Jump to content

వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 31

వికీపీడియా నుండి

పాత చర్చ 30 | పాత చర్చ 31 | పాత చర్చ 32

alt text=2014 జనవరి 1 - 2014 జనవరి 31 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2014 జనవరి 1 - 2014 జనవరి 31

2014 నూతన సంవత్సర శుభాకాంక్షలు - వికీపీడియా అభివృద్ధికి ఆలోచనలు

[మార్చు]
  • తెలుగు వికీపీడియా చదువరులకు, సభ్యులకు 2014 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సందర్భంగా బాధ్యులందరూ వికీపీడియా 2013 సమీక్షను మరియు 2014లో పురోగతికి తమతమ ఆలోచనలు పంచుకుంటే బాగుంటుందని అనిపించింది. 2013 లో మన ప్రచార కార్యక్రమాలు ఉగాది మహోత్సవాలతో ఇంతకు మందుకంటే పై స్థాయికి వెళ్లాయి. విషయం పరంగా, సాంకేతికంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాము. తెవికీ ఉన్నతికికృషి చేసిన వారిని తగిన పురస్కారము, ప్రశంసాపత్రాలతో గుర్తించాము. 2014 లో తెలుగు వికీపీడియా నాణ్యత పై దృష్టిపెట్టాలని, రెండు నెలలకో ప్రాజెక్టు చొప్పున కనీసం నాలుగు ప్రాజెక్టులు, విద్యారంగంతో అనుబంధం పెంచుకొని, విషయపరంగా మరియు సాంకేతికంగా అభివృద్ధి జరగాలని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 06:26, 1 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • తెలుగు వికీపీడియా వాడుకరులకు, చదువరులకు, నిర్వాహకులకు, అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సమైక్య కృషికి అత్యుత్తమ నిర్వచనంగా నిలిచిన తెవికీ అభివృద్ధిలో పాల్గొన్న మనందరికీ ధన్యవాదాలు; చేరబోయే మరెందరికో హార్థిక స్వాగతం పలుకుతున్నాను. Rajasekhar1961 (చర్చ) 06:30, 1 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • తెలుగు వికీపీడియన్లు అందరుకీ శుభాభినందనలు.--t.sujatha (చర్చ) 06:46, 1 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • నా ఆలోచన: వికీలో ఏ పదాల కోసం ఎక్కువగా వెతుకుతున్నారు. అందులో వ్యాసాలు లేనివెన్ని? తెలుసుకుని వీలైన వాటిని వ్యాసాలుగా మారిస్తా బాగుంటుందని నా అభిప్రాయం. --రవిచంద్ర (చర్చ) 06:51, 1 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వెలుగు, జనవరి 2014 సంచికలో అర్జున వ్యాసం

[మార్చు]

తెలుగు వెలుగు, జనవరి 2014 సంచిక, 46-49 పేజీలలో అందరి విజ్ఞానం అందరికీ శీర్షికతో వికీపీడియా ప్రస్థానం మరియు అభివృద్ధికి చేయవలసిన విషయాలపై నేను రాసిన వ్యాసం, ఉగాది మహోత్సవాల ఛాయాచిత్రంతో ప్రచురించబడిందని తెలుపుటకు సంతసించుచున్నాను. ఈ ప్రతి ప్రస్తుతం బజారు లో అమ్మబడుతున్నది. నెలరోజులలో నెట్ లో చేర్చబడవచ్చు. దీనిని చదివి స్పందనలు తెలియచేయవలసిందిగా సహ సభ్యులను కోరుచున్నాను. అలాగే సహసభ్యులు తమ ఆలోచనలు వివిధ మాధ్యమాలద్వారా వెల్లడించి వికీపీడియా ప్రచారానికి మరియు అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 03:33, 2 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • గత వారం రోజులుగా దాదాపు 10 మంది రాష్ట్రం వివిధ ప్రాంతాలనుండి (గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, కరీంనగర్, తెనాలి, కడప, హైద్రాబాదు మొదలగునవి) ఫోన్ /ఎస్ఎమ్ఎస్/ఈ మెయిల్ ద్వారా నన్ను సంప్రదించారు. వికీ గురించిన సందేహాలను ప్రధానంగా వారి రచనలు చేర్చటం గురించి అడగటము మరియు వాటికి నేను స్పందించటము జరిగింది. ఒకరు, వారు ప్రచురించిన పుస్తకాన్ని నాకు పంపించారు. తెలుగుపై ఆసక్తి వున్న వారికి వికీపీడియా గురించి తెలియచేయటానికి ఈ వ్యాసం ఉపయోగపడినదిగా నేను భావిస్తాను. అయితే అంతర్జాలం సౌకర్యంగలవారు లేక వాడుతున్న వారి స్పందన తక్కువనే చెప్పాలి.దీనికి తెవికీ ఇతర భాషా సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేపట్టినప్పుడే తెవికీ ప్రచారం మరింత పుంజుకోగలదు. --అర్జున (చర్చ) 04:28, 10 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • జాలంలో "చెవల, అర్జున రావు (2014-01-01). "అందరి విజ్ఞానం అందరికీ". రామోజీఫౌండేషన్ తెలుగు వెలుగు. Retrieved 2014-01-30." వ్యాసం అందుబాటులోకి వచ్చింది.--అర్జున (చర్చ) 04:05, 30 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విష్ణువు వేయి నామములు

[మార్చు]

విష్ణువు వేయి నామములు- 1-1000 Lellasrinu గారు తెవికీ లో చేర్చారు. విష్ణు సహస్రనామ స్తోత్రములో చేర్చినదానిని నేను ఒక వేరు పేజీగా మార్చాను. వేయి నామాలను పది వ్యాసాలుగా చేసి కొన్ని 300/400 వరకు వాటికి పేజీలున్నాయి. మిగిలిన 400-1000 వరకు నామాలను 100 నామాలకు ఒక వ్యాసంగా ఈ పెద్ద వ్యాసాన్ని విభజించి చేస్తే బాగుంటుంది. కానీ సమస్య ఇవి రెండు వేర్వేరు పద్ధతులలో వున్నాయి. సభ్యులు అభిప్రాయాల్ని తెలియజేస్తే ఈ ప్రాజెక్టు పూర్తిఅవుతుంది.Rajasekhar1961 (చర్చ) 06:35, 2 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సభులు ఎవరి నుండి కూడా స్పందన లేని కారణం చేత నేను వెయ్యి నామాలను 10 వ్యాసాలుగా విభజించాను. లోపాలుంటే తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 04:26, 8 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఇందులో పెద్ద "వ్యాసం" ఏమీ లేదు. ఈ పేజీలను వికీసోర్స్ లో కానీ వికీబుక్స్ కి కానీ తరలించాలి. --వైజాసత్య (చర్చ) 07:13, 14 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

2013 డిసెంబరు మొలకల జాబితా

[మార్చు]

2013 డిసెంబరు నెలలో కొత్తగా సృష్టించబడిన మొలకల జాబితా వచ్చింది. దయచేసి ఈ వ్యాసాలను విస్తరించే ప్రయత్నం చేయండి --వైజాసత్య (చర్చ) 06:54, 2 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • గత కొద్ది రోజుల నుండి ముంజేతి కంకణము ఉపకాణము (Navigational Popups) పని చేయుట లేదు. ఇందువలన వ్యాసము యొక్క పరిమాణము తెలియడం లేదు. ఫైర్ ఫాక్స్ వెర్షన్ 26.0 మరియు విండోస్ 8.0 లో ఈ సమస్య ఎదురవుతున్నది. పరిష్కారము తెలిసినచో తెలుపగలరని విన్నపము.--ఖాదర్ (చర్చ) 11:30, 2 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఖాదర్ గారికి, ఇటీవల జరిగిన ముఖ్యమైన Mediawiki పేరు బరిలో మార్పులు చూశాను కాని కారణం తెలియలేదు. నేను నా వాడుకరి ఉపపేజీగా vector.js సృష్టించుకొని దానిలో అవసరమైన కోడ్ చేర్చితే పనిచేస్తున్నది. మీరు కూడా అలాగే చేసి, ఖాతానుండి నిష్క్రమించి మరల ప్రవేశించి పరీక్షించండి. రచ్చబండలో వ్యాఖ్య రాసేటప్పుడు మీరు కోరిన వారి వాడుకరిపేజీల వికీలింకులు చేర్చడం ద్వారా వారికి ఎకో వ్యవస్థ ద్వారా సందేశం పంపవచ్చు. ప్రత్యేకించి ఆయా వాడుకరి పేజీలలో మరల వ్యాఖ్య రాయనవసరములేదు. ఇలా మీ సమయం ఆదా అవుతుంది. చర్చలు కేంద్రీకృతమై అందరికీ సౌలభ్యంగా వుంటుంది . ఇకముందు అలా ప్రయత్నించండి--అర్జున (చర్చ) 10:17, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
సూచనకు ధన్యవాదములు అర్జున గారూ. ఈ సౌలభ్యము నాకు ఇంతవరకు తెలియదు. ముందుగా వాడుకరి ఉపపేజీగా vector.js సృష్టించుకొని ముంజేతి కంకణము పనిచేస్తుందేమో చూస్తాను. ఏమైనా సందేహములున్నచో మరలా మిమ్మల్ని సంప్రదిస్తాను.
తెవికీలో ఉన్న ముంజేతి కంకణం స్క్రిప్టు చాలా పాత వెర్షన్. అదీ ఇటీవలి మార్పుల వల్ల పనిచేయటం మానేసింది. నేను కొత్త వెర్షన్ స్థాపించడం వళ్ళ తిరిగి పనిచేస్తుంది. --వైజాసత్య (చర్చ) 05:10, 5 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది పరిమాణం ఆధారంగా సృష్టించిన జాబితానే --వైజాసత్య (చర్చ) 03:48, 17 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీవీక్షణలలో మార్పులతీరు (వికీట్రెండ్స్)

[మార్చు]

జొహన్ గున్నార్సన్ వికీట్రెండ్స్ లో తెలుగు (ఉదా:గత ఏడురోజలలో తెలుగు వికీలో పెరుగుతున్న వీక్షణలు గల వ్యాసాలు) చేర్చబడింది. దీనితో తెలుగు వికీవీక్షణల మార్పులతీరు ప్రతిగతదినం, ప్రతివారంగత ఏడురోజులు, మరియు ప్రతినెలగత30రోజులు వారీగా గమనించవచ్చు.గత వారంఏడురోజులలో వీక్షణలలో అత్యధిక మార్పుల జాబితాలో పై పది వ్యాసాలు ఈ విధంగా వున్నాయి.

1.కామిక్స్ (+15 400%)

కామిక్స్ గ్రీకుκωμικός భాషలో, కోమికొస్ అంటే "హాస్యానికి సంబంధించిన" κῶμος - kōmos నుండి "రెవెల్, కొమోస్", (2) వైయా లాటిన్ కోమికస్ ) దృశ్యకళలకు సంబంధించిన మాధ్యమం, వాటిలో వరుసక్రమంలో ఉండే చిత్రాలు కథను తెలియజేస్తాయి. ఈ మాధ్యమంలో అత్యంత హాస్యభరితమైన మొట్టమొ...

2.ఋణానందలహరి (+8 400%)

ఋణానందలహరి ముళ్లపూడి వెంకటరమణ రాసిన కథలమాలిక. ఋణము అనగా అప్పు. అప్పులు తీసుకోవడం, అప్పులవాళ్ల నుంచి తప్పించుకోవడం, అప్పుల ప్రశస్తి వంటి హాస్యస్ఫోరకమైన అంశాల ఆధారంగా రాసిన కథలమాలిక....

3.అరవింద్ కేజ్రివాల్ (+348%)

1999 డిసెంబర్ లో కేజ్రివాల్ రెవెన్యూ సర్వీసులో ఉండగానే ,పరివర్తన్ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి ఢిల్లీలోని ప్రజలకు పన్నులు, విద్యుత్తు, ఆహార పంపిణి విషయాల గురించి అవగాహన కలిగించడం లో సహాయం చేశారు. కేజ్రివాల్ "మార్పు చిన్న చిన్న విషయాలతో ప్రారంభం అవుతుం...

4.ట్విట్టర్ (+123%)

ట్విటర్ అనేది ఒక ఉచిత సాంఘిక నెట్ వర్కింగ్ మరియు సూక్ష్మ-బ్లాగ్ సేవ, ఇది దాని యొక్క వాడుకదారులుట్వీట్స్ అని పిలవబడే సందేశాలను పంపడానికి మరియు చదవడానికి తోడ్పాటునిస్తుంది. ట్వీట్లనేవి 140 అక్షరముల దాకా కల విషయ-ఆధారమైన వివరముల సరఫరా, ఇది రచయిత సంక్షిప్త పేజ...

5.పవన్ కళ్యాణ్ (+217%)

పవన్ కళ్యాణ్గా ప్రసిద్ధుడైన కొణిదెల కల్యాణ్ బాబు తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ గా వెలుగుతున్న చిరంజీవి సోదరుడు, కొణిదెల వెంకటరావు, అంజనా దేవిల మూడవ కుమారుడు. పవన్, సెప్టెంబరు 2, 1973న జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తెలుగు సినిమా పరిశ్ ...

6.సంక్రాంతి (+75%)

సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కా... Related pages: కుక్కుట శాస్త్రం (+100%), తెలంగాణ (+77%), దీపావళి (+82%), భారత దేశము (+8%), ముగ్గు (+212%)

7.ముగ్గు (+212%)

ముగ్గు లేదా రంగవల్లి అనేది ఇంటి వాకిలి మరియు ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీనా కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం....

8.ఆంధ్ర ప్రదేశ్ (+62%)

ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలోని ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో నాలుగవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్. భౌగోళికంగా ఈ రాష... Related pages: తెలంగాణ (+77%), ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర (+53%), భారత దేశము (+8%)

9.నరేంద్ర మోడి (+209%)

1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర మోడి (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) ప్రస్తుతం గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. డిసెంబర్ 2007 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా మూడవ సారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని చేరువ...

10.ఫ్రాంజ్ కాఫ్కా (+243%)

<వివరం ఉపకరణంలో లేదు>

తెలుగు వీక్షణల స్థాయితక్కువగా వున్నందున, ముఖ్యంగా రోజువారీ మార్పుల శాతం సంఖ్యలు స్వల్ప సందేహంతో మాత్రమే తీసుకోవాలి. దీనిలో ఎక్కువగా దర్శించబడుతున్న వ్యాసాలు, వీక్షణలు తగ్గినవి కూడా చూడవచ్చు.ఈ ఉపకరణం ఉపయోగంపై సహసభ్యులు స్పందిస్తే ఏవైనా స్వల్ప మార్పులు కావలసివస్తే అభివృద్ధికారునికి తెలిపవచ్చు. --అర్జున (చర్చ) 03:49, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • వీక్షణ వ్యాసాలు, వీక్షణలో మార్పులు అన్నీ పరిశీలించాను. టాప్-10 వ్యాసాల వల్ల పాఠకులకు ఎలాంటి వ్యాసాలు కావాలో తెలుసుకోవడానికి వీలుండటం లేదు. సాధారణంగా మొదటిపేజీలో (ఈ వారం వ్యాసం, చరిత్రలో ఈరోజు ...) లింకులు, సైడ్‌బార్ లింకులు, సైట్ నోటీసు లింకులు మరియు స్వాగతంలో ఉన్న లింకులకు చెందిన వ్యాసాలలోనే అధికంగా హిట్లు జరుగుతున్నట్లు పరిశీలించాను. నిన్ననే నేను తెవికీ నిర్వహణ బ్లాగులో హిట్లకు సంబంధించిన పోస్టే వేశాను. మొత్తంపై తెవికీ హిట్లు చాలా తక్కువగా ఉన్నట్లుగా నా పరిశీలనలో తేలింది. ఒక్కరి నియంత్రణలో ఉండే ఒక బ్లాగులోని ఒక పోస్టుకు జరిగిన హిట్లు కూడా తెవికీ వ్యాసాలకు రావడంలేదు. ఉదా:కు నా పాలమూరు జిల్లా విజ్ఞానసర్వస్వము బ్లాగులోని "ఆంధ్రప్రదేశ్ వార్తలు-2013" పోస్టుకు జరిగే హిట్లు కూడా తెవికీలోని వ్యాసాలకు రావకపోవడం పరిశీలించాల్సిన విషయమే. (ఈ బ్లాగుకు కనీసం అగ్రిగేటర్లలో కూడా చేర్చలేను, కేవలం నా జికె బ్లాగు లింకు మరియు గూగుల్ సెర్చ్ ద్వారానే వస్తున్నారు) తెవికీ వ్యాసాలకు హిట్లు పెరగాలంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలా మార్పులకు లోనుకావల్సి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:57, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • సభ్యుడు:C.Chandra Kanth Rao గారి స్పందనకు ధన్యవాదాలు. తెలుగు వికీ వీక్షణలు తక్కువస్థాయిలో వుండడం విచారించదగ్గది. అయితే ఈ కొత్త ఫలితాల వలన మనకు సభ్యులు ఏ విషయంపై వ్యాసాలు చూస్తున్నారు అని ముందుగా తెలిసే అవకాశముంది. సంక్రాంతి ఇంకా 10 రోజులువుండగానే, తెవికీ లో సంక్రాంతి వ్యాస వీక్షణలు పెరగటం గమనించాం. ఇది ముఖ్యమైన ఘటనలగురించి ఊహించదగ్గదే ఐనా, ఆయా వ్యాసాల నాణ్యతను మెరుగు పరచి మరియు, ఈ వికీట్రెండ్స్ వ్యాసాల పేర్లను ప్రోగ్రామ్ ద్వారా ప్రతిరోజు మొదటిపేజీలో కనబడేటట్లు చేయడం ద్వారా, తెవికీ ఆదరణని పెంచడానికి కృషిచేయవచ్చు. --అర్జున (చర్చ) 03:40, 4 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వికీట్రెండ్స్ బాగుంది. ప్రతి వారం ఈ వివరాల్ని మొదటిపేజీలో కనిపించినట్లుగా చేస్తే క్రియాశీలకంగా వున్న సభ్యులు వాటి నాణ్యతను బాగుచేయడానికి లేదా విస్తరించడానికి అవకాశం వుంటుంది. ఒక చిన్న ప్రాజెక్టుగా తయారుచేసినా కూడా మంచిదే. 2-3 ఆసక్తి వున్న సభ్యులు దానిలో పాల్గొనవచ్చును.Rajasekhar1961 (చర్చ) 05:09, 8 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి వికీప్రాజెక్టు కి ఆహ్వానం

వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి పేజీ తయారు చేశాను. ఆసక్తిగల వారు ఆ పేజీలో తమ వికీసంతకం చేయండి. ఐదారుగురు చేరితే ప్రాజెక్టుని అధికారికంగా ప్రారంభించవచ్చు. మొదటి విడత ప్రాజెక్టులో ఆసక్తి చూపటానికి ఆఖరుతేది:14 జనవరి 2014. --అర్జున (చర్చ) 05:55, 8 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి వికీప్రాజెక్టుృ-201401 వీక్షణల విశ్లేషణ

వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్#ఫలితాలుప్రకారం, 201401లో మొత్తము వీక్షణలు గతసంవత్సరం అదేనెలతో పోల్చితే సుమారు 4% తగ్గినా పైస్థాయి 10వ్యాసాల వీక్షణలు 22%వృద్ధి చెందాయి. దీనికి కొన్ని ప్రత్యేకకారణాలున్నా కొంత మేరకు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ సహాయ పడిందని భావించవచ్చు. ఈ మొదట విడత ప్రణాళిక పూర్తయినతరువాత విశ్లేషిస్తే మరింత నమ్మకమైన ఫలితాలు దొరికే అవకాశముంది. సహసభ్యులందరూ తమ ఆసక్తి మేరకు ఈ ప్రాజెక్టులో పనిచేసే వీలున్నందున,ప్రాజెక్టులో చేరి సహకరించవలసినదిగా కోరుతున్నాను. --అర్జున (చర్చ) 05:34, 1 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నా సిస్టం లో సాంకేతిక సమస్య... పరిష్కారానికి మార్గం చూపగలరా???

[మార్చు]

2/1/2014 సాయంకాలము కొన్ని పుస్తకాల అట్టమీది బొమ్మలను ఫోటో తీసి కామన్స్ లో ఎక్కిస్తున్నాను. ఆయా పుస్తకాల వివరాలు తెవికిలో వ్రాయుచున్నాను. అలా ఎక్కించిన పోటోలు కొన్ని నేను తీసిన అడ్డంగా తీసిన కొన్ని ఆలాగే ఎక్కించేశాను. ఆ పుస్తకాల వివరాలు రాయడానికి ప్రయత్నించగా ఆ పుస్తకానికి సంబందించిన (తెవికిలోని కుడివైపు) బాక్సులో ఫోటొ కూడ అడ్డంగా పడింది. పొరబాటున నేను తీసిన బొమ్మను ఏడిట్ చేయకుండా అనగా దానిని నిలువుగా మార్చకుండా ఎక్కించాను. తిరిగి దానిని సరి చేద్దామని కామన్సు లో ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో ఏఏ బటన్లను నొక్కానో నాకు గుర్తు లేదు. దాని పర్యవ సానంగా..... నా సిష్టం లో బొమ్మలన్నీ మాయమై పోయినవి. ఇదివరకు కామన్స్ లో ఎక్కించిన బొమ్మలను చూసి మనకు కావలసిన బొమ్మలను తీసి తెవికీలో కావలసిన చోట పెట్టుకునే వాడిని. కాని ఇప్పుడు ఆ బొమ్మల స్థానంలో కేవలం ఖాళీ బాక్సు మాత్రమే కనబడుతున్నది. (ఇది గ్యాలరీ గురించి) uploads క్లిక్ చేస్తే అన్ని బొమ్మలు వారుసగా పేర్లతో సహా కనబడేవి. ఇప్పుడు కేవలము వాటి పేర్లు మాత్రమే కనబడు తున్నవి. కామన్సు లో picture of the day / media of the day మొదలగు బొమ్మలు కూడా కనబడడం లేదు.

అన్ని వికీ ప్రాజెక్ట్లల మొదటి పేజీలలోని వాటి లోగోలు కూడ మాయమైనవి. వికీపీడియా, విక్షనరి, వికీ సోర్సు మొదలగు వాటికున్న లోగోలు కూడ మాయమైనవి. వికి పీడియాలో ఈ వారం బొమ్మ కూడ రావడం లోదు. వాడుకరి పుటలోని ఎవరి బొమ్మలు కూడా రావడంలేదు. ప్రతి పుటలో ఈ మద్యన పెడుతున్న పురస్కార గ్రహీతలకు అభినందనలు. దానిలో కూడ అందరి బొమ్మలు రావడంలేదు. పరిశీలనగా వికీ సోర్సును కూడ చూచాను. (అవి కూడ పోటోలే కదా యని అవి కనిపిస్తున్నాయో లేదో నని పరిశీలన కొరకు చూసాను) లోని అన్ని పుస్థకాల పుటలు కూడా కనబడలేదు. తెలుగీకరించిన భాగాలు కనబడుతున్నాయి కాని వ్రాయ వలసిన భాగాలు కనబడడము లేదు.

ఇంత వివరంగా ఎందుకు వ్రాస్తున్నానంటే సాంకేతిక నిపుణులైన వికీపీడియన్లు జరిగిన తప్పిదాన్ని గ్రహించి తగు సూచనలు చేయగలరేమోనని. సత్వర పరిష్కారం తెలుప గలరని మనవి. Bhaskaranaidu (చర్చ) 08:06, 3 జనవరి 2014 (UTC) వాడుకరి ఎల్లంకి భాస్కరనాయుడు.[ప్రత్యుత్తరం]

  • బొమ్మలు వెబ్ పేజెస్ లో కనపడకపోవడానికి పలు సమస్యలు కారణమవచ్చు. ఒకటి- ఇంటర్నెట్ కనెక్షన్ స్లో ఉండటం, రెండు - ఏదయినా స్క్రిప్టు విహారిణి (బ్రౌజర్) లో బొమ్మల లోడింగును నిరోధించడం. మొదలగునవి. దీనికొక మార్గం - బ్రౌజర్ మార్చాలి లేదా ఇంటర్నెట్ కనెక్షన్ సరి చూసుకోవాలి. ఇక కామన్స్ లో అస్తవ్యస్తంగా అప్లోడ్ అయిన బొమ్మలను రోటేట్ రిక్వెస్ట్ పెట్టి తిప్పేలా అహ్యర్థన చేయవచ్చును! ఈ ఆప్షన్ బొమ్మ కిందనే ఉంటుంది . --రహ్మానుద్దీన్ (చర్చ) 08:35, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ధి ఉత్సవాలకు తేదీల నిర్ణయం (ఫిబ్రవరి 15, 16)

[మార్చు]

సభ్యులకు సంతోషకరమైన వార్త. కే.బీ.యన్. కళాశాల వారు తెలుగు వికీపీడియా దశాబ్ధి ఉత్సవాలను జరుపుకొనేటందుకు అనుమతించారు. ఫిబ్రవరి 15 మరియు 16 తేదీలలో కార్యక్రమం ఆ కాలేజీలో జరుపబడును. ఇప్పడు మొదలుకొని విజయవాడ కేంద్రంగా చుట్టుపక్కల పలు కళాశాలలోనూ, రాజమండ్రి, భీమవరం, నర్సాపురం మరియు కాకినాడల్లో ముందుస్తు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటుచేసే దిశగా మల్లాది కామేశ్వరరావుగారు తదితరులు కృషి చేస్తున్నారు. అందుకు వారికి కృతజ్నతలు తెలియచేస్తూ మీ యొక్క విలువైన సలహాలు అందించగలరని ఆశిస్తూ...విశ్వనాధ్ (చర్చ) 12:30, 5 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాలో ఆంగ్ల అంశాల చేర్పు

[మార్చు]

మూసలు మరియు నిర్వహణకు సంబంధించిన పేజీలు తెవికీలోకి దింపుకునే ముందు వాటిని పూర్తి స్థాయిలో తెలుగీకరించి చేయగలరు. ఈ మధ్య అర్జున గారు దింపుకుంటున్న అంశాలు తెలుగీకరించకుండానే జరిపేస్తున్నారు. ఇంతకు ముందు కేవలం ఆంగ్ల దారిమార్పులకే ఆంగ్ల పదాలు తెవికీలో పెరిగిపోతున్నాయని కొందరు సభ్యులు ఇంతకు ముందు జరిగిన చర్చలో స్పందించారు. ఇలాంటివి చేసేప్పుడు సభ్యులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:03, 6 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • రహ్మానుద్దీన్ గారికి నేను ఇంతకు ముందు వివరించినట్లు ప్రధానపేరుబరి మరియు ప్రధాన పేజీలోలో వాడే మూస పేరుబరులలో కనబడే అంశాలకు ఆంగ్లం అభిలషణీయం కాదు. అయితే మూసలనుఆంగ్లం నుండి దిగుమతి చేసుకోకుండా తెలుగులో నేరుగా చేయటం మరింత కష్టం. వాటిని అనువాదం చేయడానకి సహసభ్యులు ఇప్పటివరకు సహకరిస్తున్నారు.వీలైతే మీరు కూడా సహాయం చేయవచ్చు. --అర్జున (చర్చ) 00:29, 7 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
నేను చాలా మూసలు అనువాదం చేసాను. సముదాయం పరస్పర సహకారంతో మూసల గూర్చి అవగాహన ఉన్న ప్రతిఒక్కరు ఈ కార్యక్రమానికి సహకరించాలి. --కె.వెంకటరమణ (చర్చ) 01:17, 7 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఎ == దశాబ్ది వేడుకల పత్రీకరణ - ఔత్సాహికులకు అవకాశం == తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగే కార్యక్రమాన్నంతటినీ నివేదిక రూపొందించేవారికి బడ్జెట్ లో విడిగా కొంత సొమ్మును (రోజుకొక్కరికి రూ.2500/- చొప్పున నలుగురికి) ఉంచటం జరిగింది. రెండు రోజుల కార్యరమంలో జరిగే చిన్నా-పెద్ద విషయాలన్నిటినీ పత్రీకరించడం వీరి పని. ఆపై ఆ నివేదికను వివిధ రూపాల్లో (ప్రెస్ నోట్, ఈ-మెయిల్, వికీపీడియా పేజీల్లో రాయటం, మెటా వికీ వద్ద రాయటం మొ॥). ఆసక్తి ఉన్నవారు ఇక్కడ పేర్లు నమోదు చేయగలరు.
కార్యవర్గం, దశాబ్ది వేడుకలు
--రహ్మానుద్దీన్ (చర్చ) 12:23, 6 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ కార్యక్రమానికి పవన్ సంతోష్ మరియు విజయవాడలోని ఇతర స్నేహితులు ఒప్పుకున్నారు. వారికి ఈ పని అప్పగించడమయింది. --రహ్మానుద్దీన్ (చర్చ) 13:15, 24 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ దశాబ్ది వేడుకలకు సభ్యుల నమోదు

[మార్చు]

https://docs.google.com/forms/d/15IBuc1-mAT1D8xDuBAaU4g6NueTKW7709nhbQsMjyzg/viewform వద్ద గల ఫారంను నింపి మీ హాజరు గురించి తెలియచేయగలరు. ఈ ఫారంలో అన్ని గడులూ తప్పనిసరి అని గమనించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 10:41, 8 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారి పక్షపాత ధోరణి

[మార్చు]

మీరు తెవికీలో మీకు ఇష్టమైన సభ్యుల పట్ల ఆసక్తి కనబరుస్తూ ఇతర సభ్యుల పట్ల పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారు. కొందరి సభ్యులను బాగా కాచుకుంటున్నారు. ఉదాహరణకు ఇటీవల ఒక సభ్యుని చర్చా పేజీ లో రాసిన వ్యాఖ్యను సెకెండ్ల వ్యవధిలో తొలగించారు. ఈ ధోరణి అందరు సభ్యుల పట్ల ప్రదర్శిస్తే మంచిదని నా విన్నపము. ఐపి అడ్రసు తో ఈ వ్యాఖ్య చేస్తున్నాను. ఎందుకంటే నా వివరాలు తెలిస్తే మీరు కక్ష్య సాధింపు చర్యలకు దిగుతారు కాబట్టి. మీ ధోరణి దయచేసి మార్చుకోండి రాజశేఖర్ గారు.--2014-01-09T14:12:06‎ 122.167.222.91

మీ వివరాలు తెలియక్కరలేదు. కేవలం ఆధారాలు చూపమంటున్నాం అంతే. ఎత్తి చూపితే కక్ష్య సాధింపు చర్యలకు దిగుతారని అనుకోవటం చాలా విచారకరం. అలాగే ఇలా ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయటం కూడా సమంజసం కాదు. మీరు రాజశేఖర్ గారి మస్తిష్కాన్ని తిరగేసినట్టు, ఆయన అభిమతంపై అభియోగం చేయటం బాగోలేదు. ఏదైనా చర్చకానీ, విమర్శకానీ మంచి మార్పులకు దారితియ్యాలి. ఇది ఎక్కడికీ దారితీస్తున్నట్టు లేదు. మీరు వ్యక్తిగత వ్యాసాలపై చేసిన చర్చ మంచి దిశగా పరిణమించింది కానీ అక్కడా, వ్యాఖ్య చేసిన తీరు బాగోలేదు. --వైజాసత్య (చర్చ) 23:07, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారికి అలాంటి పక్షపాత దోరణి ఉన్నట్టుగా ఇన్ని సంవత్సరాల అనుభవంలో నాకనిపించుటలేదు. ఆయన కక్ష సాధించే వ్యక్తి అంతకంటే కాదు. కక్ష సాధింపు చర్యలకు ఇది ఎవ్వరి సొంత వెబ్‌సైట్ కాదు. మీరెవరైనా మీ పేరుతో నిర్భయంగా చర్చలలో పాల్గొని మీ వాదన రాయచ్చు....విశ్వనాధ్ (చర్చ) 07:12, 13 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున, Rajasekhar1961, విశ్వనాధ్, వైజాసత్య గార్ల స్పందనకు ధన్యవాదాలు. నాకు Rajasekhar1961 గారిపై ఎలాంటి వ్యక్తిగత ద్వేషము లేదు. ఆయనపై వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తెవికీ నిర్వాహకుడిగా ఆయన సమన్యాయం పాటించాలని వేడుకున్నాను. కొంతమంది సభ్యుల గురించి ఆయన తీసుకున్న కేర్ అందరి పట్ల చూపాలని కోరాను. ఈ మధ్య భాస్కర నాయుడు గారి చర్చా వేదికలో ఒక సభ్యుడు అసభ్య పదజాలం పోస్ట్ చేశాడు. దానితో బాటు నా సభ్యపేజీలో కూడా అదే పని చేశాడు. స్పందించిన రాజశేఖర్ గారు వెంటనే ఆయన చర్చా పేజీ లో నుండి ఆ సమాచారం తీసివేశారు. అదే పని అత్యంత సీనియర్ సభ్యుడినైన నా పట్ల కూడా చేయవచ్చు కదా? అదండీ విషయం. ఇంతకు ముందు నా సభ్యనామంతో కొన్ని ప్రతిపాదనలు చేసినప్పుడు నా చర్చా పేజీలో ఐపి అడ్రస్ తో అభ్యంతకర వ్యాఖ్యలు రాశారు. గత్యంతరం లేని పరిస్థుతులలో నేను కూడా వారి మార్గాన్నే (ఐపి ఆడ్రస్ యూస్ చేయడం) ఆశ్రయించవలసి వచ్చింది. భాస్కర నాయుడి పట్ల చూపిన శ్రద్ద మిగిలిన వారి పట్ల కూడా చూపండి. ఆయన చూడక ముందే ఆయా వ్యాఖ్య లను డిలీట్ చేశారే? నా పట్ల అదే పని ఎందుకు చేయలేదు? అర్జున గారు వికీ మర్యాద గురించి సెలవిచ్చారు. అయ్యా? నా వ్యాఖ్యలు చూస్తే నేను అమర్యాదకరంగా ఎవరినీ సంబోధించలేదు మరియు వ్యాఖ్యానించలేదు. కేవలం నా ఆవేదనను వెలిబుచ్చాను.--106.51.174.180 14:20, 14 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక అజ్ఞాత వాడుకరి (122.166.181.168 ) 21 డిసెంబర్ 2013 నాడు భాస్కరనాయుడు గారి చర్చా పేజీలో అసభ్య పదజాలం వ్రాసినపుడు అది చూచిన వెంటనే Rajasekhar1961 గారు తొలగించి మంచి పనే చేశారు. ఇందులో పక్షపాత ధోరణి ఏముంది? ఆ స్థానంలో మీరుంటే అలాగే వదిలేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. తెవికీ శ్రేయస్సు కోరే మీ వంటి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయచేయకుండా ఉండాల్సింది.----కె.వెంకటరమణ (చర్చ) 14:48, 14 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
నేను మొత్తం పరిశీలించాను. అజ్ఞాతవాడుకరి మరొకరి పేజీలో కూడా అలాంటి పదాలు వాడినట్లు తెలుసుకోలేకపోయాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:17, 14 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఇందులో నిష్పక్షపాతమేవీ లేదండి. మీ పేజీలో కూడా చేశారని ఆయన గమనించలేదేమో. ఇక సభ్యుల మధ్య సంబంధాల విషయానికొస్తే అందరూ, అందరితో పరస్పర సంబంధాలు (ఇంటరాక్షన్స్ అన్న అర్ధంలో వాడాను) నెరపటం చాలా కష్టం. ఉదాహరణకు రాజశేఖర్ గారితో అర్జున గారికి ఉన్న ఇంటారాక్షన్ నాకు లేదు, అలాగే సుజాత గారితో కూడాను. చంద్రకాంతరావు గారితో నాకున్నంత ఇంటరాక్షన్ రవిచంద్రగారితో లేదు. ఎందుకంటే రవిచంద్ర గారి సందేహాలు, సలహాలన్ని కాసుబాబు గారు తీర్చేవారు. అంతమాత్రంచేత నేను రాజశేఖర్ గారికంటే చంద్రకాంతరావు గారితో పక్షపాతంగా వ్యవహరిస్తున్నానని కాదు. మా మధ్యన వాడీ, వేడీ వాదోపవాదాలు చూసే ఉంటారు. వికీలో శిష్యరికం చేయటం అనే ఒక పద్ధతి కూడా ఉంది. కొత్తగా చేరిన వాళ్ళు ఇక్కడి నియమనిబంధనలు పద్ధతులు నేర్చుకునేందుకు ఒక అనుభవజ్ఞుడైన వాడుకరితో గురు-శిష్య సంబంధమేర్పరచుకొని, శిష్యరికం చేసి నేర్చుకొనేందుకు అవకాశం కల్పించారు. --వైజాసత్య (చర్చ) 04:08, 17 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ లో సభ్యుల వ్యక్తిగత వ్యాసాలు

[మార్చు]

ఈ మధ్య తెవికీ లో సభ్యుల వ్యక్తిగత వ్యాసాలు రాస్తున్నారు. ఈ సంప్రదాయము వీవెన్ గారి వ్యాసంతో ప్రారంభించారు. ఇది కొందరు సభ్యులను సంతృప్తి పరచవచ్చునేమో కాని మంచి సంప్రదాయం కాదు. నిర్వాహకులు కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయకపోవడము విడ్డూరంగా ఉన్నది. బహుశా ఆయా సభ్యులకు కోపం రావచ్చునేమో అని చూస్తూ ఊరుకున్నారనిపిస్తున్నది. సభ్యుల గురించి వారి వాడుకరి పేజీలలో రాస్తే సరిపోతుంది కాని, ప్రత్యేక పేజీలు అవసరమా? ఇదే చర్య ను ఆంగ్లవికీ లో చేస్తే నిర్వాహకుల స్పందన ఇలాగే ఉంటుందా? ప్రశ్నించే నిర్వాహకులు మన తెవికీలో ఉన్నా వారి గొంతు నొక్కేశారు. ఇప్పటికైనా పెద్దలు స్పందించి ఈ విషయంపై కనీసం చర్చిస్తారని కోరుకుందాం. తెవికీ కి మీరు నిర్వాహకులైనా మీరు ఆడింది ఆట, పాడింది పాట అని అనుకోవద్దు.- 2014-01-09T14:18:55‎ 122.167.222.91

  • సభ్యులలో ఎవరైనా సమాజంలో ప్రముఖులుగా పరిగణించబడితే వారిపై వికీ వ్యాసాలు తప్పక వుండవచ్చు. వీవెన్ గారిపై వ్యాసం తెలుగు సాంకేతిక రంగంలో ఆయనకున్న గుర్తింపుకి నాకైతే సమంజసమైనదనిపించింది. సభ్యులపై ఇతర వ్యాసాలు (ఉదా:పాలగిరి రామక్రిష్ణా రెడ్డి, మల్లాది కామేశ్వరరావు) గమనించి తగిన హెచ్చరిక మూసలు చేర్చడం జరిగింది. తెవికీలో ఇంతకు ముందు ప్రాముఖ్యతను స్పష్టపరచే చర్చలు, విధానాలలో ఎక్కువమంది సభ్యులు పాల్గొనకపోవడంతో అసంపూర్తిగా ముగిసాయి. ఎక్కువమంది సభ్యులు తమ సభ్యనామంతో చర్చలు జరిపి విధానంలో స్పష్టత తెచ్చుకొని వాటికి అనుగుణంగా లేని వ్యాసాలను తొలగించడం చేయవచ్చు. ఇక ముఖ్యమైన విషయం చర్చలు మర్యాదపూర్వకంగా జరిపి సమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాలని మనవి. --అర్జున (చర్చ) 01:37, 10 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • వీవెన్ గారి వ్యాసం చూసిన(నేను కూడా కొంత ఆ వ్యాసాన్ని విస్తరించిన) తర్వాత మన వికీపీడియన్లలో కొందరు ప్రముఖుల గురించి వ్యాసాలు తయారుచేయడం తప్పులేదని భావించి పాలగిరి రామక్రిష్ణా రెడ్డి గారి గురించి వ్యాసం మొదలుపెట్టాను. వికీపీడియన్ల గురించి వికీలో వ్యాసాలు వుండకూడదని నియమం ఏదైనా వుంటే నాకు తెలియదు. అలాంటి నియమం వుంటే తెలియజేయండి. నేను చేర్చిన సమాచారానికి రిఫరెన్సుల్ని తొందరలో వ్యాసంలో చేరుస్తాను. సభ్యులు ఎవరైనా నేను చేస్తున్న, చేసిన పని తప్పనిపిస్తే అది నాకు తెలియజేస్తే నేను సరిచేసుకొంటున్నాను. నేను వికీలో ఇంకా నేర్చుకోవలసినది చాలా వుంది. తప్పుచేస్తే దయచేసి పెద్దమనసుతో క్షమించమని మనవి.Rajasekhar1961 (చర్చ) 03:03, 10 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇందులో కోపం రావటానికి పెద్ద విషయమేమీ లేదండి. విషయప్రాధాన్యత అనేది సముదాయంతో పాటు విస్తరిస్తుంది. ప్రస్తుతానికి తెలుగు వికీపీడియన్ల గురించి స్వయంగా వ్రాసుకునే స్థాయిలో తెలుగు వికీ లేదని నా అభిప్రాయం. పైన ఉదహరించిన వ్యాసాలు తొలగించాలి. ఆంగ్ల వికీలో స్పందన వేరు, ఇక్కడి స్పందన వేరు. ఆంగ్ల వికీలో అయితే ఈ పాటికి "గొంతు నొక్కేశారు" వంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేసినందుకు మీరు ఎవరో, మీ వాడుకరి పేరు ఏమిటో మొత్తం కూపీలాగే వారు. మీరు లేవనత్తెని చర్చ సబబుగానే ఉంది. మీరు వ్యాఖ్యానిస్తున్న ధోరణి బాగాలేదు. వికీ ఎవరి ఆటా, పాటా కాదు మీకు నచ్చని విషయాలుంటే, మీ అభిప్రాయాలకు మద్దతునిచ్చేవారిని కూడగట్టుకొని విధానాలను మార్చే ప్రయత్నం చేయండి.
  • ఇక విషయప్రాధాన్యత కొస్తే ఇది ఒకసారి చర్చించి వదిలేసే విషయం కాదు. మళ్ళీ మళ్ళీ తలెత్తుతూనే ఉంటుంది. చర్చ ఎప్పటికీ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. ఎప్పటికప్పడు సముదాయపు విషయప్రాధాన్యత పరిధులు విస్తరిస్తూనే ఉంటాయి. en:Wikipedia:Notability చదవండి. కొన్నేళ్ళ క్రితం గూగుల్లో ఇన్ని ఫలితాలు రావాలి వంటి కొన్ని కృత్తిమ పరిమితులు ఉండేవి, కానీ సామాజిక మాధ్యమాల యుగంలో గూగుల్ ఫలితాల విలువ తగ్గిపోయింది. ముఖ్యమైన విషయమేమిటంటే ఇతర నమ్మదగిన, మాధ్యమాలలో ఆ వ్యక్తిని గురించికానీ, స్థలం, వస్తువు గురించి కానీ నిరూపించగల విస్తృతమైన సమాచారం ఉండి ఉండాలి, అది ప్రస్తుత సముదాయపు విజ్ఞాన పరిధిలో ఉండి ఉండాలి. కొత్త కొత్త విజ్ఞానం పుడుతున్న కొద్దీ, వికీలో చేర్చబడుతున్న కొద్ది, సముదాయం విస్తరిస్తున్న కొద్దీ ప్రాధాన్యత గురించి చర్చలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి తెలుగులో పోర్టోరీకో స్వతంత్ర పార్టీ అనే పేజీ ఉంది. దీనికి తెలుగు వికీలో విషయప్రాముఖ్యత ఉన్నదా?? అంటే లేదు. కానీ వ్యాసం ఆంగ్ల వికీ విషయప్రాముఖ్యతలో చక్కగా ఒదుగుతుంది. కానీ అదే పోర్టోరికో చరిత్ర గురించి, రాజకీయాల గురించే ఎవరైన పనిగట్టుకొని ఒక వంద వ్యాసాలు వ్రాశారనుకోండి అప్పుడు తెవికీలో కూడా అది విషయప్రాముఖ్యత పరిధిలోకి వస్తుంది. పాలగిరి గారు ఐదారేళ్ళ క్రితం ఒక ప్రత్యేకమైన వెల్డింగు పద్ధతి గురించి ఒక వ్రాసి వదిలేసి ఉంటే అది విషయప్రాముఖ్యత లేదని తొలగించి ఉండేవాళ్లం. --వైజాసత్య (చర్చ) 13:09, 11 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • తెవికీలో సభ్యులన్న ఒకే ఒక్క కారణంగా సమాజంలో వివిధ రంగాలలో కృషి చేస్తున్న పాలగిరి రామక్రిష్ణా రెడ్డి, మల్లాది కామేశ్వరరావు వంటి వారి వ్యాసాలను తొలగించమనడం సబబు కాదని నా అభిప్రాయం.----కె.వెంకటరమణ (చర్చ) 13:22, 11 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • వైజాసత్య గారికి, నా దృష్టిలో వికీలో మూలసూత్రాలు యధావిధిగా అంగీకరించాల్సినవి ( ఉదా:WP:NPOV). కొన్ని విధానాలు, మార్గదర్శకాలు ఆంగ్ల వికీవి అంగీకరించటానికి వీలైనవి (ఉదా:నకలు హక్కులు విధానం), మరికొన్ని విధానాలు, మార్గదర్శకాలు తెలుగు వికీ కి అన్వయించుకోవాల్సినవి (ఉదా:వికీపీడియా:శైలి, వికీపీడియా:విషయ ప్రాముఖ్యత )వుంటాయి. మొదట్లో తెవికీ కి అన్వయించిన కొన్ని విధానాలు ఏర్పడినా ఆ తరువాత చర్చలలో చాలా తక్కువమంది పాల్గొనటంతో మరికొన్నిటికి విధానమేర్పడలేదు.విధానం లేక మార్గదర్శకము లేనప్పుడు వికీ లో రచనలు ఎవరిష్టమైనట్లు వారు చెయ్యడమవుతున్నది. అందుకనే విధానం నిర్ణయానికి ఒక పద్ధతి కూడా సముదాయం భాగస్వామ్యంతో తయారుచెయ్యడం జరిగింది. ప్రాథమిక నియమాలు తప్పించి మిగతావేవి మార్పులేకుండా వుండాలని కోరడంలేదు కాని తెవికీ అన్వయించవలసిన విధానాలు మార్గదర్శకాలుచేయటం ఎక్కువమంది (కనీసం ఇద్దరు నిర్వహకులు లేక అధికారులతో కూడిన 5 గురు క్రియాశీలక సభ్యులు పాల్గొంటేనే సాధ్యమవుతుంది.--అర్జున (చర్చ) 04:56, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • కె.వెంకటరమణ గారూ, వాళ్ళు తెవికీ సభ్యులైనందు వళ్ళ ఆ వ్యాసాలు తొలగించమనట్లేదండి. ఒక సాంకేతికతలో జీవితకాలం పనిచేసిన ఇంజనీర్లు చాలామంది ఉండి ఉంటారు. వాళ్ల స్థాయి వారికి పెద్దగా తెవికీలో పేజీలు లేవు. కాబట్టి పాలగిరి రామక్రిష్ణా రెడ్డి వ్యాసం ప్రస్తుత తెవికీ విషయ ప్రాధాన్యత పరిధిలోకి రాదు. అలాగే తెవికీలో ప్రస్తుతానికి బాగా పేరుమోసిన ప్రధాన సంపాదకులకు తప్ప మిగిలిన వారికి పేజీలు లేవు. అలాగే వీరి గురించి ప్రాధమికేతర వనరులలో సమాచారం ఉండి ఉండాలి. మల్లాది కామేశ్వరరావు వ్యాసంలో ఉన్న ఒకే ఒక మూలం కూడా ఆయన సొంతగా వ్రాసుకున్న పరిచయం. విశ్వసనీయమైన నిర్ధారించదగ్గ మూలాలు లభ్యమౌతాయి అన్న నమ్మకం ఉంటే తప్పకుండా ఉంచవచ్చు. ఇందులో ఒక చిన్న మంచి విషయం ఏమిటంటే ఈ వ్యాసం ఆయన స్వయంగా వ్రాసుకోకుండా సుజాత గారు వ్రాశారు. వీవెన్ వ్యాసం ఎందుకు విషయ ప్రాధాన్యత లేదంటే, వీవెన్ స్థాయిలోనూ, ఇంకా క్రియాశీలకంగానూ తెలుగు సాంకేతికతకు కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ స్థాయిలో ఉన్న మరెవ్వరికీ తెవికీలో పేజీలు లేవు కాబట్టి వ్యక్తిగతంగా నేనాయన ఫ్యాన్నయినా, తెవికీలో వ్యాసం కూడదు. ఇది ప్రస్తుతపు అంచనా. భవిష్యత్తులో మారవచ్చు. ఇప్పటికిప్పుడు ఠకీమని తుడిచివేయకపోయినా we need to know where stand (తెలుగులో దీన్ని ఎలా చెప్పాలబ్బా) ఉదాహరణకి: పోర్టోరీకో స్వతంత్ర పార్టీ తుడిచివెయ్యలేదు. తుడిచివేసినా పెద్ద నష్టం లేదు. అది నేను ప్రారంభించిన వ్యాసమే. దానికి తెవికీలో విషయ ప్రాధాన్యత లేదని నాకు స్పష్టంగా తెలుసు. --వైజాసత్య (చర్చ) 07:04, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • సభ్యులు తమ గురించి స్వయంగా రచించుకోవడం మినహా బయటి ప్రపంచంలో పేరుతెచ్చుకున్న సభ్యుల వ్యాసాలు తెవికీలో ఉండరాదని చెప్పలేము. కాకుంటే ఏ వ్యాసంలోనైననూ మూలాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, సభ్యుల వ్యాసాలకు మూలాల విషయంలో మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సివస్తుంది లేనిచో మునుముందు సభ్యుల మధ్యన వాదనలు జరిగే అవకాశమూ ఉంటుంది. ఆరేళ్ళ క్రితం నిసార్ అహ్మద్ గారి వ్యాసంపై జరిగిన వాదనలు ఇక్కడ చూడవచ్చు. పాలగిరి గారి లాంటి వ్యాసాలు తెవికీలో ఉండరాదని చెప్పలేము కాని ఇప్పుడున్న సమాచారంలో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. వ్యాసంలో తెవికీ కృషి గురించి, రచించిన వ్యాసాల లింకులన్నీ వ్యాసపు పేజీలో ఉండాల్సిన అవసరం లేదు. అది సభ్యపేజీకి సంబంధించినది. పాలగిరి గారి వ్యాసం ఎలా ఉండాలో ఇక్కడ చూడండి. ఇక ఈ చర్చలేవనెత్తిన సభ్యుడి కోపాన్ని నేను కొంతవరకు సమర్థిస్తాను. చాలాకాలం నుంచి తెవికీలో నిర్వహణ అనేది అస్తవ్యస్తమైపోయింది. ఒక కొత్తసభ్యుడు మొదటిపేజీలో ఇష్టమున్నట్లు బొమ్మలు పెట్టిననూ, నిబంధనలు ఉల్లంఘించిననూ నిర్వాహకులు కూడా ఏమీ చెప్పలేక ప్రేక్షకపాత్ర వహించాల్సిరావడం పదేళ్ళ చరితమున్న తెవికీకి సమంజసమైన విషయం కాదు. మొదటిపేజీలో ప్రదర్శించడానికి ముందు ఆయా బొమ్మలకు చెందిన చర్చాపేజీలలో ముందస్తుగా ఈ వారం బొమ్మ పరిగణన మూసపెట్టడం, సభ్యులనుంచి ఏమైన సందేహాలు (ఉంటే) తీసుకోవడం నియమము మరియు పద్దతి. ఇదివరకు కూడా ఒకే సభ్యుడు తాను అప్లోడ్ చేసిన బొమ్మలనే వరసగా అనేక వారాలపాటు ప్రదర్శించిననూ ఎవరూ పట్టింకోలేరు! నియమాలకు విరుద్ధంగా జరిగే తప్పులు ఎవరైనా లేవనెత్తిననూ తప్పు సరిదిద్దడం వదిలేసి తెలియజేసిన సభ్యుని పైనే ఎగిరేవారూ ఉన్నారు. ఇలాంటి కారణాలవల్లే కుప్పలు కుప్పలుగా తప్పులు జరుగుతున్నా చెప్పలేని పరిస్థితి! మూసలు, వర్గాల విషయంలోనూ కొందరు సీనియర్ సభ్యులకు కూడా అవగాహనలేదు. ప్రాజెక్టుపేరు ఏదైనా పెట్టుకుంటాం కాని మూసపేరు, వర్గం పేరులనేవి పాఠకుల దృష్టితో పాఠకుల సౌలభ్యానికి అనుగుణంగా ఉండాలి. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు కాని తెలియజేసిన విషయాలు సమంజసమేనని, ఇవి తెవికీ అభివృద్ధి కొరకే తెలియజేస్తున్నారని పట్టించుకోనప్పుడు చెప్పడం వృధాయే. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:08, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • చంద్రకాంతరావు గారూ, పైన సభ్యుని నేను సమర్ధించాను, కాకపోతే చర్చకు అవసరం లేని ఆయన చేసిన ఇతర వ్యాఖ్యలను మాత్రమే ఖండించాను. తప్పులు జరుగుతున్నప్పుడు లేవనెత్తాలి, చెప్పాలి. దానికి ఎవరూ అడ్డుచెప్పట్లేదు. మీరూ నిర్వాహకులే కదా. దయచేసి ఏవైనా తప్పులు గమనించినప్పుడు లేవనెత్తకుండా మౌనం వహించవద్దు. --వైజాసత్య (చర్చ) 07:36, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • వైజాసత్యగారూ, చాలాకాలం నుంచి ఇక్కడ జరుతున్న పరిణామాలు మీకు చూస్తున్నారు కదా! సీనియర్ సభ్యులు, నిర్వాహకులే తప్పులు చేస్తున్నారు. కొత్తసభ్యులకు మార్గనిర్దేశ్యం చేయాల్సిన అనుభవమున్న సభ్యులే తప్పులపై తప్పులు చేస్తూ పైగా తాము చేసిందే సరైనదనే ధోరణిలో ఉన్నారు. నియమాలపై పూర్తి అవగాహన ఉండనప్పుడు తెలుసుకోవాలి లేదా ఎవరైనా తెలియజేసినప్పుడైనా సరిదిద్దుకోవాలి. చెప్పేవారిపైనే కోపాన్ని ప్రదర్శించడం బాగుండదు. పైన సభ్యుడు ఐపీ అడ్రస్‌తో వ్రాయడానికి కారణం అదేననుకుంటా! సి. చంద్ర కాంత రావు- చర్చ 07:50, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ప్రారంభించిన పాలగిరి రామకృష్ణారెడ్డి వ్యాసాన్ని తొలగించాను. సభ్యులు, నిర్వహకులు, అధికారులు జరిపిన చర్చ ఆధారంగా ఈ వ్యాసానికి మూలాలు లేవు అనే కారణం చేత నేనీ వ్యాసాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నాను. మంచి సలహాలిచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఒక సభ్యుని చర్చ పేజీలో చేర్చబడిన సమాచారాన్ని తొలగించాలని ఒక అజ్ఞాత వ్యక్తి తెలియజేసిన విషయం. అదేమిటో తెలియజేస్తే దాన్ని కూడా తిరిగి చేర్చుతారు.Rajasekhar1961 (చర్చ) 10:21, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీ విధి విధానాలు పూర్తిగా అవగాహన లేక పోవడం చేత పై వ్యాఖ్య చేశాను. మంచి సలహాలు అందించిన అందరికీ ధన్యవాదాలు.----కె.వెంకటరమణ (చర్చ) 13:01, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియన్లకు వ్యాసం వ్రాయాలని నేను ఈ వ్యాసం వ్రాయలేదు. మల్లాది కామేశ్వరరావు గారు పుస్తక రచయిత, కథారచయిత, కవితలు వ్రాసారు, వ్యాసాలు వ్రాసారు, నాటకానికి వచనం వ్రాసారు, పత్రికలలో అబద్ధాల కథలు వంటి పలు శీర్షికలు నిర్వహించారు, ఎంతోకొంత నాటకానుభవం ఉంది మొత్తానికి బహుముఖ ప్రఙాశాలి. 34 సంవత్సరాల పత్రికారంగ అనుభవం ఉంది. పత్రిక అనేది ప్రజలతో అనుబంధమున్న మాధ్యమం కనుక తెలుగు రచయితగా ఆయన పేరుతో వ్యాసం వ్రాసాను. ఇది వికీపీడియా నిబంధనలకు అనుగుణంగా ఉన్నదని వ్రాసాను. ఆయన వ్రాసిన పుస్తకాల ముఖపత్ర చిత్రాలు వ్యాసంలో ఉన్నాయి. ఆయన వ్రాసిన పుస్తకం స్వయంగా చదివాను. అది వ్యక్తిత్వ వికాసానికి తోడ్పాటును అందిస్తూ ధారణా శక్తిని అభివృద్ధి చేసే పుస్తకం.

అది నాకు నచ్చింది కనుక దానిని గురించి వ్రాసాను. నిజానికి ఆ పుస్తకం చదివి పక్కన పెట్టేది కాదు. ఒక స్నేహితునిలా ఎప్పుడూ పక్కన ఉంచుకొనతగినది. రచ్చబండలో స్వంత అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఉంది కనుక ఇది వ్రస్తునాను. ఆయనకు ప్రముఖులతో ఉన్న పరిచయాలు విస్తారం. అయినా ఆయన నిరాడంబరుడు, వినయశీలి, కార్యదక్షుడు. వ్యాసానికి అవసరమనుకుంటే మరిన్ని ఆధారాలు చేరుస్తాను. ఈ విషయంలో అభ్యంతరాలు ఉంటే చర్చించండి. --t.sujatha (చర్చ) 14:25, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఒకే, సుజాత గారూ, మీరు చెప్పినవి అర్ధమైనవి. చంద్రకాంతరావు గారు సూచించినట్టు మల్లాది కామేశ్వరరావు వ్యాసానికి మరిన్ని ప్రాథమికేతర మూలాలు/ ఆధారాలు చేర్చాలి. ఇక మూల విషయానికొస్తే అర్జున గారన్నట్టు విషయ ప్రాధాన్యతకు కొన్ని నియమాలు ఏర్పరచుకోవాలి. అయితే ఈ మార్గదర్శకాలలో ప్రతి చిన్నదాన్నీ చర్చించేందుకు తగిన సమయం గానీ, సంఖ్యాబలం గానీ ప్రస్తుతం ఈ సముదాయానికి లేవు. కాబట్టి తొలిమెట్టుగా ఆంగ్ల వికీలో విషయప్రాధాన్యతపై ఉన్న నియమాలను యధాతథంగా తెలుగులో అనువదించుకోవాలి. ఆ తర్వాత నియమాలను తెలుగుకు అన్వయించడానికి ఏమైనా మార్పులు చేయాలో వాటి చర్చా పేజీలో చర్చించి, తగు మార్పులు చెయ్యాలి. తెలుగులో మార్గదర్శకాలను చిత్తుప్రతి నుండి మొదలుపెట్టడం అనవసరం, ఆచరణీయం కూడా కాదు. --వైజాసత్య (చర్చ) 23:01, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
చిన్న చిన్న సినీ, నాటక రంగ వ్యక్తులకే తెవికీలో వ్యాసాలున్నపుడు నాటకాలో విశేషకృషిచేసిన మల్లాది గారికి వ్యాసం ఉండటం తప్పులేదు. నాటకాల్లో కృషిచేసిన అనేకులకు మూలాలు దొరకటం లేదు. ఏదో ఒక వెబ్‌సైట్‌లో రాసిన ముక్కే ఆధారంగా వ్యాస ఉన్నతి నిర్ధారణ చేయడం ఏమంత సమంజసం కాదు. రాసిన రచనలు, నటించిన నాటకాల్లో బహుమతులు, ప్రస్తుత ఉధ్యోగ భాద్యతలు వంటివి ఆయనపై వ్యాసం కొరకు సరిపోతాయి. అయినా ఆయన తెవికీలో పనిచేస్తున్నాడు కనుక ఆయన వ్యాసంపై ఎక్కువ చర్చించడం తగదు. ఎందుకంటే తెవికీకి రాక మునుపే ఆయన రంగస్థల, రచనా రంగంలో కృషిచేయడం జరిగింది...విశ్వనాధ్ (చర్చ) 07:31, 13 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
పాలగిరి గారి వ్యాసాన్ని పునఃస్థాపించాను. ప్రత్యేకంగా ఆ ఒక్క వ్యాసాన్ని మాత్రమే తొలగించాలని ఎవరూ అభ్యంతరపర్చలేరు. మూలాలు లేని కారణంగా ఎవరికైనా అభ్యంతరం ఉంటే చర్చతీయవచ్చు. మూలాల కొరకు ఎవరైనా ప్రయత్నించి వ్యాసంలో చేర్చితే మంచిది. రమణగారు ఈ పనిచేస్తారని భావిస్తున్నాను. పాలగిరిగారి గురించి పత్రికలలో వచ్చియుంటే ఆ ఆధారం కూడా చేర్చండి. ప్రస్తుతం వ్యాసంలో ఉన్న తెవికీ వ్యాసాల లింకులు మాత్రం తోలగించవచ్చు. కొంతకాలం వరకు కూడా ఈ వ్యాసంలో మూలాలు చేర్చబడనప్పుడు మూలాలు లేని ఇతర వ్యాసాలతో పాటు ఈ వ్యాసంపై కూడా తొలగింపునకు చర్య తీసుకోవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:17, 13 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
"చిన్న చిన్న సినీ, నాటక రంగ వ్యక్తులకే తెవికీలో వ్యాసాలున్నపుడు మల్లాది గారికి వ్యాసం లేదన్నది" సరైన వాదన కాదు. నాటక రంగ నటులకు, సినిమా నటులకు ఒక వర్గంగా అనేక వ్యాసాలు చేర్చి ఆయా రంగాలకు తెవికీ పరిధి విస్తరించబడింది. తెవికీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన చిన్న చిన్న గ్రామాలకు కూడా పేజీలున్నవని, పంజాబ్ రాష్ట్రంలోని గ్రామాలకు తెవికీలో పేజీలు చేర్చలేం. మల్లాది గారు నాటక రంగంలో కూడా కృషిచేశారని నాకు తెలియదు. తెలియజేసినందుకు ధన్యవాదాలు. వ్యక్తిగతంగా పాలగిరి గారి పేజీ, వీవెన్ పేజీ ఎందుకు ఉంచాలో నాకింకా అర్ధం కాలేదు. కానీ సముదాయపు నిర్ణయాన్ని శిరసావహిస్తూ వాటికి తగిన ఆధారాలు చేర్చేందుకు నేనూ కృషి చెయ్యగలను --వైజాసత్య (చర్చ) 07:01, 14 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్యగారు చెప్పిన "విషయప్రాధాన్యత" సమంజసమైనదే. కేవలం ఒక్క వ్యాసాన్ని మాత్రమే తొలగించడంతో నేను పునఃస్థాపించవలసి వచ్చింది. కేవలం మూలం ఆధారంగా తెవికీలో సభ్యుల వ్యాసాలు చేర్చాలంటే ఇంకనూ చాలా సభ్యుల వ్యాసాలు చేర్చవలసి వస్తుందేమో! మరొక్క విషయం చెప్పదలుచుకున్నాను- తెవికీని సందర్శించే పాఠకులను దృష్టిలో ఉంచుకొని రచనలు చేయాల్సిన మనం, పాఠకుల అవసరార్థం వారికి ఉపయోగకరమైన వ్యాసాలను రచించి విజ్ఞానసర్వస్వాన్ని పరిపుష్టి చేయాలే కాని మనల్ని మనం ప్రచారం చేసుకోవడం కాదు కదా! మన వ్యాసాలను మనమే రచించుకొని పాఠకులపై బలవంతంగా రుద్దడం ఎంతవరకు శ్రేయస్కరం? సభ్యులకు తమకు ఇష్టమైన వ్యాసాలపై పనిచేసే స్వేచ్ఛ ఉంది అంటే ఇలా కాదు. బయటి ప్రపంచంలో కృషి వల్ల పాఠకులు మన గురించి తెలుసుకోవాలనే సందర్భం వచ్చినప్పుడు మన గురించి వ్యాసాలు రచిస్తే అప్పుడు ఎవరికీ అభ్యంతరం ఉండదనుకుంటాను. అంతేకాకుండా పరిశోధన వ్యాసాలు వికీలో చేర్చరాదనేది ప్రాథమిక సూత్రమే. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:53, 14 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియన్లకు వ్యాసాలు వ్రాయడం నా అభిమతం కాదు. మల్లాదిగారు వ్రాసిన విజయానికి ఎనిమిది సూత్రాలు సరికొత్త ప్రయోగాలలో ఒకటి. అది ఇప్పటికే రెండు ముద్రణలు పూర్తిచేసుకుని మూడవ ముద్రణకు సిద్ధంగా ఉంది. పైగా ఆ పుస్తకం కన్నడంలో ప్రచురించడానికి ఒప్పందాలు ముగిసాయి. కనుక పుస్తకం ప్రాముఖ్యతను అనుసరించి వ్యాసానికి ఎంచుకున్నాను. మల్లాది గారు వికీపీడియన్ కాకమునుపే రచనా ప్రక్రియలో పలు ప్రక్రియలలో ప్రవేశం ఉంది. ప్రముఖ వారపత్రికలలో మాయాలోకం వంటి కారికేచర్లు కొన్ని సంచత్సరాల కాలం నిర్వహించారు. ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారితో నాటకాలలో నటించిన అనుభం ఉంది. దాసరి నారాయణరావుగారి వద్ద నాటకవచనకర్తగా రూపకర్తగా బహుమతి అందుకున్నారు. తూర్పుగోదావరి కథారచయితల పరిథిలో ఆయన పేరు ఉండవచ్చు. ఈ దృష్టిలో ఆయన వ్యాసం ఉందేకాని. వికీపీడియన్‌గా కాదు. వ్యాసంలో వికీపీడియా అనికాని వికీపీడియన్ అని కాని ప్రస్తావన కూడా లేదు. తెలుగక్షరం మీద ఉన్న ఆరాధనతో అక్షరాన్ని నమ్ముకుని అక్షరాన్ని ప్రేమించే రచయితగా మాత్రమే మల్లది గారి వివరాలు అందుబాటులో ఉన్నందున వ్యాసం వ్రాసాను. రచయిత కృషి వ్యాసంలో విపులంగా ఉండడం గమనించ వచ్చు.
ఈ చర్చ లో పాల్గొన్న వాడుకరులు వైజాసత్య,C.Chandra Kanth Rao,.విశ్వనాధ్, అర్జున,Rajasekhar1961 ,కె.వెంకటరమణ ,t.sujatha గార్లకు ధన్యవాదములు. గత పదేళ్ళనుండి తెవికీ ప్రగతిని చూస్తున్న నేను ఈ మధ్య తెవికీ ప్రమాణాలు దిగజారుతుండటంతో ఆవేదనతో ఈ వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది. నాకు వ్యక్తిగతంగా ఏ సభ్యుడి పట్లగానీ మరియు నిర్వాహకుల పట్ల గాని ఎలాంటి ద్వేషం లేదు . నా ఆవేదనకు అక్షరరూపం ఇవ్వడంలో తీవ్ర పదజాలం వాడవలసి వచ్చింది. అది కొందరు సభ్యులకు అమర్యాదకరంగా తోచినట్లయితే మన్నించగలరు. ఇది డైనమిక్ ఐపీ కావున నా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే అనవసరంగా ఈ ఐపి నంబర్ వాడిన ఇతర సభ్యులెవరైనా ఉంటే వారిపై అనుమానాలు రావచ్చు. కావున ఈ ప్రయత్నము విరమించగలరు. ఈ చర్చ యొక్క అవుట్ కం ను ఒక నియమంగా రూపుదాల్చితే అది అర్ధవంతమైన ముగింపుగా ఉంటుంది. తెవికీ లో ఎంతమందికి సభ్యుల వ్యాసాల వలన ఉపయోగమో నిజంగా ఉఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే సమాధానము ప్రతి ఒక్కరికీ తెలుసు. నూనె లపై వ్యాసాలు విద్యార్థికి అవసరమేమో గానీ ఆ వ్యాసాలు రాసిన సభ్యుడి గురించి తెలుసుకొని ఏమైనా ఉపయోగమున్నదా? అలాగే లేఖిని మరియు విజయానికి ఎనిమిది సూత్రాలు వ్యాసాలకు కూడా ఇదొ వర్తిస్తుంది. అంతగా ఆయా వ్యాస రచయితల గురించి తెలుసుకోవాలంటే వ్యాస చరిత్ర ద్వారా ఆయా సభ్యుల పేజీలకు వెళ్ళవచ్చు. t.sujatha గారూ. మీరు మల్లాది గురించిన సమస్త సమాచారం ఆయన సభ్యపేజీలోనే చేర్చవచ్చును కదా? ,Rajasekhar1961 గారూ, మీరు కూడా పాలగిరి గారి సమాచారం ఫోటో తో సహా ఆయన సభ్యపేజీలో చేర్చవచ్చు కదా? ఒక్క సారి ఈ విషయంపై అందరూ ఆలోచించి తెవికీ నాణ్యత గురించి తగిన చర్యలను చేపట్టవలసిన సమయం ఆసన్నమైనది.--106.51.174.180 14:07, 14 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
మీ వ్యాఖ్య సమంజసమే కాని ఐపీ అడ్రస్‌తో కాకుండా సభ్యనామంతోనే వ్రాస్తే బాగుండేది. సభ్యనామంతో వ్రాసినప్పుడు ఎవరైనా కక్ష్యసాధిస్తారని కాకుండా మీ అభిప్రాయాలు నిర్భయంగా తెలపండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:18, 14 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
పాలగిరి రామక్రిష్ణా రెడ్డిఅని నా పేరు మీద వున్న వ్యాసాన్ని తొలగించమని కోరుచున్నాను.ఆయిల్ టెక్నాలజీలో పట్టభద్రుడిని అయ్యినప్పటికి,నూనె పరిశ్రమలో నాకు విశేష అనుభవం వున్నప్పటికి,నా అనుభవాన్ని,ప్రతిభను ఇప్పటివరకు కేవలం నా జీవనోపాధికై చేసినది.ఇందులో సమాజనికి చేసిన సేవ ఏమిలేదు,అలాగే సమాజనికి కలిగిన ప్రత్యేకమైన మేలు కూడా ఏమి లేదు,నా పరిశోధనల వలన ఎమైన మేలు ఉందంటే అధి కేవలం పరిశ్రమల యజమానులకు కలిగింది.నాకన్న ఈ సమాజానికి సేవచేసిన వారు అనేకులున్నారు.నా జీవిత చరిత్ర ఇతరులకు ప్రభోదాన్ని కల్గించెటంత గొప్పదేమికాదు. వికిఫీడియాలో రచనలు చెయ్యకముందే అయిల్ టెక్నాలజీ గురించిన పుస్తకాల రచనలవలన ఆయిల్ పరిశ్రమలలో చెయ్యువారికి వ్యక్తిగతం గా నేను పరిచయమే, సంప్రదింపుల నిపుణుడిగా అయా పరిశ్రమలలోని కార్మికుల ను కలసినప్పుడు నూనెల గురించి నేను వ్రాసిన పుస్తకాల గురించి చెప్పి ప్రశంసిస్తుంటారు.ఆ గుర్తింపు చాలు.అందువలన నా పేరు మీద వున్న వ్యాసాన్ని తొలగించమని కోరుచున్నాను.కన్నడ వికీపీడియాలో కూడా ఈ మధ్య ఇలాంటి వే చోటు చేసుకుంటున్నాయి.ఈ మధ్యకాలంలో సభ్యులుగా చేరుతున్నవారందరు ముందుగా తమపేరుమీద వ్యాసాలు వ్రాసుకోవటం మొదలు పెట్టారు.Palagiri (చర్చ) 11:31, 22 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
పాలగిరి గారూ, సమాజానికి చేసిన సేవ ఏమీ లేదనే కారణంతో మీ వ్యాసం తెవికీ నుంచి తొలగించాలంటున్నారు, అది మీరు పెద్దమనసుతో తెలుపుతున్న అభిప్రాయం. కాని తెవికీలో ఒక వ్యక్తి వ్యాసం ఉండుటకు సమాజ సేవకు ఏమీ సంబంధం లేదు. అలా అనుకుంటే వ్యాసాల పరిధి చాలా తగ్గిపోతుంది. ఒక వ్యక్తి వ్యాసం ఉండుటకు బయటి ప్రపంచంలో పేరువచ్చిందా లేదా అనేదే ముఖ్యం (మరికొన్ని ఇతర కారణాలు, నియమాలు ఉన్నాయనుకోండి). సంఘసేవకులు, సమరయోధులులతో పాటు దేశద్రోహులు, నరహంతకులు, తీవ్రవాదుల వ్యాసాలు కూడా వికీలలో ఉన్నాయనే విషయం మీకు తెలుసేననుకుంటున్నాను (అంటే ఎవరి వ్యాసమైనా ఉంచవచ్చన్నమాట). అయితే సభ్యుల పేర్లతో వ్యాసాలుండటం ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో నైనా పెద్దస్థాయిలో చర్చలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దీనికి బలమైన మూలాలు అవసరం. మీవద్ద మూలాలుంటే ఎవరికైనా మెయిల్ పంపడం కాని చర్చాపేజీలో వ్రాయడం కాని చేయండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:31, 23 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వీక్షణలు

[మార్చు]
  • పై స్పందనలు గమనించినతరువాత నా స్పందన: వికీలో వ్యాసాలు చేర్చడం లేక పరిధి విస్తరించడం ప్రతిసారి ప్రాజెక్టు రూపంలోనే జరగదు.అందుకని వాడుకరి:వైజాసత్య గారి అభిప్రాయంతో ఏకీభవించలేను. వ్యాసం వున్నా వీక్షణలు లేకపోతే ఆ విషయానికి లేక వ్యక్తికి గుర్తింపులేనట్లే. నా అనుభవంలో మన తెలుగువారు ముఖ్యంగా చాలా మంది వికీ సభ్యులు అతి నమ్రతతో కనీస స్థాయిలో కూడా తమకృషిని చెప్పుకోవడం మరియు ఇతరత్రా కారణాలవల్ల సహసభ్యులను కృషిని తగిన విధంగా గుర్తించడంలో వెనుకబడి వున్నాము. ఇటీవలి ఉగాది మహోత్సవాల వరకు మనలో ఎంతమంది తమ ఛాయాచిత్రాలను సభ్యపేజీలలో చేర్చారో చూస్తే, వికీఅభివృద్ధికి కృషి చేస్తున్న వారి పేర్లను మొదటి పేజీలో మీకు తెలుసా శీర్షికలో ప్రదర్శించినప్పుడు జరిగిన పాతచర్చ గమనించితే, మరియు వికీపీడియా:రచ్చబండ#'వికీపీడియాలో రచనలు చేయుట' లో ప్రదర్శితమయ్యే సభ్యులకు విజ్ఞప్తి కి ఇప్పటికి వచ్చిన స్పందనలను చూస్తే తెలుస్తుంది. అయితే ప్రాజెక్టు అభివృద్ధికి ప్రాజెక్టు ప్రచారం మరియు సభ్యుల కృషికి గుర్తింపు అవసరమే. ఇక 'విషయ ప్రాధాన్యత' తెవికీ ని అన్వయించడానికి గల ప్రాముఖ్యం పై అందరికి ఏకాభిప్రాయం కుదరటం సంతోషం. ఆ దిశగా చర్యలకు చర్చలో పాల్గొన్న సభ్యులు ముఖ్యంగా చర్చకు కారణమైన అనామక సభ్యుడు చొరవతీసుకుంటే మన చర్చలకు సత్ఫలితం వచ్చినట్లవుతుంది. పది సంవత్సరాలనుండి తెవికీ పై ఆసక్తి/ క్రియాశీలంగా వున్న సభ్యుడు సహసభ్యులపై వ్యక్తిగత విద్వేషాలు లేవని స్పష్టం చేశారు కాబట్టి వికీ పేరుతో వ్యాఖ్యలు మరియు రచనలు చేయమని కోరుతున్నాను. ప్రస్తుతమున్న వ్యాసాల తొలగింపు చర్చలకు రచ్చబండ సరియైన వేదిక కాదు. వ్యాసంలో తొలగింపు ప్రతిపాదన చేసి సంబంధిత చర్చను తొలగింపు చర్చలకు కేటాయించిన పేజీలలో చేయడం మంచిది.--అర్జున (చర్చ) 04:24, 15 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • అర్జున గారూ, మీరన్నట్టు అన్నిసార్లు పరిధి విస్తరణ మూకుమ్మడిగా (వ్యవస్థీకరిస్తే ప్రాజెక్టు) జరగకపోవచ్చు. కానీ హిట్లు లేకపోతే ప్రాముఖ్యత లేదన్నది సరైన తర్కం కాదు. ఉదాహరణకు మురారి రావు అన్న వ్యాసానికి ఎన్ని హిట్లు వస్తాయో నాకు తెలియదు, కానీ ఈ వ్యక్తి 18వ శతాబ్దపు దక్షిణభారత చరిత్రలో చాలా కీలకమైన వ్యక్తి. పాప్యులారిటీ ఉంటే విషయ ప్రాముఖ్యతకు దోహదపడుతుంది, కానీ పాప్యులర్ కానంత మాత్రాన విషయ ప్రాముఖ్యత లేనట్టు కాదు. --వైజాసత్య (చర్చ) 03:47, 17 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • వైజాసత్య గారి స్పందనకు ధన్యవాదాలు. http://stats.grok.se/ ప్రకారం గత 90 రోజులలోమురారి రావు దారిమార్పు రూపాలతో కలుపుకొని 19 సార్లు వీక్షించబడింది. మన ప్రాముఖ్యతను తెవికీని చదివేవారి దృష్టింలోంచి, ప్రస్తుత కాలమాన పరిస్థితుల సందర్భంలో చూస్తే ఆ వ్యాసం ప్రముఖమైనది కాదు. ఆయా వ్యక్తి ఒకానొక కాలంలో ప్రముఖ వ్యక్తి అయివుండడంలో సందేహం లేదు. నేను ప్రాముఖ్యతా నియమాలతో పాటు, వీక్షణలు ఆధారితంగా నిర్ణయించేదే పరిపూర్ణమైన ప్రాముఖ్యత లేక గుర్తింపు(Notability) అని నమ్ముతాను.--అర్జున (చర్చ) 04:21, 17 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • అర్జునరావుగారూ, వ్యాసం యొక్క ప్రాధాన్యత/ప్రాముఖ్యతను నిర్ణయించేది వ్యాస వీక్షణల సంఖ్య కాదనుకుంటాను. అసలు ఈ వీక్షణలు ఎలా జరుగుతున్నాయో మనకు తెలుసుకదా! వీక్షణలు అధికంగా లింకులద్వారానే జరుగుతున్నాయనేది మన పరిశీలనలలో తేలింది. అలాగే ఒక సమయంలో అధికంగా వీక్షణలు జరిగిన వ్యాసాలు మరికొంతకాలానికి అసలు వీక్షణలు జరుగకపోవచ్చు. వర్తమాన విషయాలకు సంబంధించిన వ్యాసాలలో ఈ మార్పును మనం స్పష్టంగా గమనించవచ్చు. మురారిరావు వ్యాసానికి ఏదో ఒక శీర్షిక ద్వారా మొదటిపేజీలో లింకు ఇవ్వండి, అప్పుడు వీక్షణలు తప్పకుండా పెరుగుతాయి, అంటే మొదటిపేజీలో లింకివ్వగానే ఆ వ్యాసం "ప్రముఖ"మైనట్లా? ప్రాధాన్యత పెరిగినట్టా? అసలు ఏ వ్యాసాన్ని "ప్రముఖ"మైనట్లు మనం చేయలేము! కాబట్టి ఈ వీక్షణల సంఖ్యలో వచ్చే మార్పుల వల్ల వ్యాస ప్రాధాన్యతను నిర్థారించలేము. అలాగే మీకు తెలుసా శీర్షికలో వ్యాస విషయకర్తలుగా సభ్యులపేర్లను ఉంచడానికి నేనెందుకు అభ్యంతరపర్చానో మీరు నా అసలు భావాన్ని గ్రహించలేరు. బొమ్మలు మాత్రం ఖచ్చితంగా సభ్యులవే, అవి ఎక్కడి నుంచి కాపీ చేయరాదు, కాబట్టి బొమ్మలకు సంబంధించి అప్లోడ్ చేసిన సభ్యుల పేర్లు ఇవ్వడం సమంజసమే కావచ్చు, కాని వ్యాస సమాచారం మాత్రం సభ్యులది కాదు. వ్యాసంలోని ప్రతి ప్రధాన వాక్యం ఏదో ఒక వనరు నుంచే తీసుకోవాలి తప్ప సభ్యుల స్వంత భావాలు అస్సలు ఉండరాదు, కాబట్టి మరికొన్ని కారణాలతో పాటు ఈ ప్రధాన కారణంతో వాక్యాలకు సభ్యుల పేర్లు అవసరం లేదన్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:08, 17 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • వికీపీడియాలో వ్యాసాలు శాశ్వతంగా ఉంటాయి. శాస్వతంగా ఉండే సమాచారానికి వీక్షణలు ప్రధానం కాదు. అణువు నుండి బ్రహ్మాండం వరకు, ఇసుక రేణువు నుండి విశ్వాంతరాల వరకు, నక్క గురించి నాకలోకం గురించి విపీకీపీడియాలో వ్యాసాలు ఉండవచ్చన్నది వికీపీడియన్లందరికీ తెలుసు.
  • వికీపీడియా వ్యాసాలు రోజూ చూడరు. అవసరమనుకున్నావారు అవసరమైనప్పుడే చూస్తారు. భారతదేశం గురినిచి రోజూ వీక్షణలు ఉండవు. అందుకని అది విషయ పధాన్యత లేని వ్యాసం కాదు. కనుక వీక్షణలకు వ్యాసప్రాధాన్యతకు ముడిపెట్టడం మంచిది కాదు.
  • వీక్షణలకు ప్రధాన్యత కొంతవరకే. సభ్యులను ప్రోత్సహించడం వరకే వీక్షణలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.
  • వీక్షణల ఆధారంగా వ్యాస ప్రాధాన్యత నిర్ణయించడానికి ఇది వాణిజ్య సంస్థ కాదు. అందరికీ కావలసిన సమాచారం అనదరం కలిసి అందుంచడమే లక్ష్యం. ఎంత మంది చూస్తున్నారన్నది లక్ష్యం కాదు. ఎప్పుడు ఎవరు ఏది కావలని అనుకున్నా అది వికీపీడియాలో లభించాలన్నది లక్ష్యం.మనం కృషిచేయవలసినది పయనించవలసినది ఆ లక్ష్యం వైపే. వీక్షణలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే వికీస్పూర్తి దెబ్బతింటున్నది.
  • వ్యాపార దృషిటితో పనిచేసే దినపత్రికలు సహితం వాస్తవ సంఘటనలకు, వార్తాకు ప్రాధాన్యత ఇస్తాయి. ప్రజలు ఏమి కావాలనుకుంటున్నారో ఆ సమచారం ఇవ్వరు. ప్రజలకు ఏది చేరాలో అది మాత్రమే అందిస్తాయి. అందుకని వికీపీడియాలో అన్ని విధాలైన వ్యాసాలకు ఎప్పటికీ స్థానం ఉండాలి. --t.sujatha (చర్చ) 05:26, 19 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • సభ్యుడు:C.Chandra Kanth Rao, వాడుకరి:T.sujatha గారి స్పందనలకు ధన్యవాదాలు, వికీపీడియా అస్థిత్వం ఎందుకు అని ప్రశ్నిస్తే ప్రజల జ్ఞానవనరుగా వినియోగపడాలి అనే అర్ధంతో అందరూ ఏకీభవిస్తారనుకుంటాను. వికీకి వనరులు పరిమితంకాబట్టి ప్రాధాన్యత నిర్ణయించి పనిచేస్తే మన లక్ష్యం వైపు పురోగతి మెరుగుగావుంటుంది. అందువలన వీక్షణలు ప్రాముఖ్యత నిర్ణయించడానికి ఉపయోగపడతాయి. దీనికి మనము వాణిజ్య సంస్ధా లేదా లాభేతర సంస్థా అన్నదానితో పనిలేదు. మొదటి పేజీలో లింకులియ్యడం వలన వీక్షణలు పెరగవని నాకు అర్ధమవుతున్నది. గత 15రోజులుగా వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ లో పనిచేస్తున్న నాకు మన తెవికీలో వ్యాసాల నాణ్యత బలహీనాలు స్పష్టమవుతున్నాయి.ఈ ప్రాజెక్టుద్వారా ఆసక్తి గల సహసభ్యుల చేయూతతో తెలుగు వికీ నాణ్యతను పెంచడం ఆ తరువాత క్రియాశీలక సభ్యులు పెంపుతో పరిధిని విస్తరించడానికి వీలవుతుంది.ఈ వికీట్రెండ్స్ మూడేళ్లక్రింద లభించివుంటే తెలుగు వికీ మరింత వున్నత స్థానంలో వుంచడం మరింత సులభమయ్యేదని నా విశ్వాసం.--అర్జున (చర్చ) 05:14, 21 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

లండన్ లో జరగబోవు వికీమేనియా 2014 సమావేశానికి మేధావేతనాలు

[మార్చు]

లండన్ లో (6-10 ఆగష్టు 2014) లోజరగబోవు వికీమేనియా 2014 సమావేశానికి మేధావేతనాల అభ్యర్ధనలు అంగీకరించబడుతున్నాయి. వీటికి చివరి తేది 17 ఫిభ్రవరి 2014. దీని ద్వారా వికీమీడియా ఫౌండేషన్ ఏర్పాట్ల ద్వారా అయ్యే ప్రయాణపు ఖర్చులు,వసతి (ఇతరులతో పంచుకొనేటట్లు) ఖర్చులు మరియు వికీమేనియా నమోదు రుసుము భరించబడతాయి. ఎంపిక విధానం ప్రకారం అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు పేజీ చూడండి.ఈ పేజీలలోని సమాచారము మరియు తరచూ అడిగే ప్రశ్నలు చూసి తెలుగు వికీమీడియా ప్రాజెక్టు సభ్యులు అభ్యర్థనను పూరించడం మంచిది. ఇంకేమైనా ప్రశ్నలుంటే స్పందించండి లేక పేజీ లో అడగండి లేక ఇంతకు ముందు వికీమేనియాలకు హాజరైననన్ను లేక రాజశేఖర్ గారిని లేక విష్ణు గారిని సంప్రదించండి. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని తెవికీ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తాను.--అర్జున (చర్చ) 04:50, 10 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

'వికీపీడియాలో రచనలు చేయుట' లో ప్రదర్శితమయ్యే సభ్యులకు విజ్ఞప్తి

[మార్చు]

'వికీపీడియాలో రచనలు చేయుట' లో ప్రదర్శితమయ్యే సభ్యులు వారి మెరుగైన ఛాయాచిత్రము మరియు వికీలో రచనలు రచనలు చేయటానికి క్లుప్త వివరణ రెండు మూడు రోజులలో చేర్చవలసిందిగా కోరుతున్నాను. దీనికి ఇంకా ఎక్కువ మంది సభ్యులను చేర్చే వీలున్నదని వాడుకరి:రహ్మానుద్దీన్ తెలిపారు కాబట్టి , ఇప్పటికే ఎంపికైన సభ్యులతో (జెవిఆర్కె ప్రసాద్, విశ్వనాధ్.బి.కె. , భాస్కరనాయుడు, సి.చంద్రకాంత రావు, టి.సుజాత, రహ్మానుద్దీన్, వైజాసత్య, డా.రాజశేఖర్, అహ్మద్ నిసార్, విష్ణు) పాటు 2013 కొలరావిపు విజేతల అంగీకారాన్ని (చదువరి ,ఎం.ప్రదీప్,చావా కిరణ్,వీవెన్, పాలగిరి,రవిచంద్ర,అహ్మద్ నిసార్,వీరా ఎస్.జె,జె.వి.ఆర్.కె.ప్రసాద్, భాస్కర నాయుడు)కోరుతున్నాము. అలాగే ఇంకా కొలరావిపు ఎంపిక మండలి ప్రశంసాపత్రాన్ని పొందిన సభ్యులు కూడా తమ ఛాయాచిత్రాన్ని మరియు వివరణను అందచేస్తే వీలుని బట్టి ఈ ప్రతిలో లేక ఇతర ప్రతులలో వాడడానికి అవకాశముంటుంది. --అర్జున (చర్చ) 05:17, 10 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

లెట్స్ ఫోకస్ - రెండవ విడత చర్చ

[మార్చు]

తెవికీ పనితీరులో నేను గమనించిన కొన్ని విషయాలు

  • మనం కొద్దిమందితో మన సముదాయానికి మించిన పనులు చేయాలని ప్రయత్నిస్తున్నాం. దానివలన క్రియాశీలక సభ్యులపై అదనపు భారం, ఒత్తిడి పడి, వికీ ఒక సరదా వ్యాసంగంగా కాకుండా, పెద్ద భారంగా తయారౌతుంది.
  • ప్రాజెక్టులైతే ప్రారంభిస్తున్నాం కానీ, సమన్వయం లేదు. ఒక్కొక్కరూ పది ప్రాజెక్టుల్లో చేరుతున్నారు, కానీ ఏవీ పెద్దగా ముందుకు కదలట్లేదు.
  • కొందరు కృషి చేస్తున్నారు కానీ, ఇతరుల మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నం చేయటం లేదు.

ఇక కొన్ని ప్రతిపాదనలు

  • కొంతకాలం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం మానెయ్యాలి.
  • కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలంటే సభ్యులు ప్రతిపాదన చేసి, మద్దతు కూడగట్టుకొని, రచ్చబండలో ఆమోదం పొందిన తర్వాతే ప్రాజెక్టును ప్రారంభించాలి.
  • గ్రామాల వ్యాసాలపై నలుగురైదుగురు పనిచేస్తున్నారు. నేను వారిని సమన్వయపరిచి ఆ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తాను.
  • సుజాత గారు లీలావతి కూతుళ్ళు, పాలగిరి గారు నూనె సాంకేతికత ప్రాజెక్టులను నడిపిస్తారు. ఇంకాఏమైనా ప్రాజెక్టులు?

--వైజాసత్య (చర్చ) 14:24, 11 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  1. పుస్తకాల ప్రాజెక్టు, రంగస్థల కళా రూపాలు లాంటివి కూడా చేయాలి. మీరన్నట్టు ఒక్కొక్కటిగా పూర్తిచేయడం మంచిది. ఎక్కువ పని భారం కాకుండా సరదాగా వ్రాయడం చేసినపుడే మరింతమందిని కలుపుకొనిపోవచ్చు. ముందు మాదిరిగా ఇపుడు అందరూ కలసి ఒక వ్యాసంపై పనిచేయడం కుదరడం లేదు. ఎవరు మొదలుపెట్టిన వ్యాసం వాళ్ళే పూర్తిచేయాలి. మరెవరూ వేళ్ళు పెట్టకూడదు అన్నట్టుగా ఉంది. స్వతంత్రించి మార్పులు చేయాలంటే ఎవరు విమర్శిస్తారో అనీ సందిగ్ధం..విశ్వనాధ్ (చర్చ) 15:22, 11 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • -వైజాసత్య గారి స్పందనకు సహకారానికి ధన్యవాదాలు. నేనీ ప్రాజెక్టుకు అనుకోకుండా వచ్చాను.
  • ఈ వ్యాసాలలో అనేక సాంకేతిక వివరాలు ఉన్నందు వలన నేను ఈ వ్యాసాలను సరైనరీతిలో అభివృద్ధి చేయలేనని అనుకుని మొదట ఊరుకున్నాను. . అయినప్పటికీ అనుకోకుండా ఈ వ్యాసాలను వ్రాయడం ప్రారంభించినప్పుడు నాకు లభించిన వనరులతో వ్యాసం సంతృప్తి కరంగా చేయలేనని అనిపించింది.
  • అందుకొరకు గూగుల్‌లో శోధన చేసినప్పుడు పి.డి.ఎఫ్ రూపంలో వనరులు లభించాయి. అందులో వంద మంది వివరాలు ఉన్నట్లు తెలిసింది. ప్రాజెక్ట్ పరిపూర్ణత కొరకు వాటిని ప్రాజెక్టులో చేర్చి అందరికీ అందుబాటులో ఉండేలా ఆయా పేజీలలో లికులు ఉంచాను.
  • కాని వ్యాసాలు అసంపూర్ణంగా ఉన్నాయని వాటిని తొలగించాలని సూచన వచ్చిన తరువాత వాటిని పూర్తిచేయాలని అనుకున్నాను. ఇది పంతమో పట్టుదలో కాదు.
  • ఈ ప్రాజెక్ట్, ఈ వ్యాసాలు తెలుగు వికీపీడియాలో ఉండతగినవి. ఇవి తెలుగు వికీపీడియాకు కొంత గుర్తింపు తీసుకు రాతగినవి కనుక వీటిని తొలగించకూడదని అనుకున్నాను.
  • ఇంతకీ నేను చేస్తున్నది వ్యాసాల ఆరంభం మాత్రమే కాని సమగ్రమైన వ్యాసాలు కావు. వ్యాసాలు సమగ్రంగా పూర్తి కావాలంటే మరిన్ని వనరులను ఉపయోగించి వ్రాయాలి.
  • వీటిలో ఆయా శాస్త్రవేత్తల విద్యావివరాలు, నివాస వివరాలు, పుట్టిన తేదీలు, వారు పనిచేసిన సంస్థలు, వారి ప్రచురణలు వంటి పలు వివరాలు చేర్చాలి. కనుక ఆసక్తి ఉన్న వారు ఈ పనిని కొనసాగించవచ్చు.
  • ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఇది తెలుగు వికీపీడియా సాధనలలో ఒకటి ఔతుంది. తెలుగు వికీపీడియా దశాబ్ధి ఉత్సవాల నాటికి వ్యాసాలకు కొంత రూపం ఇవ్వాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాను.--t.sujatha (చర్చ) 18:03, 11 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
సుజాత గారూ, మీ ఉద్దేశం అర్ధమైంది. ఇది ఒక ప్రాజెక్టును గురించిన చర్చ కాదు. సాధారణంగా ప్రాజెక్టులు నడుస్తున్న తీరుపై చర్చ మాత్రమే. ప్రాజెక్టుల జాబితాకి మరో చేర్పు - చంద్రకాంతరావు కొంతకాలం కృషిచేస్తున్న తెలంగాణ విషయాలకు ప్రాజెక్టు రూపం ఇచ్చినట్టున్నారు. --వైజాసత్య (చర్చ) 06:35, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గరూ ! మీ ఉద్దేశం చక్కగా అర్ధం చేసుకున్నాను. ఈ వివరణ సహసభ్యులందరి కొరకు. నేనీ ప్రాజెక్టులో సదుద్ధేశంతో చేసిన పని అపోహలకు లోనైంది.

వ్యాసాలు ఎర్రలింకులుగా లేనందున వ్యాసాలలో మిగిలిన సభ్యులు పనిచేయడానికి దూరంగా ఉన్నారు. అది నేను చేసిన పొరపాటని అనుకున్నా విషయం లేని వ్యాసాలని, తొలగించాలని, మూస కొరకు వ్యాసాలు వ్రాస్తున్నారని , మూల్యాంకనం కొరకు వ్యాసాలు వ్రాస్తున్నాని పేర్కొనడం వలన వివరణ ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది. అందుకే వివరణ ఇచ్చాను. నేను ప్రశాంతంగా చర్చనీయాంశాల జోలికి వెళ్ళకుండా నా పని నేను చేసుకు పోవాలని అనుకుంటాను. పదే పదే నా పేరు చర్చలో వచ్చింది కనుక వివరణ ఇస్తున్నాను. ఇంతకీ ఇది ప్రశాంతంగా వ్రాస్తున్నదే కాని ఎవరితో అభిప్రాయబేధాలు కాని మనస్తాపంతో కాని వ్రాయలేదు. --t.sujatha (చర్చ) 14:50, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పదవవార్షికోత్సవ వేడుకలకు మీడియా పార్టనర్‌

[మార్చు]

కంప్యూటర్స్‌ ఫర్‌ యు మాస పత్రిక వారు మన తెవికీ పదవవార్షికోత్సవ వేడుకలకు మీడియా పార్టనర్‌ గా ఉండడానికి సంప్రదించారు.
వారు చేసిన ప్రపోజల్

  1. త్వరలో విజయవాడలో జరిగే పదవవార్షికోత్సవ వేడుకలలో మీడియా పార్టనర్‌గా ఉండాలని. మీడియా పార్టనర్‌గా వారు తెలుగు వికీపీడియా గురించి కంప్యూటర్స్‌ ఫర్‌ యు పాఠకులకు తెలిసేలా, అలాగే విజయవాడలో పాల్గొనే వారికి తెలిసేలా ఒక వ్యాసాన్ని (రెండు పేజీలు) ప్రచురిస్తారు. దీనికి ఎటువంటి చార్జీలు లేవు. అలాగే అక్కడ పాల్గొనే ప్రతి సభ్యుడికి ఒక్కరికి ఒక్క కాపీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి మ్యాగజైన్‌ జనవరి 28 కల్లా మార్కెట్లో ఉంటుంది.
  2. వికీపీడియా ఆప్‌లైన్‌లో చూసుకునేలా ఏదేని సిడిని రూపొందిస్తే, దాన్ని వారి పత్రిక చందాదారులకు ఉచితంగా అందచేస్తామని చెప్పారు. (దీనికి చందాదారులకు ఎటువంటి చార్జీలు ఉండవు)
  3. మున్ముందు కూడా వికీపీడియా గురించిన ఎటువంటి అప్‌డేట్స్‌ ఉన్నా వాటిని తెలియచేస్తే వారి పత్రికలో ప్రచురిస్తామన్నారు.

ఈ ప్రపోజల్ పై మీ సలహాలు, సూచనలు అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలిపగలరు. కార్యవర్గం, తెవికీ దశాబ్ది ఉత్సవాలు. --విష్ణు (చర్చ)14:55, 11 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ది ఉత్సవాలు చర్చా పేజిలో కూడా ఈ చర్చ చేయవచ్చు. ఇది అందరి దృష్టికి తేవలసిన విషయం కనుక రచ్చబండలో కూడా పెట్టడానికి చొరవ తీసుకోవడం జరిగింది. అభ్యంతరాలు ఏవైనా ఉంటే జనవరి 13 కల్లా తెలియజేస్తే పత్రిక యాజమాన్యంతో సంప్రదింపులకు వీలుగా ఉంటుంది. కార్యవర్గం, తెవికీ దశాబ్ది ఉత్సవాలు. --విష్ణు (చర్చ)15:02, 11 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • విష్ణు గారి వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఇతర పత్రికలు మాధ్యమాలకు భాగస్వామ్యవకాశాన్ని తెలియపరచినది తెలియలేదు. అలా తెలియపరచి వచ్చిన స్పందనలుబట్టి ఒకటి లేక అంతకంటే ఎక్కువ మాధ్యమాలను భాగస్వామ్యం చేస్తే మంచిది. దశాబ్ది ఉత్సవాలు చర్చా పేజిలో చివరి సారి కార్యనిర్వాహక వర్గం సమావేశ నివేదిక 20.11.2013 గా కనబడుతున్నది. కార్యనిర్వాహకవర్గం తమ చర్చలు, చర్యలు గురించి మరింత కాలబద్దంగా సముదాయానికి తెలిపితే సముదాయం పాలుపంచుకోటానికి వీలుంటుంది. ఇంతకు ముందు సంబంధిత చర్చాపేజీలలో వ్యాఖ్యలకు స్పందనలు కనబడలేదు లేక స్పష్టత రాలేదు (ఉదా1,ఉదా2) --అర్జున (చర్చ) 06:07, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • అర్జున గారు మీ సూచనకు ధన్యవాదాలు. ఇతర పత్రికలు మాధ్యమాలకు భాగస్వామ్యవకాశాన్ని మనం ఇంతవరకు తెలియపరచలేదు. పైన చెప్పిన విధంగా కంప్యూటర్స్‌ ఫర్‌ యు మాస పత్రిక వారు మన తెవికీ దశాబ్ది కార్యక్రమం గురించి విని తమంతట తాముగా సంప్రదించడం జరిగింది. కార్యవర్గం దీనిని సముదాయం దృష్టికి తీసుకువచ్చింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలుపగలరు.
  • "ఎక్కువ మాధ్యమాలను భాగస్వామ్యం చేస్తే మంచిది" అని మీరిచ్చిన సలహాతో పూర్తిగా ఏకీభవిస్తున్నాము.
  • ఇకపోతే ఇతర పత్రికలకు మరియు మీడియా సంస్థలను సంప్రదించండి అని మీరు మంచి సలహా ఇచ్చారు. దీనిని ఎలా చేయాలో సూచించగలరు. దశాబ్ది కార్యవర్గం మీ అమూల్యమైన సూచనలను పరిగణలోకి తీసుకొని వీలున్నంతలో తప్పక అమలు పరచడానికి చొరవ తీసుకుంటుంది. మల్లాది గారు ఈ విషయంలో మనకు సహాయపడతారని ఆశిస్తున్నాము.
  • కార్యనిర్వాహకవర్గం చర్చలు మరింత కాలబద్దంగా తెలియజేయడానికి తప్పక కృషి చేస్తాము.
దశాబ్ది ఉత్సవాలకు సంబందించిన చర్చలు దశాబ్ది ఉత్సవాలు చర్చా పేజిలో చర్చిస్తే బాగుంటుంది. సభ్యులు గమనించగలరు. ఈ చర్చను అక్కడ కూడా పోస్ట్ చేయగలము. కార్యవర్గం, తెవికీ దశాబ్ది ఉత్సవాలు. --విష్ణు (చర్చ)08:26, 13 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఆడియో లింకులు

[మార్చు]

శ్రీఫణి (User:Sriphani) మరియు మురళీధర్ (User:MuralidharB) దంపతులిద్దరూ బొంబాయిలో పనిచేస్తున్న వ్యక్తులు. వారిని నేను ఆడియో ఫైల్స్ సృష్టించమని కోరాను. వారు విజయనగరం జిల్లాకు చెందినవారు కాబట్టి ఆ జిల్లాకు సంబంధించిన మండలాల పేర్లను ఎలా పలకాలి అనే విషయం యొక్క స్పష్టత కోసం కొన్ని పేర్లను ఉచ్ఛరించి వికీ కామన్స్ లో చేర్చి వాటి లింకుల్ని ఆయా మండలాల పేజీలో చేర్చాను. ఉదా: బాడంగి వీటిని ఎలా ఉపయోగించుకోవచ్చును సభ్యుల అభిప్రాయాలు తెలియజేయమని మనవి.Rajasekhar1961 (చర్చ) 08:41, 13 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

శెభాష్!! చాలామంచి పనిచేశారు. ఆయా ప్రదేశాలతో పరిచయం లేనివాళ్ళు అనువదించడం వళ్ళ కొన్ని పేర్లు తెలుగులో తప్పుగా వచ్చాయి --వైజాసత్య (చర్చ) 07:05, 14 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ది ఉత్సవాలకు హాజరవుతున్న సభ్యులు

[మార్చు]
  • విజయవాడలో జరుగనున్న దశాబ్ధి ఉత్సవాలకు హాజరవుతున్న సభ్యులు దయచేసి ఇక్కడ తమపేరు నమోదు చేయగలరు
  • మీకు సాధ్యం అయితే కొంత సమయం కేటాయించి గూగుల్ పత్రం పూరించి పంపగలరు.

https://docs.google.com/forms/d/15IBuc1-mAT1D8xDuBAaU4g6NueTKW7709nhbQsMjyzg/viewform. --2014-01-13T13:57:14‎ విశ్వనాధ్.బి.కె.

సమాచార హక్కు చట్టం, 2005 ప్రతి యూనికోడ్ లో తెవికీసోర్స్ లో అందుబాటులోకి

[మార్చు]

కొద్ది కాలం క్రితం సీజీజీలో చేసిన వికీఅకాడెమీ కారణంగా సమాచార హక్కు చట్టం ప్రతిని తీసుకోడం జరిగింది. అది నేడు వికీసోర్స్ లో అందుబాటులోకి తెచ్చాను. సభ్యులు గమనించగలరు. సమాచార హక్కు చట్టం, 2005. --రహ్మానుద్దీన్ (చర్చ) 21:09, 14 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా మంచి పని చేశారు. ఇది సమాచార హక్కును వాడుకునే వారందరికీ ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 09:01, 17 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

గుంటూరు, విజయవాడ మరియు తిరువూరులలో తెవికీ శిక్షణా శిబిరాలు జనవరి 18, 20, 21

[మార్చు]

వచ్చే నెల15-16 తేదీలలో విజయవాడలో జరుగబోయే మన తెవికీ దశాబ్ది మహోత్సవాలకు ముందుగా విజయవాడ పరిసర ప్రాంతాలలో ఒక పటిష్టమైన సముదాయాన్ని చేకూర్చడానికి గుంటూరు, విజయవాడ మరియూ తిరువూరులలో తెవికీ శిక్షణా శిబిరాలు జరుపడానికి ప్రయత్నాలు సఫలించాయి. జనవరి 18న గుంటూరులో వి.వి.ఐ.టి కళాశాలలో ఒక శిబిరం, జనవరి 20న విజయవాడలో కె.బి.ఎన్. కళాశాలలో రెండు శిబిరాలు (ఒకటి ఉన్నత మరియొకటి ప్రాథమిక), మరియు జనవరి 21న తిరువూరులోని వాహిని కళాశాలలో ఒక శిబిరం జరుగుతాయి. ఈ శిక్షణా శిబిరాలలో ఓత్సాహిక సభ్యులు పాల్గొని వీటీని జయప్రదం చేయవలసిందిగా మనవి. ఈ పట్టణాలకు సమీపంలో ఉన్న సభ్యులు తమ సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. ఆసక్తి ఉన్న సభ్యులకు ప్రయాణ ఖర్చులు మరియు భోజన వసతి సౌకర్యాలు తెవికీ దశాబ్ది ఉత్సవాల బడ్జెట్ నుండి కల్పించబడుతాయి.
ఓత్సాహిక సభ్యులు ఈ పేజిలలో నిర్వాహకులుగా నమోదు చేసుకోగలరు.
గుంటూరు శిబిరం
విజయవాడ శిబిరం
తిరువూరు శిబిరం.
శిక్షణా శిబిరం హోస్ట్ చేయు సంస్థల నుండి పూర్తి అనుకూలత తెలియడంలో ఆలస్యం అయినందువలన సభ్యులకు ఈ సమాచారాన్ని రచ్చబండ ద్వారా తెలియజేయడంలో కొంత జాప్యం జరిగింది. --విష్ణు (చర్చ)20:07, 15 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • విష్ణు గారి ప్రకటన మరియు ఆహ్వానానికి ధన్యవాదాలు. ఈ ప్రాంతాలలో క్రియాశీలంగా వున్న సభ్యులు తక్కువగావున్నారు కాబట్టి హైద్రాబాదు నుండి కూడా వికీపీడియా సభ్యులు హజరై తమ అనుభవాలను విద్యార్ధులతో పంచుకుంటే బాగుంటుంది.--అర్జున (చర్చ) 04:52, 16 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు బడ్జెట్ రిక్వెస్ట్

[మార్చు]

దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకోసం వికీమిడియా ఇండియా చాప్టర్ వారికి, CIS వారికి బడ్జెట్ రిక్వెస్ట్ పంపించడం జరిగింది. వివరాలకు ఈ క్రింది లంకెలను చూడగలరు. Pranayraj1985 (చర్చ) 07:07, 18 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ సభ్యులు వీటిని గమనించి తగిన సలహాలు, సూచనలు అందించగలరు. ఆయా పేజీలలో స్పందించి, నిధుల సమీకరణ ప్రయత్నాలను సఫలం చేయగలరు. తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవ ఆహ్వాన సంఘం

  • వాడుకరి:Pranayraj1985 గారి ప్రకటనకు ధన్యవాదాలు. నేను చాప్టర్ అభ్యర్ధన చర్చాపేజీలో ఒక వ్యాఖ్య రాశాను. సహ తెలుగు వికీసభ్యులు కూడా ఆయా పేజీలలో స్పందించి నిధుల సమీకరణ ప్రయత్నాలను సఫలం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇంకొకముఖ్యవిషయం కార్యనిర్వాహక వర్గ సభ్యులు వ్యాఖ్యలు రాసేటప్పుడు తప్పక తమ సంతకం చేయటం మరవవద్దు.--అర్జున (చర్చ) 04:09, 18 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • అర్జున గారికి ధన్యవాదాలు. ఆహ్వాన సంఘం తరపున అభ్యర్థన చేశాను కాబట్టి, ఒకరి పేరుకన్నా అందరి పేర్లు ఉండాలని అలా చేయడం జరిగింది. చాప్టర్ అభ్యర్ధన చర్చాపేజీ లంకెను ఇచ్చినచో, సహ తెలుగు వికీసభ్యులు స్పందించడానికి సులభంగా ఉంటుందని నా అభిప్రాయం. Pranayraj1985 (చర్చ) 07:11, 18 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • Pranayraj1985 గారు, రచ్చబండ నుండి నిధులు రావండీ. కార్యనిర్వాహకవర్గం పదాధికారులుగా మీరు నిధుల అందించేవారికి మరియు సంబంధిత జాబితాలకి తెలపడం మరియు వచ్చేంతవరకు వారితో సంప్రదింపులు చేయడం మీ బాధ్యత.ఇతర సభ్యులు స్పందనల మూలంగా సమర్ధనమాత్రమే చేయగలరు.--అర్జున (చర్చ) 04:28, 20 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీకి శలవు

[మార్చు]

రహ్మానుద్దీన్ గారి గురించి నాకు ఎక్కువగా గత రెండు సంవత్సరాలలో పరిచయముంది,వారితో వికీలో మరియు బయట (ప్రత్యక్షంగా కూడా) చర్చలు చేయడం జరిగింది. తెలుగు భాషాభిమానిగా, స్వేచ్ఛా సాఫ్ట్వేర్ గురించి కృషి చేసిన వ్యక్తిగా అలాగే తెలుగు వికీ ప్రచారాలు, సమావేశాలలో విశేష కృషి పై ప్రత్యేకంగా గౌరవం వుంది. అయినా వారి ప్రతిపాదనను తెలుగు వికీ అభివృద్ధి పై దీర్ఘకాలికదృష్టితో ఈ క్రింది కారణాల వలన వ్యతిరేకిస్తున్నాను.
తెలుగు వికీ విధానాలు, మార్గదర్శకాలు,నకలుహక్కులు వాటిపై అవగాహన, సభ్యులతో వికీలో సహకారం, ముఖ్యంగా ఏకాభిప్రాయాన్ని సమీకరించి నిర్ణయం చేయటంలలో రహ్మానుద్దీన్ గారి నైపుణ్యాలు నా అంచనాలలో తక్కువగా వున్నాయి.
అధికార హోదాకు వారు పేర్కొన్న కారణాలు వాడుకరి పేరు మార్పు అభ్యర్ధనలు అంత అత్యవసరమైనవి, తరచూ చేసేవి కావు
ఇటీవల మనం రచ్చబండ చర్చలో నిర్వాహకులు తప్పులు పై తప్పులు చేస్తున్నారన్న అభిప్రాయాలు చూస్తున్నాము.అందువలన సభ్యుల అదనపు హోదాల అభ్యర్ధనలకు సమ్మతి ప్రకటించే ముందే జాగ్రత్తగా వుండడం మేలనిపిస్తున్నది.
అధికారి హోదాఇచ్చిన తరువాత సభ్యుని అవగాహన ప్రవర్తన మెరుగుపడాలని ఆశించడం కంటే (తెవికీ కృషి స్వచ్ఛందంగా జరిగేది కాబట్టి) అవి మెరుగైన తరువాతనే అధికారిహోదా ఇవ్వడం వలన మరింత లాభం కలిగే అవకాశం వుంది.
రహ్మానుద్దీన్ గారు కొన్ని వికీ ప్రాజెక్టులకు సమన్వయకర్తగా వ్యవహరించి, కొన్ని విధానాలు మెరుగు చేయటానికి లేక కొత్తవి తయారు చేయడం లాంటి పనులు చేసిన తరువాత నేనే స్వయంగా వారికి అధికారి హోదాకి ప్రతిపాదించగలను

నా అభ్యర్థన వద్ద అర్జున గారు తెలిపిన విషయాలకు నైతిక బాధ్యత వహిస్తూ నేను తెవికీ నుండి నిష్క్రమిస్తున్నాను. నేను ప్రస్తుతం సీఐఎస్ వద్ద చేస్తున్న పనికి సంబంధం ఉన్నంతవరకూ తెవికీలో కృషి చేస్తానని, వ్యక్తిగతంగా ఉన్న వికీపీడియా పనితనాన్ని పూర్తిగా మానేస్తున్నానని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నాకు తెలిసినంతలో నా వైపు నుండి ఉన్న ఏ లోపమయినా సభ్యులు తెలిపిన వెనువెంటనే సరి చేసుకున్నానే తప్ప, వికీ విధి విధానాలననుసరించి నాకు అవగాహన ఉన్న విషయాలపై కొందరితో విభేదించాను. అయినా వారికి ఆ విషయాలపై అవగాహన తెప్పించటంలో విఫలమయ్యాను. ఇక పై ఏ విధంగానూ తెవికీలో పని చేయనని తెలుపుకుంటున్నాను. నా మీద జరిగిన నిందను నేను ఈ విధంగా మాత్రమే తీసివేయగలను. నేను తెవికీలో కొనసాగితే వాడుకరి:Arjunaraoc గారు చేసిన అభియోగాలు నిజం చేసినట్టవుతుంది. నా బాట్ ద్వారా చేసిన మార్పులను కూడా ఇక మీదట కొనసాగించడం లేదు. ఈ విధంగానైనా అర్జున గారికి నా వల్ల కలిగిన ఇబ్బంది తీరుతుందని విశ్వసిస్తున్నాను.అందరు సభ్యులకు నమస్కారములు. --రహ్మానుద్దీన్ (చర్చ) 15:33, 18 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఎందుకో నాకు సరైన పని అనిపించడం లేదు. మరొకసారి మీ నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోగలరు.--రవిచంద్ర (చర్చ) 15:59, 18 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారు చేసిన తెవికీ నిష్క్రమణ ప్రకటనకు నేను తీవ్రంగా నిరసిస్తున్నాను. సభ్యులను దృష్టిలో ఉంచుకొని కాకుండా వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా సెలవులోంచి బయటపడి మళ్ళీ తెవికీలో చురుకుగా ఉండటం బాగుంటుందనిపిస్తుంది. మనం ఇక్కడ పనిచేసేది తోటి సభ్యుల మెప్పు కోసం కాదు, వారి ఆదరాభిమానాలను పొందడం కోసం అంతకన్నా కాదు, వారిచ్చే గుర్తింపు కోసం అసలే కాదు. సభ్యుల ఆదరాభిమానాలకు మనం పొంగిపోము, వారిచ్చే గుర్తింపులకు మురిసిపోము, వారి ప్రశంసలకు ఉబ్బిపోము, అలాంటప్పుడు విమర్శలకు క్రుంగిపోవడమెందుకు? తెవికీలో ప్రవేశించేటప్పుడు మనం ఏ లక్ష్యం సాధించాలని ఇక్కడికి చేరామో, పాఠకుల ప్రయోజనం కోసం ఏమి చేయాలని మనం తలిచామో, తెవికీని ఏ గమ్యానికి చేర్చాలని మనం ఆశించామో, పాఠకులకు ఎలాంటి వ్యాసాలను అందించాలని తహతహలాడామో, మనం తెవికీలో ఏమి సాధించాలని నిర్ణయించామో- ఆ ఆశయాలు, లక్ష్యాలు, గమ్యాలు గుర్తించి మీరు మళ్ళీ వస్తారని, తెవికీని మరింత ఉత్తేజం కల్పిస్తారని మనసారా కోరుకుంటున్నాను. తోటి సభ్యుల వాక్కుకు గళమెత్తే హక్కు మీకుంది. అవసరం, సందర్భాన్ని బట్టి దీటుగా ప్రతిఘటిస్తూ చర్చంచే హక్కు సభ్యులందరికుంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. అధికారి హోదాకు ప్రతిపాదించిన సభ్యుడిపై ఇన్ని కొర్రీలు విధించే అవసరమైతే లేదు కాని ఇదివరకు నిర్వహణే చేయని కొందరు సభ్యులకు నిర్వాహక హోదాకై మద్దతు ఇచ్చినప్పుడు లేని సమస్య ఇప్పుడెలా వచ్చిందో తెలియడం లేదు! అలాంటప్పుడు చక్కగా నిర్వహణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సభ్యుడికి అధికారి హోదా ఇవ్వడంలో ప్రతిబంధకమేమిటో తెలియరావడం లేదు. అయినా అది కొద్ది మంది సభ్యుల నిర్ణయం, మెజారిటీ సభ్యులు మీకు మద్దతు ఇచ్చారనేది గుర్తించుకోండి. మెజారిటీ సభ్యుల నిర్ణయానికి కట్టుబడి, వారి అభిప్రాయాన్ని గౌరవించి తెవికీ అధికారిగా బాధ్యతలు నిర్వహించండి. తెవికీ నుంచి నిష్క్రమించి మనం సాధించేది ఏమీ ఉండదు, ఇక్కడే ఉండి నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తూ తెవికీని సంస్కరించే ప్రయత్నం చేయండి. ఇలాంటి కారణాల వల్ల నిష్క్రమించదలిస్తే అలాంటి పనిచేసిన వారిలో నేనే ముందుండేవాడినేమో! తాత్కాలిక సెలవులోంచి బయటపడి వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్యమించండి, తెవికీ లోటుపాట్లు సరిదిద్దడానికి సహకారం అందించండి, విధానాలపై సభ్యులకు నైపుణ్యం అందించండి. సోదర వికీ ప్రాజెక్టులు శరవేగంతో ముందుకు పోతున్నప్పుడు మనం ఐదారేళ్ళ క్రితం నాటి కంటే వెనకబడి ఉండటానికి కారణాలు అన్వేషించండి, తెవికీలోని లోటుపాట్లను నిర్భయంగా బయటపెట్టండి. నిర్వహణలో భాగంగా నేను లేవనెత్తిన చర్చలకు ప్రతిసారి వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి. తెవికీ కుంటుపడింది బాబోయ్ అని మొత్తుకుంటున్నా ఎవరూ ఆలకించడం లేదు. ఎవరికి వారు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో నిర్వహణకు అవకాశమే లేనట్లయింది. నేను ఏ పరిస్థితుల్లో నిర్వహణ తగ్గించానో మీకూ తెలుసుననుకుంటున్నాను. అయినా తెవికీలో నేను చేయాల్సింది ఏదో ఉంది అనే భావనే నన్ను తెవికీలో పనిచేయిస్తున్నది. సభ్యుల మాటలకు బాధపడి నిష్క్రమించడం ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది! ఇన్నాళ్ళు తెవికీని పట్టించుకున్న మీ లాంటి వారు చేసే పని ఇది కాదనుకుంటాను. రెట్టింపు ఉత్సాహంతో కృషిచేసి, మీ స్థాయిని అందరికీ తెలియజేసే విధంగా చేసి, విమర్శలకు సమాధానం మాటలతో కాకుండా చేతులతో చేసి చూపించండి. తెవికీలో సముదాయపు నిర్ణయమే ముఖ్యం కాని ఒకరిద్దరు సభ్యుల నిర్ణయం ప్రధానం కాదని తెలుసుకోండి. అలాంటప్పుడు కొందరు సభ్యుల విమర్శలకు ఎందుకు పట్టించుకోవాలి? తెవికీలో మీకు వికర్షణ కంటే ఆకర్షణే బలంగా ఉందని గుర్తించుకోండి. మరి వెనకడుగు వేయడమెందుకు? ఇన్నాళ్ళు తెవికీలో ఉంటూ రోజూ విధానాల గురించి, పద్దతుల గురించి, నియమాల గురించి తెలుసుకున్నదంతా తెవికీ అభివృద్ధికి వినియోగించండి. మీరు నేర్చుకున్నది మరికొందరికి నేర్పండి, కొత్త సభ్యులకు అవగాహన కల్పించండి, ఉన్న సభ్యులకు మరింత నేర్పండి. పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు, ఇప్పుడు విమర్శించే వారు రేపు మీకు బ్రహ్మరథం పట్టే రోజులు రావచ్చు, ఆ రోజు కోసం వేచిచూడండి. ఒక వ్యవస్థకై పనిచేసేటప్పుడు మనం అన్నింటికీ సిద్ధపడాలి. మన నిజ జీవితానికి తెవికీ అనుభవానికి అస్సలు సంబంధం లేదు. అసలు మనం ఇక్కడికి ఎందుకొచ్చామా? అని అప్పుడప్పుడు కొందరి సభ్యుల ప్రవర్తన చూస్తే నాకూ అనిపిస్తుంది, కాని ఇక్కడ మనల్ని పట్టివేసే బలమైన బంధం ఉంది. నలుగురికి విజ్ఞానాన్ని అందించాలనీ, మనకు తెలిసిన విషయాలు రచించాలనీ, మన అభిమాన బాషకు ఉడుతాభక్తిగా తోడ్పడాలనీ, మన ప్రాంతానికి న్యాయం చేకూర్చాలనీ మనలోని ప్రతి అణువణువు మనల్ని ఉత్తేజపరుస్తుంది, మనల్ని ముందుకు నడిపిస్తోంది. వ్యతిరేక పవనాలు వీస్తున్ననూ ముందుకు పోవడమే ఉత్తమం, వెనకడుగు వేస్తే భవిష్యత్తులో మనల్ని ఎవరూ పట్టించుకోరు. నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా చిన్న చేపపిల్ల ఈదినప్పుడు, గాలికి వ్యతిరేకంగా గాలిపటం ఎగిరినప్పుడు మానవమాత్రులైన మనం వాటితో స్పూర్తి పొందలేమా! పదేళ్ళ తెవికీ చరిత్రలో ఎందరెందరో మహామహులు పనిచేశారు, వారందరూ ఇప్పుడు చురుకుగా లేకపోవచ్చు. ఇక్కడ జీవితాంతం పనిచేయాలని ఏమీ లేదు, కాని అర్థాంతరంగా నిష్క్రమించామనే అపవాదు రానట్లు నిర్ణయం తీసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయం మరికొందరికి స్పూర్తిగా ఉండేట్టు చేయండి, కాని బాధాకరం చేయకండి. మీరు శాశ్వతంగా నిష్క్రమిస్తే ఈ ప్రభావం మరికొందరిపై పడవచ్చు, చివరికి తెవికీపైనా ఈ ప్రభావం ఉండవచ్చు. ఎవరైనా సభ్యులు తప్పులు చేస్తే తెవికీ సమాజం చర్య తీసుకుంటుంది, చేయని తప్పుకు మీరు నైతిక బాధ్యత తీసుకోవడం సమంజసమేనా? మీరు నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకుంటే మీరే తప్పు చేశారని, తప్పును ఒప్పుకున్నారని, తత్కారణంగానే నైతిక బాధ్యత వహించి నిష్క్రమించారని కొందరు పొరపడే అవకాశమూ ఉందని తెలియజేస్తున్నాను. కాబట్టి చివరగా నేను చెప్పేది, వివరించేది, అభిప్రాయపడేది, కోరుకునేది ఒకే ఒక్కటి, అదే- మళ్ళీమళ్ళీ చెప్పదలచుకోలేను. నా అభిమతం మీరు తెలుసుకొనే ఉంటారు, నా భావాలను మీరు గ్రహించే ఉంటారు. ఇది నా ఒక్కరి భావాలని కాకుండా మరికొందరి భావాలని కూడా పరిగణించండి, మరికొందరి అని ఏమిటి దాదాపు అందరి భావాలని గ్రహించండి. మీరు ఇదివరకు తీసుకున్న నిర్ణయం మార్పు కోసం సభ్యులు కోరుకుంటున్నారని గుర్తించుకోండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:50, 18 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రహమానుద్దీన్ గారూ ! మీ మనసు గాయపడేలాంటి పరిస్తితి ఎదురైనదుకు విచారిస్తున్నాను. నేను తెలుగక్షరాన్ని అభిమానించడం వరకే చేస్తాను. కాని మీరు తెలుగును శ్వాసిస్తారు తెలుగు, పుస్తకాలు ఇంకా అనేక విషయాలో మీకున్న పరిఙానం మీ వయోపరిమితికి దాటినది. అది భగవంతుడు మీకిచ్చిన వరం. మీరు నడిచే గ్రంధాలయం అనడం అతిశయోక్తి కాదు. ఇంతటి మీరు తెవికీకి అవసరం. మీ సాంకేతిక పరిఙానం అపారం. బౌతికంగా మీరు తెవికీపీ చేస్తున్న సేవ అపురూపం. అనుక్షణం వికీపీడియాను గురించే ఆలోచించే మీ కృషి తెలుగు వికీపీడియాకు అత్యవసరం. చురుకుదనం, కలుపుకుపోయే మనోభావం, సహసభ్యులకు ఇచ్చే గౌరవం, చురుకుదనం ఉన్న మీ వంటి యువకులు వికీపీడియాను అధికకాలం ముందుకు నడిపించగలరు. అధికారిగా ఉండాడానికి మీకున్న అర్హతలు అధికం. కనుక మీ అలోచన మార్చుకుని తెవీకీలో కొనసాగండి. అందరం కలిసి పనిచేద్దాం. తెవికీ అభివృద్ధి చేస్తాం. --t.sujatha (చర్చ) 06:00, 19 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది పూర్తిగా తొందరపాటు నిర్ణయం. కొంత ఆలోచించి మీ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలి. తెవికీ అభివృద్దికి మీలాంటి వారి సపోర్ట్ అవసరం. తెవికీ సభ్యులలో మీరు కొంత వయసు తక్కువ వారు కనుక మీరు ఇలాంటివి తేలికగా తీసుకోలేక పోతున్నరని అనుకొంటాను. ఎవరో ఒక సభ్యుని వలన ఇబ్బంది కలిగిందని మొత్తం తెవికీనే వదిలి వెళ్ళడం మంచిది కాదు. మీరేదైనా ప్రతిపాదిస్తే దానికి అందరూ మద్దతివ్వాలని అనుకొని ప్రతిపాదించరుకద. తటస్థంగా ఉండేవారూ ఉంటారు, వ్యతిరేకత కలిగిన వారూ ఉంటారు, విమర్శించేవారూ ఉంటారు.చర్చలు వాదోపవాదాలు లాంటివి దాటి వ్యక్తిగత దూషణల దాకా ఇక్కడ మీరూ చూస్తూనే ఉన్నారు. అలాంటపుడు ఇలాంటివి ఆటలో అరటిపండు లాంటివి అనుకొని మీ నిర్ణయం మార్చుకొని వికీలో కొనసాగాలని మనవి...విశ్వనాధ్ (చర్చ) 06:16, 19 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అన్ని వేళ్ళూ ఒక్క లాగే ఉందవు...! అందరి ఆలొచనలూ ఒక్క లాగే యెప్పుదూ సాగవు...! ఏ ఒక్కరూ అందరికీ నచ్చరు...! అంతమాత్రాన ఏఒక్కరూ మరొకరి కన్నా తక్కువ కాదు...! ఎక్కువ అసలే కాదు...! ఒకరి మనసు నొచ్చుకునే విధంగా వ్యవహరించడం, రాయడం, తూలనాడడం సముచితం కాదు...! నిప్పు ఎవరు ముట్టుకున్నా కాలుతుంది..! అలాగే తప్పు కూడా...! తెవికీ ఎవరి సొంత వెబ్ సైటూ కాదు...! సముదాయం అంటే ఒక్కరు కాదు...! అందరూ కలసినదే సముదాయం...! అందరికీ నచ్చిన ప్రతిపాదన ఏ ఒక్కరికొ నచ్చనంత మాత్రాన అది సముదాయపు నిర్నయం కాదు...! ఆ ప్రతిపాదన వీగిపొదు...! ....Malladi kameswara rao (చర్చ) 11:00, 19 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారి నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించింది. తెవికీలో అనతి కాలంలోనే అవిరళ కృషిచేసిన సభ్యులలో వారు ఒకరు. సి. చంద్ర కాంత రావు గారు చెప్పినట్లు వారు తమ అభిప్రాయాన్ని పునః సమీక్షించుకొని ఎప్పటిలా తెవికీలో చురుకైన పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాను. ఈ విషయంలో సీనియర్ సభ్యులు , నిర్వాహకులు చొరవ తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను. తెవికీ దశాబ్ది ఉత్సహాల వేళ ఈ సంఘటన జరిగిన ఈ సంఘటన తెవికీ పురోగతికి ఏమాత్రం మంచిది కాదు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:38, 19 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావు గారు మీ ప్రతిపాదనను సహేతుకంగాను, హుందాగానే వ్యతిరేకించారు. దానిని మీరు సరైన విధంగా సమాధానం ఇవ్వకపోవడంతో పాటు, వ్యక్తిగతంగా తీసుకొని నిష్క్రమించడం బాగోలేదు. నైతిక బాధ్యత వహిస్తూ నిష్క్రమించటానికి ఇది పదవి కాదు. ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మరింతగా కనుగొని, ఆ విషయాలలో వారి సందేహాలు తొలగించే ప్రయత్నం చేయవలసినది. మీరు నిష్క్రమించడం అర్జునరావు గారితో పాటు తక్కిన సభ్యులందరికి ముదావాహకమైన విషయమేమీ కాదు. ఎవరికీ ఊరట కానీ, సంతోషం కానీ కలగటం లేదు. విమర్శలు ఎదురైనప్పుడు నిష్క్రమించి, అధికార హోదా దక్కకపోవటం వళ్ళ నిష్క్రమించారన్న అపవాదు తెచ్చుకోవద్దు. విమర్శలు ఎదుర్కొని, వాటిని సామరస్యంతో పరిష్కరించగలగటం వళ్ళ చక్కని నిర్వాహకులుగా పరిణితి చెందగలరు. నేను చెప్పదలచుకున్నది అది. అయినా మీరు నిష్క్రమించదలిస్తే మీ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తాను. --వైజాసత్య (చర్చ) 07:48, 20 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారు తెవికీ నుండి తొలగుతాననే నిర్ణయం బాధాకరం. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కోరుతున్నాను. తెవికీ ఏ ఒక్కరిదో కాదు. మనం కోరినది లభించనప్పుడు బాధ కలగడం సహజం దానికి మొత్తం సమాజాన్ని దూషించడం లేదా మొత్తం సమాజాన్నుండి వేరుపడడం అంత మంచి పని కాదని నాకనిపిస్తుంది. వ్యవస్థలోనుండి సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అర్జునరావు గారి అభిప్రాయాన్ని నేను సమర్ధించడం లేదా తిరస్కరించడం. అది తెవికీలో ఒక సభ్యుని, లేదా అధికారి నిర్ణయం. మీకు మిగిలిన 12/13 మంది సమర్ధించారనే విషయాన్ని పోజిటివ్ గా తీసుకోండి. ఈ సమస్యను చంద్రకాంతరావు, వైజాసత్యగారు పరిశీలించి పరిష్కరించగలరని నా నమ్మకం.Rajasekhar1961 (చర్చ) 08:26, 20 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారూ, ఇక్కడ సమస్య ఏమీలేదు కాబట్టి పరిష్కరించడానికి అవకాశం కూడా లేదనుకుంటాను. ఓటింగులో వ్యతిరేకించడానికి సభ్యులకు హక్కు ఉంది కాబట్టి ఆ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించజాలము, కాకుంటే లేవనెత్తిన కారణాలకు మాత్రం సదరు సభ్యుడే తగిన విధంగా సమాధానం ఇచ్చే అవకాశం మాత్రం ఉంది. సభ్యుడి నిష్క్రమణ గురించి మాత్రం మీతో సహా చాలా సభ్యులు చెప్పారు కాబట్టి ఇంతకు మించి ఏమీ చేయలేము. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:56, 20 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ అంశంపై సభ్యుల స్పందనలకు ధన్యవాదాలు. వాడుకరి:రహ్మానుద్దీన్ గారు నేను ఒకే అంశాన్ని అర్ధం చేసుకోవటంలో చాలాసార్లు భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ప్రత్యక్ష చర్చల ద్వారా కొంత వరకు పరిష్కరించుకున్నా మరల ఈ సందర్భంలో మరల ఇబ్బంది వచ్చింది. తెలుగు వికీ అభివృద్ధిపైన దృష్టితో చేసిన అభిప్రాయాలను అభియోగాలుగా పరిగణించడం సబబు కాదు. నిర్వాహక హోదా అభ్యర్ధనలకు వ్యతిరేకత వ్యక్తం చేయటం కొత్తగా జరుగుతున్నది కాదు. రహ్మానుద్దీన్ గారి నిర్వాహకత్వానికి వికీసోర్స్ లో మొదటి గా సమర్ధించిన వాడిని మరియు వికీపీడియాలో ప్రతిపాదించిన వాడిని ఇప్పుడు వ్యతిరేకించానంటే ఆయనపై నాకేమి వ్యక్తిగతద్వేషమేమివుండి కాదని రహ్మానుద్దీన్ గారు మరియు సహసభ్యులు గుర్తించితే చాలు.నేను అదే విషయం ఈ రోజు ఫోనులో మాట్లాడిన సందర్భం వచ్చినప్పుడు రహ్మానుద్దీన్ గారితో చెప్పటం జరిగింది. అభ్యర్ధనపై స్పందించని నిర్వాహకులు లేక అధికారులు (ఇది ఆంగ్లంలో వాడుతున్న సంప్రదాయం మరియు మంచి పద్ధతి) ఈ అధికార అభ్యర్ధనపై స్పందనలు పరిశీలించి ఏ విధంగా నిర్ణయం తీసుకున్ననుా అది సముదాయం నిర్ణయంగా భావిస్తానని తెలియచేస్తున్నాను. అలాగే రహ్మానుద్దీన్ వికీ ప్రాజెక్టులలో కొనసాగాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 13:04, 21 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

లిప్యాంతరీకరణ

[మార్చు]

telugu lipyamtikrana Telugu is not coming in the system from 21/1/14. plese help me . Bhaskaranaidu (చర్చ) 02:46, 22 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు కూడా తెలుగులో టైపింగు వీలుకావడం లేదు. దయాచేసి సరిచేయండి.Rajasekhar1961 (చర్చ) 03:58, 22 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు లిప్యాంతరీకరణ రాకపోవడం వల్ల టైపింగ్ యిబ్బందిగా ఉన్నది. సరిచేయగలరు.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 05:11, 22 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ నాకు చెప్పిన పరిష్కారం. మీ అభిరుచులు తెరచి అందులో "Enable the Universal Language Selector" అనే విభాగం ముందరి పెట్టెలో టిక్ చేసి, భద్రపరచండి. అప్పుడు లిప్యంతరీకరణ వస్తుంది.Rajasekhar1961 (చర్చ) 06:31, 22 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
చిట్కా పనిచేసింది. ధన్యవాదములు రాజశేఖర్ మరియు రహ్మానుద్దీన్ గారు. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:00, 22 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వద్ద Enable the Universal Language Selector ముందు ఉన్న చెక్ బాక్స్ పెట్టెలో టిక్ చేసి భద్రపరచండి (సేవ్ చేయండి). సరిపోతుంది. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:11, 22 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ దశాబ్ది సందర్భంగా బడ్జెట్ విషయమై పలు వనరులకు చేసుకున్న అభ్యర్థనలు

[మార్చు]

తెవికీ దశాబ్ది సందర్భంగా అన్ని ఖర్చులూ కలిపి అక్షరాలా రూ. 6,62,100/- అంచనా అయింది. అందులో

మొత్తం కోసం అభ్యర్థన చేయటం జరిగింది. ఆ అభ్యర్థన పేజీలలో మరియు బడ్జెట్ పేజీలలో మీ మద్దత్తును తెలుపగలరు.
సముదాయంలో దాదాపుగా నెలనాళ్ళుగా ఈ బడ్జెట్ పేజీ అందుబాటులో ఉంది, ఇప్పటి వరకూ సభ్యులు నకారాత్మకంగా వ్యాఖ్యలు చేయలేదు. సమూహానికి బయట ఇవి ప్రదర్శిస్తున్నపుడు అక్కడ నకారాత్మకంగా వ్యాఖ్య చేస్తే సమూహ సమిష్టితనంపై అనుమానాలు బయటివారికి కలుగవచ్చు - అందువలన నకారాత్మక వ్యాఖ్యలు దయచేసి సభ్యులు చేయవద్దని మనవి. ఏమయినా వ్యాఖ్య చేయాల్సి ఉంటే బడ్జెట్ (తెవికీ) చర్చా పేజీలో చేయగలరు. --విశ్వనాధ్ (చర్చ) 09:43, 22 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ వ్యూస్టాట్స్ (Wiki Viewstats)

[మార్చు]

వికీవ్యూస్టాట్స్ - మొట్టమొదటిసారి గంటల వారీగా మరియు వివిధ కాలములలో క్రిందటి నాలుగు నెలలలో) వికీ ప్రాజెక్టుల వీక్షణలు,జతగా సభ్యుని మార్పుల విశ్లేషణ ఉపకరణం విడుదలైంది. వికీపీడియా:స్థానికీకరణ పై ఆసక్తిగలవారు https://de.wikipedia.org/wiki/Wikipedia:Wiki_ViewStats/L10n చూసి దీనిని తెలుగురూపం చేయటానికి ప్రయత్నించవచ్చు.--అర్జున (చర్చ) 05:21, 23 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

డిసెంబరు 2013 మాసపు దిద్దుబాట్లలో రికార్డుల మోత

[మార్చు]

డిసెంబరు 2013 మాసములో దిద్దుబాట్ల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా పలు రికార్డులు సృష్టించబడ్డాయి. రోజూవారీ సగటు వ్యాసాల సంఖ్య కూడా పెరిగింది. పూర్తి విశ్లేషణకై ఇక్కడ చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:48, 24 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

డిసెంబరులో 2013 తెవికీ అభివృధ్ధి

[మార్చు]

డిసెంబరులో 2013 మాసం తెవికీ గణాంకాల అత్యున్నతంగా ఉన్నాయి.

  • క్రితం నెలకంటే దిద్దుబాట్లలో ౩౩% వృద్ధి. 17,544 దిద్దుబాట్లతో, నెలవారి ఎడిట్లలో ఈ నెల ప్రథమ స్థానంలో ఉన్నది.
  • 79 మంది చురుకైన ఎడిటర్లతో 2nd highest రికార్డ్ తిరగరాయబడింది. క్రితం మాసంతో పోలిస్తే 114% వృధ్ధి.
  • 28 మంది కొత్త వాడుకరులు తెవికీలో కనీసం 5 దిద్దుబాట్లు చేసారు. క్రితం మాసంతో పోలిస్తే 367% వృధ్ధి.
  • అతి చురుకైన వాడుకరుల సంఖ్య తెవికీ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా 20కి చేరింది
  • మొట్టమొదటి సారిగా వ్యాసాలలో 4 సభ్యులు 1000 కంటే ఎక్కువ దిద్దుబాట్లు మరియు 1 సభ్యుడు 2500 పై చిలుకు దిద్దుబాట్లతో ఒక చారిత్రాత్మకమైన రికార్డు నెలకొల్పారు.
  • వ్యాసాల పరంగా రోజుకు సగటుగా 24 కొత్త వ్యాసాల ఈ మాసంలో తెవికీలో చేరుకున్నాయి.
మనం చేసిన తెవికీ శిక్షణా శిబిరాలు, మిడియా ప్రాపగాండా, సెలవులో ఉన్న కొందరు తెవికీ సభ్యులు పునరుత్తేజితులవ్వడం, తెవికీ సభ్యులు ఇంకా చురుకుగా వ్యాసాలు వ్రాయడం ఈ అభివృధ్ధికి కారణభూతాలని నా భావన. ఈ ప్రగతిని కాపాడుతూ, సమిష్టి కృషితో తెవికీ ఇలాగే ముందుకు దూసుకుపోతుందని ఆశిస్తూ...గణాంకాల వనరుకై ఇక్కడ చూడండి.

--విష్ణు (చర్చ)08:12, 24 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ గణాంకాలలో కనిపిస్తున్న అభివృద్ధి మనందరి సమిష్టి కృషి ఫలితం. సంతోషదాయకం. మనలోని భేదభావాలని తొలగించుకొని, ఒకరిని మరొకరు అర్ధం చేసుకోని, కొత్త సభ్యులకు ప్రోత్సాహించి వారితో వ్యాసాలను రాయించగలిగితే మనం ఇంకా ఎన్నొ మైలురాళ్ళను దాటవచ్చునని నా నమ్మకం.Rajasekhar1961 (చర్చ) 12:27, 24 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ ట్రెండ్స్, ట్విట్టర్ , ఎఫ్‌బి వాటిలలో ప్రస్తుతం జనరంజక మైన విషయాలు వార్తా అంశాలు దొరుకుతాయి వాటిని ద్వారా సమాచారం వికీ లో చేర్చ వచ్చు ఉదా: నాగేశ్వరావు , ఉదయ్ కిరణ్ చనిపోయినతారువత అన్నీ పేపర్లు విరణాత్మక సమాచారం ప్రచురించాయి వాటికి ఇన్పుట్ గా తీసుకోవచ్చు ఈ సారి నుండి ఆదివారాలు వీలయితే హైదరాబాదులో జరుగుతున్నా ఏమైయా సాహిత్య సాంఘిక సభలకు వెళ్ళి వారి అనుమతితో అక్కడ తెవికీ పరిచయం చేయవచ్చు. అలాంటి చోట విషయ నిపుణులు వుంటారు. గతంలో eతెలుగు ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాము .. ఫలితాలు నిరాశపరచలేదు. --కశ్యప్ 06:01, 25 జనవరి 2014 (UTC)

పార్లమెంటు సభ్యుల వ్యాసాల గురించి

[మార్చు]

నేను ఇటీవలి చూసిన కొత్త వ్యాసాల్లో పార్లమెంటు సభ్యుల గురించిన వ్యాసాలు విరివిగా వుంటున్నాయి (ఉదా:హెలన్_డెవిడ్సన్). మన ఆంధ్రప్రదేశ్ MPలు లేక కేంద్ర మంత్రులకి లేక తెలుగు మాట్లాడే ప్రముఖ ప్రాంతాలను తప్పించి అందరు MP లకు పేజీలు చేయటం ఒక విధంగా స్పామ్ (spam) నా దృష్టిలో ఎందుకంటే వాటిపై తెలుగు వీక్షకులకు అంత ఆసక్తి వుండదు. నేను కొంతకాలంగా చెబుతున్నట్లు గణాంకాలే ధ్యేయంగా వ్యాసాల సృష్టి తెలుగు వికీ అభివృద్ధికి మంచిది కాదు. చేసే కృషిని నాణ్యత పెంచే కార్యక్రమాలపై పెట్టితే ఫలితాలు మెరుగుగా వుంటాయి కాబట్టి సభ్యులని నాణ్యత వైపు దృష్టిపెట్టమని మరొక సారి కోరుతున్నాను.దీనిపై భిన్న అభిప్రాయాలున్నావారు స్పందిస్తే విధానం నిర్ణయానికి ప్రయత్నించవచ్చు. --అర్జున (చర్చ) 10:20, 24 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • హెలన్_డెవిడ్సన్ లాంటి వ్యాసాలపై తెలుగు వీక్షకులకు అంత ఆసక్తి వుండదు అని ప్రామాణికంగా చెప్పడం దుస్సాద్యం.ఎందుకంటే ప్రస్తుతం మనమున్న డిజిటల్ ప్రపంచంలో ఎవరు, ఎప్పుడు, ఎలా, ఎలాంటి సమాచారం లేక విజ్ఞానం కోసం అంతర్జాలంలో మరియు తెవికీ వంటి స్వేచ్ఛా విజ్ఞాణ భాండాగారాలలో వెదుకుతారో తెలుసుకొనడం అతి కష్టం. వ్యాసం Notability criteria కొంతలో కొంత meet అవుతుందా,లేదా అనేది చూడటం వరకు మనం చేయవచ్చు.--విష్ణు (చర్చ)18:08, 24 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • అభివృద్ధిని ప్రణాళికాబద్ధం చేయవచ్చు, అభివృద్ధి అంతా ప్రణాళికబద్ధంగానే జరగాలి అనుకుంటే అసలు వికీపీడియానే ఉండేది కాదు. విష్ణుగారన్నట్టు విషయప్రాధాన్యత, పరిధిలో ఉందా అన్నది చూసుకోవాలి. దాదాపు ఈ ఎంపీలందరికీ తప్పకుండా మూలాలు ఉంటాయి. ఇక ప్రశ్నించుకోవలసింది ఇవి పరిధిలో ఉన్నాయా లేదా అన్నది మాత్రమే. ఇది స్పామ్ మాత్రం కాదు. కేవలం పాఠకుల ఆసక్తులకే వడ్డించడానికి ఇది బ్లాగు కాదు, టీవీ ఛానలు అంతకన్నా కాదు. విజ్ఞాన సర్వస్వాలు మొదట సృష్టించబడతాయి. ఆ తరువాతే వినియోగదారులను వెతుక్కుంటాయి. కానీ ఇలా మూకుమ్మడిగా ఈ వ్యాసాలను సృష్టించడం వళ్ళ కలిగే ప్రయోజనాలను/అప్రయోజనాలను తప్పకుండా ప్రశ్నించవచ్చు. వ్యక్తిగతంగా నాకిలాంటి వ్యాసాలు సృష్టించడం ఇష్టం లేదు. అలా అని ఖరాఖండిగా నిషేధిస్తే మరి తెవికీ పరిధి ఎలా పెరుగుతుంది? --వైజాసత్య (చర్చ) 06:33, 26 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • వికీపీడియాలో ఎవరికి నచ్చిన విషయాల గురించి వారు వ్యాసాలు తయారుచేసుకోవచ్చును. చూడాల్సింది నోటబిలిటీ మాత్రమే. భారత పార్లమెంటు సభ్యులకు వ్యాసాలు నోటబిలిటీ గా వస్తాయి కాబట్టే ఆంగ్ల వికీలో కూడా ఎంతచిన్న వ్యాసమైన పార్లమెంటు సభ్యుల గురించిన వ్యాసాల్ని తొలగించరు. తెలుగు వారి గురించి మాత్రమే తెవికీలో వ్యాసాలుండాలని చెప్పడం సరికాదు. భాస్కరనాయుడు గారితో చర్చించి ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యులకు వ్యాసాలు సృష్టించమని తెలియజేస్తాను. ఆసక్తిగల వారికి సహాయంగా ఉంటుందని ఆంధ్ర ప్రదేశ్ నుండి 1 నుండి 15 వ లోకసభలకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల జాబితాలను తయారుచేస్తున్నాను. గమనించండి.Rajasekhar1961 (చర్చ) 06:45, 26 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • తెవికీలో ఎలాంటి వ్యాసాలు ఉండాలి అని చెప్పాలంటే దానికి ముఖ్యంగా రెండు అంశాల గురించి చెప్పాల్సి వస్తుంది. ఒకటి తెవికీ ప్రస్తుత స్థాయి, రెండవది తెవికీని సందర్శించే తెలుగువారి దృష్టికోణం. తెవికీ ప్రస్తుత స్థాయి గురించి చెప్పాలంటే ఇది ఇంకనూ అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉంది. కాబట్టి అభివృద్ధి చెందిన ఆంగ్లవికీలతో ఈ విషయాన్ని పోల్చలేము. ఒక ఆర్థికవేత్త అభివృద్ధి చెందిన దేశపు ఒక సిద్ధాంతాన్ని అభివృద్ధి చెందుతున్న దేశానికి అన్వయించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ విధంగా చెప్పాడు- "ఇంగ్లాండు దేశపు వాతావరణంలో పెరిగే ఒక మొక్కను భారతదేశంలో నాటితే చచ్చిపోతుంది, చచ్చే ముందు విషం కక్కుతుంది" అని. ఇదే వ్యాఖ్య మన తెవికీకి కూడా వర్తిస్తుందనుకుంటున్నాను. ఇక తెవికీని సందర్శించే తెలుగు వారి దృష్టికోణం గురించి సంక్షిప్తంగా చెప్పడం కష్టసాధ్యమే. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకొనే పరిస్థితి కూడా ఉంది. భారత పార్లమెంటు సభ్యుల గురించే కాదు అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల గురించి కూడా మనం తెవికీలో చేర్చవచ్చు. కాంగ్రెస్సే కాదు చివరికి అమెరికాలోని ఒక రాష్ట్రానికి చెందిన అసెంబ్లీ సభ్యులైనా సరే, ఒక్కటే నిబంధన- చివుకుల ఉపేంద్ర లాంటి తెలుగు వారుండి, వారి గురించి తెలుసుకొనే తెవికీ పాఠకులున్నప్పుడు. మరి మనం రాసే వ్యాసాలే పాఠకులు చూడాలా? పాఠకులు చూసే వ్యాసాలే మనం రచించాలా? అంటే ఈ విషయాన్ని ఇదివరకు అనేక చర్చలలో వెలిబుచ్చాను. అలాగే ఈ రోజు తెలుగువారి దృష్టిలో ముఖ్యంకాని వ్యాసం తెల్లారేవరకు ముఖ్యం కావచ్చు. ఒక చిన్న సంఘటన కూడా ఒక వ్యాసాన్ని పెద్దగా ప్రభావితం చేయవచ్చు. ఎక్కడో దూరాన ఉన్న ఒక చిన్న దేశంలోని ఒక మామూలు గ్రామ వ్యాసం కూడా రేపు తెవికీలో రావచ్చునేమో! అది పరిస్థితుల ప్రభావం, కాని అలాంటి పరిస్థితి ఎప్పుడైనా రాకపోతుందా అని అన్ని దేశాల గ్రామ వ్యాసాలు ముందే చేర్చడం వృధాపనే అవుతుంది. చివరగా చెప్పాలంటే ఆంగ్లవికిలో ఉన్న అన్ని వ్యాసాలు మనకు అవసరం లేదు, అలాగే ఏ వ్యాసం అనవసరం అని కూడా చెప్పలేము, కాని స్థాయిని బట్టి, పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. చివరగా విషయానికి సంబంధించి ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతాను- ఆధారం ప్రకారం చూస్తే పార్లమెంటు సభ్యుల వ్యాసాలు రాయడం మాత్రం సునాయాసం. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:26, 26 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • పార్లమెంటు సభ్యుల వ్యాసాలు ( తెలుగేతరులు) వ్రాస్తున్నది నేనే. వాటి గురించే పైన జరిగిన చర్చ. (1)వాటిని నేనెందుకు వ్రాస్తున్నాను? (2) తెరుగు వారి గురించి వ్రాయలేనా?? (3) నాకు గణాంకాలే ద్యేయమా....??? .... ఈ విషయాలపై సమాదానాలు ఇవ్వవలసిన బాధ్యత నాపై వున్నది. వాటికి నాసమాదానం.
(1) తెవికి దశాబ్దాల ఉత్సవాల నాటికి తెవికిలో ప్వాసాల సంఖ్య 55555 చేరాలని తదనుగుణంగా పని చేయాలని తెవికి ప్రముఖులు నిర్ణయం తీసుకోవడం మనందరకు తెలిసినదే.... ఆ సంఖ్యను చేరడానికి నావంతు కృషిగా నేను చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇది. అంతే కాని గణాంకాల దృష్టిలో పెట్టుకొని కాదు. తెలుగు వికీలో తెలుగేతరుల గురించిన వ్యాసాలు చాలనే వున్నాయి. వాటిలాగానే ఇవి కూడా వ్రాసాను.
(2) తెలుగు వారి గురించి కూడ వ్రాయ వచ్చు. కాని ఆపని వేరొకరు, ఇద్దరు చేస్తున్నారు. నేనూ వ్రాసాను. కొందరి పేరున వ్యాసాలు పేరులో స్వల్ప మార్పులతో ఇదివరకే వ్వాసాలున్నాయి.(ఉదాహరణకు... కిళ్ళి కృపారాణీ గారి గురించిన నేను వ్రాసిన వ్యాసం అది ఇదివరకే వున్నది.) ఆ స్వల్ప తేడాతో వ్యాసాల పేరున వెతకగా... లేదు అని సృష్టించమని వస్తేనే వ్రాస్తున్నాను. అదియును గాక తెలుగు వారి గురించి వ్రాసే వారు చాల మంది వున్నారు. మన పొరుగున వున్న రాష్ట్రాల పార్ల మెంటు సభ్యుల గిరించి తెలువారు అంతగా స్పందించరని ఊహించి వారిని గురించి వ్రాయడము మొదలు పెట్టాను. ఇవి వ్రాస్తున్నందున ఘర్షణ కూడ ఏర్పడదు. మరొక విషయం మన పొరుగు రాష్ట్రాలైన తమిళ నాడు, కర్ణాటక రాష్ట్రాల లోని సంస్కృతి సాంప్రదాయము తెలుగు దనానికి అతి దగ్గరగా వుంటుంది. ఇది ఎవరు కాదనలేని సత్యము. ఆవిధంగా ఆ రాష్ట్రాల లోని పార్లమెంటు సభ్యుల గిరించి కూడ తెలుగు వారిలో తప్పకుండ అవగాహన వుంటుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో ఎక్కువ. నేను వ్రాస్తున్న వారి పేర్లు కూడ గమనించండి ... అందులో కొన్ని తెలుగు పేర్లు కూడ వున్నాయి. ఇందులో కొంత సామ్యత వున్నందున మన పొరుగు రాష్ట్రాల వ్యక్తులను ఎంచుకున్నాను. అంతే గాని .... ఏ ఉత్తర భారత దేశములోని పార్ల మెంటు సభ్యుల గురించి.... వ్రాయలేదే?... వికీపీడియా లో తెలుగు వారి గురించి మాత్రమే వ్రాయాలని నిభందన ఏమీ లేదని నేననుకుంటున్నాను. లీలావతి కూతుళ్ళు అనే వ్యాస పరంపరలో వస్తున్న వ్యాసాలు ఎవరివి. తెలుగు వారికి అవి అవసరమా? వారి గురించి తెలుసుకోవలసిన అవసరం తెలుగు వారి కేమున్నది? ఇటు వంటి ప్రశ్నలు తలెత్తే అవకాశం లేదా??
(3)గణాంకాల పై నాదృష్టి కాదు. కాక పోతే.......... ఈ మధ్యన మన తెవికి ప్రముఖులు రాబోవు దశాబ్ధి వుత్సవాల నాటికి మన వ్యాసాల సంఖ్య 55555 మార్కు చేరాలని ఆశించాను. అందులో భాగంగానే నేను కొంత ఉత్సాహం చూపిన మాట వాస్తవమే. మరీ ఎక్కువగా వ్రాస్తే ఎవమేమనుకుంటారో నని సందేహిస్తూనే వ్రాసాను. నాసందేహమే నిజమైనది. వెంటనే మేల్కొలిపారు. అందులకు నా కృతజ్ఞతలు.
(4) నామనవి ఏమంటే? ...... ఇంతవరకు వచ్చిన వ్యాసాలలో, వస్తున్న వ్యాసాలలో పైన తెలిపినట్లు స్పాం గా పరిగణించ వలసిన వ్యాసాలను గుర్తించి బయట పెడితే మంచిదేమో. దానితో అటువంటి వ్యాసాలు సృష్టించ బడకుండా వుండగలవు కదా?? ఎలాంటి వ్యాసాలు స్పాం గా పరిగణించ బడతాయి అలా పరగణింప బడడానికి కొలబద్ద లేమైనా వుంటే వాటిని కూడ సభ్యుల ఉపయోగార్థం తెలియజేయగలరని నామనవి. రాబోవు దశాబ్ది ఉత్సవాలలోనైనా...... తెవికి/విక్షనరీ మరియు ఇతర ప్రాజెక్టులలో...... ఎలాంటివి వ్రాయవచ్చు/ఎలాంటివి వ్రాయకూడదు.. అనే విషయాలు కూలంకషంగా తెలియ జేస్తే వాడుకరులకు, ముఖ్యంగా ఈ మధ్యన కొత్తగా చేరిన వాడుకరులకు చాల ఉపయోగంగా వుంటుంది. అలా చేస్తే స్పాం బారిన పడకుండా వాడుకరులు జాగ్రత్త పడగలరు. తెకివి వ్యాసాల నాణ్యత పెరుగ గలదు.Bhaskaranaidu (చర్చ) 09:17, 26 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • సాంకేతిక అభివృద్ధితో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయిన ప్రస్తుత సమాజంలో తెలియవలసిన... తెలుసుకోదగిన... తెలియజేయదగిన... సమాచారం ఏదయినా... తెవికీలో జేర్చడం సమంజసమే...! ఇన్ని హిట్లు వస్తే..రేటింగ్ వచ్చేందుకు ఇదేమీ కమర్షియల్ స్లాట్ కాదు...! తెలుగు సంస్కృతీ సంప్రదాయాలతో బాటు, తెలుగు వారికి అవసరమైన, నేటి రేపటి తరాలకు చేర్చవలసిన, నమ్మదగిన ఖచ్చితమైన సమాచారం ఏదయినా తెవికీలో నిక్షిప్తం చెయ్యవచ్చు. .........Malladi kameswara rao (చర్చ) 18:18, 26 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • తెవికి దశాబ్దాల ఉత్సవాల నాటికి తెవికిలో వ్యాసాల సంఖ్య 55555 కి చేరాలన్న ఆశయంతో నేను కొన్ని వ్యాసాలు సృష్టించడం జరిగింది. అందులో కొన్ని copy rights problems కి గురయ్యాయి. ఈ విషయంలో నేను Bhaskaranaidu గారితో ఏకీభవిస్తున్నాను. ఇలా ఉత్సాహంతో రాస్తున్న వారిని నిరుత్సాపరిస్తే, ఇకముందు రాయడానికి ముందుకు రారేమోనని నా అభిప్రాయం. Pranayraj1985 (చర్చ) 19:04, 26 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • స్పందించిన సభ్యులందరికి ధన్యవాదాలు.నేను చర్చలేవనెత్తటానికి పై స్పందనల ప్రకారం కూడా కారణం కేవలం 55555 వ్యాసాలు చేరడం కోసం ఆధారాలు లేని, నకలుహక్కుల వుల్లంఘన జరుపుతూ ఒక వరుసకి ఒక విభాగంతో వస్తున్న వ్యాసాలు కనబడడం వలననే. నాణ్యత దెబ్బతినకుండా వ్యాసాలు పెంచాలని దశాబ్ది ఉత్సవాల కార్యక్రమం లక్ష్యంలో వున్నా నాణ్యత దెబ్బతినే విధంగా రచనలు వస్తుండటం నాకు బాధకలిగించింది. విషయప్రాధాన్యత, పరిధిలో ఉందా, మూకుమ్మడిగా ఈ వ్యాసాలను సృష్టించడం వల్ల కలిగే ప్రయోజనాలను/అప్రయోజనాలను చర్చించాలనే సభ్యుల అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఇక ఎవరికి తెలిసింది వారు రాయవచ్చు అనేదానితో ఏకీభవించలేను.అలా అనుకొనేవారికి స్వంత బ్లాగులు మంచిది.ఎందుకంటే తెలుగు వికీకీ సంబంధించి కొన్ని విధానాలు నియమాలు వున్నాయి కదా. ఇక ప్రాధాన్యత అనేది మన తెవికీ సందర్భంలో అన్వయించాలి. కొలరావిపు కార్యక్రమం చేసి తెవికీఅభివృద్ధికి దోహదం చేయనివాటిని ఎంపిక మండలి పేర్కొన్నప్పటికి సభ్యులు దృష్టిపెట్టక ఎవరిష్టమొచ్చినట్లు చేయడం మంచిది కాదు. ఇది జాల స్థలి కాబట్టి ఎన్నివ్యాసాలున్నా పెద్దగా ఖర్చయ్యేది లేదు కాని నాణ్యత లేని వ్యాసాల వలన తెలుగు వికీ చదువరులకి దురభిప్రాయం కలిగే అవకాశం ఆ అభిప్రాయం తెలుగు వికీ మొత్తానికి విస్తరించే ప్రమాదముందని గ్రహించాలి. మనం తెలుగు వికీలో ఎందుకు కృషి చేస్తున్నాము,ఎవరికోసం చేస్తున్నాము, మనం చేసేపనివలన లక్ష్యంవైపు పురోగతి ఎలా వేగవంతమవుతుంది అనేది ఎవరికివారు విశ్లేషించి పనిచేస్తే మంచిది.
పార్లమెంట్ సభ్యుల వ్యాసాలకు వస్తే దీని పరిధి ఎక్కడ నిర్వచించినట్లు కనబడదు. 55000 లక్ష్యం పెట్టినవారు మరియు తోడ్పడుతున్న వారు నాణ్యత దృష్టిలో వుంచుకోవాలి. ఇక వ్యాసం ప్రారంభించేవారు లేక పరిధిని నిర్ణయించేవారుతెలుగు వికీకి తనను తాను ఒక ముఖ్య సంపాదకునిగా భావించి ఈ వ్యాసం ఇతరులని చదవడానికి మరియు ఇతరులు దీనిని అభివృద్ధి చేయడానికి ఆకర్షిస్తుందా అన్నది దృష్టిలో వుంచుకొని కొత్త వ్యాసాలు ప్రారంభించడం మంచిది. ప్రాధాన్యత సంబంధిత పాత చర్చలలో కూడా తెలిపినట్లు,ఒక వ్యక్తి లేదా విషయం గురించి నాలుగైదు వాక్యాల సమాచారమున్నదని కొత్త వ్యాసం ప్రారంభించకుండా అటువంటి వ్యాసాలకి కొద్ది ప్రాధాన్యత వుంటే వాటిని సంబంధిత జాబితాలో రాయడం ఆ తరువాత దాని ప్రాధాన్యత పెరిగితే ప్రత్యేక వ్యాసం చేయడం మంచిదని నాఅభిప్రాయం.--అర్జున (చర్చ) 05:31, 27 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇక్కడ జరుగుతున్న మరో పెద్ద పొరపాటు ఏమిటంటే లోకసభ వెబ్‌సైటును యధాతథంగా కాపిచేయడం. ఉదా:కు చూడండి. ఒకే ఆధారం లేదా మూలం నుంచి అధిక సమాచారం తీసుకోరాదనేది వికీ మౌళిక నియమమే. దీన్ని ఉల్లంఘించడం పొరపాటు మరియు కాపీ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. వ్యాసం వ్రాయడమంటే ఇంత సులభం కాదని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. పలు వనరుల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి తెవికీ ప్రమాణాల ప్రకారం తయారుచేయడం కష్టమైననూ అసలు పద్దతి అదేనని గుర్తించడం ముఖ్యం. అర్జునరావు గారు అన్నట్లు "ఎవరికి తెలిసింది వారు రాయవచ్చు అనేదానితో ఏకీభవించలేను" అనే దానికి కొన్ని పరిమితులతో నేనూ అంగీకరిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:32, 28 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • సభ్యుడు:C.Chandra Kanth Rao గారు చెప్పినట్లు మొత్తం సమాచారం సాధారణంగా పూర్తిగా నకలు చేయడం మంచిది కాదుకాని. మూలంలో వున్నది కొద్ది సమాచారము మరియు మూలం ప్రభుత్వ జాలస్థలి మరియు విషయం ప్రజా ప్రతినిధుల సమాచారం కావున ప్రారంభ దశలో మినహాయింపు ఇవ్వవచ్చనుకుంటాను. కాని ఇతర సమాచారం, మూలాలు త్వరలో చేర్చితే మంచిది.ఆంగ్లం విషయం అనువదించాలనుకునే వారు ఆంగ్ల సమాచారాన్ని చేర్చి దాన్ని అనువాదం పూర్తయేంతవరకు వికీలో చదువరులకు కనబడకుండా ({{hidden|అనువాదం కాని దాచిన పాఠ్యం|<కనబడకుండా చేయవలసిన పాఠ్యం> }}) చేయడంమంచిది. నేను పై వ్యాసానికి ప్రస్తుతానికి అలా చేశాను.--అర్జున (చర్చ) 12:23, 30 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • మనదేశంలో ప్రజాధనంతో తయారయ్యే కృతులపై హక్కులు సార్వజనీయం చేయటానికి ఉద్యమం చేయవలసివుంది. అంతవరకు ప్రభుత్వకృతులని సముచిత వినియోగం రూపంలో వాడుకోవచ్చు అని నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 04:46, 31 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ దశాబ్ది ఉత్సవాల కార్యనిర్వాహకవర్గ సభ్యుల సమావేశ వివరాలు

[మార్చు]

నమస్కారం...తెలుగు వికీపీడియా పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా తెవికీ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించదలచి, దానికోసమై కార్యనిర్వాహకవర్గం ఏర్పాటైన విషయం అందరికి తెలిసిందే. ఆ కార్యనిర్వాహకవర్గం వారంవారం సమావేశమై, తెవికీ దశాబ్ది ఉత్సవాలు విజయవంతంగా జరగడానికి కృషి చేస్తుంది. ఆ సమావేశాల వివరాలు ఇతర సభ్యులకు కూడా తెలియాలనే ఉద్ధేశ్యంతో తెవికీ దశాబ్ది ఉత్సవాల చర్చ పేజీలో పొందుపరచడం జరిగింది. సభ్యులు స్పందించగలరు. Pranayraj1985 (చర్చ), (కార్యదర్శి, తెవికీ దశాబ్ది ఉత్సవాలు), 16:07, 27 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా కు పేస్ బుక్ పేజ్

[మార్చు]

తెలుగు వికీపీడియా కు పేస్ బుక్ పేజ్ ని ప్రారంభించాను ( https://www.facebook.com/WikipediaTelugu ) . అర్జున రావు గారితో మాట్లాడిన తరువాత మరో రెండు వికీపీడియా సంబంధించి మరో పేస్ బుక్ పేజ్ లను కూడా గుర్తించాను . ఎందుకో ఈ మధ్య కాలం లో వాటిలో అప్ డేట్స్ లేనట్లే కనిపించింది . నేను నా బ్లాగ్ ( http://www.templeinformation.in/ ) కు సంబంధించి తెలుగు ట్రావెల్ బ్లాగ్ తో పేరుతో ( https://www.facebook.com/TirthYatrainfo ) నిర్వహిస్తున్న అనుభవం కూడా ఉంది . ప్రారంభించిన తెలుగు వికీపీడియా పేస్ బుక్ పేజ్ కి 400 లైక్ లు కూడా వచ్చినవి . త్వరలోనే 1000 లైక్స్ చేరుతుంది . దీని ద్వారా పేస్ బుక్ లో తెలుగు వికీపీడియా కు ప్రచారం లభిస్తుంది . సలహాలు సూచనలు ఇవ్వగలరు . - రాజాచంద్ర (28-01-2014)

రాజచంద్రగారూ మీరు చేస్తున్న కృషికి అభినందనలు. ఇప్పుడున్న తెవికీ పేజీలలో అప్‌డేట్స్ ఉన్నాయి. (https://www.facebook.com/groups/560945180622204/), (https://www.facebook.com/groups/166361376723388/) కొత్తగా మరొకటి ఉండటం కంటే మీరే పాతవాటిని అభివృద్దిచేయవచ్చుగా. అందులోనే అప్‌డేట్స్ పెట్టండి. ఎక్కువగా పేస్బుక్ ఖాతాలున్నా వాడుకరులు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు...విశ్వనాధ్ (చర్చ) 09:01, 29 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కొలరావిపు ఎంపిక కమిటీ వారికో విజ్ఞప్తి

[మార్చు]

మెటా వద్ద దశాబ్ది బడ్జెట్అభ్యర్థనచర్చ పేజీ వద్ద వచ్చిన అభ్యర్థనననుసరించి దయచేసి ఎంపిక కమిటీ, కార్యవర్గం వారి నామినేషను పేజీలను తొలగించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:03, 31 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]