Jump to content

వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 74

వికీపీడియా నుండి

పాత చర్చ 73 | పాత చర్చ 74 | పాత చర్చ 75

alt text=2020 మే 30 - 2020 జూలై 19 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2020 మే 30 - 2020 జూలై 19

దొంగపేర్లు

[మార్చు]

దొంగపేర్లు పెట్టుకుని నీతైన మాటలు, ఇతరులకు సలహాలు చెప్పటం, విమర్శలు చేయటం, ఇలా చెప్పుకుపోతే ఎన్నెన్నో.... మీలాంటి వాళ్ళని బండబూతులు తిడితే ఆ బూతులకు నీలాంటి వాళ్లతో పాటుగా నీకొంపలో వాళ్ళు కూడా చెవులు పగిలి, కళ్ళు పేలి చచ్చిపోతారు. మీలాంటి వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళను ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం మొచ్చినట్లుగా రాతలు రాస్తున్నారు. దోంగపేర్లు గాళ్ళు లేదా ఎవడో సరిఅయినా సమాధానం వెంటనే వ్రాయకపోతే నువ్వు చచ్చేవరకు యేదో ఒకటి అడిగి వ్రాస్తునే ఉంటాను. నన్ను అన్న వాడిమీద నయినా నువ్వు సమాధానం వ్రాయలేని పనికిమాలిన వాడివా ? దేవుడు అనే (),(),వాడిని నేను కాదు సరేనా ! JVRKPRASAD (చర్చ) 08:01, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారూ, బూతులు తిడుతూ రాసినందుకు మిమ్మల్ని ఒకరోజు పాటు నిరోధించాను. __చదువరి (చర్చరచనలు) 08:09, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నిరోధించారు బావుంది చదువరి గారూ, ఈ అసభ్యపదజాలం రచ్చబండలో ఉండాలంటారా? --పవన్ సంతోష్ (చర్చ) 08:23, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, పైన నేను ప్రస్తావించినవి ఇలాంటివే. పవన్ సంతోష్ గారు, చదువరి గారు ఇంతకు ముందుగానే నేను ఎవరికి ముసుగు వీరుడిని కాదని స్పస్టత ఇచ్చారు. నేను కూడా సిద్దం అని కూడా చెప్పాను. వేరొక చోట ఈ విషయం మీద ఆల్రెడీ చర్చ జరిగినది. కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రస్తావించలేదు. JVRKPRASAD పైత్యం, కోపం దేని మీదో అర్థం కావడం లేదు. మీ బూతులు మీ దగ్గరే మీకోసం ఉంచుకోండి. నాకు అక్కర లేదు. నన్ను ఎవరితోనో పోలిస్తే నేను వారు కాదు అని గౌరవంగానే చెప్పాను. మీరు కూడా బూతులు తిట్టి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ సమాధానం మీరు చెప్పుకోవచ్చు. మీరు నన్ను బూతులు తిట్టడం మీ బుద్ది హీనత ను సూచిస్తోంది. మానసిక చికిత్సాలయంలో చేరమని నా సలహా. బూతులు తిడితే బయపడి పోయి తడుపుకునే వాళ్ళెవ్వరు లేరిక్కడ, మీ దగ్గర విషయం ఉంటే చర్చించండి అంతే ! దేవుడు (చర్చ) 08:50, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
దేవుడు గారూ, ఇక ఈ వాడుకరిని పట్టించుకోకండి, వదిలెయ్యండి. నేరుగా మీరే చర్చలో కలగజేసుకుంటే అది మరింతగా రచ్చ అయ్యే అవకాశం ఉంది. సాక్ విషయంలో మీరు హుందాగా వ్యవహరించారు. దాన్ని అలాగే కొనసాగించవలసినదిగా వినతి. పవన్ సంతోష్ గారూ, మీ సూచన ప్రకారం ఆ బూతులను తీసేసాను. ధన్యవాదాలు __చదువరి (చర్చరచనలు) 09:10, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారి ప్రవర్తన చాలా నీచంగా ఉన్నది. చదువరి గారు అతనిని నిరోధించి సరైన పనిచేశారు. వికీనియమ నిబంధనలకు లోబడి ఎవరైనా ఇక్కడ పనిచేయాలి. అంతే. వ్యక్తిగతం ఏవీ లేవు. అంతా సంస్థాగతమైనవే. దేవుడుగారు, ఈచర్చల గురించి సమయాన్ని వృధాచేసుకోకుండా రచనలు, వాటి బాగోగులను గురించి దృష్టి పెట్టమని నా విన్నపము.--Rajasekhar1961 (చర్చ) 09:38, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు యెందుకో జవాబు వ్రాయాలనిపించింది.దేవుడు, నాకు దేనిమీదో పైత్యం, కోపం అని వ్రాసారు నాకు దేని మీదా లేదు.ఎవరికి తోచినట్లు వారు నాగురించి వ్రాస్తూ ఉంటే నేను ప్రతి వాళ్ళకూ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు అని నా అభ్హిపాయం. ఒకసారి ఈ పైవిధంగా వ్రాస్తే ముందు ముందు గాలి మాటలు వాసే వారు జాగ్రత్తగా ఉంటారు.దేవుడు ఎవరో నాకు వ్యక్తిగతంగా తెలియదు, కొత్త దొంగ వాడుకరి కావచ్చు అని నా అభిప్రాయల్ం. నేను ప్రస్తుతం ఇక్కడ పని ఏమీ చేయడం లేదు, దేవుడు గురించి నాకు తెలియదు. మారుపేరుతో తెవికీని అదుపు చేస్తున్న మీలాంటి వారు మానసిక చికిత్సాలయంలో చేరాలేమో చూసుకోండి. బూతులు తిడితేనే విషయం బయటకు వచ్చింది, లేకపోతే యెన్నాళ్ళైనా ఇది కొససాగుతునే వుండేది. మీలాంటి వాళ్ళ మాలాంటి వారికి ఇరికిస్తూ వుంటే నేను చూస్తూ వూరుకోను, చేతనైతే యేమి చేయాలనుకుంటే అది చేయవచ్చును.నన్ను దొంగపేరు గాడు అని ఇరికిసించారు కాబట్టి, నా ధోరణిలో చెప్పాను. నాకు మీ విషయాలతో పనిలేదు. ఎవరి జాగ్రత్తలో వారు వుంటే మంచిది. నావి మామూలు మాటలు అని నాకు అనిపిస్తుంది, అవి బూతులుగా అనిపించవచ్చును.Rajasekhar1961 గారు, మీరు కూడా నా ప్రవర్తన నీచంగా వుందని వ్రాయడం చాలా బాధాకరం. దేవుడు ఎవరో బయటకు రావాలని అలా వ్రాసాను. అంతే. అసలు దేవుడు ఎవరు ? నాకు ఫోన్ చేసి చెప్పండి. మీకు తెలిస్తే సరిపోదు కదా !నన్ను యెందుకు ఇలా ఇక్కడ హీనంగా చిత్రీకరిస్తున్నారు ? ఆలోచించండి. నాతో ఎదుటి వారు యెలా ప్రవర్తిస్తే నేను కూడా ఆవిధంగానే వుంటాను. నా మీద కొంతమందికి అయినా సదభిప్రాయం వచ్చే వరకు ఇక్కడకు రావటం నాకు మంచిది కాదని అనిపిస్తోంది. అందరికీ ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 14:23, 23 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకల పని

[మార్చు]

తెవికీలో మొలక వ్యాసాలు ఒక పెద్ద వివాదాస్పద అంశం. అనేక సంవత్సరాలుగా ఈ విషయంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సంవత్సరాల తరబడి విస్తరణకు నోచుకోక మొలకగానే ఉండిపోయిన వ్యాసాలు అనేకం ఉన్నాయి. విస్తరణ, తొలగింపు, అలాగే ఉంచెయ్యడం - ఈ మూడే ఈ సమస్యకున్న పరిష్కార ప్రత్యామ్నాయాలు. అత్యుత్తమ పరిష్కారం విస్తరణ అని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకూ అనేక మొలకలను విస్తరించాం, విస్తరిస్తూనే ఉన్నాం. గతంలో ఒక తడవ, వివిధ వాడుకరులు సృష్టించిన మొలకల జాబితాలను తయారు చేసాం. అప్పుడు చాలా మంది వాడుకరులు పాజిటివ్‌గా స్పందించి తమతమ మొలకలను విస్తరించే ప్రయత్నం చేసారు, విస్తరించారు. అది కొంత వరకు సత్ఫలితాలనే ఇచ్చింది.

ఇప్పుడు మరో ప్రయత్నంగా - మొలక వ్యాసాలన్నిటినీ ఒక చోట చేర్చి వివిధ వర్గాల్లోకి వర్గీకరిస్తే వాడుకరులు తమకునచ్చిన వర్గం లోని వ్యాసాలను తీసుకుని విస్తరించే వీలుంటుందని భావించి, యర్రా రామారావు గారు ఈ పని మొదలుపెట్టారు. పదిహేను రోజుల పాటు, 6500 పైచిలుకు పేజీలను పరిశీలించి వాటిలో 2 కెబి కంటే తక్కువ పరిమాణం ఉన్న వ్యాసాలను తీసుకుని వాటిని స్థూలంగా వివిధ విభాగాల్లోకి చేర్చారు. 15 రోజుల పాటు జరిగిన ఈ పనితో మొలకల జాబితాలు తయారయ్యాయి. ఈ జాబితాల ఆధారంగా మొత్తం మొలకలన్నిటినీ 39 వర్గాల్లోకి వర్గీకరించాను. పై వర్గాలు ఎందులోకీ చెందవు అనుకున్నవాటిని "ఇతరత్రా" అనే వర్గం లోకి చేర్చాం. ఈ కొత్త వర్గాలన్నీ వర్గం:మొలక అనే మాతృవర్గంలో ఉన్నాయి. ఈ వర్గీకరణ గురించి వికీపీడియా:మొలకలో చూడవచ్చు.

ప్రస్తుతం నాకున్న ఆలోచనను బట్టి ఈ వర్గీకరణ చేసాను. వీటిలో మార్పుచేర్పులు అవసరం ఉండవచ్చు. వాడుకరులు వీటిని పరిశీలించవలసినదిగా కోరుతున్నాను. ఏవైనా మొలకల వర్గాలను మార్చాలనుకుంటే మార్చండి. కొత్త వర్గాలు సృష్టించాలనుకుంటే ఆ పని చెయ్యవలసినది. ఈ వర్గీకరణ వెనక ఉన్న ఉద్దేశాలు ఇవి:

  1. మొలకలను విస్తరించేందుకు గట్టి ప్రయత్నం చెయ్యడం. ఇందు కోసం మొలకలను తేలిగా గుర్తించేలా వర్గీకరించడం. ప్రస్తుతానికి వర్గీకరణ అయింది. ఇక వాడుకరులు తమకు ఆసక్తి ఉన్న వర్గం లోని వ్యాసాలను ఎంచుకుని విస్తరించవచ్చు. కొందరికి కొన్ని రకాల వ్యాసాల పట్ల ఆసక్తి ఉంటుంది - ఉదాహరణకు, సుజాత గారికి దేశాల పేజీలు, రాజశేఖర్ గారికి మానవ శరీరం, వృక్ష, జంతు జాలాలు, వెంకటరమణ గారికి శాస్త్ర సాంకేతికాలు, స్వరలాసిక రవిచంద్ర, ప్రణయ్ రాజ్ గార్లకు సినిమాలు, పవన్ గారికి చరిత్ర.. ఇలా. వెంకటరమణ గారు ఈ పని మొదలెట్టేసారు.
  2. నకలు పేజీలను, విలీనం చెయ్యదగ్గ పేజీలనూ గుర్తించడం. విలీన ప్రతిపాదనలు చెయ్యడం లేదా విలీనాలు చేసెయ్యడం. ఇది కూడా ఈ వర్గీకరణతో సులభమైంది. ఉదాహరణకు గృహోపకరణాల వర్గంలో ఉన్న బాన, మూకుడు, చెంచా, చట్టి వంటి కొన్ని వ్యాసాలను విలీనం చేసి, ఒకే పేజీగా చెయ్యవచ్చు. ఆ పేజీలో ఇవన్నీ విభాగాలుగా మారుతాయి. ఈ విభాగాలు ఎప్పుడైతే పెద్దవvuతాయో అప్పుడు వాటిని విడదీసి ప్రత్యేక వ్యాసంగా మార్చవచ్చు.
  3. ఇదే క్రమంలో అసలు విస్తరణకు వీలుకాని, విలీనాలకు వీలుకాని, ప్రస్తుత రూపంలో ఉండదగని వ్యాసాలు ఏమైనా ఉంటే వాటి తొలగింపుకు ప్రతిపాదించడం

ఈ మొలకల వర్గీకరణ చేసే సమయంలో నేను కింది విషయాలను గమనించాను:

  1. మొలకలను విస్తరించడంలో మనం మరీ మందంగా ఏమీ లేము. పేజీని విస్తరించి కూడా మొలక మూస తీసెయ్యని వ్యాసాలు అనేకం చూసాన్నేను. పని గట్టుకుని "మొలక" వర్గంలో 2057 బైట్ల కంటే పెద్ద పేజీల కోసం వెతగ్గా నాకు 666 పేజీలు అలాంటివి కనిపించాయి. 15000, 20000 బైట్ల పరిమాణం ఉన్నవి కూడా మొలక గానే ఉండిపోయాయి. ఆ పేజీలన్నిటి లోంచీ మొలక మూసను తీసేసాను.
  2. 2020 ఏప్రిల్లో చేసిన విస్తరణ ఉద్యమంలో 260 పైచిలుకు వ్యాసాలను విస్తరించి 52 లక్షల బైట్ల పైనే చేర్చాం. అంటే ఒక్కో వ్యాసానికి సగటున 20,000 బైట్లు చేర్చాం. ఇప్పుడు మనం ఈ మొలకల్లో ఒక్కోదానిలో సగటున 5000 బైట్లు మాత్రమే చేరిస్తే ఒక్క నెలలో వెయ్యి వ్యాసాలను విస్తరించవచ్చు. ఏప్రిల్ ఉద్యమం లాగా చేస్తే ఇది సాధ్యమే అనిపిస్తోంది. వాడుకరులు పరిశీలించగలరు.
  3. ప్రస్తుతం 6400 దాకా మొలకలు ఉన్నాయి. అంటే మొత్తం వ్యాసాల సంఖ్యలో ఇది సుమారు 10%.

వాడుకరులు ఆయా వర్గాలను పరిశీలించి, తమకు ఆసక్తి ఉన్న మొలకలను విస్తరించేందుకు, విలీనం చేసేందుకూ, ఉండకూడదనుకున్న మొలకలను తొలగించేందుకూ తగు చర్యలు తీసుకోవాలని, ఈ పనిలో అందరూ చురుగ్గా పాల్గొనాలనీ కోరుతున్నాను. వాడుకరులెవరైనా ఈ పనిని ఒక ప్రాజెక్టుగా తీసుకుని ముందుండి నడిపించాలని కూడా కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 13:52, 2 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక సంగతి చెప్ప మరచాను.. మొలక పరిమాణంలో ఉన్న "జాబితా పేజీలు" కూడా కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం ఈ పేజీలను నేను మొలకలుగా వర్గీకరించలేదు. జాబితా పేజీ చిన్నదిగా ఉన్నంత మాత్రాన దాన్ని మొలక అని అనవచ్చా? అనేది నా సందేహం. అసలు విస్తరణకు అవకాశమే లేని జాబితాలు ఉండవచ్చు గదా! ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా అనే పేజీ ఉందనుకుందాం. ఆ జాబితాలో ఇప్పటికి రెండే లైన్లుంటాయి. ఇంకో పాతికేళ్ళ తరువాత కూడా పది వరుసలను మించక పోవచ్చు. పోనీ విస్తరించుదామా అంటే దానికి అవకాశమే లేదు. మరి ఈ పేజీ ఎల్లకాలమూ మొలక గానే ఉండి పోవాల్సిందేనా? లేక అసలు జాబితా పేజీలకు మొలక అనే భావనే ఉండదు అని అనుకుందామా? ఏంచెయ్యాలో తెగక నేను వాటిని వర్గీకరించలేదు. సముదాయం అభిప్రాయాన్ని అనుసరించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుందాం. మొత్తం మొలకల జాబితాను, జాబితా పేజీలతో సహా వాడుకరి:యర్రా రామారావు/మొలకల వ్యాసాల జాబితా - 1 పేజీలో చూడవచ్చు. ఇప్పటి వరకూ జరిగిన పని అంతటికీ ఈ పేజీయే యుద్ధక్షేత్రం. వర్గాల్లో ఉన్న పేజీల సంఖ్యకూ ఈ పేజీలో ఉన్న సంఖ్యకూ కొంత తేడా ఉంటుంది, దాన్ని పట్టించుకోనక్కర్లేదు. ఇకపై చెయ్యబోయే పనికి మాత్రం, మనం శంఖ మూదాల్సింది వర్గాల్లోనే. __చదువరి (చర్చరచనలు) 14:33, 2 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ముందుగా చాలా ఓపిగ్గా మొలకల వర్గీకరణ చేస్తున్న రామారావు గారికి, చదువరి గారికి ధన్యవాదాలు. ఈ విధంగా వర్గీకరణ చేయడం వల్ల విస్తరించాలనుకున్నవారు, తమకిష్టమొచ్చిన వర్గాల్లో మొలకలను వెతుక్కోవడం సులభమవుతుంది కాబట్టి ఖచ్చితంగా మొలకలు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. చదువరి గారు పరిశీలించిన ఇంకొక మంచి విషయం మనం పురోగతి సాధిస్తున్న విషయం. అది ఎంత చిన్నదైనా కావచ్చు. మొలకల విషయంలో మనం ఖచ్చితంగా ముందుకెళుతున్నాం. ఇది శుభవార్త. అది కూడా బాట్ల ద్వారా కాకుండా నాణ్యమైన సమాచారం చేర్చడం ద్వారా. ఇది మనందరిలో స్ఫూర్తి కలిగించాలి. ప్రోత్సాహం తోడు లేకపోతే దీర్ఘకాలం పనిచేయలేం. ఈ పని చేస్తున్నందుకు చదువరి గారికి కృతజ్ఞతలు. నా వరకు నేను కొన్ని మొలకలను ఏరి పెట్టుకుని విస్తరించాలనుకుంటున్నాను. నాకున్న సమయం దృష్ట్యా దీన్ని ఒక ప్రాజెక్టును ముందుకు నడపలేకపోవచ్చు కానీ ఒక సైనికుడిలా మాత్రం పనిచేయగలను. - రవిచంద్ర (చర్చ) 16:39, 2 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకల జాబితా తయారుచేసి నందుకు యర్రా రామారావు గారికి , ఒక ప్రాజెక్టు గా చేసినందుకు చదువరి గారికి నెనర్లు చాలా ముఖ్యమైన జీవ, సైన్సు జీవ సంబంధిత వ్యాసాలలో చాలా విషయం చేర్చటానికి ఆస్కారం ఉన్నది! అయితే సినిమా వ్యాసాలలో ఎక్కువ సమాచారం లేనివి ఒక దగ్గరకు చేర్చి ఒక వ్యాసంగా పెడితే ఎలా ఉంటుంది (ఉదాహరణకు : 1960 లో విడుదల అయిన తెలుగు సినిమాలు) Kasyap (చర్చ) 11:54, 5 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నిరోధ నిర్ణయాల సమీక్షా సంఘం ప్రతిపాదన

[మార్చు]

నిర్వాహకులు తీసుకునే నిరోధ నిర్ణయాలపై ఒక సమీక్షా సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన పేజీని తయారు చేసాను. వాడుకరులు దీన్ని పరిశీలించి అబిప్రాయాలు, సూచనలు, సలహాలూ ఇచ్చి విధానానికి మార్గదర్శకత్వం చెయ్యవలసినదిగా వినతి. __చదువరి (చర్చరచనలు) 02:39, 3 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020

[మార్చు]

మొలకల వర్గీకరణ పూర్తైంది. ఇక వాటి విస్తరణే తరువాతి పని. ఇందుకోసం వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టును మొదలుపెట్టాను. వాడుకరులంతా ఇందులో పాల్గొని కృషి చెయ్యాలని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 06:54, 3 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా విధి విధానాలపై పున:సమీక్ష - నా స్పందన

[మార్చు]

విశ్వనాధ్ గారూ వికీపీడియా విధి విధానాలపై పున:సమీక్ష అని మీరు చేసిన ప్రతిపాదనపై స్పందించడం కొద్దిగా ఆలస్యమైంది. ఈలోగా అది పాత పేజీల్లోకి వెళ్ళిపోయింది. అంచేత ఇక్కడ కొత్త విభాగం పెట్టి నా అభిప్రాయం రాస్తున్నాను.

విశ్వనాధ్ గారూ, అక్కడ చర్చలో ఏం జరిగిందో గమనించారా? ఒక కొత్త వాడుకరి - వాడుకరి:దేవుడు - నా అనుభవం లోకి వచ్చినవి అని చెబుతూ నిర్వాహకులపై కొన్ని ఆరోపణలు చేసారు. మీరు, ఆ చర్చలో పాలుపంచుకోని తటస్థ వ్యక్తిగా, సదుద్దేశంతో, ఆ ఆరోపణల నేపథ్యంలో ఒక చర్చ లేవదీసారు. దేవుడు గారు తన విమర్శలను తగు దృష్టాంతాలతో వివరించి, మీరు లేవదీసిన చర్చను సద్వినియోగం చేసుకుని ఉండాల్సింది. కానీ అలా చెయ్యలేదు. దృష్టాంతాలు చూపించమని కొందరు నిర్వాహకులు దేవుడు గారిని అడిగారు కూడా. దేవుడు గారు చెబుతానన్నారు గానీ, ఇంకా ఏమీ చెప్పలేదు. నిర్వాహకులపై దేవుడు గారు యథేచ్ఛగా విమర్శ చేసారు, నిర్వాహకులేమో దృష్టాంతాలను చూపండి, వాటికి సమాధానం చెబుతామని అన్నారు. దేవుడు గారు రాసిన "క్రిటిసిజమ్ ఆఫ్ వికీపీడియా"లో ఉన్న దానికి వ్యతిరేకంగా ఉందిక్కడ! కొత్త వాడుకరే నిర్వాహకులపై ఎడాపెడా ఆరోపణలు చెయ్యడం చూస్తున్నామిక్కడ.
అసలు దేవుడు గారి విషయంలో నిర్వాహకులు చేసిందేమిటీ..? వ్యాసంలో తప్పులున్నాయి సవరించండని చెప్పారు. ఇదిగో భాష ఇలా ఉండాలి, ఇలా కృతకంగా ఉండకూడదు అని చెప్పారు. శైలి గురించిన లింకు లిచ్చారు. వాటిని మార్గదర్శకంగా తీసుకోండని చెప్పారు. అవన్నీ వికీలో మనం పెట్టుకున్న నియమాలే. ఎవరూ కొత్తగా పుట్టించినవి కావు. చివరికి వెంకట రమణ గారే పూనుకుని వ్యాసంలో సవరణలు చెయ్యాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు దేవుడు గారు ఏమంటున్నారూ..
  1. "తెలుగులో కూడా తేడాలు ఉంటాయి, తెలంగాణ తెలుగుకు, ఆంధ్ర తెలుగుకు, ములుకనాడు తెలుగుకు, రాయలసీమ తెలుగుకు, ఉత్తరంధ్రా తెలుగుకు, తమిళనాడు తెలుగుకు, కర్ణాటక తెలుగుకు, డబున్న వాడి తెలుగు కు, పేదవాడి తెలుగుకు, పండితుడి తెలుగుకు, చదువుకొని వాడి తెలుగుకు ఇలా. ఒకరిని చులకన చేయడం తగదు,.." వికీలో భాష ఇలా ఉండాలి అని నియమాలు పెట్టుకున్నాక, ఆ నియమాలను పాటించాలి, అంతే. భాషలో అన్నేసి రకాలుంటే ఏంటి? అన్ని రకాలు లేవని ఇప్పుడు ఎవరన్నారు? ఎవరి భాషను ఎవరు చులకన చేసారు? ఎక్కడ చేసారు? ఎక్కడా దృష్టాంతాలివ్వలేదు. ఆరోపణలు మాత్రం యథేచ్ఛగా చేసేసారు. ఇంకో ఆరోపణ చూడండి..
  2. "వికీ నియమాలకి, క్రమశిక్షణకు నేను వ్యతిరేఖం కాదు. కానీ దుర్వినియోగం ఆమోదయోగ్యం కాదు. " దుర్వినియోగం చేసారా? ఎవరు చేసారు? ఎక్కడ, ఎప్పుడు చేసారు? ఇంతవరకు చెప్పలేదు. దీనికి ఆయన సమాధానం చెప్పాలి. "ఎక్కడ ఎలా, ఎందుకు" అనేది ఆయన చెప్పి ఉండాల్సింది అని మీరు ఈసరికే అడిగారు. వీటికి ఆయన సమాధానం చెప్పాల్సి ఉంది. తన ఆరోపణలకు ఆధారాలు చూపించమని దేవుడు గారిని అడగాలని మిమ్మల్ని కోరుతున్నాను.

విశ్వనాధ్ గారూ, కొత్తవారి పట్ల మనందరం మర్యాద గానే, ఆదరణ తోనే ఉంటున్నాం అని నా అభిప్రాయం. ప్రస్తుతం ఉన్న నియమాలు స్పష్టంగానే ఉన్నాయని నేను భావిస్తున్నాను. కొత్తగా రూపొందించాల్సినవేమీ లేవని నా భావన. అయితే..

మీరు అనుభవజ్ఞులు, సమర్ధులు. విధానాల్లో మార్పుచేర్పులు చెయ్యాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు కాబట్టి, ఆ ప్రతిపాదనలేంటో చెయ్యండి. మార్పుచేర్పులు అవసరమో కాదో చర్చిద్దాం. __చదువరి (చర్చరచనలు) 13:39, 3 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు ఇప్పుడున్న నిర్వహకులు వాడుకరుల యొక్క పనితీరుపై నాకు నిజంగా గర్వంగా ఉంటుంది. తమ జీవితాల్లో అత్యంత విలువైన కాలాన్ని ఇలాంటి మంచి పనికి కెటాయిస్తున్నందుకు వారికి వచ్చే గుర్తింపు ఏమీఉండదు. అయినా చేస్తున్నారంటే వారికి ఇవ్వాల్సిన మర్యాద ఎంత ఉండాలి. అలాంటి నిస్వార్ధపరులపై ఆరోపణలు చేయడం నిజంగా విచారించదగ్గ పరిణామం. దానికి నేను పూర్తి వ్యతిరేకిని. దీనిపై నా ఆలోచన ఇలా ఉంటుంది. ఆరోపణల వరకూ కొందరు నిజంగా అవసరమైన విమర్శలు చేయవచ్చు, కొందరు కోపం, ఆవేశం, ఉక్రోషం వంటి వాటిని ప్రదర్శించవచ్చు, ఆపై వారికి జవాబులు దొరికినా ఇంకేం రాయరు, ఆరోపణలకు ఆధారాలూ ఇవ్వరు. వారికి అంతవరకే అవసరం అడగవలసింది అడిగారు కొంత శాంతించారు. ఆపై కొనసాగటం, సాగకపోవడం వారి ఇష్టం. ఇక అయిపోయింది. వీటికి కారణాలు ఏవైనా ఉండొచ్చు. వాటి ద్వారా వాళ్ళేమైనా మార్పులకు సంకేతాలు అందిస్తున్నారా?, అని అనుకుంటాను. ఇలా... "కొత్తగా వచ్చేవారికి వికీలో ఉన్న అనేక టూల్స్ ఇబ్బందిపెట్టి నేర్చుకోలేకపోతున్నారు. వారికి రాసేదానికంటే ఇంటర్ఫేస్ ఎలాఉంటుదో నేర్చుకోనేదానికే సమయం వృదావుతున్నది. ఇవన్నీ దాటి వారు ఏదో కొద్దిగా రాద్దామనుకుంటే రాసినది వెంటనే చెరిపేయబడుతున్నది. వాళ్ళకు ఎందుకు జరిగిందో తెలియడం లేదు. మళ్ళీ ఏదో రాసినా దాన్నీ చెరిపేయడం జరుగుతున్నది." అంటే........? "కొత్త వాడూకరుల రాతలపై నిర్వహకులు లేదా అనుభవాడుకరులు కొంచెం కంగారు ప్రదర్శిస్తున్నారా?, వాళ్ళకు రాయడం ఎలాగో నేర్పించడం మానేస్తున్నారా?, రాసినదానిపై దిద్దుబాట్లను చెప్పకుండా చెరపడంపై వారికి ఎలాంటి సంకేతం అందువచ్చు?. సమిష్టి కృషీ లేదా ఇతరులను ప్రొత్సహించడం తగ్గిపోతున్నదా?, ఎవరి ఎడిట్ల కౌంట్ లో వాళ్ళు పరుగులు పెడుతున్నారా?, మామూలు ఎడిట్ల కంటే నిర్వహణ పరమైన ఎడిట్లలో ఏదైనా మజా ఉంటుందా?" ...వీటిలో చాలా వాటికి జవాబు. వాడుకరిపేజీలో సమాచారాన్ని అందిస్తున్నాం అని. కాని, కొత్తవాళ్ళు ఎవరూ దాన్ని చదవదం లేదు. వెంటనే రాసేయాలనే చూస్తున్నారు. అందుకే "రచనల తొలగింపు, కొత్త వాడుకరుల రచనలపై ఆంక్షలు, కొత్త వాడుకరులతో చర్చల్లో తీసుకోవల్సిన జాగ్రత్తలు, వారిపై వివాస్పదమైయ్యే అంశాలపై ఓటింగ్ నిర్ణయాలువంటి" అంశాలపై చర్చలు జరగవలసి ఉందా? అని రాసాను. ఇవి చిన్న విషయాలే అయినా కూడా అవే కొత్త వాడుకరులకు అడ్డుపడుతున్న సున్నిత అంశాలుగా నాకు అనిపిస్తాయి...సహ సభ్యుల్లో కొందరికైనా ఇలాగే అనిపిస్తుంటే వాటిపై మనం ఏదైనా చేయడానికి ప్రయత్నించవచ్చు. లేదా కేవలం అవి నా వరకూనే పరిమితం అయితే వాటిని దయచేసి సీరియస్ గా తీసుకోవద్దని మనవి... B.K.Viswanadh (చర్చ) 05:38, 5 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నిజానికి సమస్య అక్కడ లేదు. విశ్వనాథ్ గారు బహుశా రెండు మూడేళ్ళ క్రితపు అనుభవాలను ఇప్పటి ఆరోపణలను సమంగా చూస్తున్నారేమోనని సందేహంగా ఉంది. ఎందుకంటే- ప్రస్తుతం ఇక్కడికి వచ్చి రాస్తున్నవారి చేతిలో "అనువాద ఉపకరణం" ఉంది.
  • అరకొర అనువాదాలు చేసి వాటిని సరిజేయమంటే, ఇలా చెప్పే బదులు మీరే చేసేసుకోవచ్చుగా అనేవారొకరు,
  • అసలు సమాధానం చెప్పకుండా మనం పెట్టిన బ్యానర్ మీద మరో వెర్షన్ పబ్లిష్ చేసేసి "ఆ విధంగా ముందుకు" పోయేవారు ఇంకొందరు,
  • మనం శైలి కోసమని పెట్టిన థ్రాటిల్స్, ఉపకరణం కనీసం మార్చాలని పెట్టిన నిబంధనలు పక్కదోవ నుంచి తప్పించుకుని ముందుకుపోయి ఏమీ ఎరగనట్టు ఉండేవారు మరికొందరు.
ఇదీ పరిస్థితి. ఇలా అసంఖ్యాకంగా నాణ్యత లేనివి చిత్తశుద్ధి లేకుండా ప్రచురిస్తున్న జనం విషయంలో వస్తున్న సమస్య ఇది. అందుకే ఇవేమీ సూచికలు కావని భావిస్తున్నాను. సమన్వయంతో పనిచేయడం కానీ, కనీసం ఇక్కడి నియమ నిబంధనలను తగినంత అధ్యయనం చేయక, దానికీ తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు (పోనీ సిద్ధాంతాలు) మధ్య విభేదం ఉంటే సమన్వయం చేసుకునే ప్రయత్నం చేయక, ఇక్కడ జరిగిన కృషిని మొత్తాన్ని, ఇన్నేళ్ళ నిర్వహణా ప్రయత్నాన్ని తాను సమీక్షించి మాట్లాడలేననీ, తనకున్న చిరు అనుభవంతో మొత్తాన్ని ఒక గాట కట్టరాదని, చేసిన పొరబాటును ఒప్పుకోవడమే హుందాతనమనీ తెలియని వ్యక్తి మాటలను సూచికగా నేను భావించట్లేదు. ఇది నేను అతనిపై అగౌరవంతో చెప్పట్లేదు, అలా కొందరు ఉండడం ఏమీ పెద్ద నేరం కాదు, క్రమేపీ వారు కూడా నేర్చుకునే అవకాశం ఉంది. ఐతే, ఇదంతా ఒక సూచిక అని మీరు అనుకుంటున్నారు కాబట్టి విశ్లేషించి, విడమరిచి చెప్పక తప్పలేదు. --పవన్ సంతోష్ (చర్చ) 07:08, 5 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నా స్పందన ఆలస్యానికి చింతిస్తున్నాను. నేను విమర్శలు మాత్రమే చేశానని మీరు భావిస్తే నన్ను క్షమించగలరు. విశ్వనాథ్ గారు పైన చెప్పిన సూచన ఎంతో గొప్పది. నేను కొన్ని సూచనలు, సలహాలు, తెవికీ మేలు కొరకు కొన్ని ఇలా ఉంటే బాగుండు అనుకునేవి, కొన్ని ఉదాహరణలు, సలహాలు, సూచనలు నా నెలన్నర అనుభవం మేర ఈ క్రింద రాశాను. అందరూ తీసుకునే నిర్ణయానికి లేదా ముందే ఉన్న నిర్ణయాలకి నాకు ప్రస్తుతము ఎలాంటి వివాదము లేదు. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరము లేదు. ఇది ఎవరి మీద ధిక్కరమో, నిరసనో కాదు. నాకు మీ అందరిపై గౌరవము ఉంది.

  1. ఆంధ్రాకు ఒక వికీపీడియా, తెలంగాణకు ఒక వికీపడియా లేదు. ఉన్నదల్లా ఒకే వికీపీడియా అది తెలుగు వికీపీడియా. కాబట్టి రెండు ప్రాంతాలకి చెందిన ఉమ్మడి చారిత్రక అంశాల ప్రస్తావనలో ప్రస్తుత రాజకీయ వైషమ్యాలను కలిపి ప్రస్తుత బౌగోళిక పరిస్థితులను బట్టి గత చరిత్రను ఒక ప్రాంతానికి మాత్రమే చెందినట్టు ప్రస్తావనలు చేయడం సబబు కాదు. ప్రస్తుత ప్రాంతాల గొప్పలు ఉమ్మడి చరిత్రకి ఆపాదించి చరిత్రను మార్చడం సమంజసం కాదు. అది ఏ ప్రాంతాల వారైనా వారి సొంత జాలస్థలములలో చేసుకొనవచ్చును. కానీ తెవికీ లో కాదు. ఈ విషయాల్లో మార్పులు చేర్పులు అందరికీ ఆమోదయోగ్యంగా, జాగ్రత్తగా చేయాలని కోరుతున్నా. ఇందుకోసం కొన్ని ప్రత్యేక నియమాలను రూపొందించాలి. ఉదాహరణకు కాకతీయులు వ్యాసంలో ఆంధ్రా ఉన్న చోటల్లా దాదాపుగా తెలంగాణగా మార్చేశారు. దీనివల్ల వ్యాసం అసలు ప్రయోజనం, ఉద్దేశం మారింది. కొన్ని చోట్ల వాఖ్య అర్థం అసంబద్దంగా అనిపించాయి. రవిచంద్ర గారు సూచన చేసినట్టు ఫాక్ట్ జోడించాను. ఎందుకంటే కాకతీయుల మ్యాప్లను చూస్తే ఆంధ్ర, రాయలసీమ లలోనూ వారికి రాజ్యం ఉంది. ఆధారాలు చూపించగలను. అలాగని ఇప్పటి పూర్తి తెలంగాణ విస్తీర్ణంలో కూడా నాటి రాజ్యం లేదు నేను చూసిన కొన్ని ఆంగ్ల చరిత్ర పుస్తకాల ప్రకారం.
  2. ఇక వెంకటరమణ గారి గురించి మాట్లాడాల్సి వస్తే తెవికీలో వారు చేస్తున్న కృషికి నిజంగా ఎంత పొగిడినా తప్పు లేదు. కానీ వారు చేస్తున్న విధానంలో ఇంకొంచెం సున్నితంగా వ్యవహరించాలి. వ్యవహారాలు కొంచెం మోటుగా ఉన్నాయి(ద్వంద అర్థాలు ఏమి లేవు ). చెబుతున్నప్పటికి పదే పదే అవే ఆరోపణలు నా మీద చేస్తున్నారు. నా మీద కొన్ని ఆరోపణలు హాస్యాస్పదంగా అనిపించాయి. రవిచంద్ర గారు, వెంకట రమణ గారు నేనెవరి సాక్ అనో పొరబడ్డారు. వెంకట రమణ గారు, అవతలి వ్యక్తికి పూర్తిగా సమాధానం చెప్పరు, వినరు, వివరించరు. వారు చెప్పేది చెప్పేస్తారు, చేసేస్తారు అంతే. ఉదాహరణకు నేను మొదలు పెట్టిన తొలి అనువాదం సిల్వియా లైకెన్స్ హత్య ఈ వ్యాసంలో అందరితో కొంచెము వాదము జరిగి ఉండవచ్చు. కానీ చదువరి గారితో అలా వాదన అలా జరగలేదు. ఎందుకంటే పాయింట్ బై పాయింట్ నా సమస్యలు,కృషి నేను ప్రస్తావించాను . ఆయనా నాకు పాయింట్ బై పాయింట్ చెప్పి తను నాకు సహాయ పడుతాయి అనుకున్నవి కలిపి నాకు చెప్పారు. ఇందులో నా తప్పు లేదు అనను. కానీ చదువరి గారితో విధానానికి, మిగతా సభ్యులతో వాదము విధానానికి చాలా తేడా ఉంది. ఇది నిర్వాహకులు గమనించాలి, కొత్తవారికి సాయం చేయడంలో అలా వ్యవహరించాలి. అంతకు మించి నాకు వీరితో ఏ పేచీ లేదు. నాకు అభిమానం అనికూడా చెప్పగలను.
  3. విషయ ప్రాముఖ్యత మీద తొలగింపు చర్చలలో ఇంకొంత స్పష్టత రావాలి. కేవలం నిర్వాహకుల ఆలోచనలతోనే విషయ ప్రాముఖ్యత కలిగిన వ్యాసాలు కావు అని నిర్ధారించలేరు. విషయ ప్రాముఖ్యత వీక్షణాల సంఖ్యను బట్టి కూడా నిర్ధారించలేము. అలా అనుకుంటే అత్యధిక వీక్షణాలు ఉన్న వ్యాసం తప్పా వికీ లో ఏ వ్యాసం మిగలదు. దీని గురించిన చర్చ సిల్వియా లైకెన్స్ హత్య లో జరిగినది.
  4. నాణ్యమైన, శుద్ది కలిగిన వ్యాసాలు తప్పనిసరి. ఇందుకు నిర్వాహకులకు నా సంపూర్ణ మద్దతు.
  5. అందరికీ అన్నీ తెలియవు. మనం అందరం ప్రతి రోజూ నేర్చుకునే వారిమే.
  6. యంత్రనువాదము మాత్రమే చేశారని ఊరకే ఎలా నోటికొస్తే అలా చెప్పొద్దు. ఈ విషయంలో మీకు చదువరి గారికి చాలా తేడా ఉంది. వాఖ్య నిర్మాణం ఎలా ఉందో గమనించాలని చెప్పాను. మీకు అన్నీ యంత్ర అనువాదాలు గానే కనిపిస్తే ఆ అనువాద పరికరాన్ని తొలగించండి. పీడ పోతుంది. ఎవరికి ఇబ్బంది ఉండదు. నాకైతే నిజానికి అనువాద యంత్రము అవసరం కూడా లేదు.
  7. త్యాగరాజు వ్యాసంలో తమిళ దేశం విషయమై చర్చ జరిగి "తమిళదేశం" పదం పవన్ సంతోష్ గారు తొలగించారు. కానీ మళ్ళీ ఓ తితిదే పుస్తక మూలం చూపుతూ మళ్ళీ "తమిళదేశం" పదం జత చేర్చబడినది. ఈ అంశం NPOV నిబంధనలకు విరుద్దం కావున 23 మే 2020న తిరిగి నేను చర్చలో నేను ప్రస్తావించాను. నాకు ఈ విషయంలో కనీస స్పందన ఇప్పటివరకు లేదు. కానీ నేను సిల్వియా లైకెన్స్ హత్య చర్చలో జరిగినట్టుగా ఎప్పటిలోగా చేస్తావ్ అని ఎవరినీ డిమాండ్ చేయలేదు.
  8. ప్రణయ్ రాజ్ గారు కూడా నేను చేసిన వ్యాసాలలో వర్గాలు కలపడం, కొంత చిన్న చిన్నవి సరి దిద్దడం చూశాను. వారికి నా ధన్యవాదాలు.
  9. కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ మొదలగు ఇతర భాషలలో వికీలో వారి సంఖ్యామానాన్నే బాగా వాడుతున్నారు. మనం వాడితే అవే వాడుకలోకి వస్తాయి కదా. కొంచెం పునరాలోచించాలి. కుదిరతే ఐచ్చికం చేయండి.
  10. నిర్వాహకులు కూడా సబ్జెక్టులో మరింత ప్రొ-ఆక్టివ్గా ఉండాలి. ప్రతిదీ వివరించలంటే వాడుకరికి కూడా తలనొప్పే.
  11. కొన్ని వ్యాసాలలో సమాచారం అప్ టు డేట్ ఉండకపోవచ్చు. అవి గమనించిన వాడుకరి సరిదిద్దవచ్చు. వికీ నియమాల ఉద్దేశం అదే. అందరూ అన్నీ చూడలేరు కదా.
  12. నేను "వికీపీడియా పై విమర్శలు" అని రాసి కింద "వీటన్నిటి ని నేను కూడా గత నెల రోజులుగా పడుతున్నా. కావాలంటే కొన్ని నా స్వానుభవం నుంచి కొన్ని ఉదాహరణలు ప్రస్తావించగలను." ఇది చర్చ అయోమయానికి దారి తీసినట్లు అనిపిస్తోంది. అందుకు నా క్షమాపణలు. నేను తర్వాత ప్రస్తావించిన నలుగురు నిర్వాహకులు నేను వికీలోకి అడుగు పెట్టిన నాటి నుంచి నాతో కలిసి సాగిన వారు. వారంటే నాకు గౌరవం ఉంది. వారు నాకు సహాయపడ్డారు. ధన్యవాదాలు. కొన్ని సార్లు నా మీద అతిగా ఆరోపణలు చేస్తున్నట్టు అనిపించింది. ఇక్కడ ఏమి conflict of interest ఉందో నాకు తెలియదు.
  13. నేను సూచనలు చేసినంత మాత్రాన మీరు తప్పు చేసినట్టు కాదు. మిమ్మల్ని విమర్శించినట్టు కాదు. అది నా అభిప్రాయం మాత్రమే. మీకు ఉపయోగపడుతుందనుకుంటే మీ ఇష్టం. లేదా వదిలేయండి.
  14. నేను నాకు మీకు మధ్య జరిగిన చర్చలు, వాదోపవాదాలు మీ గురించి వికీ గురించి నాకు, నా గురించి మీకు బాగా అర్థం చేసుకునేందుకు దోహదం చేశాయి అనుకుంటున్నాను. ఇది సానుకూల అంశంగా నేను భావిస్తున్నాను.
  15. ఒకటి రెండు విషయాల్లో తప్పితే నాకు నిర్వాహకులతో ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. పవన్ సంతోష్ గారు, చదువరి గారు స్పూర్తి నింపే విధానం కూడా బాగుంది. రవిచంద్ర గారికి కూడా వారి సహకారానికి ధన్యవాదాలు.
  16. వెంకటరమణ గారు, మా మీద కొంచెం దయ చూపండి. వికీపీడియా నిజంగా ఇలా ఉంటుందని తెలియదు. తెలియక తప్పులు చేసుండవచ్చు. కానీ ఏదీ ఉద్దేశ పూర్వకం కాదు.
  17. నేను ఇది వరకే ఎవరితోనో చర్చ జరిగిందనేది, మాయ మాటలు చెప్పాను అనేది అబద్దం, కుట్ర పూరిత ఆపాదన. నేను ఎవరెవరితో సంభాషణలు చేశానో నాతో మాట్లాడిన నిర్వహకులకి పూర్తిగా తెలుసు. నిర్వాహకులూ, నేను ఈ పేరుతో తెవికీలో ఉండటం ఇష్టం లేకపోతే చెప్పండి మీరు అలా అనుకోవడం లేదని భావిస్తున్నాను. నాతో ఓపెన్గా చెప్పేయండి.
  18. ఎవరినైనా నా వాఖ్యలు ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. FORGIVE & MOVE ON.

తెవికీలోని ఈ క్రింది చిట్కా లు చూడండి. మీకు ఉపయోగపడొచ్చు.

  1. ఈనాటి వికీ చిట్కా "ఈ నాటి చిట్కా...వికీ శ్రామికులు వెట్టిచాకిరీ చేయడంలేదు. మీరు స్వచ్ఛందంగా పని చేస్తున్నారని మీకు తెలుసనుకోండి. కాని ఇతర సభ్యుల విషయానికొచ్చేసరికి ఈ స్థితిని (మీకు తెలియకుండానే, మీకా ఉద్దేశ్యం లేనప్పటికీ) విస్మరించడం జరిగే ప్రమాదం ఉంది - ఈ తప్పు ఇంకా ఎందుకు దిద్దలేదు? నా ప్రశ్నకు జవాబు ఎందుకు ఇవ్వలేదు? ఆ వ్యాసం మొదలుపెట్టి ఇంతకాలం ఎందుకు అనువదించలేదు? - వంటి ప్రశ్నలన్నీ ఎదుటివారి స్వచ్ఛందతను గుర్తించకుండా అడిగేవే. వారిష్టం. మీకు కుదిరితే మీరు దిద్దండి. లేదంటే వేచి చూడండి. అన్య మార్గం లేదు."
  2. ఇంకో వికీ చిట్కా,"క్రొత్త సభ్యులకు సహాయం చాలా అవసరం తెలుగు వికీపీడియా పెద్ద జనాదరణ ఉన్న సైటు కాదు. తెలుగులో వ్రాయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వికీపీడియాలో నియమాలు పెద్దగా లేవంటూనే క్రొత్తగా చేరి వ్రాయడం మొదలు పెట్టిన వారికి అవీ ఇవీ వంకలు పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదు. కాస్త శ్రమ తీసికొని క్రొత్త సభ్యులు చేసే పొరపాట్లను ఎలా దిద్దాలో వారకి వివరించండి. పాత సభ్యులు చేసే పొరపాట్లకూ ఇదే నియమం వర్తిస్తుందనుకోండి." ____దేవుడు (చర్చ) 10:03, 7 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]


@దేవుడు: గారూ! మీరూ ఇక్కడ కనీసం మూడు విషయాలు గ్రహించాలి:
  • వికీపీడియా విధానాలు కొన్ని ఉన్నాయి. ఈ విధానాలు అన్నవి ఏదోక మూలస్తంభాన్ని కొన్ని భావనల ద్వారా ఆయా సందర్భాలకు వర్తించేలా రూపొందించిన నియమాలు. దీనిపై గతంలో చర్చ జరిగివుండవచ్చు కూడా. ఒకవేళ మంచి చర్చ జరిగి ఒక విధానం అన్నది ఏర్పడితే, మన వ్యక్తిగత అభిప్రాయాలు అందుకు భిన్నంగా ఉన్నా దాన్ని అనుసరించడం అలవరుచుకోనివారు వికీలో సామరస్యంగా పనిచేయలేరు.
    • నా ఉదాహరణ నుంచి చెప్పాలంటే, నేను వచ్చిన కొత్తలో బహువచన ప్రయోగం చేసేవాడిని, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి కాశీకి వెళ్ళారు అని రాసేవాడిని. ఏకవచనం ఇక్కడి నియమం అన్నది జీర్ణించుకోవడానికి నా నేపథ్యం చాలా ఇబ్బందిపెట్టేసింది. కానీ, క్రమేపీ ఆ ఏకవచనం గురించిన చర్చలు చదివాను. నేను అభిప్రాయం మార్చుకున్నాను, మార్చుకోక మునుపు కూడా నియమాన్ని గౌరవించి ఏకవచనంలోకే దిగాను. ఐతే, నేను ఫేస్‌బుక్‌లోనో, పత్రికలకో రాసేప్పుడు ఇప్పటికీ బహువచనమే వాడతాను. వికీలో వాడను.
    • మీ ఉదాహరణ నుంచి ఒకటి చెప్పాలంటే మీ వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం మీకు అరబిక్ అంకెల బదులు తెలుగు అంకెలు వాడాలన్న పట్టుదల ఉండవచ్చు. మంచిదే. కాకపోతే ఆ విషయం మీద ఉద్యమం ప్రారంభించడానికి వికీపీడియా మొదటి స్థానం కాదు, చివరి ప్రదేశం. అంటే- సర్వేసర్వత్రా తెలుగు అంకెలు వాడుతున్నప్పుడు తప్పించి వికీపీడియాలో వాటి వాడకం ప్రారంభం కాదు. మీ బ్లాగులో మీరు తెలుగు అంకెలు వాడుకోవచ్చు, వికీపీడియాలో మాత్రం సాధ్యం కాదు. చెప్పవచ్చేదేమంటే - మీకున్న బిగుతైన సిద్ధాంత చట్రంలో కొన్ని వికీపీడియాలోని విధానాలకు సరిపోకపోవచ్చు. కానీ, ఈ మాధ్యమ నియమాలు గౌరవించి ఇక్కడ ఇక్కడి విధానాలే అనుసరించాల్సి వస్తుంది.
  • నిర్వహణా మూసలు, తొలగింపు మూసలు పెట్టడం వికీపీడియా రొటీన్‌లో భాగం. ఇప్పటిదాకా జరిగినదాని సంగతి చెప్తున్నారు, ఇకపైనా ఈ నిర్వహణా మూసలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఆమాటకి వస్తే మీరూ ఆధారం కావాలి మూసలు కొన్ని పెట్టారు కదా. అలానే మీరూ సమర్థించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇది తప్పదు. అలానే నాకు సమయం, ఇష్టం కుదిరేంతవరకూ నేను చేయను అన్నది మీ హక్కు అయినప్పుడు, ఆ ముహూర్తం ఎప్పటికి వస్తుందో మీరు చెప్పలేనప్పుడు "మీకు కుదిరితే మీరు దిద్దండి. లేదంటే [నిరవధికంగా] వేచి చూడండి." అన్న ఆల్టిమేటం జారీచేసే హక్కు వాడుకరికి ఉండదు. నిర్వాహకులు నిర్వాహక చర్యల ద్వారా తొలగింపుకు గురైతే ఊరుకోవాల్సి వస్తుంది మరి.
  • మీ అనువాదంలో అనువాద దోషాలు ఉన్నాయన్నది సుస్పష్టం. అలానే మీరు చర్చల్లో వాడుతున్న తెలుగు చాలా సరళంగా, సంక్లిష్టమైన భావాలనూ, అభిప్రాయాలనూ చెప్పగలిగేటంత శక్తివంతంగా ఉందన్నదీ అంతే సత్యం. మీరు మీ అనువాద శైలిని క్రమేపీ ప్రయత్నపూర్వకంగా మెరుగుపరుచుకుంటూ పోవచ్చు. అలానే మీరు గతంలో అన్న "నిర్వాహకులు ఇంత చర్చ చేస్తున్నారే, దాని బదులు మీరే దిద్దవచ్చు కదా" అన్నది సరైన తర్కం కాదు. అందుకు బదులుగా మీరు మెరుగుపరుచుకుంటూ పోవచ్చు. తప్పనిసరిగా అందుకు సాయం చేస్తాం. మరో ముఖ్యమైన విషయం ఏమంటే - చర్చల్లో ఇంత చక్కని తెలుగు రాస్తున్నారు కాబట్టి అనువాదాల్లోనూ ఇంత చక్కని తెలుగే మీరు రాయగలరు అని నా అంచనా.
ఎటు తిరిగి ఎటు వచ్చినా ఇప్పుడు మీరూ తెలుగు వికీపీడియా సముదాయంలో విడదీయరాని భాగం. నిర్వాహకత్వం అన్నదేమీ ప్రత్యేక హక్కు కాదనీ, ప్రతీ వాడుకరికి ఇక్కడ సమానమైన బాధ్యతలూ హక్కులూ ఉంటాయనీ మీకు మరోసారి గుర్తుచేస్తున్నాను. ఒకానొక సంఘటనలో చర్చోపచర్చలు జరిగితే దానితోనే మొత్తం వికీపీడియాలోని నిర్వహణా చర్యలన్నిటినీ జడ్జ్ చేయకూడదన్న "స్టాటిస్టిక్స్ సాధారణాంశం" మీకూ, ఒక సందర్భంలో వ్యక్తి ఒకలా ప్రవర్తిస్తే ఆ ఒక్క సందర్భాన్నీ పట్టుకుని వ్యక్తిని జడ్జ్ చేయకూడదన్న "మానసిక శాస్త్ర సాధారణాంశం" నాకూ తెలియనిది కాదు కదా. జరిగిన సంఘటనలో మీపై ఏకపక్షంగా చర్యలు తీసుకోలేదు. మీపై ఆరోపణలు జరిగాయి, మీరూ ప్రత్యారోపణలు చేశారు. ఇక్కడ మీరూ ఒక వాడుకరిగా ప్రత్యారోపణలు, మీకు తోచిన సూచనలూ చేయగలిగారన్నది మీకూ తెలుసు. మనం సమానులుగానే వ్యవహరించామని నా అనుకోలు. కాబట్టి, MOVE ON అన్న మంత్రం మీరే సూచించారు కదా. కాబట్టి, ఆ విధంగా మనం ముందుకు పోదాం. మొలకల విస్తరణ ఋతువు నడుస్తోందని మీరూ చూసేవుంటారు పై చర్చలో. కాబట్టి, మీరు కూడా ఈ విజ్ఞాన సర్వస్వ వ్యవసాయంలో ఒక చేయి వేసి అందరితోనూ భుజం భుజం రాసుకుని పనిచేస్తే బావుంటుందని సూచిస్తూ, అందుకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 14:57, 7 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
[మార్చు]

అర్జున గారు, చదువరి గారు... check date దోషం మళ్ళీ వస్తోంది. ఒకసారి పరిశీలించండి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:46, 9 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Pranayraj Vangari గారికి, మార్పు చేసి దోషం పరిష్కరించాను. పరీక్షించిన వ్యాసంకబడ్డీ కబడ్డీ. --అర్జున (చర్చ) 06:01, 10 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు అర్జున గారు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:06, 10 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, 12.05pm కి జరిగిన ఈ మార్పును ఒకసారి చూడండి. ఈ మార్పులో ఆర్కైవ్ తేదీ దగ్గర జూలై నెల పేరు తెలుగులోకి మారడంవల్ల ఆర్కైవ్ తేదీ ఎర్రర్ వచ్చింది. ఇలా అన్ని మార్పులకు వస్తోంది. దీనికి శాశ్వత పరిష్కారం చూడాలి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:48, 10 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అవును,ఇంకా కొన్ని చోట్ల దోషం వుండిపోయింది. పరీక్ష నమూనాల పేజీ . ..అర్జున (చర్చ) 07:14, 10 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కోడ్ మార్పుల వలన ప్రస్తుతానికి తెలుగు నెలల తేదీలకు check date error తప్పదు. ఈ దోషం పాఠ్యం కనబడకుండా చేయటానికి వీలుంది. సభ్యులు స్పందన తెలపండి. --అర్జున (చర్చ) 10:09, 10 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, తేదీని yyyy-mm-dd ఆకృతిలో రాయవచ్చు, కదా? మీ పరీక్షా పేజిలో చేసి చూసాను, బానే ఉంది. దోషాన్ని సరి చేసే వరకు అలా రాద్దామని నా సూచన. __చదువరి (చర్చరచనలు) 13:43, 10 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు చెప్పినట్టుగా కొత్తగా ఇచ్చే మూలాలకు అలా చేయవచ్చు. అయితే, ఈ బాటు చేస్తున్న మార్పుల వల్ల పాత మూలాల్లో ఇంగ్లీషులో ఉన్న నెల పేర్లు తెలుగులోకి మారిపోతున్నాయి. అంతేకాకుండా మూలంలో లింకులకు బాట్ ద్వారా ఆర్కైవ్ లింక్ (చేసినవి ఉంటే) చేర్చేప్పుడు ఆర్కైవ్ తేదీకి నెల పేరు తెలుగులోనే ఇవ్వడంతో అప్పుడు కూడా check date దోషం వస్తోంది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:54, 10 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pranayraj Vangari గారూ, బేసిగ్గా నేను సరిగ్గా రాయలేదు. "ఆ పరికరం లోని దోషాన్ని సవరించేవరకు దాన్ని వాడాక తేదీలను yyyy-mm-dd ఆకృతిలోకి మానవికంగా మారుద్దాం" అని రాసి ఉంటే కొంత అర్థవంతంగా ఉండేది. కాకపోతే చాలా లింకులను మార్చాల్సి ఉంటుంది, పెద్ద పనే అది. ఇక అది వద్దనుకుంటే, సమస్య తీరేదాకా పరికరాన్ని వాడకుంటే సరి. అర్జున గారూ, దోష సందేశాన్ని కనబడకుండా చెయ్యడం సరైన పరిష్కారం కాదని నా ఉద్దేశం. __చదువరి (చర్చరచనలు) 00:07, 11 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తీన్మార్ సావిత్రి (జ్యోతి) పేజీలో ఒక గంట క్రితం మూలం చేరుస్తూ archivedate" 2020-06-13"గా పెట్టాను. అయితే, వాడుకరి:InternetArchiveBot ఆ మూలాన్నీ పరిశీలించడంలో భాగంగా "13 జూన్ 2020" లా మార్చడంతో ఎర్రర్ వస్తోంది. అలా చేయడంకంటే ఏమి మార్చకుండా ఉంటే బాగుంటుందేమో. InternetArchiveBot మారుస్తున్న ప్రతి పేజీకి వెళ్ళి ఎర్రర్ ని సరిచేయడం తప్పడంలేదు. చదువరి గారు చెప్పినట్టుగా సమస్య తీరేదాకా పరికరాన్ని వాడకపోవడమే మంచిది. కష్టపడి మూలం చేర్చిన తరువాత అందులో ఎర్రర్ రావడం బాలేదు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:24, 13 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నేను మరికొంత పరిశీలించి configuration లో స్థానిక తేదీ సవరింపులు చేశాను, కాని check date దోషాలు తొలగలేదు. check date హెచ్చరిక కావున, InternetArchiveBot ప్రధానంగా మూలాలను అర్కైవ్ లింకులు చేర్చుట ఎక్కువ విలువైనది కావున, InternetArchiveBot కొనసాగించడం మంచిదని నా అభిప్రాయం. ఇక మీ తేదీ సవరణలు InternetArchiveBot దిద్దడం అవి దోషాలుగా కనబడడం బాధాకరం కావున, మీరు కేవలం మూలం చేర్చి, ఆ మూలాన్ని ఆర్కైవ్ లో భద్రపరచి వదిలేయండి. InternetArchiveBot అర్కైవ్ లింకు అదే వీలువెంబడి చేరుస్తుంది.--అర్జున (చర్చ) 06:22, 15 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, InternetArchiveBot చేర్చే అర్కైవ్ లింకులో కూడా నెల పేరును తెలుగులోనే ఇవ్వడంతో అప్పుడు కూడా check date దోషం వస్తోంది. మీరన్నటుగా InternetArchiveBot పని కొనసాగనివ్వండి. ప్రస్తుతానికి నా దృష్టికి వచ్చిన check date హెచ్చరికలను సరిచేసుకుంటాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:52, 15 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pranayraj Vangari, చదువరి గార్లకు, InternetArchiveBot సవరణలు పరిశీలిస్తే check date దోషాలు కనబడడం లేదు. పరీక్ష నమూనాల పేజీ తొలిరూపంపై నడిపి చూశాను. ఏమైనా దోషాలు కనబడితే మరల తెలియచేయండి.--అర్జున (చర్చ) 07:05, 18 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పుడు సరిగానే వస్తోంది. ధన్యవాదాలు అర్జున గారు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:07, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నిరోధ నిర్ణయాల సమీక్షా విధానం

[మార్చు]

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిరోధ నిర్ణయాల సమీక్షా విధానం వాడుకరుల అభిప్రాయాల కోసం చూస్తోంది. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 12:31, 14 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మూస "పేరు", మూస "పేజీ పేరు" ఒకటే ఉండాలి

[మార్చు]

వాడుకరులందరికీ ఈ విషయం ఈసరికే తెలిసే ఉంటుంది. తెలియని వారెవరైనా ఉంటే వారికి పనికొస్తుందని ఇక్కడ రాస్తున్నాను.

ఏదైనా మూసను గమనిస్తే దాని పైనున్న పట్టీలో ఎడమ చివర v t e మూడు అక్షరాలను చూడొచ్చు - పక్కనున్న బొమ్మలో లాగా. అందులో v ని నొక్కితే మూస పేజీని తెరిచి చూడవచ్చు, t ని నొక్కితే దాని చర్చ పేజీ తెరుచుకుంటుంది. e ని నొక్కితే మూస ఎడిట్ పేజీ తెరుచుకుంటుంది. మూసను ఏ పేజీలోనైతే ట్రాన్స్‌క్లూడు చేసారో ఆ పేజీనుంచే నేరుగా, ఈ లింకుల ద్వారా ఈ పేజీలను తెరవవచ్చు. లేదంటే, ఈ ట్రాన్స్‌క్లూడు చేసిన పేజీ దిద్దుబాటు పేజీని తెరచి, మూస "మార్పు" ను నొక్కి, అక్కడి నుండి మూస పేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈ v t e లింకులు పని చెయ్యాలంటే కింది కండిషను తప్పనిసరి:

మూసలో ఉండే name, మూస పేజీ పేరూ ఒక్కటే అయి తీరాలి. కింది బొమ్మలు చూడండి:

మూస పేజీ పేరు: "చత్తీస్‌గఢ్ లోని జిల్లాలు", మూస లోని పేరు (name): "చత్తీస్‌గఢ్" - రెండూ వేరువేరు, కాబట్టి ఇక్కడ లింకులు పనిచెయ్యవు"
మూస పేజీ పేరు: "చత్తీస్‌గఢ్ లోని జిల్లాలు", మూస లోని పేరు (name): "చత్తీస్‌గఢ్ లోని జిల్లాలు" - రెండూ ఒకటే, కాబట్టి ఇక్కడ లింకులు పనిచేస్తాయి

ఏ మూసలోనైనా v t e లను నొక్కినపుడు (ముఖ్యంగా v e లు. ఎంచేతనంటే t పేజీని (చర్చ పేజీ) ఇంకా సృష్టించి ఉండకపోవచ్చు), పేజీ ఉనికిలో లేదు సృష్టించండి అని అన్నదీ అంటే దానర్థం.. పై లోపం ఉన్నట్టే. దీనికి పరిష్కారం: సదరు మూసలో name పరామితిని మార్చడమే. మార్చెయ్యండి. __చదువరి (చర్చరచనలు) 07:56, 15 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Editing news 2020 #2

[మార్చు]

20:33, 17 జూన్ 2020 (UTC)

Twinkle వాడుకరులకు సమస్య

[మార్చు]

Twinkle వాడుకరులకు మెనూ అప్రమేయంగా విస్తరించబడడం, వెతుకుపెట్టె క్రిందకు జరపబడటం సమస్య కనబడింది. Indic-techcom వారికి నివేదించాను. ప్రస్తుతానికి ట్వింకిల్ గేడ్జిట్ అచేతనం చేసుకొని వాడుకొనడం తాత్కాలిక పరిష్కారం. --అర్జున (చర్చ) 05:40, 18 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు అర్జున గారూ, తర్వలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాను. నేనూ ట్వింకిల్ వాడుకదారుణ్ణే, నిన్న సమస్య ఎదుర్కొన్నాను. నివేదించినందుకు మీకు కృతజ్ఞతలు. --పవన్ సంతోష్ (చర్చ) 06:24, 18 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు అర్జున గారు-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:49, 18 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సమస్య పరిష్కరించబడింది. ఏమైనా సమస్యలుంటే తెలియచేయండి. --అర్జున (చర్చ) 11:50, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Urgent help

[మార్చు]

Please help us translate the text (in bold) to your language Join WPWP Campaign to improve Wikipedia articles with photos and win a prize. Thanks for your help. T Cells (చర్చ) 18:22, 20 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

జులై 14 నుండి మొదటి పేజీ మొబైల్ వీక్షణ కొత్త రూపు

[మార్చు]

మొదటిపేజీ పాతకాలపు ప్రత్యేక రూపుదిద్దడం జులై 13 తో అంతమవుతుంది కావున మొదటిపేజీకి కొత్తగా template styles వాడి రూపుదిద్దాలి. (చూడండి T254287). ప్రయోగాత్మకంగా మార్పులు చేశాను.. కొత్త రూపు ని పాత రూపుతో మీ మొబైల్ లో పరీక్షించి ఏమైనా సమస్యలు, సూచనలు తెలపండి. --అర్జున (చర్చ) 05:42, 29 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:మొదటి పేజీ పాదములో ము బదులు అనుస్వారం ఉంటే బాగుంటుంది.అంతేగాదు పాదం అనే పదం భాగం అనే అర్థం సూచిస్తుంది. మూస:మార్గదర్శిని అనే దానిలో 'ని' అవసరంలేదు.మూస:మార్గదర్శి అని ఉంటే సరిపోతుంది.మార్గదర్శి అంటేనే ఆంగ్లలో గైడ్ అని,తెలుగులో మార్గ దర్శకుడు అనే అర్థాలు సూచిస్తాయి.నిఘంటుశోధనలో పరిశీలించండి.ఇవి నాసూచనలు.--యర్రా రామారావు (చర్చ) 06:11, 29 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారికి మూసపేరుబరి పేర్లు వీక్షకుడు చూసేవి కావు కనుక వీక్షకుడికి కనబడే పేర్లు మార్పు చేస్తాను. ఇకముందు మూసలు చేసేటప్పుడు మీ సూచనలు వాడుతాను. అర్జున (చర్చ) 03:54, 30 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ ఈ విషయంపై శ్రద్ధ పెట్టినందుకు ధన్యవాదాలు. నేను మొబైల్లో వికీని పెద్దగా చూడను, కాబట్టి పాత పేజీలో ఉండే లోటుపాట్లేమైనా ఉంటే నాకు వివరంగా తెలియదు. ప్రస్తుతం నేను గమనించినవి ఇవి (యాండ్రాయిడ్ మొబైల్లో, క్రోమ్ బ్రౌజర్లో):
  1. కొత్త రూపులోని పేజీ చక్కగానే కనిపిస్తోంది. లోపాలేమీ లేవు.
  2. పాత రూపుతో పోలిస్తే కొత్త రూపు మెరుగ్గా ఉంది.
  3. పాత రూపులో ఉన్న అంశాలన్నీ కొత్త దానిలో కనిపిస్తున్నాయి. అందులో లేనివి, కొత్త దానిలో కనిపిస్తున్నవీ అయిన అంశాలు ఏంటంటే.. ఈ వారపు బొమ్మ, సోదర ప్రాజెక్టులు, విరాళాల అభ్యర్ధనలు
  4. అయితే, కొత్త దానిలో కనిపించనివీ, మామూలు డెస్కుటాపులో కనిపించేవీ (ముఖ్యమైనవి) కొన్నున్నాయి. అవేంటంటే - పైనుండే గణాంకాల పెట్టె, కిందున్న మార్గదర్శిని పెట్టె. అవి కూడా ఉంటే బాగుంటుందనుకుంటా.
__చదువరి (చర్చరచనలు) 06:16, 29 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, భేదాలు సవివరంగా తెలిపినందులకు ధన్యవాదాలు. మొబైల్ వాడుకరులకు నెట్ సంపర్క వేగం తక్కువ స్థాయిలో వుంటుంది కాబట్టి, పేజీ పరిమాణం తక్కువ వుండేటట్లు చేయాలి. కావున ఈ వారం బొమ్మ, సోదర ప్రాజెక్టులు,విరాళాలు ఇంకా మార్గదర్శిని కేవలం లింకులుగా వుంటే బాగుంటుంది. అలా చేయటానికి ప్రయత్నిస్తాను. --అర్జున (చర్చ) 03:59, 30 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, మరింత పరిశోధించిన మీదట, కేవలం మొబైల్ లో వేరేగా కనబడేటట్లు చేయటానికి సులభమైన పరిష్కారం కనబడలేదు. ప్రస్తుతానికి అవసరమైన అంశాలు మాత్రమే వుంటాయి.--అర్జున (చర్చ) 11:27, 14 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, సరేనండి__చదువరి (చర్చరచనలు) 13:06, 14 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు కొత్త రూపు బావుంది. ధన్యవాదాలు. నాకు ఇటీవల లప్టాఫ్ మీద వర్క్ చేయడానికి అవ్వడం లేదు. దీన్లో చేద్దామంటే అంత సులభంగా కాదు. ఇంకా మెరుగుపడితే ఎక్కువమంది మార్పులు చేయగలుగుతారు. B.K.Viswanadh (చర్చ) 03:35, 19 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

B.K.Viswanadh గారు, మీకు నచ్చినందులకు సంతోషం. వికీపీడియా app వాడి చూశారా?సవరణలు సులభంగా చేయగలుగుతారు. అన్నట్లు పరిమాణం తగ్గించడానికి ఈ వారం బొమ్మ లాంటివి దాచుదాము అనుకున్నా కాని, ఆంగ్ల వికీపీడియా వారు అలా చేయలేదు కనుక నేను వుంచేశాను. పెట్టెలకి ఇంకా కొంత శుద్ధి కావాలి. ఆంగ్ల వికీపీడియామొబైల్ ప్రధానపేజీతో పోల్చిచూడండి. ముందు ఎవరైనా ఆ ప్రయత్నాలు చేపట్టితే మంచిది. --అర్జున (చర్చ) 06:23, 19 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]