Jump to content

వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 64

వికీపీడియా నుండి

పాత చర్చ 63 | పాత చర్చ 64 | పాత చర్చ 65

alt text=2019 ఫిబ్రవరి 1 - 2019 ఫిబ్రవరి 28 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2019 ఫిబ్రవరి 1 - 2019 ఫిబ్రవరి 28

తెలుగు వికీపీడియా నాణ్యత: ఆన్‌లైన్ తరగతులు

[మార్చు]

తెలుగు వికీపీడియా నాణ్యత పెంచే దిశగా పనిచేయదలుచుకున్న వారికి రెండేసి ఆదివారాలకు ఒకమారు జరిగేలా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నాం. ఆ తరగతుల పేజీలు ఇక్కడ చూడండి: వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-ఆన్‌లైన్ శిక్షణా తరగతులు. దీనిలో కొత్త వికీపీడియన్లు కానీ, వివిధ అంశాలపై అనుభవం ఉన్నా నాణ్యతాభివృద్ధిపై ఇంతవరకు వివిధ కారణాలపై పనిచేయని వాడుకరులు కానీ - దీనిలో సభ్యులు కావచ్చు. ప్రత్యేకించి కోర్ కంటెంట్ పాలసీలు, వికీపీడియా శైలి, ఎటువంటి మూలాలు వినియోగించినప్పుడు ఎలా రాయవచ్చు వంటి అంశాలు ప్రధానంగా చర్చనీయాంశాలు కాగా మరిన్ని వివరాల కోసం పైన ఉన్న ప్రాజెక్టు పేజీ చూడొచ్చు. ఆఫ్ లైన్ కార్యక్రమాలకు ఇంత తరచుగా వివిధ ప్రాంతాల్లో ఉన్న వాడుకరులు హాజరుకాలేకపోవడం, దూరాభారాలు ప్రయాణాలు చేసి కార్యక్రమాలకు రావాల్సి ఉండడం ఆసక్తి ఉన్నా వీలు లేని సభ్యులను, శిక్షకులను నిరుత్సాహపరుస్తూండడం వంటి సమస్యలకు ఇదొకానొక పరిష్కారం కాగలదని నమ్ముతున్నాం. ఎప్పటి నుంచో పనిచేస్తూ కొన్ని నాణ్యతాపరమైన అంశాలు నేర్చుకునేందుకు వీలుపడని వాడుకరుల ఆసక్తి కూడా దీనిని రూపొందించడానికి కారణమైంది. సభ్యులు దయచేసి పై పేజీని సందర్శించి ఆసక్తి మేరకు తరగతులకు సైన్-అప్ అవుతారని ఆశిస్తూ, --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 13:02, 1 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ శిక్షణలో ఎవరైనా చేరవచ్చని నా ఉద్దేశం. విషయాలు తెలిసినప్పటికీ, రిఫ్రెష్ చేసుకునేందుకు ఈ తరగతులు ఉపయోగపడతాయి. అలాగే తమకు తెలిసిన దాన్ని అవసరమైతే, శిక్షకుడు ఒప్పుకుంటే, మిగతావారికి నేర్పనూవచ్చు. నేనూ చేరుతున్నాను. అలాగే, @Pavan Santhosh (CIS-A2K):, నా అభిప్రాయాలను అక్కడి చర్చా పేజీలో రాసాను. __చదువరి (చర్చరచనలు) 05:28, 3 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, ధన్యవాదాలు. ఆలోచనలు బావున్నాయి. వాటిని స్వీకరిస్తూ మార్పుచేర్పులు చేసుకుంటున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 04:56, 5 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ట్వింకిల్ కేమైంది?

[మార్చు]

పేజీకి పైన ట్యాబ్ బార్‌లో ట్వింకిల్ ట్యాబు ఉండేది. ఇవ్వాళ లేదు. ఎప్పటి నుండి కనబడ్డంలేదో తెలీదు. ఇది నా సమస్యా? (నా అభిరుచులు సెట్టింగులు బానే ఉన్నాయి.) లేక వికీ సమస్యా? ఎవరికైనా తెలుసా? __చదువరి (చర్చరచనలు) 06:01, 3 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@చదువరి నాకైతే ఫైర్ఫ్రాక్స్ క్వాంటమ్ 65లో కనబడుతున్నది. --అర్జున (చర్చ) 09:59, 3 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, నేను ఈ సమస్యను గిట్‌హబ్‌లో చెప్పాను. వాళ్ళు ఒక పరిష్కారం చెప్పారు. ఓసారి చూసి, చూస్తారా. వాళ్ళు చెప్పిన మార్పులు నాబోటి అసాంకేతికులు చేస్తే తేడాలొస్తాయేమోనని భయంగా ఉంది. అంచేత మీరు కలగజేసుకోవాలని విజ్ఞప్తి. __చదువరి (చర్చరచనలు) 05:34, 5 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@చదువరి పైన చెప్పిన విధంగా మార్పులు చేశాను. నా ఉబుంటులో ఫైర్ఫాక్స్, క్రోమ్ లో రెండింటిలో ఇంతకు ముందులాగే ట్వింకిల్ కనిపిస్తున్నది. ('మరిన్ని' అన్న టేబ్ తర్వాత ఖాళీ టేబ్ తరువాత "TW").
సూపర్ అర్జున గారూ! మీరు చెప్పినట్టే, సరిగ్గ అలాగే ఇప్పుడు నాకూ క్రోమ్‌లో కనిపిస్తోంది. ధన్యవాదాలు.__చదువరి (చర్చరచనలు) 07:53, 5 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

విజయనగరం జిల్లా లోని గ్రామాలకు గణాంక వివరాలు లేవు

[మార్చు]

విజయనగరం జిల్లా లోని గ్రామాలకు చాల వారకు గణాంక వివరాలు లేవు. అందు చేత మండలానికి మరియు గ్రామానికి ఒకే సమాచారము వున్నది. పవన్ గారూ .... ఇదివరలో మీరు పంపిన తెలుగులో గ్రామ జనాభా గణాంక వివరాలు (జనాభా లెక్కలు మాత్రమే కాదు ఇతర వివారాలు కూడ )పంపిస్తే ఎక్కించ గలను. ఇదే సమస్య మరి కొన్ని జిల్లాలలోని గ్రామాలకు కూడ వున్నది. బహుశ ఆయా గ్రామాల జనాభ గణాంక వివరాలు లేవేమో. Bhaskaranaidu (చర్చ) 15:40, 3 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

విజయనగరం జిల్లా గ్రామాల పేజీల పని కొంతవరకే అయింది. నా వద్ద ఆ పేజీలు సిద్ధంగా ఉన్నాయి. ఆ పేజీల్లో సమాచారం చేర్చేందుకు ఆసక్తి కలవారు ఉంటే ఆ టెక్స్టు ఫైళ్ళు పంపిస్తాను.__చదువరి (చర్చరచనలు) 04:19, 5 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

విజయనగరం జిల్లాలోని గ్రామాల వివరాలు నా మెయిల్ కు పంపగలరు.--కె.వెంకటరమణచర్చ 04:47, 5 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పంపానండి.__చదువరి (చర్చరచనలు) 05:31, 5 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పుస్తకాలను స్కాను చేయుటకు కొత్త కేంద్రము

[మార్చు]
టిటిస్క్రైబ్ (TTScribe) వాడి పుస్తకము స్కాన్ చేయుట(వీడియో)

పబ్లిక్ రిసోర్స్.ఆర్గ్ సంస్థ సౌజన్యంతో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు లో పుస్తకాలను స్కాను చేయటకు కొత్త కేంద్రము ప్రారంభించబడింది. ఇది ప్రధానంగా స్వచ్ఛందసేవకులచే నిర్వహించబడుతుంది. కాపీహక్కులు తొలగి ఇంకా స్కాన్ రూపంలో లభ్యంకాని, లేక కాపీహక్కుల సిసి బై రూపంలో పునర్విడుదలైన పుస్తకాలు స్కాను చేసి ఇంటర్నెట్ అర్కైవ్ ద్వారా అందరికి అందుబాటులో వుంచడానికి ఈ కేంద్రం సేవలను వినియోగించుకోవచ్చు. పుస్తకాలను, Yoga Narasimha,I/C Public Resource.org Scanning Center, Indian Academy of Sciences, C. V. Raman Avenue, Raman Research Institute Campus, Sadashivanagar, Bengaluru 560 080 INDIA Tel.: +91-80-2266 1200 Fax: +91-80-2361 6094 Email: office@ias.ac.in కు వికీమీడియా స్వేఛ్ఛా కాపీహక్కుల ధృవ పత్రంతో సహా (ఉదాహరణ)పంపించగలరు. సందేహాలకు అర్జునని సంప్రదించండి--అర్జున (చర్చ) 04:10, 8 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వ నియమ నిబంధనలు - 2

[మార్చు]

నిర్వాహకత్వ బాధ్యతలను ఉపసంహరించడంపై ఒక విధానాన్ని రూపొందించుకునేందుకు గాను, ఒక విధాన పేజీ తయారైంది. ఈ ప్రతిపాదనపై అక్కడి చర్చాపేజీలో చర్చిస్తున్నాం. 2019 ఫిబ్రవరి 16 వ తేదీనాటికి ఈ విధానానికి తుది రూపు ఇవ్వబోతున్నందున, వాడుకరులంతా ఈ వారం లోగా తమతమ అభిప్రాయాలు చెప్పి ఈ విషయమై ఒక చక్కటి విధానాన్ని రూపొందించడంలో పాల్గొనాలని వినతి. __చదువరి (చర్చరచనలు) 06:39, 8 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుత నిర్వాహకుల్లో వాడుకరి:Arjunaraoc, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:యర్రా రామారావు గార్లు ఈసరికే ఈ విధాన నిర్ణాయక చర్చలో పాల్గొన్నారు. నేనూ పాల్గొన్నాను. ఇతర నిర్వాహకులైన @B.K.Viswanadh:, @C.Chandra Kanth Rao:, @K.Venkataramana:, @Pranayraj1985:, @Rajasekhar1961:, @T.sujatha:, @Veeven:, @రవిచంద్ర:, @రహ్మానుద్దీన్:, @స్వరలాసిక: గార్లు కూడా ఈ చర్చలో పాల్గొనాలని వారికి పేరుపేరునా విజ్ఞప్తి చేస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 07:19, 8 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ అనే పేజీలో ప్రస్తుతం సూచించినది, విధానం గురించిన ప్రతిపాదన మాత్రమే. ఇంకా అది విధానంగా రూపు దిద్దుకోలేదు. సముదాయం దాన్ని చర్చించి, అవసరమైన మార్పుచేర్పులు చేసుకున్న తరువాతే విధానానికి తుది రూపు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి వాడుకరులంతా ఈ చర్చలో పాల్గొని తమతమ సూచనలను ఎలుపవలసినదిగా మరోసారి విజ్ఞప్తి. __చదువరి (చర్చరచనలు) 13:12, 14 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ లవ్స్ విమెన్ 2019

[మార్చు]

వికీపీడియా:వికీ లవ్స్ విమెన్ 2019 అన్న ఎడిటథాన్ రేపటి నుంచి ప్రారంభమై మార్చి నెలాఖరు వరుకు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వికీపీడియాలో మహిళల గురించిన సమాచార లేమిని తగ్గిస్తూ, భారతీయ మహిళల జీవితాల గురించిన వ్యాసాలు పెంచేందుకు ఉద్దేశించింది. ఈ ఏడాది వికీ లవ్స్ విమెన్ స్త్రీవాదం, మహిళల జీవిత చరిత్రలు, జెండర్ కు సంబంధించిన అంశాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నాం. కనీసం 5 వ్యాసాలు నిబంధనలకు అనుగుణంగా రాసినా, విస్తరించినా ఒక పోస్టుకార్డు అందుకోవచ్చు. అంతకుమించి తెలుగు వికీపీడియాలో మహిళల గురించిన సమాచారం విస్తరణకు ఈ ప్రయత్నం ఎంతగానో ఉపకరిస్తుంది. దయచేసి ఆసక్తి గల సముదాయ సభ్యులను పాల్గొనమని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 08:43, 9 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వానికి గణాంకాలెందుకు ?

[మార్చు]

తెవికీలో చురుకైన నిర్వాహకుల కొరత చాలా కాలం నుంచి ఉన్నదే. దిద్దుబాట్లు చేస్తూ కూడా నిర్వహణ పనులు చేయకపోవడం ఒకరకమైతే, ఇతర (స్వంత) పనులవల్ల తెవికీ సెలవులో ఉండటం మరొకటి. నిర్వాహణ పనులకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం, నిర్వహణకై సభ్యుల నుంచి విమర్శలు, చివాట్లు ఎదుర్కోవడం, నిర్వాహణ చేసిన వారిపైనే తోటి నిర్వాహకులు దాడిచేయడం ముఖ్యమైన మరొక్కరకం. దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం తెవికీలో నిర్వాహకులు పలువులు ఉన్ననూ నేను చురుకైన నిర్వహణ నిర్వహించాను. అదే సమయంలో సభ్యుల నుంచి చీవాట్లు కూడా ఎదుర్కొన్నాను. నిర్వహణ ఇబ్బందులు నిర్వహణ చేసేవారికే తెలుస్తుంది. తోటి నిర్వాహకుల నుంచి ఎలాంటి సరైన సహకారం లేకపోవడం, పైగా పొరపాట్లు చేసిన వారికే మద్దతు తెల్పడం తదితర కారణాలతో నా నుంచి నిర్వహణ పనులు తగ్గిపోయాయి. నేను నిర్వహణ మానివేయుటకు కొంతముందు కూడా సరైన ప్రక్రియ ప్రకారం ముందుకు వెళ్ళి ఒక సభ్యుడిని పలుమార్లు హెచ్చిరించి తన ధోరణి ఎంతకూ మార్చుకోనందున ఒకరోజు, ఆ తర్వాత 3 రోజులు, ఆ తర్వాత వారం రోజులు నిరోధం విధించాను. వారం రోజుల నిరోధం రెండుమూడు రోజుల్లో పూర్తి అవుతుందనగా తోటి నిర్వాహకులే ఆ సభ్యునికి అనుకూలంగా ప్రవర్తిస్తూ నిరోధం తొలగించాలని ప్రతిపాదించడం నా నిర్వహణ పనులకు అడ్డంకిగా మారింది. ఎవరో ఒక తప్పు చేయగానే నేనేమీ చర్యలు తీసుకోలేను. చాలా కాలం నుంచి మళ్ళీ మళ్ళీ పొరపాట్లు చేస్తూ, ఎంత చెప్పిననూ ధోరణి మార్చుకొనక నిర్వాహణకు ఇబ్బందిగా మారినప్పుడు కూడా తోటి నిర్వాహకులు సహకరించకపోవడం ఇంతగా కాకున్నా కొంతైనా మునుపటి నుంచే కొనసాగుతోంది. రచ్చబండలో, నిర్వాహకుల నోటీసుబోర్డులో వివరించినప్పుడు వ్యాఖ్యానించని నిర్వాహకులు నిర్వహణ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు భిన్నంగా వ్యాఖ్యానించడం సమంజసం అనిపించలేదు. ఒకానొకప్పుడు నేను ఒంటిచేత్తో నిర్వాహక పనులు కూడా చేసిన సంగతి అప్పటి సభ్యులకు బాగా తెలుసు. కేవలం నిర్వహణ కోసమే ఎంతో కాలం నా సమయం వెచ్చించాను. తెవికీకి ఒకప్పుడు పాఠకులు బ్రహ్మరథం పట్టారంటే నా వంతు కృషి కూడా ఉందని నమ్ముతున్నాను. వ్యాస నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ తెవికీని నాణ్యమైన విజ్ఞానసర్వస్వంగా మార్చడానికి అహరహం కృషిచేశాను. చివరికి తోటి నిర్వాహకులు అడ్డుతగిలి నన్ను నిర్వహణ పనుల నుంచి దూరం చేశారు. అయిననూ నేనేమీ తెవికీకి శాశ్వతంగా దూరం కాలేను. తోటి నిర్వాహకుల ధోరణి నచ్చనందుకు తాత్కాలికంగా మాత్రమే పక్కకు జరిగాను. తెవికీలో మళ్ళీ చురుకుగా ఉండాలనీ, రోజూ నిర్వహణ పనులు చేయాలనీ, తెవికీని చక్కదిద్దాలనీ, తెవికీకి పూర్వవైభవం తీసుకురావాలనీ నా మనసు ఉబలాటపడుతోంది. కాని ఇప్పుడు నిర్వహణ పనులు చేయడం లేదనీ ఏకంగా నిర్వహకత్వానికే ఎసరు తీసుకురావడం వింతగా తోస్తోంది. అసలు దిద్దుబాట్లు చేస్తూ కూడా నిర్వహణ గురించి ఏ మాత్రం పట్టించుకోని వారికే ఈ నిబంధన వర్తింపజేస్తే బాగుంటుందేమో ! రెండేళ్ళవరకు దిద్దుబాట్లు చేయనివారిని ఎలాగూ స్టీవార్డులు తొలగిస్తారు (వారు కూడా ఏకపక్షంగా తొలగించరు. చర్చద్వారా, మెయిల్ ద్వారా సంప్రదిస్తారు). మరి ఈ కొత్త నిబంధనల ఉద్దేశ్యం ఎందుకో తెలియడం లేదు. తెవికీలో నిర్వాహకుల కొరత అంటూనే నిర్వాహకులను తొలగించడం ఎందుకో అర్థం కావడం లేదు. నిర్వహణ పనులు చేసే వారికి ఇబ్బంది కల్గజేయకుండా ఉంటే నిర్వాహకులు స్వచ్ఛందంగా మరియు సంతోషంగా పనిచేస్తారు. నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చు. కొంతకాలం క్రితమే ఇలాంటి సంఘటన కూడా జరిగింది. విజ్ఞానసర్వస్వం అంటే ఆషామాషీ కాదు. ఇందులో పనిచేయడం అంటే అనుకున్నంత సులభం కాదు. కాని ఎవరైనా దిద్దుబాట్లు చేయవచ్చనే నిబంధనతో ఎవరికి వారు తమ ఇష్టమైనట్లు దిద్దుబాట్లు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేముకదా ! ఆ సమయంలో దానికి తగ్గట్టు బలమైన నిర్వహణ తప్పనిసరి. అదే ఇప్పుడు కొరవడింది. ఒకానొకప్పుడు దిద్దుబాట్ల సంఖ్య ఆధారంగా సభ్యులను అభినందించడం, పతకాలు ప్రధానం చేయడం ఉండేది. తెవికీ ప్రగతికి కావలసింది సంఖ్య కాదు నాణ్యత మాత్రమే అనీ, గణాంకాలకు ప్రాధాన్యత ఇస్తే తెవికీ నాణ్యత కుంటుపడుతుందనీ నేను పదేపదే చెప్పి చివరికి ఆ పద్దతిని మాన్పించాను. ఇప్పుడు నిర్వాహక పనులకు కూడా గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడం నాకు అస్సలు నచ్చడం లేదు. గణాంకాలు పెంచుకోవడానికి నిర్వాహకుల మధ్య పోటీ ఏర్పడి చివరికి అసలైన నిర్వహణ కుంటుపడుతుంది లేదా సభ్యుల మధ్యన పోటీతో పాటు ఘర్షణ వాతావరణం ఏర్పడి నిర్వాహకుల మధ్య మనస్పర్థలు తలెత్తి చివరికి తెవికీకే నష్టం కలగవచ్చు. గతంలో దిద్దుబాట్లు పెంచుకోవడానికి సభ్యులు ఎలా పోటీపడ్డారో నాకు బాగా తెలుసు. చివరికి ఈ దిద్దుబాట్ల మోజులో పడి సభ్యులు హీనమైన దిద్దుబాట్లు చేసి వ్యాస నాణ్యతను తీవ్రంగా దిగజార్చారు. నిర్వహణ పనులకు కూడా గణాంకాలు వర్తింపజేస్తే నిర్వాహకులు నిర్వాహక పనులు చేయడం కంటే తమ గణాంకాలు చూసుకోవడానికే సమయం సరిపోతుందేమో! ఇప్పుడు చురుకైన నిర్వాహకులే కొద్దిమంది. వారిలో నిర్వహణ పనులు చేసేవారిని లెక్కించడానికి అరచేయి కూడా అవసరం లేదు. ఉన్న నిర్వాహకులను కాపాడుకోవాలి, వారి నిర్వాహక పనులకు సహకారం అందించాలి, అంతేకాని గణాంకాల ప్రకారం మీరు చురుకుగా లేరు కాబట్టి మీ నిర్వాహకత్వం పోతుందంటే ఇన్నేళ్ళు తెవికీకై అహరహం కృషిచేసిన వారిని అవమానపర్చడమే అవుతుంది. అంతేకాదు ఇప్పుడు చురుకైన నిర్వాహకులలో కూడా అభద్రతాభావం ఏర్పడుతుంది. అసలీ ఆలోచన ఎందుకు ? ఏవో కొన్ని వికీలలో ఉన్నంత మాత్రానా అలాంటి నిబంధన మనకెందుకు ? ఈ నిబంధనకు ప్రాతిపాదిక ఏమిటి? తెవికీని చక్కదిద్దడానికి ఉన్న అవకాశాలు వదిలి ఈ నిబంధనపై సభ్యుల దృష్టి మళ్ళించడమెందుకు? పోనీ ఈ నిబంధనే చేశామనుకుందాం, అప్పుడు తెవికీ నిర్వహణ బాగుపడుతుందనే నమ్మకం ఉందా ? నిర్వహణ బాగుపడాలంటే నిర్వహణకు సంబంధించిన నిబంధనలు మెరుగుపర్చాలి. తెవికీని ప్రగతిపథంలో నడిపించడానికి ఇతర వికీలలో మెరుగైన నిబంధనలు గమనించి అలాంటి పద్దతులు పాటించడానికి ప్రయత్నిస్తే నైనా తెవికీ బాగుపడవచ్చు. నిర్వాహకుడిగా కొనసాగాలంటే ఆ గణాంకాలను ఒక్క రోజులో సాధించవచ్చేమో కాని అది పిల్లచేష్టలా ఉంటుంది. అలాంటి అవసరం ఉండరాదు. నిర్వాహకత్వం అనేది హుందాగా కొనసాగాలి. అది స్వచ్ఛందంగా చేయాల్సిన ఒక విధినే కాని బాధ్యతగా మారరాదు. నిర్వాహకత్వం అనేది ఉత్సాహంగా చేసేటట్లుగా ఉండాలి కాని గణాంకాలను చేరుకోవడానికి ఆయాసపడేటట్లుగా కారాదు. నిర్వాహకత్వం అనేది శాశ్వతం కాదు, కాని ఏదో కొంతకాలం చురుకుగా ఉండనంత మాత్రాన (గణాంకాలు చూపనంతమాత్రాన) దూరం చేయడం భావ్యమూకాదు. ఇప్పుడు చురుకుగా ఉన్న సభ్యులు ఏవైనా నిబంధనలు రూపొందించుకోవచ్చు. పాలసీలు తయారుచేయడం కష్టమేమీ కాదు. కాని ఆ నిబంధనలు ఒకప్పుడు తెవికీ ప్రగతికి తోడ్పడినవారికి బాధ కలిగించకుండా ఉంటేచాలు. నిర్వాహకుల సంఖ్యకు పరిమితి ఉండి, ఆ పరిమితి వల్ల కొత్తగా నిర్వాహకులను తీసుకోవడం ఇబ్బందిగా ఉండి, ఇప్పుడున్న నిర్వాహకులు తెవికీకీ భారం అయితే చురుకుగా లేని నిర్వాహకులను తప్పకుండా తొలగించవచ్చు. కాని ఇప్పుడు తెవికీలో ఈ సమస్య ఏ మాత్రంలేదు. కాదుకాదు, ఇవేమీ కాదు, గణాంకాలే ముఖ్యం, నిర్వహణకు గణాంకాలే ప్రాతిపదిక, వ్యక్తిగతంగా ఎన్ని పనులున్నా సరే తెవికీలో నిర్వహణ గణాంకాలు చూపాల్సిందే అంటే మాత్రం మొదటగా నన్నే తొలగించండి. ఎందుకంటే నేను గణాంకాలను పూర్తి వ్యతిరేకిని. ఒకవేళ గణాంకాలకే మొగ్గుచూపుతూ నిబంధన చేస్తే నిర్వాహకత్వానికి రాజీనామా చేసేవారిలో నేనే ముందుంటాను. నిర్వాహణ అనేది సాధారణంగా సభ్యులు పొరపాట్లు చేసినప్పుడే తలెత్తుతుంది. సభ్యులు పొరపాట్లు చేయనప్పుడు నిర్వాహకులు తమ నిర్వాహణ గణాంకాలకై తామే కొత్త సభ్యుల లేదా అనామకుల (ఐపి అడ్రస్) అవతారమెత్తి పొరపాట్లు సృష్టించే పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. అలాచేసే అవకాశాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేము. తెవికీ అనేది ఇంకనూ చిన్న వికీనే. రోజూవారీ దిద్దుబాట్ల సంఖ్య చూసిననూ పరిమితమే. అందులో నిర్వహణ గణాంకాలకు సరిపడా పొరపాట్లు ఉండాయనుకోవడం అనుమాస్పదమే. నిర్వహణ దిద్దుబాట్ల సంఖ్యకై నిర్వాహకులు అతిగా ప్రవర్తిస్తే చివరికి కొత్త సభ్యుల పాలిట శాపంగామారి తెవికీ ప్రగతి మరింత కుంటుపడవచ్చు. నిర్వాహకులు కేవలం గణాంకాలపైనే దృష్టిపెడితే తెవికీ శుద్ధి, వ్యాసనాణ్యత తదితర గణాంకేతర నిర్వహణ పనులు కుంటుపడటం ఖాయం. అసలే చురుకైన నిర్వహకుల కొరత ఉన్న తరుణంలో కొత్తగా నిర్వాహకుల గణాంకాలు చూడటానికి ఒకరిద్దరిని కేటాయిస్తే అది వృధాప్రయాసగానే మారేపరిస్థితి తలెత్తవచ్చు. మొదటిపేజీ నిర్వహణ అనేది చాలా ముఖ్యమైన కార్యము. దీన్ని నిర్వహణ గణాంకాలలో చేర్చినప్పుడు పలువులు నిర్వాహకుల మధ్య ఈ శీర్షిక నిర్వహణకు పోటీ పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు. దేనికైనా సరే పోటీ ముఖ్యమే కాని అది స్నేహపూర్వకంగా ఉండాలి కాని ఘర్షణ లేదా ఉద్రిక్తతగా ఉండరాదు. మొత్తంగా చూస్తే ఈ నిబంధనలు సభ్యులు పొరపాట్లు చేయాలని ప్రోత్సహించేటట్లుగా ఉన్నాయి. సభ్యులు చేసే పొరపాట్లకై నిర్వాహకులు ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి తెచ్చుకోవడం శోచనీయమైన విషయం. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:18, 9 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మూసలు-రంగులు

[మార్చు]

నేను నిన్న పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు నందు ఉన్న మండలాలకు చెందిన మూసలు వర్గం:పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మూసలు రంగు వెలసిపోయినట్లు ఉంటే నేను దాని పాత రంగు మార్చి కొత్త రంగుతో మూసలు ఆకృతి మార్చాను. ఈ పని చేయుటకు సమూహ అభిప్రాయ సేకరణ తీసుకోవటం అనేది ఇంతకు ముందు నేను చూడలేదు. అందుకనే చర్చలో పెట్టలేదు. ప్రస్తుత వికీలో నా స్థితి, పరిస్థితి దృష్ట్యా (నా మీద సదభిప్రాయ సదుద్దేశ్య మనసులు చాలా వరకు కొరవడిన నేపథ్యంలో) ఇది ఒక నేరం లేదా వికీ నియమాలకు విరుద్ధం అని వికీ పెద్దలు తెలియజేస్తే వెంటనే ఉన్న పాత రంగునే పునరుద్ధరిస్తాను. దయచేసి తెలియజేయండి. JVRKPRASAD (చర్చ) 07:06, 10 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నా స్పందన వికీపీడియా:సహాయ_కేంద్రం#మూసలు-రంగులు విభాగంలో చూడవచ్చు.--అర్జున (చర్చ) 04:31, 11 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కొద్ది మార్పుతో కలిగిన వర్గాలు మెరుగైన వర్గంలో విలీనం గురించి

[మార్చు]

ఒకే వివరాల తెలిపే ఈ వర్గాలు లోని వ్యాసాలు మెరుగైన వర్గంలో విలీనం చేయవలసి ఉంది.ఇలా రెండు, మూడు వర్గాలు ఉన్న పరిస్థితి వలన ఏ ఒక్క వర్గంలోకి పూర్తిగా వ్యాసాలు వర్గీకరణ అయ్యే పరిస్థితి లేదు. మరికొంత గంధరగోళ పరిస్థితి కూడా ఉంటుంది.ఇది వికీ సంప్రదాయంకూడా కాదు.కావున ఈ దిగువ వివరింపబడిన వర్గాలులోని వ్యాసాలు మెరుగైన వర్గాలలోకి చేర్చి, మిగిలిన వర్గాలు దారి మార్పు చేయటానికి ప్రతిపాదిస్తున్నాను. మెరుగైన వర్గాలును సముదాయ సభ్యులు నిర్ణయం చేయటానికి ప్రతిపాదిస్తున్నాను. మొదటి వర్గం

  1. వర్గం:అమెరికా బుల్లితెర నటులు
  2. వర్గం:అమెరికా టెలివిజన్ నటులు
  3. వర్గం:అమెరికన్ టెలివిజన్ నటులు

రెండవ వర్గం

  1. వర్గం:2000లో అమెరికన్ టెలివిజన్ సిరీస్
  2. వర్గం:2000లో అమెరికన్ టెలివిజన్ ధారావాహికలు

వర్గం:అమెరికా పరిశీలించగా అమెరికన్ మొదలుతో సృష్టించిన వర్గాలు ఎక్కువుగా ఉన్నవి.అన్నీ ఒకే మాదిరిగా ఉంటే బాగుంటుందనేది నా అభిప్రాయం.అలాగే అమెరికాతో మొదలైన వర్గాలు అన్నీ అమెరికన్ వర్గాలుగా తరలింపు చేస్తే మంచిదని నాఅభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 15:42, 12 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు గారికి, వర్గాలను శుద్ధిపరిచే కార్యక్రమాలలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. సాధ్యమైనంతవరకు అర్ధమయ్యేతెలుగు పదాలు వుండడమే బాగుంటుంది. అలాగే ఒక విషయానికి ఒకే తెలుగు పదం వాడడం మంచిది. అందువలన నాకు నచ్చినవి వర్గం:అమెరికా టెలివిజన్ నటులు, లేక వర్గం:అమెరికా టెలివిజన్ ధారావాహికలు (అమెరికా ధారావాహికలు గురించి తెలుగులో ఎక్కువ వ్యాసాలు వుండవు కాబట్టి ఆంగ్లంలో వాడినంత వివరం అవసరంలేదు) --అర్జున (చర్చ) 01:41, 13 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావు గారు సూచించినట్లు మెరుగైన వర్గంలో విలీనం చేసి ,ఆయా వర్గాలు తొలగింపబడినవి.--యర్రా రామారావు (చర్చ) 06:55, 5 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసిద్ధ, ప్రఖ్యాత వంటి విశేషణాలు

[మార్చు]

వికీపీడియాలో ప్రసిద్ధ, ప్రఖ్యాత, ప్రముఖ వంటి విశేషణాలను జాగ్రత్తగా వాడాలనే సంగతి మనకు తెలిసిందే. ఏ పేజీలోనైనా అలాంటి విశేషణాలు - ప్రసిద్ధ రచయిత, ప్రఖ్యాత నటుడు వంటివి - వాడితే, వాటికి మూలాలు చూపించవలసి ఉంటుంది. అయితే, అనేక వ్యాసాల్లో ఈ పదాలు ఇప్పటికే చేరిపోయాఅయి. వాటికి మనం తగు మూలాలను చేరుస్తూ ఉండాలి, లేదా ఆ విశేషణాలను తొలగిస్తూ ఉండాలి. ఇకముందు అలాంటి విశేషణాలను చేర్చి, దాన్ని భద్రపరచే సమయంలో వికీ ఆ వాడుకరికి ఒక హెచ్చరిక చేస్తుంది. సదరు దిద్దుబాటుకు "విశేషణాలున్న పాఠ్యం" అనే ట్యాగును చేరుస్తుంది. ఇటీవలి మార్పులు పేజీలో ఆ మార్పు పక్కనే ఈ ట్యాగు కనిపిస్తుంది. వాడుకరులు సదరు దిద్దుబాటును చూసి, తగు మూలం ఉందా లేదా అని పరిశీలించి, అవసరమైన చర్య తీసుకునే వీలుంటుంది. ఈసరికే ఆ పదాలు ఉన్న పేరాగ్రాఫులో దిద్దుబాటు చేసినా (ఆ పదాలు ఇప్పుడు రాసినవి కాకున్నప్పటికీ) ఈ హెచ్చరిక, ట్యాగు వస్తాయి. వాడుకరులు గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 18:43, 15 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఇటీవల నేను మొదటి పేజీలో వచ్చే వికీపీడియా:చరిత్రలో ఈ రోజు క్యాలెండర్‌ పరిశీలించి, శుద్ధి చేశాను. దాదాపు ప్రతీరోజూ మొదటి పేజీలోనే అనేక ప్రసిద్ధలు, ప్రఖ్యాతలు వస్తున్నాయి. ప్రసిద్ధ, ప్రఖ్యాత, ప్రముఖ అన్న పదాలు తటస్థ దృక్కోణం పాలసీకి విరుద్ధమన్న విషయం కూడా అంత తేలికగా తట్టే సంగతి కాదు. మిగతా సభ్యుల సంగతీ విడిచి పెట్టి నేనే ఇటీవల వరకూ ఈ పదాలు వాడి, ఇటీవలే ఇవి తటస్థతకు వ్యతిరేకమని స్ఫురించి శుద్ధి ప్రారంభించాను. మీ ప్రయత్నం చాలా బావుంది. అభినందనలు. --పవన్ సంతోష్ (చర్చ) 06:26, 16 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
గతంలో నేను కూడా ప్రముఖ వంటి విశేషణాలను చాలావరకు ఉపయోగించాను. 2019 ఫిబ్రవరి 10, రెండవ ఆదివారం నాడు జరిగిన వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-ఆన్‌లైన్ శిక్షణా తరగతులులో ఈ విషయమై ప్రస్తావన వచ్చింది. అయితే, అలాంటి విశేషణాలను ఉపయోగించడం వికీ నియమాలకు విరుద్ధం కాబట్టి, నేను కూడా అలాంటి వ్యాసాలను శుద్ధిచేయాలి అనుకుంటున్నాను. చదువరి గారు చేసిన సూచన బాగుంది. "విశేషణాలున్న పాఠ్యం" అనే ట్యాగును చేర్చడం ద్వారా విశేషణాలున్న వ్యాసాలను సులభంగా గుర్తించవచ్చు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 08:46, 19 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరిగారు... ప్రముఖులు అనే పదం ఉన్న వర్గాలు చేర్చుతున్నప్పుడు కూడా హెచ్చరిక, ట్యాగు వస్తున్నాయి. అలా రాకుండా ఉండేలా అవకాశం ఉందా..?-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:57, 16 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వ నియమ నిబంధనలు - గడువు మరోసారి పొడిగింత

[మార్చు]

నిర్వాహకత్వ ఉపసంహరణ విధాన ప్రతిపాదన విషయమై చర్చ జరుగుతోందని వాడుకరులు గమనించే ఉంటారు. ఈ చర్చలో వాడుకరులందరూ (నిర్వాహకులు మాత్రమే కాదు) పాల్గొని, సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిర్వాహకులు ఇలాంటి విధాన నిర్ణాయక చర్చల్లో చురుగ్గా పాల్గొని, సరైన విధానాన్ని తయారు చేసుకోవడంలో ఇతోధికంగా తోడ్పడాల్సి ఉంది. నిరాహకత్వ బాధ్యతల్లో విధానాల తయారీ ఒకటని మనకు తెలియనిదేమీ కాదు. బహుశా ఇతర పనులతో బిజీగా ఉండటం వలన ఈ చర్చలో పాల్గొనడం కుదిరి ఉండకపోవచ్చు. అంచేత, ఈ చర్చ వ్యవధి మరొక వారం పాటు, 2019 ఫిబ్రవరి 23 వరకు, పొడిగించబడింది.

@K.Venkataramana:, @Pranayraj1985:, @Rajasekhar1961:, @T.sujatha:, @Veeven:, @రహ్మానుద్దీన్:, @స్వరలాసిక: - ఈ పొడిగింపును గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 19:01, 15 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు, జరుగుతున్న చర్చలు మొదటి నుండి చూస్తున్నాను. ఈ మధ్యన వాడుకరులు కూడా వారివారి అభిప్రాయాలు కూడా తెలియజేయ వచ్చును అని అడుగుతున్నారు. నిర్వాహకులు స్పందించ వలసిన వారు ఇంకా ఉన్నారు. వాడుకరులు ఎప్పుడు స్పందించాలి, స్పందించ వలసిన వాడుకరుల పేర్లు కూడా మీరు ఉటంకిస్తే, వాడుకరుల అభిప్రాయాలు సదుద్దేశ్యంతోనే చర్చలో అనుమతిస్తారు కనుక, సూచించిన వాడుకరుల అభిప్రాయాలు త్వరగా వచ్చేందుకు అవకాశం ఉండవచ్చునని నాకు తోచుచున్నది. పేర్లు సూచించని వారు కూడా వీరితోపాటు స్పందించండి అని చెబితే చర్చ బాగా ముందుకు వెళ్ళవచ్చును. JVRKPRASAD (చర్చ) 00:29, 16 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారూ, ఇలాంటి అనుమానాలు వస్తాయనే "ఈ చర్చలో వాడుకరులందరూ (నిర్వాహకులు మాత్రమే కాదు) పాల్గొని, సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది." అని రాసాను. ఈ విషయంలో నిర్వాహకులకు మరింత బాధ్యత ఉందని భావించడం, వారి సంఖ్య కూడా తక్కువగా ఉండటం కారణంగా వారి పేర్లు ఉటంకించానంతే. వాడుకరులందరి పేర్లూ ఉటంకించడం సాధ్యం కాదు గదా. ఏది ఏమైనప్పటికీ, అనుమానం రానే వచ్చింది కాబట్టి మరోసారి వివరణ ఇస్తూ... పేర్లు సూచించని వారు కూడా వీరితోపాటు స్పందించండి. __చదువరి (చర్చరచనలు) 01:24, 16 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, క్రియాశీలక వాడుకరులలో సీనియర్ సభ్యులు చాలా కొద్దిమంది ఉన్నారు కనుక పిలుపుకు పెద్ద కష్టమేమీ కాదండి. ప్రస్తుతం నేను (పరోక్ష వాడుకరిని (అనగా ప్రత్యక్షంగా తరచుగా ఇతర వాడుకరులతో వ్యక్తిగతంగా కలుసుకోలేని వ్యక్తిని) మరియు తొలగించబడిన నిర్వాహాకుడను. నా అభిప్రాయములు, సలహాలు, సందేహాలు మీరు చేసి చర్చలలో పొందుపరచ వచ్చునో లేదో నాకు తెలియదు. దయచేసి తెలిజేయండి. JVRKPRASAD (చర్చ) 04:56, 16 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
నా అభిప్రాయం మేరకు - మీరు చర్చలలో పాల్గొనవచ్చు, అందు కభ్యంతరమేమీ లేదు. __చదువరి (చర్చరచనలు) 05:25, 16 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఎస్ వి జి అనువాద కాంపైన్ 2019

[మార్చు]

ఎస్ వి జి అనువాద కాంపైన్ 2019 ఫిబ్రవరి 21 ( అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం ) నుండి ప్రారంభమవుతుంది. ప్రాంతీయ భాషా వికీపీడియాల్లో వాడకం కోసం ఎస్ వి జి ఫైళ్లను భారతీయ భాషలలోకి అనువదించడానికి 38 రోజులు పాటు ఈ కాంపైన్ జరుగుతుంది. 2018 సెప్టెంబరులో వికీ గ్రాఫిస్ట్స్ బూట్ క్యాంప్ తరువాత, వెక్టర్ బొమ్మలను (ఎస్ వి జి వెక్టార్ గ్రాఫిక్స్ కోసం ఒక ఫార్మాట్ , రేస్టర్ గ్రాఫిక్స్ కోసం జె పి జి వంటివి) సృష్టించడానికి ఇంక్ స్కేప్ మరియు ఇతర సాధనాలను ఉపయోగించి శిక్షణ కోసం భారతదేశం, ఇతర పొరుగు దేశాల నుండి చాలామంది వికీమీడియన్లు పాల్గొన్నారు. ఈ కాంపైన్ దాని తరువాయి ప్రాజెక్టు గా చేస్తున్నారు. అంతేకాక భారతీయ సముదాయాల్లో వెక్టార్ గ్రాఫిక్స్ వినియోగాన్ని ప్రోత్సహించడం కూడా దీని లక్ష్యం. తరచుగా, మనం ఆంగ్ల-లేబుల్ ఎస్ వి జి ఫైళ్ళను ఇండియన్ వికీపీడియాలో వాడుతున్నాము, ఈ కాంపైన్ మన భాషల లేబుల్స్ తో స్థానికీకరించిన ఎస్ వి జి ఫైళ్ళను వికీపిడియాల్లో ఉపయోగించటానికి పనికివస్తుంది.

సాధనాలను: మీరు ఈ కాంపైన్ లో పాల్గొనడానికి అన్ని వనరులను కింద లింక్ లో చూడవచ్చు c:Commons:SVG Translation Campaign 2019 India / Resources. దీనిలో ఇన్క్ స్కేప్ ను ఉపయోగించి ఎస్విజి లను అనువదించడం గురించి తెలుసుకోవడానికి 24 నిమిషాల వీడియో ట్యుటోరియల్ ఉంటుంది (https://www.youtube.com/watch?v=O5OOZMIq-8A). ఈ పుటలో ప్రచారం, ఇంక్ స్కేప్ సంబంధిత వనరులు, ఫాంట్లు ఉపయోగించడం (డౌన్ లోడ్ మరియు ఇన్ స్టాల్), నిఘంటువులు (దయచేసి మీ భాషా పేజీలను జోడించండి) వంటివి ఉన్నాయి.

చిత్రాలు జాబితా: అన్ని భాషలలో అనువాదానికి పనికివచ్చే చిత్రాల జాబితా ఇక్కడ (link ) అందుబాటులో ఉంది: c:Commons:SVG Translation Campaign 2019 in India/File list. ఈ కార్యక్రమం 21 ఫిబ్రవరి 2019 నుంచి మొదలవుతుంది. ముందుగా , సాధన కోసం జాబితాలు కూడా ఉన్నాయి (20 చిత్రాలు) SVG అనువాద సాధన. ఇవన్నీ పైన పేర్కొన్న "ఫైల్ జాబితా" పేజీలో పొందవచ్చు.

సహాయ కేంద్రం: మీరు SVG అనువాదానికి సంబంధించిన ప్రశ్నలు అడగాలనుకుంటే, దయచేసి వాటిని సహాయ కేంద్రం కి పోస్ట్ చేయండి.

సంప్రదింపు: మీ భాషకు సంబంధించిన ప్రశ్నల విషయంలో నిర్వాహకుల పేజీ లోని భాష నిర్వాహకులను సంప్రదించండి. దయచేసి పాల్గొనడానికి ఇక్కడ నమోదు అవ్వండి: c:Commons:SVG Translation Campaign 2019 in India/Participants మీరు ఈ కార్యక్రమానికి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లో చేరవచ్చు. https://t.me/joinchat/E1HSNhOXJZWnxus-36PuNA Sumanth699 (చర్చ) 18:57, 19 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఎస్ వి జి అనువాద కాంపైన్ 2019 ఆన్సైట్ ఈవెంట్ 3 మార్చ్ 2019 ఆదివారం హైదరాబాద్ లో జరగనుంది. ఈ కార్యక్రమం 3 నుంచి 4 గంటలు జరుగుతుంది. ఆసక్తి వున్నవారు saisumanth532@gmail.com కి మీ యొక్క సమాచారం (యూసర్నేమ్, మొబైల్ నెంబర్) పంపించండి. కార్యక్రమ పేజీ ఇక్కడే అందిస్తాం. Sumanth699 (చర్చ) 14:45, 27 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Talk to us about talking

[మార్చు]

Trizek (WMF) 15:01, 21 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ప్రతిపాదన చాలా ముఖ్యమైనదిగా నాకు తోస్తోంది. చర్చా పేజీని మరింత వీలుగా, మరింత సులువుగా, మరింత ప్రయోజనకరంగా తయారు చేసేందుకు ఉద్దేశించనది ఈ సమాలోచన. మనమూ ఈ చర్చలో పాల్గొని మన అభిప్రాయాలను కలబోసుకుందాం. __చదువరి (చర్చరచనలు) 06:06, 22 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ! ఇక్కడ సైన్-అప్ అవుదాం అండీ. ఇది ప్రయోజనకరంగా కనిపిస్తోంది. ఫ్లాగ్ చేసినందుకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 08:14, 24 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు టైగర్ సంప్రదింపుల కార్యక్రమంలో ప్రాతినిధ్యం

[మార్చు]

భారతీయ భాషల వికీపీడియాల్లో స్థానికంగా ఆసక్తిదాయకమైన, అత్యున్నత నాణ్యత కలిగిన సమాచారాన్ని పెంపొందించే లక్ష్యంతో 2018లో ప్రాజెక్టు టైగర్ తొలి దశ సాగింది. ఇందులో భాగంగా భారతీయ భాషల వికీపీడియన్లకు ఇంటర్నెట్, లాప్టాప్ మద్దతు అందించడం, భారతీయ భాషల వికీపీడియాల్లో ప్రాజెక్టు టైగర్ వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది ప్రాజెక్టు మలిదశ కూడా మొదలుకానుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రాజెక్టు టైగర్ సంప్రదింపు కోసం ఓ ఆఫ్ లైన్ కార్యక్రమం మార్చి తొలివారంలో చెన్నైలో జరుగనుంది. ఈ కార్యక్రమం కోసం పాల్గొన్న భాషల నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ఇద్దరిద్దరు వికీపీడియన్లను ఎంచుకుని ఆహ్వానించడం జరిగింది. అలా ఆహ్వానించిన క్రమంలో తెలుగులో ప్రాజెక్టు టైగర్ పోటీలో అతిఎక్కువ వ్యాసాలు ఆమోదం పొందిన తొలి ముగ్గురు వికీపీడియన్లను ఆహ్వానించగా వారికి వ్యక్తిగతంగా పాల్గోలేని స్థితి ఏర్పడడంతో ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఇక జ్యూరీ సభ్యుల్లో ఒకరిని ఆహ్వానించినా, వారూ రాలేని స్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వాడుకరి:Ajaybanbiని ప్రాతినిథ్యం వహించమని ఆహ్వానించడం జరుగుతోంది. ఇందుకు మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి - ఆయన ఈ పోటీలో తెలుగు తరఫున జరిగిన ఏకైక ఆఫ్లైన్ కార్యక్రమాన్ని నిర్వహించారు, రెండవది - పోటీలో భాగస్వామ్యం వహించి కొన్ని వ్యాసాలు ఆమోదం పొందేలా రాశారు, మూడోది - ఈ ప్రాజెక్టు టైగర్లో మరో భాగమైన భారతీయ వికీపీడియన్లకు మద్దతు అన్నదాంట్లో ఇంటర్నెట్ మద్దతు స్వీకరించారు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 09:45, 22 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ - నిర్ణయం

[మార్చు]

వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ ప్రతిపాదనపై చర్చకు మనం పెట్టుకున్న గడువు ముగిసింది. గడువు పొడిగింపును ఎవరూ కోరుకోవడం లేదని భావిస్తూ, చర్చలో పాలుపంచుకోని నిర్వాహకులెవరైనా చర్చను ముగించి ఫలితాన్ని వెల్లడించాలని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 02:48, 24 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కులాలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక జాగ్రత్త - పాలసీ ప్రతిపాదన

[మార్చు]

కులాలకు సంబంధించిన అంశాలలో ప్రత్యేక జాగ్రత్త అని ఒక పాలసీ ప్రతిపాదించడం జరిగింది. దయచేసి తోటి నిర్వాహకులు, వాడుకరులు పాలసీని పరిశీలించి చర్చించవలసిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:09, 25 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ అంశాల్లోని వ్యాసాలను దాడుల నుంచి కాపాడుతూ, ఇబ్బందులు ఎదుర్కొని నిర్వహణ చేసిన @K.Venkataramana: గారు, తదితరులు దయచేసి తమ అభిప్రాయం పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీరు గతంలో సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలు ఉండడం వల్ల ఈ పాలసీలోని అంశాలను మరింత సమర్థంగా తీర్చిదిద్దగలరని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 14:46, 26 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వికీటెక్స్టు ఎడిటరుతో ఇబ్బంది

[మార్చు]

ఈ మధ్య వికీటెక్స్టు ఎడిటరుతో ఇబ్బంది ఎదురౌతోంది. చాలా నెమ్మదిగా ఉంటోంది. టైపు చేస్తోంటే, కీని నొక్కిన కాసేపటికి గాని అక్షరం పడటంలేదు. చాలా బద్ధకంగా రాస్తోంది. విజువల్ ఎడిటర్లో ఆ సమస్య లేదు. ఇతర వాడుకరులకూ ఆ సమస్య ఉంటే, దాన్ని రిపోర్టు చేద్దాం. __చదువరి (చర్చరచనలు) 02:13, 27 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సమస్యాత్మక శీర్షికలు గల పేజీలు

[మార్చు]

తెవికీలో కొన్ని పేజీల శీర్షికలలో కొందరు వాడుకర్లు ZWNJ/ZWJ వాడారు. పదం మధ్యలో అక్షరాలు అతుక్కోకుండా అక్షరానికి, అక్షరానికి మధ్యలో ZWNJ వాడుతాం. ఉదా: రాజ్కుమార్ కి బదులు రాజ్‌కుమార్ రావటానికి. అయితే కింద చెప్పిన వ్యాసాల శీర్షికల్లో పదం మొదట్లో, అవసరం లేని చోట ఈ ZWNJ/ZWJ ని వాడారు : కెప్టెన్ రాజు, క్రాంతికుమార్, ఛాంపియన్, జేమ్స్ బాండ్ (అయోమయ నివృత్తి), జ్ఞానేశ్వర్, డాక్టర్ ఆనంద్, డియర్ బ్రదర్స్, డిస్కో కింగ్, డేంజర్ లైట్, డ్రైవర్ మోహన్, దయ్యాల దర్బార్, దొంగలకు సవాల్, దొంగా పోలీస్, నిజాం కాలేజీ, ఫిల్మ్ నగర్, బందిపోటు భయంకర్, బస్తీమే సవాల్ ఏజెంట్ 007, బాచిలర్స్, బావా మరదళ్ల సవాల్, బ్లాక్ టైగర్, భక్త కబీర్, భక్త జయదేవ, భక్త జయదేవ్, భక్త రఘునాథ్, భగత్, భగవాన్, భలే పోలీస్, భారత నివాస్, భారత్ బంద్, భార్గవ్, భార్యాభర్తల సవాల్, మర్డర్,మిస్ 420, మృగం, లేబూరు బిట్ - ii, వేమూరి వేంకటేశ్వరరావు, శ్రీదేవి (నటి), శ్రీరాంనగర్ (ct), సర్కార్ ఎక్స్‌ప్రెస్, హరవిలాస్, హలో డార్లింగ్, హలో పార్టనర్, హలో బ్రదర్, భారత ఆర్ధిక వ్యవస్థ. కొన్ని శీర్షికలలో zwnj తొలగించి తరలించాను. శీర్షికలలో ఈ కంట్రోల్ క్యారక్టర్ ఉంటే అవి అక్షరక్రమంలో కనిపించవు. ఇవి ఎలా తొలగించాలో అర్ధం కావటం లేదు. --రహ్మానుద్దీన్ (చర్చ) 13:41, 27 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@రహ్మానుద్దీన్ గారికి, నా పరిశీలనలో ఇవి user:vyzbot ద్వారా యాంత్రికంగా సృష్టించబడి, దోషం తెలిసినమీదట దారిమార్పుతో పేరు మార్చబడినట్లుగా వుంది. ఉదాహరణ కెప్టెన్ రాజు, జ్ఞానేశ్వర్. దారిమార్పుగల వ్యాసాలను తొలగించితే సరిపోతుందనుకుంటాను. --అర్జున (చర్చ) 05:14, 28 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]