సలహాలివ్వవచ్చు. కొందరు ఒకేసారి కొన్ని వేల సంఖ్యలో దిద్దుబాట్లు చేస్తున్నప్పుడు ఎన్ని వ్యాసాలను నిర్వాహకులు పరిశీలించగలరు? లక్షల సంఖ్యలో దిద్దుబాట్లు చేస్తున్న సభ్యులకు వికీ నియమాలు తెలుస్తాయని భావించడం, సీనియర్ సభ్యులు కావడం, ఒకేసారి వారు చేసిన దిద్దుబాట్లు వేల సంఖ్యలలొ ఉండటం వలన వాటిని పరిశీలించే అవకాశం తక్కువ అయింది. సదరు సభ్యులు బాగా అనుభవం ఉన్నవారు కనుక తప్పులు ఏమైనా ఉంటే వారే సరిద్దిద్దుకొంటే మంచిది. ఈ మధ్య కొంతమంది సీనియర్ సభ్యులకు వికీ నియమాల గురించి ఎవరైనా సలహాలిస్తే వారు ప్రతిస్పందించిన తీరు అందరికీ విదితమే. సభ్యులకు వికీ నియమాలు చెబుతుంటే తిరిగి తిట్లు కాయడం స్వచ్చందంగా ఇక్కడ పనిచేసేవారికి ఎవరికి యిష్టం ఉంటుంది? కనుక ఎవరి యిష్టం వచ్చినట్లు వారు దిద్దిబాట్లు చేసుకొని పోతున్నారు. కొత్త సభ్యులు, అనామక వాడుకరులు చేస్తున్న దుశ్చర్యలను పరిశీలించి సరిదిద్దడం జరుగుతున్నది. కొత్త సభ్యుడు ఆనంద్ గారు అనేక గ్రామ వ్యాసాలలో ఖాళీ విభాగాలు చేరుస్తున్నందున ఆ దిద్దుబాట్లను రద్దు చేయడం జరిగినది. గ్రామ వ్యాసాలలో యిదివరకు ఖాళీ విభాగాలు చేర్చడానికి లక్షల దిద్దుబాట్లు, అవి తొలగించడానికి లక్షల దిద్దుబాట్లు జరిగాయి. ప్రస్తుతం విషయం లేని ఖాళీ విభాగాలూ చేర్చినందున దిద్దిబాట్లను రద్దు చేయడం జరిగినది. వికీ నియమాలకనుగుణంగా సరియైన మూలాలతో వ్యాస రచనలు చేయాలని వాడుకరులకు మనవి.--
కె.వెంకటరమణ⇒చర్చ 05:08, 24 జూలై 2016 (UTC)
- గ్రామ వ్యాసాల్లో ఖాళీ విభాగాల చేర్పు గురించి నేను కూడా పలు మార్లు అలా మార్పులు చేసేవారిని హెచ్చరించి ఉన్నాను. కొన్ని వ్యక్తిగతంగా తొలగించాను కూడా. పైన వెంకటరమణ గారు పేర్కొన్నట్లు అలాంటి మార్పులు లక్షల్లో ఉండటం వల్ల ఆ పని పూర్తి చేయలేకపోయాను. కానీ పాలసీ నిర్ణయం అంటూ ఏదీ జరగలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సభ్యులంతా కలిసి గ్రామ వ్యాసాల్లో మార్పులను మార్గదర్శనం చేయడానికి ప్రత్యేక పాలసీని ఏర్పాటు చేసుకుందాం. అలాగే ప్రతి ఏటా ఎక్కువ మార్పులు చేసిన వారికి బహుమతులివ్వడం ముఖ్యంగా ధన రూపేణా లాంటి వాటికి నేను పూర్తిగా విరుద్ధం. అసలు ఇలాంటి పనులు వికీ స్ఫూర్తికే విరుద్ధం అని నా భావన. వికీకి ఏ పని చేసినా సభ్యులు ఎటువంటి ధనసహాయం ఆశించకుండా స్వచ్ఛందంగా, ఉచితంగా చేస్తే బాగుంటుంది.--రవిచంద్ర (చర్చ) 16:21, 24 జూలై 2016 (UTC)
- ప్రతిస్పందించిన సభ్యులకు కృతజ్ఞతలు. ఇదివరకు గ్రామవ్యాసాలలో ఖాళీవిభాగాలు చేర్చేసమయంలో గుళ్ళపల్లి గారికి పలు సార్లు చర్చాపేజీలలో తెలియజేసిననూ ఏ మాత్రం పట్టించుకోకపోవడం, ఇతర సభ్యులు కూడా తగినంతగా సహకారం అందించకపోవడం మరియు ఏకపక్షంగా సభ్యులపై చర్య తీసుకోవడానికి సరైన నిబంధనలు లేకపోవడం తదితర కారణాల అనుభవంతో ఈ సారి పరిస్థితిని గమనించి సహసభ్యులు సహకారం అందించకున్ననూ ఒకే నిర్వాహకుడు సభ్యులపై చర్య తీసుకొనే విధంగా నిబంధనల ఉల్లంఘనలు జరుగుతుండటంతో నేను ఈ ప్రక్రియను చర్చాపేజీల నుంచి కాకుండా రచ్చబండనుంచి ప్రారంభించాను. రెండో రోజు మాత్రమే ప్రక్రియలో భాగంగా నిర్వాహకుల నోటీసుబోర్డులో పేర్కొన్నాను. వారంరోజులకు పైగా సాగుతుందనుకున్న ఈ ప్రక్రియ సహసభ్యుల సహకారంవల్ల సదరు సభ్యులు దిద్దుబాట్లను ఆపుచేయడంతో రెండురోజులకే ముగియడం సంతోషకరం. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:07, 24 జూలై 2016 (UTC)
- గ్రామవ్యాసాల కొరకు ఒక పాలసీ తయారు చేసుకోవాలి. ఏ విభాగాలు ఉండాలి, ఏవి ఉండకూడదు. ఉన్నవాటిని కలిపేయాలా?, లేదా కాళీ విభాగాలు ఉండాలా, వద్దా ? - అనేదానిపై పాలసీ రూపొందించాలి. చంద్ర కాంత రావు గారు దయచేసి దీనిని మీరు రూపొందించి ఓటింగ్ కొరకు పెట్టగలరా ?...--Viswanadh (చర్చ) 02:44, 25 జూలై 2016 (UTC)
- విశ్వనాథ్ గారూ, ఈ విషయంలో పాలసీ రూపొందించడం తేలికే కాని అమలుపర్చడమే కష్టం. ఎన్ని పాలసీలు రూపొందించిననూ సభ్యులు అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒక వ్యాసంలో ఏయే విభాగాలు, ఎన్ని విభాగాలు ఉండాలనే విషయంలో గ్రామవ్యాస నిడివి, గ్రామ ప్రాముఖ్యత, మనకు లభ్యమయ్యే సమాచారం తదితర అంశాలపై ఆధారపడుతుంది. నేను ఆదర్శ గ్రామవ్యాసంకై భూత్పూర్ వ్యాసాన్ని తయారుచేశాను. ఈ వ్యాసంలో ఉంది కదా అని ప్రతి గ్రామవ్యాసంలో ఈ విభాగాలు చేర్చే అవసరం లేదు. ఇక్కడ లేని విభాగాలు కూడా కొన్ని గ్రామాలలో అవసరం కావచ్చు. ఒక పదం కోసమో, ఒక వాక్యం కోసమో విభాగం ఏర్పర్చే అవసరం ఉండరాదు. ఖాళీ విభాగాలు అసలు అవసరమే లేదు. స్వల్ప సమాచారం ఉన్న విభాగాలు ఉపోద్ఘాతంలో కాని సంబంధిత ఇతర విభాగంలోకాని విలీనం చేస్తే సరిపోతుంది. ప్రతి గ్రామంలో భౌగోళిక పటాలు ముఖ్యం. నేను గతంలో పటాలు తయారుచేసి (ఉదా: చెన్నారం) నాణ్యమైన సమాచారంతో గ్రామవ్యాసాలను ఒక మంచి రూపం ఇవ్వాలనే సమయంలోనే కొందరు సభ్యుల మూలంగా నిలిపివేశాను. ఇప్పటికే నా వద్ద గ్రామవ్యాసాలలో చేర్చదగిన ప్రామాణిక సమాచారం ప్రభుత్వ శాఖల నుంచి తీసుకున్నాను. పరిస్థితి చక్కబడిన తర్వాత చేర్చడానికి ప్రయత్నిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:19, 25 జూలై 2016 (UTC)
గ్రామాల పేజీల్లో...
[మార్చు]- గ్రామాల పేజీల్లో విభాగాలను సృష్టిస్తూ పోతున్నాం. విభాగాల పేర్లలో గ్రామం అని ప్రతి చోటా రాస్తున్నాం -గ్రామ చరిత్ర, గ్రామం పేరు వెనుక చరిత్ర, గ్రామ భౌగోళికం, గ్రామంలో విద్యా సౌకర్యాలు, గ్రామానికి రవాణా సౌకర్యాలు, గ్రామములో మౌలిక వసతులు, గ్రామములో రాజకీయాలు, గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు - ఇలాగ. వీటిలో గ్రామ ను తీసివెయ్యొచ్చనుకుంటా, పరిశీలించండి.
- చరిత్ర, పేరు వెనక చరిత్ర అని రెండు విభాగాలున్నాయ్, చరిత్ర ఒక్కటీ సరిపోతుందేమో!?
భాస్కర నాయుడు గారు, నాగేశ్వరరావు గారు పరిశీలించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 01:33, 25 జూలై 2016 (UTC)
- ఇది పరిశీలించతగ్గ విషయం --Nrgullapalli (చర్చ) 01:37, 25 జూలై 2016 (UTC)
నాగేశ్వరరావు గారికి విన్నపం. విభాగాల పేర్లు అన్ని పేజీల్లోనూ కాపీ & పేస్టు విషయమే ఉంటోంది కాబట్టి, అవే తప్పులు మరలా మరలా దొర్లుతున్నై. ఉదాహరణకు: 'గ్రామజనాబా' - జనాభా అనాలి కదా! ఇంకా తప్పులేమైనా ఉన్నాయేమో చూడగలరు. అలాగే భాషలో నిలకడ లేమి.. కొన్నిచోట్ల మూలాలు, సౌకర్యాలు , దేవాలయాలు , రాజకీయాలు .. ఇలా ఉండి, కొన్ని చోట్ల ప్రదేశములు అని ఉంది. ప్రదేశాలు అని రాస్తే బాగుంటుంది. (తప్పులను చూడగానే చూసినవారే సరిదిద్దాలి, కానీ కాపీ & పేస్టు కారణంగా అవే తప్పులు పదే పదే వస్తూ ఉంటాయి కాబట్టే ఈ హెడ్సప్!). __చదువరి (చర్చ • రచనలు) 02:08, 25 జూలై 2016 (UTC)
- చాల మంచి సూచన. అందుకు ముందుగా ధన్యవాదములు. ఇలాంటి ముందస్తు సూచనలతోనూ, సలహాలతోనూ మంచి వ్యాసాలు తయారౌతాయి. వీలైనంత వరకు సరిదిద్దుదాం, సరిదిద్దలేని వాటిని తొలిగిద్దాం. ఇది మంచి పద్దతే. అంతే గాని తప్పులున్నవని భావన కలిగినప్పుడు సూచనలు, సలహాలు, హెచ్చరికలు లాంటి వేవి లేకుండా .... ఒకేసారి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమే భాదాకరము. భాస్కరనాయుడు (చర్చ) 03:22, 25 జూలై 2016 (UTC)
గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు ద్వారా తయారైన చెత్తను ఏం చెయ్యాలి
[మార్చు]గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారానో మరో రకంగానో కొందరు భాషాంతకులు, పాపం ఒక ఒరిజినల్ వ్యాసాన్ని తీసుకుని, దాన్ని ఖండఖండాలుగా నరికి, పోగులు పెట్టి, అదే అనువాదమనుకునే భ్రాంతిలో పడి, ఆ పోగులను వ్యాసంగా భ్రమించి, దాని కో పేరు తగిలించి, తెవికీలో పారేసినట్లుగా తెలుస్తోంది (ఉదాహరణకు: వేల్ షార్క్).
ఈ శవాలకు పోస్టు మార్టమ్ చేసి ఎందుకు చచ్చిపోయాయో తేల్చాల్సిన అవసరం అస్సలు లేనే లేదు. వాటికి ఏదైనా కాయకల్ప చికిత్స చేసి, మళ్ళీ బతికింపజెయ్యొచ్చనే ఆశ, దింపుడు కళ్ళెం ఆశ కంటే కూడా దురాశ, పేరాశ! కాబట్టి ఈ వ్యాసాలను (శవాలను) తక్షణమే తొలగించాలని (దహనం చెయ్యాలని) ప్రతిపాదిస్తున్నాను. తక్షణమే అని ఎందుకంటున్నానంటే, ఈ శవాలు తెవికీలో ఎన్నాళ్ళుంటే, అన్నాళ్ళపాటు మనందరినీ మూకుమ్మడిగా అవమానించినట్లే!__చదువరి (చర్చ • రచనలు) 08:33, 25 జూలై 2016 (UTC)
వివరణ
[మార్చు]కింది సభ్యుల అభిప్రాయాలు చూసిన తరువాత చదువరి గారి ప్రతిపాదనకు నా అభిప్రాయాలు జోడిస్తే బాగుంటుందని ఇలా రాస్తున్నాను. అనువాద వ్యాసాలన్నీ తొలగిస్తే అందులో ఉన్న మంచి వ్యాసాలు కూడా పోగొట్టుకుంటాం కదా అన్న సభ్యుల అభిప్రాయం సమంజసంగా ఉంది. ఇక్కడ సమస్యల్లా అలాంటి వాటిని వెతికి పట్టుకోవడమే. ఇందులో ఉత్సాహం ఉన్న సభ్యులు దీన్ని ప్రాజెక్టులా భావించి వేరు చేస్తామనడం స్వాగతించదగ్గ నిర్ణయం. ఏవో కొన్ని మంచి వ్యాసాలు పోగొట్టుకుంటామని చాలా చెత్త వ్యాసాలు ఉంచడం సరికాదని నా అభిప్రాయం. ఇదివరకే శుద్ధి చేసిన వ్యాసాలకు మినహాయింపు ఇవ్వడానికి మార్గాలు ఆలోచిద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే అనువాద వ్యాసాలు తొలగిస్తున్నామంటే వాటిని శాశ్వతంగా తొలగిస్తున్నామని కాదు. తొలగించిన తరువాత కూడా సభ్యులకిష్టమైన వ్యాసాలు ఎంపిక చేసుకుని పునస్థాపించుకుని వాటిమీద కృషి చేయవచ్చు. ఇది కొద్దికాలంలో పూర్తయ్యే పని కాదని సభ్యులందరికీ తెలుసు. తెవీకీలో పని చేసేవారు తమకిష్టమైన సమయంలో స్వేచ్ఛగా పని చేస్తారు కాబట్టి ఇది ఎప్పటికీ పూర్తి చేస్తారని సభ్యులను బలవంత పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పని కోసం పసలేని వ్యాసాలు ఉంచడం లో అర్థం లేదు. --రవిచంద్ర (చర్చ) 15:51, 25 జూలై 2016 (UTC)
- చక్కని చర్చ. సత్ఫలితాల వైపుకే దారి తీస్తోంది. ప్రస్తుతం కొద్ది ఆరోగ్యపరమైన ఇబ్బందితో నా చేతికి ఇంట్రావీనస్ ఇంజక్షన్ చేసే నీడిల్ క్యాప్ పెట్టారు. ఈ చేత్తో టైప్ చేయడానికి నొప్పితో పాటు చాలా సేపు పడుతోంది. ఉదయానికల్లా దీన్ని తీసేస్తారు కనుక చర్చలో ప్రధానంగా ముందుకు వచ్చిన(ట్టు నాకు అనిపిస్తున్న) ప్రాధాన్యత క్రమం నిర్ధారణ అన్నదానిపై ఓ చిత్తు ప్రణాళిక రూపొందించి చూపడానికి ఒక్క రోజు వ్యవధి ఇస్తే తయారుచేసి ప్రతిపాదిస్తాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:49, 25 జూలై 2016 (UTC)
- అందరికీ నమస్కారం.. నిన్న రాత్రి నేను చెప్పిన విధంగా ఓ చిత్తు ప్రణాళిక రూపొందించాను. పరిశీలించి చూడగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:35, 26 జూలై 2016 (UTC)
అంగీకారం
[మార్చు]- నేను ఇందుకు అంగీకరిస్తున్నాను. మనం ఎంత కృషి చేసినా కేవలం ఇటువంటి కొన్ని వ్యాసాల వల్ల తెలుగు వికీ నాణ్యత కోల్పోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. సముదాయ నిర్ణయం అయితే ఆపరేషన్ స్వచ్ఛ వికీ చేపట్టడానికి నాకేం అభ్యంతరం లేదు. --రవిచంద్ర (చర్చ) 11:48, 25 జూలై 2016 (UTC)
- ఈ వ్యాసాలను శుద్ధిచేసేకన్నా కొత్తగా రాసుకోవడం మంచిది. ఆ యాంత్రిక అనువాద వ్యాసాలను శుద్ధిచేయడం కూడా అతి కష్టంతో కూడుకున్నది. అనేక సంవత్సరాలనుండి ఉన్న ఆయా వ్యాసాల వల్ల వికీ నాణ్యత కోల్ఫోవడం తప్ప ఏ ప్రయోజనం లేదు. కొన్ని వ్యాసాలను శుద్ధి చేయగలిగాము. అన్ని వ్యాసాలను శుద్ధిచేయడం సాధ్యంకాని పని. కనుక తొలగించినా అభ్యంతరం లేదు.--
కె.వెంకటరమణ⇒చర్చ 12:13, 25 జూలై 2016 (UTC)
' అంగీకరిస్తున్నాను. ఈ వ్యాసాల వల్ల లాభం అయితే ఏమీ లేదు.--రహ్మానుద్దీన్ (చర్చ) 14:08, 25 జూలై 2016 (UTC)
' అంగీకారము. అయితే అన్నీ కాకుండా, అస్సలు శుద్ధికి పనికి రానివి ముందుగా తొలగించితే కొంత వరకు సమంజసము అని ఇదివరకు తెలియజేసాను. దశల వారీగా ఈ తొలగింపు కార్యక్రమము చేపడితే బావుంటుంది అని నా అభిప్రాయము మాత్రమే. (ప్రస్తుతము నేను శలవులో ఉన్నాను కనుక నా అభిప్రాయము తెలియజేయటములో అభ్యంతరము ఉండదని అనుకుంటున్నాను. ఎవరికైనా ఇబ్బంది అయితే నా అభిప్రాయము తొలగించ వచ్చును.) JVRKPRASAD (చర్చ) 14:17, 25 జూలై 2016 (UTC)
- నాకు అంగీకారమే. ఏదైనా పని మొదలుపెట్టినా అది ఆరంభశూరత్వంగానే ఉంటుంది కనుక. మళ్ళీ వాటిని మెరుగు చేయగలగటం కష్టమైన పని. అలా అని వాటిలో మెరుగుపరచగల వ్యాసాలను విడదీయడం కూడా చాలా పెద్దపని. అలా విడదీయడానికి ఎవరైనా ముందుకొచ్చి, వాటిల్లో ఒక మూస ఉంచితే మిగతావి తొలగించవచ్చు.--Viswanadh (చర్చ) 14:40, 25 జూలై 2016 (UTC)
- ఒక్క వాక్యం కూడా అర్థంకాని ఇలాంటి క్రుళ్ళిపోయిన శవ వ్యాసాలు పాఠకుల పాలిట పిశాచులుగా మారి భయభ్రాంతులకు గురిచేసి పాఠకులను మళ్ళీ ఈ వైపు చూడనివ్వవని వేరే చెప్పనక్కరలేదు. వీటిని తెవికీలో ఉంచడం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ లేదు. వీటిని శుద్ధి చేయాలన్ననూ కొత్త వ్యాసం కంటే అధికశ్రమ అవుతుంది. కాబట్టి శుద్ధిచేయడానికి వీలుపడని ఇలాంటి వ్యాసాలను పూర్తిగా తొలిగించడమే ఉత్తమం. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:45, 25 జూలై 2016 (UTC)
తిరస్కారం
[మార్చు]- గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి ప్రాజెక్టుపై ఇప్పటికే నేను పైలెట్ కృషి చేస్తున్నాను. నిజానికి ఈ జాబితాలో ఎన్నో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యాసాలున్నాయి. అలానే ప్రస్తుతం నేను వాడుతున్న కంటెంట్ ట్రన్స్లేషన్ టూల్ ప్రతి వాక్యాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. మొత్తం కొత్త వ్యాసాన్నే తయారు చేసుకోవచ్చు. పైగా మనం ఇవాళ కొంత అనువాదం చేసి, దాన్ని సేవ్ చేయకపోయినా తరువాత ఆ పేజీ ఓపెన్ చేసుకుంటే డేటా పోకుండా వస్తుంది. ఇలాంటి అవకాశం ఉండగా చివరిగా ఓ గట్టి ప్రయత్నం చేయకుండా మొకుమ్మడిగా తొలగించడం మంచిది అనిపించట్లేదు. పైగా అనుభవజ్నులైన తెవికీ రచయితలు చురుగ్గా పాల్గొంటున్న ఈ సమయంలో ప్రణాళికాబద్ధమైన కృషి చేసి, వాటిని శుద్ధి చేయగలమని నమ్ముతున్నాను.--Meena gayathri.s (చర్చ) 12:39, 25 జూలై 2016 (UTC)
- మొత్తం కొత్త వ్యాసాన్నే తయారు చేసుకోవచ్చు. అదే అందరూ చెబుతున్నది కూడా. కావాలంటే ఈ వ్యాసాల పేర్లు ఒక చోట చేర్చుకుని, ఆ వ్యాసాలు తొలగించేసి, మీ వేగానికి అనుగుణంగా రాసుకోవచ్చు. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:11, 25 జూలై 2016 (UTC)
- ఈ వ్యాసాలను తొలగించేబదులు వాటిని శుద్ది చేసి నాణ్యతను పెంచడానికి కృషి చేయవచ్చు. పరభాషా వ్యాసాలను తెవికీలో చేరుస్తూ ఆదరిస్తున్న మనము, ఉన్నవాటిని తొలగించకుండా వాటి శుద్దికై ఒక కార్యాచరణ ప్రణాళిక చేపట్టవచ్చు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:33, 25 జూలై 2016 (UTC)
తటస్థం
[మార్చు]నేను వాటిని లోతుగా చూశాను. ఒక 1000 పెద్ద వ్యాసాలను శుద్ధిచేయడం చాలా పెద్ద పని. చేయగలిగితే మంచిదే. కానీ నా వరకు అది ఇంచుమించు అసాధ్యం. అలాగే అన్నింటిని మూకుమ్మడిగా తొలగించడం (తమిళ వికీపీడియాలో చేసినట్లుగా) నాకు నచ్చనిది. నేను వ్యక్తిగతంగా చూసిన మంచి వ్యాసాలు కొన్ని ఇందులో ఉన్నాయి. వాటిని గుర్తించి వేరుచేయడం మనం చేయాల్సిన మొదటి పని; అలాగే చదువరి గారు చూపించిన వ్యాసాల వంటివాటిని గుర్తించి పూర్తిగా తొలగించడం చేయవచ్చును. వ్యాసం ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని నా మనవి. నా యీ అభిప్రాయాలు క్లిష్టంగా ఉన్నా కూడా వెయ్యి పెద్ద వ్యాసాలను కోల్పోకూడదనే మీనా గాయత్రి, సుజాత గారితొ కలసి వీటిని ఒక ప్రాజెక్టు (వికీపీడియా:వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి గా స్వీకరించి శుద్ధి చేస్తున్నాము. ఎవరైనా అసలు చెత్తగా ఉన్న వ్యాసాలను గుర్తిస్తే; వాటిని తొలగించడం కూడా ఇందులో భాగంగా నిర్వహిస్తాము. మొత్తం అన్ని వ్యాసాలను తొలగించడానికి నేను వ్యతిరేకం. అందరం కలసి ఒక ప్రణాలిక ప్రకారం పనిచేసి ఈ వ్యాసాలలో కొన్నింటిని బ్రతికించవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 14:29, 25 జూలై 2016 (UTC)
అభిప్రాయాలు
[మార్చు]20 రోజుల్లో 36వ్యాసాలు(వాటిల్లో అతిపెద్ద వ్యాసం సైజు 53 కెబిలు, ఒక్క మొలక వ్యాసం కూడా లేదు.)అనువాదం చేసాను. ఇది ఇంకా కొనసాగుతుంది. దీన్ని బట్టీ చూసినా, సుజాత గారి కాంట్రిబ్యూషన్స్ చూసినా తెవికీలోని మహిళా వికీపీడియన్లకు ఆరంభ శూరులు అన్న పేరు కరెక్ట్ కాదని తెలుస్తోంది. ఇంతకుముందే ప్రాధాన్యత గుర్తించమని అడిగాం. ఇప్పుడూ అదేమాట. ప్రాధాన్యత లేని, తెవికీ కి పనికిరాని వ్యాసాలను వేరు చేసి తీసేయడం కరక్టే. కానీ ఏ మాత్రం ప్రాధాన్యత ఉన్న వ్యాసమైన, అవి వందలాదిగా వచ్చినా కూడా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధమే. ఈ వ్యాసాల్లో అమితాబ్ బచ్చన్, సోనియా గాంధీ, ముకేష్ అంబానీ, సానీయా మీర్జా వంటి అతిముఖ్యమైన వ్యాసాలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమం జయప్రదం చేసుకోగల సామర్ధ్యంతోనీ మనం ఉన్నాం. కాబట్టి అలోచించి సభ్యులు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. నా మాటలతో ఎవరినైనా హర్ట్ చేస్తే సారీ.--Meena gayathri.s (చర్చ) 15:48, 25 జూలై 2016 (UTC)
- మీనా గాయత్రి గారూ, మీరు శుద్ధి చేసినవి, తిరగరాసినవి ఈ లెక్కలోకి రావండీ. వాటి గురించి మీకేమీ భయం అక్కర్లేదు. ఇక్కడ ఆలోచిస్తున్నది ఏ సభ్యులూ చాలా కాలంగా పట్టించుకోకుండా అలా పడి ఉన్న వ్యాసాల గురించి. మీరు ఇప్పుడు రాస్తున్నవే కాక రాయబోయే వ్యాసాల జాబితాను తయారు చేసుకుని వాటిని మీరు అభివృద్ధి చేస్తారంటే దానిని స్వాగతించే వారు తప్ప వ్యతిరేకించే వారుండరు. --రవిచంద్ర (చర్చ) 15:55, 25 జూలై 2016 (UTC)
- ఇంతకుముందే అభివృద్ధి చేసిన వ్యాసాలను తెవికీలో తొలగించరని నాకూ తెలుసండీ. పైన నేను మాత్రమే అనువాదం చేసిన వ్యాసాల పేర్లు ఉదహరించడంతో మీరు ఇలా భావించారనుకుంటా. నేను చెప్పేది ప్రాధాన్యత ఉన్న శుద్ధి చేయాల్సిన వ్యాసాల గురించే.--Meena gayathri.s (చర్చ) 05:02, 26 జూలై 2016 (UTC)
అట్నుంచి కొట్టుకురండి
[మార్చు]సత్యం శంకరమంచి రాసిన "అమరావతి కథల్లో" ఒక కథుంటుంది అట్నుంచి కొట్టుకురండి అని. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పరిపాలనాకాలంలో అడవిలో దారిదోపిడీ దారుల తెగ మితిమీరి దారుణాలు చేస్తోంది. వారిని ఆపడానికి నాయుడు వారి జాతి నాయకుణ్ణి పిలిపిస్తాడు. చిన్న కూనల తప్పు కాయమని వేడిన నాయకుడి మాటలు మన్నించి, వారందరినీ సైన్యంలో చేర్చుకుని, గౌరవమైన జీవితం కల్పిస్తాడు. కానీ అరచకాలు చేయడానికి అలవాటు పడినవారు అడవిలో చేసే దారుణాలు రాజ్యంలో మొదలెడతారు. సొంత బిడ్డల్లా కాపాడుతున్న ప్రజకు వీరు కలిగించే కష్టనష్టాలను ఓర్చికోలేక, మాయోపాయంతో వారిని విందుకు పిలిపించి, చివర్లో మీ తప్పులెన్నిటినో కాశాను ఇకమీకు నూకలు చెల్లినయ్ అంటూ అందరినీ వరసలో నించోపెట్టి ఒకే సారి అందర్నీ నరికేయబోతాడు. ఈలోపు జాతి నాయకుడు దొరా చంపేది ఉంటే చంపేయండి, కానీ అటునుంచీ కొట్టుకురండి అని ప్రాధేయపడతాడు. ఈ లోపు జాలి కలిగి దొర ఈ హత్యాకాండ ఆపమంటాడన్న ఆశతో.
ఇప్పుడు కూడా అట్నుంచే కొట్టుకు రమ్మంటున్నా. తెవికీకి ప్రాధాన్యత లేని వ్యాసాలను కొట్టుకురండి. ఇట్నుంచీ ప్రాధాన్యత కలిగిన వ్యాసాలను అభివృద్ధి చేసుకుంటూ వద్దాం. పైన కథలో నాయుడుగారు దోపిడీదారుల తలలన్నీ కొట్టేసినట్టుగా, తెవికీలో అవకతవకల అనువాద వ్యాసాలను-ప్రాధాన్యత ఉన్నవాటిని అభివృద్ధి చేసుకుని, లేనివాటిని తొలగించుకుని శేషం లేకుండా వదిలించుకుందాం. --Meena gayathri.s (చర్చ) 04:59, 26 జూలై 2016 (UTC)
వికీకాన్ఫరెన్స్ ఇండియా 2016లో పాల్గొనడానికి ఆసక్తి
[మార్చు]అందరికి నమస్కారం!
గత కొన్ని ఏళ్లుగా నేను తెవికీలో చురుగ్గా పాల్గొంటున్నాను. రాబోయే రోజుల్లో తెవికీ అభివృద్ధిలో ఇలాగే చురుగ్గా పాల్గొనదలచాను. అయితే, చండిఘడ్ లో ఆగష్టు 5,6,7వ తేదీలలో జరుగుతున్న వికీకాన్ఫరెన్స్ ఇండియా 2016 గురించి తెలియకపోవడం వల్ల వికీకాన్ఫరెన్స్ ఇండియా వారి స్కాలర్ షిప్ కి అప్లై చేయలేకపోయాను. కానీ, ఆ కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తితో ఉన్నాను. కనుక, వికీకాన్ఫరెన్స్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనడానికి సి.ఐ.ఎస్ వారు నాకు సహకరిస్తే, నా దారి ఖర్చులను భరించగలిగితే నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో సహ సభ్యులు స్పందన తెలుసుకోగోరుతున్నాను.--స్వరలాసిక (చర్చ) 15:05, 25 జూలై 2016 (UTC)
అంగీకారం
[మార్చు]' --'
కె.వెంకటరమణ⇒చర్చ 15:11, 25 జూలై 2016 (UTC)
'--Meena gayathri.s (చర్చ) 15:12, 25 జూలై 2016 (UTC)
'--నాయుడుగారి జయన్న (చర్చ) 15:15, 25 జూలై 2016 (UTC)
' -- స్వరలాసిక గారు తెవికీలో చురుకుగా రాస్తున్నారు. వారు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని ఇతర భాషా వికీపీడియన్ల నుండి తెవికీ అభివృద్ధికి కావలసిన విషయాలు తెలుసుకొని, మరింతగా తెవికీ అభివృద్ధికి కృషి చేయాలని నా కోరిక. కనుక వికీకాన్ఫరెన్స్ ఇండియా 2016లో పాల్గొనడానికి సి.ఐ.ఎస్ వారు సహకరించగలరు. --Pranayraj1985 (చర్చ) 15:18, 25 జూలై 2016 (UTC)
' -- ప్రస్తుతం తెవికీలో చురుగ్గా విలువైన వ్యాసాలను అందిస్తున్న వారిలో స్వరలాసికగారు ఒకరు అని చెప్పడానికి గర్విస్తున్నాను. వీరు వికీ సమావేశాలకు హాజరు కావడం మూలంగా మరింత చురుగ్గా తెవికీ అభివృద్ధి తోడ్పడగలరని భావిస్తున్నాను. వీరికి తగిన సహాయాన్ని అందించాల్సిందిగా CIS-A2 వారిని కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 15:30, 25 జూలై 2016 (UTC)
'__చదువరి (చర్చ • రచనలు) 15:45, 25 జూలై 2016 (UTC)
'--రవిచంద్ర (చర్చ) 15:55, 25 జూలై 2016 (UTC)
'--JVRKPRASAD (చర్చ) 15:56, 25 జూలై 2016 (UTC)
'..--Viswanadh (చర్చ) 16:03, 25 జూలై 2016 (UTC)
'..t.sujatha (చర్చ) 02:52, 26 జూలై 2016 (UTC)
'----Nrgullapalli (చర్చ) 02:57, 26 జూలై 2016 (UTC)
'--శ్రీరామమూర్తి (చర్చ) 09:30, 26 జూలై 2016 (UTC)
'-- స్వరలాసిక గారు వికీ సమావేశాలలో పాల్గొనడానికి అవకాశం కల్పించాలని నా మద్దతు తెలియజేస్తున్నాను. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:39, 28 జూలై 2016 (UTC)
తిరస్కారం
[మార్చు]తటస్థం
[మార్చు]ఫలితం
[మార్చు]నమస్కారం,
ఈ ట్రావెల్ రిక్వెస్టును సీఐఎస్-ఎ2కె స్వీకరించి, అంతర్గతంగా చర్చించి అంగీకరిస్తోంది. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:08, 26 జూలై 2016 (UTC)
ధన్యవాదాలు
[మార్చు]నా అభ్యర్థనను అంగీకరించిన సిఐఎస్ - ఎ2కె వారికి మరియు నా అభ్యర్థనకు మద్దతు పలికిన తెవికీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు.మీ అందరి సహకారం వలన నేను వికీ కాన్ఫరెన్స్ ఇండియా 2016లో పాల్గొన బోతున్నందుకు సంతోషంగ ఉంది.--స్వరలాసిక (చర్చ) 15:53, 3 ఆగష్టు 2016 (UTC)
రచనాశైలి (ఏకవచనం)
[మార్చు]తెవికీలో రచనా శైలికి సంబంధించి, మనలో చాలామందికి కింది విషయాలు తెలిసే ఉంటాయి. బహుశా కొందరికి ఇవి ఉపయోగపడవచ్చు.
ఓ తడవ చూడండి.__చదువరి (చర్చ • రచనలు) 04:18, 27 జూలై 2016 (UTC)
- ముఖ్యంగా ఆ రెండో పేజీ చర్చాపేజీలో జరిగిన చర్చను చూడాలి.__చదువరి (చర్చ • రచనలు) 04:31, 27 జూలై 2016 (UTC)
శోధ్‍గంగలో తెలుగు పత్రాల అందుబాటు, వ్యాసాల నాణ్యత పెంచేందుకు అవకాశం
[మార్చు]భారత ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఈ మధ్య అన్ని వనరులు ఆన్లైనుకి అన్నట్టు తీసుకున్న చర్యలలో ఈ శోధ్‍గంగ ఒకటి. వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో జరిగిన పరిశోధనలను ఒక చోట పొందుపరిచి జనసాధారణానికి అందుబాటులోకి తేవడం ఈ జాలస్థలం ఉద్దేశ్యం. ఇది మొదలై దాదాపు ఒక ఏడాది కావస్తుంది. మొదట్లో చూసినపుడు తెలుగు పత్రాలేవీ లేవు. ప్రస్తుతం ఒక ఐదొందల పత్రాలకి దగ్గర దగ్గరగా తెలుగు పరిశోధనలు కనిపిస్తున్నాయి. ఇది ఇంకా మెరుగు పడుతుందే గానీ, తగ్గదు. సభ్యులు, ఆసక్తి ఉన్నవారు ఈ పరిశోధన పత్రాలను వాడుకొని తెవికీ వ్యాసాల నాణ్యత పెంచగలరు.
- శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనంతపురం వారి ౩౪౨ పరిశోధన పత్రాలు
- శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం అనంతపురం వారి ౯౮ పరిశోధనలు
ఇవి విధిగా వనరుల కింద ఉపయోగించడానికి అత్యంత అనువైనవని నా అభిప్రాయం. --రహ్మానుద్దీన్ (చర్చ) 13:57, 27 జూలై 2016 (UTC)
- ఆధారాల కోసం మంచి వనరు. నేను అల్లం రాజయ్య వ్యాసానికి మూలాలేమీ లేకపోతే ఇందులోని వ్యాసాన్ని చూపాను. --రవిచంద్ర (చర్చ) 17:42, 27 జూలై 2016 (UTC)
Olympics Edit-a-ton
[మార్చు]Dear Friends & Wikipedians, Celebrate the world's biggest sporting festival on Wikipedia. The Rio Olympics Edit-a-Ton aims to pay tribute to Indian athletes and sportsperson who represent India at Olympics. Please find more details here. Looking forward to your participation. Thank you Abhinav619 sent using MediaWiki message delivery (చర్చ) 04:28, 29 జూలై 2016 (UTC)
పంజాబ్ ఎడిటథాన్ ఆగస్టు 6 వరకూ పొడిగింపు
[మార్చు]తెలుగు వికీపీడియాలో చురుగ్గా సాగుతున్న బహుభాషా ఎడిటథాన్- పంజాబ్ ఎడిటథాన్ ముగింపు తేదీని ఆగస్టు 6 వరకూ పొడిగించారు. ఈ ఎడిటథాన్ లో కృషిచేయదలచిన, చేస్తున్న వారు ఆగస్టు 6 వరకూ ఈ ప్రాజెక్టు పరిధిలోని వ్యాసాలు సృష్టించడం, అభివృద్ధి చేయడం సాగించవచ్చని మనవి. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:07, 30 జూలై 2016 (UTC)
ఆంధ్రా లయోలా కళాశాలలో ఉపాధ్యాయులతో కార్యక్రమ ప్రతిపాదన
[మార్చు]అందరికీ నమస్కారం,
విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాల భాగస్వామంలో భాగంగా సీఐఎస్-ఎ2కె తెలుగు వికీపీడియా అభివృద్ధికి సంబంధించి ఉపాధ్యాయులు, అధ్యాపకులతో కార్యక్రమం నిర్వహించాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చింది. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ప్రధానంగా సైన్స్ నేపథ్యం నుంచి, తెలుగు నుంచి వచ్చే ఉపాధ్యాయులతో తెలుగు వికీపీడియాతో వారెలా కలసి కృషిచేసి పరస్పరాభివృద్ధి సాధించవచ్చో కార్యశాలలు, ప్రెజంటేషన్లు వంటివాటి ద్వారా తెలియజేయడం ప్రధానంగా ఉండాలని భావిస్తున్నాం. ఇందులో భాగంగా ఏయే కార్యక్రమాలు ఉండవచ్చునన్న అంశంతో ముసాయిదా కార్యక్రమాల జాబితా తయారుచేయడంలో విశ్వనాధ్ సహకరించారు. ప్రణయ్ రాజ్, రాజశేఖర్ వంటివారూ తమ సూచనలు కూడా అందించారు. తెలుగు వికీపీడియాకు ఆ కార్యక్రమంలో నేరుగానూ, తర్వాత ఆయా ఉపాధ్యాయుల నుంచి ప్రయోజనకరంగా ఉండేలా ఈ ముసాయిదాపై చర్చించి సూచనలు, ఆలోచనలు తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:41, 31 జూలై 2016 (UTC)
- కార్యక్రమ ముసాయిదా ప్రణాలిక బాగున్నది. తెలుగు వికీపీడియా, వికీసోర్స్ తో బాటుగా విక్షనరీకి కూడా ఒక సెషన్లో బాగం కల్పిస్తే బాగుంటుంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:02, 9 ఆగష్టు 2016 (UTC)
గ్రామ వ్యాసాల ద్వారా ప్రయోగం
[మార్చు]ఇటీవల పంజాబ్ ఏడిటధాన్ మరియు గ్రామ వ్యాసాల అభివృద్ది ప్రాజెక్టులో భాగంగా అమృత్ సర్ లోని గ్రామాలను తీసుకొని చేస్తున్నాం. అది ఒక ప్రయోగంలా చేస్తున్నాం. వీటిలో వచ్చే వ్యాసాల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు అవసరమవుతున్నాయి. వాటిని AWB బ్రౌజర్ మరియు కాపీ రీప్లేస్ ద్వారా మార్పులను చేస్తూ ఎలా వీటికి పూర్తి రూపం తీసుకురావాలని చూస్తున్నాం. ఇది అయిపోతే వీటిని తెలుగులో గ్రామ వ్యాసాలకు ఉపయోగించుకొని అన్ని గ్రామ వ్యాసాలు అభివృద్ది చేయాలనేది ఆలోచన.--Viswanadh (చర్చ) 06:33, 6 ఆగష్టు 2016 (UTC)
పంజాబ్ ఎడిటథాన్ ద్వారా సృష్టించిన గ్రామవ్యాసాల శుద్ధి
[మార్చు]పంజాబ్ ఎడిటథాన్‌లో తెలుగు వికీపీడియా సముదాయానికి ట్రోఫీ లభించడం ఆనందదాయకం. ఈ ఎడిటథాన్‌లో మనం అవలంబించిన స్ట్రేటజీలో భాగంగా చివరి రోజు సృష్టించిన అనేక గ్రామ వ్యాసాలలో చాలా మార్పులు చేయవలసి ఉంది. ఈ మార్పులు word to word పరిశీలిస్తూ చేయవలసి ఉంది. ఈ మార్పులను ఎడిటథాన్‌లో పాల్గొన్న వాడుకరులు యుద్ధ ప్రాతిపదికన వెంటనే పూర్తి చేయాల్సి ఉంది. ఎవరైనా మనవైపు వేలెత్తి చూపించకముందే ఈ పని పూర్తికావాలి. ఇది పూర్తి అయిన తర్వాతే ఖమ్మం జిల్లా గ్రామ వ్యాసాల సంగతి చూద్దాం.--స్వరలాసిక (చర్చ) 06:21, 8 ఆగష్టు 2016 (UTC)
- నేను ఏకీభవిస్తున్నాను. అన్ని వ్యాసాలలో కామన్ గా ఉన్న పొరపాట్లు.
- వ్యాసం పేరు బ్రాకెట్లో ఇంగ్లీషు పేరుతో ఒక ఖాళీ విభాగం ఉంది.
- ఒక విభాగం పేరు భౌగోళికం వద్ద మరియు జనాభా అని ఉంది. ఇది సవరించాలి.
- వర్గాలు సరి చేయాలి
- గ్రామంలో ఉత్పత్తులు కొన్ని ఇంగ్లీషులో ఉన్నాయి. వాటిని అనువదించాలి.
- ఏకవచనం బహువచనం ప్రయోగం
- గ్రామంలో సదుపాయాలను సంక్షిప్తంగా పట్టిక రూపంలో రాస్తే బాగుంటుందేమో చూడాలి.
--రవిచంద్ర (చర్చ) 06:35, 8 ఆగష్టు 2016 (UTC)
- ప్రస్తుతం నేను ఇన్ఫో బాక్స్ ల శుద్ధి చేస్తున్నాను. అది పూర్తయ్యాకా మిగతా వాటి సంగతి కూడా చూస్తాను. అయితే చాలా గ్రామాలు ఉత్పత్తి చేసే పంటలు సాధారణంగా గోధుమ, వరి, మొక్కజొన్న ఉన్నాయి. పైగా వాటి ప్రస్తావన వ్యాసంలో ఒకసారే వస్తోంది కాబట్టి ఆటో వికీ బ్రౌజర్ ద్వారా అది చేసేయ్యచ్చేమో చూడండి. ఆ టూల్ వచ్చినవారు ఆ పని త్వరగా ముగించేస్తే వ్యాసాల్లో ఆంగ్ల పదాల బెడద వదిలిపోతుందని నా ప్రతిపాదన సహ సభ్యులు గమనించగలరు.--Meena gayathri.s (చర్చ) 08:27, 8 ఆగష్టు 2016 (UTC)
- మేము వచ్చిన వెంటనే వాటిపై పనిచేయాలని అనుకొన్నాము వాటిని శుద్ది చేసాక ఖమ్మం గ్రామా వ్యాసాలు ఎలా ఉండాలో వీటిలో అవసరం ఉన్నవి ఏవో కానివి ఏవొ చూసి ఆ మార్పులు చేసాక మొదలు పెట్తాలి.--Viswanadh (చర్చ) 09:06, 8 ఆగష్టు 2016 (UTC)
- చర్చ చాలా ఆనందదాయకంగా ఉంది. అలానే పంజాబ్ ఎడిటథాన్ లో తెలుగు వికీపీడియా ట్రోఫీ గెలుపొందినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ప్రత్యేకించి పాల్గొన్న సభ్యులు భాస్కరనాయుడు, గుళ్ళపల్లి, WPమణికంఠ, మీనా గాయత్రి, పాలగిరి, ప్రణయ్ రాజ్, రాజశేఖర్, రవిచంద్ర, రహ్మానుద్దీన్, స్వరలాసిక, సుజాత, సుల్తాన్ ఖాదర్, విశ్వనాథ్, వెంకటరమణ తదితరులందరికీ పేరు పేరునా అభినందనలు, ధన్యవాదాలు. సభ్యులు సమిష్టి స్ఫూర్తితో కృషిచేసి మన తెవికీని గెలిపించడం శుభపరిణామం. నాణ్యతా పరమైన చర్యలు మొదటి నుంచీ ఈ ఎడిటథాన్ నిర్వహణలో భాగంగా ఉంటూనే వచ్చాయి. మొలకల జాబితాను ఎడిటథాన్ నిర్వహిస్తున్నప్పుడే వేసుకుని అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు చివరిలో చేసిన వ్యాసాల నాణ్యతాభివృద్ధి చర్యలకు కూడా సమిష్టిగా సభ్యులు ముందుకు రావడం సంతోషకరమైన విషయం. నా వరకూ నేనూ దానిపై పనిచేస్తున్నాను. అత్యంత సమీప భవిష్యత్తులో తెవికీ గ్రామాల వ్యాసాలను ఈ అనుభవాన్ని వినియోగించుకుని మరింత మెరుగ్గా విస్తరించుకోవాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 17:20, 8 ఆగష్టు 2016 (UTC)
- పంజాబ్ ఎడిటథాన్లో బహుమతి పొందిన తెవికీ స్థాయీ సామార్ధ్యాలు భారతీయ భాషా వికీపీడియన్లందరికీ తెలిసాయి. ఇందుకు మనందరమూ ఆనందించాలినది. సమిష్ఠి కృషి వలన ఎలాంటి లాభాలున్నాయో ఇదొక ఉదాహరణ. ఈ ఐకమత్యం మనం నిరవధికంగా కొనసాగించవలసినదే. ప్రస్తుతం గ్రామ వ్యాసాల మీద దృష్టి పెట్టి ఒక్కొక్క జిల్లాల వారీగా వాటిని అభివృద్ధి చేసుకొంటే బాగుంటుందని నా ఆలొచన. ఈ ఎడిటథాన్లో ఎక్కువగా కృషిచేయలేనందుకు బాధగా ఉన్నది. అందరికీ మరోసారి శుభాకాంక్షలు.Rajasekhar1961 (చర్చ) 07:00, 9 ఆగష్టు 2016 (UTC)
- పంజాబ్ ఎడిటథాన్‌లో మనం ట్రోఫీ గెలుచుకోవడం సంతోషంగా ఉంది. ఈ రెండు వారాలూ మనాళ్ళు చేస్తూన్న పని చూస్తున్నప్పుడే చూచాయగా అనిపించింది, మనం గెలుపుకు దగ్గరలోనే ఉంటామని. తీరా చూస్తే ఏకంగా ట్రోఫీనే తెచ్చేసారు. ఇందులో పాల్గొన్నవాళ్ళందరికీ నా అభినందనలు. వ్యాసాల నాణ్యత (గ్రామాల వ్యాసాలను కొంత తక్కువగా ఉన్నా..) కూడా బాగుంది. గడువైపోగానే పనైపోయిందని చేతులు దులిపేసుకోకుండా, ఆయా వ్యాసాల నాణ్యత సంగతి చూద్దామని అనుకుంటున్నారు చూసారూ.. అది చాలా గొప్ప సంగతి. అందుగ్గాను, మీ అందరికీ మరోసారి అభినందనలు. __చదువరి (చర్చ • రచనలు) 09:43, 9 ఆగష్టు 2016 (UTC)
- చర్చ చాలా ఆనందదాయకంగా ఉంది. అలానే పంజాబ్ ఎడిటథాన్ లో తెలుగు వికీపీడియా ట్రోఫీ గెలుపొందినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ప్రత్యేకించి పాల్గొన్న సభ్యులు భాస్కరనాయుడు, గుళ్ళపల్లి, WPమణికంఠ, మీనా గాయత్రి, పాలగిరి, ప్రణయ్ రాజ్, రాజశేఖర్, రవిచంద్ర, రహ్మానుద్దీన్, స్వరలాసిక, సుజాత, సుల్తాన్ ఖాదర్, విశ్వనాథ్, వెంకటరమణ తదితరులందరికీ పేరు పేరునా అభినందనలు, ధన్యవాదాలు. సభ్యులు సమిష్టి స్ఫూర్తితో కృషిచేసి మన తెవికీని గెలిపించడం శుభపరిణామం. నాణ్యతా పరమైన చర్యలు మొదటి నుంచీ ఈ ఎడిటథాన్ నిర్వహణలో భాగంగా ఉంటూనే వచ్చాయి. మొలకల జాబితాను ఎడిటథాన్ నిర్వహిస్తున్నప్పుడే వేసుకుని అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు చివరిలో చేసిన వ్యాసాల నాణ్యతాభివృద్ధి చర్యలకు కూడా సమిష్టిగా సభ్యులు ముందుకు రావడం సంతోషకరమైన విషయం. నా వరకూ నేనూ దానిపై పనిచేస్తున్నాను. అత్యంత సమీప భవిష్యత్తులో తెవికీ గ్రామాల వ్యాసాలను ఈ అనుభవాన్ని వినియోగించుకుని మరింత మెరుగ్గా విస్తరించుకోవాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 17:20, 8 ఆగష్టు 2016 (UTC)
- గెలుపుకు ఎలా అయితే అందరం కలిసికట్టుగా కృషి చేశామో శుద్ధికి అలాగే కలిసి పనిచేద్దాం. సుమారు 450 కొత్త వ్యాసాలు రాశాం. అందులో 100 కి పైగా బాగా రాసినవి. అందులో ఏమీ మార్పులు అక్కర్లేదనుకుంటూన్నాను. మిగతా 300 చిల్లర వ్యాసాలు 10 మంది తలా 30 వ్యాసాలు పంచుకుంటే వారంలో అయిపోతుంది అనుకుంటున్నా. --రవిచంద్ర (చర్చ) 10:12, 9 ఆగష్టు 2016 (UTC)
- చదువరి గారూ ధన్యవాదాలు. అలానే రవిచంద్ర గారి సూచన నాకు నచ్చింది. నా వరకూ నేను 30 వ్యాసాలను నా ప్రయోగశాలలో జాబితా వేసుకుని పనిచేస్తాను. నా ప్రయోగశాలలోని జాబితా నచ్చితే, అక్కడే నేను ఇచ్చే ఖాళీ పట్టికను కాపీ చేసి ఎవరికి వారు వాడుకోవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 03:31, 10 ఆగష్టు 2016 (UTC)
Save/Publish
[మార్చు]The Editing team is planning to change the name of the “మార్పులను ప్రచురించు” button to “పేజీని ప్రచురించు” and “మార్పులను ప్రచురించు”. “పేజీని ప్రచురించు” will be used when you create a new page. “మార్పులను ప్రచురించు” will be used when you change an existing page. The names will be consistent in all editing environments.[1][2]
This change will probably happen during the week of 30 August 2016. The change will be announced in Tech News when it happens.
If you are fluent in a language other than English, please check the status of translations at translatewiki.net for “పేజీని ప్రచురించు” and “మార్పులను ప్రచురించు”.
The main reason for this change is to avoid confusion for new editors. Repeated user research studies with new editors have shown that some new editors believed that “మార్పులను ప్రచురించు” would save a private copy of a new page in their accounts, rather than permanently publishing their changes on the web. It is important for this part of the user interface to be clear, since it is difficult to remove public information after it is published. We believe that the confusion caused by the “మార్పులను ప్రచురించు” button increases the workload for experienced editors, who have to clean up the information that people unintentionally disclose, and report it to the functionaries and stewards to suppress it. Clarifying what the button does will reduce this problem.
Beyond that, the goal is to make all the wikis and languages more consistent, and some wikis made this change many years ago. The Legal team at the Wikimedia Foundation supports this change. Making the edit interface easier to understand will make it easier to handle licensing and privacy questions that may arise.
Any help pages or other basic documentation about how to edit pages will also need to be updated, on-wiki and elsewhere. On wiki pages, you can use the wikitext codes {{int:Publishpage}}
and {{int:Publishchanges}}
to display the new labels in the user's preferred language. For the language settings in your account preferences, these wikitext codes produce “పేజీని ప్రచురించు” and “మార్పులను ప్రచురించు”.
Please share this news with community members who teach new editors and with others who may be interested.
Whatamidoing (WMF) (talk) 18:04, 9 ఆగష్టు 2016 (UTC)