వికీపీడియా:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/చర్చావేదిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్

చర్చావేదిక

సూచన: ఈ వేదిక కేవలం తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్ తరపున ప్రతిపాదిస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన చర్చలకు, తీసుకోవలసిన నిర్ణయాలకు పరిమితం.

వికీసోర్స్ కు గ్రంథాలయ సర్వస్వం పత్రిక

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం (APLA) ఒక శతాబ్దం పైగా పౌర గ్రంధాలయ ఉన్నతికి పనిచేస్తున్న సంస్థ. ఆ సంస్థ 1915 వ సంవత్సరం నుండి గ్రంథాలయ సర్వస్వం అను పత్రికను ప్రచురిస్తోంది. ఇది గ్రంథాలయ సమాచార విజ్ఞానంలో మొదటి పత్రిక, ఇప్పుడు 84 సంపుటాలు పూర్తి చేసికొని 85లోకి అడుగు పెట్టింది. గ్రంథాలయ సమాచార విజ్ఞానంలోనే కాకుండా, ఈ పత్రిక సాహిత్యం, సంస్కృతి, చరిత్ర, స్వాతంత్రోద్యమ విషయాలు, గ్రంథాలయోద్యమ విషయాలు, ఇతర సామాజిక అంశాల మీద ఆనాటి నుండి వ్యాసాలు ప్రచురిస్తున్నది.

ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఏ.రాజశేఖర్ గారి నుంచి ఈ పత్రిక గురించిన ప్రతిపాదన రావడంతో తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్ తరపునుండి ఆ సంస్థ అధికారులను (మౌఖికంగానే) సంప్రదించి గూగులు మీట్ లో 30 ఏప్రిల్ 2024న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం లో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం తరపున ఆ సంస్థ కార్యదర్శి డా. రావి శారద గారు, వికీ సోర్స్ నుండి డా. రాజశేఖర్ గారు, పవన్ సంతోష్ గారు, నేను (వి.జె.సుశీల) పాల్గొనడం జరిగింది. ఆ సమావేశంలో మన వికీ సోర్స్ విధానాన్ని వివరించి ఆ పత్రికలను వికీసోర్స్ కు అందచేయమని అభ్యర్ధించడమైనది. ఆ ప్రతిపాదనకు శారదగారు అంగీకరించి, ఆ పత్రికలను మొదట విడతగా 11 సంపుటాలను 'మనసు ఫౌండేషన్' వారి సహకారంతో స్కాన్ చేయించగలిగారు. అయితే మన తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్, వికిసోర్స్ తరపునుంచి సంయుక్తంగా APLA సంస్థకు ముందుగా ఒక అభ్యర్ధన పత్రం అధికారికంగా (లెటర్ హెడ్) సమర్పిస్తే వారు ఆయా ఫైల్స్ ఇచ్చిన తరువాత ఒక తీసుకున్న గుర్తింపు పత్రం ఇవ్వవచ్చు.

ఈ ప్రక్రియ వేరే ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో లావా దేవీల విషయంలో భవిష్యత్తులో కూడా అవసరం పడుతుంది అనుకుంటున్నాను. ఈ ప్రక్రియ మన వేదికలలో అమలులో లేదని భావిస్తూ మొదలు పెట్టేటందుకు సభ్యుల అభిప్రాయం, ఆమోదం కోరడమైనది.
ధన్యవాదాలు - --V.J.Suseela (చర్చ) 09:43, 18 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

  • మంచి ప్రయత్నం. ఈ ప్రక్రియకు నా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను.
స్వరలాసిక (చర్చ) 06:17, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • వికీసోర్స్ ప్రాజెక్టు కొద్దిమందితో సుమారు 19000 పైచిలుకు వ్యాసాలతో పురోగమిస్తున్నది. ఈ గ్రంథాలయ సర్వస్వం ప్రాజెక్టు ద్వారా తెవికీ సభ్యులందరినీ తెలుగు వికీసోర్సుకు ఆహ్వానిస్తున్నాను. మీ అందరి సహకారంతో మనం చేయాలనుకొంటున్న 2025 ఉత్సవాల సమయానికి 20 వేల వ్యాసాల మైలురాయి చేరుకోగలదని భావిస్తున్నాను. ఈ ప్రాజెక్టు ముందుకు నడిపిస్తున్న సుశీల గారికి మరియు మీరందరికీ నా ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:57, 20 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
Vjsuseela గారూ, బావుందండి. అయితే ఇప్పుడు మన యూజర్‌గ్రూపుకు ఒక లెటర్‌హెడ్ తయారు చేసుకోవాలన్న మాట. మరి "వికీసోర్సుతో సంయుక్తంగా" అన్నారు గదా.. అంటే వికీసోర్సుకు కూడా ప్రత్యేకంగా లెటర్‌హెడ్ కావాలా? లేఖ, వికీసోర్సులో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం లింకును ఇస్తే సరిపోతుందా? __ చదువరి (చర్చరచనలు) 11:49, 25 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
యూజర్ గ్రూప్ తెలుగులోని అన్ని వికీ ప్రాజెక్టులకు సంబంధించినది అనుకుంటున్నాను. ఒకసారి మన సభ్యుల స్పందన చూసి అందరు కలిసి ఏవిధంగా అనుకూలంగా ఉంటుందో నిర్ణయము తీసుకోవచ్చు. ధన్యవాదాలు. V.J.Suseela (చర్చ) 12:09, 25 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియా మరియు వికీసోర్సులు రెండు యూజర్ గ్రూప్ క్రిందనే వస్తాయి. కాబట్టి వేరుగా తెలియజేయాల్సిన అవసరం లేదనుకుంటాను.--Rajasekhar1961 (చర్చ) 14:33, 25 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మనది వికీమీడియన్ల యూజర్‌గ్రూపు. కాబట్టి వికీసోర్సుతో సహా అన్ని తెలుగు వికీమీడియా ప్రాజెక్టులన్నీ ఇందులో భాగమే. అందులో నాకు సందేహమేమీ లేదు.
Vjsuseela గారూ. నేను నా మొదటి వ్యాఖ్య సరిగ్గా రాసినట్టు లేను. నేను చెప్పదలచినదేంటంటే.. " అయితే మన తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్, వికిసోర్స్ తరపునుంచి సంయుక్తంగా APLA సంస్థకు ముందుగా ఒక అభ్యర్ధన పత్రం అధికారికంగా (లెటర్ హెడ్) సమర్పిస్తే" అని రాసారు గదా.. వికీసోర్సుకు కూడా లెటర్‌హెడ్ అవసరమా అనే సందేహం వచ్చింది, అంతే. ఆ సందేహం ఎలా ఉన్నప్పటికీ, వికీసోర్సులో ఈ విషయమై ఒక చర్చ, ఒక నిర్ణయం ఉండాలని నా ఉద్దేశం (ఈసరికే జరిగి ఉండకపోతే). __ చదువరి (చర్చరచనలు) 23:34, 25 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అవునండీ. నేను రాసినదానిబట్టి ఆ సందేహం ఉత్పన్నమవుతుంది. అలా రాయకుండా ఇంకొంచెం వివరణ ఉండాల్సింది. కానీ రాయడం లో ఉద్దేశ్యం వరకు వికీసోర్స్ బాధ్యత చూసుకునేవారు, యూజర్ గ్రూప్ కు సంబంధించిన వారు దీంట్లో సంతకం వగైరా చేసి కాంటాక్ట్ లో ఉండాలని. నాకు అర్థమవుతున్న వరకు లెటర్ హెడ్ లాంటి ప్రక్రియ ఇక్కడ లేదు, యూజర్ గ్రూప్ కొత్తగా ఏర్పడినది, ఇక్కడ వుండే అవకాశం ఉండవచ్చు, కాబట్టి దానికి సంబంధించిన విషయాలకు చర్చ ఉండాలని వేరే వేదిక (పవన్ గారి సూచనతో) ఏర్పరచడం జరిగింది. చర్చ నిర్ణయం దిశగా వెళ్తున్నందుకు ధన్యవాదాలు. Vjsuseela.

గ్రంథాలయ సంచికలు ఎన్నో వివరాలతో కూడుకుని ఉంటాయి వీటిని వికీ లోకి తీసుకొస్తున్నందుకు కృతజ్ఞతలు. Kasyap (చర్చ) 11:19, 25 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]