వికీపీడియా:తెలుగు వికీపీడియా కరదీపిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్తవారికి తెలుగు వికీపీడియాను పరిచయం చేసేలా ఒక చిరుపుస్తకాన్ని తయారు చేసే ప్రయత్నం ఇది. ఔట్‌రీచ్ కార్యక్రమాల్లో పనికి వచ్చేలా రూపొందించాలనేది లక్ష్యం. అ పుస్తకం రూపానికి సంబంధించి తొలి ఆలోచనలను ఇక్కడ చూదవచ్చు,. దీనిపై వచ్చిన సూచనలు, అభిప్రాయాల మేరకు తుది రూపుకు చేరవచ్చు. అభిప్రాయాలు, సూచనలను అట్టడుగున ఉన్న విభాగంలో రాయవలసినది.

ఎవరి కోసం
వికీపీడియా గురించి ఏమీ తెలియని వారి కోసం
పరిమాణం
విశాఖ తెవికీ పండగలో ఇచ్చిన "ఎందరో వికీమీడియన్లు" పుస్తకం పరిమాణంలో, 50 పేజీలు ఉండేలా
పుస్తకం ఎవరు రాస్తారు
మనమే! కంటెంటులో కొంత ఈసరికే అక్కడా ఇక్కడా ఉంది. ఇంకా అవసరమైన దాన్ని కొత్తగా రాద్దాం

పరిధి

[మార్చు]

పుస్తకంలో కింది అంశాలుంటాయి

ఎప్పటి లోగా చెయ్యాలి

[మార్చు]
  • కంటెంటు సిద్ధం: సెప్టెంబరు 30
  • టైప్ సెట్టింగు, అట్టల డిజైను వగైరాలు అక్టోబరు 31
  • ముద్రణ: నవంబరు

దాంతో పుస్తకాలు, పుస్తక ప్రదర్శన నాటికి సిద్ధంగా ఉంటాయి.

కంటెంటు సేకరణ

[మార్చు]

మనమే! కంటెంటులో కొంత ఈసరికే అక్కడా ఇక్కడా ఉంది. దాన్నంతా ఒకచో చేర్చి మార్పుచేర్పులు, తీసివేతలూ చేసి పెట్టుకుందాం. ఇతర భాషల వాళ్ళు తయారు చేసిన పుస్తకాలు ఏమైన ఉంటే వాటిని చూద్దాం. సి ఐ ఎస్ ఎ2కె వాళ్ళు ఒక పుస్తకం వేసారంట - అదీ చూద్దాం. ఇంకా అవసరమైన పాఠ్యాన్ని కొత్తగా తయారు చేసుకుందాం. ఇప్పుడు మనకున్న కొంత సమాచారం ఇక్కడ చూదవచ్చు.

అభిప్రాయాలు, సూచనలు

[మార్చు]

ఈ పుస్తకం మంచి ఆలోచన. ఇందులో వికీడేటా పరిచయం, తెవికీ నిర్వాహకత్వం గురించి (ఎవరు చేస్తారు, ఏం చేస్తారు) కూడా చేర్చితే బాగుంటుంది.

పుస్తకంలో అక్కడక్కడా చిన్న చిన్న చిట్కా డబ్బాలు పెట్టవచ్చు. ఇవి అనుభవంతో తెలిసేవీ, చేసే పనిని సులభతరం చేసేవి అవ్వవచ్చు.

పైన చెప్పిన అంశాలన్నీ విడి విడిగా విశదీకరించిన తరువాత, పుస్తకం చివర్లో స్క్రీన్‌షాట్లతో ఉదాహరణలు ఇవ్వాలి. అంటే ఒక కొత్త వ్యాసం మొదలుపెట్టడం, శీర్షిక కింద కనిపించే చిన్న వివరణ ఇవ్వడం, పాఠ్యాంశం చేర్చడం, మూసలు, లంకెలు, మూలాలు, వర్గాలు, వికీడేటా లింకు వంటి చేయాల్సిన హంగులన్నీ చూపించాలి. అలాగే అనువాద పరికరం కూడా స్క్రీన్‌షాట్లతో చూపిస్తే బాగుంటుంది. - కిమీర (చర్చ) 10:18, 4 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

పుస్తక ప్రదర్శనలో సందర్శకులకు ఇవ్వటానికి ఒక చిరు పుస్తకం తో పాటుగా ఒక పెద్ద పిడిఎఫ్ పుస్తకం కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది అందులో విషయాలను వివరంగా పేర్కొనటంతో పాటు అందుకు సంబంధించిన వీడియోలు ఇతర లింకులు కూడా ఇవ్వవచ్చు అంతేకాక ఎంతో తోడ్పడుతున్న మన వికీపీడియా సభ్యుల పరిచయం ఫోటో వారి కృషి కూడా తగినన్ని పేజీలు కేటాయించవచ్చు . నేను సాధారణంగా ఇలాంటి సామూహిక కార్యక్రమాలలో ప్రత్యేకించి వ్యక్తుల ప్రాధాన్యతకు అంత సుముఖంగా ఉండను అయితే గత ఉత్సవాలలో ప్రచురించిన పుస్తకం నా ఆలోచనను మార్చినది. ఇలాంటివి ప్రస్తుతం స్వచ్ఛందంగా కృషి చేస్తున్న వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇది డిజిటల్ కాపీ కాబట్టి అవసరం అయిన మార్పులు చేస్తూ వుండవచ్చు. Kasyap (చర్చ)