వికీపీడియా:వికీప్రాజెక్టు/లక్ష వ్యాసాల దిశగా ప్రగతి/ప్రస్థానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లక్ష వ్యాసాల లక్ష్యాన్ని చేరే క్రమంలో తెవికీ సాగించిన ప్రయాణం, మలుపులు, మైలురాళ్ళను ఇక్కడ చూడవచ్చు.

వ్యాసాల సంఖ్యల్లో తేడా ఎందుకుంది?

[మార్చు]

ప్రాజెక్టు పేజీలో పైన చూపిస్తున్న సంఖ్యకు, డేటాబేసులో క్వెరీ ద్వారా తెచ్చిన సంఖ్యకూ తేడా ఉంటోంది. అలా ఎందుకు? జూన్ 25 ఉదయం 8 గంటలకు, ప్రాజెక్టు పేజీలో, మొత్తం 96,493 వ్యాసాలున్నాయని చూపించగా, అదే సమయానికి క్వారీలో ఈ క్వెరీ ద్వారా డేటాబేసును అడిగినపుడు 96,587 అని చూపించింది. ఈ 94 వ్యాసాల తేడా ఎందుకు వచ్చిందంటే..

ప్రాజెక్టు పేజీలో ఉన్న సంఖ్య {{NUMBEROF|articles|te}} ద్వారా తెచ్చాం. ఇది వ్యాసాల సంఖ్యను లెక్కించడంలో ఒక విశిష్టతను పాటిస్తుంది - అది కనీసం ఒక్కటైనా వికీలింకు ఉన్న వ్యాసాలనే లెక్కలోకి తీసుకుంటుంది. అసలు వికీలింకంటూ లేని వ్యాసాలను లెక్కలోకి తీసుకోదు. క్వారీలో అడిగిన క్వెరీలో ఆ నిబంధన పెట్టలేదు. ప్రత్యేకపేజీల్లోని అగాధ పేజీలు పేజీలో ఉన్న పేజీల సంఖ్య వీటి మధ్య ఉన్న తేడాకు దాదాపుగా సరిపోతోంది. ఒక్క వికీలింకు లేని పేజీలే గదా అగాధ పేజీలంటే!

అగాధ పేజీలను లెక్కలోకి తీసుకున్నప్పటికీ, ఇంకా 3 వ్యాసాల తేడా ఉంది గదా, అలా ఎందుకుంది?
ఇప్పుడు అందరం కలిసి దాన్ని పరిశోధించాలి.

ఇంతకీ పై లెక్క జూన్ 25 నాటిది. జూన్ 28 నాటికి అగాధ పేజీల సంఖ్య 126 కు చేరింది.

వివిధ వికీపీడియాల్లో అగాధ పేజీలు

[మార్చు]

జూన్ 28 న ఇతర ఇండిక్ వికీపీడియాల్లో పరిస్థితి ఇలా ఉంది

  • తమిళంలో అగాధ పేజీల సంఖ్య: 1724
  • మలయాళంలో అగాధ పేజీల సంఖ్య: 1049
  • కన్నడంలో అగాధ పేజీల సంఖ్య: 819
  • హిందీలో అగాధ పేజీల సంఖ్య: 3810
  • బెంగాలీలో అగాధ పేజీల సంఖ్య: 311
  • మరాఠీలో అగాధ పేజీల సంఖ్య: 778
  • పంజాబీలో అగాధ పేజీల సంఖ్య: 127
  • గుజరాతీలో అగాధ పేజీల సంఖ్య: 135
  • ఒరియాలో అగాధ పేజీల సంఖ్య: 17
  • అస్సామీలో అగాధ పేజీల సంఖ్య: 175

సరే, ఇంగ్లీషులో ఎన్ని ఉన్నాయంటే - 7! ఫ్యాక్టోరియల్ (5040) కాదది, ఆశ్చర్యార్థకం. 68 లక్షల వ్యాసాలున్న ఇంగ్లీషు వికీపీడియాలో అగాధ పేజీల సంఖ్య: కేవలం ఏడు! దాని నిర్వహణ, దాని నాణ్యత స్థాయి అది.

వ్యాసాల్లో జరిగిన దిద్దుబాట్లు, అవి చేసిన వాడుకరులు

[మార్చు]

జూన్ 25 నాటి గణాంకాలు

  • తెవికీలో ఇప్పటి వరకు 88,576 మంది దిద్దుబాట్లు చేసారు. వారిలో 52,467 మంది అజ్ఞాత వాడుకరులు (ఐపీ చిరునామాలు) కాగా 36,109 మంది నమోదైన వాడుకరులు
  • వీరిలో వ్యాసాలు సృష్టించిన వాడుకరులు 3,781 కాగా, అందులో 2,099 మంది అజ్ఞాత వాడుకరులు (ఐపీ చిరునామాలు), 1,682 మంది నమోదైన వాడుకరులు
    • వెయ్యికి పైగా వ్యాసాలు సృష్టించినవారు 17
    • 500 - 1000 మధ్య వ్యాసాల సృష్టికర్తలు 11
    • 100 - 500 మధ్య వ్యాసాల సృష్టికర్తలు 28
    • 100 - 50 వ్యాస సృష్టికర్తలు 21
    • 50 లోపు వ్యాసాలు సృష్టించినవారు 3704
    • మొత్తం వ్యాసాల్లో అజ్ఞాతలు సృష్టించినవి 3,247
  • వ్యాసాల్లో చేసిన మొత్తం దిద్దుబాట్లు 29,25,742. ఈ దిద్దుబాట్లు చేసినవారు మొత్తం 50,806 మంది కాగా అందులో 40,578 మంది అజ్ఞాత వాడుకరులు (ఐపీ చిరునామాలు), 10,228 మంది నమోదైన వాడుకరులు
    • లక్షకు పైగా దిద్దుబాట్లు చేసినవారు: 8
    • లక్ష -50 వేలు దిద్దుబాట్లు చేసినవారు: 9
    • 50 వేలు - 25 వేలు దిద్దుబాట్లు చేసినవారు: 15
    • 25 వేలు - 10 వేలు దిద్దుబాట్లు చేసినవారు: 26
    • 10 వేలు - 1,000 దిద్దుబాట్లు చేసినవారు: 98
    • 1,000 - 100 దిద్దుబాట్లు చేసినవారు: 313
    • 100 - 1 దిద్దుబాట్లు చేసినవారు: 50,493
    • మొత్తం దిద్దుబాట్లలో అజ్ఞాతలు చేసినవి: 1,29,314