వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/డిసెంబర్ 20, 2015 సమావేశం
మొదటిసారిగా ఆంగ్ల, తెలుగు వీకి సమావేశం కలిపి నిర్వహించడం జరుగుతోంది. కావున మనకి హైదరాబాదు కి చెందిన ఆంగ్ల వీకి వాళ్ళని కలిసే అవకాశం లభిస్తొంది.
వివరాలు
[మార్చు]- ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్
- తేదీ : 20-12-2015; సమయం : 10:00 AM నుండి....
జరిగే కార్యక్రమాలు
[మార్చు]- తెవికీ పై చిన్న ప్రెజెంటేషన్ మరియు సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక 2015-16పై (పవన్ సంతోష్ గారిచే) చర్చ
- తెవికీ లోకి అనువాదం పై ఎడిట్-ఎ-థాన్
- ఆంగ్ల వికీపీడియన్లతో మాములు చర్చ.
నిర్వహణ
[మార్చు]నిర్వాహకులు
[మార్చు]గమనిక: ఈ సారి
నిర్వహణ సహకారం
[మార్చు]
సమావేశానికి ముందస్తు నమోదు
[మార్చు]- శ్రీకర్ కాశ్యప్ 14:32, 11 డిసెంబరు 2015 (UTC)
- --Pranayraj1985 (చర్చ) 09:47, 17 డిసెంబరు 2015 (UTC)
- --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:13, 18 డిసెంబరు 2015 (UTC)
- -- శశి (చర్చ) 01:38, 20 డిసెంబరు 2015 (UTC)
- --కశ్యప్ (చర్చ) 03:40, 20 డిసెంబరు 2015 (UTC)
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
నివేదిక
[మార్చు]బహుభాషా సంస్కృతులు నిలయమైన హైదరాబాద్ నగరంలో తొలిసారిగా బహుభాషా వికీపీడియన్ల అరుదైన సమ్మేళనం జరిగింది. మొదటగా పరిచయ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం వికీమీడియా ఇండియా ఛాప్టర్ కార్యకలాపాలను యోహన్ థామస్ వివరించి, హాజరైన వికీపీడియన్లకు ఛాప్టర్ సభ్యత్యాలు అందజేశారు. తరువాత వికీపీడియాలో రచనలు చేయడం మాత్రమే కాక ఎన్ని రకాలుగా కృషిచేయవచ్చు అన్న అంశాన్ని నిర్వహణ సహకారం అందించిన పవన్ సంతోష్ ప్రెజంటేషన్లో తెలియజేశారు. మధ్యాహ్న భోజన అనంతరం తెలుగు భాష మరియు సంస్కృతికి సంబంధించి ఆంగ్ల వికీపీడియాలో ఉన్న వ్యాసాలను తెలుగు వికీపీడియాలోకి అనువదించారు. రెండు భాషల వికీపీడియన్లు పరస్పర అవగాహనలతో తమ తమ వికీపీడియాల్లోని పద్ధతులు పంచుకున్నారు. ఈనాడు పత్రికలో వచ్చిన వార్తాంశంను చూసి కార్యక్రమానికి వచ్చిన కొత్త వికీపీడియన్లు ఖాతా తెరిచి వికీపీడియా గురించి రాయడాన్ని నేర్చుకున్నారు. తేలికగా అనువాదాలు చేయడం తెలుసుకుని వికీపీడియా అనువాదాల ఎడిటథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక 2015-16పై చర్చ జరిగింది.
పాల్గొన్నవారు
[మార్చు]- డా. రాజశేఖర్
- భాస్కరనాయుడు
- గుళ్ళపల్లి నాగేశ్వరరావు
- స్వరలాసిక
- కశ్యప్
- ప్రవీణ్ ఇళ్ల
- శశి
- పవన్ సంతోష్
- ప్రణయ్‌రాజ్ వంగరి
- శ్రీకర్ కాశ్యప్
- రాజగోపాల రెడ్డి
- విజయ్
- రామ్ నందన్
- వినయ్
- యోహన్
- ముజమిల్
- అచల
- రమణ
- స్వరూప్
- చైతన్య
ఫలితాలు
[మార్చు]గమనిక: కార్యక్రమం నుంచి వచ్చిన ఫలితాలు ఎలాంటివైనా ఈ కింద సాధికారికమైన ఆధారాలతో రాయవచ్చు
- తెవికీపీడియన్లుగా ఆంగ్ల వికీపీడియన్లు
- నిర్వాహకుల కోరిక మేరకు పవన్ సంతోష్ చేసిన ప్రసంగంలో భాగంగా ఆంగ్ల వికీపీడియన్లకు, ఇతర కొత్త వికీపీడియన్లకు తెవికీపీడియాలో ఇప్పటివరకూ జరిగిన, జరగాల్సిన అభివృద్ధి గురించి విహంగ వీక్షణంగా తెలియజేశారు.
- వచ్చిన ఆంగ్ల వికీపీడియన్లతో తెవికీపీడియన్లు తమ అనుభవాలు పంచుకోవడం, తెవికీపీడియాలో ఉండే సుహృద్భావ వాతావరణం గురించి వివరించడంతో వారిలో కొందరు ఆసక్తి చూపారు.
- ప్రత్యేకించి వినయ్ తెవికీపీడియాలోని గ్రామ వ్యాసాల గురించి వాటి అభివృద్ధి గురించి ఆసక్తి చూపారు. తాను ఇప్పటికే ఆంగ్ల వికీలో చేస్తున్న కృషిని తెవికీకి విస్తరిస్తానని ఆ ప్రకారమే కృషిచేస్తున్నారు.
- విజయవాడ నగరంలో అవుట్ రీచ్ కార్యక్రమాల నిర్వహణకు శ్రీకర్ కాశ్యప్ ను తెవికీపీడియన్లు ప్రోత్సహించడం, విజయవాడలో సీఐఎస్-ఎ2కె పరంగా జరుగనున్న కార్యక్రమాలు పవన్ సంతోష్ వివరించడంతో శ్రీకర్ ఆ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని ముందుకువచ్చారు.
- స్వరూప్, చైతన్యలూ తమవంతుగా తెవికీపీడియాలో కృషిచేస్తామని తెలియజేశారు. ఆ ప్రకారం కృషిని కూడా ప్రారంభించారు.
- అనువాద వ్యాసాల ఎడిటథాన్
- అనువాదాలు చేసేందుకు ఇటీవల వికీపీడియాల్లో చేరిన కొత్త సౌకర్యం గురించి, దాన్ని ఎలా వినియోగించుకోవాలన్న అంశాన్ని గురించి పవన్ సంతోష్ చిరు శిక్షణ ఇచ్చారు.
- తద్వారా పలువురు వికీపీడియన్లు ఈ ఉపకరణాన్ని వినియోగించుకుని, లేక ఉపయోగించుకోకుండా కూడా అనువాదాలు చేయడం ప్రారంభించారు. కార్యక్రమం నిర్వహించిన కొద్దిరోజుల వరకు ఈ స్ఫూర్తితో అనువాదాలు జరిగాయి.
- కొత్త వికీపీడియన్ల చేరిక
- తెవికీలోకి ఈనాడు వార్తాకథనాన్ని చూసి ముగ్గురు, ప్రవీణ్ ఇళ్ళ తీసుకురాగా ఒకరు, కార్యక్రమాన్ని గురించి తెలుసుకుని మరొకరు వచ్చి వికీపీడియన్లు అయ్యారు.
- భవిష్యత్ భాగస్వామ్యాలు, కార్యక్రమాలు
- కార్యక్రమానికి విద్యాసంస్థల నిర్వాహకుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయ సహాయ గ్రంథాలయాధికారి/అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చారు.
- ఉస్మానియా విశ్వవిద్యాలయ సహాయ గ్రంథాలయాధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అచల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని నగరంలోని పలు గ్రంథాలయాధికారులతో ఉస్మానియా విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో వికీ వర్క్ షాప్ కార్యక్రమానికి పునాదులు పడ్డాయి.
- సీఐఎస్-ఎ2కె కార్యప్రణాళికపై చర్చ
సీఐఎస్-ఎ2కె 2015-16 తెలుగు కార్య ప్రణాళికపై చర్చ జరిగింది. ఈ క్రమంలో ప్రణాళికలో గల పలు అంశాలపై తెలుగు వికీపీడియన్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కశ్యప్, భాస్కరనాయుడు, గుళ్ళపల్లి, ప్రణయ్ గార్లు ఇందులో పాల్గొన్నారు. ఆంధ్ర లొయోలా కళాశాలతో ఉన్న ఒప్పందం పునరుద్ధరించాలని కశ్యప్ భావించగా, భాస్కరనాయుడు విద్యార్థులతో తన అనుభవాలు తెలిపారు. ఆ క్రమంలో ఆయన నాణ్యతపై దృష్టిపెట్టాలని సూచన చేశారు. విజయవాడలో డిజిటల్ రీసోర్సు సెంటర్ ను ఏఎల్సీతో సంయుక్తంగా ఏర్పాటుచేసే అంశాన్ని గురించి అభిప్రాయం కోరగా ఇప్పటికే ఒప్పుదల అయివున్న అంశం కనుక దాన్ని ఏర్పాటుచేస్తేనే మేలని, కాకుంటే భవిష్యత్తులో సంస్థలకు ఉన్న రీసోర్సులనే వినియోగించుకునేలా ప్రయత్నించాలని సూచించారు. తెలుగు వికీపీడియా అవుట్ రీచ్ కార్యక్రమాలను చిన్న నగరాల్లోనూ, పట్టణాల్లోనూ నిర్వహించే ప్రణాళికా భాగం పట్ల పాల్గొన్న సభ్యులంతా ఏకాభిప్రాయంతో ఆమోదించారు. అలాంటి కార్యక్రమం వల్ల తెవికీ అభివృద్ధి పుంజుకుంటుందని భావించారు.
చిత్రమాలిక
[మార్చు]-
వికీమీడియన్ పరిచయం
-
వికీమీడియన్ పరిచయం
-
వికీమీడియన్ పరిచయం
-
వికీమీడియన్ పరిచయం
-
వికీమీడియన్ పరిచయం
-
వికీమీడియన్ పరిచయం
-
వికీమీడియా ఇండియా ఛాప్టర్ కార్యకలాపాలను వివరిస్తున్న యోహన్ థామస్
-
వికీ లవ్ పుడ్ ఫోటో కాంటెస్ట్ వివరిస్తున్న యోహన్ థామస్
-
తెలుగు వికీపీడియాలో కృషిచేయడం గురించి వివరిస్తున్న పవన్ సంతోష్
-
రామ్ నందన్ తో తెవికీ ఖాతా తెరిపిస్తున్న ప్రవీణ్ ఇళ్ల
-
వికీపీడియా గురించి వివరిస్తున్న కశ్యప్
-
సమావేశానికి హాజరైన వికీపీడియన్లు
-
సమావేశానికి హాజరైన వికీపీడియన్లు
-
సమావేశానికి హాజరైన వికీపీడియన్లు
-
కొత్త వికీపీడియన్ కు శిక్షణ ఇస్తున్న భాస్కరనాయుడు
-
ఆంగ్ల వికీపీడియాలోకి వ్యాసాలను తెలుగులోకి అనువదిస్తున్న వికీపీడియన్లు
-
OCR గురించి వివరిస్తున్న కశ్యప్
-
కార్యక్రమ నిర్వాహకుడు శ్రీకర్ కాశ్యప్ కు వికీ కప్ బహుకరణ
-
సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక 2015-16 ను వివరిస్తున్న పవన్ సంతోష్