Jump to content

వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 44

వికీపీడియా నుండి

పాత చర్చ 43 | పాత చర్చ 44 | పాత చర్చ 45

alt text=2015 ఆగస్టు 30 - 2015 డిసెంబరు 11 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2015 ఆగస్టు 30 - 2015 డిసెంబరు 11

తెలుగు వికీపీడియాలో స్తబ్దత

[మార్చు]

తెలుగు వికీపీడియాలో తిరిగి రచనలు ప్రారంభించాలనుకొంటున్నాను. (వికీసోర్సు నుండి తొలగించబడిన పుస్తకాలన్నీ అర్జునరావు, రహ్మానుద్దీనుల చొరవతో తిరిగి స్థాపించబడ్డాయి) నా యొక్క విలువైన సమయాన్ని సద్వినియోగం చేయడానికి, నా సోదర సభ్యుల సలహాలు కోరుతున్నాను. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 09:39, 30 ఆగష్టు 2015 (UTC)

డాక్టరు Rajasekhar1961 గారు, నమస్కారము. మీరు కొద్దికాలము కేవలం విశ్రాంతి తీసుకున్నారు. మీరు అందుబాటులో లేని లోటు లోటుగానే ఉంటుంది. ముఖ్యంగా, పనిచేసే మరియు పనిచేయించ గలిగే మీలాంటి వారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటేనే మాలాంటి వారికి ఒక దారి తెన్నూ లభిస్తుంది. మీరు ప్రశ్నించండి, వీలయితే సమాధానము చెప్పగలుగుతాము. మీకు శుభాభివందనములు. JVRKPRASAD (చర్చ) 11:48, 30 ఆగష్టు 2015 (UTC)
ధన్యవాదాలు. సభ్యులందరికీ అందుబాటులో ఉంటూ మీ అందరి సహాయ సహకారాలతో తెవికీని మరింత ముందుకు తీసుకొని పోవడానికి ప్రయత్నిస్తాను.--Rajasekhar1961 (చర్చ) 13:40, 30 ఆగష్టు 2015 (UTC)
Rajasekhar1961 గారు వికీపీడియా వ్యాసాలను అభివృద్ది చేయడానికి కృషి ప్రారంభించ సంకల్పించినందుకు ధన్యవాదాలు. వారికి సంపూర్ణ సహకారం అందించగలను. వారి సారధ్యంలో వికీ మరింత అభివృద్ధి చెందగలదు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 14:10, 30 ఆగష్టు 2015 (UTC)
  • రాజశేఖర్ గారూ పున:స్వాగత శుభాకాంక్షలు. నేను తెలుగు సినిమా వ్యాసాలపై చేస్తున్న కృషిని గమనించి, దానిని ఇతర సభ్యుల సహకారంతో మరింత వ్యాపితం చేసేందుకు మీరిచ్చిన సూచనలతో ప్రాజెక్టు ఉపపేజీ ప్రారంభించాను. మీలాంటి అనుభవజ్ఞులు అంకితభావం కలవారు ఈ ప్రణాళికలో పాలుపంచుకుంటే బావుంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 07:18, 31 ఆగష్టు 2015 (UTC)
తప్పకుండా నేను భాగస్వామిగా సినిమా వ్యాసాలను అభివృద్ధి చేద్దాము. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 11:04, 31 ఆగష్టు 2015 (UTC)
నేను మీకు సహాయపడగలను, నా వద్ద తెలుగు సాంకేతికత ఉన్నది, వ్యాసాలు వ్రాయడములో మీకు సహాయపడగలను. ఏమైనా సహాయపడగలను అనుకుంటే నాతో చెప్పండి. ధన్యవాదములు -- శ్రీనివాస్ (చర్చ | మార్పులు) 15:59, 31 ఆగష్టు 2015 (UTC)

క్రికెట్

[మార్చు]

క్రికెట్ నకు సంబందించిన వ్యాసాలు తెలుగు వికిపీడియ లో ఎవరు కూడా వ్రాయడం లేదు, ప్రస్తుతం జరుగుతున్న వాటిల్లో నేను శ్రీలంక పర్యటనలో భారత క్రికెట్ జట్టు 2015 అనే దానిని వ్రాయనారంబించితిని. మీరు కూడా నాతో సహకరించండి. మీరు కూడా మరిన్ని వ్యాసాలు వ్రాయుటకు మీ సహకారాన్ని అందించండి. ధన్యవాదములు. శ్రీనివాస్ (చర్చ | మార్పులు) 13:58, 30 ఆగష్టు 2015 (UTC)

శ్రీనివాస్ గారూ మీరు క్రికెట్ సంబంధిత వ్యాసాలను వ్రాయ సంకల్పించినందుకు ధన్యవాదాలు. మా సహకారం ఎప్పుడూ ఉంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 14:07, 30 ఆగష్టు 2015 (UTC)
ధన్యవాదములు కె.వెంకటరమణ, మనము మిగిలిన అన్నీ క్రికెట్ వ్యాసములు, మూసలు, వర్గములు మొదలగునవి కూడా వ్రాయదలచితిని. శ్రీనివాస్ (చర్చ | మార్పులు) 14:17, 30 ఆగష్టు 2015 (UTC)
వ్రాయండి. సహకరిస్తాము.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 14:39, 30 ఆగష్టు 2015 (UTC)
చాలా మంచి ప్రణాలిక. క్రికెట్ గురించిన మంచి సమాచారం ఆంగ్ల వికీపీడియాలో కలదు. వానినుండి తెలుగులోకి అనువాదం చేసుకొంటే కొంతవరకు పని జరుగుతుంది. నేను మీకు సహాయం అందించగలను.--Rajasekhar1961 (చర్చ) 15:14, 30 ఆగష్టు 2015 (UTC)

మూలాలు చేర్చే మూసలు కనపడడం లేదు

[మార్చు]

మూలాలు చేర్చండి అన్న బార్ పెట్టి, దానిలో సైట్ వెబ్, సైట్ న్యూస్, సైట్ బుక్, సైట్ జర్నల్ అన్న నాలుగు మూసలు, పేరుపెట్టిన మూలాలు, తప్పుల తనిఖీ అనేవి చేర్చారు. ఇన్నాళ్ళుగానూ మొత్తం మూస మార్కప్ కోడ్ రాసుకోకుండా బటన్ ద్వారానే వినియోగించుకుంటున్నాను.కానీ ఇప్పుడు సైట్ వెబ్, సైట్ న్యూస్, సైట్ బుక్, సైట్ జర్నల్ అన్న నాలుగింటిపై క్లిక్ చేసినా అందులో నింపేందుకు ఖాళీలు కనిపించడంలేదు. నేను నేరుగా మార్కప్ కోడ్ తెచ్చి వినియోగించుకుంటున్నాను. తిరిగి మొదట్లో వైజాసత్య గారు స్థాపించినప్పుడున్న విధంగా వచ్చేలా ఎవరైనా ప్రయత్నిస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 13:36, 1 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సరి చేసాను. వైజాసత్య గారు ఇక పై ఏదయినా గ్యాడ్జెట్ స్థాపించినపుడు తగు రీతిలో ఆ గ్యాడ్జెట్ పాఠ్యీకరణను అందించగలరు. అలా జరిగి ఉంటే తక్కువ సమయంలోనే ఈ సమస్య పరిష్కరించగలిగేవాణ్ణి. --రహ్మానుద్దీన్ (చర్చ) 09:34, 5 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామవ్యాసాలను అభివృద్ధి చేయు వాడుకరులకు వినతి

[మార్చు]

మీరు తెవికీలో గ్రామ వ్యాసాలను సరిదిద్దుతున్నందుకు ధన్యవాదాలు. మీరు గ్రామవ్యాసాలలొ చిన్నమార్పు చేస్తున్నప్పుడు పేజీని భద్రపరచే ముందు " ఇది ఒక చిన్న సవరణ" అనే బాక్సులో క్లిక్ చేసి భద్రపరచండి. అలా చేయనిచో ఇటీవల మార్పులను పర్యవేక్షించడానికి యిబ్బందిగా ఉంది. మీరు చేస్తున్న చిన్నమార్పులు అనేక వేలసంఖ్యలో ఉన్నందున మధ్యలో అనామక వాడుకరులు ఏవైనా దుశ్చర్యలకు పాల్పడినట్లైతే గుర్తించడానికి నిర్వాహకులకు యిబ్బందిగా ఉంటుంది. మీరు " ఇది ఒక చిన్న సవరణ" ను గుర్తిస్తే యిటీవలి మార్పులలో చిన్నమార్పులను హైడ్ చేసి మిగిలిన మార్పులను పర్యవేక్షించడానికి అనుకూలంగా ఉంటుంది.సహకరింపవలసినదిగా కోరుచున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 01:48, 2 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారు, నేను minor edit అనే ఇస్తున్నాను. తదుపరి, మీరు గుర్తించవలసినవి:

(1) గ్రామము అనే బదులు గామము అని ఉంటోంది.
(2) వ్యవసాయము అనే చోట వ్వవసాయము అని ఉంది.
(3) జనాభా బదులు జనబ, జనబా జనాబా జనాబ ఇలా ఉంది.
(4) మూలాలు అనే చోట మూలం వ్రాయడము జరుగుతోంది
(5) మూలాలు దాని క్రింద మూలాల జాబితా మూస ఉండాలి. ఆ రెండింటి మధ్య మూలం ఉంటున్నది.
(6) జనాభా లెక్కలు చాలా చోట్ల తప్పులు ఉన్నవి.
(7) ఒక జిల్లాకు బదులు మరో జిల్లా కోడ్ చాలా చోట్ల ఉన్నాయి
(8) మూసలలోని గ్రామాల జాబితాకు, ఆ మండలములోని జాబితాకు కొన్ని మూసలలో పొంతన లేదు.
(9) మండలములోని గ్రామాల జాబితాకు, ఆ మండలమునకు చెందిన మూస మరియు జాబితాకు పొంతన చాలావాటికి లేదు.
(10) చాలా గ్రామాలకు బాక్స్‌లు, ఇతరములు పొందుపరచాలి.
(11) అనేక విభాగాలు తొలగించవలసిన అవసరము ఉన్నది.
(12) తక్కువ సమయములో తప్పులు లేకుండా ఎక్కువ పని చేయనవసరము ఉన్నది.
(13) చెప్పాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. అయినా ఇది నేను ఎవరినీ విమర్శించే ఉద్దేశ్యముతో వ్రాయ లేదు. పని చాలా ఉంది. చేసే పని మెచ్చుకోక పోయినా ఇబ్బంది లేదు, కానీ విమర్శలతో రాజకీయాలు చేయాలనుకునే వారికి తగు సలహాలు, సూచనలు ఇవ్వగలరు.
(14) గ్రామాలలో జరుగుతున్న పని నేను చేస్తున్నది వివరించమంటే వివరంగా వివరించగలను.
(15) నా పని లేదా నా గురించి ఏమైనా ఎవరికయినా నా నుండి తెలుసు కోవాలనుకుంటే తప్పకుండా జవాబు ఇస్తాను.

ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 02:05, 2 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పైన మీరు తెలియజేసిన కార్యక్రమమాలు మహోన్నతమైనవి. యివి వికీపీడియా అభివృద్ధికి, గ్రామవ్యాసాల అభివృద్ధికి తోడ్పడే మంచి విధానాలు. వికీపీడియాలో వ్యాసాల శుద్ధి కార్యక్రమాలకోసం నిరంతరం అలుపెరుగక కృషి చేస్తున్న వాడుకరులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఆటోవికీ బ్రౌజర్ లో చేస్తున్న మార్పులకు మైనర్ ఎడిట్స్ గా వస్తున్నాయి. మామూలుగా చిన్నమార్పులు చేస్తున్న కొందరు గౌరవ సభ్యులు మైనర్ ఎడిట్స్ గుర్తించమని మనవి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:23, 2 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారు, మీరు ఇస్తున్న పోత్సాహం ఓపిక లేకున్నా మరింత కష్టపడి పని చేయాలనిపిస్తోంది. పునాది పని చేస్తున్నాను. ఒక్కొక్క గ్రామాన్ని చూసి తప్పులు తదుపరి సరి చేస్తాను. వీలయినంత వరకు వ్యాసపుటను ఉన్నంతలో అందముగా వచ్చేవిధముగా తీర్చిదిద్దుతాను. నేను చేస్తున్న విధానము తప్ప మరో మార్గము తక్కువ సమయములో ఎక్కువ పని చేయుటకు అవకాశము లేదు. తదుపరి, గణాంకాలు [1]నందు పురుషుల: మరియు స్త్రీల: అని వ్రాయడము జరిగినది. జనాభా సంఖ్యను పురుషులు: మరియు స్త్రీలు: అని ఉండాలి అని నా అభిప్రాయము. దయచేసి దీని మీద స్పందించగలరు. JVRKPRASAD (చర్చ) 03:16, 2 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారూ, అనేక గంటలు వికీపీడియా అభివృద్ధికి కష్టపడి పనిచేయడానికి ఓపిక,కృషిచేసే సామర్థ్యం, ఉన్న మీవంటి వాడుకరులకు బాటు ద్వారా చేయడం తెలియదు. బాటులు నడిపే వారికి చేయడానికి తగినంత సమయం ఉండకపోవచ్చు! అందువల్ల మీ వంటి వారు తక్కువకాలంలో వేగంగా గ్రామవ్యాసాలను వృద్ధి చేయడానికి ఆటోవికీబ్రౌజర్ చాలా ఉపయోగపడుతుంది. ఏ విధానంలో చేసినా మన అంతిమ లక్ష్యం వికీపీడియా లో వ్యాసాల అభివృద్ది చేయుట.కనుక మీ కృషిని కొనసాగించండి. గ్రామవ్యాసాలలో ఖాళీ భాగాలు తొలగించుట, గణాంకాలు చేర్చుట వంటి విషయాలు చేస్తున్న వాడుకరులందరికీ ధన్యవాదాలు. మీరు సూచించిన గ్రామవ్యాస లింకు లో [2] లో పురుషుల, స్త్రీల పదాలకు బదులుగా పురుషులు, స్త్రీలు అనే ఉండాలి. సరిదిద్దండి. వికీదేవాలయాన్ని శుద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:49, 2 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నిజంగా అద్భుతమైన కృషి, ఇలాంటి చిన్న చిన్న మార్పులు, అక్షర దోషాల గుర్తింపు వెంటనే జరగవల్సిన అవసరం ఉంది..--విశ్వనాధ్ (చర్చ) 04:23, 3 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Introducing the Wikimedia public policy site

[మార్చు]

Hi all,

We are excited to introduce a new Wikimedia Public Policy site. The site includes resources and position statements on access, copyright, censorship, intermediary liability, and privacy. The site explains how good public policy supports the Wikimedia projects, editors, and mission.

Visit the public policy portal: https://policy.wikimedia.org/

Please help translate the statements on Meta Wiki. You can read more on the Wikimedia blog.

Thanks,

Yana and Stephen (Talk) 18:13, 2 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

(Sent with the Global message delivery system)

Open call for Individual Engagement Grants

[మార్చు]

My apologies for posting this message in English. Please help translate it if you can.

Greetings! The Individual Engagement Grants program is accepting proposals until September 29th to fund new tools, community-building processes, and other experimental ideas that enhance the work of Wikimedia volunteers. Whether you need a small or large amount of funds (up to $30,000 USD), Individual Engagement Grants can support you and your team’s project development time in addition to project expenses such as materials, travel, and rental space.

Thanks,

I JethroBT (WMF), Community Resources, Wikimedia Foundation. 20:52, 4 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

(Opt-out Instructions) This message was sent by I JethroBT (WMF) (talk) through MediaWiki message delivery.

వృక్షశాస్త్రం పై జరుగుతున్న కార్యక్రమ తదుపరి ఆవృతం సెప్టెంబర్ 11,12, 13 తేదీలలో జరుగనుంది. ఆసక్తి గల వారు పాల్గొనగలరు. సీఐఎస్-ఏ2కే నుండి పవనజ ఈ కార్యక్రమాన్ని నడుపుతారు, విజయవాడలో ఆ సమయంలో ఉండే సముదాయ సభ్యులు పవనజ ను కలవవచ్చు. పవనజ కన్నడ వికీపీడియాలో నిర్వాహకులు, అంతకు ముందు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, టీఐఎఫార్ లలో పని చేసిన అనుభవముంది. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:51, 5 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు రహ్మానుద్దీన్ గారు. ఇది మంచి అవకాశం. నాకు పాల్గొనాలనే ఉందికాని, 12వ తేదీన గోల్డెన్ త్రెషోల్డ్ లో కవిసంగమం కవిత్వపఠన కార్యక్రమం జరుగుతుంది. అక్కడి ఏర్పాట్లు నేనే చూసుకోవాలి. కనుక నేను పాల్గొనడానికి వీలుపడదు. --Pranayraj1985 (చర్చ) 18:22, 5 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సీఐఎస్-ఏ2కే ప్రోగ్రాం అసోసియేట్ దరఖాస్తుల గురించి

[మార్చు]

విజ్ఞాపన కు చాలా తక్కువ (రెండు) స్పందనలు మాత్రమే వచ్చాయి కనుక, అభ్యర్థిత్వానికి గల ఆఖరి తేదీని 15 సెప్టెంబర్ కు మార్చడమైనది. సభ్యులు గమనించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:23, 7 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియాకు కావలసిన వనరుల గురించి పవనజతో సమావేశం

[మార్చు]

అందరికి నమస్కారం... సెప్టెంబర్ 11,12,13 తేదీలలో ఆంధ్ర లొయోల కళాశాలలో వృక్షశాస్త్రం పై జరుగుతున్న కార్యక్రమానికి సీఐఎస్-ఏ2కే నుండి పవనజ వస్తున్న విషయం సభ్యులందరికి తెలిసిందే... అందులో భాగంగా తెలుగు వికీపీడియాకు కావలసిన వనరుల గురించి చర్చించడానికి, పవనజ గురువారం సాయంత్రం అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ కి వచ్చారు. వర్షం కారణంగా మిగతా సభ్యులకు వీలుకాకపోవడంతో రాజశేఖర్ గారు, ప్రణయ్‌రాజ్ వంగరి లు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు.

చర్చించిన అంశాలు

Creating Movement Resources - Telugu

Documents:-

  1. Wikipedia brochure - 4 pages
  2. Wikipedia tutorial
  3. Wiki Markup Quick Reference (cheat-sheet)
  4. Keyboard layout - add Apple & Modular keyboard to the existing document
  5. Copyright manual
  6. CC handbook
  7. Wikisource tutorial
  8. Wiktionary tutorial

Videos:-

  1. Tutorial videos - 10 number just like Hindi & Kannada

Request from Telugu community:-

  1. DLI books to be listed and find out the books which are out of copyright so that they can be added to Telugu Wikisource

ఇవి కాకుండా వేరే ఏవైనా Resources కావాలనుకుంటే సభ్యులు తెలుపగలరు మరియు పై వాటిలో ప్రాధాన్యతను బట్టి ఏది తెవికీకి ముందుగా అవసరమో కూడా తెలుపగలరు. Resources కోసం ఇక్కడ చూడగలరు.

అంతేకాకుండా 12వ తేదీన పవనజ గారు విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ఉంటున్నారు. Creating Movement Resources - Telugu గురించి మరింతగా చర్చించడానికి విజయవాడలోని మరియు విజయవాడ దగ్గరి ప్రాంతాల వికీపీడియన్లు హాజరుకాగలరు. ధన్యవాదాలు...--Pranayraj1985 (చర్చ) 20:01, 10 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పవనజ గారిని విజయవాడలో నేను మల్లాది గారు కలిసాము. పై అలిస్ట్ చూపి మరేవైనా మార్పులు ఉంటే సూచించమని అడిగారు. మునుపు సి.ఐ.ఎస్ వర్క్ ప్లాన్‌లో వికీ సముదాయం సూచించిన మార్పులను పరిశీలించమని చెప్పాను. మిగతా వారు ఏవైనా మార్పులు సూచించాలనుకుంటే రచ్చబండలో రాయమని చెప్పాడు..--Viswanadh (చర్చ) 05:18, 14 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విరామ చిహ్నాలు - దోషాలు

[మార్చు]

తెలుగు వికీపీడియాలో రచనలు చేసిన వాడుకరులు చేస్తున్న స్వల్ప దోషాలను వేమూరిగారు నా చర్చాపేజీలో తెలియజేసారు. దానిని దిగువనిస్తున్నాను. దానిని దిగువన ఇస్తున్నాను. తదుపరి రచనలలో యిటువంటి దోషాలు రాకుండా చూడవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 01:14, 12 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చుక్కలు, కామాలు పెట్టే పద్ధతి

[మార్చు]
  1. మీరు దయచేసి వికీ రచయితలకి ఒక సందేశం పంపగలరా? తెలుగు వికీపీడియాలో సర్వసాధారణంగా కనిపించే ఒక తప్పుని ఏ రచయిత కా రచయిత సరిదిద్దుకుంటే సర్వత్రా మన రాత మెరుగుపడుతుందని నా అభిప్రాయం. నేను సరిదిద్దుతున్నాను, కాను ఎన్నని దిద్దగలను?
  2. ఫుల్‌ స్టాప్ (లేదా చుక్క) వాక్యం పూర్తి అయీఅవగానే పెట్టాలి; ఒక ఖాళీ వదలిన తరువాత కాదు. ఇదే నియమం ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలు విషయంలో కూడ పాటించాలి.
    ఉదా:రాముడు బంతిని తన్నెను . - తప్పు
    రాముడు బంతిని తన్నెను. - ఒప్పు.
  3. కామా (comma) మాట పూర్తి అవగానే పెట్టాలి; ఒక ఖాళీ వదలిన తరువాత కాదు.
    ఉదా:ప్రతి విద్యార్థి మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి: అభ్యాసం , అభ్యాసం , అభ్యాసం. (తప్పు)
    ప్రతి విద్యార్థి మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి: అభ్యాసం, అభ్యాసం, అభ్యాసం. (ఒప్పు)
  4. కుండలీకరణాలు తెరచిన తరువాత, వెనువెంటనే, మాట మొదలవాలి; ఒక ఖాళీ వదలిన తరువాత కాదు. మాట పూర్తి అయిన వెనువెంటనే కుండలీకరణాలు మూయాలి; ఒక ఖాళీ వదలిన తరువాత కాదు
    ఉదా: కామా ( comma ) మాట పూర్తి అవగానే పెట్టాలి; ఒక ఖాళీ వదలిన తరువాత కాదు. (తప్పు)
    కామా (comma) మాట పూర్తి అవగానే పెట్టాలి; ఒక ఖాళీ వదలిన తరువాత కాదు. (ఒప్పు)
  5. చుక్క తరువాత, కామా తరువాత, ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలు తరువాత, మూసిన కుండలీకరణం తరువాత విధిగా ఒక ఖాళీ వదలాలి.
    ఈ నాలుగు నియమాలు పాటిస్తే రాత చూడడానికి బాగుండడమే కాకుండా అంతర్జాతీయ ప్రమాణలతో ఉంటుంది. ఎంత పాండిత్యం ఉన్నా మనం ధరించిన దుస్తులని చూసి ఎలా విలువ కడతారో, అలాగే మనం ఎంత కష్టపడి రాసినా విరామ చిహ్నాల వాడుకలో కనీసపు శ్రద్ధ చూపించకపోతే చదువరులు మన రాతని గౌరవించరు. Vemurione (చర్చ) 00:23, 12 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందనలు

[మార్చు]
  • వేమూరి గారూ యిటువంటి దోషాలు అనేక వేల సంఖ్యలో ఉంటాయి. వీటిని సరిదిద్దాలంటే బాటు ద్వారా చేయాలి. యిటువంటి దోషాలు సరిదిద్దాలంటే బాటు సభ్యత్వం గల రహ్మానుద్దీన్ గారు సులువుగా చేయగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 01:21, 12 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • వేమూరి వారి సూచనలు చాలా బావున్నాయి. ఇవన్నీ సామాన్యంగా ప్రస్తుతం అచ్చులోనూ, జాలంలోనూ ఉన్న పత్రికల్లో, పుస్తకాల్లో పాటిస్తూండేవే. పత్రికాఫీసుల్లో వేమూరి వారు రాసినట్టు విలేకరులకు, జర్నలిస్టులు ఈ పొరపాట్లు చేయకుండా అతికించివుంచుతారు. అవి వారికి బాగా ఉపయోగపడతాయి. అలానే వీటిని వికీపీడియన్లందరూ చదివి వ్యక్తిగతంగా అలవాటు చేసుకుంటే సరిపోతుంది. కె.వెంకటరమణ గారూ జరిగిన తప్పులు సరిదిద్దడం ఒకపని అయితే, పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడడం మరోటి-ప్రస్తుతం వేమూరి వారు ఈ పోస్టు పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహించేందుకు చెప్పినట్టున్నారు. --పవన్ సంతోష్ (చర్చ) 06:45, 13 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇటువంటి పొరపాట్లకు మనం కూడా AWB ద్వారా తొలగించవచ్చు, ఇలాంటివి ఎప్పటికపుడు వస్తూనే ఉంటాయి. కొత్తవారు చేస్తూనే ఉంటారు..--Viswanadh (చర్చ) 05:24, 14 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

టీటీడీ వారి పుస్తకాలు ఈకాపీలు

[మార్చు]

సభ్యులకు

తిరుమల తిరుపతి దేవస్థానముల వాఙ్మయము, వారు ప్రచురించిన వివిధ పుస్తకాలు ఆన్లైన్లో http://ebooks.tirumala.org వద్ద గలవు. ఇవి వికీపీడియాకు, వికీసోర్స్ కు చాలా ఉపయోగపడగలవు. గమనించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 05:50, 12 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు చాలా మంచి పుస్తకాలు దొరికాయి. వీలువెంబడి చదవాలి. --పవన్ సంతోష్ (చర్చ) 06:48, 13 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

" పురాణ నామ సంగ్రహము" ఈ పుస్తకంలొ చాలా వైదిక పదాలకు అర్దాలు వున్నాయి , వీటిని ఎందులొ చేర్చాలి ?

కశ్యప్ గారూ తెలుగు విక్ష్నరీలో ఆయా పదాలు చేరిస్తే బావుంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 10:48, 18 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/సెప్టెంబరు 20, 2015 సమావేశం

[మార్చు]

అందరికి నమస్కారం... వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/సెప్టెంబరు 20, 2015 సమావేశం… సెప్టెంబరు 20, 2015 (మూడవ ఆదివారం) నాడు హైదరాబాద్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో ఏర్పాటు చేయబడుతుంది.

చర్చించాల్సిన అంశాలు

[మార్చు]
  • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • ప్రస్తుతం జరుగుతున్న వికీ ప్రాజెక్ట్ పై సమీక్ష
  • వికీ శిక్షణా శిబిరాల నిర్వాహణ పై చర్చ
  • భవిష్యత్ ప్రణాళిక
  • తెలుగు వికీపీడియాకు కావలసిన వనరుల పై చర్చ

సభ్యులు హాజరుకాగలరు. వివరాలకు వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/సెప్టెంబరు 20, 2015 సమావేశం లో చూడగలరు. --Pranayraj1985 (చర్చ) 08:12, 14 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

New Wikipedia Library Database Access (September 2015)

[మార్చు]

Hello Wikimedians!

The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

  • EBSCOHost - this is one of our largest access donations so far: access to a wide variety of academic, newspaper and magazine sources through their Academic Search Complete, Business Source Complete and MasterFILE Complete
  • Newspaperarchive.com - historical newspapers from the United States, Canada, UK and 20 other countries, and includes an Open Access "clipping" feature (1000 accounts)
  • IMF Elibary- a digital collection of the IMF's reports, studies and research on global economics and development (50 accounts)
  • Sabinet - one of the largest African digital publishers, based in South Africa, with a wide range of content in English and other European and African languages (10 accounts)
  • Numérique Premium - a French language social science and humanities ebook database, with topical collections on a wide range of topics (100)
  • Al Manhal - an Arabic and English database with a wide range of sources, largely focused on or published in the Middle East (60 accounts)
  • Jamalon - an Arabic book distributor, who is providing targeted book delivery to volunteers (50 editors)

Many other partnerships with accounts available are listed on our partners page, including expanded accounts for Elsevier ScienceDirect, British Medical Journal and Dynamed and additional accounts for Project MUSE, DeGruyter, Newspapers.com, Highbeam and HeinOnline. Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 19:42, 16 September 2015 (UTC)

We need help! Help us coordinate Wikipedia Library's distribution of accounts, communication of access opportunities and more! Please join our team at our new coordinator signup.
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

అక్షరశిల్పులు

[మార్చు]

అక్షరశిల్పులు అనేది సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ వ్రాసిన 180 పేజీల పుస్తకం. పుస్తకం లో ఆయన 2008 లో ఒక ప్రకటన ద్వారా 242 మంది రచయితలు వారి వివరాలను తీసుకున్నట్లు తెలియజేసారు. ఆ పుస్తకంలో 333 మంది కవుల గూర్చి వ్రాసారు. వారి గూర్చి శోధించేవారికి వికీసోర్సులో విషయం లభ్యమవుతుంది. అందులో చాలా వ్యాసాలు మొలకలు. వాటి గూర్చి ఆ పుస్తకం తప్ప ఏ విధమైన వనారులు,మూలాలు లభించుటలేదు. అందులో ప్రఖ్యాతి పొందిన యాకూబ్ (కవి) వంటి వారిపై వ్యాసాలు వ్రాయవచ్చు. యితరత్రా మూలాలు లభ్యమైన వాటి గూర్చి వ్యాసాలు వ్రాయవచ్చు. ఆ పుస్తక మూలం మాత్రమే ఉన్నదని అన్నింటికీ వ్యాసాలు వ్రాయడం సరికాదు. ఆ విషయాలు కూడా పుస్తక రచయితకు ఆ రచయితలే యిచ్చినట్లు పుస్తకం ద్వారా తెలియుచున్నది. దయచేసి అందులో ముఖ్యమైన వారిగూర్చి వ్యాసాలు వ్రాయాలని మనవి. అలా అయితే మన రాష్ట్రంలో ఒక శతకం,కథలు,పద్యాలు వ్రాసిన తెలుగు పండితులు అనేక మంది పాఠశాలలలోనూ,కళాశాలల లోనూ ఉన్నారు. కానీ వారి రచనల గూర్చి ఏ విధమైన మూలాలు లభ్యం కావు. మూలాలు లేనందున వారికి నోటబిలిటీ లేదని అర్థం. కనుక నోటబిలిటీ ఉన్న వ్యక్తుల వ్యాసాలు వ్రాయడం మంచిది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 07:33, 20 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నోటబిలిటీ గురించి అక్షరశిల్పులు ఉదాహరణ తీసుకుని నా అభిప్రాయాలు పంచుకోదలిచాను. ఒకటి కంటే ఎక్కువ మూలాలు కలిగివుంటే నోటబుల్ అనుకోవచ్చుననుకుందాం, తెలుగు సాహిత్య వాతావరణంలో ఉన్న పుస్తకాలు దొరకడం ఎంతో కష్టంగా ఉంది. ఎవరి గురించైనా రాసేప్పుడు ఒక మూలం దొరకడమే మహద్భాగ్యమైన పరిస్థితి. అలాంటి స్థితిలో నోటబిలిటీకి మరిన్ని ప్రమాణాలు కూడా వుంటే బావుంటుందనుకుంటున్నాను. ఉదాహరణకు కనీసం 2-3 తెలుగు పుస్తకాలు రాసిన రచయితలు నోటబుల్ అనో, లేక మరేదైనానో తీసుకోవచ్చు. ఒక శతకం, మూడు కథలు, 30 పద్యాలు రాసిన తెలుగు పండితులు ప్రతి 4 పాఠశాలలకు ఒకరున్నారన్న మాట కరెక్టే. కానీ అక్షరశిల్పులు పుస్తకంలో గణించదగ్గ సంఖ్యలో బహు గ్రంథకర్తలు ఉంటే వారిని పరిగణించవచ్చు కదా. కనీసంలో కనీసం వారి పుస్తకాలను రకరకాల మేగజైన్లలో చేసిన రివ్యూలే ఉంటాయి ఓ నాలుగైదు. ఆ రివ్యూలు కేవలం తెలుగు మేగజైన్లు, వార్తాపత్రికలు, పుస్తకాలు అంతర్జాలంలో లభించట్లేని ఒకే ఒక కారణాన మనకు దొరకట్లేదు. మనకు దొరక్కుంటే వారు నోటబుల్ కాకుండా పోరు కదా. ఆలోచించి చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 06:58, 22 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మీరన్నట్లు ఇతరత్రా ఏమైనా మూలాలుంటే వ్యాసాలను వృద్ధి చేయవచ్చు. ఆ అక్షరశిల్పులు పుస్తకంలో గల ఏక వాక్య వ్యాసాలని వికీలో చేర్చడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముంది?మొలకల సంఖ్య పెంచుకోవడం తప్ప. వికీసోర్సు కూడా తెవికీకి సోదర ప్రాజెక్టు కదా! ఆయా రచయితల గూర్చి గూగుల్ సెర్చ్ చేసినపుడు వికీసోర్సులో ఆయన గురించి వివరాలు లభ్యమవుతున్నాయి. ఆ పుస్తకంలో గల ప్రాముఖ్యత గల వ్యాసాలను తెవికీలో ప్రమాణాలకనుగుణంగా చేర్చవచ్చు.అంతర్జాల మూలాలు లభ్యమవక పోతే వివిధ పుస్తక మూలాలైనా చేర్చవచ్చు. మూలాలు సరైనవి లభించినపుడు వికీలో అజ్మల్ కసబ్ వంటి తీవ్రవాదులు, కొత్తదాస్ లాంటి గూండాలు, వీరప్పన్ వంటి బందిపోటు వ్యాసాలు కూడా ఉన్నాయి. వారికి కూడా నోటబిలిటీ ఉన్నట్లే గదా! అలాగే సాహితీకారుల వ్యాసాలకు సరైన మూలాలు లేనపుడు అతడు ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి అని తెలిసినా ఎలా చేర్చుతామో తెలియజేగలరు. వికీ వ్యాసానికి మూలస్థంబం సరైన మూలాలు చేర్చడమే.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:56, 22 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఉదాహరణ తీసుకుంటే అబ్దుల్ ఖాదర్ వేంపల్లి అనే రచయిత ఆరుకు పైగా పుస్తకాలు రాశారు. కుందుర్తి జాతీయ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా పురస్కారం వంటి ప్రఖ్యాత పురస్కారాలూ పొందారు. ఆయన ప్రాముఖ్యత కలిగిన వ్యక్తే. కనీసం ఒక్కో పురస్కారం పొందినప్పుడు ఒక్కో పత్రికలో వార్త వరకూ పడినా ఆయన గురించి చాలా మూలాలే వుంటాయి. తప్పకుండా స్థానిక పత్రికల్లో ఆయన విశేషాలూ పడివుంటాయి. మనకు దొరకలేదంతే ఆ మాత్రాన ఆయన నోటబుల్ కాదనలేం. ఇక మీరు వ్యాసాన్ని చూస్తే అది రెండు కెబిలు దాటిపోయేవుంది. వికీలో ఇప్పటికిప్పుడు చాలా గొప్ప నాణ్యమైన వ్యాసం అయిపోతుందని ప్రారంభించము కదా. అదీ నా పాయింట్. ఒకవేళ ఒకటి అర పుస్తకాలు రాసినవారైతే మీరన్నట్టే మరే మూలమూ లభించదనీ, వారు అంత నోటబుల్ కారనీ అనుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ ఏకవాక్యాలైతే కావు. పి.ఎస్. మరోవిధమైన ఉదాహరణలూ వున్నాయి, 1935 నవంబరు నాటి 'భారతి' సంచికలో 'ఓరుగల్లు చరిత్ర' వ్యాసం ప్రచురితం. అన్న ఏకవాక్యంతో అహమ్మద్ అలీ ఖాదరీ సాహెబ్ అనే ఆయన వివరం కూడా ఇచ్చారు. అలాంటి వారి గురించి వ్యాసాలు అవసరం లేదని నా అంచనా. --పవన్ సంతోష్ (చర్చ) 14:42, 22 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అక్షరశిల్పులు పుస్తకంలో ప్రముఖుల వ్యాసాలు ఉన్నవి. అందులో గల ప్రాముఖ్యత ఉన్న వ్యాసాలని మాత్రమే తెవికీలో చేర్చాలని నా ఉద్దేశ్యం. చిన్న వ్యాసాలైనచో శోధించేవారికి వికీసోర్స్ లో వారి వివరాలు లభ్యమవుతాయి కదా. ఎక్కువ సమాచారం, మూలాలు లభించినపుడు వారి గూర్చి కూడా వ్యాసాలను ప్రారంభించవచ్చు. సమాజంలో ఏ విధమైన మూలాలు లేని అనేక మంది ప్రముఖులు ఉన్న విషయం యదార్థం. కానీ తెవికీకో మూలాలు చేనిచో ఎలా చేర్చుతామో తెలియజేయగలరు. మూలాలు లభించిన తదుపరి వ్యాసం చేర్చవచ్చు. నా వద్ద అనేక వందల సంఖ్యలో మహిళా శాస్త్రవేత్తలు, తెలుగు శాస్త్రవేత్తల వివరాలు ఉన్నాయి. కానీ వారి గూర్చి అంతర్జాలంలోనూ, పుస్తకాలలోనూ శోధించి మూలాలు లభించిన తదుపరి వ్రాస్తున్నాను.మూలాలు లేని వ్యాసాలను వారు ప్రముఖులని తెలిసి కూడా వ్రాయదలుచుకోలేదు. అది వికీ నియమాలకు విరుద్ధం కనుక. స్వరలాసిక గారు వ్రాస్తున్న కొంతమంది నేటి రచయితల గూర్చి సమాచారం సంగ్రహంగా యున్నప్పుడు వారి వివరాలను, పత్రికా విషయాలను ఆయా రచయితల నుండి ఈ మెయిల్ ద్వారా తెప్పించుకొని వ్రాస్తున్నాను. దయచేసి మూలాలు గల వ్యాసాలకు ప్రాధాన్యతనివ్వండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:03, 22 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ కాన్ఫరెన్స్ ఇండియా 2016

[మార్చు]

నమస్తే,

మేము మిమ్మల్ని వికీ కాన్ఫరెన్స్ ఇండియా 2016కు ఆతిథ్యమిచ్చే ప్రతిపాదన (bid) కొరకు ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రతిపాదన (బిడ్) రెండు రౌండ్లు కలిగివుంది. మొదటి రౌండ్ పాల్గొనడాన్ని ప్రోత్సహించే సాధారణ రౌండ్. స్థానిక సముదాయం సహకారం, సామర్థ్యాలను నిర్ధారించుకోవడం మొదటి రౌండ్ లక్ష్యం. మొదటి రౌండ్ నుంచి 5 అర్హత పొందిన నగరాలు ప్రతిపాదన (బిడ్డింగ్) యొక్క అంతిమమైన రెండో రౌండ్ లో మరింత విపులమైన ప్రణాళికతో పాల్గొంటాయి.

మొదటి రౌండ్ ప్రతిపాదన (బిడ్డింగ్) ప్రమాణాలు

  • నగరం మరియు ప్రతిపాదిత వేదిక. ఈ నగరంలో కనీసం ఓ దేశీయ (domestic) విమానాశ్రయం అయినా వుండాలి.
  • ఈ కార్యక్రమాన్ని మీ నగరంలో జరిగితే నిర్వహణలో పాలుపంచుకునేందుకు నిబద్ధులైన వికీమీడియా ప్రాజెక్టు క్రియాశీలక వాడుకరుల వికీమీడియా సంతకాలు.
  • బిడ్ ని సముదాయ సభ్యులు ఆమోదించిన స్థానిక రచ్చబండ పేజీ లింకు.
  • 500మంది నమోదైన సభ్యులు పాల్గొనే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మొత్తం ప్రతిపాదిత బడ్జెట్ (స్కాలర్షిప్ పొందే వందమందికి 3 రోజులపాటు ఇచ్చే వసతి ఖర్చు కూడా కలుపుకుని).
  • ఇటువంటి కార్యక్రమం(లేదా కార్యక్రమాలు) చేసిన పూర్వానుభవం.

దయచేసి 18 అక్టోబర్ 2015 11:59 PM ISTలోపుగా బిడ్స్ ఇక్కడ చేర్చగలరు.

అభినందనలతో,

వికీకాన్ఫరెన్స్ ఇండియా 2016 వాలంటీర్లు

Only one week left for Individual Engagement Grant proposals!

[మార్చు]

(Apologies for using English below, please help translate if you are able.)

There is still one week left to submit Individual Engagement Grant (IEG) proposals before the September 29th deadline. If you have ideas for new tools, community-building processes, and other experimental projects that enhance the work of Wikimedia volunteers, start your proposal today! Please encourage others who have great ideas to apply as well. Support is available if you want help turning your idea into a grant request.

I JethroBT (WMF), Community Resources 21:01, 22 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సీఐఎస్-ఏ౨కే ప్రోగ్రాం అసోసియేట్ అభ్యర్థిత్వానికి సహాయం

[మార్చు]

తెవికీ సభ్యులకు నమస్కారం. సీఐఎస్-ఏ౨కే ప్రోగ్రాం వారి అసోసియేట్ ఉద్యోగానికి తెలుగు సముదాయం ఆమోదంతో నేను దరఖాస్తు చేసిన విషయం మీ అందరికి తెలిసిందే.. అందుకుగానూ సీఐఎస్-ఏ౨కే ప్రోగ్రాం మేనేజర్ పవనజగారు కొన్ని పత్రాలను అనువదించమని పంపారు. అనువాద ప్రక్రియలో సహకరించమని సహ సభ్యులకు నా మనవి.

అనువాదం కోసం ఉన్న పుస్తకాలు రెండు. - 1. ఆలోచన చౌర్యాన్ని అరికట్టడం, 2. వికీపీడియాలో మూలాలు - చేపుస్తకం

అనువాదానికి చివరి గడువు సెప్టెంబర్ 29. ధన్యవాదాలు...--Pranayraj1985 (చర్చ) 08:16, 24 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]


రచ్చబండలో అనువాదం వేదిక కాదు

[మార్చు]

ప్రణయరాజ్ అడిగినది వ్యక్తిగత సహాయం. దీనికి రచ్చబండ వేదిక కాదు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 16:15, 26 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పై వ్యాఖ్య భాస్కరనాయుడు గారు "వికీపీడియాలో మూలాలు - చేపుస్తకం" అనే విభాగంతో రచ్చబండలో అనువాదం చేయుచున్నందున అనువాదానికి రచ్చబండ వేదిక కాదని తెలియజేసాను. ఆ విభాగాన్ని తొలగించారు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 00:01, 27 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం ప్రాజెక్టు -ఆఖరు తేదీ సెప్టెంబర్ 29

[మార్చు]

అహ్మద్ నిసార్ గారు ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్_లో_ఇస్లాం ప్రాజెక్టు ఐ.ఇ.జి గ్రాంటు కొరకు దరఖాస్తు చేయబడినది. ఈ విషయం గూర్చి ఇంతకూ మునుపే అనేకమంది తెవికీ సభ్యులు తమ అంగీకారాన్ని తెలిపియున్నారు. కావున ఇప్పుడు మెటా పేజీలో తమ మద్దతును సులభంగాను శీఘ్రంగానూ వ్రాయవచ్చు. మెటా పేజీలో ఎండార్స్ మెంట్ స్థలంలో తమ మద్దతును, సూచనలను ఇక్కడ తెలియజేయగలరు.ఆఖరు తేదీ సెప్టెంబర్ 29 ,కావున సభ్యులు తమ మద్దతును మరియు స్పందనను ఆలస్యం చేయకుండా తెలుపగలరు--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:50, 28 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Reimagining WMF grants report

[మార్చు]

(My apologies for using English here, please help translate if you are able.)

Last month, we asked for community feedback on a proposal to change the structure of WMF grant programs. Thanks to the 200+ people who participated! A report on what we learned and changed based on this consultation is now available.

Come read about the findings and next steps as WMF’s Community Resources team begins to implement changes based on your feedback. Your questions and comments are welcome on the outcomes discussion page.

With thanks, I JethroBT (WMF) 16:56, 28 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Individual grant/project proposal

[మార్చు]

Hello,

First of all, my apologies for writing in English. I know nothing about reading/writing Telugu. I would love it if someone can translate the following and/or move this message to a more appropriate page, if applicable.

I have proposed an individual project here to increase awareness of and participation in Telugu wikipedia content (among other Indic languages) creation by a very resourceful segment of the population. I will appreciate it if you review it, give feedback and/or endorse my proposal.

Hoping to hear from you soon!

Thank you,

अभय नातू (చర్చ) 22:35, 28 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రోగ్రామ్ అసోసియేట్ (కన్సల్టెంట్ - యాక్సెస్ టు నాలెడ్జ్ - లాంగ్వేజ్ యాంకర్) ఉద్యోగానికి దరఖాసు

[మార్చు]
రచ్చబండ పాతచర్చ లో పైన తెలుపబడిన ప్రతిపాదిత విషయం చర్చకోసం దిగువ చేరుస్తున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:01, 1 అక్టోబరు 2015 (UTC) [ప్రత్యుత్తరం]


ది సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (సీఐఎస్) బెంగుళూరు, ప్రోగ్రామ్ అసోసియేట్ (కన్సల్టెంట్ - యాక్సెస్ టు నాలెడ్జ్ - లాంగ్వేజ్ యాంకర్) ఉద్యోగానికి కన్నడ, ఒడియా, తెలుగు భాషల్లో అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తోంది. ఈ ఉద్యోగం సెప్టెంబర్ ౧, ౨౦౧౫ నుండి జూన్ ౩౦, ౨౦౧౬ వరకు ఉంటుంది.

అభ్యర్థి ముందుగా సీఐఎస్-ఏ౨కే[[ ప్రణాళికలను పరిశీలించాల్సిందిగా మనవి. అభ్యర్థి ఉద్యోగిగా తెలుగు వికీమీడియా సముదాయం, వికీమీడియా భారతదేశ చాప్టర్, వికీమీడియా ఫౌండేషన్, తదితర వికీ అనుబంధ, స్వేచ్ఛా ఉద్యమాలతో దగ్గరగా పని చేయాల్సిన ఉంటుంది. సీఐఎస్-ఏ౨కే తో గల వివిధ సంస్థాగత ఒప్పందాలకనుగుణంగా ఏర్పరిచిన లక్ష్యాలపై పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగి ౪-౮ మందిగల ఒక చిన్న జట్టుతో పని చేస్తారు. అభ్యర్థి సీఐఎస్ లో ఉండగా పూర్తి పారదర్శకంగా, జవాబుదారీగా పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం ౯ నెలల పాటు ఉంటుంది (సెప్టెంబర్ ౧ ౨౦౧౫ నుండి జూన్ ౩౦ ౨౦౧౫).

బాధ్యతలు
  • ముఖ్యమైన బాధ్యతలు సముదాయమే నిర్ణయిస్తుంది.
సీఐఎస్-ఏ౨కే
  • సముదాయం-సీఐఎస్-ఏ౨కే కి అనుసంధానంగా ఉండాలి (సముదాయ అభ్యర్థనలని సమకూర్చడం, వివిధ కార్యక్రమాలను, ప్రాజెక్టులను సముదాయం కోసం చేపట్టడం).
  • నెలవారీ ప్రాజెక్టు నివేదిక.
  • నెలవారీ సముదాయంతో ఐఆర్సీ, న్యూస్లెటర్, సమావేశంలో పాల్గొని నివేదిక సమర్పించడం.
  • ఐఈజీకి అభ్యర్థించే వారికి అభ్యర్థన వ్రాయడంలో, ప్రశ్నోత్తరాలలో సహకరించడం.
  • సోషల్ మీడియాలో తెవికీ ప్రాజెక్టులకు మరింత ప్రాప్యత, వీక్షణలు పెంచే విధంగా చర్యలు చేపట్టడం. సముదాయ అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చడం.
  • ప్రతి మూడు నెలలకు అభ్యర్థి కార్యాచరణపై పరిశీలన ఉంటుంది.
  • సీఐఎస్-ఏ౨కే ప్రోగ్రాం డైరెక్టర్ సూచించిన మేరకు మరిన్ని విధులు చేపట్టాల్సి రావచ్చు.
స్థలం
  • హైదరాబాద్
జీతం
  • అభ్యర్థి అనుభవం, కుశలత పై జీతం నిర్ణయించబడుతుంది.

ఈ ఉద్యోగానికి అర్జీ పంపేందుకు అభ్యర్థులు తమ తమ రెజ్యూమె, కవరింగ్ లెటర్ మరియు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరెందుకు అర్హులో, మీ ప్రేరణ ఏమిటో తెలపాల్సి ఉంటుంది. దరఖాస్తులను డా॥ పవనజ (pavanaja@cis-india.org) కు పంపాలి. దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ ఆగస్టు ౨౯, ౨౦౧౫. --రహ్మానుద్దీన్(సీఐఎస్-ఏ౨కే) (చర్చ) 04:11, 19 ఆగష్టు 2015 (UTC)

దరఖాస్తులు

[మార్చు]
Pranayraj1985

అందరికి నమస్కారం.. సీఐఎస్-ఏ౨కే వారి ప్రోగ్రామ్ అసోసియేట్ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకుంటున్నాను.. సభ్యులు సహకరించగలరు.. ఇతర సభ్యులు కూడా దరఖాస్తు చేయోచ్చు... Pranayraj1985 (చర్చ) 09:54, 20 ఆగష్టు 2015 (UTC)

  1. Support ' ప్రణయరాజ్ అభ్యర్ధిత్వాన్ని సమర్ధిస్తున్నాను. యితను సమర్ధుడు --Nrgullapalli (చర్చ) 01:57, 29 ఆగష్టు 2015 (UTC)
  2. Support ' ప్రణయరాజ్ కు నా మద్దతు ఫూర్తిగా ఇస్తున్నాను . మీ దరఖాస్తును తగు విదముగా తగిన చోట పెట్టగలరు."...............భాస్కర నాయుడు.
  3. Support ' ప్రణయరాజ్ కు నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను.--'ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 17:24, 7 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  4. Support ' ప్రణయరాజ్ గారికి నా మద్దతు తెలియజేస్తున్నాను. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:14, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  5. Support ' t.sujatha (చర్చ) 05:56, 4 అక్టోబరు 2015 (UTC) ప్రణయ రాజ్ గారికి నా మద్దతు తెలియజేస్తున్నాను. [ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్

సహ సభ్యులందరికీ నమస్కారం. సీఐఎస్-ఏ౨కే ప్రోగ్రామ్ అసోసియేట్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాను. తెలుగు వికీపీడియన్లకు ప్రత్యక్షంగానూ, జాలపరంగానూ నేను సుపరిచితుణ్ణే. తెవికీ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్న విషయం, ఇతర వికీపీడియన్లు చేస్తున్న కృషికి శక్తిమేరకు ఓ వాలంటీరుగా సహకరిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వికీమీడియా ఫౌండేషన్ ఐఈజీ పొంది తెవికీకి మేలుచేసే "తెలుగు సమాచారం అందుబాటులోకి" ప్రాజెక్టు మీ అందరి సహకారంతో పూర్తిచేశాను. అందరమూ పలు ప్రణాళికలు పంచుకోవడమూ జరిగినదే. వీటిన్నిటి దృష్ట్యా ఈ ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చేందుకు నా అనుభవం, ఆసక్తి వంటివి ఉపకరిస్తాయని భావిస్తున్నాను. ఈ విషయంలో భవిష్యత్తులో కూడా సహ సభ్యుల సహకారం ఎప్పటిలాగానే నాకు అందుతుందని ఆశిస్తూ --పవన్ సంతోష్ (చర్చ) 06:13, 26 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

  1. Support ' పవన్ సంతోష్ అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను.--'ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:02, 28 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Support ' పవన్ సంతోష్ గారికి నా మద్దతు తెలియజేస్తున్నాను. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:14, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  3. Support ' t.sujatha (చర్చ) 05:56, 4 అక్టోబరు 2015 (UTC) పవన్ సంతోష్ గారికి నా మద్దతు తెలియజేస్తున్నాను.[ప్రత్యుత్తరం]
Viswanadh

సభ్యులకు నమస్కారం. నేనుకూడా ఈ ఉధ్యోగానికి ధరఖాస్తు చేసాను. తగిన అనుభవం తోపాటు. సి.ఐ.ఎస్ నుండి గతంలో జరుగవల్సిన పనులను పూర్తిచేయటకు, కొత్త లోచనలతో ముందుకు వెళ్ళడం ద్వారా తెలుగు వికీపీడియాను బలోపేతం చేసేందుకు ఈ ఉద్యోగం ఉపయోగపడుతుందనే అలోచనతో ధరఖాస్తు పంపినాను. సభ్యులు తమ విలువైన ఆలోచనలకు, సలహాలను తెలియచేస్తూ తమ సహకారాన్ని అందచేయగలరని ఆశిస్తూ..మీ ---Viswanadh (చర్చ) 05:23, 28 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

  1. Support ' సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను.--'ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:02, 28 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Support ' విశ్వనాధ్.బి.కె గారికి నా మద్దతు తెలియజేస్తున్నాను. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:14, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  3. Support ' t.sujatha (చర్చ) 05:56, 4 అక్టోబరు 2015 (UTC) విశ్వనాథ్ గారికి నా మద్దతు తెలియజేస్తున్నాను.[ప్రత్యుత్తరం]

ఆభ్యర్దులకు ప్రశ్నలు

[మార్చు]

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులందరికీ ధన్యవాదాలు. @Pranayraj1985, @పవన్ సంతోష్, @Viswanadh. మీ అందరికీ రెండు ప్రశ్నలు: 1) మీ దృష్టిలో సి.ఐ.ఎస్-ఏ2కే తెలుగు వికీపీడియాలో ఏ పనుల్లో సహకరించవచ్చు. ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదని అనుకుంటున్నారో తెలియజేయగలరు. 2) సి.ఐ.ఎస్-ఏ2కే లక్ష్యాలు ఏమిటి? వికిపీడియా లక్ష్యాలు ఏమిటి? వాటిలో తారతమ్యాలు వివరించగలరు --వైజాసత్య (చర్చ) 11:07, 2 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం వైజాసత్య గారు. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ఏదైనా గడువు ఉందా ? మా సమాధానాలను ఎక్కడ రాయాలి ? ధన్యవాదాలు...--Pranayraj1985 (చర్చ) 17:45, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్ ఈ ప్రశ్నలు మన అవగాహన ఏంటో తెలియడానికి వాడుకరి:వైజాసత్య గారు వేసినట్టు కనిపిస్తోంది. కనుక ఎంత స్పాంటేనియస్ గా, మన స్వంత ఆలోచనతో రాస్తే అంత మేలు. సమయం తీసుకుని పరిశోధన చేసి రాసేది మన స్పందన అవదు, మన దృక్పథం వెల్లడించదు. అందుకే గడువు అంత అవసరం కాదనుకుంటాను. ఇక గడువు ఒకందుకు పనికివస్తుంది. మనం బిజీగా ఉన్నట్టైతే కొంత సమయాన్ని ఏర్పరుచుకుని, కూచుని రాసేందుకు. ఆ సమయం ఉన్నట్టైతే మన దృక్పథాన్ని సూటిగా వెల్లడిస్తే సరిపోతుందని నా అంచనా. --పవన్ సంతోష్ (చర్చ) 05:59, 4 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నన్ను ఏనాటి నుంచో సన్నిహితులు పిలుస్తున్న, నేను సమయం కేటాయించుకునివున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రెండు రోజుల్లో వరుసగా వచ్చాయి. దాంతో శుక్రవారం రాత్రి నుంచి నాకు ఈ ప్రశ్నకు సమాధానం రాసే సమయం దొరకలేదు. ఆలస్యానికి క్షమించండి. ఇక మీరడిగిన ప్రశ్నలకు ఇప్పటివరకూ నాకున్న అవగాహన మేరకు సమాధానమిస్తున్నాను:

2. తెలుగు వికీపీడియా సముదాయం తెలుగులో స్వేచ్ఛా విజ్ఞానం కోసం వివిధ తెవికీ ప్రాజెక్టుల ద్వారా స్వేచ్ఛా విజ్ఞానం కోసం ప్రాథమికంగా ఆన్లైన్ లో కృషిచేస్తున్న సముదాయం. వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వ వ్యాసాలు అభివృద్ధి చేయడం, వికీసోర్సులో కాపీహక్కులు లేని పాఠ్యాలు చేర్చడం, చర్చలు చేయడం, పాలసీలు నిర్ధారించడం వంటి అనేకానేక పనులు వీరు చేస్తూంటారు. అంతా స్వేచ్ఛా విజ్ఞానాన్ని తెలుగు వికీ ప్రాజెక్టుల్లో అభివృద్ధి చేయడమనే మౌలిక లక్ష్యం వైపే సాగుతుంది. అలాగే ఆ లక్ష్యాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా సముదాయాన్ని విస్తరించడం, అందుబాటులో ఉన్న స్వేచ్ఛా విజ్ఞానం జనానికి చేరువ చేయడం వంటివి కూడా వీరి కార్యకలాపాల్లో భాగం. దక్షిణాసియాలో, భారతీయ భాషల్లో వికీ ప్రాజెక్టులు, స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమం అభివృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేయడం సీఐఎస్ ఎ2కె లక్ష్యం. అయితే కార్యకలాపాల పరంగా వికీపీడియాలో రాయడం, పాలసీలు తామే తయారుచేయడం వంటివి కాదు. అందుకు గాను సంబంధిత వికీ సముదాయాలకు మానవ వనరులు, ఆర్థిక వనరులు, ఇతర వనరుల ద్వారానూ అన్ని విధాలా మద్దతు నివ్వడం, సంస్థాగత భాగస్వామ్యాలు ఏర్పరచడం, వీలున్నంత ఎక్కువ సమాచారం స్వేచ్ఛా లైసెన్సుల్లోకి తీసుకురావడం వంటివి వీరి కార్యకలాపాల్లో భాగం. క్లుప్తంగా చెప్పాలంటే తెలుగు వికీ సముదాయం తెలుగులో స్వేచ్ఛా విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా కలిగివుంటే, భారతీయ భాషల్లో స్వేచ్ఛా విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఉత్ప్రేరకంగా పనిచేయడం సీఐఎస్ ఎ2కె లక్ష్యం. ఆ తేడా వల్ల కార్యకలాపాలు వేరయ్యాయి. ఇక సంస్థ చేసే పనులు సముదాయానికి సహకారిగా, వారిని బలోపేతం (ఉదాహరణకు సంఖ్యాపరంగానూ, వనరుల పరంగానూ) చేసేలా ఉండాలి. సముదాయం ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు సంస్థ సముదాయం కోరిక మేరకు, అవసరాలకు అనుగుణంగా సహకరించవచ్చు. సముదాయానికి సంస్థ పట్ల అలాంటి బాధ్యత ఉన్నట్టు సిద్ధాంతపరంగా కనిపించకున్నా ఆచరణలో మాత్రం సముదాయం దృక్పథానికి అనుగుణంగా, వారిని కలగలుపుకుని, సముదాయం లక్ష్యాలకు ఉపకరించే కార్యకలాపాలు చేపట్టినప్పుడు సంస్థకు చేయదగ్గ సహకారం అందిస్తోంది. ఎందుకూ తెలుగులో స్వేచ్ఛా విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమన్న తమ లక్ష్యానికీ, అలాంటి కార్యక్రమాలను ఉత్ప్రేరకం చేయాలన్న వీరి లక్ష్యాలకు మౌలికంగా పొసగుతోంది కనుక.

1. తెలుగు వికీపీడియా సముదాయం ఆన్లైన్లో స్వచ్ఛందంగా కృషిచేస్తున్న సముదాయంగా వ్యాసాల రచన, పాలసీలపై చర్చ, నిర్వహణ, వగైరా పనులు చేస్తుంది. సముదాయంలోని కొందరు మరింత సమయాన్ని కేటాయించి ఆఫ్ లైన్లో కార్యక్రమాలు కూడా చేయడం, వాటికి సహకరించడం వంటివి చేస్తున్నారు. ఐతే ఈ రెండు రకాల కార్యలాపాల్లోనూ స్వచ్ఛంద కార్యకర్తగా విస్తృతమైన కృషిచేసిన నాకు ఆఫ్-లైన్ కార్యకలాపాల్లో చాలావాటికి సంస్థాపరమైన మద్దతు వేగవంతంగా, ప్రభావశీలంగా పనిచేసేందుకు ఉపకరిస్తుందని, అలాగే వ్యాసరచన వంటివాటి ఆన్లైన్ కార్యకలాపాల్లో కూడా వికీపీడియన్ల అవసరాల మేరకు, వారి కోరిక మేరకు సహకరించవచ్చు. ఉదాహరణలు తీసుకుని వివరించాలనుకుంటే-ఈ పుస్తకాల జాబితా తెవికీసోర్సు కార్యకర్తలు అభివృద్ధి చేశారు. ఈ జాబితాలోని పుస్తకాలు వికీసోర్సులో ఉంటే దాంతో పాటు ఇతర వికీ ప్రాజెక్టులకు ఉపకరిస్తుందన్న అంచనాపై తయారుచేశారు. వీటిలో కాపీహక్కులు ఉండి వికీసోర్సులో ఇప్పటికే చేరినవి, కాపీహక్కులు లేక పీడీఎఫ్ అందుబాటులో లేనివి ఇలా చాలా రకాలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాలు, వ్యక్తులు ఇలా పలువురు వీటి కాపీహక్కులు కలిగినవారున్నారు. సీఐఎస్ ఎ2కె సంస్థ సముదాయంతో మాట్లాడి ఈ విశ్వవిద్యాలయాలు, వ్యక్తులను సంప్రదించి వీలున్నంతవరకూ వీటిని స్వేచ్ఛానకలు హక్కుల్లో విడుదల చేయిస్తే బావుంటుంది. అలానే సముదాయం గతంలో ఓ సినీ విమర్శకుణ్ణి ఆహ్వానించి సినిమా వ్యాసాలకు మూలాల విషయంలో సూచనలు తీసుకుంది, ఆయన కొన్ని పుస్తకాలు ఇచ్చి స్కాన్ చేసుకుని ఇచ్చేయమన్నారు. స్వచ్ఛంద కార్యకర్తలుగా వికీపీడియన్లు ఆ పని చేసుకోగలిగితే ఓకే. లేకుంటే వారి విజ్ఞప్తి మేరకో మరే విధంగానో ఇలాంటి స్కాన్లు చేసే స్వచ్ఛంద సేవా సంస్థలతో మాట్లాడి ఈ విషయాన్ని కాపీహక్కుల పరిధి చూసి ముందుకుతీసుకువెళ్ళవచ్చు. చేయకూడనివి ఏవి అంటే - తెవికీ సముదాయం ప్రయోజనాలకు, తద్వారా స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమానికి విఘాతం కలిగించేవి ఏవీ చెయ్యకూడదు. మొత్తంగా ఈ ఉద్యమంతో సంస్థపరంగా పనిచేసేప్పుడు రెండు చాలా ముఖ్యం: సముదాయం అవసరాలకు, చేస్తున్న కృషికి ఇప్పుడు చేస్తున్న పని ఎలా ఉపకరిస్తుంది లేదా వేగవంతం చేస్తోందా అన్నది మొదటిది. రెండోది-సముదాయం దీన్ని స్వాగతిస్తోందా లేదా.--పవన్ సంతోష్ (చర్చ) 09:32, 4 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తాజాకలం: సీఐఎస్ ఎ2కె ప్రోగ్రాం అసోసియేట్ ఉద్యోగపు పరిధి ఇంతకు మించీ ఉండవచ్చు, కానీ వైజాసత్య గారి ప్రశ్న అనుమతించిన పరిధి మేరకే ఈ సమాధానం రాశానని గుర్తించగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 09:27, 5 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారు క్షమించాలి, అనారోగ్య కారణాన ఈ రోజే ఈ చర్చ చూసాను. పవన్ సంతోష్ త్వరగా స్పాంటేనియస్‌గా రాస్తే మన దృక్పధం తెలుస్తుంది అని రాసారు. అయినప్పటికీ నా అనారోగ్య పరిస్థితి ఆయనకూ తెలుసు కనుక నేను కొద్దిగానే చింతిస్తున్నాను.  :) :) - నా జవాబు దిగువ చూడగలరు

1) మీ దృష్టిలో సి.ఐ.ఎస్-ఏ2కే తెలుగు వికీపీడియాలో ఏ పనుల్లో సహకరించవచ్చు. ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదని అనుకుంటున్నారో తెలియజేయగలరు.

  • సి.ఐ.ఎస్-ఏ2కే - ఇప్పటి వరకూ చేపట్టిన అన్ని ప్రాజెక్టులలో కనీసం సగం వరకూ అయినా తమ లక్ష్యాలను చేరుకోలేకపోయింది.
  • వికీపీడియాలో వారు చేయదలచిన కృషిలో భాగంగా తమ ప్రాజెక్టుల ద్వారా చేపట్టిన వ్యాస రచనలు పూర్తి చేయించాలి,
  • వాటిలో కల అక్షరదోషాలను సరిచేసి, మూలాలను చేర్చి, బొమ్మలు చేర్చి పూర్తి స్థాయి వ్యాసాలుగా మార్చాలి.
  • అవి చేస్తూ విద్యార్ధులను పూర్తి స్థాయి ఆశక్తి కలిగిన వికీపీడియన్లుగా మార్చాలి
  • గ్రామ వ్యాసాలలో బొమ్మలు, సమాచారం చేర్చే వనరులను, ఆశక్తి కలగిన వికీ సమూహాన్ని వృద్ది చేయాలి.
  • వికీసోర్స్ కొరకు స్వేచ్చా హక్కులు కలిగిన వనరులను సమకూర్చాలి. హక్కులు కలిగిన పుస్తకాలను గుర్తించి వాటిని వికీపీడియన్లకు చేరువ చేయాలి.
  • వృద్దులు ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులకు వికీ చేరువ చేసే కార్యక్రమాలు రూపొందించాలి, వారికి తగిన శిక్షణ ఇస్తూ, వనరులను సమకూర్చి వ్యాసాల నాణ్యత పెంచే ప్రయత్నాలు చేయాలి.
  • ఇప్పటికి అలా ఒకే మూస రచనలు చేస్తున్న వారికి, మరింత శిక్షణ ఇచ్చి, వనరులు అందించి, వికీపీడియాతోపాటు, వికీసోర్స్,విక్షనరీ, వికీకోట్లలో రాసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.

2) సి.ఐ.ఎస్-ఏ2కే లక్ష్యాలు, వికిపీడియా లక్ష్యాలు- వాటిలో తారతమ్యాలు

  • సి.ఐ.ఎస్-ఏ2కే లక్ష్యాలు వివిద భాషలలో వ్యాస విస్తరణకు మూలాల సేకరణ, హక్కులు కలిగిన వనరులను వికీకి అందించడం, సమూహాలను బలోపేతం చేయడం, కొన్ని సంస్థల ద్వారా వ్యాసాల విస్తరణకు కృషి చేయడం, దానికి వివిద కార్యక్రమాలను రూపొందించడంగా చెప్పుకోవచ్చు
  • వికీపీడియా లక్ష్యాలలో సంస్థల, కార్యక్రమాల అవసరం కనిపించకపోవచ్చు, వీరి లక్ష్యాలలో ప్రధానమైనవి, వ్యాసాలు పరిపూర్ణంగా ఉండటం, నిర్ధిష్ట ప్రమాణాలకు లోబడి వికీ సభ్యులు వ్యాసరచన చేయడం, వికీపీడియన్ల మధ్య స్నేహపూర్వక వాతావరణం, ఏ ఇతర ప్రలోభాలు లేక స్వేచ్చగా సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉండేట్టుగా చేయడంగా చెప్పుకోవచ్చు
  • ఈ రెండు సంస్థల లక్ష్యాలు కొన్ని సమాంతరంగా కొన్ని వేరుగా ఉంటాయి. వికీపీడియాలోకార్యకాలపాలలోఅంతర్గతంగా పారదర్శకత, పూర్తి నియంత్రణ వంటివి ముఖ్యంగా కనిపిస్తే సి.ఐ.ఎస్-ఏ2కేలో కార్యకాలాపాలు భాహ్యంగా సముదాయానికి ప్రోత్సాహకంగా ఉంటాయి.
  • ఇప్పటి పరిస్థితి బట్టి ఈ రెండిటిని సమతుల్యం చేస్తూ వికీ సముదాయం ద్వారా సరికొత్తగా ప్రణాళిక తయారుచేసుకొని దాని ద్వారా ముందుకెళ్ళడం ద్వారా మనం అనుకొన్నవి కొన్ని సాధించవచ్చునని నా అభిప్రాయం....--Viswanadh (చర్చ) 11:51, 4 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]


1) మీ దృష్టిలో సి.ఐ.ఎస్-ఏ2కే తెలుగు వికీపీడియాలో ఏ పనుల్లో సహకరించవచ్చు. ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదని అనుకుంటున్నారో తెలియజేయగలరు..?

  • తెవికీ ఉత్సవాలు, నెలవారీ సమావేశాలు, శిక్షణా శిబిరాలు, కాపీరైట్ సీసీ లైసెన్సుల మీద శిక్షణ, వికీడేటా అవగాహన సదస్సులు, పట్టణాలూ, నగరాలలో వికీపీడియా వంటి కార్యక్రమాల నిర్వాహణలో సి.ఐ.ఎస్. సహకరించవచ్చు.
  • కొత్త వాడుకరులను తేవడం, వికీపీడియన్లకి గుర్తింపు తేవడం, వికీవిధానాల రూపకల్పన మరియు మెరుగుదల, సాంకేతిక సహాయం, సమిష్టి కృషికి పథకాలు రూపొందించడం, కరపత్రాలు, పుస్తకాల ముద్రణ, పటిష్ట కమ్యూనిటీ రూపకల్పన, కంటెంట్ జనరేషన్, సంస్థాగత భాగస్వామ్యాలు (విశ్వవిద్యాలయాలూ, కళాశాలలతో) ఏర్పాటుచేయడం, వాడుకరి అభిరుచి జట్టులు రూపొందిచడం, తెవికీ సమూహాన్ని సశక్తం చెయ్యటం, తెవికీ రాశి వాసి అభివృద్ధి, బడ్జెట్ మరియు ఖర్చులు వంటి పనులు సి.ఐ.ఎస్. చెయ్యాలి.
  • సమూహం తనంతట తానుగా చేయగలిగిన పనులను సి.ఐ.ఎస్. చేయకూడదు.

2) సి.ఐ.ఎస్-ఏ2కే లక్ష్యాలు ఏమిటి? వికిపీడియా లక్ష్యాలు ఏమిటి? వాటిలో తారతమ్యాలు వివరించగలరు..?

  • ఆయా వికీ సముదాయాల బలాలు, బలహీనతలు, అవసరాలు; ఆ భాషా, ప్రాంత, సాంకేతిక స్థితిగతులలను దృష్టిలో ఉంచుకొని భారతీయ భాషలలో వికీపీడియాను అభివృద్ధి చేయడం, కొత్త వాడుకరులను తేవడం, ప్రపంచవ్యాప్తంగా వికీపీడియన్లకి గుర్తింపు తేవడం, వికీవిధానాల రూపకల్పన మరియు మెరుగుదల, కంటెంట్ జనరేషన్ సి.ఐ.ఎస్-ఏ2కే లక్ష్యాలు.
  • స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని భావితరాలకు అందించడం, అందుకోసం అందురు కలిసి సమిష్టిగా పనిచేయడం, కొత్త వికీపీడియన్లను తేవడం, వీలైనన్ని ఎక్కువ వ్యాసాలను రాయడం, ప్రతి వ్యాసం పరిపూర్ణంగా చేయడం వికిపీడియా లక్ష్యాలు.
  • సి.ఐ.ఎస్-ఏ2కే, వికీపీడియా లక్ష్యం వికీపీడియాను అభివృద్ధి చేయడమే కాబట్టి.. తారతమ్యాలు అంతగా లేవని నా అభిప్రాయం. --Pranayraj1985 (చర్చ) 06:07, 6 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం

[మార్చు]
  • ఎంపిక కమిటీ సలహా మేరకు పవన్ సంతోష్ ని ఈ ఉద్యోగానికి ఎంపిక చేయటం జరిగింది.

పవన్ సంతోష్ గురించి :

తెలుగు వికీ ప్రాజెక్టుల్లో నాణ్యత, సమాచారం పెంపొందేందుకు 16వేల పైన ఎడిట్లతోనూ, పలు కార్యక్రమాల్లో భాగస్వామ్యంతోనూ కృషిచేసిన వికీమీడియన్. తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవానికి సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు. వికీమీడియా ఫౌండేషన్ నుంచి ఇండివిజువల్ ఎంగేజ్మెంట్ గ్రాంట్ పొంది తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టును నిర్వహించారు. అనేక సమావేశాలను, కార్యక్రమాలను, అవుట్-రీచ్ కార్యక్రమాలను నిర్వహణ, సహ-నిర్వహణ చేశారు.

తెలుగు పత్రికల్లో సాహిత్యంపై పలు వ్యాసాలు వ్రాస్తూంటారు. గతంలో స్వచ్ఛంద సేవా సంస్థకు కార్యదర్శిగా, పశ్చిమగోదావరి జిల్లా చదరంగ సంఘానికి పి.ఆర్.వో.గా పలు కార్యక్రమాలు నిర్వహించాడు. తెలుగు వికీపీడియన్ గా చేసిన కృషికి గుర్తింపుగా "కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీమీడియన్ - 2015", సాంఘిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా "పశ్చిమగోదావరి జిల్లా ఉత్తమ యువజన అవార్డ్" వంటి పురస్కారాలు పొందాడు. --రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే) (చర్చ) 10:40, 28 నవంబర్ 2015 (UTC)

అనువాద ప్రక్రియలో సహకారానికి కృతజ్ఞతలు

[మార్చు]

సీఐఎస్-ఏ౨కే ప్రోగ్రాం వారి అసోసియేట్ ఉద్యోగానికి సంబంధిచిన దరఖాస్తులో భాగంగా.. సీఐఎస్-ఏ౨కే ప్రోగ్రాం మేనేజర్ పవనజగారు పంపించిన పత్రాల అనువాద ప్రక్రియలో నాకు సహకరించిన భాస్కరనాయుడు గారికి, సుజాత గారికి, రహ్మానుద్దీన్ గారికి నా ధన్యవాదాలు... --Pranayraj1985 (చర్చ) 06:17, 2 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Unused images without license

[మార్చు]

Hello, I made a list of images without licensing information (probably unfree) which are also unused. They must be deleted per wmf:Resolution:Licensing policy, unless they have a valid free license. Where can I ask deletion? Nemo bis (చర్చ) 14:33, 2 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

you have listed వాడుకరి:Nemo bis/Unused files to delete. in that pictures there are important pictures with public domain. the users who created the picture do not add them in the articles. i will add them in relevant articles. please do not delete the pictures. if there are any fair use pictures which are do not use in the articles after i do the work then you will delete them as per wmf:Resolution:Licensing policy. thank you sir.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:33, 3 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Hello వాడుకరి:Nemo bis There are so many pictures are need to paste in those article which are need for these pics in your list - so do not delete them, until we did that job - thank you--Viswanadh (చర్చ) 12:06, 4 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@Nemo bis and others, I have made a table of users and the number of files which need fixing and posted it atవాడుకరి:Arjunaraoc\files_needing_license_info, I request the wikipedians to address the issue in 3-6 months, failing which they may be deleted. Please note that licensing information needs to be added by the original uploader only for it to be authentic. If any uploader needs help, they may contact other experienced wikipedians. --అర్జున (చర్చ) 11:49, 6 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@Nemo bis , As I found some of the files to be having licensing information, but are being flagged in categories like" no machine readable "xxxx, we need to update the Template:Information .Can you help update the same?--అర్జున (చర్చ) 12:05, 6 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మొలక వ్యాసాల గుర్తింపు.

[మార్చు]

సభ్యులకు,

బాటు ద్వారా మొలక వ్యాసాలను గుర్తించడానికి ఇవాళ నేను బాట్ ను ఆడిస్తున్నాను. ఇందుకు ప్రస్తుతమున్న 2048 బైట్ల నిడివిని కాకుండా 4000 బైట్ల నిడివిని మొలక వ్యాసాలుగా గుర్తిస్తున్నాను. అయోమయ నివృత్తి పేజీలు శీర్షికలో అయోమయ నివృత్తి అని లేనిదే అయోమయ నివృత్తి పేజీలుగా పరిగణించడానికి లేదు. అందువలన అయోమయ నివృత్తి పేజీలలోకి ఈ మొలక మూస చేర్చబడుతుంది. మొలక నిడివి ఎక్కువ చెయ్యడం సముదాయ సభ్యులకు సమ్మతమేనా? --రహ్మానుద్దీన్ (చర్చ) 07:29, 5 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రహ్మానుద్దీన్ గారు, తప్పకుండా మీ బాట్‌ను ఆడించండి. మొత్తం ఎంత పొడవు వచ్చినా నాకు సమ్మతమే. కానీ ప్రతినెల మొలకలు (మొగ్గలు) తీయండి. తదుపరి అందులో మొగ్గలు పుష్పించినవి (అనగా మొలకలు నుండి ఎదిగినవి) ఎన్ని కూడా తెలిస్తే బావుంటుంది. మరొక విషయం, మాకు ముంజేతి కంకణం అందుబాటులో లేదు. దాని వలన వ్యాస నిడివి మాకు తెలియటము లేదు. దానిని మాకు అందుబాటులో ఉంచితే మొగ్గలు ముందుగా పుష్పించి తదుపరి పువ్వు(వ్యాసము)లుగా మారే అవకాశము రావచ్చును. ఈ విషయములు కూడా మీరు దృష్టిలో పెట్టుకొని, అన్నీ పరిష్కరించగలరని ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 08:32, 5 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారూ, ప్రత్యేక:Gadgets వద్ద ఏ-ఏ గ్యాడ్జెట్లు పని చెయ్యటంలేదో తెలుస్తున్నది. అక్కడ తెలిపిన విధంగా మార్పులు చేసినా, ఇంకా పని చేయటం లేదు. ఈ వారాంతానికి ముంజేతి కంకణం పని చేసేలా చూస్తాను. అలానే, ఈ నెలవారీ మొలకల జాబితాను వైజాసత్య గారు వ్రాసిన స్క్రిప్టుతో సరి చేయవచ్చు. --రహ్మానుద్దీన్ (చర్చ) 13:35, 5 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారు, ధన్యవాదములు. ప్రతి నెల నెల పాత మొలకలు కూడా మీకు వీలయితే ఉంఛండి. JVRKPRASAD (చర్చ) 13:44, 5 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మొలక జాబితాను తయారు చేయండి. నెలవారీ మొలక జాబితాలను యిదివరకు ప్రతినెలా తయారుచేసేవారు. కానీ ఆ మొలకను విస్తరించేదెవరు? అవి సృష్టించే వాడుకరులు కూడా స్పందించరు. అలా అవి జాబితాల రూపంగానే మిగిలిపోయాయి. యిదివరకు మొలక వ్యాసాలు, ఏక వాక్యాలపై విస్తృతమైన చర్చ జరిగినది. ఓటింగు పద్దతిలో మొలక స్థాయి దాటాలంటే 2 కె.బి వ్యాసముండాలని నిర్ణయించారు. కానీ ఈ విధానాన్ని అమలు చేయాలంటే ముందుగా మొలకలను సృష్టించడం మానివేయాలి. వ్యాసం కనీసం 2 కె.బి ఉన్నదంటే ఆ వ్యాసాన్ని ప్రారంభించాలి. లేనిచో వ్యాసాన్ని మొదలుపెట్టరాదు. కొన్ని వ్యాసాలలో ఒక మూసను చేర్చి అది కూడా ఒక వ్యాసంగా నిర్ణయిస్తే ఎలా? కనీసం వ్యాసంలో కొన్ని వాక్యాలు కూడా వ్రాయరు. జాబితాలను తయారుచేస్తే ఎవరి మొలకలను వారు విస్తరిస్తారంటే అదీ ఉండదు. మరి ఈ జాబితాలతో పని ఏమో అర్థం కావటంలేదు. యికనుండైనా మొలక వ్యాసాలు సృష్టించడం ఆపి ఎవరి మొలక వ్యాసాలను వారు అభివృద్ధి చేయాలని మనవి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 10:26, 6 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నేను సృష్టించిన ఏ వ్యాసములు అయినా కనీసం 2కెబి వరకైనా ఉండేటట్లుగా, మొలక స్థాయి దాటే విధంగా వ్రాయగలను. అందుకే నేను వ్రాస్తున్న వ్యాసములలో కొంతకాలం పాటు ఎవరినీ జోక్యం చేసుకోవద్దని పదే పదే తెలియజేస్తున్నాను. నేను వ్రాస్తున్న వాటిలో అనేక లింకులు ఉంటాయి. అందుకని మొలకలుగా ఉన్నా అవి తదుపరి వ్యాస రూపాంతరము చెందుతాయి. మధ్యలో కొత్త వాడుకరులుగా వచ్చి కొంతమంది అనవసర చర్చలు చేస్తున్నారు. ఒకేసారి అన్ని మొలకలు పూర్తి కావు, అలాగే ఒకదాని తరువాత ఒకటి వ్రాయడము కుదరదు. అదేవిధముగా ఆంగ్లములో ఉన్నవి కూడా నావి పూర్తి చేయగలను. నా వ్యాసములు వరకు మాత్రము పూర్తి చేయగలను. వ్యాస పరిమాణము తెలుసుకోవడము మాత్రము ప్రస్తుతము ఎలానో తెలియడము లేదు. అందరు గమనించగలరని ఆశిస్తాను. JVRKPRASAD (చర్చ) 12:04, 6 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఎవ్వరైనా అనేక మొలకలని సృష్టించి, ఒకటో, రెండో వాక్యాలు రాసి వదలిపెట్టడంలో ఏదైనా (నా కంటికి కానరాని) లాభం ఉందా? వ్యాసాలు సృష్టించిన వారికి ఏదైనా credit వస్తుందా? లేకపోతే ఎందుకు ఇన్ని మొలకలు కనిపిస్తున్నాయి? యాదృచ్చిక పేజీ నొక్కి చూస్తే ఎన్నో అసంపూర్ణంగా ఉన్న మొలకలు కనిపిస్తున్నాయి. పోనీ ఆ మొలకని విస్తరించి పూర్తి చేద్దామా అంటే అది ఎవరు "పూర్తి చేద్దామన్న ఉద్దేశంతో" సృష్టించుకున్నారో అన్న అనుమానం పీకుతూ ఉంటుంది. మొలకని వెనువెంటనే విస్తరించే ఉద్దేశం లేకపోతే ఆ మొలకని సృష్టించకుండా ఉంటేనే లాభదాయకమేమో అన్నది ఆలోచించవలసిన విషయం. ధన్యవాదాలు Vemurione (చర్చ) 18:30, 7 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు తెలిసి వికీపీడియాలో మొలకలను తయారుచేసేవారే ఎక్కువగా ఉన్నారు కానీ మొలకలను విస్తరిద్దామనుకొనేవారు చాలా అరుదు. ఒక్కొక్క వ్యాసం తయారుచేసి దానిని విస్తరించి మంచి వ్యాసంగా తీర్చిదిద్ది మరొక వ్యాసం ప్రారంభించవచ్చుకదా! వికీలో ఫలానా సమయానికి ఇన్ని వ్యాసాలు ఉండాలి అనే నిబంధన ఏదో ఉన్నట్లు పుంఖాను పుంఖాలుగా మొలకలను తయారుచేసి వదిలేస్తున్నారు. వాటి జాబితాలు తయారుచేసినా వాటిపై ఎవరు శ్రద్ధ పెడతారు? ఎవరు విస్తరిస్తారు? ప్రతీ వాడుకరి తాను చేసిన మొలకలపై దృష్టి పెట్టకపోతే ఇతర వాడుకరులు ఆ వ్యాసాన్ని విస్తరించడానికి ఇష్టపడరు! దయచేసి మొలక వ్యాసాలు నిరోధిస్తామన్న సంకల్పం ఉన్న వాడుకరులు మొలకలు తయారుచేయవద్దు. 2 కె.బి వరకైనా విస్తరించి రాయండి. గత రెండేళ్ళ నుండి మొదటి పుటలో ఈ వారం వ్యాసం శీర్షిక నిర్వహిస్తున్నాను. ఈ వ్యాసం పరిగణనల వ్యాసాలు కూడా బాగా తగ్గిపోయాయి. మరి కొంత కాలానికి మొదటి పేజీలో ప్రదర్శిద్దామన్నా విశేష వ్యాసాలు దొరకని పరిస్థితి రావచ్చు! పాలగిరి గారు ఒక వ్యాసాన్ని పూర్తిగా మూలాలతో విస్తరించిన తదుపరి వేరొక వ్యాసంపై దృష్టి పెట్టడం గమనించగలరు. ఆ వ్యాసాలు మీకు తెలుసా శీర్షికకు కూడా ఉపయోగపడుతున్నాయి. కొన్ని మొదటి పేజీలొ ఈ వారం వ్యాసంగానూ ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం వికీపీడియాలో ఉన్న మొలకల సృష్టిపై కొందరు వాడుకరులు దృష్టి పెట్టడం మాని కొన్ని విశేష వ్యాసాలను అయినా తయారుచేసి ఆ వ్యాస చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అనే మూసను చేర్చండి. వికీపీడియా అభివృద్ధికి దోహదపడండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:51, 8 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • కె.వెంకటరమణ గారూ, వేమూరి వారూ మొలకలు సృష్టించి ఊరుకోకూడదని, తెవికీ నాణ్యత పెరగాలంటే మంచి వ్యాసాలు తయారుచేసే అలవాటు ఉండాలన్న విషయంలో నేనూ మీరు చెప్పినదానితో ఏకీభవిస్తాను. ఆ మార్గాన్నే నడుస్తూవుంటాను కూడా. కాకుంటే ఇన్నాళ్ళుగా 2కెబిలోపుండే వ్యాసాలే మొలకల జాబితాలోకి వచ్చేవి. ఇప్పుడు 4కెబి మించని వ్యాసాలన్నిటినీ చేర్చాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనిపై కూడా చర్చించగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 06:06, 8 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
4వేలకెబిదాటని వ్యాసాలను మొలకల జాబితాలో చేర్చడం సరియైనదనే నేను భావిస్తాను.Palagiri (చర్చ) 04:42, 10 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ మొలక వ్యాసాల కొరకు 1 ఏప్రిల్ 2013 న వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం పై జరిగిన ఓటింగు విధానంలో "తెవికీలో అనుభవంగడించినవారు (అనగా 25 మార్పులైన చేసినవారు) ప్రారంభించిన మొలక వ్యాసాలు, ప్రారంభించిన నెలరోజులలోగా కనీస స్థాయికి అనగా వ్యాస పరిమాణం 2000బైట్ల మరియు కనీసం ఒక అంతర్గత లింకు) ఎదగకపోతే వాటిని వీలైతే ఇతర వ్యాసాలలో విలీనం చేసి తొలగించవలెను." అని ప్రతిపాదించబడినది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 07:54, 10 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీ సముదాయానికి డిజిటల్ రీసోర్స్ సెంటర్ స్థాపన విషయమై

[మార్చు]

తెలుగు సముదాయం ద్వారా జరుగుతున్న కార్యకలాపాలకు మరింత చేయూతనిచ్చేందుకు సీఐఎస్-ఏ2కే తరఫున స్కానర్, ఆడియో రికార్డర్ లాంటివి అందించాలనే ప్రతిపాదన వచ్చినది. ఈ ఉపకరణాలు వాడి తెవికీ సముదాయం వారు మరింత లాభపడాలని సీఐఎస్-ఏ2కే కాంక్షిస్తుంది. సీఐఎస్-ఏ2కే పని చేస్తున్న అన్ని సముదాయాల్లో ఈ తరహా డిజిటల్ రీసోర్స్ సెంటర్ ఏర్పాటు చేయలనుకుంటున్నాము. ఈ స్కానర్ లేదా ఇతర ఉపకరణాలు తెలుగు సముదాయ సొత్తుగా ఉంటాయి, ఉపయోగించుకునే వ్యక్తి బాధ్యత వహించి వాడుకున్న పిదప అవసరమున్న తెవికీ సభ్యుడికి ఇచ్చివేయవచ్చు లేదా సీఐఎస్ బెంగుళూరు ఆఫీసుకు పంపవచ్చు. స్కానర్, ఆడియో రికార్డర్ కాకుండా మరే ఇతర ఉపకరణం కావాలన్నా కూడా సీఐఎస్ వారి అభ్యర్థన పేజీ మీద చెప్పగలరు. --రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే) (చర్చ) 12:12, 13 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాతో విజయవంతంగా పనిచేయడం ఎలా దస్త్రం రూపకల్పన

[మార్చు]

ఇటీవల సీఐఎస్ ఎ2కె వారి ప్రోగ్రామ్ అసోసియేట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఉద్యోగ దరఖాస్తును పరిశీలించే క్రమంలో వారు how to work successfully with wikipedia అన్న చిరుపొత్తాన్ని అనువదించమనీ, ఈ పుస్తకం విషయంలో ప్రత్యేకించి భారతీయ ఉదాహరణలతో భారతీయీకరణ (ఇండియనైజేషన్) చేయమని సూచించారు. ఆ నేపథ్యంలో సంస్థాగత భాగస్వామ్యాల ఉదాహరణలు భారతీయంగా తీసుకుని, అందుకు అనుగుణంగా ఛాయాచిత్రాలు, పాఠ్యం కూడా మార్చి వికీపీడియాతో విజయవంతంగా పనిచేయడం ఎలా? అన్న పుస్తకాన్ని రూపొందించాను. ఈ ప్రయత్నంలో కొంత భాగం అనువాదంతో పాటుగా, మిగిలిన భాగం విషయంలో భారతీయ ఉదాహరణల స్వీకరణ, అనుగుణమైన ఛాయాచిత్రాల ఎంపిక, పాఠ్యం రచన, రూపకల్పన వంటివన్నీ చేశాను. ఇందుకు యూనీకోడ్ తెలుగు పాఠ్యాన్ని వినియోగించి ఇంక్‌స్కేప్ ద్వారా తయారుచేశాను. మూలకృతిని, నేను తయారుచేసిన భారతీయమైన కృతిని పరిశీలించి మీ అభిప్రాయాన్ని ఇక్కడ వ్యాఖ్యానించమని కోరుతున్నాను. ధన్యవాదాలతో పవన్ సంతోష్ (చర్చ) 15:53, 13 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రసాయన శాస్త్రం

[మార్చు]

రసాయన శాస్త్రం వ్యాసాలను అభివృద్ధి చేస్తున్న పాలగిరి గారికి చాలా ధన్యవాదాలు. ఇవి తెలుగు విద్యార్ధులకు చాలా ప్రయోజనకరం. వీనిలో ఒక చిన్న సవరణను ప్రతిపాదిస్తున్నాను. ఆంగ్ల పదాలు తెలుగులోకి అనువదించినప్పుడు చివరగా పొల్లు రాకూడదు. తెలుగు భాష అజంత భాష అనగా అచ్చుతో అంతమయ్యేది అని అర్ధం. మనం సోడియమ్‌ అని కాకుండా సోడియం అని వ్రాస్తున్నాము. కాబట్టి బ్రోమైడ్, సల్ఫేట్ మొదలైన చాలా పదాలు బ్రోమైడు, సల్ఫేటు అని ఉండాలి. సమ్మేళనాలకు కూడా ఇలాగే మార్పుచేయాల్సి వుంటుంది. సభ్యులు వారి అభిప్రాయాల్ని తెలియజేయాలని కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 13:56, 15 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ అంశంలో రాజశేఖర్ గారి అవగాహన, వివరణ చాలా సరైనదని నా పరిశీలన. తెలుగు భాష పదాలను సంస్కృత ప్రాకృతాల నుంచి స్వంతం చేసుకున్నప్పుడే డుమువులు చేర్చి వాడేసుకున్నాం. అలానే ఇక్కడ ఆంగ్లాన్ని తెనిగించుకోవడంలో చక్కగా ఉకారాన్నో, పూర్ణానుస్వరాన్నో(ము లేదా ం) చేర్చేసుకుంటే సరి. ఇది పత్రికలు, ఇతర సమకాలీన పుస్తకాల్లో కూడా ప్రాచుర్యంలో ఉన్న మంచి పద్ధతి. మంచి సూచన. --పవన్ సంతోష్ (చర్చ) 15:21, 15 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్‌ గారి సలహాని సూత్రప్రాయంగా సమర్ధిస్తున్నాను. మాట చివర నకారపొల్లు వచ్చిన సందర్భాలలో మరికొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి (వికీపీడియాలో). ఉదాహరణకి: క్లబ్లోకి అని రాస్తే బాగుండదు. క్లబ్‌లోకి అని రావాలంటే క్లబ్‌ అని టైపు చేసి వెనువెంటనే ^ అనే గుర్తు టైపు చెయ్యాలి. లేదా క్లబ్ అని టైపు చేసి, ఒక ఖాళీ వదలి లోకి అని చెయ్యాలి. పబ్బం గడుపుకోడానికి ఏదో ఒక విధంగా టైపు చేసేమనుకుందాం. అప్పుడు "క్లబ్ లోకి" అని వెతుకు పెట్టెలో వేసి వెతికవలసి వచ్చినప్పుడు క్లబ్ అన్న మాటని ఎలా (అంటే ^ ఉపయోగించా, ఉపయోగించకుండానా) మొదట్లో టైపు చేసేమో అచ్చం అలానే టైపు చేస్తే మనకి అంశం దొరుకుతుంది. ఈ వైవిధ్యత పరిష్కారం లేకుండా ఉండిపోవడం వల్ల ప్రస్తుతం మన వికీపీడియాలో వెతకడం అనేది కష్టం అవుతోంది. కనుక బ్రోమైడ్, సల్ఫేట్ మొదలైన చాలా పదాలు బ్రోమైడు, సల్ఫేటు అని ఉంటే ఈ సమస్య కొంతవరకు అదుపులోకి వస్తుంది. వికీపీడియాలో కొంతకాకపోతే కొంతయినా స్థాయీకరణ లేకపోతే మనం పడుతూన్న శ్రమ అంతా వృధా అయిపోతుందేమోనన్న బెంగ నన్ను నిత్యం వెంటాడుతోంది. మన పేజీలని సందర్శించడానికి ఎంతమంది వస్తున్నారో గణాంకాలు చూడండి. నేను చూసిన పేజీలలో దేనికీ పట్టుమని 30 మంది కూడ లేరు. ఆలోచించండి. Vemurione (చర్చ) 01:57, 16 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
శాస్త్రవిజ్ఞానికి చెందిన సాంకేతిక పదాలను అంగ్ల పద ఉచ్చరణకు అనుకూలంగా హలాంతాలుగా ఉంచడమే సరియైనది అని నానమ్మకం.పిడుగుకు బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లుగా అన్ని అజాంతాలుగా కావాలని అంటే ఎలా?.ఒకప్పటి పుస్తకాలలో ఉన్నభాషాకు ఇప్పటి వ్యవహారభాషాకు ఎంతో వ్యత్యాసమున్నది.కావున సాంకేతిక పదాలు హాలంతాలుగా నే ఉండనివ్వండి.వచ్చేనష్టం లేదు.ఈ విషయమై బాగా అలోచించే ఆపదాలను అజంతాలుగా మార్చలేదు.వ్యాసంలోని పదాలనుమార్చకుండ వ్యాస శీర్ధికను అజంతంగా దారి మార్పు చేసిన వ్యాసంను వెదకుటకు ఇబ్బంది ఉండదు. శాస్త్రవిజ్ఞానం,యంత్రిక శాస్త్రంలో అనుభవమున్న వ్యక్తిగా సాంకేతిక పదాలను సాంకేతిక పదాలుగానే ఉండనిద్దాం.ఇప్పటి వరకు నే వ్రాసిన అన్ని రసాయనసశాస్త్ర వ్యాసాల శీర్షికలకు చివరన డు,ము,వు లు చేర్చాను.అందువలన వెతుకు పెట్టెలో వ్యాసాలను వెదుకుటకు ఎలాంటి ఇబ్బందిలేదు.Palagiri (చర్చ) 03:37, 16 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరులకు నమస్కారము. అందరినీ సమర్ధిస్తూనే ఎక్కువగా పాలగిరి గారిని సమర్ధిస్తున్నాను. నాతో చర్చ చేయాలనుకుంటే చేయవచ్చును. గ్రూపులతో, గొడవలు వద్దు. నేను ప్రశ్నలు ఇస్తాను, సమాధానము చెప్పగలిగే వాళ్ళు చెప్పవచ్చును. కొన్ని శాస్త్రాలలో పేర్లు, ఊరి పేర్లు, రైల్వేలలో కొన్ని వందల పేర్లు, ఇతరత్రా అనేక వాడుకలోని పదాలకు అజంతా భాషకు సరిపోవు. అజంతా అంటూ కొమ్ములు ఇచ్చుకుంటూ పోతే అర్థాలు మారిపోతాయి. ఉదా: భోపాలు, మాచ్‌ఖండు, కిషన్‌గంజు, క్లోరిను, ఇథలీను, ఆల్కహాలీకు, మిథనాలు, మోనోక్రోటోఫాసు, ఇమిడాక్లోప్రిడు, ఎసిఫేటు, ఎసిటామిప్రిడు.........భత్కళ, సూరత్కళ, హబీబుగంజు, హజ్రతు నిజాముద్దీను,.........కొన్ని వేల పదాలకు అర్థాలు మారి పోతాయి. ప్రజలకు సౌకర్యం, వాడుకలో ఉన్నవి, అర్థాలు ఏవిధంగా చెడకుండా, వీలయిన చోట్ల కొమ్ములు ఇచ్చుకుంటూ, కుదరని పక్షంలో అలాగే ఉంచటం మంచిది. అనవసర ప్రయత్నమే అవుతుంది. నేను రసాయనిక శాస్త్రము, ఇతర జాబితాలలో చేర్చినవి బాగానే ఉన్నాయని నా నమ్మకం. ఎవరో పదిమంది వచ్చి వారి వాదన నెగ్గాలని, వారు చెప్పేదే వేదమని అనవసర చర్చలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. పని చేస్తూ చర్చలు చేస్తే కొంత మనుష్యుల మధ్యన అవగాహాన ఉంటుంది. ఇటువంటి గురించి ఆలోచించే కన్నా, అందరూ వారికి తోచిన పని చేస్తే తెలుగు అజంతా శిల్పాల అందాలకు మెరుగులు దిద్దిన వారు అవుతారని, అదే మంచిది అని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 07:26, 16 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సభ్యుల స్పందనలకు ధన్యవాదాలు. ఇంటర్మీడియట్, డిగ్రీ పాఠ్య పుస్తకాలలో ఏవిధంగా ఉన్నది. వాటిలో కూడా పదాలు పొల్లుతోనే అంతమయ్యాయా. దయచేసి తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 08:03, 16 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారు, మీరు చెప్పిన కొన్ని పదాలకు కొమ్ములు ఇవ్వవచ్చును. అర్థం కూడా పెద్దగా ఏమీ మారదు. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇథలిన్ ఇలా చాలా వాటికి కొమ్ములు ఇవ్వము, చాలా కొద్ది పదాలకు మాత్రమే మనము తెలుగులో ఇస్తున్నాము. పదం అర్థం మారని, ఇవ్వగలిగే వాటికి ఇవ్వవచ్చును. సమస్య పెద్దగా ఏమీ ఉండదు. ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 08:46, 16 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంటర్మీడియెట్, డిగ్రీ పుస్తాకాలే ప్రమాణీకాలు కాదు.వ్యాసాలు కేవలం విద్యార్దులకే కాదు అందరికి ఉద్దేశించి వ్రాసినవి. ఈలింకులు కూడా చూడండి:

Palagiri (చర్చ) 04:47, 17 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు అజంతా భాషలో మాజీ ప్రధాని "మన్ మోహన్ సింగ్" గారి పేరుకు కొమ్ములు ఉండాలంటారండీ ! దయచేసి తెలిసిన వారు తెలియజేయ గలరు. JVRKPRASAD (చర్చ) 06:26, 17 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సభ్యులకు ధన్యవాదాలు. ఇప్పుడు తెవికీలోని రసాయన శాస్త్ర వ్యాసాలను అదే విధంగా పొల్లుతోనే ఉంచడమే మంచిదనిపుస్తుంది. ఈ చర్చను ప్రస్తుతానికి ముగిస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 07:04, 17 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియాకు కావలసిన వనరులు

[మార్చు]

అందరికి నమస్కారం... తెలుగు వికీపీడియాకు కావలసిన వనరుల గురించి గత నెలలో సీఐఎస్-ఏ2కే ప్రోగ్రాం మేనేజర్ పవనజతో అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో రాజశేఖర్ గారు, ప్రణయ్‌రాజ్ వంగరి మరియు విజయవాడలోని హోటల్ ఐలాపురంలో విశ్వనాధ్ గారు, మల్లాది కామేశ్వరరావు గారు సమావేశమైన విషయం సభ్యులకు తెలిసిందే. అందులో

చర్చించిన అంశాలు

Creating Movement Resources - Telugu

దస్త్రాలు (డాక్యుమెంట్లు):-

  1. వికీపీడియా కరపత్రము - 4 పేజీలు
  2. వికీపీడియా శిక్షణ
  3. వికీ మార్కప్ తక్షణ రెఫరెన్సు (చీట్-షీట్)
  4. కీబోర్డు లేఔట్ - మరియు ఆపిల్ మరియు మాడ్యులర్ కీబోర్డు - ప్రస్తుత డాక్యుమెంట్ల కొరకు
  5. కాపీరైట్ మాన్యువల్
  6. సిసి కరదీపిక
  7. వికీసోర్సు శిక్షణ
  8. విక్షనరీ శిక్షణ

వీడియోలు :-

  1. Tutorial videos - 10 number just like Hindi & Kannada

Request from Telugu community:-

  1. DLI books to be listed and find out the books which are out of copyright so that they can be added to Telugu Wikisource

పై అ లిస్ట్ చూపి మరేవైనా మార్పులు ఉంటే సూచించమని అడిగారు. మునుపు సి.ఐ.ఎస్ వర్క్ ప్లాన్‌లో వికీ సముదాయం సూచించిన మార్పులను పరిశీలించమని విశ్వనాధ్ గారు చెప్పారు. ఇవి కాకుండా వేరే ఏవైనా Resources కావాలనుకుంటే సభ్యులు తెలుపగలరు మరియు పై వాటిలో ప్రాధాన్యతను బట్టి ఏది తెవికీకి ముందుగా అవసరమో కూడా తెలుపగలరు. Resources కోసం ఇక్కడ చూడగలరు. ధన్యవాదాలు... --Pranayraj1985 (చర్చ) 09:32, 17 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మనకు ఒక ప్రొజక్టర్ , తెర వుంటే బాగుంటుంది ఎక్కడన్నా ఔట్ రీచ్ పొగ్రాములప్పుడు అవసరం --122.175.25.187 03:44, 3 నవంబర్ 2015 (UTC)

చరిత్రలో ఈ రోజు శీర్షిక నిర్వాహకులకు విజ్ఞప్తి

[మార్చు]

ఈ శీర్షికలో చేర్చే బొమ్మలలో తెలుగువారి బొమ్మలకే ప్రాధాన్యతనీయ ప్రార్థన. --కంపశాస్త్రి 01:16, 18 అక్టోబరు 2015 (UTC)

కంపశాస్త్రి గారూ, మీ సూచనకు ధన్యవాదాలు. మొదటి పేజీలో ప్రదర్శితమవుతున్న చిత్రాలు సార్వజనీనమైనవి,కామన్స్‌లో ఉన్నవి ఉండాలి. కనుక కొంత మంది తెలుగు ప్రముఖుల చిత్రాలు ఉచితమైనవి లభించనందున ఉచితంగా లభ్యమయ్యే ఇతర చిత్రాలను చేర్చడం జరిగినది. సాధ్యమయినంతవరకు తెలుగువారి చిత్రాలను చేర్చే ప్రయత్నం చేద్దాం.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:54, 18 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీవాండ్ అప్లికేషను

[మార్చు]

వాడుకరులకు నమస్కారము. ఒకసారి వికీవాండ్ అప్లికేషను మీ బ్రౌజరులో యాడ్‌ఆన్ డౌన్‌లోడ్ చేసుకొని, అందులోనుండి వ్యాసములు వ్రాయుటకు ఒకసారి ప్రయత్నించి చూడండి. JVRKPRASAD (చర్చ) 00:09, 20 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారూ, ఈ ఆడ్ ఆన్ ను ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో ప్రయత్నించాను. వ్యాసాన్ని ఎడిట్ చేయవలెనంటే మరలా పాత వికీ పేజీకి పోవలసి వస్తున్నది. ఇందులో గల ప్రత్యేకతలు మరియు పనిముట్లు ఏమిటో తెలియడం లేదు. సాధారణ వికీ పేజీకి మరియు ఇందులో చూస్తున్న కంటెంట్ కి తేడా పెద్దగా కనబడటం లేదు. ఇందులోని ప్రత్యేకతలను వీలున్నచో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:56, 20 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాముఖ్యత, ప్రాచుర్యం కలిగిన పద్యాలకు వేరే వ్యాసాలు, ఆ వ్యాసాల అవసరాలు

[మార్చు]

తెలుగు సాహిత్యంలో ఎన్నో విధాలుగా ప్రాచుర్యం పొందిన పద్యాలు, కవితలు ఉన్నాయి. వీటి ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ఏకంగా కొన్ని పద్యాల పాదాలను విశ్లేషిస్తూ పుస్తకాలే రాశారు (ఉదాహరణకు నన్నయ్యగారి కథాకలితార్థయుక్తి, అల్లసాని వాని అల్లిక జిగిబిగి). కొన్ని పద్యాలు పండితులు మొదలుకొని అత్యంత పామరుల వరకూ నోటికి వచ్చివున్నాయి (ఉదాహరణకు బావా ఎప్పుడు వచ్చితీవు), కొన్ని పద్యాల పాదాలు సామెతలుగా వర్థిల్లాయి (నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష). ఈ నేపథ్యంలో పద్యాలకు, కవితలకు విడిగా వ్యాసాలు సృష్టించి, వాటి గురించి రాయాలని ప్రయత్నిస్తున్నాను. ఇందుకు తెలుగు సాహిత్యంపై కృషిచేసే ఇతర వికీసభ్యులు కూడా ముందుకురావాలని పిలుపునిస్తున్నాను. అలాగే ఆ వ్యాసాలకు కూడా సమాచారపెట్టె ఉండాలని ఆశిస్తున్నాను. ఎవరైనా ముందుకువస్తే చర్చించి తయారుచేద్దాం. ముందస్తుగానే ధన్యవాదాలతో పవన్ సంతోష్ (చర్చ) 09:45, 21 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ, సమాచారపెట్టెకు కావలసిన అంశాలను తెలుపగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 17:19, 21 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ మూస:సమాచారపెట్టె పద్యం పరిశీలించండి. దీనిని సింగం బాకటితో గుహాంతరమునం పద్యానికి వాడుకను పరిశీలించి ఏ విషయాలైనా చేర్చవలసినవి ఉంటే తెలియజేయండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 01:27, 22 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తాజాకలం: ఇప్పుడే చిన్న సమస్య గుర్తించాను. ఈ పద్యం చేర్చిన ప్రతి వ్యాసంలోనూ శతకాలు అన్న వర్గం అప్రమేయంగా వచ్చేస్తోంది. ప్రఖ్యాతిపొందిన పద్యాలన్నీ శతకపద్యాలే కాదు కదా. ఈ సింగం బాకటితో, సారపు ధర్మమున్ విమల సత్యము వంటివన్నీ భారత పద్యాలు, అంతే కాక రాబోవు కాలంలో మరెన్నో ఇతిహాసాల, కావ్యాల, ప్రబంధాల, ఖండకావ్యాల పద్యాలకు వ్యాసాలు తయారుచేస్తాం. అంతేకాక ఒకవేళ శతకపద్యాల వ్యాసాల్లో కూడా వర్గం శతక పద్యాలు అనివుండాలి తప్ప శతకం అని ఉండకూడదు. కాబట్టి ఆ అప్రమేయంగా రాకుండా చూడగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 18:23, 22 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చరిత్రలో ఈ రోజు -- అక్టోబరు 23 లో మార్పు

[మార్చు]

చరిత్రలో ఈ రోజు అక్టోబర్ 23 లో పీలే మరణం అని ఉన్నది. దానిని జననం గా మార్చాలి.--కంపశాస్త్రి 00:27, 23 అక్టోబరు 2015 (UTC)

కంపశాస్త్రి గారి వ్యాఖ్యకి ధన్యవాదాలు. ఇది ఎవరైన సరిచేయవచ్చు. మార్పు ద్వారా సరిచేశాను.--అర్జున (చర్చ) 06:40, 23 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారికి,ధన్యవాదాలు. నాకు ఈ మార్పు ఎలా చేయాలో తెలియడం లేదు. వ్యాసాలలో అయితే సవరించు బొత్తం నొక్కగానే సవరించవలసిన పాఠం తెరమీదికి వస్తుంది. దానిలో మార్పులు చేసి పేజీని భద్ర పరిస్తె సరిపోతుంది. ఒక పది రొజుల క్రితం వరకు ఇదే పద్ధతిని చరిత్రలో ఈ రోజు కు కూడా వర్తిపజేస్తూ వచ్చాను. కాని ఇప్పుడు కుదరడం లేదు. నా పరిజ్ఞానం చాలదనుకుంటాను. సాంకేతికత మారిందేమో?--కంపశాస్త్రి 07:43, 24 అక్టోబరు 2015 (UTC) నాగూరు బాబు(మనో) జననం అక్టోబరు 26, (అక్టోబరు 24 కాదు). మార్చాలి.--కంపశాస్త్రి 22:27, 24 అక్టోబరు 2015 (UTC)

కంపశాస్త్రిగారూ, మీరు నేరుగా మార్పులు చేసుకోవచ్చు. దారిమార్పు పేజీలుగా ఉండడం వల్ల మార్పులు చేయడంలో మీకు యిబ్బంది యేర్పడింది. దానిని సరిచేసాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:19, 25 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

గత కొన్ని నెలలుగా నేను చరిత్రలో ఈ రోజు లో ఉన్న సంఘటనలు, జననాలు, మరణాలు లను మార్పులు... చేర్పులు చేస్తున్నాను. ఒక్కో పేజీలో ఒక్కో రకంగా ఉంటున్నాయి. వాటన్నింటిని ఒకే రూపంలోకి తీసుకువస్తున్నాను.

ఉదా. అక్టోబర్ 27 పేజీలోని జననాలు వర్గంలో ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ లను కనుగొన్న నావికుడు జేమ్స్ కుక్ జన్మించాడు అని ఉంది. అది జననాలు అనే శీర్షికలోనే ఉంది కాబట్టి జన్మించాడు అనే పదాన్ని తొలగించి జేమ్స్ కుక్, ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ లను కనుగొన్న నావికుడు. (మ.1779) గా మారుస్తున్నాను. అదేవిధంగా ఆయా వ్యక్తుల యొక్క జనన మరణ తేదీలను సరిచేస్తున్నాను. --Pranayraj1985 (చర్చ) 14:07, 27 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

జనన మరణాలను సరిచేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ కృషిని కొనసాగించండి. యిలా చేయడం వల్ల ఈ పేజీలు నాణ్యత మెరుగుపడుతుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:19, 27 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు కె.వెంకటరమణ గారు....--Pranayraj1985 (చర్చ) 14:58, 27 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/నవంబర్ 15, 2015 సమావేశం

[మార్చు]

అందరికి నమస్కారం... వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/నవంబర్ 15, 2015 సమావేశం… నవంబర్ 15, 2015 (మూడవ ఆదివారం) నాడు హైదరాబాద్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో ఏర్పాటు చేయబడుతుంది.

చర్చించాల్సిన అంశాలు

[మార్చు]
  • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • ప్రస్తుతం జరుగుతున్న వికీ ప్రాజెక్ట్ పై సమీక్ష
  • వికీ శిక్షణా శిబిరాల నిర్వాహణ పై చర్చ
  • భవిష్యత్ ప్రణాళిక
  • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు

సభ్యులు హాజరుకాగలరు. వివరాలకు వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/నవంబర్ 15, 2015 సమావేశం లో చూడగలరు. --Pranayraj1985 (చర్చ) 18:29, 8 నవంబర్ 2015 (UTC)

అవనిగడ్డలో తెవికీ అవగాహనా సదస్సు

[మార్చు]

మండలి బుద్ధప్రసాద్ గారు ఈ నెల 16న అవనిగడ్డలో తెవికీ అవగాహన కోసం ఒక సదస్సును ఏర్పరచనున్నారు. ఈ సదస్సులో భాగంగా అవనిగడ్డలోని ప్రభుత్వ కళాశాలలోని ఉపాధ్యాయులకు తెవికీ శిక్షణ ఇవ్వబడుతుంది. తెవికీ సముదాయం ఒప్పుకున్న పక్షంలో ప్రభుత్వ కళాశాలతో సీఐఎస్-ఏ2కే సంస్థాగత భాగస్వామ్యం ఏర్పరిచి, అక్కడి విద్యార్థులను వికీపీడియనులుగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకు కొత్తగా ఎంపికైన ప్రోగ్రాం అసోసియేట్ పని చేయవలసి ఉంది.
ఇక ఈ సదస్సు ద్వారా బుద్ధప్రసాద్ గారు రచించిన, సంపాదకత్వం వహించిన కొన్ని పుస్తకాలు సీసీ లైసెన్స్‌లో విడుదల కానున్నాయి. వీటిని తద్వారా వికీసోర్స్‌లో చేర్చే వీలు ఏర్పడుతుంది. తెవికీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనగలరు. వారి దారి-వసతి ఖర్చులు సీఐఎస్-ఏ2కే భరిస్తుంది. --రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే) (చర్చ) 09:23, 9 నవంబర్ 2015 (UTC)

ఈ భాగస్వామ్యం సమ్మతి తెలపండి

సమ్మతమే

[మార్చు]
  1. Pranayraj1985 (చర్చ) 10:47, 9 నవంబర్ 2015 (UTC)
  2. Rajasekhar1961 (చర్చ) 12:33, 9 నవంబర్ 2015 (UTC)
  3. --Viswanadh (చర్చ) 13:30, 9 నవంబర్ 2015 (UTC)
  4. ... భాస్కరనాయుడు (చర్చ) 13:36, 9 నవంబర్ 2015 (UTC)
  5. ----నాయుడుగారి జయన్న (చర్చ) 17:06, 9 నవంబర్ 2015 (UTC)
  6. --Nrgullapalli (చర్చ) 01:46, 10 నవంబర్ 2015 (UTC)
  7. -- ----t.sujatha (చర్చ) 09:52, 10 నవంబర్ 2015 (UTC)
  8. --------JVRKPRASAD (చర్చ) 04:46, 14 నవంబర్ 2015 (UTC)

<ఇక్కడ సంతకం చేయండి>

సమ్మతం కాదు

[మార్చు]

తటస్థం

[మార్చు]

చర్చ, సూచనలు

[మార్చు]
  • ఈ భాగస్వామ్యంలో ఒక విష్యం గమనించాలి. కళాశాల పరిధిలో వికీ అవగాహన లేదా శిక్షణ లాంటి విషయాలలో విద్యార్ధులకు కేవలం వారి పాఠ్యాంశాలలో మాత్రమే కాక ఇతర విషయాలో వ్యాసరచనకు అవకాశం కల్పించగలిగితే బావుంటుంది. ఎందుకంటే ఇప్పటికే లయోలా కళాశాల ద్వారా వచ్చిన వ్యాసాలలో ఇబ్బాందులు ఎదుర్కొన్నాం కనుక అలాంటి సమస్య తలెత్తకుండా ముందు వారికి అన్ని విషయాలో వ్యాసాలు రాయడం మీద అవగాహన వచ్చిన పిదప పాఠ్యాంశాలలో వ్యాసాలను రాయించేలా కళాశాల యాజమాన్యాన్ని ఒప్పించగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఈ దిశగా సి.ఐ.ఎస్ కృషిచేయగలరని ఆశిస్తాను. --Viswanadh (చర్చ) 13:30, 9 నవంబర్ 2015 (UTC)
ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వికీపీడియనులు నమోదు చేసుకోగలరు

భాస్కరనాయుడు (చర్చ) 13:41, 9 నవంబర్ 2015 (UTC)

  1. --Nrgullapalli (చర్చ) 01:48, 10 నవంబర్ 2015 (UTC)
  2. <ఇక్కడ సంతకం చేయగలరు>
ఈకార్యక్రములొ పాల్గొనదలచి పేర్లు నమోదుఛెయటం జరిగింది. తరువాత ఎలాంటి సూచనలు అందలేదు. ఎందుకు నమోదుచేయవలసిందిగా కోరారు. సభ్యులను సంధిగ్దావస్థలో వుంచి మీరు ఆనందిస్తారా!

--Nrgullapalli (చర్చ) 02:16, 16 నవంబర్ 2015 (UTC)

గుళ్ళపల్లి గారూ నమస్కారం. దురదృష్టవశాత్తూ ఈ కార్యక్రమం ఆ ప్రాంతంలో ఇటీవల కురిసిన తీవ్రమైన వర్షాలు, వరదల వల్ల రద్దయింది. భవిష్యత్తులో ఎప్పుడు నిర్వహిస్తారన్నది మండలి బుద్ధప్రసాద్ గారు చెప్పేంతవరకూ తెలియదు. కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తారో వివరాలు వచ్చాకా తెలియజేస్తాం. అసౌకర్యానికి చింతిస్తున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్ - ఎ2కె) (చర్చ) 08:52, 1 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

UPDATE: 2015 Global Congress on Intellectual Property and the Public Interest

[మార్చు]

Hello,
Apologies for writing in English, please feel free to translate this message to your language.
Earlier, we announced in the mailing lists informing you all about the 2015 Global Congress on Intellectual Property and the Public Interest that is going to be held between 15 and 17 December at National Law University, Delhi. 10 Wikimedians from various Indian language Wikimedia communities and Indian English Wikipedia/Wikimedia community will be selected to attend this event where the event is aimed at helping them to work on various policy level works for their respective communities.

From your community we have got 4 nominations where we want you all to select only one participant by endorsing against the usernames below. Please edit the subsections below and endorse the applicant you think should be representing your community in the event. We also encourage more applicants, especially more female applicants, to apply and share their application with other fellow Wikimedians in your language community for endorsements. Though we understand it is quite difficult to assess one’s contribution on the basis of endorsements only, it is impossible on our end to select one from your community as a representative without your consent.

Last date of nomination/endorsement is: 15 November 2015, 23:59 (IST) --Titodutta (చర్చ) 09:58, 9 నవంబర్ 2015 (UTC)

గమనిక

[మార్చు]

కొత్త అభ్యర్థనలు కూడా చేయవచ్చని ఇవాళ ఏ౨కే టీం లో నిర్ణయించడమైనది. తెలుగు నుండి ఒక్కరిని మాత్రమే సముదాయ మద్దతును అనుసరించి ఎంపిక చేయటం జరుగుతుంది. --రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే) (చర్చ) 07:52, 13 నవంబర్ 2015 (UTC)

మీరు చెప్పిన మార్పు పేజీలో లేదు. ఇక అప్లై చేసుకోరాదని గమనిక ఉంది????--Meena gayathri.s (చర్చ) 15:38, 13 నవంబర్ 2015 (UTC)
రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే) గారూ, కొత్త అభ్యర్థనలు చేయవచ్చు అనే నిర్ణయం గల పేజీ లింకును తెలియజేయగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 16:06, 13 నవంబర్ 2015 (UTC)
  • పైన టిటో ఇచ్చిన సందేశం పూర్తిగా చదవగలరు. "We also encourage more applicants, especially more female applicants, to apply and share their application with other fellow Wikimedians in your language community for endorsements." --రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే) (చర్చ) 09:15, 14 నవంబర్ 2015 (UTC)
రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే) గారికి తెలియజేసినందుకు ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా సముదాయ మద్దతుతో ఎంపిక కాబడిన సభ్యులు తెలుగు వికీ అభివృద్ధికి దోహదపడాలని ఆశిద్దాం.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:14, 14 నవంబర్ 2015 (UTC)

Endorsements

[మార్చు]
  1. I support Mr. Nr gullapalli భాస్కరనాయుడు (చర్చ) 01:36, 10 నవంబర్ 2015 (UTC)

Endorsements

[మార్చు]
  1. I support Bhaskaranaidu --Nrgullapalli (చర్చ) 01:41, 10 నవంబర్ 2015 (UTC)

Endorsements

[మార్చు]
  1. Support ' నిస్సార్ గారికి నా మద్దతు ఇస్తున్నాను. --t.sujatha (చర్చ) 09:32, 11 నవంబర్ 2015 (UTC)
  2. Support ' నిస్సార్ గారికి నా మద్దతు ఇస్తున్నాను. --నాయుడుగారి జయన్న (చర్చ) 17:57, 12 నవంబర్ 2015 (UTC)
  3. Support ' అహ్మద్ నిస్సార్ గారికి నా మద్దతు తెలియచేస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:05, 13 నవంబర్ 2015 (UTC)
  4. Support ' అహ్మద్ నిస్సార్ గారికి నా మద్దతు తెలియచేస్తున్నాను. -----JVRKPRASAD (చర్చ) 04:47, 14 నవంబర్ 2015 (UTC)


User:Ahmed Nisar Congratulations - శుభాకాంక్షలు JVRKPRASAD (చర్చ) 05:45, 28 నవంబర్ 2015 (UTC)

"స్వేచ్ఛా నకలు హక్కుల్లో శాస్త్రీయ సంగీత కృతులు" అన్న అంశంపై ఆ ఈవెంట్లో పేపర్ ప్రెజంటేషన్ ఇద్దామని ప్రయత్నిస్తున్నాను. నేను గత సంవత్సరంలో రికార్డ్ చేసి, హక్కులు తీసుకుని కర్ణాటిక్ సంగీతం స్వేచ్ఛా హక్కుల్లో విడుదల చేసే కార్యక్రమం నేనూ, పవన్ సంతోష్ కలిసి స్వంతంగా చేశాం. కాబట్టి ఈ ప్రెజెంటేషన్లో కో-ఆథర్ గానూ, కో-ప్రెజంటర్ గానూ అతన్ని ఎంచుకుని ఒప్పించాను. నాకు పరిచయమైన సీఐఎస్ ఉద్యోగి తన్వీర్ హాసన్ను సంప్రదించగా మా ఇద్దరికీ కలిపి నన్నే నామినేట్ చేయమని సలహా ఇచ్చాడు. దాంతో నేనే సంతోష్ ని, నన్నూ నామినేట్ చేశాను. అది ఇక్కడ చూడండి. ఈవెంట్లో కేవలం పార్టిసిపేట్ చేయడమే కాకుండా తెలుగు వికీపీడియన్లు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విషయంలో చేసిన కృషిని, ఓ కొత్త కోణాన్ని ప్రెజంట్ చేస్తే బావుంటుందని ఇలా చేస్తున్నాను. నా ఈ ప్రయత్నం నచ్చిన వారు నన్ను ఎండార్స్ చేయండి. --Meena gayathri.s (చర్చ) 15:26, 11 నవంబర్ 2015 (UTC)

  • "స్వేచ్ఛా నకలు హక్కుల్లో శాస్త్రీయ సంగీత కృతులు" ద్వారా విడుదలైన దస్త్రాలు ఏవి? ఓటీఆరెస్ కు అనుసరించిన విధానం ఏమిటి? --రహ్మానుద్దీన్ (చర్చ) 09:19, 14 నవంబర్ 2015 (UTC)
  • స్వేచ్ఛా నకలు హక్కుల్లో ఒక ఆడియో ఫైల్ ను విడుదల చేయడం, మరీ ముఖ్యంగా శాస్త్రీయ సంగీత రంగంలో ఉన్న స్థితిగతుల్లో హక్కులు విడుదల చేయించడమనే విషయం పై మాత్రమే నేను పరిమితమయ్యాను. పైగా ఈ హక్కుల విడుదల క్రితం సంవత్సరమే జరిగిపోయింది. కర్ణాటిక్ మ్యూజిక్ పాడేవారు ఇలాంటి ప్రయత్నాలకి ఎలా రియాక్ట్ అవుతారు, పై కార్యక్రమాలు చేయడంలో నిర్వాహకుల పాత్ర ఏంటి, ఈ ప్రయత్నాల వల్ల సంగీతం ప్రజలకు ఎంత బాగా చేరుతుంది, ఇలా విడుదల చేయడం ద్వారా సంగీతం తన పరిధుల్ని ఎలా దాటగలుగుతుంది వంటి విషయాలపై పేపర్ ప్రజంట్ చేద్దామనుకున్నాను. వికీమీడియా కామన్స్ లో చేర్చేందుకు అవసరపడే ఓటీఆర్ఎస్ విధానల గురించి, వాటిలో ఎదురయ్యే సమస్యల గురించీ గ్లోబల్ కాంగ్రెస్ లో చర్చించే ఉద్దేశం నాకు లేదు. పాలసీ లెవెల్ అంశాలపై చర్చించే వారితో వికీ లోని అంతర్గత విధానాలు గురించి మాట్లాడటం బాగోదని నా ఉద్దేశ్యం. పైగా అలాంటి విషయాలు వికీపీడియన్ల మీట్స్ లో మాట్లాడాలని నా అవగాహన. అందుకని మీరడిగిన ప్రశ్నలకు సమధానం చెప్పే వేదిక ఇది కాదు.--Meena gayathri.s (చర్చ) 15:03, 14 నవంబర్ 2015 (UTC)

Endorsements

[మార్చు]
  1. Support ' - మీనాగాయత్రికి నా మద్దతు తెలుపుతున్నాను.--'ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 16:35, 11 నవంబర్ 2015 (UTC)

పవన్ సంతోష్ ఈ కార్యక్రమం సమయానికి సీఐఎస్ ఉద్యోగి కనుక అతని అభ్యర్ధన చెల్లదు. గమనించగలరు. సుజాత గారు ఈ కార్యక్రమం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, కాపీరైట్ సంబంధితం కాబట్టి తగువారిని సమర్ధించగలరు.రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే) (చర్చ) 11:34, 10 నవంబర్ 2015 (UTC)

Endorsements

[మార్చు]

Endorsements

[మార్చు]

Thanks for getting involved.. Based on your discussion and endorsement the following user has been selected: User:Ahmed Nisar . --Titodutta (చర్చ) 05:16, 28 నవంబర్ 2015 (UTC)

User:Ahmed Nisar Congratulations - శుభాకాంక్షలు JVRKPRASAD (చర్చ) 05:45, 28 నవంబర్ 2015 (UTC)

Community Wishlist Survey

[మార్చు]
Community Tech Team via MediaWiki message delivery (చర్చ) 21:58, 9 నవంబర్ 2015 (UTC)

Wikimania 2016 scholarships ambassadors needed

[మార్చు]

Hello! Wikimania 2016 scholarships will soon be open; by the end of the week we'll form the committee and we need your help, see Scholarship committee for details.

If you want to carefully review nearly a thousand applications in January, you might be a perfect committee member. Otherwise, you can volunteer as "ambassador": you will observe all the committee activities, ensure that people from your language or project manage to apply for a scholarship, translate scholarship applications written in your language to English and so on. Ambassadors are allowed to ask for a scholarship, unlike committee members.

Wikimania 2016 scholarships subteam 10:48, 10 నవంబర్ 2015 (UTC)

అర్జెంటుగా చెయ్యాల్సిన పని

[మార్చు]

ఎవరో అజ్ఞాత వాడుకరి ఏదో మూసలో తెలిసో తెలియకో ప్రముఖ నాదస్వర విద్వాంసుడు రాజారత్నం పిళ్ళై కూడా నాయీ బ్రాహ్మణుడే అనే వాక్యాన్ని చేర్చారు. దీనివల్ల కొన్ని వ్యాసాల్లో ఈ వాక్యం అన్నింటికంటే పైన కనిపిస్తోంది (ఉదాహరణకు ముకేష్ రిషి చూడండి). నేను ఎంత వెతికినా ఈ మార్పు ఎక్కడ ఎవరో చేశారో కనిపెట్ట లేకున్నాను. తెలిసిన వాళ్ళు సాధ్యమైనంత తొందరగా ఈ మార్పును చేయగలరు. --రవిచంద్ర (చర్చ) 23:57, 11 నవంబర్ 2015 (UTC)

వికీపీడియా ఏషియన్ నెల

[మార్చు]

వికీపీడియా ఏషియన్ నెల బహుభాషలలో నిర్వహిస్తున్న ఎడిటథాన్. ఆసియా దేశాల వివిధ సముదాయాల మధ్య అవగాహన పెంచడం కోసం ఇది నిర్వహించబడుతుంది. నవంబర్ 2015 నెలంతా జరుగుతుంది. ఆసియా ఖండంలోని వివిధ దేశాలు, ప్రదేశాల గురించి వ్రాయవచ్చు లేదా ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

ఆసియా వికీమీడియా సముదాయాల మధ్య గల స్నేహాన్ని గుర్తిస్తూ, ఆంగ్ల వికీలో కనీసం ఐదు వ్యాసాలను వ్రాసిన వారికి పాల్గొన్న ఇతర దేశ సముదాయాలనుండి ఒక ప్రత్యేక వికీపీడియా పోస్టుకార్డు పంపబడుతుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న దేశాలు - చైనా, భారతదేశం, ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పైన్స్, తైవాన్, మరియు థాయ్లాండ్.

అన్నిటికంటే ఎక్కువ నాణ్యమైన వ్యాసాలు వ్రాసిన వ్యక్తికి "వికీపీడియా ఏషియన్ అంబాసడర్" బిరుదు ఇవ్వబడుతుంది.

మరిన్ని వివరాలకు ఈ ప్రాజెక్టు పేజీ చూడగలరు.--రహ్మానుద్దీన్ (చర్చ) 12:36, 15 నవంబర్ 2015 (UTC)

అందులోని పాలుపంచుకుంటున్న వికీపీడియాల జాబితాలో తెలుగు వికీపీడియా ఇంతవరకూ చేర్చలేదు. మనం తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాస్తే పరిగణిస్తారా? ఇప్పుడు తెలుగు వికీపీడియాను పాలుపంచుకుంటున్న వికీల్లో చేర్పించవచ్చా? --పవన్ సంతోష్ (చర్చ) 12:56, 15 నవంబర్ 2015 (UTC)
సమన్వయం మెటాలో జరుగుతుంది. అక్కడి నుండి ఆంగ్ల/ఇతర వికీల్లో చేర్చుతారు. --రహ్మానుద్దీన్ (చర్చ) 13:36, 15 నవంబర్ 2015 (UTC)
రహ్మానుద్దీన్ గారు... మీరు పైన ఇచ్చిన లంకె పేజీలో ఆంగ్ల వికీలో కనీసం ఐదు వ్యాసాలను వ్రాసిన వారికి పాల్గొన్న ఇతర దేశ సముదాయాలనుండి ఒక ప్రత్యేక వికీపీడియా పోస్టుకార్డు పంపబడుతుంది అని ఉంది. వ్యాసాల రచన మరియు అభివృద్ధి ఆంగ్ల వికీపీడియాలో చేయాలా ? తెలుగు వికీపీడియాలో చేయాలా ?--Pranayraj1985 (చర్చ) 15:01, 15 నవంబర్ 2015 (UTC)
రహ్మానుద్దీన్ గారు... ఆంగ్ల వికీపీడియా లోని వ్యాసములను తెలుగులోకి అనువదించి వ్రాయవచ్చునా ? ఎక్కడా లేని కొత్త వ్యాసములు వ్రాయవలయునా ? ఎటువంటి వ్యాసములు వ్రాయవచ్చునో మరికొంత విపులముగా విశదీకరించ గలరు. కనీసం ఎటువంటి వర్గాలలోని వ్యాసములు కొత్తవి వ్రాయవచ్చునో తెలియజేయగలరు. నేను , హిందూమతము, రైల్వేలు, వంటలు, తెలుగు సంస్కృతి వంటి వ్యాసములు వ్రాసిన అందుకు అర్హత లభిస్తుందా ? దయచేసి తెలియజేయగలరు. JVRKPRASAD (చర్చ) 23:21, 15 నవంబర్ 2015 (UTC)
  • https://tools.wmflabs.org/wam/progress.php?username=JVRKPRASAD&wiki=te.wikipedia.org ఇక్కడ మీరు వ్రాసిన వ్యాసాలను పరిశీలించగలరు. నిబంధనలలో పేర్కొన్న విధంగా నిడివి, పొడవు సరి చూసుకుంటే చాలు. మీరు వ్రాసే హిందూమతము, రైల్వేలు, వంటలు, తెలుగు సంస్కృతి వంటి వ్యాసాలు సరిపోతాయి. అనువాదం అయినా సహజంగా ఉండాలే కానీ యాంత్రిక అనువాదం కాకూడదు అని నిబంధనలలో ఉంది. ధన్యవాదాలు. విజ్ఞప్తి : ఇక ఈ ప్రాజెక్ట్ చర్చలు సంబంధిత చర్చ పేజీలో చేయగలరు.--రహ్మానుద్దీన్ (చర్చ) 02:37, 16 నవంబర్ 2015 (UTC)

పోటీలో పాల్గొన్న సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ పోటీ ద్వారా ఏషియన్ అంబాసిడర్స్ ని ఎంపిక చేసి, వారిని ౨౦౧౮లో జరుగబోయే వ్వికీమేనియాకు వాలంటీర్లుగా పరిగణిస్తారు.

ఈ పోటీ ఫలితాలు వెల్లడించబడ్డాయి. దయచేసి గమనించగలరు. వికీపీడియా ఏషియన్ అంబాసిడర్ గా జేవీఆర్కె ప్రసాద్ గారి పేరును నేను సమర్ధిస్తున్నాను. ఇక కనీసం ఒక్క వ్యాసం అర్హత పొందిన వారికి కార్డులు అందేలా సిఫారసు చేస్తున్నాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 18:51, 12 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రహ్మానుద్దీన్ గారికి, ధన్యవాదములు. వాడుకరులందరికీ శుభాభివందనములు. JVRKPRASAD (చర్చ) 21:39, 12 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పోటీలో పాల్గొన్నవారికి పోస్టుకార్డు పంపుతామన్నారు. ఇంతవరకు పత్తా లేదు :-) --స్వరలాసిక (చర్చ) 16:19, 14 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ రోజు పోస్టుకార్డు అందింది. నిర్వాహకులకు ధన్యవాదాలు.--స్వరలాసిక (చర్చ) 13:27, 26 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Highlight or Discuss your community issues in CIS-A2K's policy handbook

[మార్చు]

Hello,
Currently at CIS-A2K, we are working on a handbook called "Indic Wikipedia Policies and Guidelines Handbook" where we are discussing a number of things such as: Creating new policies, Modifying existing ones; and to explain these we had to discuss Village Pump, Consensus etc. The book is in English, but we hope to translate and print the book in a few Indian languages.

Now,

a) We are eager to add your frequently asked questions on policies and guidelines, and discuss the difficulties you are facing to manage, enforce or deal with any policy on your Wikipedia.

For this reason, we are inviting you to ask questions or discuss things related to your Wikipedia's policies and guidelines.

Selected questions or discussions will be published in our handbook and askers/participants will be given credits in the book.

and/or

b) We are also inviting you to preview the handbook and give your feedback to improve it. You may read the handbook in Telugu also.

Please fill this form and let us know if you want to join this survey

Regards. --Titodutta (చర్చ) 09:14, 17 నవంబర్ 2015 (UTC)

వేధింపులపై సంప్రదింపులు (Harassment consultation)

[మార్చు]

Please help translate to your language

The Community Advocacy team the Wikimedia Foundation has opened a consultation on the topic of harassment on Meta. The consultation period is intended to run for one month from today, November 16, and end on December 17. Please share your thoughts there on harassment-related issues facing our communities and potential solutions. (Note: this consultation is not intended to evaluate specific cases of harassment, but rather to discuss the problem of harassment itself.)

Regards, Community Advocacy, Wikimedia Foundation

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/నవంబర్ 15, 2015 సమావేశంలో చర్చించిన అంశాలు

[మార్చు]

అందరికి నమస్కారం... నవంబర్ 15 (మూడవ ఆదివారం) నాడు హైదరాబాద్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో తెలుగు వికీపీడియా సమావేశం ఏర్పాటుచేయబడిన విషయం సభ్యులందరికి తెలిసిందే.. ఆ సమావేశంలో చర్చించిన అంశాలను సమావేశ నిర్వాహకులైన పవన్ సంతోష్, వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/నవంబర్ 15, 2015 సమావేశం పేజిలో రాయడం జరిగింది. చర్చించిన అంశాలకోసం ఇక్కడ చూడగలరు. ధన్యవాదాలు. ----Pranayraj1985 (చర్చ) 15:34, 22 నవంబర్ 2015 (UTC)

29 తేదీన తెలుగు వికీపీడియా ఐఆర్సీ

[మార్చు]

అందరికీ నమస్కారం,
నవంబరు 29, 2015-ఆదివారం రాత్రి తెలుగు వికీపీడియన్లకు ఐఆర్సీ(ఇంటర్నెట్ వెబ్ చాట్) నిర్వహించనున్నాము. సీఐఎస్-ఎ2కె కార్యప్రణాళికను అమలుచేయడంలో ప్రోగ్రాం అసోసియేట్ గా నా బాధ్యతలు, తెలుగు వికీ అభివృద్ధికి చేయదగ్గ కార్యకలాపాలపై తెలుగు వికీమీడియన్ల సూచనలు వంటి అంశాలు ఈ ఐఆర్సీలో ప్రధానాంశాలు.

  • తేదీ: నవంబరు 29, 2015
  • సమయం: రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకూ (సాయంత్రం మరేదైనా సమయాన్ని ప్రతిపాదించవచ్చు, కొద్దిరోజులపాటు ఏ ప్రతిపాదనలు లేకుంటే ఇదే సమయం ఖరారవుతుంది)
  • అంశం: సీఐఎస్-ఏ2కే వారి కొత్త ప్రోగ్రాం అసోసియేట్ కార్యప్రణాళికకు సంబంధించి నిర్వహించే విధులు, తదితర అంశాలపై సముదాయం సలహాలు, సూచనలు, వాటిపై చర్చ
  • లంకె: ఈ లంకెలో ఐఆర్సీ సమయానికి చేరవచ్చు.

సభ్యులు హాజరుకాగలరు. వివరాలకు, ముందస్తు నమోదుకు వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 16లో చూడగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 15:14, 23 నవంబర్ 2015 (UTC)

ఐఆర్సీ అనుకున్న సమయానికి తెలుగు వికీపీడియన్ల హాజరుతో జరిగింది. మిగిలిన వివరాలకు సంభాషణల చిట్టాను చూడవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 11:36, 1 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా వీడియోపాఠాలు

[మార్చు]

గత నెలల్లో తెలుగు వికీపీడియన్లు రాజశేఖర్, ప్రణయ్ రాజ్ తదితరులను సీఐఎస్ ఎ2కె ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్. యు.బి.పవనజ హైదరాబాదులో కలిసి వనరుల విషయంలో తెలుగు వికీపీడియన్లకు ఏం కావాలని అడిగారు. ఆ క్రమంలో తెవికీపీడియన్లు కోరినవాటిలో వీడియోపాఠాలను తెలుగులో తీయాలన్నది కూడా ఉంది. ఆపైన జరిగిన చర్చలో సీఐఎస్ ఎ2కె వారు హిందీ తదితర భాషల్లో తీసిన వికీపీడియా వీడియో ట్యుటోరియల్స్ గురించి తెలియజేసి ఆ పద్ధతిలోనే తెలుగు వికీపీడియాకు కూడా వీడియోపాఠాలు తయారుచేద్దామన్న ప్రతిపాదన తీసుకువచ్చారు. సమావేశమైన తెలుగు వికీపీడియన్లు అందుకు సంతోషించి అంగీకరించడమే కాక తర్వాత నిర్వహించిన పలు సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి చర్చించుకున్నారు, రచ్చబండలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తెలుగు వికీపీడియాకు ఉపకరించే వీడియో పాఠాలు తయారుచేయడం లక్ష్యంగా ప్రాజెక్టు పేజీ తయారవుతోంది. అలాగే ఆంగ్లంలోని స్క్రిప్టును తెలుగు అవసరాలకు అనుగుణంగా, తెలుగు ఉదాహరణలతో సహా అనువదించి, ఆపైన కావాల్సిన స్క్రీన్ షాట్లు తీసుకుని, పాఠాలు రూపకల్పన చేసే ఈ కార్యప్రణాళిక ప్రస్తుతం మొదటి దశలో ఉంది. ఇందులో పాల్గొనదలుచుకున్న వికీపీడియన్లు దయచేసి ఈ ప్రాజెక్టు పేజీని సందర్శించి, నమోదుచేసుకుని కృషిచేయాల్సిందిగా మనవి.--పవన్ సంతోష్ (చర్చ) 03:54, 25 నవంబర్ 2015 (UTC)

This is a message regarding the proposed 2015 Free Bassel banner. Translations are available.

Hi everyone,

This is to inform all Wikimedia contributors that a straw poll seeking your involvement has just been started on Meta-Wiki.

As some of your might be aware, a small group of Wikimedia volunteers have proposed a banner campaign informing Wikipedia readers about the urgent situation of our fellow Wikipedian, open source software developer and Creative Commons activist, Bassel Khartabil. An exemplary banner and an explanatory page have now been prepared, and translated into about half a dozen languages by volunteer translators.

We are seeking your involvement to decide if the global Wikimedia community approves starting a banner campaign asking Wikipedia readers to call on the Syrian government to release Bassel from prison. We understand that a campaign like this would be unprecedented in Wikipedia's history, which is why we're seeking the widest possible consensus among the community.

Given Bassel's urgent situation and the resulting tight schedule, we ask everyone to get involved with the poll and the discussion to the widest possible extent, and to promote it among your communities as soon as possible.

(Apologies for writing in English; please kindly translate this message into your own language.)

Thank you for your participation!

Posted by the MediaWiki message delivery 21:47, 25 November 2015 (UTC) • TranslateGet help

సీఐఎస్ - ఎ2కె తెలుగు వికీపీడియా కార్యప్రణాళిక 2015-16కు సంబంధించిన అభివృద్ధి, జూలై - నవంబరు 2015 నివేదిక

[మార్చు]

సీఐఎస్ - ఎ2కె ఉద్యోగిగా బాధ్యతలు స్వీకరించాను. ప్రస్తుత సంవత్సరానికి పనిచేయాల్సిన ప్రణాళికను పి.వో. సహకారంతో పరిశీలించాను. పరిశీలనలో తేలిన అంశాలు, జరిగిన ప్రగతి ఇక్కడ పెడుతున్నాను. దీనిపై వ్యాఖ్యానించగలరు. అలాగే కార్యప్రణాళికపై ఎలా పనిచేయవచ్చు, ఏం పనిచేయవచ్చో కూడా చర్చించవచ్చు. సముదాయ సభ్యులు గమనించగలరు.

ప్రణాళిక శీర్షిక చేయాలని అంచనా వేసిన కార్యకలాపాలు అంచనా ఫలితాలు జరిగిన కృషి ఫలితం
సంస్థాగత భాగస్వామ్యాలు (విశ్వవిద్యాలయాలూ, కళాశాలలతో) ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఆంధ్ర లయోలా కళాశాల విద్యార్థులతో బోటనీ వ్యాసాలపై కృషి జరిగింది 100 బోటనీ వ్యాసాలు
పట్టణాలూ, నగరాలలో వికీపీడియా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి
  • విజయవాడ, గుంటూరుల్లో ఒక్కో కార్యక్రమం జరిగింది
  • అవనిగడ్డలో ప్రణాళిక వేసుకున్న కార్యక్రమం ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆగింది. భవిష్యత్తులో జరుగుతుందని ఆశిస్తున్నాం.
ప్రత్యేకించిన ఫలితాలు ఇప్పటివరకూ లేవు
వాడుకరి అభిరుచి జట్టులు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి జరగలేదు ఫలితాలు లేవు
వాడుకరులకు శిక్షణ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి జరగలేదు ఫలితాలు లేవు
కాపీరైట్ సీసీ లైసెన్సుల మీద శిక్షణ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి రమ్య కాపీరైట్ మేన్యువల్ గురించి సముదాయ సభ్యుల వద్ద సూచనలు తీసుకున్నారు, తదుపరి కార్యకలాపాలు జరుగుతున్నాయి. పని అభివృద్ధిలో ఉంది, ఫలితాలు భవిష్యత్తులో వెలువడుతాయి.
తెవికీ సముదాయ సమావేశాలు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి నెలవారీ సమావేశాలకు కోరిన సహకారం అందిస్తున్నారు. గుంటూరు, విజయవాడల్లో ఎడిట్-అ-థాన్లు జరిగాయి. సముదాయం సమావేశాల్లో సముదాయ నిర్మాణ కృషి చేస్తోంది
తెవికీ పుష్కరోత్సవం ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మెయిల్ లో సముదాయ సభ్యులుగా గతంలో కార్యక్రమం పట్ల ఉత్సాహం చూపిన పవన్ సంతోష్ తదితరులతో అర్జున, వైజాసత్య గార్లతో ‘‘తెవికీ పుష్కరోత్సవం’’ వల్ల సముదాయానికి ప్రయోజనం ఏమిటో చెప్పి ముందుకు వెళ్ళాలని సూచించారు. సముదాయ సభ్యునిగా ఉన్నప్పుడు పవన్ సంతోష్ ఈ అంశాన్ని హైదరాబాద్ నెలవారీ సమావేశంలో చర్చించగా భాస్కరనాయుడు గారు, కశ్యప్ గారు తదితరులు దాని ప్రయోజనం ఉందని నిర్వహించాలని భావించారు. ఇదంతా నెలవారీ సమావేశం నివేదికలో నివేదించబడింది. ఈ ఆన్-వికీలో చర్చ జరిగాకా సముదాయం ఏకాభిప్రాయాన్ని బట్టి ఇది నిర్ణయింపబడుతుంది. సముదాయ నిర్ణయాన్ని అనుసరించి దీనిపై కృషి ప్రారంభమవుతుంది.
తెలుగు కథా రచయితల ప్రాజెక్టు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సముదాయ సభ్యులకు సీఐఎస్ - ఎ2కె ప్రతినిధి గతంలో అవసరమైన సోర్సు అందజేశారు. కృషి ప్రారంభం కావాల్సివుంది. సీఐఎస్ ఎ2కె సోర్సు అందజేసింది, కృషి ప్రారంభమైతే సహకారం అందిస్తుంది.
లంబాడీ-బంజారా ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ప్రాజెక్టు నడిపిస్తానన్న సముదాయ సభ్యుడు మల్లేశ్వర నాయక్ గారు ముందుకు రాలేదు. ప్రాజెక్టును స్వీకరిస్తానన్న సముదాయ సభ్యుడు స్పందించలేదు. స్పందిస్తే సీఐఎస్ ఎ2కె సహకారం అందిస్తుంది.
ముఘల్ చక్రవర్తుల ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ప్రాజెక్టును నడిపించిన టి.సుజాత గారికి సీఐఎస్ ఎ2కె అవసరమైన సహకారం అందించింది. సముదాయ సభ్యురాలు ముందు ఆశించిన 12 పేజీల్లో పది పూర్తయ్యాయి.
కంప్యూటర్ హార్డువేర్ ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సంబంధిత సముదాయ సభ్యుడు ముందుకు రాలేదు. ప్రాజెక్టు సాగలేదు. సముదాయ సభ్యుడు ముందుకురాకపోవడంతో ప్రాజెక్టు సాగలేదు. స్పందించి కృషి సాగించదలిస్తే సీఐఎస్ ఎ2కె సహకరిస్తుంది.
తెలుగు పండుగల ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సంబంధిత సముదాయ సభ్యుడు ముందుకు రాలేదు. ప్రాజెక్టు సాగలేదు. సముదాయ సభ్యుడు ముందుకురాకపోవడంతో ప్రాజెక్టు సాగలేదు. స్పందించి కృషి సాగించదలిస్తే సీఐఎస్ ఎ2కె సహకరిస్తుంది.
తెలుగు సినిమా ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సముదాయ సభ్యునిగా గతంలో పవన్ సంతోష్, సముదాయ సభ్యులు రాజశేఖర్, సుల్తాన్ ఖాదర్ గార్లు ప్రణాళిక రూపొందించుకుని కృషిచేస్తున్నారు. అది అలావుండగా సీఐఎస్ ఎ2కె వారు వీరిలో కొందరికీ, ఇతర వికీపీడియన్లకు తమవద్ద ఉన్న మూలాలు పంచుకున్నారు. ప్రాజెక్టు సాగుతోంది. సముదాయ సభ్యులకు మూలాలు అందజేశాము. అవసరం మేరకు వారు వినియోగించుకుంటారు.
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సరిపడ మూలాలను వికీసోర్సులో చేర్చి దాన్ని సముదాయ సభ్యులు వినియోగించుకునేందుకు సీఐఎస్ ఎ2కె అందించింది. సముదాయ సభ్యులు భాస్కరనాయుడు గారు వినియోగించుకుని కృషిచేస్తున్నారు. ప్రాజెక్టు సాగుతోంది. సముదాయ సభ్యులకు సీఐఎస్ ఎ2కె సహకారం అందిస్తోంది.
సాహిత్యం వేదిక ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సముదాయ సభ్యుడు వ్యతిరేకించివుండడంతో ఇది చేయట్లేదు. ఫలితాలు లేవు
తెలుగు వికీపీడియా గ్రామాల ప్రాజెక్టు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి గణాంకాల విషయంలో సముదాయ సభ్యులకు మూలాలు అందించి సీఐఎస్ ఎ2కె సహకరిస్తోంది. గ్రామ వ్యాసాలకు ఉపకరించే విషయంపై ఇప్పటికే ఆర్టీఐ వేశాం, ఫలితాలు అందగానే పంచుకోనున్నాం. గ్రామ వ్యాసాల విషయంలో జరుగుతున్న ఖాళీ శీర్షికల చేర్పు అంశంలో సీఐఎస్ ఎ2కె నుంచి ఏ ప్రమేయం లేదు. గ్రామ వ్యాసాల అభివృద్ధికి ప్రాజెక్టు ఉఫకరిస్తోంది.
నెలవారీ మొలకల జాబితా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి నెలవారీ మొలకల జాబితా ప్రతినెలా తయారవుతోంది. కొన్నిమార్లు సీఐఎస్ ఎ2కె ప్రతినిధి రచ్చబండలో ప్రకటించారు. నాణ్యత పెంపొందించేందుకు ఉపకరిస్తున్నాయి
వికీడేటా అవగాహన సదస్సులు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సముదాయ వ్యతిరేకత వల్ల జరగలేదు ఫలితాలు లేవు
పాలిసీ స్థాయి పనులు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సీఐఎస్ - ఎ2కె ప్రతినిధి టిటో దత్తా ఈ అంశంపై పనిచేస్తున్నారు. పాలసీ కరపుస్తకాలు తయారుచేసేందుకు తెలుగు వికీపీడియన్ల సూచనలు, అవసరాలు వంటివి పరిగణలోకి తీసుకుంటున్నారు. అంశం ప్రగతిలో ఉంది, ఫలితాలు అందుబాటులోకి వస్తుంది.

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్ - ఎ2కె) (చర్చ) 09:52, 29 నవంబర్ 2015 (UTC)

లక్ష్యాలు

[మార్చు]

ఇవి పై కార్యప్రణాళికను, లేదా సముదాయం సూచించే ఇతర కార్యప్రణాళికను అమలుచేయడం ద్వారా లభించాలని సీఐఎస్ ఎ2కె తనకు నిర్దేశించుకున్న లక్ష్యాల పట్టిక.

పారామీటర్లు (సంఖ్యాపరంగా) ఫిబ్రవరి 28, 2015 నాటికి ఉన్నవి జూన్ 30, 2016 నాటికి లక్ష్యం జూన్ 30, 2016 నాటికి స్వప్నం ఇప్పటికి సాధించినది వ్యాఖ్య
వాడుకరుల సంఖ్య 854 1100 1200 911 (అక్టోబర్ 2015 నాటికి) లక్ష్యం సాధించాల్సివుంది
క్రియాశీల వాడుకరుల సంఖ్య 70 100 120 46 (అక్టోబర్'15 నాటికి) లక్ష్యం సాధించాల్సివుంది
వ్యాసాల సంఖ్య 61,406 65,000 68,000 63,000 (అక్టోబర్'15 నాటికి) లక్ష్యం సాధించాల్సివుంది
2kb కన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్న వ్యాసాల శాతం 40% 50% 55%
సంస్థాగత భాగస్వామ్యాల సంఖ్య 4 3 7 - లక్ష్యం సాధించాల్సివుంది
కొత్తవాడుకరుల సంఖ్య 190 (క్రితం సంవత్సరంలో) 220 370 95 (జనవరి-అక్టోబర్) లక్ష్యం సాధించాల్సివుంది
అవుట్ రీచ్ కార్యక్రమాల సంఖ్య 15 15 20 3 లక్ష్యం సాధించాల్సివుంది

ఈ అంశాలపై ఫలప్రదమైన చర్చకు సముదాయాన్ని మరోమారు ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:20, 1 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Community Wishlist Survey

[మార్చు]

MediaWiki message delivery (చర్చ) 14:38, 1 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చరిత్రలో ఈ రోజు , డిసెంబర్ 2

[మార్చు]

పై శీర్షికలో బి.నాగిరెడ్డి బొమ్మ చిత్రంలో అని ఉన్నది కాని కనిపించడం లేదు. ఎందువల్ల?--కంపశాస్త్రి 05:27, 2 డిసెంబరు 2015 (UTC)

కనిపిస్తున్నది. చూడండి.--Viswanadh (చర్చ) 07:11, 2 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2015

[మార్చు]

ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ యేడు కూడా హైదరాబాద్ బుక్ ఫెయిర్ డిసెంబర్ 18 నుండి డిసెంబర్ 27 వరకు ఎన్.టి.ఆర్. స్టేడియంలో జరుగుతోంది. గత ఏడాదిలాగే ఈసారి కూడా వికీపీడియా e-తెలుగు సంస్థతో కలిసి స్టాల్ నిర్వహించే ఉద్దేశం ఉందా? ఉంటే ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? గత ఏడాది బుక్ ఫెయిర్ వల్ల తెవికీకి ఏమైనా ఉపయోగం కలిగిందా? కార్యకర్తల కొదవ లేకుంటే ఈ ఏడాది కూడా బుక్ ఫెయిర్‌లో ఒక స్టాల్ నిర్వహించగలరు --స్వరలాసిక (చర్చ) 01:08, 3 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

e-తెలుగు ప్రతినిధితో ఈ అంశం మాట్లాడగా e-తెలుగు తరఫున స్టాల్ నిర్వహించగలమో లేదో చెప్పలేమని, నిర్వహించినా వారి సంస్థ ప్రాధాన్యతల్లో ఈసారి గూగుల్ ఓసీఆర్ వాడకాన్ని, వాడే పద్ధతిని ప్రచారం చేయడం ముందు ఉందని చెప్పారు. దాంతో స్టాల్ అంటూ నిర్వహించాలంటే తెవికీపీడియన్లే నిర్వహించాల్సి రావచ్చు. ఈ విషయంలో సీఐఎస్ ఎ2కె నుంచి సహకారం కోరుతున్నట్టైతే స్టాల్ నిర్వహించదలిచిన తెవికీపీడియన్లలో ఒకరు ముందుగా ఇక్కడ చర్చించి, ఆపైన ఈ పేజీలో అవసరమైన సహాయాన్ని కోరవచ్చు.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:55, 3 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
2015 హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో e తెలుగు - తెలుగు వికిపీడియా స్టాలుని CIS వారి సహకారంతో చేశాము అందులో ఎక్కువ సమయం వికీ మీద చర్చ ,ప్రదర్సన చేయటం వలన e తెలుగు ప్రతి ఏటా ఇచ్చే స్వేచ్చా ఉపకరణాలు , కంప్యూటర్లలో తెలుగు టైపింగ్ సమస్యలు, ఇంటర్నెట్ లేనపుడు తెలుగు టైపింగ్, ఆండ్రయిడ్ ఫోన్‌లలో తెలుగు టైపింగ్ , బ్లాగులు రాయటం , తెలుగు లో దైనందిక సాంకేతిక అవసరాలు నిర్వహించు కోవటం వంటి ఇతర లక్ష్యాలు అందరికీ చేర్చ లేక పోయాము కాబట్టి ఉన్న మానవ,ఆర్ధిక వనరులతో ఈ సారికి "వికిపీడియా " ఒక ప్రత్యేక స్టాలుని నిర్వహిస్తే తెలుగు తో పాటు అక్కడికి గణనీయ సంఖ్యలో వచ్చే ఇతర భాషా అభిమానులకు వికిపీడియా గురించి వివరించ వచ్చు దానికి నానుంచి ఎటువంటి సహకారము కావలెను అన్నా వాలంటీరుగా అందచేయగలవాడను , CIS లో నాతరుపున అబ్యర్ధన పెట్టటం తప్ప :) --కశ్యప్ (చర్చ) 12:01, 3 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
గత అనుభవం దృష్ట్యా ఎవరైనా ఒక వికీపీడియన్ లేదా ఇద్దరు ప్రత్యేకంగా ప్రదర్శన జరిగినన్ని రోజులూ దీని భాద్యతలు తీసుకోవాలి. ఉండటానికి కేలం వాలంటీర్లానే కాక వారి భోజన, పలహార, రవాణా చార్జీలు ఇచ్చే విధంగా ఆలోచించాలి. అలా అయితే ఎవరైనా ముందుకు రావచ్చు. అంతే కాక మునుపు ఉన్న బ్యానర్స్, పాంప్లెట్స్ వంటివి కూడా పనికివచ్చే పక్షంలో ఖర్చుకూడా తగ్గవచ్చు --Viswanadh (చర్చ) 05:00, 4 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సీఐఎస్ ప్రణాళికలోంచి అంశాలు తొలగించేందుకు ఐఆర్సీ

[మార్చు]

సీఐఎస్ ఎ2కె 2015-16కు వేసిన ప్రణాళికలోని పలు అంశాల వివరాలు, వాటి పురోగతి ఇంతకుముందే రాశాను. ఐతే వీటిలో సముదాయ సభ్యులకు అనవసరం అనిపించిన అంశాలు తొలగించే అంశంపై డిసెంబర్ 6, 2015 (ఆదివారం) రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకూ ఐఆర్సీ నిర్వహించే ఆలోచనలో ఉన్నాము. అలానే సముదాయ సభ్యులు వీటిలో ప్రయోజనకరమని భావించినవీ, లేదూ పూర్తిగా కొత్తవీ కూడా ప్రతిపాదించవచ్చు. అలానే ఏయే అంశాలు ముందుగా చేయవచ్చో, ఏవి తర్వాత చేయవచ్చో ఓ ప్రాధాన్యత క్రమాన్ని కూడా నిర్ణయించుకోవచ్చు. ఐతే ప్రతీవారం ఇలా ఐఆర్సీ వుండదని, ఇది కేవలం అత్యవసర స్థితి వల్ల ఏర్పాటుచేసినదనీ గుర్తించగలరు. ఇకపై అర్జునరావు గారు, రాజశేఖర్ గారు ప్రతిపాదించినట్టు ప్రతి నెల ఐఆర్సీ నిర్వహించుకుంటే బావుంటుందని అనుకుంటున్నాను. ఆ ప్రకారమే ఉంటుంది. ఈ ఐఆర్సీకి హాజరయ్యే సభ్యులు ఇక్కడ ముందస్తు నమోదు చేసుకుని, కార్యక్రమాన్ని సమర్థించే పక్షంలో నిర్వహిస్తాం.--పవన్ సంతోష్ (సీఐఎస్ ఎ2కె) (చర్చ) 03:03, 4 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

క్షమించాలి. రాజశేఖర్ గారితో మాట్లాడాకా, మరికొన్ని సంప్రదింపుల తర్వాతా ముందుగా నావద్ద ఏం చేయగలం, ఏం చేయలేమన్న అంశంపై స్పష్టమైన కార్యప్రణాళిక సిద్ధంగా ఉన్నాకే ఐఆర్సీ నిర్వహిస్తే బావుంటుందని తెలియవస్తోంది. దాని కోసం తెవికీతో పనిచేయడానికి ముందుకువస్తున్న తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు, విశ్వవిద్యాలయాల ముఖ్యులు, రచయితలు, సంపాదకులు, ఇతరులతో సంప్రదింపులు జరపడానికి కనీసం 10 రోజులైనా అవసరం అవుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని ఆపై వచ్చే ఆదివారం, అంటే డిసెంబర్ 13, 2015న నిర్వహిస్తే సముదాయ సభ్యులు వెచ్చించే సమయానికి ఉపయోగం కనిపిస్తుందని భావిస్తూ వాయిదా వేయడానికి అనుమతి అడుగుతున్నాను. ముందస్తు నమోదు చేసుకున్న కశ్యప్ గారు, రాజశేఖర్ గారూ క్షమించాలి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:12, 4 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ముందస్తు నమోదు

[మార్చు]
  1. --పవన్ సంతోష్ (సీఐఎస్ ఎ2కె) (చర్చ) 03:03, 4 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --కశ్యప్ (చర్చ) 05:05, 4 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --Rajasekhar1961 (చర్చ) 05:47, 4 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాల్లో ఖాళీ విభాగాలు

[మార్చు]

గ్రామ వ్యాసాల్లో ఖాళీ విభాగాలు చేర్చడంలో సీఐఎస్-ఎ2కె ఉత్ప్రేరకంగా ఉందని గతంలో సముదాయ సభ్యులు పలుమార్లు రాసిన విషయం తెలిసిందే. అయితే ఇది సీఐఎస్-ఎ2కె ప్రోత్సాహంతో కానీ, సూచనలతో కానీ చేసినది కాదని గత లాంగ్వేజ్ యాంకర్ రహ్మానుద్దీన్ స్పష్టం చేశారు. ప్రవీణ్.జి.రావు సీఐఎస్-ఎ2కె ఇంటర్న్ గా పనిచేసి ఆ పనిచేసిన కాలం ముగిశాకా, సముదాయ సభ్యునిగా స్వంత ఆసక్తితో గ్రామాల వ్యాసాల్లో ఖాళీ విభాగాలు చేర్చడం ప్రారంభించారని, దానిని అందిపుచ్చుకున్న మరికొందరు ఆ బాటలో నడిచారని ఆయన వివరించారు.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 13:50, 4 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చరిత్రలో ఈరోజు డిసెంబర్ 4

[మార్చు]

చిత్రంలో ఘంటసాల అని ఉండాలి, ఘంటశాల అని కాదు.--కంపశాస్త్రి 23:04, 4 డిసెంబరు 2015 (UTC)

అమ్మనుడి (పూర్వపు నడుస్తున్న చరిత్ర) సీసీబై ఎస్ఎ లైసెన్సుల్లో విడుదల

[మార్చు]

అమ్మనుడి (పూర్వపు నడుస్తున్న చరిత్ర) భాషాపరమైన అంశాలతో కూడిన పత్రిక. ఇది సమకాలీన భాషోద్యమాలతో ముడిపడినది. 1993లో నడుస్తున్న చరిత్ర సామాజిక, రాజకీయ, ఆర్థిక పత్రికగా ప్రారంభమైనా 2000 నాటికి భాషోద్యమ పత్రికగా మారింది. ఈ నడుస్తున్న చరిత్ర పత్రిక పేరు ప్రస్తుతం అమ్మనుడిగా మారింది.

20 సంవత్సరాల పాటు సాగిన మొదటి పత్రిక సంచికలూ, ప్రస్తుత పత్రిక సంచికలూ కూడా సీసీల్లో రీలైసెన్స్ చేయడం ద్వారా వికీపీడియా, వికీసోర్సులకు డొనేట్ చేశారు. వీటిని ఎలా వినియోగించుకోవచ్చన్న అంశంపై వికీపీడియన్లు చర్చించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:19, 7 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

టి-హబ్ వారితో కలసి పనిచేసే ప్రతిపాదనలు

[మార్చు]

భారతదేశంలోకెల్లా అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ (ప్రారంభస్థాయి సంస్థలను అభివృద్ధి చేసే సంస్థ)గా టి-హబ్ హైదరాబాద్ లో ఏర్పడింది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ లోని 3 విద్యాసంస్థలు (ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ఐ.ఎస్.బి., నల్సార్), కొన్ని ప్రైవేటు రంగ సంస్థలు కలసి ఏర్పరిచిన ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం. ఈ సంస్థ ప్రతినిధి ఇటీవల బెంగళూరులో సీఐఎస్-ఎ2కె కార్యాలయంలో సీఐఎస్ ప్రతినిధులను కలసి తెలుగు వికీపీడియా, సీఐఎస్-ఎ2కెలతో పనిచేసేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు. ఆ క్రమంలో వచ్చిన ప్రతిపాదనల్లో సముదాయానికి సంబంధించినవి:

  1. జనవరి 26 తేదీన హైదరాబాద్ లో తెలుగు వికీపీడియాకు సాంకేతికంగా అవసరమయ్యే బాట్లు, యాప్ లు వంటివి రూపొందించడంపై హ్యాకథాన్ మరియు పోటీ నిర్వహించడం. ఎటువంటి యాప్ లేదా బాట్ తెవికీకి ఉపకరిస్తుందన్న విషయాన్ని కూడా సముదాయమే నిర్ణయించవచ్చు.
  2. తెలుగు వికీపీడియన్లు హైదరాబాద్ సమావేశం నిర్వహించుకునేందుకు ప్రస్తుతం ఉపయోగించుకుంటున్న వేదికతో పాటుగా అదనపు వేదికగా గచ్చిబౌలి ప్రాంతంలోని టి-హబ్ లోని సమావేశ మందిరాన్ని వినియోగించుకోవచ్చు. మరొక వేదికను కూడా కలిపి మూడు వేదికలు నెలవారీగా మారుతూంటే సమావేశం ఆసక్తికరంగా ఉండొచ్చని మరో ప్రతిపాదన.

అయితే సమావేశంలోనే తెవికీపీడియన్లు ఈ భాగస్వామ్యాన్ని, కార్యక్రమాలను ఇష్టపడితేనే ముందుకువెళ్తుందని చెప్పాం. ప్రస్తుతం తెవికీ సముదాయం ఈ అంశంపై చర్చించి త్వరితంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:32, 7 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికి సాంకేతికాల పైన బాట్లు, యాప్ వంటివి వాటిమీద హ్యాకథాన్ బాగానే వున్నది , కానీ తివికీ మీద సరిఅయిన అవగాహన లేకుండా బాట్లు ఆడించంటం ప్రమాదకరం టి-హబ్ లోని సమావేశ మందిరం బాగుంటుంది కానీ చాలా తెలుగు వికీపీడియన్ల కు దూరం , నాకు దగ్గర :) , నగరానికి నడిబొడ్డున ప్రతినెలా క్రమం తప్పక సమావేశాలు నిర్వహిస్తుంటేనే జనాలు రావటం లేదు , ఇక మనం వేదికలు ఊరికి చివరలొ వుంటే "అందరూ" వస్తారు అని నేనుఅనుకోను , కాకపొతే హ్యాకథాన్ ఇతర సాంకేతిక సమావేశాలకు టి-హబ్ అనువైన ప్రదేశం . --కశ్యప్ (చర్చ) 13:57, 8 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]


కశ్యప్ గారు చెప్పినట్టు నెలవారి సమావేశాలు కాకుండా ఇతర కార్యక్రమాలను టి-హబ్ లో నిర్వహించడం బాగుంటుంది. ఒకరోజు తెలుగు వికీపీడియా విషయమై కొణతం దిలీప్ (తెలంగాణ ఐ.టి. డైరెక్టర్) గారిని సెక్రటేరియట్ లో కలవడం జరిగింది. "తెలుగు వికీపీడియాలో తెలంగాణ వ్యాసాలు గాని తెలుగు వికీపీడియన్లు గాని ఎక్కువగా లేరు. కనుక కొంతమంది సభ్యులతో ఒక సమూహాన్ని ఏర్పాటుచేసి, తెలంగాణకు సంబంధించిన వ్యాసాలను తయారుచేద్దాము. దానికి తెలుగు వికీపీడియా నుండి ఎలాంటి సహకారం ఉంటుంది" అని అడిగారు. "ఈ విషయమై సమదాయంలో చర్చిస్తాను" అని చెప్పాను. తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే తెవికీకి మంచి వేదిక దొరుకుతుందని నా అభిప్రాయం.--Pranayraj1985 (చర్చ) 08:53, 9 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్ గారూ కొణతం దిలీప్ గారిని తప్పకుండా కలుద్దాం. మీతో నేను వ్యక్తిగతంగా చెప్పినట్టుగా మనం ఇద్దరం, వీలుంటే మరో వికీపీడియన్ కలసి ఆయనను కలసి తెవికీ ప్రగతి గురించి చర్చిద్దాం. ఇది చాలా మంచి అవకాశం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 02:48, 11 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

[మార్చు]

అందరికి నమస్కారం... డిసెంబర్ 10 తెలుగు వికీపీడియా ఆవిర్భావ దినోత్సవం రోజున వికీపీడియాకు సంబంధించి ఏదైన ఒక కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని పలువురు సభ్యులు కోరడం జరిగింది. అయితే డిసెంబర్ 10 సెలవు రోజు కాకపోవడంతో ఎక్కువమంది పాల్గొనడానికి అవకాశం ఉండదనే ఉద్ధేశ్యంతో, డిసెంబర్ రెండవ శనివారం లేదా రెండవ ఆదివారం కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచనలో కొంతమంది సభ్యులు ఉన్నారు. కనుక సభ్యులు తమ అభిప్రాయాలను మరియు ఎలాంటి కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందో తదితర వివరాలను తెలుపగలరు...--Pranayraj1985 (చర్చ) 08:17, 9 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఎలాగో 20న హైదరాబాదు లో మీత్ ఉంది కనుక ఆ రోజే ఈ కార్యక్రమము కుడా జరుపుకోచు అని నా అభిప్రాయం. - శ్రీకర్ కాశ్యప్ 07:07, 10 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్ రాజ్ గారు ప్రతిపాదించినది చాలా బావుంది. ఈ ఆదివారం డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర మ్యూజియంలో హైదరాబాదుకు చెందిన తెవికీపీడియన్లు ఫోటో హంట్ (ఫోటోలు తీసి కామన్స్ లోకి ఎక్కించే కార్యక్రమం) నిర్వహిస్తే బావుంటుంది. 20న మీటప్ ఐతే ఉంది కానీ ఆ రోజు ముఖ్యమైన అంశాలు చర్చకు వస్తాయి, పైగా ఆంగ్ల, తెలుగు వికీపీడియన్ల మీటప్ జరుగుతోంది. ఇన్నిటిమధ్య ఫోటో హంట్ అవుతుందా అన్నది ఆలోచించి చూడండి. ఈ ఆదివారం మ్యూజియం ఉంటుంది, పైగా కెమెరాలను కూడా అనుమతిస్తారు. ప్రస్తుతం మనకున్న పరిచయాలతో పత్రికా మాధ్యమాల్లో కార్యక్రమానికి చక్కని కవరేజి కూడా ఇప్పించవచ్చు. సముదాయ సభ్యులు చర్చించి త్వరగా ఈ అంశాన్ని ఓ కొలిక్కి తీసుకువస్తే ముందుకువెళ్ళవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:34, 10 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మీరన్నది నిజమే. ఆ రోజు అంత సమయం ఉండకపోవచ్చు. ఈ ఆదివారమే పెట్టుకోవడం మంచిది. శ్రీకర్ కాశ్యప్ 11:31, 10 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఐడియా బాగుంది. ఎక్కడో ఒక దగ్గర కూర్చొని, చర్చించడం కన్నా ఏదైనా ఇలాంటి ఉపయోగకరమైన పనిచేపడితే బాగుంటుంది. ఫొటో హంట్ మంచి ఆలోచన. కార్యక్రమం అనంతరం ఆ ఫోటోలను కామన్స్ లోనికి అప్లోడ్ చేయడం కూడా ఆదివారం పూర్తిచేస్తే ఇంకా బాగుంటుంది. పబ్లిక్ గార్డెన్ లోనూ బయట కొన్ని విగ్రహాలు, చారిత్రాత్మక నిర్మాణాలు కూడా ఉన్నాయి. వాటి చిత్రపటాలను కూడా ఫోటో హంట్ లో బాగంగా తీసుకుంటే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 12:50, 10 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఇలాంటి ఆలోచనతో వచ్చిన ప్రణయ్ కు అభినందనలు, మంచి ప్రయత్నం దీనిని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్న శ్రీకర్ గారికి, పవన్ సంతోష్ గార్లకు కూడా అభినందనలు తెపుతున్నాను.. సరియైన ప్రణాళికతో కార్యక్రమం విజయవంతం చేయగలరు..--Viswanadh (చర్చ) 08:03, 11 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
శ్రీకర్ గారికి, Rajasekhar1961 గారికి మరియు Viswanadh గారికి ధన్యవాదాలు... పైన తెలిపిన విధంగా డిసెంబర్ రెండవ ఆదివారం (13.12.2015) నాడు హైదరాబాదుకు చెందిన తెవికీపీడియన్లతో.. డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్ర మ్యూజియంలో మరియు పబ్లిక్ గార్డెన్ లోపల బయట ఉన్న విగ్రహాల, చారిత్రాత్మక నిర్మాణాల ఫోటో హంట్ (ఫోటోలు తీసి కామన్స్ లోకి ఎక్కించే) కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇతర ప్రాంతాలలో ఉన్న తెలుగు వికీపీడియన్లు కూడా ఇందులో పాల్గొని.. మీమీ ప్రాంతంలో ఉన్న చారిత్రిక ఛాయాచిత్రాలను కామన్స్ లోకి ఎక్కించగలరు. కార్యక్రమ పేజీ కొరకు ఇక్కడ చూడగలరు. --Pranayraj1985 (చర్చ) 09:04, 11 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ పుష్కరోత్సవంపై చర్చ

[మార్చు]

తెవికీ పుష్కరోత్సవం జరపాలన్న అంశంపై ముందుగా మెయిల్స్ లో విశ్వనాధ్ గారు ప్రతిపాదించగా మరికొందరు వికీపీడియన్ల మధ్య ప్రారంభమై సీరియస్ చర్చ సాగింది. ఆ చర్చలో భాగంగా అర్జున గారు గత మూడు మహోత్సవాల ఫలితాలను బట్టి చూస్తే వికేంద్రీకరణగా చిన్న ఉత్సవాలను ఓపికున్నవారితో చేయించడం మంచిందేమోనని భావించారు. ఆపైన వైజాసత్య గారు ఎలా చేయాలన్న ప్రశ్నకన్నా ముందు మౌలికంగా ఎందుకు చేయాలన్న ప్రశ్న వేసుకోవాలని పేర్కొన్నారు. ఆ ప్రశ్న కేవలం విశ్వనాధ్ గారికే కాదని మన సముదాయం మొత్తానికి సంధించుకుంటున్న ప్రశ్న అని తెలిపారు. యధాలాపంగా మరో సంవత్సరం వస్తోందని మరో ఉత్సవం జరుపుకోవాలంటే మన చిన్న వికీలోని అత్యంత క్రియాశీలక సభ్యులంతా ఆ విషయంపై సమయాన్ని, శక్తిని మళ్ళించాల్సివస్తోందని, కనుక దానికి ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న వేసుకోవాల్సివస్తోందని తెలిపారు. సముదాయాన్ని బలోపేతం చేయడానికా అంటే వ్యతిరిక్త ఫలితాలే వస్తున్నాయని, సమావేశాల వల్ల కొత్త వాడుకరులు ఉత్తేజితమౌతున్నారా అంటే గత సమావేశానికి కొత్తగా హాజరైన వాళ్ళలో ఇప్పుడు ఎంతమంది క్రియాశీలకంగా దిద్దుబాట్లు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అయితే దయచేసి దీన్ని నిరుత్సాహకంగా పరిగణించవచ్చు. కేవలం ఆలోచింపజేసేందుకే. సముదాయంగా ఈ సమావేశాల జరపాలని సహేతుకంగా నిర్ణయిస్తే, నా వంతు తోడ్పాడుకు నేను సిద్ధం అని ముగించారు.
దీనికి కొనసాగింపుగా పవన్ సంతోష్ ఈ అంశాన్ని సముదాయ సభ్యునిగా నెలవారీ సమావేశంలో చర్చించారు. అక్కడ భాస్కరనాయుడు గారు, కశ్యప్ గారు, తదితరులు పుష్కరోత్సవం అవసరమేనని, సమావేశం సమావేశం కొరకే అవసరమని ప్రతిపాదించారు. అంటే సమావేశం జరగడం ద్వారా పత్రికా మాధ్యమాల్లో తెవికీకి ప్రాచుర్యం తీసుకురావచ్చన్నారు. నేను దాన్ని విస్తరించి పత్రికా మాధ్యమాల్లో అత్యంత విస్తృతమైన ప్రాచుర్యం తీసుకురావడమే థీమ్ గా చేద్దామంటున్నారా అని అడిగితే అవునన్నారు. గత రెండు సమావేశాల విషయంలో పత్రికా మాధ్యమాల్లో వచ్చిన ప్రసారాలు విశ్లేషించి అవి కార్యక్రమానికి తగినంత స్థాయిలో రాలేదని విశ్లేషించారు. 2006లో ఈనాడు ఆదివారం ముఖపత్ర కథనం వల్ల ఎంత ప్రయోజనం కలిగిందో తెలిసిందే కనుక అలాంటి ప్రయోజనం దీని వల్ల కూడా ఉండొచ్చని భావించారు. అలా చేయాలంటే హేమాహేమీలైన వారిని తీసుకురావాలని, హైదరాబాదులోనే నిర్వహించాలని కశ్యప్ సూచించారు. మనం మన పరిమిత వనరులతో చేయగలమా అని కోరగా చేయగలమని గతానుభవాలు ఉటంకిస్తూ సమాధానమిచ్చారు.
ఈ చర్చ అటుంచితే, ఇప్పుడు కార్యక్రమాన్ని సముదాయం చేయదలిస్తే వికీమీడియా ఫౌండేషన్ వారి పీఈజీ కోరి చేయాల్సివుంటుంది. అలా చేయాలంటే వికీమీడియా ఫౌండేషన్ వారి మూడు strategic priorities అయిన increasing reach, increasing participation, improving qualityల్లో కనీసం రెంటిని సాధించేలా ప్రణాళిక వేసుకోవాలి. పైన చర్చించినంతవరకూ increasing reach తప్పకుండా సాధ్యపడుతుంది (మీడియా కవరేజి ద్వారా). increasing participation(కొత్త సభ్యుల చేరిక, వారి ఉత్తేజం) జరుగుతుందని భావించగలమే తప్ప ఖరారుగా తెలియదు. ఇక improving quality ఊసు పైన చెప్పిన ఒక థీమ్ తో నేరుగా సాధ్యపడుతుందని అంచనా వేయలేం. గతంలోలాగానే ఫిబ్రవరిలో నిర్వహించాలంటే తప్పకుండా మనం డిసెంబరు మధ్యకే పీఈజీ సబ్ మిట్ చేయాలి. పై ప్రశ్నలకు సమాధానం లభిస్తే, ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయిస్తే నేను రాయగలను, అలానే నిర్వహణకూ నేను పూర్తి సహకారం అందించగలను.
ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఉత్సవాలు ఎందుకు నిర్వహించాలి? వాటి వల్ల ఏయే ప్రయోజనాలు ఆశిస్తున్నాం? ఎలా నిర్వహిస్తే ఆ ప్రయోజనాలు లభిస్తాయి? ఎప్పుడు నిర్వహించాలి? వంటి అంశాలపై సముదాయం చర్చిస్తే బావుంటుంది. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:35, 10 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మీటప్ లో ఎడిట్-అ-థాన్

[మార్చు]

అందరికి నమస్కారం. నేను శ్రీకర్. 20న జరగబోయె మీటప్ కి ఆంగ్ల వీకి నుంచి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నా. ప్రనయ్ గారితో మాట్లాడిన తరువాత ఆ రోజున ఒక ఎడిట్-అ-థాన్ నిర్వహిస్తే బాగుంతుంది అని అనుకుంటున్నా. ముందు గానే అనుకున్న కొన్ని వ్యాసలని అనువదించమని ఇస్తాము. అవి సరిగ్గా చేసిన వాళ్లకి టి-షర్ట్, బాడ్జ్ లాంటి చిన్న బహుమతులు ఇస్తే బాగుంతుంది. దీనిపై మీ అందరి అభిప్రాయాలు కోరుకుంతున్నను. ఇట్లు, శ్రీకర్ కాశ్యప్ 11:23, 10 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నేను తప్పకుండా పాల్గొనేందుకు ప్రయత్నిస్తాను. బహుమతులు ఏమైనా పొందిన వారికి వ్యక్తిగతంగా హాజరు కాలేని వారికి కొరియర్ ద్వారా పంపగలరు అని నా సలహా సూచన. JVRKPRASAD (చర్చ) 12:18, 10 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
* శ్రీకర్ గారూ చాలా చక్కని ప్రయత్నం. ఇంతకు మునుపే ప్రణయ్ గారితో ఈ అంశాన్ని చర్చించాము. మీరు మెయిల్ లో సూచించినట్టుగా తెవికీ ప్రాజెక్టు పురోగతి, స్థితి వంటి అంశాలపైన కూడా ఓ చిరు ప్రెజంటేషన్ నేను ఇచ్చేందుకు సిద్ధమవుతాను. అదీ ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా, షార్ట్ అండ్ స్వీట్ గానే చేసేందుకు ప్రయత్నిస్తాను. మంచి కార్యక్రమానికి నిర్వాహకునిగా వ్యవహరిస్తున్నందుకు అభినందనలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 13:53, 10 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నన్ను గారు అనకండి. నేను మీకంటే చిన్నవాడిని!! మీ అందరి సహయం లేకుండా ఇది అవ్వదుగా! నేను అడిగిన వెంటనే అంగీకరించినందుకు [[పవన్ గారికి ధన్యవాదాలు. నాకు ముందు నుంచి సహాయపడుతున్న ప్రనయ్ గారికి కూడా! మనం అనుకున్నవి అనుకున్నట్టు ఐతే చాలు. కాస్త పెద్ద ప్రొగాం పెట్టాము కాబట్టి వచ్చేవాళ్ళకి అల్పాహారం లాగా తినడానికి ఎమన్నా పెడితే బాగుంటుంది. ఇంకా ఇండాక అనుకున్న ఎడిట్-అ-థాన్ కి కావల్సిన సామాగ్రి పై మనం ఇక్కడ ఒక నిర్ణయానికి ఒస్తే సీఐఎస్-ఎ2కె వారిని గ్రాంట్ అడగవచ్చు. అందున అందరు త్వరగా నిర్ణయం తీస్కొగలరని నా నమ్మకం. ధన్యవాదాలు. శ్రీకర్ కాశ్యప్ 17:05, 10 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

New Wikipedia Library Accounts Available Now (December 2015)

[మార్చు]

Hello Wikimedians!

The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for, free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

  • Gale - multidisciplinary periodicals, newspapers, and reference sources - 10 accounts
  • Brill - academic e-books and journals in English, Dutch, and other languages - 25 accounts
  • Finnish Literature Society (in Finnish)
  • Magiran (in Farsi) - scientific journal articles - 100 articles
  • Civilica (in Farsi) - Iranian journal articles, seminars, and conferences - 50 accounts

Many other partnerships with accounts available are listed on our partners page, including EBSCO, DeGruyter, and Newspaperarchive.com. Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 01:01, 11 December 2015 (UTC)

Help us a start Wikipedia Library in your language! Email us at wikipedialibrary@wikimedia.org
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

అనామకులు సృష్టించిన మొలకల తొలగింపు పాలసీ

[మార్చు]

మొలకల విషయంలో ఇప్పటివరకూ తెవికీలో అనుభవంగడించినవారు (అనగా 25 మార్పులైన చేసినవారు) ప్రారంభించిన మొలక వ్యాసాలు, ప్రారంభించిన నెలరోజులలోగా కనీస స్థాయికి అనగా వ్యాస పరిమాణం 2000బైట్ల మరియు కనీసం ఒక అంతర్గత లింకు) ఎదగకపోతే వాటిని వీలైతే ఇతర వ్యాసాలలో విలీనం చేసి తొలగించవలెను. అన్న పాలసీ ఉంది. ఫిబ్రవరి 2013లో చిత్తు ప్రతిపాదన అర్జున గారు ప్రారంభించి ఓటింగ్, చర్చలకు పెట్టగా విస్తృతమైన చర్చ జరిగాకా ఏప్రిల్ 2013 నాటికి ఓటింగ్ పద్ధతిలో మొలకపేజీల నియంత్రణ విధానం ఆమోదింపబడింది. దీని ప్రకారం అనుభవజ్ఞులైన వికీపీడియన్లు సృష్టించిన మొలక వ్యాసాలే తొలగించే విధంగా ఉంది. కొత్త వికీపీడియన్లు వచ్చీరాగానే వారి వ్యాసాలు మొలకలని తొలగిస్తే నిరుత్సాహంగా ఉంటుందని అక్కడి చర్చలో భావించి 25 మార్పుల కన్నా తక్కువ చేసినవారికి మినహాయింపు ఇచ్చారు. ఐతే అనామక సభ్యులు (ఐపీ అడ్రస్ పై) చేసే మార్పుల్లో భాగంగా వ్యాసాలు సృష్టిస్తే వాటిని గురించి ఏమీ పాలసీ లేకపోవడం ఎలా? దీనిపై చర్చ జరిపితే బావుంటుంది. అనామక సభ్యులు సృష్టించిన మొలక వ్యాసాలు నెలరోజుల్లోగా ఏ మార్పూ లేకుంటే తొలగించవచ్చు అన్న ప్రతిపాదన ఎలావుంటుంది? అలానే ప్రతినెలా మొలకల జాబితాను సృష్టిస్తున్నాం. ఐతే ఆ మొలకల జాబితాలో సృష్టించినవారి పేరు జోడించి ప్రచురిస్తున్నాం. ఇలా ప్రచురించడం సముదాయానికి సరేనా? మొలకల పాలసీ ప్రకారం ఈ మొలకలు తొలగింపబడతాయి కనుక అవసరమైతే సమిష్టికృషిగానో, ఇంటర్న్ విధానంలోనో అభివృద్ధి చేయవచ్చు. సముదాయ సభ్యులు ఈ ప్రతిపాదనలపై చర్చించాలని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:41, 11 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

దయచేసి ప్రతినెలా తీసిన మొలకల జాబితా, మొలకలు మొక్కలుగా (వ్యాసములుగా) మారిన జాబితా, మిగిలిన మొలకలు జాబితా వివరముగా తెలిసిన వారు ప్రచురించండి. అదేవిధముగా పాత వికీపీడియన్లు మొలకలు వ్యక్తిగతముగా ఈ వివరములు పొందుపరచి కూడా ఇస్తే బావుంటుంది. ముందు నావి ఉంటే సంపూర్ణముగా అన్నివివరములతో సహా తెలిసినవారు ఇవ్వగలరు. JVRKPRASAD (చర్చ) 05:02, 11 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]