వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 37
← పాత చర్చ 36 | పాత చర్చ 37 | పాత చర్చ 38 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2015 జనవరి 4 - 2015 జనవరి 30
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92, 93 |
సహవికీపీడియనులకు మనవి: తిరుపతిలో జరుపబోవు తెవికి సభల గురించి మూడు రోజుల కార్యక్రమాల సమయానుకూల వివరాలు వ్రాయడమైనది. వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations లో 18 వ అంశముగా వ్రాయడమైనది. దీనిని పరిశీలించి తగు విధంగా సవరించి దీనికి ఒక సమగ్ర రూపమివ్వవలసినదిగా కోరడమైనది. ఎల్లంకి (చర్చ) 08:23, 1 జనవరి 2015 (UTC)
వికీపీడియా కరపత్రము
[మార్చు]తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్స సభలు తిరుపతిలో జరుప తలపెట్టిన సందర్భంగా వికిపీడియా ప్రచార నిమిత్తము వికీపీడియా:'''తెలుగు వికీపీడియా''' మార్గదర్శిని అనే చిరు పొత్తమును తయారు చేసి అందరి ముందు వుంచడమైనది. కాని దానిని ముద్రించి పంపణీ చేయడానికి సమయం చాలకున్నందున అందులోని ప్రధాన విషయాన్నిసంక్షిప్తపరచి ఒక కర పత్రంగా వికీపీడియా కరపత్రము అనే పేరుతో మన కార్యవర్గ సభ్యుల సూచన మేరకు సుమారు నాలుగు పుటలు వుండేటట్లు తయారు చేసి వుంచడమైనది. దానిని మన సమావేశాలలో పంపిణీ కొరకు ఉపయోగించుకో వచ్చును. సహ సభ్యులు అందులో ఏదేని మార్పులు చేర్పులు సూచించ వచ్చును. ఎల్లంకి (చర్చ) 13:00, 4 జనవరి 2015 (UTC)
సెన్సస్ 2011 డేటా ఇప్పుడు అందుబాటులో
[మార్చు]భారతదేశ సెన్సస్ సంస్థ వారి వెబ్సైటులో గ్రామం పేరును టైపు చేసి 2011 జనాభాను పొందవచ్చు. గ్రామ వ్యాసాలు అభివృద్ధి చేసే వారు ఈ సమాచారాన్ని వాడుకోగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 15:11, 4 జనవరి 2015 (UTC)
విశిష్ట వికీపీడియన్
[మార్చు]2014 సంవత్సరంలో వికీపీడియాలో చురుకుగా పాల్గొన్నవారిలో 5 మందికి విశిష్ట వికీపీడియన్ అని బహుమతి ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే. అది ఏ పేరుతో ఇస్తే బాగుంటుంతో అన్న విషయంపై రచ్చబండలో చర్చించి నిర్ణయించాలి అని గత మీటింగ్‌లో నిర్ణయించారు దాని ప్రకారం ఈ క్రింద తెలిపిన విధంగా ఉన్నాయి. మద్దుతు ఎక్కువగా దేనికి ఉంటే అది నిర్ణయింపబడుతుంది. జనవరి 20 వతేదీ వరకూ నిర్ణయింపబడును.
1.విశిష్ట వికీపీడియన్ 2014
మద్దతు
2. కొమర్రాజు లక్ష్మణరావు వికీపీడియా పురస్కారం 2014
మద్దతు
- కొమర్రాజు లక్ష్మణరావు గారు తెలుగు భాషాభివృద్ధికి విశిష్ట కృషి చేసిన వ్యక్తి, విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకులు మరియు తొలి విజ్ణాన సర్వస్వ నిర్మాత. తెవికీ పురస్కారానికి చాలా చర్చల అనంతరం పెట్టిన ఇతని పేరును కొనసాగించడం చాలా ఉత్తమం.--Rajasekhar1961 (చర్చ) 13:15, 8 జనవరి 2015 (UTC)
- ఆయన పేరుమీదుగా అందరికీ పూర్తి పరిచయం ఏర్పడాలి, విజ్ఞాన సర్వస్వం అంటే ఆయనే అనే విధంగా ఈ పురస్కారం కొనసాగాలి.--విశ్వనాధ్ (చర్చ) 13:27, 8 జనవరి 2015 (UTC)
- కొమర్రాజు లక్ష్మణరావు వికీపీడియా పురస్కారం 2014 పేరుకు నేను మద్దతు తెలుపుతున్నాను.Naidugari Jayanna (చర్చ) 17:28, 8 జనవరి 2015 (UTC)
- కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియన్ పురస్కారం-2014 పేరుకు నేను మద్దతు తెలుపుతున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 15:50, 9 జనవరి 2015 (UTC)
- నా మద్దతు కూడా ఈ రెండవ పేరుకే --వైజాసత్య (చర్చ) 22:37, 26 జనవరి 2015 (UTC)
3. వికీపీడియా పురస్కారం 2014
మద్దతు
- సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:06, 8 జనవరి 2015 (UTC)
4. తెలుగు వికీపీడియా పురస్కారం 2014
మద్దతు
కశ్యప్ --కశ్యప్ (చర్చ) 09:04, 15 జనవరి 2015 (UTC)
5.విశిష్ట తెలుగు వికీపీడియను 2014
మద్దతు
- విశిష్ట తెలుగు వికీపీడియను 2014
మద్ధతు --గుళ్ళపల్లి 03:56, 13 జనవరి 2015 (UTC)
వ్యాసరచన - తెవికీ 11వ వార్షికోత్సవాల సంధర్భంగా
[మార్చు]వ్యాసరచన సమయాభావం వలన, విద్యార్ధులకు ప్రాక్టికల్స్, ఎగ్జాంస్ జరుగుతున్నందున జూలై ప్రోగ్రాం వరకూ వాయిదా వేయబడినవి. ఇప్పటి వరకూ పాల్గొన్న విద్యార్ధులకు తిరుపతి ప్రోగ్రాం కొరకు కార్యవర్గ<ం ద్వారా అవకాశం కల్పించబడూచున్నది. కావున ఇప్పటికే వ్యాస రచనలో పాల్గొనిన వారు ఈ అవకాశం ఉపయోగించుకొనవచ్చును.
మరిన్ని వివరాలు 11 వ వార్షికోత్సవ వ్యాసరచన పోటీ పేజీలో చూడవచ్చు
జిల్లా వ్యాసాలు, పట్టణాల వ్యాసాలు విడదీయాలి
[మార్చు]మన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకు చక్కని వ్యాసాలున్నాయి. కానీ సమస్య ఏంటంటే ఆ జిల్లా పేరు, పట్టణం పేరు ఒకటిగానే ఉంటోంది. పట్టణం నుంచి నేరుగా జిల్లా పేజీకే రీడైరెక్టు ఉంటోంది. కర్నూలు వంటి పట్టణాలకు, హైదరాబాద్ వంటి నగరాలకు, పశ్చిమగోదావరి(జిల్లాపేరు వేరు, జిల్లా కేంద్రం పేరు వేరు) వంటి జిల్లాలకు వేర్వేరుగా ఉన్నాయి తప్ప వరంగల్ వంటి అతిపెద్ద నగరాలకు కూడా విడిగా పేజీలు లేకపోవడం గమనించాను. ప్రస్తుతం నేను ఆదిలాబాద్ జిల్లా వ్యాసం నుంచి పట్టణం వివరాలతో వేరే పట్టణం వ్యాసం తయారుచేస్తున్నాను. ఆసక్తి కలిగిన వికీపీడియన్లు దీనిలో పాలుపంచుకుంటారని, ఏమైనా సలహాలు, పూర్వానుభవాలు ఉంటే వ్రాస్తారని కోరుతున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 07:27, 11 జనవరి 2015 (UTC)
- పవన్ సంతోష్ గారు, విడగొట్టి ఒకకొత్త వ్యాసము వ్రాయడములో ఎవరికైనా పెద్ద సమస్య ఏమీ ఉండదు. ఎవరైనా ఆ ప్రయత్నము తేలికగా చేయవచ్చును. సమయము చేసుకొని ఎవరైన ముందుకు వస్తారేమో ? ఇంతకీ మీ సమస్య సూటిగా పొందు పరచండి. JVRKPRASAD (చర్చ) 07:57, 11 జనవరి 2015 (UTC)
- సమస్య నాది అని కాదు. వికీలో ముఖ్యమైన పట్టణాలకు వ్యాసాలు లేవు(కొన్ని జిల్లాల వ్యాసాల్లో అంతర్భాగాలైపోయాయి). తేలికగా తయారుచేయగల సాధనాసంపత్తి మనవద్ద ఉంది. నేను కొంత పనిచేయదలుచుకున్నాను. ఎవరైనా ముందుకువస్తే బావుంటుంది అని చెప్పదలిచాను.--పవన్ సంతోష్ (చర్చ) 10:27, 11 జనవరి 2015 (UTC)
- నేను అడిగింది, మీ సమస్య అంటే, మీరు కనుగొన్న సమస్య, లేదా ఇప్పుడు మీకు ఎదురు అవుతున్న సమస్య అని అర్థం. అంతేకాని, మీ వ్యక్తిగత సమస్య అని కాదు. పైన మీరు వ్రాసినట్లు ఉన్న విషయాన్నంతటిని గంపగుత్తగా ఓ రకమైన సమస్యగా తీసుకుంటే అలాంటి సమస్యలు అనేకం అనేక వర్గాలలో ఉన్నాయి. వాటిని నిదానంగా వీలునుబట్టి విడదీస్తునే ఉన్నాము. ఇది కొత్త సమస్య కాదని గ్రహించగలరు. అనేక మంది అనేక సందర్భాలలో ఆయా విషయం గురించి తెలిసిన తెలియక పోయినా అనేకం రీడైరెక్టు చేసినవి ఉన్నాయి. నేను కూడా అనేకం వేరు చేస్తున్నాను. ఇది తెలిసిన తేలిక పని అని నా భావన అంతకుమించి ఏదైనా తెలుసు కోవాలేమో అని నా ప్రశ్న(మీ సమస్య) అర్థం అని గ్రహించగలరు . JVRKPRASAD (చర్చ) 11:17, 11 జనవరి 2015 (UTC)
- సమస్య నాది అని కాదు. వికీలో ముఖ్యమైన పట్టణాలకు వ్యాసాలు లేవు(కొన్ని జిల్లాల వ్యాసాల్లో అంతర్భాగాలైపోయాయి). తేలికగా తయారుచేయగల సాధనాసంపత్తి మనవద్ద ఉంది. నేను కొంత పనిచేయదలుచుకున్నాను. ఎవరైనా ముందుకువస్తే బావుంటుంది అని చెప్పదలిచాను.--పవన్ సంతోష్ (చర్చ) 10:27, 11 జనవరి 2015 (UTC)
- పవన్ సంతోష్ గారు, విడగొట్టి ఒకకొత్త వ్యాసము వ్రాయడములో ఎవరికైనా పెద్ద సమస్య ఏమీ ఉండదు. ఎవరైనా ఆ ప్రయత్నము తేలికగా చేయవచ్చును. సమయము చేసుకొని ఎవరైన ముందుకు వస్తారేమో ? ఇంతకీ మీ సమస్య సూటిగా పొందు పరచండి. JVRKPRASAD (చర్చ) 07:57, 11 జనవరి 2015 (UTC)
- ఇంతకుముందు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వ్యాసాలలో ఈ సమస్యను గుర్తించి వాటిని అర్జునరావు గారితో సంప్రదించి వేరుచేశాను. కానీ అప్పుడు కొన్ని జిల్లా మరియు పట్టణానికి సంబంధించిన సమాచారం తక్కువగా ఉన్నందున అన్ని జిల్లాలకు దీనిని చేయలేదు. ఇప్పుడు మీరు వ్యాసాల్ని విస్తరించాలనుకుంటే వాటిని సులువుగా విడదీయవచ్చును. నా సహాయం మీకు ఎప్పుడు ఉంటుంది.--Rajasekhar1961 (చర్చ) 10:43, 11 జనవరి 2015 (UTC)
- దీనిపై మునుపు చర్చ జరిగింది, తదుపరి మాకినేని ప్రదీపు, వైజాసత్య వాటిపై పనిచేసారు. ఈ పేజీలో ఉన్నట్లు వివరాలు ఉంటే సరిపోతుందా. జిల్లాలకు వేరు పేజీలు కలిగి ఉన్నాయి ( ఉదా: కర్నూలు, కర్నూలు జిల్లా). ఇంకా మిగిలిన వేవైనా ఉంటే వాటిపై పనిచేయచ్చు---విశ్వనాధ్ (చర్చ) 10:54, 11 జనవరి 2015 (UTC)
- జిల్లా వ్యాసాల నుంచి పట్టణ/నగర వ్యాసాలను వేరు చేయడం, మండల వ్యాసాల నుంచి గ్రామ/పట్టణ వ్యాసాలను వేరుచేయడం విషయంపై నాలుగైదు సంవత్సరాల క్రితం అనేక సార్లు చర్చ జరిగింది. సాధారణంగా జిల్లా/ మండల వ్యాసాల నుంచి పట్టణ/గ్రామ వ్యాసాలను వేరు చేయడం సులభమే కాని ఆ తర్వాతే సమస్య ఉత్పన్నమౌతుంది. దీన్ని ఛేధించడమూ కష్టం కాదు కాని ప్రతి గ్రామవ్యాసానికీ బాటు నడుపాల్సి ఉంటుంది. జిల్లా/ మండల వ్యాసాల ఏర్పాటు నుంచి జరిగే ప్రక్రియను గమనిస్తే- మొదట జిల్లా వ్యాసాలకు చివరన "జిల్లా" అని పెట్టకుండా వ్యాసాలు సృష్టించబడ్డాయి. ఆ తర్వాత ఇదే లింకుతో గ్రామ/మండల వ్యాసాలలో ఈ గ్రామం/ఈ మండలం ఫలానా జిల్లాలో ఉంది అని ఏక వాక్యంతో దాదాపు 25 వేల వ్యాసాలు సృష్టించబడ్డాయి. కొన్నేళ్ళ క్రితం ఇదే విషయంపై చర్చ అనంతరం జిల్లాపేరుతో లేని జిల్లా వ్యాసాలను తరలింపు చేయగా మునపటి పేరు రీడైరెక్ట్‌గా మారింది. నేను మహబూబ్ నగర్ పట్టణం వ్యాసాన్ని సృష్టించేటప్పుడు కూడా పై సమస్య వల్లే వ్యాసం పేరు చివరన పట్టణం అని పెట్టాల్సి వచ్చింది. (రీడైరెక్టుగా ఉన్న మహబూబ్‌నగర్ పేజీలో సమాచారం చేర్చితే గ్రామ/మండల వ్యాసాలలో ఉన్న లింకు పట్టణానికి చేరేది). ఆదర్శ గ్రామ వ్యాసం కోసం భూత్పూర్ గ్రామాన్ని ఎంపికచేసినప్పుడు కూడా ఇదే సమస్య వల్ల భూత్పూర్ వ్యాసం చివరన గ్రామం అని తగిలించి భూత్పూరు (గ్రామం) అని పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడున్న జిల్లా వ్యాసాలనుంచి జిల్లా కేంద్ర వ్యాసాలను వేరుచేయడానికి రీడైరెక్టు తొలగించి వ్యాసం అభివృద్ధి చేయడం కంటే గ్రామ/మండల వ్యాసాలలో మార్పు చేయడమే కష్టమవుతుంది. దీనికి బాటు నడుపుటకై నేను గతం లోనే సూచించాను. ప్రస్తుతం కర్నూలు జిల్లాకు చెందిన గ్రామ మరియు మండల వ్యాసాలలో ఇదే సమస్య వచ్చిపడింది. కర్నూలు గ్రామ లేదా మండల వ్యాసాలలో జిల్లా కొరకు ఇవ్వబడిన లింకు పట్టణానికి దారితీస్తోంది. కాబట్టి ముందుగా బాటు ద్వారా మండల మరియు గ్రామ వ్యాసాలలో లింకులు మార్చితే ఈ సమస్య ఉండదు. సి. చంద్ర కాంత రావు- చర్చ
- చంద్రకాంతరావు గారూ పట్టణం పేరున రాసేదంతా జిల్లా వ్యాసంలో రాయడమో, జిల్లా పేరతో రాసేది పట్టణం పేరుమీద ఉండడమో ఎప్పటికైనా సరిజేయాల్సిన సమస్యే కదా. ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన చరిత్రను వ్రాస్తూంటే జిల్లా వ్యాసంలో ఎలా రాస్తామనే సమస్య ఎదురైంది నాకు. ఆదిలాబాద్ జిల్లా గురించిన చరిత్ర వేరు, పట్టణం చరిత్ర వేరు కదా. 19వ శతాబ్దిలో ఆదిలాబాద్ ఇలా ఉంది అంటే పట్టణం గురించి రాస్తున్నాం, కానీ అది జిల్లా వ్యాసంలో రాస్తే జిల్లా మొత్తం అలా ఉందనే అర్థం వస్తోంది. ప్రతిసారీ పట్టణం అంటూ ప్రస్తావిస్తూ రాయాలి. ఇదంతా సమస్యాత్మకం కదా మరి.Rajasekhar1961 గారూ ధన్యవాదాలు, విశ్వనాధ్ గారూ కొన్ని ఉన్నాయి, కర్నూలు వంటివాటి విషయంలో ఏం చేశారో చరిత్ర ద్వారా చూస్తాను. ధన్యవాదాలు --పవన్ సంతోష్ (చర్చ) 18:15, 11 జనవరి 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ, జిల్లా/మండల వ్యాసాల నుంచి పట్టణ/గ్రామ వ్యాసాలు వేరు చేయడానికి నేను వ్యతిరేకత చూపలేను. (మహబూబ్ నగర్ జిల్లా నుంచి పట్టణ వ్యాసం వేరు చేసిన విషయం కూడా తెలిపాను). గతంలో నాకూ అలా చేయాలని ఉండిననూ, తర్వాత గ్రామ వ్యాసాలలో సమస్యలు వస్తాయనే భావనతో ఈ మార్పులకు దూరంగా ఉండిన నా అనుభవాన్ని మరియు గత చర్చల సారాంశాన్ని పైన ఉటంకించాను. ఇది చేయడానికి ముందు ఇక్కడ చేయాల్సిన మార్పులను తెలియజేశానంతే. నేను ప్రస్తుతం తెవికీలో చురుకుగా లేను. మునపటిలా చర్చలలో పాల్గొనడం లేను. ఇది గత చర్చలకు సంబంధించినది కాబట్టి అప్పటి విషయాలు తెలియని వారికి ఒక సూచికగా ఉంటుందనే ఉద్దేశ్యంతో చేసిన చర్చ మాత్రమే. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:09, 11 జనవరి 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయా జిల్లాల పేజీలు సృష్టించిన కొంతకాలానికే అవగతమైంది. అప్పట్లో సమాచారం పెరిగిన తర్వాత, పట్టణాలు, జిల్లాల వ్యాసాలు వేరుచేద్దామని అనుకోవటం జరిగింది. ఇలా విడిగా జిల్లాకేంద్రాలకు, జిల్లాలు వేరే పేజీలు రె0డు, మూడేళ్ళ క్రితమే సృష్టించారు అనుకున్నానే? (ఉదా: ఖమ్మం, ఖమ్మం జిల్లా). ప్రస్తుతానికి కేవలం జిల్లాలను, జిల్లా కేంద్ర పట్టణాలనే వేరుచేద్దాం. మరి కొన్నేళ్ళ తర్వాత మండలాల విషయంలో ఇదే పనిచేయవచ్చు. చంద్రకాంతరావు గారు దీని వలన ఉత్పన్నమయ్యే సమస్యను చక్కగా ఎత్తి చూపారు. పరిష్కారంగా, అన్ని గ్రామాల మరియు మండలాల పేజీలో జిల్లా లింకునే బాటుచే సరిచేయించగలను. ఇక మహబూబ్ నగర్ పట్టణం విషయానికి కొస్తే, మహబూబ్ నగర్ అన్న పేజీ నిజానికి పట్టణానికే చెందాలి, ఎందుకంటే మహబూబ్ నగర్ పట్టణం, మహబూబ్ నగర్ జిల్లా కంటే ముందునుండి ఉన్నది. --వైజాసత్య (చర్చ) 22:53, 26 జనవరి 2015 (UTC)
- వైజాసత్యగారూ, నా చర్చలను అర్థం చేసుకొనే స్థాయి/స్తోమత ఇక్కడ మీకు మాత్రమే ఉందనుకుంటున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:26, 27 జనవరి 2015 (UTC)

- వైజాసత్య గారూ, చంద్రకాంతరావుగారూ మీ స్పందనకు, వివరణలకు ధన్యవాదాలు. ఇక్కడ చంద్రకాంతరావుగారు సమస్యను వివరించాకానూ, అంతకుముందు కాశీయాత్రచరిత్ర సమాచారాన్ని గ్రామవ్యాసాల్లో చేర్చేప్పుడు గ్రామాల సమచారపెట్టెలో మండలాలు, మండలాల సమాచారపెట్టెలో జిల్లాల పేర్లకు ఉన్న విలువ నాకు అర్థమైంది. వాటి ఆధారంగానే నేను కొన్ని గ్రామాలను గుర్తించగలిగాను అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు చంద్రకాంతరావుగారు చెప్పినట్టు ఒక జిల్లా పేరు మార్చి, జిల్లాకేంద్రానికి ఓ వ్యాసం తయారుచేస్తే అంతటితో బాధ్యత తీరదనీ అర్థమౌతోంది. కానీ ఈ విషయంలో నేను అశక్తుడిగా ఊరుకున్నది బాటు వాడకం, తయారీ నాకు రాకమాత్రమే. మీరు సూచించినట్టు జిల్లా వరకు తీసుకుని ప్రారంభిస్తే కొన్నేళ్ళకి మండలాల వరకూ వెళ్ళొచ్చునేమో.--పవన్ సంతోష్ (చర్చ) 13:52, 27 జనవరి 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ, మీరు చెప్పినది నిజమే. అందుకే నేను పాలమూరు జిల్లాకు తప్ప మిగితా జిల్లా కేంద్రాల వ్యాసాలను సృష్టించలేకపోయాను. నాకూ బాటు సభ్యత్వం లేనందుకు గ్రామ, మండల వ్యాసాలలో మార్పులు చేయక ఊరకుండిపోయాను. బాటుద్వారా గ్రామ మరియు మండల వ్యాసాలలో మార్పులు చేస్తే జిల్లా కేంద్రాల మండల కేంద్రాల వ్యాసాలు ప్రత్యేకంగా సృష్టించిననూ సమస్య ఉండదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:59, 27 జనవరి 2015 (UTC)
- పరిశీలించి చూడగా కేవలం ఐదు జిల్లాల ముఖ్యపట్టణాలకు మాత్రమే ఇంకనూ విడిగా పేజీలు లేవు. నేను ఈ మండలాల, గ్రామాలలో లింకులకు చేస్తున్నా మార్పుల యొక్క ప్రగతిని ఇక్కడ నమోదు చేస్తున్నాను --వైజాసత్య (చర్చ) 22:17, 31 జనవరి 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ, మీరు చెప్పినది నిజమే. అందుకే నేను పాలమూరు జిల్లాకు తప్ప మిగితా జిల్లా కేంద్రాల వ్యాసాలను సృష్టించలేకపోయాను. నాకూ బాటు సభ్యత్వం లేనందుకు గ్రామ, మండల వ్యాసాలలో మార్పులు చేయక ఊరకుండిపోయాను. బాటుద్వారా గ్రామ మరియు మండల వ్యాసాలలో మార్పులు చేస్తే జిల్లా కేంద్రాల మండల కేంద్రాల వ్యాసాలు ప్రత్యేకంగా సృష్టించిననూ సమస్య ఉండదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:59, 27 జనవరి 2015 (UTC)
బడ్జెట్ ఆఖరి రివ్యూ
[మార్చు]సభ్యులకు నమస్కారం. 11 వ వర్షికోత్సవాలకు బడ్జెట్ రివ్యూ జరుగుతున్నది. త్వరగా దానిని పూర్తిచేయాలి. ఎవరైనా సూచనలు సలహాలు ఇవ్వాలన్నా మార్పులు చేయాలన్నా దయచేసి ఈ లింక్ చేయగలరు. --విశ్వనాధ్ (చర్చ) 13:35, 13 జనవరి 2015 (UTC)
తెవికీ 11వ వార్షికోత్సవాలు బడ్జెట్ డ్రాఫ్ట్ - Tewiki 11th Anniversary Celebrations draft
[మార్చు]తెవికీ 11వ వార్షికోత్సవాలు బడ్జెట్ డ్రాఫ్త్ తయారు చెసాము, ఖర్చుల వివరాలు, కార్యక్రమాలు ,టిం పేర్లు సూచించాము దయచేసి ఆశక్తిగల వారు తమపేరుని Coordinators గా చేర్చగలరు, మీ సూచనలు, సలహాలు మరేవైనా ఇక్కడ ఇవ్వగలరు 15 జనవరి 2015 లోగా దీనిని WMF CIS వారి ఆమోదం కొరకు పెట్టాలి. Telugu wikimedians11th Anniversary Celebrations request for grant draft copy Grants:PEG draft Tewiki 11th Anniversary Celebrations
తెవికీ 11వ వార్షికోత్సవాలు పండుగకు హాజరు కాలేని ప్రముఖ వికీపీడియన్లు
[మార్చు]మన తెవికీ 11వ వార్షికోత్సవాలు పండుగకు హాజరు కాలేని కొంతమంది ప్రముఖ వికీపీడియన్లకు కొరియర్ ద్వారా ఆహుతులకు అందించే ఉచిత వస్తువులు (బహుమతులు, వివిధ కరపత్రములు, చేతి పుస్తకములు, ఇలాంటి వివిధ రకములయిన అన్ని వస్తువులు) రకమునకు ఒకటి అయినా, కార్యక్రమునకు గుర్తుగా వారికి పంపు ఏర్పాటు చేస్తే బావుంటుందని నా ఆలోచన మరియు మనవి. వ్యక్తిగతంగా హాజరు కాలేని, నాలాంటి వారు, ముందుగా నేను అలాంటి(వి) ఆశిస్తూ కోరుకుంటున్నాను. నా సూచన వార్షికోత్సవాలు నిర్వహించే కమిటీ వారు బడ్జెట్ నందు మరో ఖర్చును తగ్గించి, ఈ ఏర్పాటు చేయగలరని తలుస్తాను. JVRKPRASAD (చర్చ) 06:54, 15 జనవరి 2015 (UTC)
వికీపీడియా 11వ వార్షిక సమావేశ ఆహ్వానం
[మార్చు]ఫిబ్రవరి 14, 15 తేదీల్లో తిరుపతిలో తెలుగు వికీపీడియా 11వ వార్షిక సమావేశం నిర్వహించడానికి తెలుగు వికీపీడియా 11వ వార్షిక కార్యనిర్వాహక వర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించి వికీమీడియా ఫౌండేషన్, సిఐఎస్ ఎ2కె వారిని గ్రాంటులకై సంప్రదిస్తున్నాము. తెలుగు వికీసభ్యులందరూ ఈ సమావేశాలకు హాజరుకావాలని మా సవినయ వినతి. తెవికీ ప్రాజెక్టులలో డిసెంబరు 31 2014 వరకూ కనీసం 500 ఎడిట్లు కానీ, 2014 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు కనీసం 150 ఎడిట్లు కానీ చేసిన వికీపీడియన్లకు భోజన, రవాణా, వసతి సదుపాయాలు ఏర్పాటుచేయడం జరుగుతుంది. వికీపీడియన్లందరూ ఇక్కడ మీ పేరును నమోదుచేసుకోగలరు. ఈ సమావేశానికి అందరూ ఆహ్వానితులే.--పవన్ సంతోష్ (చర్చ) 15:16, 18 జనవరి 2015 (UTC)(తెలుగు వికీపీడియా 11వ వార్షిక సమావేశ నిర్వహణ కమిటీ సంయుక్త కార్యదర్శిగా కార్యవర్గం తరఫున)
వికీపీడియా వ్యాసాల శుద్ధికి ఒక అవకాశం
[మార్చు]తెలుగు వికీపీడియా వ్యాసాలలో కొన్ని వ్యాసలలో బొమ్మలకి లంకెలు ఉన్నా, బొమ్మలు ప్రదర్శింపబడకపోవటం చూసాము. (దీనికి కారణం ఆ బొమ్మలు వ్యాసం రూపొందించినపుడు ఉన్నప్పటికీ, తరువాతా తొలగించబడటం. కానీ కోట్ల సంఖ్యలో బొమ్మలు గల కామన్స్ లో ప్రత్యామ్నాయ బొమ్మలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.) అయితే ఇలా బొమ్మలు/దస్త్రాలు లేని వ్యాసాలు నాణ్యతను తగ్గించి వేస్తాయి. అలాంటి వ్యాసాలు ప్రస్తుతం వ్యాసపు పేరుబరిలో దాదాపు రెండు వేల పైబడి ఉన్నాయి. వాటిని ఇక్కడ పొందుపరిచాను. ఆసక్తి గల సభ్యులు ఆయా వ్యాసాలలో ఆ బొమ్మలను మరో బొమ్మతో కామన్స్ నుండి దింపుకొని మార్చవచ్చు. వారం వారం ఈ జాబితాను తాజాపరుస్తాను. సభ్యులు ఈ పనిలో పాల్గొన్న చుఱుకుదనాన్ననుసరించి ఇలాంటి పనులు ఇంకొన్ని వచ్చే కొన్ని నెలలలో చేపట్టవచ్చు. --రహ్మానుద్దీన్ (చర్చ) 13:06, 19 జనవరి 2015 (UTC)
ట్రెయిన్ ది ట్రెయినర్ 2015
[మార్చు]ట్రెయిన్ ది ట్రెయినర్ వికీపీడియన్లలో నాయకత్వపు గుణాలు పెంపొందించి, వారిని వివిధ విధాలుగా వికీపీడియా-స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమాన్ని ముందుకు నడిపించే కార్యకర్తలుగా రూపొందించే అంశాలౌ పొందుపరుస్తూ సాగే ఒక మూడు రోజుల కార్యశాల. ఇది 2013 లో సీఐఎస్-ఏ2కే నిర్వహించిన మహత్తర ఆలోచన. 2013 లో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వికీమీశియన్లు అచల్, అర్జునరావు, హరిప్రసాద్, శ్యామల్, టినుచెరియన్, విశ్వప్రభ తదితరులకు ధన్యవాదాలతో 2015 లో మరొకసారి ఇంకొందరు వికీమీడియన్లను సమాయుత్తం చేసేందుకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇది ఫిబ్రవరి ఆఖరులో జరిగే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి.
- ముఖ్యమైన తేదీలు:
- జనవరి 27, 2015 - నమోదుకు ఆఖరు తేదీ
- జనవరి 30, 2015 - ఎంపికైన అభ్యర్ధుల నిర్ధారణ
- ఫిబ్రవరి 26 నుండి మార్చ్ 1, 2015 - టిటిటి-2015 కార్యశాల
మేము ప్రస్తుతం కార్యక్రమ ప్రణాళిక మీద పని చేస్తున్నాము, మీరు మీ సలహాలను, సూచనలను మాకిక్కడ తెలుపవచ్చు. దయచేసి ఇంకేమైనా సమాచారం కోసం tanveer@cis-india.org, vishnu@cis-india.org వద్ద మెయిల్ వ్రాయగలరు.
రహ్మానుద్దీన్
ప్రోగ్రాం ఆఫీసర్
సీఐఎస్-ఏ2కే
వికీవ్యాఖ్య సాంకేతికంగా అభివృద్ధి
[మార్చు]తెలుగు వికీవ్యాఖ్య(te.wikiquote.org) అభివృద్ధి చేద్దామని ప్రస్తుతానికి రాజశేఖర్ గారు, నేను ప్రయత్నిస్తున్నాము. కాకుంటే అక్కడ కొన్ని సాంకేతికంగా వస్తున్న సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. సమగ్రమైన మూలాలు ఇచ్చేందుకు సైట్ మూస వాడుదామంటే కొన్ని మాడ్యూల్స్, మూసలు లేవు. అలానే కొన్ని వికీ కామన్స్ లో లేని సముచిత వినియోగం కిందకు వచ్చే దస్త్రాలు వాడదామంటే లోకల్ వికీలో ఫోటోలు చేర్చేందుకు వీలు కనిపించట్లేదు. తెవికీపీడియన్లు సాంకేతికంగా దాన్ని అభివృద్ధి చేసి సహకరించమని మనవి.(వైజాసత్య గారితో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. ఆయన కూడా కొంతవరకూ సహకరిస్తానన్నారు.) --పవన్ సంతోష్ (చర్చ) 05:06, 23 జనవరి 2015 (UTC)
వికీ వాడుకరుల సహాయ అభ్యర్థన
[మార్చు]వికీ వాడుకరులకు నమస్కారము. నేను మొదటి సారిగా 24.1.15 న ఒక పుటను దిగుమతి చేశాను. దానితో పాటు మిగాతా అనుబంధములు కూడా దిగుమతి అయ్యాయి.[1] తదుపరి కొన్ని గంటల అనంతరం తెలుగు వికీ మూసలు, మూలాలు పని చేయలేదు. నేను దిగుమతి చేసి కారణము వల్ల, జరిగిందేమోనని ఈ రోజు వాటిలో కొన్ని తొలగించాను. ఆ తదుపరి సమస్య మరింత జటిలం అయ్యింది. తెలిసి తప్పు చేయలేదు. కనుక మీరు సహృదయముతో అర్థము చేసుకొన గలరు. దయచేసి సమస్యకు పరిష్కారము చూపగలరు. తోటి వికీ వాడుకరులకు కలిగిన అసౌకర్యమునకు మంచి మనసులతో మన్నించ గలరు. వీలయినంత త్వరలో ఈ సమస్య సరి దిద్దగలవారు సహాయ పడగలరని అభ్యర్థించు చున్నాను. JVRKPRASAD (చర్చ) 00:37, 25 జనవరి 2015 (UTC)
- ప్రసాద్ గారూ, navbox మూసలన్నీ పనిచేయడంలేదు. అది మీ తప్పిదంవల్ల కాదని తెలుస్తుంది. కన్నడ వికీలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అక్కడ కూడా navbox మూసలు పనిచేయడం లేదు. మూలాల మూసలు కొన్ని సరిచేసితిని. కానీ కొన్నిసార్లు error వచ్చి, మరికొన్ని సార్లు పనిచేయడం లేదు. అందువలన మనం చేయగలిగేదేమీ లేదని నా అభిప్రాయం. కొన్ని వికీలలో ఇలా వస్తుండటం వల్ల తరువాత సరిఅవుతాయని అనుకుంటున్నాను. ఈ మూసల దోషాలను మీరు ఎంతమాత్రము బాధ్యులు కాదు. మీ కృషిని కొనసాగించండి. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ⇒✉ 12:24, 26 జనవరి 2015 (UTC)
- కొంత పరిశోధన చేసిన తరువాతలింకుప్రకారం Module:Navbox లో Template ని తెలుగు పేరుబరిలోకి మార్చిన తరువాత పనిచేసింది. ఏమైనా ఇతర సమస్యలుంటే తెలపండి. --అర్జున (చర్చ) 12:28, 27 జనవరి 2015 (UTC)
- అర్జున గారికి, మీరు తీసుకున్న చొరవకు మరియు సమస్య పరిష్కారము జరిగినందులకు ముందుగా ధన్యవాదములు. ప్రస్తుతము మూసలు పనిచేస్తున్నాయి. ఏమైనా ఇతర సమస్యలుంటే తప్పకుండా తెలియజేస్తాను. మీ సహాయ సహకారములు మాకు ఎల్లప్పుడూ ఉండాలని మేమందరము కోరుకుంటున్నాము. JVRKPRASAD (చర్చ) 12:54, 27 జనవరి 2015 (UTC)
- అర్జునరావు గారికి మనఃపూర్వక ధన్యవాదాలు. మీరు లేని లోపం నాకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు త్వరలో మానసికంగా కోలుకొని తెలుగు వికీపీడియా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరుకొంటున్నాను.--Rajasekhar1961 (చర్చ) 13:13, 27 జనవరి 2015 (UTC)
- అర్జున గారికి, కోరిన వెంటనే సహాయపడినందుకు ధన్యవాదాలు. మీరు తెలియజేసిన దోషాన్ని కన్నడ వికీపీడియాలో కూడా సరిచేసితిని. అక్కడకూడా ప్రస్తుతం మూసలు ప్రస్తుతం పనిచేయుచున్నవి. మీ సహాయ సహకారములు మాకు ఎల్లప్పుడూ ఉండాలని మేమందరము కోరుకుంటున్నాము.-- కె.వెంకటరమణ⇒✉ 14:12, 27 జనవరి 2015 (UTC)
- JVRKPRASAD,Rajasekhar1961 మరియు కె.వెంకటరమణ ల స్పందనలు మరియు ఆదరాభిమానాలకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 08:13, 28 జనవరి 2015 (UTC)
- సమస్యను పరిష్కరించిన అర్జున గారికి ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 22:13, 31 జనవరి 2015 (UTC)
- JVRKPRASAD,Rajasekhar1961 మరియు కె.వెంకటరమణ ల స్పందనలు మరియు ఆదరాభిమానాలకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 08:13, 28 జనవరి 2015 (UTC)
- కొంత పరిశోధన చేసిన తరువాతలింకుప్రకారం Module:Navbox లో Template ని తెలుగు పేరుబరిలోకి మార్చిన తరువాత పనిచేసింది. ఏమైనా ఇతర సమస్యలుంటే తెలపండి. --అర్జున (చర్చ) 12:28, 27 జనవరి 2015 (UTC)
- ప్రసాద్ గారూ, navbox మూసలన్నీ పనిచేయడంలేదు. అది మీ తప్పిదంవల్ల కాదని తెలుస్తుంది. కన్నడ వికీలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అక్కడ కూడా navbox మూసలు పనిచేయడం లేదు. మూలాల మూసలు కొన్ని సరిచేసితిని. కానీ కొన్నిసార్లు error వచ్చి, మరికొన్ని సార్లు పనిచేయడం లేదు. అందువలన మనం చేయగలిగేదేమీ లేదని నా అభిప్రాయం. కొన్ని వికీలలో ఇలా వస్తుండటం వల్ల తరువాత సరిఅవుతాయని అనుకుంటున్నాను. ఈ మూసల దోషాలను మీరు ఎంతమాత్రము బాధ్యులు కాదు. మీ కృషిని కొనసాగించండి. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ⇒✉ 12:24, 26 జనవరి 2015 (UTC)
తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవ ఉత్సవాలకు ఆహ్వానము
[మార్చు]తెవికి మొదటి పుటలో ఆహ్వానము వున్నందున దీన్ని తొలిగించాను. ఎల్లంకి (చర్చ) 11:55, 27 జనవరి 2015 (UTC)
సి.ఐ.ఎస్ సహాయం కావాలి - తెలుగు సినిమా పత్రికలు
[మార్చు]Centre for the Study of Culture and Society (http://cscs.res.in/) వద్ద రూపవాణి వంటి పాత తెలుగు సినిమా పత్రికల భండాగారం ఉండేది. కానీ అది ఇప్పుడు బయటికి వారికి అందకుండా తీసేసినట్టున్నారు. ఇవి తెలుగు వికీజనాలకు అందుబాటులో ఉంచితే, సినిమా వ్యాసాలు అభివృద్ధిచేయవచ్చు --వైజాసత్య (చర్చ) 01:14, 27 జనవరి 2015 (UTC)
- వైజాసత్య గారు CSCS Web Archive తరలింపులో ఉన్నట్టుగా సమాచారం. దీనిపై మరింత సమాచారం అందగానే ఇక్కడ తెలియజేస్తాను. CSCS లో పాత తెలుగు సినిమాకు సంబందించిన archive build up చేయడంలో నా ప్రయాస కొంత ఉంది. ఆ archive ని offline లో కావాలి అంటే అందజేయగలను. తెలియజేయగలరు. --విష్ణు (చర్చ) 07:32, 28 జనవరి 2015 (UTC)
- నేను ఈ ఆర్కైవును, ముఖ్యంగా రూపవాణి పత్రికలను విస్తృతంగా ఉపయోగించుకొన్నాను. కానీ ఈ సంస్థ సి.ఐ.ఎస్ సంబంధిత సంస్థ అని మొన్నటి దాకా తెలియదు. ఈ అర్కైవు నిర్మాణంలో మీ పాత్ర కూడా ఉండటం ముదావాహం. ఆఫ్లైన్లో ఆర్కైవును కొందరు ఆసక్తి ఉన్న, క్రియాశీలక వికీపీడియన్లకు అందచేస్తే బావుంటుంది. మీ సహాయానికి కృతజ్ఞతలు --వైజాసత్య (చర్చ) 09:44, 28 జనవరి 2015 (UTC)
- మనకు ఈ సమాచారం తెలుగు సినిమా వ్యాసాల అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. దయచేసి వైజాసత్య గారికి, నాకు ఆఫ్ లైన్లో అందజేయగలిగితే మేము వాటికి ఎలా ఉపయోగించాలో ఆలోచించి వీలుంటే తెలుగు సినిమా ప్రాజెక్టు ద్వారా, మరియు వికీసోర్స్ ద్వారా దానిని అందరికీ అందుబాటులోకి తెస్తాము.--Rajasekhar1961 (చర్చ) 12:22, 28 జనవరి 2015 (UTC)
- నేను ఈ ఆర్కైవును, ముఖ్యంగా రూపవాణి పత్రికలను విస్తృతంగా ఉపయోగించుకొన్నాను. కానీ ఈ సంస్థ సి.ఐ.ఎస్ సంబంధిత సంస్థ అని మొన్నటి దాకా తెలియదు. ఈ అర్కైవు నిర్మాణంలో మీ పాత్ర కూడా ఉండటం ముదావాహం. ఆఫ్లైన్లో ఆర్కైవును కొందరు ఆసక్తి ఉన్న, క్రియాశీలక వికీపీడియన్లకు అందచేస్తే బావుంటుంది. మీ సహాయానికి కృతజ్ఞతలు --వైజాసత్య (చర్చ) 09:44, 28 జనవరి 2015 (UTC)
తెవికీ 11వ వార్షికోత్సవాల బడ్జెట్ సి.ఐ.ఎస్ కొరకు
[మార్చు]వికీ వాడుకరులకు నమస్కారము.
ఫిబ్రవరి 14, 15 తేదీల్లో తిరుపతి లో తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవాలు నిర్వహించడానికి తెలుగు వికీపీడియా 11వ వార్షిక కార్యనిర్వాహకవర్గం నిర్ణయించిన విషయం మీ అందరికి తెలిసిందే. దానికోసం వికీమీడియా ఫౌండేషన్, సిఐఎస్ ఎ2కె వారిని గ్రాంటులకై సంప్రదించాము. సమావేశానికి తక్కువ వ్యవధి ఉన్నందువల్ల వికీమీడియా ఫౌండేషన్ వారి వద్ద నుండి గ్రాంట్ రాదని తెలిసింది. కనుక, సి.ఐ.ఎస్ నుండి వచ్చే గ్రాంట్ తో సమావేశం జరపాలని నిర్ణయించడం జరిగింది.
బడ్జెట్ పేజి కొరకు ఇక్కడ చూడగలరు.
రేపు (29. 01. 2015) సాయంత్రం లోపు సలహాలు, సూచనలు అందించగలరు. 30. 01. 2015 ఉదయం సి.ఐ.ఎస్ వారి మెటా పేజీ లో రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. సభ్యులు సహకరించగలరు. --Pranayraj1985 (చర్చ) 10:02, 28 జనవరి 2015 (UTC)
- వికీ పురస్కారాలు ముందు మనం 10 మందికి అందజేశాము. అప్పుడు దశాబ్దం కాలంలో పనిచేసిన అందర్నీ పరిగణలోకి తీసుకున్నాము. ఇప్పుడు ఒక సంవత్సరం కాలం (అనగా 2014 మాత్రమే) పరిగణలోకి తీసుకొందామని చర్చించాము. అయితే ఇందులో చాలాకాలం నుండి పనిచేస్తున్నవారికే ఈ పురస్కారం లభించే అవకాశం ఉన్నది. ఇంక కొత్తవారిని సన్మానించుకొనే అవకాశం ఉండదు. అందువలన విజేతలను 10 మందిగానే ఉంచి, ఫండింగ్ చాలకపోతే ఒక్కొక్క వ్యక్తికి ఇచ్చే బహుమానాన్ని తగ్గించి పాతవారిని మరియు కొత్తవారిని కూడా సత్కరించుకొనే అవకాశాన్ని మనకు అందిస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 12:28, 28 జనవరి 2015 (UTC)
- తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాల కొరకు CIS కు బడ్జెట్ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ మీ మద్దతు తెలియచేయగలరు..--విశ్వనాధ్ (చర్చ) 08:33, 29 జనవరి 2015 (UTC)
- తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాల కొరకు CIS కు SWAG s కొరకు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. వాటి కొరకు ఇక్కడ మీ మద్దతు తెలియచేయగలరు..--విశ్వనాధ్ (చర్చ) 14:10, 8 ఫిబ్రవరి 2015 (UTC)
తెవికీ క్రియాశీలత 2009-2014
[మార్చు]తెవికీ సంవత్సరాంత గణాంకాలు పరిశీలించినతరువాత గత సంవత్సరంలో పేజీ అభ్యర్ధనలు, ముఖ్యంగా సభ్యుల క్రియాశీలత గణనీయంగా పెరిగింది. దీనికి సంబంధించిన వివరాలు, పటాలు నా ఈ నాటి తెలుగినక్స్ బ్లాగుపోస్టులో చూడవచ్చు. దీనికి కృషిచేసిన వారందరికి మరియు సహాయపడిన సిఐఎస్ మరియు వికీమీడియా ఫౌండేషన్ కు ధన్యవాదాలు.తెవికీలోటుపాట్లని సర్వేలు మరియు గణాంకాలసహాయంతో మరింతగా విశ్లేషించి భవిష్యత్ కార్యక్రమాలు చేపట్టితే బాగుంటుంది. దీనికి ఎవరైనా ముందుకువస్తే నాకు వీలైనంతలో సహాయపడగలను. --అర్జున (చర్చ) 12:42, 28 జనవరి 2015 (UTC)
- మీరు గతంలో చేసిన వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు(నావరకూ నాకు) చాలా ఉత్సాహకరంగా సాగింది. అటువంటిదేదైనా మీరు ప్లాన్ చేయగలరా? ప్రస్తుతానికి మూలాలను అభివృద్ధి చేసేందుకు ఏదైనా కాన్సెప్టు తయారుచేస్తే బావుంటుందని నా వ్యక్తిగతాభిప్రాయం.--పవన్ సంతోష్ (చర్చ) 15:33, 28 జనవరి 2015 (UTC)
- తెలుగు వికీపీడియా లో పనిచేస్తున్న చురుకైన సభ్యులందరి కృషి ఫలితమే ఈ అభివృద్ది. ఇందులో భాగస్వాములైన తోటి వికీపీడియన్లకు, సిఐఎస్ మరియు వికీమీడియా ఫౌండేషన్ వారందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. 2015 సంవత్సరంలో కూడా మనమందరం కలసికట్టుగా పనిచేసి మరింత ముందుకు సాగాలని నా అభిలాష.--Rajasekhar1961 (చర్చ) 09:29, 29 జనవరి 2015 (UTC)
- ఈ విశ్లేషణకు ధన్యవాదాలు అర్జునగారు. ఇక ముందు కూడా మన తెవికీ ప్రగతి శతదా, సహస్రదా వృధ్ధి చెందాలని ఆశిస్తూ... భవిష్యత్ కార్యాచరణలో ఇంకా మెరుగ్గా కలసికట్టుగా తోడ్పడి తెవికిని వాసి-రాసి పరంగా మెరుగు పరుద్దాం.--విష్ణు (చర్చ) 19:59, 29 జనవరి 2015 (UTC)
- తెలుగు వికీపీడియా లో పనిచేస్తున్న చురుకైన సభ్యులందరి కృషి ఫలితమే ఈ అభివృద్ది. ఇందులో భాగస్వాములైన తోటి వికీపీడియన్లకు, సిఐఎస్ మరియు వికీమీడియా ఫౌండేషన్ వారందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. 2015 సంవత్సరంలో కూడా మనమందరం కలసికట్టుగా పనిచేసి మరింత ముందుకు సాగాలని నా అభిలాష.--Rajasekhar1961 (చర్చ) 09:29, 29 జనవరి 2015 (UTC)
- ధన్యవాదాలు అర్జునగారు.నేను మీరు చేయబోయే భవిష్యత్ కార్యక్రమాలలో ఎప్పటి లాగానే కియాశీలంగా ఉండగలను , తెవికి లోనికి లాభాపేక్ష లేని కొత్త వారు రావలసిన అవసరం ఉన్నది . వికీ మూల స్థంబాల గురించి మరింత ప్రచారం చేయవలసిన అవసరం వున్నది ----కశ్యప్ (చర్చ) 01:58, 30 జనవరి 2015 (UTC)