వికీపీడియా:వికీప్రాజెక్టు/లక్ష వ్యాసాల దిశగా ప్రగతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

89.2% - లక్ష చేరేందుకు ఇంకా రాయాల్సిన 3,765 వ్యాసాల్లో మిగిలి ఉన్న పని (3359).

   


  • 2024 జూన్ 17 ఉదయం 7 గంటలకు మొత్తం వ్యాసాల సంఖ్య 96,223.
  • ఈ క్షణాన ఈ సంఖ్య: 96,641

జూన్ 17 నాటికి, తెవికీ లక్ష వ్యాసాల మైలురాయిని చేరడానికి మరో 3700 వ్యాసాల దూరంలో ఉంది. ప్రస్తుతం కొత్త వ్యాసాలు వస్తున్న వేగం ఇలాగే కొనసాగితే దాన్ని త్వర లోనే చేరుకుంటాం. దాని కోసం ప్రత్యేకించి ప్రాజెక్టేమీ అక్కర్లేదు. కానీ ఇది ఎందుకంటే ఈ లక్ష వ్యాసాల సంరంభంలో సముదాయంలో అందరం పాలుపంచుకునేలా, అందరం పల్లకీ మోసేలా చేసేందుకు ఈ ప్రాజెక్టు. రండి, లక్షలో అందరం ఒక చెయ్యేద్దాం. ఇంకా 3700 అవకాశాలు మాత్రమే ఉన్నాయి. తలా కాసిని పంచుకుందాం. సెప్టెంబరు 30 నాటికి లక్ష పూర్తయ్యే లాగా లక్ష్యాన్ని పెట్టుకుందాం. ఈ శనివారం జూన్ 22 నాడు ఈ ప్రాజెక్టు మొదలుపెడదాం. 22,23 - శని ఆది వారాలు రెండు రోజులు ఒక ఎడిటథాన్ పెట్టుకుందాం. 2 రోజులు - 200 వ్యాసాలు అనే లక్ష్యం పెట్టుకుందాం.

ఈ ప్రాజెక్టు ద్వారా ఏం చేద్దాం

[మార్చు]

ఈ ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా సమన్వయం చేసుకుందాం. ఎప్పటి కప్పుడు మన ప్రగతిని బేరీజు వేసుకుందాం. దాంతో పాటు కింది పనులు కూడా చేద్దాం:

  • ఏయే వ్యాసాలు రాయవచ్చో జాబితా చేద్దాం
  • ఎవరెవరెన్నెన్ని రాస్తారో చెప్పుకుందాం
  • ప్రస్తుతం చురుగ్గా లేని వాడుకరులను తిరిగి రమ్మని ఆహ్వానిద్దాం
  • లక్ష వ్యాసాల ప్రస్థానం తొలి నుంచీ ఎలా ఉందో ఒక సింహావలోకనం చేసుకుందాం
  • తెవికీలో అత్యుత్తమ వ్యాసాల జాబితాలను తయారుచేద్దాం
    • అత్యుత్తమ, ఉత్తమ, మంచి వ్యాసాలు ఏంటి? (తలా పది)
    • సబ్జెక్టు పరంగా విశిష్టత కలిగిన వ్యాసాలు ఏంటి?
    • బాగా అభివృద్ధి సాధించిన వ్యాసాల రంగాలు (వర్గాలు) ఏంటి? (ఉదాహరణకు గ్రామ వ్యాసాలు)
    • తెవికీ 100 అత్యుత్య్తమ వ్యాసాల షోకేసు తయారీలో పాలు పంచుకోండి.
    • వివిధ వర్గాల్లో అత్యుత్తమ వంద వ్యాసాల జాబితాలు

అలాగే, లక్ష వ్యాసాల లక్ష్యానికి చేరుకున్నాక, పత్రికల్లో ప్రముఖంగా వార్తలు వచ్చేలా చూసుకుందాం. అప్పుడు ఈ జాబితాలు కూడా పనికొస్తాయి.

లక్ష్యం గురించి

[మార్చు]
  • మన లక్ష్యం: లక్ష వ్యాసాలు
  • ప్రారంభ తేదీ: 2024 జూన్ 17
  • గడువు తేదీ: 2024 సెప్టెంబరు 30
  • చెయ్యాల్సిన పని: 105 రోజులు 3700 వ్యాసాలు (రోజుకు సగటున 35)

ప్రాజెక్టు ఉపపేజీలు

[మార్చు]

ఏయే వ్యాసాలు రాయవచ్చు

[మార్చు]

తెవికీలో లేని ఎన్వికీ వ్యాసాల జాబితాలను కింద చూడవచ్చు. గతంలో రచ్చబండలో ఈ వ్యాసాల జాబితాలను చేర్చాం. ఈ జాబితాల్లోని వ్యాసాలు మొత్తం 80-90 వేలు ఉండవచ్చు. అన్నీ కూడా భారత దేశానికి సంబంధించిన జాబితాలే.

  1. భారతదేశ రహదారులు - ఈ అనుబంధ పేజీలో 421 వ్యాసాలున్నాయి
  2. భారత మహిళలు
  3. భారతీయ శాస్త్రవేత్తలు ఇందులో మహిళలు ఉండరు
  4. భారత మాస్ మీడియా వ్యక్తులు - ఇందులో మహిళలు ఉండరు
  5. భారతీయ పురస్కార గ్రహీతలు -ఇందులో మహిళలు, శాస్త్రవేత్తలు, మాస్ మీడియా వ్యక్తులు ఉండరు
  6. వివిధ వృత్తులకు చెందిన భారతీయులు మహిళలు, శాస్త్రవేత్తలు, పురస్కార గ్రహీతలు, మాస్ మీడియా వ్యక్తులు కాకుండా
  7. భారత చరిత్ర వ్యాసాలు
  8. భారతదేశంలో విద్య
  9. భారత ఆర్థిక వ్యవస్థ
  10. భారత పర్యావరణం
  11. భారతదేశంలో వివిధ ప్రభుత్వాలు, వ్యవస్థలు
  12. వృక్షశాస్త్రం
    1. భారతదేశంలో మొక్కలు, వృక్షాలు - తెలుగులో లేని 657 ఇంగ్లీషు వ్యాసాలు
    2. వృక్షశాస్త్రవేత్తలు - అన్ని దేశాలకు చెందిన వారు - 5,155 వ్యాసాలు
    3. వృక్షశాస్త్ర సంస్థలు - 206 వ్యాసాలు
    4. భారతదేశంలో ఉద్యానవన శాస్త్రం - 33 వ్యాసాలు
  13. భారతీయ పురస్కారాలు పొందిన వారు
    1. పద్మ విభూషణ పురస్కార గ్రహీతలు - 76
    2. పద్మభూషణ పురస్కార గ్రహీతలు - 731
    3. పద్మశ్రీ పురస్కార గ్రహీతలు - 1283
    4. అర్జున పురస్కార గ్రహీతలు - 462
    5. నారీశక్తి పురస్కార గ్రహీతలు - 22
    6. సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీతలు - 311
    7. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు - 630
    8. ప్రవాస భారతీయ సమ్మాన్ పురస్కార గ్రహీతలు - 81
    9. శాంతి స్వరూప్ భట్నగర్ పురస్కార గ్రహీతలు - 418
    10. ఇతర పౌర పురస్కారాలు పొందినవారు - 346 వ్యాసాలు
  14. నోబెల్ బహుమతి గ్రహీతలు - 1800 వ్యాసాలు

ఎవరెవరు ఎన్నెన్ని

[మార్చు]

ఈ వందరోజుల్లో ఎవరెవరు ఎన్నెన్ని వ్యాసాలు రాద్దామో కింది పట్టికలో స్వచ్ఛందంగా లక్ష్యాలు పెట్టుకుందాం.

లక్ష యజ్ఞంలో వాడుకరులు వ్రేల్చే సమిధలు
క్ర.సం సంతకం వ్యాసాల సంఖ్య ఇతరత్రా
1 చదువరి (చర్చరచనలు) 100 5 రాసాను
2 ప్రణయ్‌రాజ్ వంగరి 500+
3 పవన్ సంతోష్ 100+
4 Mothiram 123 (చర్చ) 00:02, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం] 100
5 కె.వెంకటరమణచర్చ 100
6 దివ్య
7 యర్రా రామారావు 100
8 భవ్య
9
10